11, జులై 2016, సోమవారం

కూతురి ప్రేమాయణం

"అమ్మ ! ఈ రోజు ఎం జరిగిందో తెలుసా? వికాస్ గాడు ఏదో గ్రీటింగ్ కార్డు ఇచ్చి టెక్ యువర్ టైం, అని వెళ్ళి పోయాడు. తర్వాత ఓపెన్ చెస్తే, ఐ లవ్ యూ పవిత్ర అని ఉంది. వాడు మరి యిలా అర్థం చేసుకుంటాడు అనుకోలేదు" అని గల గల చెప్పుకుంటూ పోతున్నా కూతుర్ని నవ్వుతూ చూస్తోంది గాయత్రి. 

తర్వాత నెమ్మదిగా "దట్ మీన్స్ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ సంబడి అడ్మైరింగ్ యూ! నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్?" అడిగింది చాలా సాధారణంగా. 

దానికి పవిత్ర సిగ్గు పడుతు గర్వ మయిన అనుభూతికి లోనయింది. "నో నో ఐ డోంట్ వంటూ గెట్ ఎనీ డిస్టబెన్స్ అండ్ కాన్సన్ ట్రేట్ ఆన్ మై స్టడీస్" అని అక్కడి నుండి వెళ్ళి పోయింది. 

ఇద్దరు తల్లి కూతుళ్ళ వరుస చూసిన గాయత్రి స్నేహితురాలు వనజకు మాత్రం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది.  ఆపుకోలేక అడిగేసింది "ఏంటి గాయత్రి ! ఎదిగిన కూతురు ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడని చెపితే, మంద లించకుండా అలా నువ్వేం అనుకుంటున్నావు, నువ్వు అందంగా ఉన్నావ్, అని ఇంకా ఏవో నూరి పొస్తున్నావ్" అంది మూతి మూడు వంకరలు తిప్పుకుంటూ. 


గాయత్రి ప్రశాంతంగా నవ్వి "మందలించాల !  ఎవర్ని? నా కూతుర్న? లేక లవ్ లెటర్ ఇచ్చిన తన స్నేహితుడినా? నా కూతుర్ని మందలించటానికి తను చేసిన తప్పేంటి? అందంగా పుట్టడమా? మంచి కాలేజ్ లో సీట్ వచ్చిందని కో-ఎడ్యుకేషన్ లో చేరటమా?  ఒక వేళ ఏదయినా తప్పు ఉంది అంటే ఆ అబ్బాయిది. కానీ నేను మందలించి వచ్చిన మరుసటి రోజు నుండి నా కూతురికి నరకం చూపిస్తాడు వాడు. ఎందుకంటే వాడి వయసు అలాంటిది" అంది వివరిస్తూ. 

వనజకు అహం దెబ్బతింది. కానీ దాన్ని బయటకు కనపడ నివ్వకుండా "ఎవడో కుర్రాడు లవ్ లెటర్ ఇచ్చేంత వరకు వచ్చాడు అంటే! నీ కూతురు వాడికి ఎంత అలుసు ఇచ్చి ఉండాలి? దాని గురించి మాట్లాడుతున్నాను" అంది దెప్పి పొడుస్తూ. 

"ఒకే దగ్గర చదువుకునే వాళ్ళు, కలిసి లాబ్ వర్క్ అని,  ప్రాజెక్ట్ వర్క్ అని పని చేసుకునే వాళ్ళు మాట్లాడుకుంటే తప్ప? వయసులో ఉన్న వాళ్ళు ఆకర్షణకు లోను కావటానికి ఎంత చనువు కావాలి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సినిమాల్లో ఉదర గొట్టేస్తుంటే, ప్రపంచంలో ప్రేమ సమస్యలు తప్ప ఏమి లేనట్లు అచ్ఛంగా వాటినె సినిమాలుగా తీస్తుంటే, ఆ పసి మనసులు అపార్థం  చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది." 

"అంటే సినిమాల ప్రభావం నీ కూతుర్ని, తన  మగ స్నేహితుడిని  తప్పు చేసేలా చేసింది అంటావ్! " అని వెటకారం ఆడింది వనజ. 

"సినిమాల ప్రభావం అవ్వచ్చు లేదా ఇంకా ఏదయినా అవ్వచ్చు. కాని వాళ్ళు తప్పు చెయ్యలేదు. నువ్వంటే ప్రేమ అని ఆ అబ్బాయి చెప్పాడు, నా కూతురు ఇంకా ఏమి చెప్పలేదు. మగ స్నేహితుడు అని ఎందుకు అంత నొక్కి మరి చెపుతున్నావ్? స్నేహితులు మగవాళ్ళు కాకూడదా? ఆడవాళ్ళు అన్ని పనులు చేసెయ్యాలి కానీ మగవాళ్ళతో స్నేహం మాత్రం చెయ్యకూడదు."

"తప్పు  చెయ్యలేదా? మరి ఇందాక తప్పు ఏదయినా ఉందంటే ఆ అబ్బాయిది, తనను మందలించాలి అన్నావ్?" నిష్టురంగా  అడిగింది వనజ.  

"అవును ఇప్పటికి అదే అంటాను,  ఏదయినా తప్పు ఉంటే అబ్బాయిదెనని. చదువు కోవటానికి వచ్చిన పిల్లలు ప్రేమ గీమ అంటూ తిరగటం తప్పేగా?" నిలదీసి అడిగింది గాయత్రి. 

"మరి సినిమాలు, పసి మనసులు అని ఇందాక ఏదో ఉపన్యాసం ఇచ్చవ్? " వనజ సంబరపడి పోయింది తనకేదో మంచి పాయింట్ దొరికిందని. 

గాయత్రి నవ్వుతూ "నా ఉద్దేశ్యం ఆ అబ్బాయి చేసింది మందలించేంత పెద్ద తప్పు కాదు, తప్పే కాదు అనేంత మాములు విషయం కాదు. పెద్ద వాళ్ళమయిన మనమే  ఎన్నో తప్పులు చేస్తుంటాం. అలాంటిది ఎదిగే పిల్లలు వాళ్ళు తప్పు చెయ్యటం సహజం, దాన్ని భూతద్దంలో చూసి రెచ్చ గొట్టకూడదు అన్నాను" అంది. 

"మరి నువ్వు అందంగా ఉన్నావ్! నువ్వంటే ఒకడికి మోజు అని కూతురికి లేని పోనీవి నూరి పోస్తున్నావ్. దానికి ఏం  అంటావ్." 

"అడ్మిరేషన్.... తెలుగులో మొహం లేదా మోజు. ఐ అడ్మైర్ యువర్ వర్క్ అంటే !  నీ పని అంటే మోజు నాకు. దాంట్లో తప్పు లేనప్పుడు మనిషిని అడ్మయిర్ చేస్తే తప్ప?  ఒక మనిషికి నువ్వు అందంగా ఉన్నావ్ అని చెప్పిన, కనీసం నీ డ్రెస్ బాగుంది అని చెప్పిన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాంటిది నా కూతురికి చెపితే తప్ప?"

"అంతే కానీ నేను అందంగా ఉన్నాను కాబట్టి మగళ్ళను నా వెంట తిప్పు కోవాలని ని కూతురికి అనిపించదు అంటావ్." 

"నువ్వు నెగటివ్ సైడ్ మాత్రమే చూస్తున్నావ్. నేను తనకు ఆ మాట చెప్పింది, ఎక్కడ తను లవ్ లెటర్ ఇఛ్చిన అబ్బాయిని దూరం పెడుతుందో, దాని వల్ల కొత్త సమస్యలు ఎక్కడ వస్తాయో అని. నేను ఆ మాట చెప్పటం మూలంగా తాను ఇప్పుడు ఆ విషయానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వదు, ఆ అబ్బాయికి  తానే నచ్ఛ చెపుతుంది. కానీ ఆ విషయం నేను చెప్పక పోతే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని తనను తాను నిందించుకుని  డిప్రెషన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాదంటావా? "

"ఒకే. కానీ నువ్వేం అనుకుంటున్నావు అని నిర్ణయం తనకే వదిలేసావ్. తాను కూడా ప్రేమ వైపు మొగ్గు చూపితే?"

"నేను తన మిద వదిలెయ్యలేదు. అభిప్రాయం అడిగాను. తన నిర్ణయాన్ని బట్టి దాంట్లో కష్ట నష్టాలు వివరించి చెప్పేదాన్ని."

"ఉమ్........సర్లే నాకు ఉంది కూతురు. మరి ఇంత కంప్లికేటెడ్ కాదులే. ఏదో కాలేజీ కి వెళ్ళి బుద్దిగా చదువు కుంటూ ఉంటుంది" అంది వనజ  చురకలేస్తున్నట్లు. 

"కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. కానీ నీ కూతురు నా కూతురి కన్న బాగుంటుంది. తనకు ఇలాంటి సమస్యలు రాలేదా?" అని ఆశ్చర్య పోయింది గాయత్రి. 

"చూడు గాయత్రి అందం కాదు. మగ పిల్లలతో మన ప్రవర్తన హద్దులు దాట కుండా ఉంటే ఎవడు మన జోలికి రాడు. ఆ విషయం నా కూతురికి బాగా తెలుసు" గర్వంగా పలికింది వనజ. 

"తప్పు వనజ. ప్రవర్తన కొంత వరకు నిజమే కానీ ఆకర్షణ అన్నింటికి మూల కారణం. అది ఎదుటి వారి పట్ల మనకు కావచ్చు, మన పట్ల ఎదుటి వారికి కావచ్చు"

"ఇప్పుడేంటి ? నీ కూతురికి ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడని నా కూతురికి కూడా ఇవ్వలి అంటావా? "

"ఇచ్ఛే ఉంటారు. కానీ తాను మీకు చెప్పి ఉండదు. ఒక్కసారి తనతో మాట్లాడి చూడు." 

 "ఇది టూ మచ్ గాయత్రి. ఇప్పుడు నా కూతురికి లేని పోనీ ఆలోచనలు కల్పించాలా? తనేదో బుద్దిగా చదువుకుంటూ ఉంటే ఏంటి నీ ఊహ గానాలు" చిరాకు పడింది వనజ. 

"సరే ఇది చెప్పు. కాలేజ్ నుండి రాగానే ఎం మాట్లాడుకుంటారు?"

"ఎం ఉంటాయి మాట్లాడటానికి? ఏదో జ్యూస్ చేసిస్తాను తాగేసి తన రూం లో కెళ్ళి తలుపేసుకుంటుంది. తర్వాత నేనే డిన్నర్ కి పిలుస్తాను." 

"నువ్వు వెళ్ళే సరికి సిగ్గు పడుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది."

"ఎవరూ అని అడిగితే పలానా  ఫ్రెండ్ అని అమ్మాయిల పేర్లు చెపుతుంది. అయినా తాను చదివేది గర్ల్స్ కాలేజ్, నీ పప్పులేం ఉడకవ్"

"నీ కూతురు తప్పు చేస్తుందని నేను ప్రూవ్ చెయ్యాలని చూడటం లేదు. ఎదిగె పసి వాళ్ళు వనజ. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆకర్షణలు. ఎటు వెళ్ళాలో తెలియక తప్పటడుగు వేస్తారు, మనం కాకుండా ఎవరు ఉన్నారు?" గాయత్రి కళ్ళల్లొ లోతయిన జాలి.

"మరి ప్రతి విషయాన్ని పట్టించుకుంటే వాళ్ళు సొంతంగా ఎం నేర్చు కుంటారు?"

"నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్. ప్రతి విషయం నేర్పించమనలేదు. ఎంత నమ్మకంగా ,  బాహాటంగా  వాళ్ళు తమ విషయాలు మనకు చెప్పుకుంటున్నారు? "

"ఇలా ప్రతి అడ్డమయిన విషయం, అనవసరమయిన విషయం వింటూ పోతే, ఇంకా అయినట్లే" వనజ వెక్కిరిస్తూ అంది.

"పిల్లలకు సంభందించిన విషయం ఎది కూడా అడ్డమయినది, ఆనవసరమయింది కాదు. వాళ్ళు మనతో చెప్పుకోవటానికి ఇష్ట పడటం లేదంటే ఏదో గిల్టి గా ఫీల్ అవుతున్నారు. లేదా చెప్పుకునే వెసలు బాటు వారికి మనం దూరం చేశాం"

"అబ్బబ్బాబ్బబ్బా.....ని కూతురు అన్ని పూసగుచ్చినట్లు చెపుతుందని నా కూతురు కూడా చెప్పలంటే ఎలా? షి ఇస్ వెరీ ఇండిపెండెంట్" విసుగు పడింది వనజ.

"ఇండిపెండెంట్ అయినా సరె, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనకు చెప్ప వలసిందే. ఎందుకంటే వాళ్ళ జీవితం ఇంకా మన మీద ఆధార పడి ఉంది"

"అది సంగతి! వాళ్ళకు తిండి, బట్ట, చదువు ఇస్తున్నాం కాబట్టి మన ఆదీనంలో ఉండి అన్ని విషయాలు చెప్పాలి అంటావ్?".

"మళ్ళి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్. పిల్లాడికి నడిచె సామర్థ్యం వచ్చింది కదా అని రోడ్డు మిద వదిలెయ్యలేం కదా? అలాగే నిర్ణయాలు తీసుకునే జ్ఞానం వచ్చింది కదా అని గుడ్డిగా వారి నిర్ణయాలకు వారిని వదిలెయ్య కూడదు అంటున్నా"

"మనం ఎటు నుండి ఎటు వెళ్తున్నాం. మన టాపిక్ పిల్లలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళను ఎలా మందలించాలి అని" వనజ అసహనం వ్యక్తం చేసింది.

