13, జులై 2016, బుధవారం

చల్లని కాష్టం !నీ మాటే ఊపిరిగా బ్రతుకుతూ
నీతో నడక సత్తువయి సాగుతుంటే
వదిలి నన్ను, ఊపిరి ఉన్నా శవం చేశావు

నీ కోరికల  ఊపిరి తియ్యాలని నేనొస్తే
నా ఆశలకు పూర్ణాయువు నింపి
అందకుండా  విరిసి వేసావు

నీ కలలు నిజం చెయ్యలని నేననుకొంటె
నువ్వు నా కలలు కల్లలు చేసావు
నాజీవితంలో  తీరని కలలు నింపావు

నువ్వు లేని గతం వద్దని మరచి పోయాను
నిన్ను కలవని క్షణలు చెరిపి వెసాను
నువ్వు ! నాకు  భవితనే లేకుండా చేసావు

నీ ఏడుపు నా కన్నీరు చేశాను
నీ సంతోషం నా లక్ష్యం గా మార్చాను
చివరికి కన్నీరే ఫలితంగా ఇచ్చావు

ప్రేమ పంచె మాధుర్యం తన పేరంతేనా ?
జీవితమంతా కోరుకుంటే అత్యాశేనా?
ఆ చల్లని కాష్టంలో కాలిపోవాల్సిందేనా?

1 వ్యాఖ్య: