31, మార్చి 2014, సోమవారం

చేతిలో భూతం !!! -3

(రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.)

తనలో ఆ మార్పుకు కారణం తెలియక సతమతం అవుతున్న విక్టర్ కు, కళ్ళ ముందు ప్రియమణి విల విల లాడుతున్న దృశ్యం కనపడి వణికి పోయాడు.

"తనకు జరుతున్నా విషయాలకు దానికి ఏదయినా  సంబంధం ఉందా? అసలు ఆ హత్య గురించి భయట ఎం అనుకుంటున్నరో ?  సైదులు గాడు తనను అనవసరంగా చంపేసాడు. ఒక వెళ చంపక పొతే ఈపాటికి తమ గురించి నిజం తెలిసి పోయేది. పాపం చాల మంచి అమ్మాయి ! చాల అందంగా ఉండేది" యిలా సాగుతున్నాయి తన ఆలోచనలు. 

అక్కడ ఉండి బుద్ది కాక బార్ కు వెళ్దామని లేస్తుండగా ఫోన్ మోగింది. చుస్తే చర్చ్ అయిపోయింది, డాడీ చేస్తున్నాడు. "ఎక్కడ ఉన్నావ్ రా ! ఇంటికి వచ్చి అన్నం తిని రెస్ట్ తీసుకో" అన్నాడు హుకుం వేస్తూ. 

ఇంటికి వెళ్ళి భోజనం చేసి తన రూం లోకి వచ్చి పడుకున్నాడు విక్టర్. అటు ఇటు దోర్లు తున్నాడు కాని  నిద్ర పట్టడం లేదు. కళ్ళ ముందు ప్రియమణి దృశ్యమే కనిపించ సాగింది. హల్లో అక్కయ్యలు ఇద్దరు టీవీ చూస్తున్నారు, దాని శబ్దం అక్కడి దాక  వినిపిస్తోంది.  మధ్యలో ఏదో న్యూస్ చానెల్ పెట్టినట్లు ఉన్నారు, టీవీ లో యాంకర్ చదువుతోంది "కాల్ సెంటర్ ఉద్యోగిణి  దారుణ హత్య ! మల్టీ నేషనల్ కంపెనీ కాల్ సెంటర్ లో పని చేసే ప్రియమణి అనే అమ్మాయిని ఎవరో రేప్ చేసి,  పీక కోసి చంపేశారు". 

అది వినగానే ఒళ్ళంతా వణికి పోయింది విక్టర్ కు. రక్తం జివ్వుమని పరుగులు తీసి తలలోకి ఎగబాకిన అనుభూతికి లోనయ్యాడు. తలకు చేతులు పెట్టుకుని దిగులుగా కూలబడి పోయాడు. కొద్ది సేపటికి అప్రయత్నంగా అతని ఎడమ చెయ్యి అతని పీకకు బిగుసుకుంది.  ఒక్కసారిగా అదిరి పోయాడు.  తన కుడి చేతితో  విడిపించుకోవాలని ప్రయత్నించాడు. కాని చాల బలంగా బిగుకుసు కుంటోంది అతని ఎడమ చెయ్యి ! ఎంత లాగినా మెడను వదిలి రావటం లేదు. ఉపిరి తీసుకోవటం కష్టం అయ్యేలా ఉంది ఆ పట్టుకు.

అతనికి చాల కంగారుగా ఉంది ! ఎం చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. కుడి చేతితో ఒక్కొ వెళిని తీసెయ్యాలని ప్రయత్నిసున్నాడు. కాని అతని ప్రయత్నం వృధా అవుతోంది ! తీసేసిన వెళ్ళు తిరిగి చుట్టుకుంటున్నాయి. అలా  ఇబ్బంది పడుతుండగా,  చచ్చి పోతానెమో అని భయం వేసింది  అతనికి.