"నేను చెప్పేది కూడా అదే. పిల్లలతో ఏదయినా మాట్లాడాలి, మందలించకుండా నిర్ణయాలు తీసుకోవటంలో సహాయం చెయ్యాలని."

 వనజను ఎం మాట్లాడాలో తెలియలెదు. మూతి ముడిచి కను బొమ్మలు ఎగరేసింది.

"ఒక్క విషయం చెప్పు. నీ కూతుర్ని చివరి సారి ఎక్కువగా ఎప్పుడు మందలించావ్ ?" అడిగింది గాయత్రి.

"రెండేళ్ళ క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్ అందరం సినిమా కెళ్ళాం అని చెప్పింది. ఆ రోజు నేను, మా ఆయన బాగా కోప్పడ్డం. ఇంకోసారి వెళ్ళితే బాగుండదు అని గట్టిగా మందలించాం. అప్పటి నుండి అన్ని మానెసింది."

"అన్ని మానేసింది అని నువ్వనుకుంటున్నావ్, చెప్పటం మానేసింది అని నేననుకుంటున్నాను. కాస్త ఓపిక పట్టి అలా వెళ్ళటం వల్ల  కలిగే నష్టాలు చెపితే వెళ్ళటం మానేసేది, ఇప్పటికి అన్ని విషయాలు చెప్పేది" గాయత్రి బాధపడుతూ చెప్పింది.

"నీకేం తెలుసని నా కూతురు తప్పు చేస్తుందని చెప్పగలవు. తను నిజంగానే మానేసిందేమో" కోపంగా అడిగింది వనజ.

"నేను నీ కూతురు ఖచ్చితంగా తప్పు చేస్తుందని చెప్పటం లేదు. కానీ తన విషయాలు మీకు చెప్పుకునే అవకాశం తనకు  దూరం చేశారు."

"నాకేం అర్థం కావటం లేదు."

"పిల్లలు చిన్న వయసులో స్కూల్ నుండి రాగానే అన్ని విషయాలు మనకు చెప్పుకుంటారు. మనం వాటిని నవ్వుతూ విని, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెపుతాం. కానీ కాస్త పెద్దవాళ్ళయి ఏదయినా తప్పు చేశాం అని చెప్పగానే చాలా మందలిస్తాం. దాంతో వీళ్ళకు చెపితే తిట్టడం తప్ప ఏమి లేదని చెప్పటమే మానేస్తారు. "

"మరి మెచ్చుకొని ముద్దులు పెట్టుకోవాలా?"

"మెచ్చుకొను వద్దు, తిట్టను వద్దు. ఆ పని చెయ్యటం వల్ల జరిగే మంచి, చెడ్డలు వివరించి చెపితే,  మంచి నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకుంటారు. ఏ సమస్య వచ్చిన, ఏ విషయం అయినా నేనున్నాని వాళ్ళకు భరోసా ఇవ్వాలి. అప్పుడు మనకు చెప్పుకునే సౌకర్యం అలాగే ఉంటుంది. వాళ్ళు ఎం చేసిన మనకు తెలుస్తుంది" వివరించింది గాయత్రి.

వనజ ఆలోచనలో పడింది. కొద్దీ సేపటికి "నువ్వు చెప్పింది అక్షరాలా నిజం గాయత్రి. ఈ రోజు నుండి నా కూతురితో టైం స్పెంట్ చేస్తాను. తన విషయాలు నాకు చెప్పుకునే వాతావరణం కల్పిస్తాను" అంది దృఢ నిశ్చయంతో.

"చాలా సంతోషం వనజ. పిల్లలకు స్నేహితులు ఉంటారు చాలా విషయాలు చెప్పటానికి, చూసి నేర్చుకోవటానికి. కానీ మంచి చెడ్డలు విడమరిచి చెప్పాల్సింది మనమే. ఎందుకంటే స్నేహితులు కూడా చిన్నవాళ్ళే కాబట్టి"

"నాకు అర్థం అయింది తల్లి. నా కూతురు కాలేజ్ నుండి వచ్ఛే టైం అయింది. బై, మళ్ళీ కలుద్దాం" అని నవ్వుతూ వెళ్ళి పోయింది వనజ.


(అయిపోయింది) 

3 వ్యాఖ్యలు: