9, మే 2016, సోమవారం

సగం జీవితం!
ఎవరి తప్పో తెలియదు! కాని
నేను సగం జీవితమే బ్రతుకుతున్నాను !

బడి నుండి పగటి బోజనానికి
ఇంటికి వస్తే !
పక్కింటిలో చద్ది పెట్టి
అమ్మా పొలానికి వెళ్ళిందని !
సాయంత్ర మయిన, యింటికి రాక
అరుగు మీద బిక్కు బిక్కు మన్న క్షణాలు !
ఇప్పటికి గుబులు పుట్టిస్తాయి
ఆదివారం అయినా అమ్మతో గడపాలన్న ఆశను
పొలం కలుపుతో పెరికేసిందని,
ఆ అసంతృప్తి ఇంకా అలాగే ఉందని, అమ్మకు చెప్పేదా?

గొప్పగా నన్ను చూడాలని నాన్న
పరాయి ఊరు వలస పోయి,
నాకు చుట్టంలా  మారిపోయాడు !
నన్ను  ఉత్తరాల్లోనే అడించాడని
ఆ ఆటలు ఇంకా బాకి ఉన్నడని, నాన్నకు  చెప్పేదా?

చదువు నాకు భారమాయి
నన్ను ఇంటికి దూరం చేసింది
హాస్టల్ లో జ్వరం వస్తే, ఎన్ని మందులు ఇచ్చిన
తగ్గదే? అని డాక్టర్ బిత్తర పోతాడు, కాని
అమ్మ ఒడిలో ఒక్క రాత్రి పడుకుంటే
ఎ మందు అవసరం లేదని తెలిసినా! ఒప్పుకోడు
ఎక్కడ తన డిగ్రీ వెక్కిరిస్తుందో నని

అక్షరం ఖాళీ లేకుండా కబుర్లు రాసి
అమ్మ కు ఉత్తరం పంపి,
ఉత్తరాల అంకుల్ కోసం ఎదురు చూస్తూ
తిండి మర్చి పోయిన రోజులు ఎన్నో !
జాబు రాలేదంటే, అమ్మ మీద ఎంత కోపమో ?
ఆ యాతన, ఆ ఒంటరి తనం అలాగే ఉందని, ఎవరికి చెప్పేది?

చదువు నన్ను తెలివయిన వెర్రి వాణ్ణి చేస్తే
ఉద్యోగం నన్ను ఊరి నుండి తరిమేసింది
బహుళ జాతి కంపెని, నన్ను తనకు బానిస చేసింది
వారానికి ఒక్కసారి వెళ్ళటానికి కూడా
నా పల్లె అంధకారం,
ఆ  పట్నపు పూతల ముందు ఓడిపోయింది
నా పిల్లల్ల సుకుమారం,
నన్ను మళ్ళి నాకు దూరం చేసింది !

నా దేశ అవినీతి, రూపాయిని
అంతర్జాతీయ అంగట్లో పాపాయిని చేసింది
నన్ను దేశం నుండే బహిష్కరించింది
సంపాదించాలన్న సంకల్పం
నా వారికీ నన్ను పూర్తిగా దూరం చేసింది !
ఇంత దూరం లో, ఎంత దిగులుతో ఉన్నానో
చెపితే అర్థం అవుతుందా ?

9 వ్యాఖ్యలు:

 1. mee swagatham..naa swagathaanni thadimindi.
  brathuku chithraanni kallamundu nilipaaru.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. I could see my self in every line of your poem....very real

  ప్రత్యుత్తరంతొలగించు


 3. చదువుల వెంబడి పరుగులు
  నిదురను బోవగ క్షణములు నీదరి రాకన్
  కుదురక తల్లిని తలచిన
  చెదిరెను స్వప్నము జిలేబి చేరువ లేకన్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీ కవిత ఆవేదనాపూరితంగా ఉంది. చివరి రెండు లైన్లు చదువుతుంటే విన్నకోట రవిశంకర్ అనే ప్రవాస కవి తన ఓ కవితలో అన్న "కలలుకన్న దేశం వచ్చాక కన్నదేశం కలలోకొస్తోంది" అనే వాక్యం గుర్తొచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు