7, జులై 2016, గురువారం

హౌస్ వైఫ్ !

అలారం మోతతో మెలకువ రాగానే "అబ్బా అప్పుడే తెల్లారిందా ? " అని నిట్టూరుస్తూ లేచింది అరుణ.  "తొందరగా లేచి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యాలి, ఈయన గారికి బాక్స్ రెడీ చెయ్యాలి" అని మనసులో అనుకుని కిచెన్ లోకి అడుగు పెట్టింది. 

పిలల్ల స్కూల్ బ్యాగ్ లోంచి మరియు భర్త ఆఫీస్ బ్యాగ్ లోంచి బాక్స్ లు తీసి కడిగేసి ఫ్రీజ్ లోంచి పాలు తీసి వేడి చెయ్యటం మొదలు పెట్టింది. తర్వాత ఇడ్లి లు మరో పొయ్యి మీద పెట్టి, టీ కాయటం మొదలు పెట్టింది. పిల్లల బెడ్ రూం కి వెళ్ళి వాళ్ళను నిద్ర లేపి, బాత్రూమ్ లోకి పంపింది. 

చిన్నోడికి "నాన్న నువ్వు పళ్ళు సరిగా తొము, నీ నోరు కాస్తా వాసన వస్తుంది" అని చెప్పి మళ్ళీ కిచెన్ కి వఛ్చి వంట పనిలో మునిగి పోయింది.  పిల్లలు స్నానాలు ముగించుకుని రాగానే,  వాళ్ళకు ఇష్టమయిన సిరీయల్స్ బ్రేక్ ఫస్ట్ పెట్టి, వాళ్ళ లంచ్ లోకి బ్రెడ్ తో శాండ్ విచ్ లు తయారు చెయ్యటం మొదలు పెట్టింది. 

"ఖర్మ  కాకపోతే ! ఈ అమెరికా పిల్లలకు ఇండియా వంటల గురించి తెలియక, మా పిల్లలను వెక్కిరించటం ఏమిటి, వీళ్ళు మేము లంచ్ తీసుకెళ్ళాం అని మొండి కెయ్యటం ఏంటి? బెండ కాయ తీసుకెళ్తే, ఏంటిది అంత జిగటగా ఉంది! దీన్నెల తింటారు అన్నారంట. వీళ్ళ మొహానికి వాళ్ళా అమ్మలు వండి పెడితే తెలుస్తుంది. పోనీ పిల్లలు అక్కడే స్కూల్ లో లంచ్ కొనుక్కుని తింటం  అంటే, ఈయన గారికి పైసా కరగటం ఇష్టం లేదాయె. నేను ఉన్నాను కదా! చాకిరి చెయ్యటానికి" అని గొణుక్కుంటూ వాళ్ళ బాక్స్ పని  పూర్తి చేసింది. 

"బేబీ ఆఫీస్ కి లేట్ అవుతుంది మీ డాడీ ని నిద్ర లేపు" అని పంపింది పెద్దమ్మాయిని. 

"మామ్ డాడ్ ఇస్  ఆల్రెడీ ఇన్ బాత్రూమ్ "

రావటం తోనే "నా బాక్స్ రెడీ అయిందా? " అంటూ వచ్చాడు కిరణ్. 

"అవుతుందండి ! టిఫిన్ చేసే లోపు అయిపోతుంది"  అని కూర కలుపుతూ అంది. 

"ఏంటి ! ఇంకా కాలేదా? నేను ఆఫీస్ వెళ్ళకుండా నీ లాగా ఇంట్లో తాపీగా కూర్చుంటే ఎవడు తెస్తాడు? అయినా నువ్వు లేచింది ఎప్పుడు?"  విసుక్కున్నాడు. 

"నేను లేచిన దగ్గర్నుంచి కనీసం నోట్లో నీళ్ళు కూడా పోసుకోలేదు. నాకేమన్నా పది చేతులు ఉన్నాయా? చేస్తూనే ఉన్నాను. కొంచెం ఓపిక పట్టండి" అని దినంగా బ్రతిమాలింది. 

"కమన్ ! మళ్ళీ ఏడుపు మొదలు పెట్టకు. నీకు పది చేతులు కాదు! ఇరవై చేతులు ఉన్నా సరిపోవు, పని తీరదు"  అసహ్యంగా చూసాడు. వస్తున్నా దుఃఖాన్ని దిగ మింగుకుని స్టవ్ వేడి  పెంచింది. పిల్లలకు బాక్స్ సర్ది వాళ్ళను స్కూల్ బస్ ఎక్కించ టానికి బయటికి బయలు దేరింది. 

"హెల్లొ  ఎక్కడికి బయలు దేరావు? బయటకు వెళ్ళే టప్పుడు నైట్ డ్రెస్ మీద కాకుండా మంచి డ్రెస్ వేసుకోమన్నాను కదా" అన్నాడు గుర్రుగా చూస్తూ. వస్తున్నా కోపాన్ని దిగమింగుకుని డ్రెస్ మార్చు కోని వచ్చింది అరుణ .  

బయటకు వెళ్తుండగా, "నాకు టిఫిన్ పెట్టి వెళ్ళు"  అని టీవీ ఆన్ చేశాడు కిరణ్. "ఇక్కడే ఇడ్లి ఉంది, పక్కనే చట్నీ ఉంది, పెట్టుకొని తినచ్చు కదా" అనుకుంది మనసులో. పిల్లలను స్కూల్ బస్  ఎక్కించి వచ్ఛే సరికి, ఇంట్లో కూర మాడుతోంది. 

"ఏంటండీ ! కూర మాడుతోందని తెలియటం లేదా? కాస్త వచ్చి కలపటమో లేక స్టవ్ తగ్గించటమో చేస్తే అరిగి పోతారా?" అంది నిష్టురంగా. 

"అది నీ పని. నా ఆఫీస్ లో ఏదయినా ఇష్యూ ఉంటే నిన్ను హెల్ప్ అడుగుతున్నానా? రాత్రులు మెలకువగా ఉండి  నేనే సాల్వ్ చేసుకోవటం లేదా? ఇది అంతే" వెటకారమాడాడు. 

బాక్స్ రెడీ చేసె  లోపు షూస్ వేసుకుని రెడీ అయ్యాడు. తర్వాత కూర గిన్నె ఓపెన్ చేసి వాసన చూశాడు. "ఏంటిది ! కూర మొత్తం మాడు వాసన? మాడి పోయిన కూరలన్న, మాడి పోయిన మొహాలన్న నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వే తిను...నీ వెర్రి....." అని  చీదరించుకుని బాక్స్ తీసుకోకుండా వెళ్ళి పోయాడు. 

ఒక్కసారిగా కళ్ళు తిరిగి పోయాయి అరుణకు. పొద్దున లేచిన దగ్గర్నుంచి మంచి నీళ్ళు తాగకుండా వంట చేస్తే, కాస్త మాడు వాసన వచ్చిందని టిఫిన్ తీసుకోకుండా వెళ్తున్నాడు. మళ్ళీ రేపు నన్ను దెప్పి పొడవటానికి పనికొస్తుంది ఇది. సోఫాలో అలాగే కూలబడి పోయి, కొద్దీ సేపటికి లేచి బాత్రూమ్ లో దూరింది.  టిఫిన్ పెట్టుకుంటే తినాలని పించలేదు. 

"అమెరికా లో ఇద్దరు పిల్లలతో, మంచి జీతం వచ్ఛే భర్తతో చాలా సంతోషంగా ఉంది మా కూతురు అనుకుంటున్నారు అమ్మ  నాన్న. కానీ తన తిప్పలు ఎవరికి తెలుసు. పిల్లలకు వేరే వండి, ఈయన గారికి వేరే వండి, ఇంటి పనులు చేసె సరికి నడుము పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడయినా ఏదయినా నొప్పి అని చెప్పినా, ఎప్పుడు ఏదో ఒక్కటి చెపుతావ్ అని ఈసడింపులు. కొందరయితే వారానికి సరిపడ ఒక్కసారె  వండుకుంటారంట ! అలా చేస్తాను అంటే, వాళ్ళంటే జాబ్ చెస్తున్నారు, నువ్వేం చేస్తావ్? కనీసం వంట కూడా చెయ్యవా? అని నిష్ఠురాలు ఆడుతాడు". 

"గవర్నమెంట్ జాబ్ చేసే నాకు మరో గవర్నమెంట్ జాబ్ వాడినే చూడండి నాన్న అంటే, వింటేనా? గొప్పలకు పోయి సాఫ్ట్వేర్ ఇంజినీర్, అమెరికా వెళ్తాడు అని ఈయనకు కట్టబెట్టారు. కొత్తలో బాగానే ఉండేది. పెళ్ళి కాగానే అమెరికా తీసుకొచ్చేశాడు. చల్లని ప్రదేశం, వెచ్చని రాత్రులు, జీవితం అంత హానీ మూన్ లాగా ఉంటుదనుకున్నాను. కానీ ఇలా వంట పనికి ఇంటి పనికి అంకితం అవుతుందనుకోలేదు. ఈ ఆలోచన లోంచి బయటకు రావటానికి ఎవరికయినా ఫోన్ చేద్దాం అంటే, బిల్డప్ లు ఇస్తారు. గొప్పలు చెప్పుకోవటం తప్ప వీళ్ళకు ఏ పని పాట లేదు. పోనీ కాసేపు ఏదయినా  చూద్దాం" అనుకుని టీవీ ఆన్ చేసింది. 

మా టివి పెట్టగానే ఏదో రొమాంటిక్ సాంగ్ వస్తోంది. రవితేజ ఆ హీరోయిన్ పేరు ఏంటో తెలియటం లేదు తనకు. అది చూడగానే మనసంతా బాధతో మూలిగింది. "వాళ్ళు చేస్తున్నది నటనే అయినా, అలాంటి అనుభవం తనకు దక్కి ఎన్నాళ్ళు అవుతుంది. మొగుడనే వాడు కంప్యూటర్ తో  హాల్లో  కాపురం చేస్తున్నాడు. నేను గిన్నెలతో, కూరగాయలతో కాపురం చేస్తున్నాను.  ఎప్పుడు తనతో పడుకోడు, ఎప్పుడయినా పడుకున్నా అటు తిరిగి పడుకుంటాడు. పెళ్ళి అయినా కొత్తలో బాగానే రొమాంటిక్ గా ఉండేవాడు, కానీ ఇప్పుడు కనీసం నవ్వుతూ మాట్లాడటం మర్చి పోయాడు. ఇంకా పడక సుఖం కూడానా? నన్నే పట్టించు కొని వాడికి నేను ఎలా ఉంటే ఏంటో? కాస్త లావు అయితే చాలు ఈసడింపులు ఇంకా పెరిగి పోతాయి. ఏదయినా రుచి అయినా కూర ఉండి రెండు ముద్దలు ఎక్కువ తిన్న కూడా కొర కొర చూసే చూపులకు ఆకలి, తినాలన్న యావ రెండు చచ్చి పోతాయి". 

"పెళ్ళికి ముందు ఎంత దర్జాగా బతికిందో ఇప్పుడు అంత దయనీయంగా బతుకుతోంది. ఇష్టమయిన డ్రెస్ వేసుకోవటానికి లేదు. అమెరికాలో శారీ  ఏంటి గంగిరెద్దు లాగా, ఇప్పుడు పంజాబ్ డ్రెస్ ఏంటి ముష్టి మొహం లాగా అని ఎప్పుడు ఈయన గారికి నచ్చినవే వేసుకోవాలి. ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కొలిగ్స్ ను టీజ్ చేశారట ఈ డ్రెస్ లకు కొలతలు అక్కర్లేదు అని. అంతే నన్ను కూడా వేసుకోనివ్వటం మానేసాడు దొర. నాకు ఇష్టమయిన చీర  కట్టుకుని కలెక్టర్ ఆఫీస్ లో జాబ్ కు వెళ్తుంటే ఎంత మంది కన్నార్పకుండా చూసేవాళ్ళు. పక్క సెక్షన్ రాజేష్ నేనంటే ఎంత పడి చచ్చే వాడు.  అనుష్క అని,   విద్యా బాలన్ అని రోజుకో పేరు పెట్టి పిలిచే వాడు. కాస్త దైర్యం చేసి వాణ్ణి చేసుకున్నా అయిపోయేది. కులం తక్కువని, ఇంట్లో ఒప్పుకోరని వదిలించుకుంది. కానీ తాను మాత్రం వాణ్ణి ప్రేమించలేదా? వాడి కోసమే కద! రోజుకో చీర కట్టుకెళ్ళేది. వాడు కళ్ళు పెద్దవి చేసి తనను ఆశగా చూస్తుంటే ఎంత మురిసి పోయేది.  ఆశ స్థానంలో ఇప్పుడు తనంటే అసహ్యం చోటు చేసుకుంది తన మొగుడనే మగాడిలో. కారణం ఎంటో ఎప్పుడు తెలియలేదు. అడిగే ధైర్యం చెయ్యలేదు". 

"అందరి భార్యలు వర్క్ చేస్తున్నారు, నేను కూడా ఏదయినా చేస్తాను అంటే నీకు అంత సీన్ లేదు, అయినా నువ్వు డిపెండెంట్ వీసా మీద ఉన్నావ్ కుదరదు అంటాడు. అప్పుడే నువ్వు కంప్యూటర్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ వీసా చేయించే వాణ్ణి, నువ్వేమో తొక్కలో గర్నమెంట్ జాబ్ అని ఈసడించు కుంటాడు. నీకు  పెళ్లికి ముందు మా వాళ్ళు చెప్పలేదా? అని ఒక్కసారి అడిగినందుకు పిచ్చి పట్టినట్లు అరుస్తూ చెంపలు వాయించేశాడు. ఇంకా అడిగే ధైర్యం నాకు లేదు.  రోజు కో కొత్త టెక్నాలజీ వస్తుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ప్రైవేట్ జాబ్ చెయ్యటం నీకేం చేతనవుతుంది. ఏదో ఎంట్రన్స్ రాసి ఆ కోటా, ఈ కోటా అని జాబ్ తెచ్చుకున్న నువ్వు ఇక్కడ స్వీపర్ గా కూడా పనికి రావు, ఎందుకంటే దానికి కూడా కంప్యూటర్ రావాలి. అని తీసేసినట్లు మాట్లాడుతుంటే చొక్కా పట్టుకుని అడగాలనిపిస్తుంది, స్టేట్ వైడ్ ఎంట్రన్స్ లో కనీసం క్వాలిఫై అయ్యే సత్తా ఉందా నీకు అని?  కానీ వాడిలో  మృగం  నిద్ర లేస్తుంది. దాని తో పోరాడే శక్తి నాకు లేదు" . 

"ఇంకో రెండు రోజులయితే వీకెండ్ వస్తుంది. తలచుకుంటేనే భయంగా ఉంది. ఏమి వండ మంటాడో అని. అవి ఎక్కడ కుదరక పోతే మళ్ళీ సూటి పోటి మాటలతో కుళ్ళ బొడుస్తాడో అని. నేనేమన్నా ప్రొఫెషనల్ కూక్ నా? బిర్యాని ఏమాత్రం పలుకు లేకుండా, మెత్తగా అవ్వకుండా వండ టానికి ! అసలు పచ్చి మాంసం ముట్టుకుంటేనే నాకు అసహ్యం, అలాంటిది నేనే కడిగి కట్ చేసి  వండాలంటే, కొత్తలో ఎంత చీదర పుట్టేది. పిల్లలు ఇష్టంగా తింటారని అలవాటు చేసుకున్నా. కానీ వీక్ అంత ఇంటి పనితో అలసి పోయే నాకు మాత్రం వీకెండ్ పని ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఈయన గారు కొలీగ్స్ తో పెట్టె పాట్-లక్  కి వండి తీసుకెళ్ళటం. అందరూ హోటల్స్ నుండి తీసుకొస్తే మేము మాత్రమే ఇంట్లోనుండి. పొరపాటున ఎవరయినా బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఇస్తే అక్కడే నా పరువు తీసేస్తాడు" . 

"హౌస్ వైఫ్ అంటే అంత చులకన? ఇంటి పని చెయ్యటం అంత తేలిక? పొద్దున్న లేస్తూనే వేడిగా వండి పెట్టి, బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి, ఇళ్ళు శుభ్రం చేసి, సరుకులు తీసుకొచ్చి, బాత్రూమ్ లు కడిగి, పిల్లల్లతో హోం వర్క్ చేయించి, వాళ్లకు ఏదయినా తినాలనిపిస్తే వండి, మళ్ళీ వంట చేసి, గిన్నెలన్నీ తోమి, వాళ్ళను నిద్ర పుచ్చి,  నీ పక్కలో చేరితే నువ్వు దగ్గర తీసుకోకుండా, కనీసం మెచ్చుకోవటం వదిలేసి, మాట్లాడకుండా అటు తిరిగి పడుకుంటే? నేను మనిషిని అనుకున్నావా లేక కంప్యూటర్ అనుకున్నావా? నువ్వెంతా ! నీతో జీవితం ఎంత ? అనుకుంటే నేను సుఖంగా బ్రతకటం, ఇంటి పని చెయ్యటం కన్నా తేలిక.  అయ్యో నా పిల్లలు, మొగుడు ఎక్కడ కష్టపడుతారోనని అన్ని దిగమింగుకుంటూంటే చేతకాని దానిలాగా అయిపోయాను" ఇలా ఆలోచిస్తుంటే అప్రయత్నంగా అరుణ కళ్ళలోంచి జల జల రాలిపోతున్నాయి కన్నీరు. 

స్నానికి బాత్రూమ్ లో దూరి, గట్టిగా అరుస్తు భర్తను బండ బూతులు తిట్టడం మొదలు పెట్టింది. స్నానం అయ్యేంత వరకు తిడుతూనే ఉంది. స్నానం చేసి ప్రశాంతంగా బయటకు వచ్చింది. తర్వాత రోజులాగే ఇంటి పనిలో మునిగి పోయింది.  


(అంతులేని కథకు ఇక్కడితో ముగింపు)

42 వ్యాఖ్యలు:

 1. Very Realistic Story and Nice flow with narration....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కథ బాగుంది. కొన్నికొన్ని చోట్ల కొంత అసహజంగ ఉన్నా కథల్లో అది పెద్దగా ఇబ్బంది కాదు. శారీ కి సారీ అనీ, is కు ఐస్ అనీ ఇలా potluck కు పాట లాక్స్ అని చాలానే పదాలు తప్పులున్నాయి. భాషను సరిగా వ్రాయటమూ విషయం సరిగా చెప్పటంలో భాగమే కాక అంతకంటే ఏమాత్రమూ తీసిపోని ముఖ్యవిషయం అని గమనించ ప్రార్థన.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాలా కృతజ్ఞతలు. మీరు వెలికి తీసిన పద దోషాలు టైపింగ్ తప్పులు. కానీ పాట్ లాక్ అనే పదాన్ని పాట లాక్ అని తప్పుగా ఎత్తి చూపారు. కథలో అసహజం అన్నారు ! కాస్తా చెప్పగలరని మనవి. దాన్ని దిద్దుకునే అవకాశం ఉంటుంది తర్వాత రచనలో.

   తొలగించు
  2. మీ రన్నది నిజమే. typoలే హెచ్చుగా ఉన్నాయి. వీలైనంతగా వాటివిషయంలో‌ శ్రధ్ధ వహించండి. అసహజత్వం గురించి తరువాత వ్రాస్తాను. ఎడమచేయి బెణుకుపుణ్యమా అని నాకు ప్రస్తుతం టైపింగు చాలా ఇబ్బందిగా ఉంది. పాట్ లాక్ కాదండీ, పాట్ లక్. స్పెల్లింగ్ potluck అని.

   తొలగించు
 3. 1. బెండ కాయ తీసుకెళ్తే, ఏంటిది అంత జిగటగా ఉంది! దీన్నెల తింటారు అన్నారంట.
  నాకు తెలిసినంతవరకు అమెరికాలో ఇతరుల ఆహారపుటలవాట్లపైనా వేషభాషలపైనా హేళనలు ఉండవు. చాలా అరుదుగా కనిపించినా అవి పరిగణించదగినవి కావు. దీన్నే అవ్యాప్తి దోషం అంటాం.
  2. ఎవరికయినా ఫోన్ చేద్దాం అంటే, బిల్డప్ లు ఇస్తారు. గొప్పలు చెప్పుకోవటం తప్ప వీళ్ళకు ఏ పని పాట లేదు.
  అమెరికాలో ఉన్న ఇండియన్స్ కాస్త కలిసిమెలిసే ఉంటారండీ. మైనారిటీ వర్గం కదా మనవాళ్ళక్కడ! అందుకని అన్నమాట. గృహిణులుగా ఇంటిపట్టున ఉన్నవారికి పెద్దకాలక్షేపం ఇలా మనదేశీయుల సాటిగృహిణులతో కలవటమేను. అందుచేత డప్పువేసుకోవటాల కన్నా ఇతరులతో‌ సఖ్యతకే పెద్దపీట వేస్తారంతా. తక్కువగా పోజులు కొట్టేవాళ్ళూ ఉంటారు లెండి. అంత అవ్యాప్తిగా కాదు.
  3. బాత్రూమ్ లో దూరి, గట్టిగా అరుస్తు భర్తను బండ బూతులు తిట్టడం మొదలు పెట్టింది...
  ఇది కొంచెం వింతగా ఉంది. సంభావ్యమేను.
  ఇవన్నీ పెద్దపెద్ద విషయాలు కాదు. కథబాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్యామలీయం గారు! నేను అమెరికాలో ఉంటున్న వాడిని. నా స్నేహితుల అనుభవాలు వారి పిల్లలను ఇక్కడి పిల్లలు ఎంతగా టీజ్ చేసే వారో, వారి పిల్లలు ఇండియన్ వంటకాలు తీసుకెళ్ళటానికి ఎంతగా భయపడుతారో తెలుసుకుని దాన్ని రాయటం జరిగింది.

   మైనార్టీలు అయినా సరే ! ఎంత కలిసి ఉన్నా సరే ! మొన్నే అది కొన్నాము, ఇది తీసుకున్నాము, ఇంకేదో గొప్ప జరిగింది మాకు అని చెప్పుకోవటమే వాళ్ళ పని. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చిందే డబ్బులు సంపాదించటానికి.

   భర్త మీద కోపంతో, తనను ఏమి చెయ్యలేక, వదిలి పోలేక, ఆమె ఎలా మాములు మనిషిగా బ్రతుకుతుంది? అందుకే బాత్రూమ్ లో దూరి తన అక్కసును వెళ్ళ దీసుకుంటోంది. ఇది ఒక మానసికమయిన చిట్కా. కథలో మీరు ఎత్తిన చూపిన లోపాలతో నేను ఏకీభవించటం లేదు. అచ్చు తప్పుల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటాను.

   ధన్యవాదాలు.

   తొలగించు
  2. బహుశః మీరు చెప్పిన విషయాలు నిజమే కావచ్చును. నా అనుభవంలో గ్రహించిన విషయాలు అలాగు లేవు. కాని ఎవరి అనుభవాలూ సమగ్రం‌ కావు కదా. అందుచేత మీరు వ్రాసినది ఒప్పుదలగానే ఉంది. ఒకరికి లోపాలుగా అనిపించినంత మాత్రాన అవి లోపాలు కానవసరం లేదు. అచ్చుతప్పుల పట్ల జాగరూకత వహిస్తానన్నారు. మంచి సంగతి.

   తొలగించు


 4. గురుని యమెరికా రోజులు
  అరుదయినవి నేడు వాటి మాధురి బోయెన్ !
  గిరగిర తిరిగెను కాలము
  భరతమ్ము సరియగు భావి భవ్యము గానన్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అమెరికాకి వెళ్ళినా ఇండియన్ మెంటాలిటీ పోదు కానీ ఈ అమ్మాయి ఆలోచనా విధానం నాకు అస్సలు నచ్చలేదు.మీరు కొత్త బ్లాగర్ కదా చెపితే ఫీలవుతారని ఊరుకున్నాను.ఇపుడు మీరు వ్రాసింది బాగులేదు అంటే వ్యక్తిగతంగా తీసుకోకండి.ఇది కధని ఉద్దేశ్యించినది మాత్రమే !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫీల్ అయ్యేది ఏమి లేదు. మీరు ఇప్పుడు చూస్తున్నారేమో నా బ్లాగ్, కానీ నేను మొదలు పెట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది. అమెరికా వచ్చినంత మాత్రన బుద్దులు మారి పోతాయా? కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్ఛే తత్వం ఎవరిలో అయినా ఒక్కటే. అమెరికన్స్ అనగానే ప్రతి దానికి విడాకులు తీసుకుంటారు అనే అపోహ మానుకోవాలి. ఇక్కడ కూడా పిల్లల కోసం, కుటుంబం కోసం ఓపిక పట్టే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇవ్వన్ని ఎందుకు, మీకు నచ్చని అంశాలు ఏమిటో చెప్పండి :) :)

   తొలగించు
  2. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్ఛే తత్వం ఎవరిలో అయినా ఒక్కటే. అమెరికన్స్ అనగానే ప్రతి దానికి విడాకులు తీసుకుంటారు అనే అపోహ మానుకోవాలి. ఇక్కడ కూడా పిల్లల కోసం, కుటుంబం కోసం ఓపిక పట్టే వాళ్ళు చాలా మందే ఉంటారు.

   ఇండియన్ మెంటాలిటీ అంటే ఇదే కదా ? ఆ అమ్మాయి తత్వం నచ్చలేదు అంటే అమెరికన్స్ ని అన్నానని ఎందుకనుకున్నారు ? ఆ అమ్మాయి ఇండియన్ కాదా?

   మనం చేస్తున్న పనిమీద మనకు గౌరవం ఉండాలి.మనం చేస్తున్న పనిని మనం తిట్టుకుంటూ అవతలివ్యక్తిని నేను ఉద్ధరిస్తున్నాను అని ఫీలవడం నాకు నచ్చలేదు.ఉద్యోగం కావాలా భర్త కావాలా తేల్చుకోకపోతే అసంతృప్తే మిగులుతుంది. గృహిణిగా ఉండడాన్ని ప్రతిక్షణం నిరసిస్తూనే ఉంది.మీరు వ్రాసిన విధానం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత కోల్పోయేలా చేసింది. ఇది ఇంకా నచ్చలేదు.

   మీరు ఫీలవనన్నారు కనుక చెపుతున్నాను ఈ కధలో నేర్చుకోడానికి ఏమీ లేదు కనుక నాకు నచ్చలేదు....నచ్చలేదు...నచ్చలేదు.

   తొలగించు
  3. నీహారిక గారు అన్యథా భావించని పక్షంలో ఒకటి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను.

   ఈ‌కథలోని గృహిణి తన బాధ్యతలపట్ల నిరసనతో‌ కాక కుటుంబంలో తనకు ఏవిధమైన గుర్తింపూ లభించకపోవటమూ అంతకు మించి జీవితభాగస్వామి అనునిత్యమూ అవమానిస్తూ‌ ఉండటమూ పట్ల ఆవేదనతో ఉన్నదని అనిపిస్తున్నది. ఈ కథలో ఐతే, గృహిణిని ఒక జీతభత్యాలు లేని పనిమనిషిగా చూసే మనస్తత్త్వం ఉన్న భర్తలు నేర్చుకోవలసినది చాలాచాలా ఉన్నది. స్త్రీలైతే అణచివేతధోరణులను అరికట్టేందుకు తమవంతుగా ఏమి కృషిచేయాలో ఆలోచించుకోవలసినది కూడా ఉంది - ఉదాహరణకు బిడ్డలను తీర్చిదిద్దేటప్పుడు ఈ‌నాటికీ తెలిసీతెలియక అనేకమంది గృహిణులు స్వయంగా రకరకాల లింగవివక్షను చూపుతూ‌ ఉంటారు - తమ బిడ్డలను ఇటువంటి వివక్షతను గురించి సక్రమంగా అలోచించేలా పెంచేవిషయం గృహిణులు దృష్టిలో ఉంచుకోవటం నేర్చుకోవాలి. ఇత్యాదులు. కథబాగుందని నేను అభిప్రాయపడినది అందుకనేను.

   ఐతే నీహరికగారికి, ఒక గృహిణిని వెన్నెముకలేని బక్కజీవిగా ఆత్మన్యూనతతో బ్రతుకుతున్నట్లుగా కథల్లో చూపటంపై అభ్యంతరం ఉందని అనుకుంటున్నాను. ఆవిడ దృక్కోణం పూర్తిగా సమంజసమే. ఆత్మన్యూనతలను కథావస్తువులుగా చూపినంతమాత్రాన ప్రయోజనం పెద్దగా ఉందదు. అలా కాక ఆత్మన్యూనత పలు కాకుండా అణచివేతల వంటి వాటిని ఎదుర్కొనే, వాటిని అధిగమించే పరిణతి ఉన్న స్త్రీమూర్తులను చిత్రీకరించటం సమాజానికి మరింత మేలు చేస్తుందన్న వాదన చాలా మంచి వాదన. ఆదిశగా కూడా రచయితగారు ఉత్తరోత్తరా ఆలోచించి మరిన్ని మంచి కథలు వ్రాయగలరని ఆశిద్దాము.

   తొలగించు
  4. నిహారిక గారికి, మీరు మాటి మాటికి ఇండియన్ మెటాలిటీ అంటుంటే ఇండియన్స్ అంటే మీకు సదభిప్రాయం లేదని అనుకోవాల్సి వస్తుంది. మీరు అమెరికా వెళ్లిన కూడా ఇండియన్ మెటాలిటీ పోదు అన్నందుకు నేను అలా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అంతే కానీ మీరు అన్న ప్రకారం, ఏదో ఇండియన్ మెంటాలిటీ తో మాత్రం కాదు (అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదు. కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి).

   ఏ పని చేసిన ఎవరయినా కాస్త గుర్తింపు కోరుకుంటారు. మనం చేసిన వంటయినా, చిన్న పనయినా బుజం తట్టి ప్రోత్సహిస్తే ఎంత ఆనందం వేస్తుంది మీకు తెలియనిది కాదు. ఏదో ఒక రోజు కాస్త కూర మాడి పోయిందని కష్టపడి వండిన కూరను తీసుకు పోనీ మొగుడి ని ఏమి చేయలేక తాను ఉద్యోగం చేసిన రోజులు ఎంత గౌరవించ బడేదో తల్చుకుని బాధపడటం సాధారణ విషయం. అది కాకుండా పెళ్లికి ముందు ఉద్యోగం చేసే వారికి వంట, వార్పూ తెలియాలన్న నియమం లేదు, కానీ కాస్త అటు ఇటు అయితే పది మందిలో పరువు తీసే మొగుడి తో చేసే పని పట్ల ఉత్సాహం ఎలా ఉంటుంది? ఇక కథలో నేర్చుకొనే విషయాలు శ్యామలీయం గారు చక్కగా వివరించారు. కానీ ఇందులో మరో కోణం, భార్యలు తల్చుకుంటే, మొగుడిని, పిల్లలను వద్దు అనుకుంటే వారు బ్రతకటం వంట చేసినంత తేలిక. సదరు మొగుళ్ళు తమ భార్యలను గౌరవించాలని హెచ్చరిక తట్టలేదా?


   శ్యామలీయం గారికి, నా కథ ను బాగానే అర్థం చేసుకున్నారు. పాత్ర ఆత్మనూన్యత గురించి, అది ఉంటే నేరమా? నిజ జీవితంలో ఎంత మంది మనకు తారస పడరు? అస్తమానం అవమానిస్తూ, ఏ మాత్రం మెచ్చుకొని, కనీసం దగ్గరకు తీసుకొని భర్తతో బ్రతికే ఆడవారికి ఏలాంటి ఆత్మ విశ్వాసం ఉంటుంది? కానీ ఏదో ఇప్పుడు సమర్థించు కుంటున్నాను అనుకోక పోతే, ఆ పాత్రకు తన బలం తెలుసు. అందుకే నిన్ను వదిలి పోతే నేను బ్రతకటం ఇంటి పని చెయ్యటం కన్నా తేలిక అంటుంది. కానీ పిల్లలను తండ్రి ప్రేమకు దూరం చెయ్య కూడదని, భర్త మీద ఇంకా మిగిలి ఉన్న ప్రేమ కోసం భరిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు కదా? ఏదో ఒకనాడు నాకు మంచి రోజులు వస్తాయని బ్రతికే ఆడవాళ్ళు మన మధ్య ఎంత మంది లేరు? భర్తను నీకు అంత సామర్థ్యము ఉందా? అని మనసులో ప్రశ్నించుకునే తనకు తన శక్తి సామర్థ్యాలు తెలియావ?

   అన్యదా భావించటానికి, ఫిల్ అవ్వటానికి సిద్ద పడితే అభిప్రాయాలు చెప్పటం మానుకోవాలి. అన్నింటికి సిద్దపడే నేను బ్లాగ్ మొదలు పెట్టాను. అందుకే మీరు ఎంత నచ్చ లేదు.... నచ్చ లేదు అని చెప్పిన నేనేం నొచ్చుకోలేదు.

   మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  5. ఆత్మనూన్యత గురించి, అది ఉంటే నేరమా?
   కాదండీ. ఒక మానసికస్థితి మంచిదైనా చెడ్డదైనా దానంతట అది నేరం కాదు కద. ఆత్మనూన్యత నివారణీయం‌ కాబట్టి ఆకోణంలో‌ కూడా వీలువెంబడి వ్రాయమని సూచించానే కాని తప్పుపట్టలేదు మిమ్మల్ని కాని కథను కాని.

   >అన్యదా భావిస్తే, ఫిల్ అయ్యే పనే అయితే అభిప్రాయాలు చెప్పటం మానుకోవాలి. అందుకే మీరు ఎంత నచ్చ లేదు అని చెప్పిన నాకేం అనిపించలేదు. మీకు అర్థం అయినా విధానం అలాంటిది
   ఈ‌ పేరా నాకు సరిగా అవగాహన కావటం‌ లేదు. 1. అన్యథా భావించవద్దని చెప్పటం సముదాచారం. 2. మీ కథన నచ్చలేదని నేను చెప్పలేదు కదా. 3.నాకు అర్థం ఐన విధానంలో లోపం ఉండవచ్చును - మానవమాత్రుడిని, అపండితుడిని కాబట్టి.

   తొలగించు
  6. శ్యామలీయం గారికి, నేను రాసిన మూడవ పేరా, సమగ్రత కోసం రాసింది. ఎందుకంటే మీరు నిహారిక గారిని అన్యదా భావించ వద్దని రాసారు, నిహారిక గారు నేను ఫిల్ అవ్వనంటే అని రాసారు. ఇందులో ఆ రెండింటికి తావు లేదు, ఒక వేళ ఉంటే పది మందిలో మాట్లాడే పని మానుకోవాలి అని నా ఆభిప్రాయం. మన అభిప్రాయం అందరికి నచ్చాలి అన్నప్పుడే అన్యదా భావించటం కానీ, ఫీల్ అవ్వటం కానీ జరుగుతుంది. మీరు అపండితుడు అని ఎన్నటికీ భావించను. బహుశా నేను సూటిగా రాసి ఉండాల్సింది. కానీ కథ పాత్ర యొక్క స్వగతంతో సాగటం మూలంగా సాధ్యపడలేదు.

   తొలగించు
  7. అలారం మోతతో మెలకువ రాగానే "అబ్బా అప్పుడే తెల్లారిందా ? " అని నిట్టూరుస్తూ లేచింది అరుణ. "తొందరగా లేచి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యాలి, ఈయన గారికి బాక్స్ రెడీ చెయ్యాలి" అని మనసులో అనుకుని కిచెన్ లోకి అడుగు పెట్టింది.

   మొట్టమొదట లేస్తూనే ఇలా తిట్టుకుంటూ నిద్రలేచిన ఆమె రోజంతా భర్త మీద ద్వేషంతో మాట్లాడిన మాటలు ఆమెపై సానుభూతిని చెరిపేసాయి.నేను ఈ కధా వస్తువు గురించి మాట్లాడుతుంటే మీరు సార్వజనీయక విషయాల గురించి మాట్లాడుతున్నారు.అంతులేని కధంటూ ముగింపు ఒకటి ! ముగింపు లేని కధలంటే నాకు చిరాకు.ఆవిడలా ముగింపు లేకుండా జీవితాంతం బాధపడుతూనే ఉంటుందా ? (రావు రమేష్ స్టైల్ లో) కాస్త పట్టించుకోండి,అలా వదిలెయ్యకండి.

   తొలగించు
  8. పొద్దున లేవగానే , ఉదయం ఎంత బాగుంది, ఇప్పుడు సంతోషంగా పని చేసుకోవాలి అని రాయాలా? తాను పలానా పని చెయ్యాలి అని రచయిత రాయకుండానే పాఠకులకు అర్థం అయిపోతుందా? ఎక్కడ భర్తను ద్వేషించు కుంది... "తీసేసినట్లు మాట్లాడుతుంటే చొక్కా పట్టుకుని అడగాలనిపిస్తుంది, స్టేట్ వైడ్ ఎంట్రన్స్ లో కనీసం క్వాలిఫై అయ్యే సత్తా ఉందా నీకు అని? కానీ వాడిలో మృగం నిద్ర లేస్తుంది." ఇక్కడ తప్ప ఎక్కడ భర్తను కనీసం "వాడు" అనలేదు, దూషించ లేదు.

   ఆ పాత్ర పట్ల సానుభూతి ఎక్కడ తగ్గ కూడదు అనే, భర్తను ఎక్కడ నిందించ కుండ జాగ్రత్త పడ్డాను. నేను రాసిన ఒక్క పేరాలోనే అన్ని "సార్వజనీయక విషయాల గురించి" అర్థం అయిందా తమరికి. కానీ ఇంత చెప్పిన కథ మాత్రం అర్థం కాలేదు. అంతులేని కథ అంటే ఆమెకు మంచి రోజులు రావు అని అర్థం ఉందా? తన సామర్థ్యం ఏమిటో తన భర్తను మనసులో ప్రశ్నించటంలోనే చూపించాను.

   ఎదుటి వారిని ఎంతటి వారు అనుకుంటే, వారు ఏది చెప్పిన పొల్లు మాట గానే తోస్తుంది. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే మర్మం తెలుస్తుంది.

   దీన్ని మీకు ఇష్టం వఛ్చిన స్టయిల్ లో చదువుకోండి. పక్క వాళ్ళ స్టయిల్స్ అనుకరించటం నాకు చిరాకు. అందుకే ఏ స్టయిల్ చెప్పటం లేదు.

   తొలగించు
  9. నిహారిక గారు, మనం ఎపుడైనా "పనిలేక" కూర్చుని .. ప్రతివ్రతల కధలు విని తరించితే తప్పులేదు. వచ్చే జన్మలో అయినా భర్త మాట జవదాటని జవరాళ్ళమై పుట్టవచ్చేమో కదా ?

   మీరు మీ బ్లాగ్ లో రాసిన ఈ ఒక్క వాక్యం తో మీకు నా కథ ఎందుకు నచ్చలేదో చెప్పగలను. ఆడవారు భర్త మాట జవదాటని వారుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ నా పాత్ర, నా భావాలు అవి కావు. పాపం ఆడవాళ్ళను కూడా ఆలోచించ నివ్వండి. మొగుడు తప్పు చేస్తే కనీసం మనసులో అయినా తిట్టుకొని బాధను వెళ్లగక్క నియ్యండి.

   తొలగించు
  10. స్నానికి బాత్రూమ్ లో దూరి, గట్టిగా అరుస్తు భర్తను బండ బూతులు తిట్టడం మొదలు పెట్టింది. స్నానం అయ్యేంత వరకు తిడుతూనే ఉంది.

   ఎంత స్థిమితంగా ఆలోచించినా ఈ పతివ్రత కధ చదివి తరించలేకపోతున్నా ! క్షమించండి.

   తొలగించు
  11. ముందుగా ఆ పతివ్రత వ్యామోహం నుండి బయటకు రండి మీరు. నేను ఎక్కడ నా పాత్ర చేత నేను పతివ్రతను అని చెప్పించలేదు. ఇది ఒక సాధారణ గృహిణి కథ. తనకు కోపం, ప్రేమ, కోరికలు, ఆశలు అన్ని ఉన్నాయి (మీకు నచ్చే పతివ్రతల బాపతు కాదు లెండి). ఇంతకు ముందు శ్యామలీయం గారికి వివరణ ఇఛ్చినట్లే, భర్త మీద, పిల్లల మీద ప్రేమను, కుటుంబం పట్ల బాధ్యతను వదులు కోలేక, మొగుడితో పోరాడే శక్తి లేక తనలో అక్కసును అలా వెళ్లగక్కుతోంది. ఇది ఒక మానసిక మయిన చిట్కా.

   మంచి భర్త దొరికి నప్పుడే కాదు, చెడ్డ భర్త దొరికిన కూడా అతన్ని వదిలి పోకుండా మార్పు కోసం ఎదురు చూడటం పతివ్రత లక్షణం అని, పతివ్రతల కథలు తెలిసిన మీకు నేను చేపుతునందుకు క్షమించండి.

   తొలగించు

 6. అమెరికా పిల్లలకు ఇండియా వంటల గురించి తెలియక, మా పిల్లలను వెక్కిరించటం ఏమిటి,
  అమెరికాలో ఉన్న ఇండియన్స్ కాస్త కలిసిమెలిసే ఉంటారండీ.
  నేను అమెరికాలో ఉంటున్న వాడిని.

  ఇవన్నీ చదివిన తరువాత నేను వ్యాఖ్యానించడం జరిగింది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆ విషయం అర్థం అయింది నాకు. కానీ మీరు మాటి మాటికి ఇండియన్ మెంటాలిటీ అని సెలవిచ్చారు కదా! దాని గురించి నేను అడిగింది. అంటే ఏంటో చెప్పమని.

   తొలగించు
  2. మొగుడు తప్పు చేస్తే కనీసం మనసులో అయినా తిట్టుకొని బాధను వెళ్లగక్క నియ్యండి.

   తప్పుచేస్తే అతనికి డైరెక్ట్ గా చెప్పకుండా మనసులో తిట్టుకోవడమే ఇండియన్ మెంటాలిటీ !

   తొలగించు
  3. ఓహో అలాగ? మరి ముందు చెప్పిన విషయాలకు ఇప్పుడు ఇస్తున్న వివరానికి అసలు పొంతన లేదే? ఎంత మంది విదేశీయులతో మీకు సాన్నిహిత్యం ఉంది? ఇది మాత్రమే ఇండియన్ మెంటాలిటీ అని నిర్దారించేశారు. వ్యక్తిత్వ వికాసం అనేది ఎవరి కయినా ఒక్కటే. అన్ని మనస్తత్వాలు అన్ని దేశాల వారిలో ను ఉంటాయి. ఇండియన్స్ అందరూ అలా ఉంటారు, విదేశీయులందరూ ఓపెన్ గా ఉంటారు అనేది అర్థం లేని వ్యర్థ వాదం.

   అవును ! తనను నేరుగా ప్రశ్నించే శక్తి లేక కనీసం మనసులో ప్రశ్నిస్తోంది. ఇలాంటివి అన్ని దేశాల వారిలో, అన్ని జాతుల వారిలోను ఉంటాయి. నిజానికి అమెరికన్స్ లోనే ఎక్కువ మొహమాటం, దయ ఉంటుంది, ఎదుటి వారిని భాద పెట్టకూడదు అని. అందుకే మన ఇండియన్స్ ఇక్కడ హాయిగా ఉండగలుగుతున్నారు.

   మళ్ళీ ఇండియన్ మెంటాలిటీ అని దీని కి ఏదో పేరు.......

   తొలగించు
  4. అన్ని మనస్తత్వాలు అన్ని దేశాల వారిలో ను ఉంటాయి.నిజానికి అమెరికన్స్ లోనే ఎక్కువ మొహమాటం, దయ ఉంటుంది, ఎదుటి వారిని భాద పెట్టకూడదు అని.

   ఈ విషయాలు తెలుసుకోవడం కోసం అమెరికా వెళ్ళి సాన్నిహిత్యం పెంచుకోవాలంటారా ? ఒబామాని చూస్తే సరిపోదా ?

   తొలగించు
  5. మరి ఇండియన్ మెంటాలిటీ అని పదే పదే వల్లే వేశారు? దాని అర్థం ఏమిటో?

   తొలగించు
 7. ఇండియన్స్ అందరూ అలా ఉంటారు, విదేశీయులందరూ ఓపెన్ గా ఉంటారు అనేది అర్థం లేని వ్యర్థ వాదం.

  Yes,I agree !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అబ్బా ఏమి నా భాగ్యం . మీరు ఒప్పుకున్నారా? మరి ఇండియన్ మెంటాలిటీ అంటూ ఏదో తెగ చెప్పినట్లు ఉన్నారు. అన్ని మనస్థత్వాలు అన్ని దేశాల వారిలో ఉంటాయి.

   తొలగించు
 8. ఈ అమెరికా పిల్లలకు ఇండియా వంటల గురించి తెలియక, మా పిల్లలను వెక్కిరించటం ఏమిటి

  అమెరికన్స్ అందరూ వెక్కిరించరు కదా ? ఆవిడ అలా ఎందుకనుకుంది ?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆవిడ అమెరికా మెంటాలిటీ అని అనలేదు. వారి పిల్లల స్కూల్ లో ఉన్న అమెరికన్ పిల్లల గురించి అనుకుంది. దాన్ని కూడా విడమరచి రాస్తే పాఠకుడికి కావాల్సిన చదివించే గుణం కోల్పోతుంది రచన. చదివే వాడికి ఆ మాత్రం జ్ఞానం ఉంటుందని రచయిత అనుకోవటం అత్యాశ కాదు కదా?

   తొలగించు
 9. మంచి భర్త/చెడ్డ భర్త దొరికితే .... మార్పుకోసం ఎదురుచూస్తూ... తనను తాను మార్చుకోవడమే పతివ్రత లక్షణం (మారాలంటే మారక తప్పదు) అని మీరు తెలుసుకోనందుకు ఒక బ్లాగర్ గా నేను మిమ్మల్ని క్షమించలేను.

  “ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్
  ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మవః”

  ఇస్లియే… కాబట్టి

  “ఎవరో వస్తారని ఏమో చేస్తారని
  ఎదురు చూసి మోసపోకుమా
  నిజం మరచి నిదురపోకుమా”

  మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అబ్బో చాలా పెద్ద పెద్ద శ్లోకాలు ఏవో రాసారు. మీరు ఇంత చెప్పి నా పాత్ర మారి పోతే మీకు నచ్చే పతివ్రత కింద పరిగణిస్తారు అని నాకు అర్థం అయింది. మారాలి అంటే, ఇంకా అణగారి పోవాలా? ఏ మాత్రం గౌరవం, ప్రోత్సాహం ఇవ్వని మొగుడిని నువ్వే దైవం అని పూజించాలా? ఒక్కపుడు స్వతంత్రముగా ఉద్యోగం చేసి, ఇంకా చేసే సత్తా ఉన్న మనిషిని కేవలం ఇంటి వద్ద ఉంటుందని, అది కూడా ఉద్యోగం చేయటానికి వీలు స్థితిలో, అస్తమానం అవనిస్తూ ఉంటే ఏం మార్పు తెచ్చుకోవాలి? ఎలా మారి పోవాలి? అందరిని వదిలి వెళ్ళి పోవాలా? లేదా అలాగే అణిగి ఉండటాని సంతోషంగా స్వీకరించాల? స్వీకరించాలి అంటే గనుక ! ఒక బ్లాగర్ గా నేను మిమల్ని క్షమించను.

   నేను యుద్దాలు చేయించాలను కోలేదు. పాత్ర మీద సానుభూతి పుట్టించి, తన శక్తి సామర్థ్యాలు చెప్పించాలను కున్నాను. అలాగయినా కనీసం ఇంట్లో పని చేసుకునే ఆడవారి పట్ల పురుష అహంకారుల దృష్టి మారుతుందని. అలాగే పడి ఉంటుంది, ఏం చేసిన ఏమి చెయ్యలేదు, అనుకునే మగవారికి, నీతో జీవితం అక్కర్లేదు అనుకుంటే, నేను బ్రతకటం చాలా తేలిక, అని చెప్పించాను. అది వారికి హెచ్చరిక కదా?

   ఇన్ని విషయాలు తమరికి అర్థం కాలేదు, కానీ యుద్దాలు మార్పులు అని శ్లోకాలు మాత్రం వల్లే వేస్తారు.

   తొలగించు
  2. పాత్ర మీద సానుభూతి పుట్టించి, తన శక్తి సామర్థ్యాలు చెప్పించాలను కున్నాను.

   సానుభూతితో శక్తిసామర్ధ్యాల ప్రదర్శన ....ఓహ్, చదివే వాడికి ఆ మాత్రం జ్ఞానం ఉంటుందని రచయిత అనుకోవటం అత్యాశ కాదు.

   తొలగించు
  3. మీరు ఎం రాసారో కనీసం మీకు అర్థం అవుతుందా? అయ్యో పాపం ఇలా జరుగ కూడదు తనకు అనుకోనేది ఒక అంశం, అది సానుభూతి. అలాగే నేను నిన్ను వదిలి పోగలను, స్వతంత్రంగా బతుక గలను అని తన శక్తి ని ప్రదర్శించటం ఒక అంశం. ఒకే సారి చెప్పినంత మాత్రాన రెంటికి పొత్తు పెట్టి, మీ జ్ఞానాన్ని ఇంకా చాటుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు అప్పుడపుడు ఎదురు పడితినే రచయిత సామర్థ్యం ఏంటో తనకు తెలుస్తుంది.

   తొలగించు
  4. మీలాంటి వాళ్ళు అప్పుడపుడు ఎదురు పడితినే రచయిత సామర్థ్యం ఏంటో తనకు తెలుస్తుంది.

   Thanks !

   తొలగించు
 10. "Sayaram.....

  అబ్బో చాలా పెద్ద పెద్ద శ్లోకాలు ఏవో రాసారు. మీరు ఇంత చెప్పి నా పాత్ర మారి పోతే మీకు నచ్చే పతివ్రత కింద పరిగణిస్తారు అని నాకు అర్థం అయింది. మారాలి అంటే, ఇంకా అణగారి పోవాలా? ఏ మాత్రం గౌరవం, ప్రోత్సాహం ఇవ్వని మొగుడిని నువ్వే దైవం అని పూజించాలా? ఒక్కపుడు స్వతంత్రముగా ఉద్యోగం చేసి, ఇంకా చేసే సత్తా ఉన్న మనిషిని కేవలం ఇంటి వద్ద ఉంటుందని, అది కూడా ఉద్యోగం చేయటానికి వీలు స్థితిలో, అస్తమానం అవనిస్తూ ఉంటే ఏం మార్పు తెచ్చుకోవాలి? ఎలా మారి పోవాలి? అందరిని వదిలి వెళ్ళి పోవాలా? వెళ్ళి పోవాలి లేదా అలాగే అణిగి ఉండటాని సంతోషంగా స్వీకరించాలి అంటే ఒక మహిళగా మిమల్ని నేను క క్షమించను

  ఈ అంతులేని కధ వ్రాసింది మీకు ముగింపు తెలియకనే కదా ? తెలుసుకుని మీరు పొడిచేసేదీ ఏమీ లేదు (లేదని మీరే వ్రాసారు) కొన్ని జీవితాలంతే !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొడిచేసింది ఏమి లేదు అని రాసింది, వినయంతో కూడిన విధేయత అని మీకు తెలియక పోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ సాధించింది సున్నా అయినా, ఏదో విశ్వమంతా మా గుప్పిట్లో నే ఉంది అని చంకలు గుద్దుకుంటూ, మమల్ని మించిన తెలివైన వారు ఇంకా లేరు అని ఎగిసే పడుతూ ఉంటారు మీలాంటి వారు.

   ముగింపు లేక, తెలియక రాయలేదు. కథ అనుకున్నప్పుడే దీన్ని ఇలాగే ముగించాలి అనుకున్నాను. ఎందుకంటే నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరిగే సంఘర్షణ కాబట్టి. అయినా ముగింపు ఇలాగే ఉండాలి అని రచయితను శాసించే హక్కు పాఠకురాలిగా మీకు లేదు. మీకు అది అర్థం కాదు, కొన్ని జీవితాలు అంతే !!!!

   తొలగించు
  2. విశ్వమంతా నా గుప్పెట్లో ఉందా ? ఎంత మంచి మాటన్నారు. మీ వినయంతో కూడిన విధేయతకి నా ధన్యవాదాలు.

   తొలగించు
  3. ఎంత బాగా అర్థం చేసుకున్నారో? మీ అర్థం చేసుకొనే తెలివికి నా ధన్యవాదాలు. ఇంకా సెలవ్.....

   తొలగించు
 11. Very nice and eye opening story for male dominating society.... Husbands should understand wives and their effort to keep them happy....

  ప్రత్యుత్తరంతొలగించు