21, మార్చి 2014, శుక్రవారం

లెజెండ్ ఆడియో (హాస్యం)

(కొద్ది రోజుల క్రితం జరిగిన లెజెండ్ ఆడియో ఫంక్షన్ ఈ మధ్యే యుట్యూబ్ లో నేను చూడటం జరిగింది. అది చూసినప్పుడు చాల సందర్బాలలో నాకు నవ్వు వచ్చింది. దాన్ని మీతో పంచుకోవాలని సరదాగా ఇది రాసాను.)

ఇద్ద్దరు మిత్రులు యాదగిరి, రాజు ఒక సాయంత్రం మందు కొడుతూ టీవీ   చూస్తు చానెల్స్ తిరగేస్తుండగా ఏదో చానెల్ లో  లెజెండ్ ఆడియో ఫంక్షన్ ప్రసారం అవుతూ కనిపించింది. అసలే బాలయ్య డైలాగులు అంటే ఇష్టపడే ఇద్దరు ఆ ఫంక్షన్ ను  పూర్తిగా చూడాలని నిర్ణయించు కున్నారు. 

యాదగిరి: ఈ సినిమా పేరు ఎందిరా? లెజెండ్ అని ఉంది. నాకు తెలిసి ఇది మోహన్ బాబు సినిమా అనుకుంటా !

రాజు: మోహన్ బాబు సినిమా ను బాల కృష్ణ ఎందుకు తీస్తాడు రా? నువ్వు ఏమన్నా ఆ సినిమా చూసినవ ఏందీ?

యాదగిరి: కాదురా ! అప్పుడెప్పుడో మోహన్ బాబు నేను లెజెండ్ నేను లెజెండ్ అని టీవీ ల చెప్పినట్లు గుర్తు. 

రాజు: అరె ఆ విషయమా? అది సినిమా గురించి కాదురా బై. సినిమా ఉత్సవాలు అయినాయి కదా ! దాంట్ల చిరంజీవికి లెజెండ్ ఇస్తే నాకు బి లెజెండ్ అవార్డు కావాలని లొల్లి పెట్టిండు. 

యాదగిరి: అంటే ! అవార్డు ఏది ఇస్తే అది తీసుకుంటారు గాని ! నాకు అది కావలె ఇది కావలె అని జబర్దస్త్ చేస్తార?

రాజు: చిరంజీవి, ఆయన ఎప్పుడో కలిసి పోయిండ్రు. నేను పాము ఈన జెర్రి అని చెప్పుకున్నారు (టామ్ అండ్ జెర్రీ). ఒకళ్ళ మనసు ఒకళ్ళం  దోచుకున్న దొంగలం  అని కూడా చెప్పిండ్రు,  టీవీల మంచిగా అలుముకున్నారు. 

యాదగిరి: అబ్బా ఎంత మంది అచ్చిండ్రు చూసినవ? బాలయ్య క్రేజే వేరు రా బై. 

రాజు: చాలు తియ్యు రా బై. సినిమా హీరో కనిపిస్తే ఎడికయినా అస్తారు జనం. 

యాదగిరి: అరె ఈ యాంకరు పేరు అనసూయ కద? జబర్దస్త్ ల వస్తుండె. అబ్బా ! మస్త్ ఉంటది రా బై. 

రాజు: ఆమెకు పెండ్లి అయ్యింది. ఒక పిలగడు కూడా పుట్టిండు. నువ్వు ఎక్కువ ఆశపడకు బిడ్డ. 

యాదగిరి: అయితే మనకేంది  కాక పొతే మనకేంది. సూడదలికి మంచిగుంటది అన్న. అలీ కూడా చేస్తుండు కదా యాంకరింగ్. 

రాజు: ఎ ఫంక్షన్ కు వచ్చిన డబ్బా కొట్టి కొట్టి చంపుతడు రా నాయన. 

యాదగిరి: అరె ! ఆలను పిలిచేడిదే అందుకు. తారిప్ చేసి తారిప్  చేసి ఫాన్స్ ను అరిపించి అరిపించి ఒక్కొక్కోడి నోరు పడిపోయే టట్లు చేసి ఇంటికి పంపాల. 

రాజు: వాళకేం వస్తాది  రా?

యాదగిరి:  జనం ఎంత అరిస్తే సినిమా అంత హిట్ అవుతది అని అందరు అనుకుంటారు. గట్లనే హీరో క్రేజ్ మస్త్ ఉంది అని సినిమా ఎట్లా ఉన్నా మొదటి రోజే అందరు చూస్తరు. కతం,  వారం రోజులల్ల డబ్బులు వచ్చేసే. అరేయ్ !  స్క్రీన్ మీద దూకుడు ఇంకా ఈగ అని పడుతుంది ఎందుకు రా?

రాజు: ఈ సినిమా దూకుడు నిర్మాతలు ఇంకా ఈగ నిర్మాతలు కలిసి తీసిండ్రు. అందుకోసం అనుకుంటా. 

యాదగిరి: అంటే ఫుల్ బారి బడ్జెట్ సిన్మాన ఏందీ? ఇంతమంది నిర్మాతలు కలిసిండ్రు !

రాజు: ఒక్కవేళ ఫ్లాప్ అయితే ఎక్కువ నష్టం రావద్దని కావచ్చు. 

యాదగిరి: అరె లోకేష్ బాబు కూడ వచ్చిండు కదా ! 

రాజు: మామ సినిమా ఫంక్షన్ కు అల్లుడు రాడ ఏందీ ! 

యాదగిరి: అరేయ్ ఇల్ల  ఇంట్ల మామ అలుల్ల లొల్లి భలే ఉంటాది రా బై. అప్పట్లో ఎన్టీఆర్,  చంద్రబాబు. ఇప్పుడు బాలయ్య, లోకేష్. ఎవరిని ఎవరు ఎం చేస్తారో ఇప్పుడు. 

రాజు: బాలయ్య ఎన్టీఆర్ లాంటొడు  కాదురో. కాల్చి పారేస్తాడు. 

యాదగిరి: అరె అటు చూడురా !  వాళ్ళు డాన్సు చేస్తుంటే ఎంత చక్కగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. బాలయ్య పాపం అమాయకుడురా. 

రాజు: అదేరా నేను చెప్పేది. తెలివయినోడిని గెలికితే వాడు అలోచించి కుట్ర చేసి ఏదయినా చెయ్యాలని చూస్తాడు. అదే బాలయ్యను గెలికితే అక్కడిక్కడే సపా చేస్తాడు. అందుకే బాలయ్య బహు డేంజర్. 

యాదగిరి: జగపతి బాబు కూడ ఉన్నాడట కదా ఇండ్ల ?

రాజు: విలన్ గా చేసిండట. ఫుల్ స్టైల్ గా ఉంటాది నా పాత్ర  అని చెప్పిండు. నా ఫాన్స్ బాధ పడద్దు, నేను మళ్ళ హీరో గా కూడా చేస్తా అన్నాడు. 

యాదగిరి: ఈయన ఫాన్స్ భాధపడ్డ రా? అసలు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? డబ్బులెందుకు పోగొట్టు కోవాలె పూలు అమ్మిన దగ్గర కట్టెలు ఎందుకు అమ్మాలె. 

రాజు: కాని మనోళ్ళు అన్ని రకాలు చేసుడు నేర్చుకోవల్ర భై. ఎప్పుడు చూడు హీరో అంటారు తొడలు కొడుతారు. యాభై దాటినా యంగ్ హీరో అంటారు ! ఈయన మంచి పని చేసిండు. 

యాదగిరి: అరె జగపతి బాబు అస్తుండు మాట్లాడానికి. అరేయ్ ఎం చెప్పిండు బాలయ్య గురించి. అదే వాక్ మాన్, కేసెట్ , పెన్సిల్ తోని  కేసెట్ తిప్పుకుంటా సింపుల్ గా ఉన్నడు అంట. 

రాజు: అదే వాక్ మాన్, అదే కేసెట్, అదే పెన్సిల్ తో దాన్ని తిప్పు కోవటం. సింపుల్ గా ఉండుడ  ! లేక అక్కడే ఆగిపోవుడా ? 

యాదగిరి: అంటే ఏందిరా ? బాలయ్యకు డబ్బులు లేవా ఐపాడ్ లు,  ఐఫోన్ లు కొనుక్కోవటానికి. 

రాజు: డబ్బులు లేక కాదుర. వాటి వాడకం  తెలియక ! ఆయన ఇంకా వాక్ మాన్ ల  కేసెట్  పెట్టుకుంటూ,  పెన్సిల్ తోని  తిప్పుకుంటూ ఉన్నాడని అర్ధం అస్తుంది అంటున్నా. 

యాదగిరి: బాలయ్య బాబు వాడటం మొదలు పెడితే అయన కన్నా బాగా ఎవడు వాడలేడు. 

రాజు: అయన వాడుకో బడ్డ కూడ, ఆయనంత బాగ ఎవరు వాడ బడరేమో. 

యాదగిరి: బాలయ్య ఫాన్స్ ఇక్కడ. హర్ట్ చేసావంటే అసలే మందు యేసి ఉన్నా. కొడుకా నరుకుతా. 

రాజు: ఆవేశ పడకురా. నేను చెప్పింది చంద్ర బాబు  వాడుకోవటం గురించి కాదు. డైరెక్టర్ బోయపాటి వాడకం గురించి. ఆక్టింగ్ బాగా చేయించాల కదా. 

యాదగిరి: ఓరి ఓరి ఓరి చెప్పవెంది రా. నేనింక గమనిస్తాలె,  డైరెక్టర్ బోయపాటి సినా? ఇంకేంది ! ఇది గూడ హిట్టే. ట్రైలర్ ఎసిండ్రు చూడు. 

రాజు: వారెవ్వా ట్రైలర్ ఏముంది రా బై. అచ్చం సింహ లెక్కనె పవర్ ఫుల్ గా ఉన్నది. 

యాదగిరి: ఏందీ రా ఎక్కిరిస్తున్నవా ? ట్రైలర్ సింహ లెక్క ఉన్నదా? కండ్లు పెట్టి చూడు. దాంట్ల మీసాలు ఎట్లా ఉన్నాయి, దింట్ల ఎట్లున్నాయి. అండ్ల మెడ మీద టాటూ లేదు ఇండ్ల టాటూ ఉన్నది. డైలాగులన్ని డిఫరెంట్. 

రాజు: నిజమే రా డైలాగులు అన్ని డిఫరెంట్ ఉన్నాయి. "సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాక నివ్వను" ఈ డైలాగు వాళ్ళ బావ బాలయ్య తో అన్నట్లు ఉంది రియల్ లైఫ్ ల. 

యాదగిరి: ఛల్ ! వేస్ట్ ఫెల్లో. తెలుగు దేశం పార్టి ఎన్టీఆర్ పెట్టింది. అయన కొడుకులకు కాకపోతే ఇంకా ఎవరికీ ఇస్తారు.

రాజు: ఎన్టీఆర్ కొడుకులు నలుగురి పేరు చెప్పురా. 

యాదగిరి: బాల కృష్ణ, హరి కృష్ణ, రామ కృష్ణ ఇంకా ఇంకా.....గవ్వన్ని ఇప్పుడెందుకు రా బై. రాజ మౌళి గూడ అచ్చిండు ! ఏందీ మొత్తం గడ్డం పెంచిండు?

రాజు: ఇప్పుడు బాహుబలి తిస్తుండు కదా. అండ్ల హీరోలు గడ్డం పెంచిండ్రు ఈయన బి పెంచిండు. 

యాదగిరి: అంటే అయన సినిమాల్ల హీరోలు ఎట్లా గెటప్ ఎస్తె అట్లా తయారవుతాడ? 

రాజు: చుడలె ! ఛత్రపతి టైం లా ప్రభాస్ లాగా మీసాలు పెంచిండు. యమ దొంగ టైం ల జూనియర్ లెక్క పెద్ద జుట్టు పెంచిండు. మగధీర టైం ల రామ్ చరణ్ తోని పోటి పడి గుర్రం స్వారి చేసిండు. 

యాదగిరి: మరి ఈగ టైం ల ఈగ లాగ రెక్కలు పెట్టుకున్నాడ? 

రాజు: కాదుర బాబు. నాని లెక్కనె మీసాలు తీసేసి అయిన కంటే యంగ్ తయారయిండు. 

యాదగిరి: ఇంకా నయం హీరో క్యారెక్టర్ పిచ్చోడు ఐతే ఎట్లా చేస్తాడో. 

రాజు: దేవి శ్రీ వచ్చిండు చూడు. కతర్నాక్ మ్యూజిక్ ఇస్తాడు బై. 

యాదగిరి: కాని ఎప్పుడో ఒక్కసారి విన్నట్లు ఉంటాయి రా బై ఈయన పాటలు.  థమన్ అయితే వెరైటి గా ఉంటాయి పాటలు. 

రాజు: అంత డైరెక్టర్ మీద ఉంటది  రా బై. బోయపాటి మాట్లాడుతుండు వినురా. చూడు అభిమానుల రక్తం కుత కుత లాడుతదట. వాళ్ళ కోసమే సినిమా తీస్తాడట. 

యాదగిరి: అంతే కదరా. ఫాన్స్ లేక పొతే హీరోలు లేరు గదా. 

రాజు: ఫాన్స్ కోసమే సినిమాలు దిస్తే తర్వాత నిర్మాతలు ఉండరని ఎప్పుడు తెలుసు కుంటారో ఇళ్ళు. 

యాదగిరి: అన్నింట్లా ఏదో పుల్ల పెట్టక పొతే నీకు మనసుల పట్టద? అయన చెప్పింది ఫాన్స్ కొరుకొనెటియి ఉండి అందరికి నచ్చేటట్లు తిసిన అని. 

రాజు: అచ్చా !  అన్ని కలిపి కిచిడి చేసిండు మన ప్లేట్ల పెట్టిండు  అన్నట్లు. 

యాదగిరి: చుడురా ఎంత కరేజ్ తో చెప్పుతున్నాడు. సినిమా గుండె మిద చెయ్యి యెసుకొని చూస్తారని. పగిలి పోతుందట. 

రాజు: ఏందీ పగిలేది  !  గుండెనా ! నిర్మతలద?  లేక చూసె  టొల్లద? 

యాదగిరి: సినిమా రా బై. టోటల్ ఫ్యామిలీ తోని చూడచ్చంట. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటరంట ! చూడు.  ముందు అయన చెప్పేది విని మాట్లాడు. 

రాజు: సినిమా నచ్చిపెట్టుకుంటారో లేక ఎందుకు వచ్చాము రా బాబు అని పెట్టుకుంటారో. 

యాదగిరి: ఇంకా నువ్వు అపు. బాలయ్య బాబు స్పీచ్ మొదలయింది విను. 

రాజు: శుక్లం బరధరం విష్ణు చతుర్ భుజం ప్రసన్న వదనం జ్యాయే. సర్వ విజ్ఞోప శాంతయే కృష్ణం వందే జగత్ గురు. సరస్వతి నామస్తుబ్యం వరదే కామా రూపిణి విద్య రంభం కరిష్యామి. 

యాదగిరి: ఏందిరా !  ఇష్టం వచ్చినట్లు చదువుతున్నావ్ శ్లోకలు. 

రాజు: అంటే బాలయ్య బాబు చదివితే మూసుకొని చూస్తావ్. నేను చదివితే లొల్లి చేస్తావ్. 

యాదగిరి: అరె !  ఆయనంటే తెలుగు బాగ మాట్లాడుతడు,  రోజు పూజలు చేస్తాడు,  అందుకే చదువుతుండు. 

రాజు: అంటే ! రోజు పూజారి గుడిలో మంత్రాలూ చదువుతడు అని,  పలకరించే ప్రతిసారి ఒక మంత్రం చదవాల్న? పోనీ దాని అర్ధం చెపితే అయినా బాగుండేది గద. అంత తత్తర పడుతూ చదవటం దేనికి,  అందరిని చంపటం దేనికి ? బిత్తిరి తనం గాకపోతే. 

యాదగిరి: అబ్బా వినురా. 

రాజు: నలు దిక్కులా నుంచి, నలు చెరగాల నుంచి, నలు మూలల నుంచి తరలి వచ్చిన అభిమానులకు అంట. ఆ మూడు మాటలకు తేడా ఏందో  కొంచెం చెప్పురా. 

యాదగిరి: నువ్వు అన్నింట్లో విమర్శలు చెయ్యటం ఆపెయ్. అంత మంది ముందు అప్పటికప్పుడు మాట్లాడితే తెలుస్తది. 

రాజు: ఏందీ బాలయ్య దేవిని భయపడ్డావ?  అని అడుగుతున్నాడు. 

యాదగిరి: అంటే అయన పవర్ ఫుల్ క్యారెక్టర్ చూసి భయపడ్డావ అని అడుగుతుండు రా మజాక్ లా. 

రాజు: ఎంత పవర్ ఫుల్ అయితే మాత్రం దెయ్యం ను చూసినట్లు భయపడుతర్రా బై. పిచ్చి వాగుడు కాక పొతే. 

యాదగిరి: బాలయ్యను చూసి భయపడనోడు లేడు ఇండస్ట్రీ లా. అది తెలుసుకుంటే మంచిది. 

రాజు: ఎందుకంటే, ఒకడు ఆయనకు ఎదురు ఎల్లిన,  అయన వాడికి ఎదురు ఎల్లిన వాడికే రిస్క్,  ట్రైలర్ లా చెప్పిండు కద. 

యాదగిరి: జగపతి బాబును ఎంత బాగ పోగుడుతున్నాడు చూడు. 

రాజు: అయన విలన్ కాదు, కతర్నాక్ పాత్ర అని చెప్పదలిగి వాళ్ళ నాయన గురించి ఇంకా సమర సింహ రెడ్డి గురించి ఇన్ని చెప్పల్లా రా బై? 

యాదగిరి: అరె ! ఏందిరా బై. సినిమా గురించి చెప్పి ఎవరు ఎట్లా చేసిండ్రు అని చెప్పడానికి  ఏందో ఏందో చెపుతడు. నిద్ర పట్టదు, పరకాయ ప్రవేశం అని. 

రాజు: గిల్లు కుంటడట ! పాత్ర లోంచి భయటకు రాదలిగి. డైరెక్టర్ కట్ చెపుతడు కదరా. డైలాగులు చెప్తుండు  చూడు. 

యాదగిరి: డైలాగులు చెప్పుడు అపు బాలయ్య. ఏదో సినిమాల్లా ,  చూసుకొని చెపుతావ్ అని మాకు దెల్సు. 

రాజు: అయ్యో దేవుడా. ఏందిరా మీ హీరో గిట్లా చేస్తుండు. 

యాదగిరి: ఏందీ ! మా హీరోనా? అంటే మా ఇంట్ల పుట్టిండా? ఏందీ. 

రాజు: అగొ అందరు లేచి పోతుండ్రు గదురా ! 

యాదగిరి: మరి ! ఒళ్ళు ఉంటారు బె గిట్ల మెదడు తింటే. ఛల్ !  చానెల్ మార్చు. 

బాలయ్య స్పీచ్ పూర్తికాకుండానే చానెల్ మార్చిన వారికి,   పవర్ స్టార్ పార్టి పెడుతున్నాడని న్యూస్ తెలిసి,  ఎలాగయినా దాన్ని లైవ్ చుడాలనుకున్నారు యాదగిరి, రాజు. 


3 వ్యాఖ్యలు: