12, మార్చి 2016, శనివారం

మరో కోణం - 2

(మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి.)

"ఎం అంటుంది రా మైథిలి ? ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు" కుతూహలంగా అడిగాడు వెంకట్. 

"తన పని కూడా నన్నే చేయమంటుంది రా ! అమ్మగారు మాత్రం పేస్ బుక్ లో ఫ్రెండ్స్ తో బిజీ గా ఉంటుందట" విసుక్కున్నాడు సతీష్. 

"ఇద్దరు లవర్స్ ఒకే ఆఫీసు లో, ఇంకా ఒకే ప్రాజెక్ట్ లో చేస్తే ఈ తిప్పలు తప్పవ్ మామ. అనుభవించు" బాగా అయింది వెధవకు ! అనే భావన కనబడనియ్యకుండా జాగ్రత్త పడ్దననుకున్నాడు వెంకట్. 

తన మర్మం అర్థం అయినా సతీష్ "భలే చెప్పావ్ రా, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు" అని వెళకొళమ్ ఆడాడు.

"దూరపు కొండలు నునుపు అంటారు"

"అందని ద్రాక్ష పుల్లన అంటారు మరి"

"సర్లే రా !  నీకందిన ద్రాక్ష ఎన్ని రోజులు తియ్యగా ఉంటుందో చూద్దాం"

********************************************************************************************************

  రెండు వారాల తర్వాత.......

"ఏంట్రా ఈ మధ్య మీ మధ్య కొంటె చూపులు లేవు, కవ్వింపులు లేవు" వెంకట్ అరతిసాడు. 

"అసలు నువ్వు పని చేస్తున్నావా ? అదే పనిగా మమల్ని చూస్తున్నావా ?" చిరాకు పడ్డాడు సతీష్. 

"పక్కనే ఉండి, రొమాంటిక్ టచ్ లు ఇచ్చుకుంటూ ఉంటె ఉప్పు కారం తినే ఎవడికయినా చూపు పడకుండా ఉంటుందా ?"

"మా మధ్య రొమాన్స్ కన్నా, మీ ఏడుపు ఎక్కువయింది. అందుకే ఒక్క విషయంలో కూడా మా ఇద్దరి ఒపీనియన్ కలవటం లేదు"

పక్కోడి ప్రొబ్లెమ్స్ నుండి కాలక్షేపం  వెతుక్కొనే సగటు సామాన్యుడిల  "ఏమయింది రా ? కాస్త వివరంగా చెప్పు" అని ఆసక్తి కనబరిచాడు వెంకట్.

"ప్రతిది ప్రోబ్లమే రా దానితో. తన పని,  నా పని చేసేసరికి దూల తీరిపోతుంది" అంటూంటే సతీష్ ను మధ్యలోనే ఆపేసి

"ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటుంది కదరా!" అన్నాడు వెంకట్.

"ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుందిరా మేడం. పని గురించి వదిలేయ్ రా,  నిన్న ఇష్యూ లతో అంత బిజీ ఉన్ననా? వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తానని టచ్ కి పిలిచింది. కుదరదు అంటే వినదు, చచ్చినట్లు ఆఫీసు నుండే అటూ వెళ్ళాను. అక్కడ మళ్ళి సనగటం మొదలు పెట్టింది. ఏంటి ఈ బట్టలు? మా ఫ్రెండ్స్ ను చూడు ఎలా ట్రెండి గా ఉన్నారో అని కంపరిసాన్స్"  అక్కసు వెళ్ళ గక్కడు సతీష్.

"ఫ్రెండ్స్ అమ్మాయిల!  అబ్బాయిల?" కుతూహల పడ్డాడు వెంకట్.

"అమ్మాయిలయితే నన్ను ఎందుకు కంపేర్ చేస్తుందిరా లాపుట్ గా. ఒక్కడు కూడా పద్దతిగా జాబ్ చేసే బాపతి లేడు. బేవార్స్ గా పబ్ లు తిరుగుతూ, ఇదిగో మా సోది మొఖం దాని లాంటి వాళ్ళకి ఆ పని ఈ పని చెయ్యటమే వాళ్ళ పని లా ఉంది"

"మైథిలి లాంటి కత్తి లాంటి ఫిగర్ కు సేవలు చెయ్యటానికి కుర్రాళ్ళకు కరువెంట్రా" అన్నాడు వెంకట్  ఉడికిస్తూ.

కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళి పోయాడు  సతీష్.

***********************************************************************************************************

 సతీష్ అమెరికా వెళ్ళె బోయే రెండు రోజుల  ముందు తన రూం లో వెంకట్ తో పార్టి చేసుకుంటున్నాడు........

"మామ అమెరికా చెక్కేస్తున్నావ్, మైథిలిని పెళ్ళి చేసుకొని వెళ్తావ్ అనుకున్నా" అన్నాడు వెంకట్.

"అది పెళ్ళికి పనికి రాదు మామ.  అందులోకి మన లాంటి వాళ్ళకు అస్సలు పనికి రాదు" అన్నాడు సతీష్.

"ఏంట్రా నువ్వు మాట్లాడేది. అంత అందమయిన పెళ్ళాం వస్తుందంటే ఎవరయినా వద్దంటారా" ఆశ్చర్య పోయాడు వెంకట్.

"అందం.... మహా అయితే  వన్ ఇయర్,  తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కావాల్సింది అందం కాదురా" దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు సతీష్.

"అబ్బో జీవిత సత్యం బాగానే చెప్పావ్ గాని, ఇంతకూ తనలో ఉన్నా లోపం ఏంట్రా?"

"నేను ఆఫీసు లో అంత పని చేసి, తాను ఎక్కడికి పిలిస్తే అక్కడి కి వెళ్తే, హ్యాపీ గా ఉండటం మానేసి, ఆ డ్రెస్ ఏంటి? ఆ జుట్టు ఏంటి?   అసలు గ్లామర్ మైటైన్ చెయ్యటం తెలుసుకో అని, క్లాస్ పికుతుందా?"

"ఒరేయ్ తానూ అంత అందంగా ఉన్నప్పుడు నువ్వు కూడా తనకు దీటుగా ఉండాలని అనుకుంది,  తప్పా?"

"నేను చేసేది సాఫ్ట్వేర్ జాబు రా,  మోడలింగ్ కాదు. గొడ్డు చాకిరీ చేస్తేనే ఆన్ సైట్ ఇచ్చారు. నైట్ షిఫ్ట్ లు చేస్తు, అంత ప్రేజర్ లో హీరో గా ఉండు అంటే ఎలా కుదురుతుంది?"

"ఇది చాల చిన్న ప్రాబ్లెమ్ మామ. తర్వాత నువ్వే సెట్ అవుతావ్"

"అసలు దాని ఖర్చులు చూశావ? జీతం వచ్చింది వచ్చినట్లు ఉదేస్తుంది. వేసినా డ్రెస్ వెయ్యటం నేను ఇంతవరకు చూడలేదు"

"ఈ మధ్య అమ్మాయిలందరూ అలాగే ఉన్నారు లే మామ"

"లేదురా తన తో లైఫ్ చాల కష్టం. నా బ్యాక్ గ్రౌండ్ కు తన బ్యాక్ గ్రౌండ్ కు అస్సలు సెట్ కాదు"

"ఆ విషయం ఆమెను లవ్ చేసేటప్పుడు తెలియలేదా?"

"ఎవరయినా అందమయిన గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను, లవ్ చేసాను. కాని తానూ గర్ల్ ఫ్రెండ్ మెటీరియలే కాని వైఫ్ మెటీరియల్ కాదని తెలిసి పోయింది"

"అమ్మాయిలందరూ ఎప్పుడో ఒక్కసారి భార్యలు గా మారాల్సిందే రా. తను అంతే"

"అందుకే రా పెద్ద వాళ్ళు కయ్యనికయినా వియ్యాని కయినా సమవుజ్జీ ఉండాలన్నారు. తనకు నాకు దేనిలోనూ సమవుజ్జీ లేదు"

"అరిగిపోయిన డైలాగులు అపు మామ. ఎంతమంది చేసుకోవటం లేదు సిటీ అమ్మాయిల్ని విలేజ్ అబ్బాయిలు? సాఫ్ట్వేర్ పుణ్యమాని మనమే టాప్ రా ఇప్పుడు"

"మా నాన్న 7 వ తరగతి వరకు చదువుకున్నాడు, మా అమ్మ అక్షర జ్యోతి లో  ఏదో బస్సు బోర్డు లు చదవటం నేర్చుకుంది. వాళ్ళ ఫ్యామిలీ !  వాళ్ళా నాన్న లాయర్, వాళ్ళ అమ్మ డాక్టర్, వాళ్ళ అన్న అమెరికా సెటిల్. ఎక్కడన్న మ్యాచ్ అయ్యిందా?"

"అయినా నిన్ను ఇష్టపడింది కదరా? ఇంకా ఏంటి ప్రాబ్లెమ్?"

"నాకు ఆన్ సైట్ వస్తుందని తెలిసి నాతొ మాట్లాడటం మొదలు పెట్టింది. అసలు తన ముందు మనం ఎందుకు పనికోస్తం రా? ఏదో వయసులో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం ఉన్నాం"

"ప్రేమలో ఉన్నారు కాబట్టి అందం ఇంధనం అవుతుంది, కాని పెళ్ళికి ! భాద్యత స్టిరింగ్ అవుతుంది. ప్రాబ్లం కాదు రా"

"మా  అమ్మ నాన్నను  అసలు గౌరవిస్తుందంటావా? దాని మైటేనేన్స్ కు ఇంకా పది హేను సంవత్సరాలు ఇలాగె ఉంటుంది. నేను ఎలా ఉంటానో తెలుసా? పెద్ద పోట్టేసుకుని, జుట్టు ఉడిపోయి, అంకుల్ గాడిలా"

"నువ్వు కూడా మైటైన్ చెయ్"

"కష్టం రా.  కెరీర్ కోసం పరుగేట్టాల, లేక దానితో పోటి కోసం పరుగు పెట్టాలా? ఎంత మైటైన్ చేసిన జుట్టు ఆగదు, మన జాబు లో ప్రెజర్ లకు తొందరగానే ముసలితనం వచ్చేస్తుంది. చమన చాయ రంగులో గవర్నమెంటు గుమాస్తాలగా మారిపోతాను.  ఇంత అందమయిన అమ్మాయికి వీడ్ని ఇచ్చి చేశారేంటి అని నలుగురు నన్ను చూసి నవ్వుకుంటే తట్టుకోలేను మామ"

"నువ్వు చెప్పేది సిల్లీగా ఉంది రా. మీ ఇద్దరు ప్రేమగా ఉండాలి కాని ఇవ్వన్ని చిన్న విషయాలు మామ"

"ఏంట్రా సిల్లీగా ఉండేది. ఎంత మంది భార్య భర్తలను చూసి మనం నవ్వుకోవటం లేదు. అది వాళ్ళకు అర్థం అయ్యి ఎలా సిగ్గుపడి తల దించుకుంటున్నారు. వాళ్ళ మధ్య ప్రేమ లేదని కాదు. కాని ఒక రకమయిన ఇన్ సెక్యూరిటీ తో బయటకు వస్తున్నారు"

"అయితే ఇప్పుడు ఏమంటావ్? మైథిలి పెళ్ళికి పనికి రాదు అంటావా?"

"నాకు పనికి రాదు అన్నాను. మైథిలి కోహినోర్ లాంటిది, దాన్ని కాపాడటానికి, కోట ఉండాలి, రాజు ఉండాలి. అంతే  కాని గుడిసె, నాలాంటి గుమస్తా  కాదు. నాకు తగ్గటు గా ఒక మట్టి బొమ్మను చేసుకుంటాను, జీవితాంతం గొప్పగా బతికేస్తాను"

 "నువ్వు ఇంత పిరికోడివా మామ? స్వర్గనికి ఆహ్వానం వస్తే నేను ఎక్కలేను అని రానన్నాడట నీలాంటి వాడు"

"ఓడిపోతామని తెలిసి చేసే యుద్ధం, చేరలేమని తెలిసి మొదలు పెట్టె ప్రయాణం మూర్ఖత్వం అవుతుంది కాని ధైర్యం అవ్వదు. నేను చేసేది తెలివయిన పనే గాని పిరికితనం కాదు రా"

"నీ లవ్ లో ఈ యాంగిల్ ఏంటో గాని, నువ్వు అమెరికా వెళ్ళి పోయాక నేను ట్రై చేసుకోనా మరి! మైథిలిని" ఆశగా అడిగాడు వెంకట్.

"తెలిసి తెలిసి నిప్పును హత్తుకుంటనంటే నేను మాత్రం ఎం చేస్తాను"  నిర్లిప్తంగా పలికాడు సతీష్.

(అయిపొయింది)