"అసలు తన చెయ్యి తన ప్రమేయం లేకుండా తనను చంపెయ్యటానికి చూడటం ఏంటి? ఇదేదో దెయ్యం పనిలగా ఉంది. దేవుడా ! నన్ను కాపాడు, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు" అంటూ మనసులోనే వేడుకుంటూ చేతిని తీసే ప్రయత్నంలో ఉన్నాడు.  కొద్దిసేపటికి ఎం జరిగిందో తెలియదు కాని అతని చెయ్యి మెడ నుండి విడి పోయింది.

గట్టిగా ఉపిరి పీల్చుకుని "బతికి పోయాను రా దేవుడా" అనుకుని  అక్కడ నుండి భయటకు  పరుగు పెట్టాడు. టీవీ లో లీనం అయిన అతని అక్కలు అది గమనించు కోలేదు. అతను అల వెళ్తున్నప్పుడు అతని ఎడమ చెయ్యి మాములుగానే ఉంది. అతను ఎటు తిప్పితే అటు తిరుగు తోంది.  కొద్ది దూరం పరుగు పెట్టి,  ఆగి తన ఎడమ చేతిని పరీక్షగా చూసుకున్నాడు.  కుడి చేతికి దానికి ఏమి తేడా లేదు. నోట్లో ఒక వెళు  పెట్టుకుని గట్టిగా కొరికాడు. నొప్పితో "అబ్బా !" అని చెయ్యి పట్టుకుని గంతులు వేసాడు.

అంత గట్టిగా కోరుకుకున్నందుకు తన మిద తనకు కోపం వేసింది,  నొప్పి ఉంది అంటే తన చెయ్యి మాములుగానే ఉంది. కాని ఎందుకిలా తన గొంతుకు చుట్టుకుని చంపాలని చూస్తుంది. ఇలా ఆలోచిస్తుంటే తనకు పిచ్చెక్కి పోతోంది. నిజంగానే తనకు ఏదో దెయ్యం పట్టింది. ప్రియమణి ఆత్మ తన చెయ్యిలో దూరి అప్పుడప్పుడు తనను చంపాలని చూస్తోంది.

అలా అనుకోగానే తన చెయ్యి చూస్తే తనకే భయం వేసింది. ఇంకా ఎన్ని అనర్దాలు జరుగుతాయో ! ఎప్పుడు ఈ చెయ్యి తన మిద దాడి చేస్తుందో ! ఆలోచించుకుని వణికి పోయాడు. "అర్జెంటు గా ఈ విషయం సైదులు గాడికి చెప్పి ఏదో ఒక మార్గం చూడాలి  ఈ దెయ్యం పీడ వదిలించు కోవటానికి" అనుకున్నాడు విక్టర్.

వెంటనే సైదులు నెంబర్ కి ఫోన్ చేశాడు. "డార్లింగ్ ! ఎలా ఉన్నావ్ ? నేను రేపు వచ్చేస్తాను కదా. అప్పుడే నన్ను మిస్ అవుతున్నవా" అన్నాడు సైదులు ఉషారుగా.

"అరేయ్ మామ ! నాకు దెయ్యం పట్టిందిరా. నా ఎడమ చెయ్యి నన్ను చంపాలని చూస్తోంది రా" అన్నాడు భయం ఉట్టిపడేలా.

"ఎయ్ అపు. పిరికి నాయాల, పోలీస్ వ్యాన్ సౌండ్ వినగానే ఎటు చూడకుండా నా కన్న ముందే పరుగు పెట్టావ్. బొక్క బోర్ల పడి  నానా రచ్చ చేశావ్. ఇప్పుడు మళ్ళి దెయ్యం, భూతం అని కథలు చెపుతున్నావ్. నేను వచ్చే వరకు పిచ్చి పిచ్చి పనులు చేసి నీతో పాటు నన్ను ఇరికించకు" అన్నాడు మాటల్లో  కోపం ప్రదర్శిస్తూ.

"నన్ను చూస్తే తెలుస్తుంది మామ ! ఉండి ఉండి నా చెయ్యి నన్నుచంపాలని చూస్తుంది. నువ్వు వచ్చాక నీ ముందే జరిగితే అప్పుడు తెలుస్తుంది" అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసాడు.


**********************************************

సైబరాబాద్ పోలీస్ స్టేషన్. యస్ ఐ చాల అసహనంగా చిందులు వేస్తున్నాడు సిబ్బంది మిద "ఎం చేస్తున్నారయ్య మిరు !  ఎవరో అమ్మాయిని సిటి లో రేప్ చేసి చంపినా కూడా మనకు ఏ ఎవిడెన్స్ లేదు"

"కాల్ సెంటర్ వాళ్ళు ఆమె మేం పంపిన క్యాబే ఎక్కలేదు అంటున్నారు సార్" హెడ్ కానిస్టేబుల్ సమాధానం.

"మరి ఆ అమ్మాయిని ఎవరు ! ఎలా తిసుకెళ్ళారు" అడిగాడు ఆలోచిస్తూ.

"కొలీగ్స్ ను అడిగితె ! డ్యూటీ కన్నా 15 నిముషాలు ముందే తనకు క్యాబ్ వచ్చిందంటూ వెళ్లి పోయింది అంటున్నారు" మరో కానిస్టేబుల్  హింట్ ఇచ్చాడు.

"అంటే కంపెనీ క్యాబ్  కాకుండా ఏదయినా ప్రైవేట్ క్యాబ్ వాడి ఉంటుందా?" పైకే  గొణుకున్నడు యస్ ఐ.

 కొద్ది సేపటికి మళ్ళి  "ఆ అమ్మాయి దగ్గర వస్తువులు ఏమయినా దొరికాయా ?" అడిగాడు ఆశగా.

"ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది ! కాని అందులో పనికి వచ్చేది ఏది దొరకలేదు సార్" నిరాశగా చెప్పాడు కానిస్టేబుల్.

"సెల్ ఫోన్ లేదా ? చివరగా ఎవరితో మాట్లాడింది ? ఎప్పుడు మాట్లాడింది. ఇలాంటివి చాల ఇంపార్టెంట్"  అసహనం వ్యక్తం చేశాడు యస్ ఐ.

"సెల్ ఫోన్ లో లాస్ట్ కాల్ 11:00 కి వచ్చింది సార్. ఆ నెంబర్ కి చేస్తే ఏదో పబ్లిక్ బూత్ అంటున్నారు" హెడ్ కానిస్టేబుల్  చిన్నగా సణిగాడు.

"వారం క్రితం జరిగిన బాంబు బ్లాస్ట్ కేసు గురించే చస్తుంటే ! మళ్ళి ఇలాంటి చిల్లర కేసులు ఒకటి మన ప్రాణానికి" అని రుస రుస లాడాడు యస్ ఐ.

అందరు అంగికరిస్తున్నట్లుగా తలలూపి,  నిశ్శబ్దంగా చూస్తూ ఉండి  పోయారు యస్ ఐ వంక.

"ఒక పని చెయ్యండి ! ఈ కేసు కొద్ది రోజులు పక్కన పెట్టి ఆ బాంబు దాడుల కేసు మిద పని చెయ్యండి. అసలే బాంబు దాడులు ఇంకా జరుగ బోతున్నాయి అని వార్నింగ్ కూడా  వచ్చింది సెంట్రల్ నుండి" అన్నాడు అందరికి ఆర్డర్స్ జారి చేస్తూ.

******************************************************

"డార్లింగ్  నేను చెప్పేది నీకు అర్ధం కావటం లేదు.  నువ్విపుడిల దెయ్యం,  భూతం అని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే అనవసరంగా అందరి చూపు మన మీదికి వస్తుంది. అది చాల డేంజర్"  అన్నాడు  సైదులు చేతిలో పెగ్గు తాగుతూ.

"మామ నా భాధ నీకు తెలియటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో భయపడి చస్తున్నాను రా" అదిరి పోతున్నాడు విక్టర్.

"జరిగినప్పుడు చూద్దాం. నువ్వు కూడా నాతోనే రూం లో ఉండు"  అని బిల్లు కట్టేసి విక్టర్ ను తీసుకుని రూం కు వచ్చాడు సైదులు.

"మామ ఇంకా కొద్ది సేపట్లో డ్యూటీ టైం అవుతుంది. కొద్ది సేపు పడుకుంటే ఫ్రెష్ గా ఉంటది" అని పక్కలు సర్దాడు.

భయపడుతూనే పడుకున్నాడు విక్టర్. పెగ్గు వేసి ఉన్నా సైదులు ఆదమరచి గురక పెడుతూ పడుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత నిద్ర పోతున్న విక్టర్ ఎడమ చెయ్యి నెమ్మదిగా పక్కనే పడుకున్న సైదులు గొంతు మీదికి చేరింది. అదేమీ తెలియని విక్టర్ కూడ ఆదమరచి నిద్ర పోతున్నాడు.

గొంతుకు ఏదో బిగుసు కొవటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు సైదులు. విక్టర్ చేతితో తన గొంతు పిసకటం చూసి "ఒరేయ్ మామ ! ఉపిరి ఆడటం లేదు వదిలి పెట్టురా"  అరిచాడు వదిలించుకుంటూ.

అలసి పోయి పడుకున్న విక్టర్ మగతగా కళ్ళు తెరిచాడు. జరుగుతున్న విషయం చూసి "బాబోయ్" అని భయంతో అరిచాడు.  సైదులు  మాత్రం తన గొంతుకు బిగుసుకుంటున్న   చెయ్యి వదిలించుకొవాలని  రెండు చేతులతో ప్రయత్నిస్తున్నాడు. కాని తన బలం సరి పొవటం లేదు ! విక్టర్ కూడ తన వంతుగా అతని గొంతును వదలాలని చూస్తున్నాడు.

"మామ నా చెయ్యి నా కంట్రోల్ లో లేదురా ! నేను చెప్పాను కదరా" అరుస్తున్నాడు విక్టర్.

సైదులు కు ఉపిరి తీసుకోవటం కష్టం గా మారుతోంది. బ్రతకాలన్న నిశ్చయంతో రెండు చేతులతో విక్టర్ చెయ్యిని వదిలించు కొని నేలకు అదిమి పట్టి "నాటకాలు ఆడుతున్నావా"  అరిచాడు  కోపంగా.

"అయ్యో లేదురా. నిజంగానే నా చెయ్యికి ఏదో భూతం పట్టింది రా" అంటూ ఏడుపు మొదలు పెట్టాడు.

"నువ్వు చెప్పింది నిజం అయితే ! మా ఉరికి దగ్గర్లొ ఒక మాంత్రికుడు ఉన్నాడు. వాణ్ణి కలిసి ఆ భూతం నిజమే కాదో తేల్చుకుందాం" పలికాడు సైదులు ఇంకా అనుమానిస్తూనే.

తర్వాత మాంత్రికుడి నెంబర్ తెలుసుకొని,  ఫోన్ చేసి,  జరుగుతున్నా విషయాలు చెప్పాడు సైదులు. "రేపు రాత్రి నా స్థావరానికి రండి" అని ఫోన్ కట్ చేశాడు మాంత్రికుడు మైసమ్మ.

*****************************************************

మైసమ్మ ఒక్కపుడు వాళ్ళ ఉళ్ళొ  పని లేక తిరుగుతుండే వాడు. ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ, జాల్సగా గడిపే సోమరి వాడు. ఒక రోజు ఎవరో ఆడమనిషిని చెయ్యి లాగడాని ఉళ్ళొ వాళ్ళు తన్ని తరిమేశారు.అయిదేళ్ళ  తర్వాత ఏదో  విచిత్రంగా వేషం వేసుకొని ఉళ్ళొకి దిగాడు. 

ఉరికి దగ్గరలో తనకు ఉన్నా కొద్ది పాటి పొలంలో ఒక గుడిసె వేసుకొని, ఏవో పూజలు చేయ్యసాగాడు. అది చూసి ఊర్లో వాళ్ళు "వీడు ఏవో మంత్రలు నేర్చుకోచ్చాడు"  అని దూరంగా ఉండ సాగారు. ఒక రోజు ఎవరో  నలుగురు మనుష్యలు దెయ్యం పట్టిందని ఒక ఆడమనిషిని తెస్తే ! గంటలో ఆమెను మాములు మనిషిని చేసి పంపాడు.

 అప్పటి నుండి చుట్టు పక్కల ఉళ్ళలో జనం  గాలి సోకింది అని, దిష్టి తగిలింది అని, మంత్రం చేశారని,   రక రకాల కారణాలతో మైసమ్మ దగ్గరికి రాసాగారు. అతని దగ్గరికి రావటానికి ఒక్కటే నియమం ! సమస్య గురించి ముందే చెప్పి తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడే రావాలి. డబ్బులు కూడా దండిగానే ముట్ట చెప్పాలి.

సైదులు, విక్టర్ మైసమ్మ  చెప్పిన సమయానికి అతని స్థావరం చేరుకున్నారు. ఆ ప్రదేశం లో కరెంట్ లేదు. చిన్న గుడిసె ఆవరణలో ఏదో కిరోసిన్ లాంతరు మాత్రం వేలాడుతు తన ఉనికిని చూపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నా వారికి గుడిసె లో నుండి ఒక యువతి భయటకు వస్తు కనిపించింది.

"సామి పిలుస్తారు ఇక్కడే ఉండండి" అని గుడిసె ముందు అరుగు చూపించింది కుర్చోమన్నట్లుగా.

అక్కడి పరిసరాలు, ఆ చీకటి చూస్తుంటే,  పట్నం లో అర్దరాత్రిని సైతం పగలుగ  చూపించే వెలుగుల మధ్య పెరిగిన విక్టర్ కు చాల దడ గా ఉంది. మంత్రాలూ,  భూతాలు సినిమాలలో చూడటమే కాని ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. ఎం జరుగు తుందో  అని లోలోపల వణికి పోతున్నాడు.

ఉరిలో పుట్టి పెరిగిన సైదులు మాత్రం దైర్యంగానే ఉన్నాడు.ఇప్పటికే ఎన్నో బలాత్కారాలు, హత్యలు చేసి ముదిరి పోయిన తనకు,  ఈ చీకటి, ఆ కనిపించని ఆ దెయ్యం  ఎ రకంగాను భయపెట్ట లేవు అన్నట్లు గా ఉంది అతని వాలకం. చిన్నగా విక్టర్ చెవిలో అన్నాడు "మామ ! కతర్నాక్ పిట్ట రా. వెధవ భలే ఎంజాయ్ చేస్తుండు" తన కసినంతా పలికిస్తూ.

"ఒరేయ్ నీకు దండం పెడుతా ! మనం వచ్చిన పని ఏంటి,  నువ్వు మాట్లాడేది ఏంటి"  భయపడుతూ రెండు చేతులతో దండం పెట్టాడు విక్టర్.

కొద్దిసేపటికి ఆ అమ్మాయి "లోపలికి  రండి" అని పిలిచింది.

లోపలికి  వెళ్ళిన వాళ్ళకు గుడిసె మధ్యలో ఒక దీపం వెలుగుతూ కనబడింది. అక్కడ ఉన్నా కొన్ని వస్తువులు తప్ప ఆ వెలుగు కు  గుడిసెలో ఏమి కనిపించటం  లేదు. గుమ్మానికి ఎదురుగా గోడకు అనుకుని   ఒక 40 సంవత్సరాల అతను పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అతని నుదుటన రూపాయి బిళ్ళంత గంధం బొట్టుంది. వంటి మిద ఏమి లేకుండా, విబూది తో అడ్డ నామాలు పెట్టుకున్నాడు. కింద నల్లని వస్త్రం చుట్టుకుని, మేడలో రక రకాల తాయెత్తులు వేసుకున్నాడు. గుబురు మీసాలతో, నల్లగా, తుమ్మ మొద్దు లాంటి ఒళ్లుతో భయం పుట్టేలా ఉన్నాడు.

అతని ముందు కూర్చోగానే విక్టర్ కుడి చెయ్యి పట్టుకుని ఏవో మంత్రాలూ చదివాడు. తర్వాత ఎడమ చెయ్యి తీసుకుని మళ్ళి ఏవో మంత్రాలూ చదివాడు. వెంటనే "ఉంది ! ఉంది"  అని తల తిప్పుతూ ఉగిపోయాడు.

విక్టర్ కు ఒక్కసారిగా దడ పుట్టి సైదులు వంక చూశాడు భయపడుతూ. "ఉంది ఉంది అని ఉగిపోవటం కాదు. దానికి ఋజువులు చూపించు" అన్నాడు సైదులు వెటకారం ఆడుతూ.

"చూపిస్తారా ! చూపిస్తా.  తేట నీటిలో దాని జాడ చూపిస్తా ! గుట్టు రట్టు చేస్తా" అంటూ ఆ అమ్మాయికి సైగ చేశాడు మైసమ్మ.

ఒక పెద్ద మట్టి పళ్ళెం లో కొన్ని మంచి నీళ్ళు తీసుకొచ్చి వారి మధ్యలో పెట్టింది. ఏవో మంత్రాలు చదువుతూ ఒక నల్లని పొడిని నీళ్ళలో కలిపాడు. తర్వాత విక్టర్ రెండు చేతులు పట్టుకుని తడుముతూ ఏవో మంత్రాలు చదువుతూనే ఉన్నాడు.

విక్టర్ కు లీలగా అనిపించింది "అతను తన ఎడమ చేతిని తడుము తున్నప్పుడు ఏదో ద్రావణం పుస్తున్నాడని, కాని మళ్ళి కోపం తో ఎం చేస్తాడో"  అని ఉరకుండి పోయాడు.  తర్వాత సైదులు తో "ఇప్పుడే చూపిస్తా ! దాని ఆనవాలు" అని విక్టర్ కుడి చేతిని నీటి పళ్ళెం లో ముంచాడు. కానీ ఏమి జరుగ లేదు.

తర్వాత ఎడమ చేతిని నీటి పళ్ళెం లో ముంచ గానే నీరంతా పరుచుకున్న నల్లని పొడి ఒక్కసారిగా పక్కలకు జరిగి  పోయింది. అప్పుడు మైసమ్మ "చుశావ్ రా ! చుశావ్ రా. భూతం దెబ్బకు మంత్రించిన పొడి ఎలా అదిరి పోయిందో" అని ఉగి పోయాడు.

అప్పటి వరకు ధైర్యంగా ఉన్నా సైదులు ముఖం లో కాస్త భయం చూడగానే ఇంకా రెచ్చి పోయాడు మైసమ్మ. ఉగిపోతూ విక్టర్ ను పక్కనే ఉన్నా వేప కొమ్మలతో కొడుతూ ఏవో మంత్రాలు చదవ సాగాడు. అలా భాదిన తర్వాత ఏవో తాయ్యేత్తులు కట్టాడు అతని ఎడమ చేతికి.

సైదులు అయిదు వేల నోట్ల కట్ట ఒక్కటి ఇచ్చి భయం భయం గా విక్టర్ ను తీసుకుని బయట పడ్డాడు.

(ఇంకా ఉంది)

(నాలుగవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.)

2 వ్యాఖ్యలు: