27, మార్చి 2014, గురువారం

చేతిలో భూతం !!! -2

(మొదటి భాగం  కోసం ఇక్కడ నొక్కండి.)

సిగరెట్ దమ్ము గుండెల నిండా పిల్చి "ట్రాప్ చెయ్యడం అంటే ఏంటి మామ ! నాకు లవ్ చెయ్యటానికి అమ్మాయి కావాలంటే, నువ్వు ఏదో చెపుతున్నావ్"  అడిగాడు  విక్టర్ ఆతృతగా.

దానికి సైదులు చిన్నగా నవ్వి "అమ్మాయిని ప్రేమించి ఎం చేస్తావు డార్లింగ్" అడిగాడు.

నవ్వుతు  "ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటా" అన్నాడు.

"తర్వాత" అడిగాడు కుతులాహం ఏమి లెకుండా.

"తర్వాత ఏంది మామ !  అదే పని" అన్నాడు విక్టర్ సిగ్గు పడుతూ.

"ఇవ్వన్ని లేకుండా నేను ముందే ఆపని ఏర్పాటు చేస్తా. దాన్నే ట్రాప్ చేయడం" అన్నాడు  సైదులు క్రూరంగా నవ్వుతూ.  

విక్టర్ భయంగా  చూసి "ఏంటి మామ నువ్వు అనేది? రేప్ చెయ్యటమా !" అన్నాడు.

"అబ్బా ! ఏంటి డార్లింగ్  నువ్వు,  అప్పుడే అక్కడి దాక పోతావ్. డబ్బులు పారేస్తే రాని అమ్మాయి ఉంటుందా ! అందులోకి ఈ హై క్లాసు ఫిగర్స్ ఎప్పుడు ఎవడితో ఎంజాయ్ చేద్దామ? అని ఎదురు చూస్తూ ఉంటాయి" అన్నాడు నిర్లక్ష్యంగా.

విక్టర్ కు ఒక్కసారిగా ప్రియమణి గుర్తుకొచ్చి "ప్రియా డార్లింగ్" అని కసిగా సిగరెట్ దమ్ము లాగాడు.

"డార్లింగ్ ! ఇలాగె కలవరిస్తూ కూర్చుంటే కలలే మిగులుతాయి. కలలు తీరాలంటే మంత్రాలు, తాయెత్తులు కాదు ! ధైర్యం కావాలి" అన్నాడు సైదులు అతణ్ణి  రెచ్చ గొడుతూ. 

ఎప్పటినుంచో మొహం వాచి పోయిన విక్టర్ లో ఎక్కడ లేని తెగింపు చోటు చేసుకుంది ! "చెప్పు మామ ! నువ్వు ఏది చెపితే అది చేస్తా" అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న సైదులు "శబాష్ డార్లింగ్, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి చెయ్యాలి ఏదయినా. నీకు నచ్చిన ప్రియమణి నే మనం టార్గెట్ చేద్దాం" అన్నాడు ఉత్సాహంగా.

అప్పుడే ప్రియమణి తన సోతం అయినట్లుగా ఉహల్లొ తేలి పోయాడు విక్టర్. "ఇంతకూ ఎం చేయాలి మామ" అడిగాడు కుతూహలంగా.

సైదులు కు ఇలాంటివి కొత్త కాదు, తడుము కోకుండా  "ఎం లేదు మామ ! ప్రియమణిని నేను చెప్పిన చోటుకి తీసుకుని రా. తర్వాత పైసలు ఆశ చూపి నీ తోని ఆ పనికి ఒప్పుకోమందం. అక్కడ ఒక్కతె ఉంటది కాబట్టి చచ్చినట్లు ఒప్పుకుంటుంది" అన్నాడు.

 "ఒప్పుకోక పోతే" విక్టర్ అనుమానం వ్యక్తం చేశాడు.

"మామ ! అన్నింటికి అనుమానించుడు మాని నన్ను ఫాలో అయిపో" అన్నాడు విసుగుగా.

"అది కాదు మామ ! నేను తీసుకు పోయినట్లు తెలిస్తే, దానికి  ఏదయినా అయితే నా మిదికి వస్తాది కదా ?" అన్నాడు భయపడుతూ.

అప్పుడు సైదులు "నువ్వు శుక్రవారం డ్యూటీ మధ్యలో ఏదో కడుపు నొప్పి అని చెప్పి లీవ్ పెట్టు. తర్వాత డ్యూటీ అయిపోయే సమయానికి ప్రియమణి డ్రాప్ కోసం  క్యాబ్ మేనేజర్ కి ఫోన్  చేయక ముందే,  నువ్వు ఆమెకు  ఫోన్ చేసి తనను  డ్రాప్ చెయ్యటానికి వచ్చాను అని చెప్పు. తర్వాత నేను వెయిట్ చేస్తున్నా చోటికి తీసుకుని రా" అన్నాడు రహస్యంగా.

"లీవ్ పెట్టి డ్యూటీ లో లేక పోయిన కూడా నేను ఆమెను పికప్ చేసుకోవాలి. అంటే మనం తీసుక పోయినట్లు ఎవరికీ తెలియదు. మరి నువ్వు ఎలా లీవ్ పెడుతావ్" అడిగాడు  అమాయకంగా.

"నేను రేపే వెళ్ళి, శుక్రవారం  మా బందువుల పెళ్లి అని లీవ్ పెట్టి ఉరికి బయలు దేరినట్లు నమ్మిస్తా" అన్నాడు సైదులు.

అనుకున్నా ప్లాన్ ను ఒక్కటికి రెండు సార్లు పరిశీలించి చూసుకున్నారు ఇద్దరు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి , అనుమానం రాకుండా ఎలా చెయ్యాలి అని,  అన్ని రకాలుగా మాట్లాడుకొని శుక్ర వారం కోసం ఎదురు చూడ సాగారు.

******************************************************

శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిముషాలు. పని ఎక్కువగా ఉండటంతో చాల అలసి పోయింది ప్రియమణి. ఏదో కస్టమర్ తో కాల్ మాట్లాడుతుండగా ఫోన్ మోగింది. చూస్తే  ఏదో కొత్త నెంబర్.

ఫోన్ ఎత్తే సరికి  "నేనే మేడం విక్టర్ ను" అన్నాడు.

"ఏంటి కొత్త నెంబర్ నుండి చేశావ్ ! ఇంకా 30 మినిట్స్ ఉంది ఆఫీస్ అయిపొవటానికి" అంది ఆశ్చర్యంగా.

"సారీ మెడం ! నా సెల్ రిపేర్ అందుకే వేరే నెంబర్ నుండి చేస్తున్నా. రోజు నేనే కదా మిమల్ని డ్రాప్ చేసేది. మా మేనేజర్ వేరే దూరం ఉన్నా డ్రాప్ ఇస్తుంటే వద్దని చెప్పి మీకు చేస్తున్నా. మళ్ళి  మీరు ఆయనకు చెయ్యకండి మెడం ! వేరే డ్రాప్ ఇస్తే నాకు చాల లేట్ అవుతది" అని నమ్మబలికాడు.

"అలాగే లే. ఇంకో 15 మినిట్స్ లో వస్తా, భయట వెయిట్ చెయ్" అంది ప్రియమణి.

"మెడం ! ఒక్క విషయం. నేను ఆఫీసు బయట లేను. కొంచెం దూరం లో రెస్టారెంట్ దగ్గర ఉన్నా" అన్నాడు.

"నేను అక్కడికి రావటం ఎంటి. నువ్వే ఇక్కడికి రా, లేదంటే నేను మీ మేనేజర్ కు ఫోన్ చేస్తా" అంది చిరాకు పడుతూ.

"అబ్బ  ప్లీజ్ మెడం. దయచేసి ఇక్కడికి రండి. ఫ్రెండ్స్ తోని డిన్నర్ చేస్తున్న. నేను తాగిన అనుకుంటున్నారేమో,  లేదు ఉరికే భోజనం చేస్తున్నా. ప్లీజ్ మేడం కాదనకండి" అన్నాడు బ్రతి మాలుతు.

"సరే సరే వస్తాను లే" అంది మరో కస్టమర్ కాల్ రావటంతో.

అనుకున్నది అనుకున్నట్లుగా అవుతోందని సంతోష పడుతున్నా ! అతనికి ఎక్కడో భయం మాత్రం తొలుస్తోంది, తర్వాత ఎం జరుగుతుందోనని.

కొద్ది సేపటికి ప్రియమణి దూరంగా వస్తు కనిపించింది. ఆమెకు ఎదురు వెళ్ళి "చాల చాల థాంక్స్ మెడం. మా మేనేజర్ ఎక్కడో వనస్థలి పురం డ్రాప్ ఇస్తుండు. మనం ఎప్పటినుండి ఒక్కటే రూట్ ల ఉన్నాం, మిరే చెప్పండి" అన్నాడు.

 ప్రియమణి ఏమి మాట్లాడుకుండా కారులో కూర్చుంది. బాగా అలసి పోవటంతో అలాగే వెనుకకు వాలి కళ్ళు మూసుకుంది. తను అలా చేస్తుందని ఎప్పటి నుంచో ఆమెను డ్రాప్ చేస్తున్న విక్టర్ కు తెలుసు.

సంతోషంగా కారును ముందుకు ఉరికించాడు. సైదులు గాడు ఉన్న చోటికి అర్జెంటు గా వెళ్ళి పొతే మొత్తం వాడే చుస్కుంటాడు అని స్పీడ్ గా పోనిస్తున్నాడు. అలసి పోయిన ప్రియమణి అలాగే మగతగా కళ్ళు మూసుకుని కారు ఎటు వెళ్తుందో గమనించటం లేదు.

కొద్ది సేపటికే సైదులు గాడు వెయిట్ చేస్తున్నా ఒక నిర్మానుష్యమయిన ప్రదేశంలో కారు ఆపాడు విక్టర్. కారు ఆగటంతో హాస్టల్ వచ్చిందేమో అని కళ్ళు తెరిచినా ప్రియమణి ఆ ప్రదేశం చూసి అదిరి పోయింది. వెంటనే విక్టర్ వైపు తిరిగి "ఏంటి ! ఇక్కడికి తీసుకు వచ్చావ్" అంది వణుకుతున్నా స్వరం తో.

విక్టర్ ఏదో చెప్ప బొయెలొగ సైదులు ముందుకు వచ్చి "మా వాడికి నువ్వంటే ఇష్టం. ఒక్కసారి వాడి మోజు తిర్చవంటే నీకు ఈ నెల జీతం మొత్తం ఇచ్చేస్తాడు" అన్నాడు తనను ఆశ పెడుతూ.

"షట్ అప్ ! మర్యాదగా నన్ను హాస్టల్ దగ్గర దింపేయ్యండి. నా రెండు నెలలా  జీతం మొత్తం ఇస్తాను. దయ చేసి నన్ను వదిలెయ్యండి" అంది బెదిరిస్తూ, ఆశ పెడుతూ,  బ్రతి మాలుతు.

సైదులు తన ప్యాంటు జేబు లోంచి  తళ తళ మెరిసే కత్తి భయటకు తీసి "మర్యాదగా నోరు మూసుకుని మేము చెప్పింది చెయ్. లేదా గొంతు కోసేసి డ్రైనేజ్ లో పారేస్తాం" అన్నాడు బెదిరిస్తూ. తర్వాత ఆమెను కారు నుండి రోడ్డుకు దూరంగా తిసుక్కోచ్చారు.

భయంతో బిక్క చచ్చి అలాగే విగ్రహంల నిలబడి పోయింది  ప్రియమణి. విక్టర్ కు సైగ చేశాడు సైదులు. ఆమెను సమీపించి గట్టిగా హత్తుకుని ఎక్కడెక్కడో తడుముతూ ఏదేదో చెయ్యటం మొదలు పెట్టాడు. ప్రియమణి నిస్సహయురాలయి ఏడుస్తోంది. తనకు ఆ సమయంలో అమ్మ, నాన్న గుర్తుకు వస్తున్నారు.

వాళ్ళు ఎంత వద్దు వద్దు అని చెప్పిన నైట్ షిఫ్ట్ ఉన్నా ఈ జాబు లో చేరింది. విక్టర్ ఆమెను  కింద పడేసి పూర్తిగా ఆక్రమించుకుని పశువుల మారిపోయాడు. కొద్ది సేపటికి అలసి పోయి పైకి లెచాడు. ప్రియమణి సిగ్గుతో, భాదతో  చచ్చి పోతోంది.

తర్వాత సైదులు ఆమెను అక్రమించుకున్నాడు. అప్పటికే ఎన్నో అనుభవాలు ఉండటంతో ఆమెను చిత్ర వధ చేయ్యసాగాడు. ప్రియమణి బాధతో అరుస్తుంటే, కత్తి గొంతు మిద పెట్టి బెదిరించి, తన మరణ కాండ సాగించాడు. కొద్ది సేపు తనను అలా వేధించి అలసి పోయి పైకి లేచాడు. ప్రియమణి లేని ఓపికను తెచ్చుకుని నెమ్మదిగా  పైకి లేచి బట్టలు సర్దుకుంది.

వెంటనే సైదులు ఆమెను వెనుక నుండి పట్టుకుని గొంతు మిద కత్తి పెట్టాడు. విక్టర్ కంగారు పడుతూ "ఎం చేస్తున్నావ్ ! వదిలేయ్ మామ" అన్నాడు.

"డార్లింగ్ ! దిన్ని ఇప్పుడు వదిలేస్తే రేపు మన గురించి అందరికి చెప్పేస్తుంది. అందుకే లేపేద్దాం అనుకుంటున్నా" అన్నాడు చాల సాధారణంగా.

ప్రియమణి కి భయంతో నోట మాట రావటం లేదు. తన గొంతు తడారి పోయింది, అలాగే చలనం లేకుండా అయిపొయింది.  "వద్దు మామ. చంపటం తప్పు మామ" అన్నాడు విక్టర్ భయపడుతూ.

సైదులు గుంబనంగా  నవ్వుతు "డార్లింగ్ ! తప్పు చేశాక దాని నుండి ఎలా తప్పించుకోవాలో చూడాలి కాని ! తప్పొప్పులు  లెక్కేయ కూడదు. అది ఇంకా పెద్ద తప్పు" అని ప్రియమణి గొంతు మిద ఉన్న తన చేతిని అటు నుండి  ఇటు తిప్పాడు.

వెంట్రుకను సైతం నిలువునా చిల్చే పదును ఉన్నా ఆ కత్తి,  ఆమె గొంతు మిద ఏమాత్రం కష్టపడకుండ పెద్ద గాటు పెట్టింది. రక్తం బుస్సుమని పొంగింది ! ప్రియమణి గొంతు పట్టుకుని విల విల లాడుతూ కొట్టుకుంటోంది.

ఇదంతా చూస్తున్న విక్టర్ కు ఎక్కడ లేని దుఖం వేసింది. భాదగా అరుస్తూ "ఎంత పని చేశావ్ రా ! చెత్త నా కొడుకా" అని సైదులు మిద పడ్డాడు.  అవేవి పట్టని సైదులు విక్టర్ ను తోసేసి ప్రియమణి కొట్టుకుంటూ దూరంగా వెళ్ళకుండా కాళ్ళతో తోస్తున్నాడు.

కొద్దిసేపటికి ప్రియమణి లో చలనం ఆగిపోయింది. ఆమె చచ్చింది అని నిర్దారించుకున్నాక విక్టర్ తో "చల్ పద మామ ! రెండు రోజుల వరకు మనల్ని అడిగే వాడు ఉండడు. నేను మా ఉరికి వెళ్తా, నువ్వు ఇంటికి వెళ్ళి పో" అన్నాడు చాల ప్రశాంతంగా.

అప్పుడే దూరంగా పోలీస్ వ్యాన్ శబ్దం "కుయ్ కుయ్" మని వినిపించింది. ఇద్దరిలో కంగారు మొదలయి దూరంగా ఉన్నా  కారు దగ్గరికి పరుగు పెట్టారు. విక్టర్ ముందు, సైదులు వెనుక.  స్పీడ్ గా పరుగు పెడుతున్నా విక్టర్ కు కొద్ది దూరం లో ఎవరో ఉన్నట్లు అనిపించింది. పోలిసులకు దొరక కూడదని నిశ్చయించుకున్న అతను,  ఎవరయినా సరే కింద పడేసి పరుగు పెట్టాలను కున్నాడు. ఒక్కసారిగా ఆ ఆకారం మీదికి దూకాడు. అక్కడ ఎవరు లేక పోయేసరికి బొక్క బోర్ల పడి పోయాడు.

వెనుక పరుగు పెడుతున్న సైదులు వచ్చి లేపే వరకు లెవ లేక పోయాడు. అలాగే కింద కూర్చుని బిత్తర చూపులు చూడ సాగాడు. "ఏమయింది మామ ! అల పడిపోయావ్" అని భుజం తట్టి లేపుతున్నాడు. కాని విక్టర్ అలాగే అయోమయంగా అటు ఇటు చూస్తూ లేచి నిలబడ్డ్డాడు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని ఏమి భయటకు రావటం లేదు. కొద్ది దూరం  తుళ్ళుతూ నడిచి బళ్ళుమని వాంతి చేసుకుని అక్కడే కూలబడి పోయాడు.

సైదులుకు ఎం చెయ్యాలో తెలియటం లేదు. ఇలాంటి పిరికి వెధవతో పెట్టుకునందుకు తనను తనే తిట్టుకుంటున్నాడు. విక్టర్ మాత్రం అలాగే కూర్చుండి పోయాడు. కొద్ది సేపటికి "మామ..... నా చెవులు.....రక్తం" అంటూ ముద్ద ముద్ద గా గొణిగి చెవులు మూసుకున్నాడు. సైదులు కు చాల కోపంగా ఉంది ! అయినా తమాయించుకుని "డార్లింగ్ ! ఏమయింది ? చెవులు ఎందుకు మూసుకుంటున్నావ్?" అడిగాడు.

"రక్తం కారుతున్నాయ్" అన్నాడు నూతిలోంచి మాట్లాడుతున్నట్లుగా.

అతని చేతులు తీసి  చూసిన సైదులు "రక్తం లేదు,  ఎం లేదు. తొందరగా వెళ్ళి పోవాలి మామ. లేక పొతే దొరికి పోతాం" అని తొందర చేశాడు. విక్టర్ నా వాళ్ళ కాదంటూ చేతులు అడ్డంగా ఉపాడు. చేసేది లేక సైదులు విక్టర్ ను వెనుక విపు మీద వేసుకుని కారు వెనుక సీటు లో పడేసి కారు ముందుకు పోనిచ్చాడు.

విక్టర్ ఇంటి దగ్గర  అతను రోజు పార్క్ చేసే చోట కారు ఆపి అతన్ని లేపి ఇంటికి పంపాడు. అలాగే తుళ్ళుతూ ఇంటికి వెళ్ళిన విక్టర్ ను తాగి వచ్చాడు అనుకుని ఎవరు ఏమి అనలేదు. అటు సైదులు తమ ఉరికి ప్రయాణం అయ్యాడు.

మరునాడు పొద్దున్నే ఎంత సేపటికి విక్టర్ నిద్ర లేవక పోయేసరికి తండ్రి వచ్చి చూశాడు. ఒళ్ళు కుంపటిల కాలి పోతోంది. వెంటనే అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు. టెస్ట్ లు చేసిన డాక్టర్స్ కు అన్ని నార్మల్ గానే అని పించాయి. నీరసం పోవటానికి ఏవో సేలైన్స్ ఎక్కించారు. సాయంత్రం కల్ల పరిస్థితి మెరుగు అవ్వటంతో డిశ్చార్జ్ చేశారు.

మరునాడు ఆదివారం అలవాటు గా  చర్చ్ కు వెళ్ళాడు విక్టర్.  ఎప్పటిలాగే కీ బోర్డ్ ఉన్నా దగ్గరికి వెళ్ళి "మామ ఒక్క ఛాన్స్" అన్నాడు. అసలే హాస్పిటల్ నుండి వచ్చాడు అన్న సింపతి తో "సరే" అన్నాడు అది వాయిస్తున్న అతను.

విక్టర్ ఎక్కడ లేని సంతోషంతో కుర్చుని విచిత్రంగా ఎడమ చేతితో కీ బోర్డ్ వాయించటం మొదలు పెట్టాడు. కీ బోర్డ్ వాయిస్తున్న సంతోషం లో అతను గమనించు కోవటం లేదు. కాని అది చూస్తున్న అబ్బాయి నోరు వెళ్ళ బెట్టాడు. ఎందుకంటే విక్టర్ చాల బాగా వాయిస్తున్నాడు.అసలు అతను అంత బాగా ప్లే చేస్తాడని ఉహించని ఆ యువకుడు విపరీతమయిన ఆశ్చర్యంతో   చూస్తూ ఉండి పోయాడు.

అప్పటి వరకు అంత మంచి మ్యూజిక్ వినని అందరు కీ బోర్డ్ ఉన్నా వైపు చూశారు. అద్బుతాన్ని చూసినట్లుగా విక్టర్ ను చూడసాగారు. అప్పుడు కాని విక్టర్ కు అర్ధం కాలేదు ! తను చాల బాగా వాయిస్తున్నానని, అది కాకుండా ఎడమ చేతితో వాయిస్తున్నానని. అదిరి పడినట్లుగా లేచి భయటకు వెళ్ళి పోయాడు.

ఒంటరిగా కూర్చుని తన ఎడమ చేతి వైపు చూసుకుంటున్నాడు. కాని ఏమి తేడా అని పించలేదు. తనకు చాల ఆందోళనగాను,  ఆనందంగానూ ఉంది. ఎప్పటికి వాయించాలేను అనుకున్నా కీ బోర్డ్ అంత బాగా వాయిస్తున్నందుకు ఆనందంగా ఉంది .  ఏ  మాత్రం నేర్చుకోకుండా ! ఎడమ చేతితో వాయించడం చాల ఆందోళన కలిగిస్తోంది.

(ఇంకా ఉంది)

(మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.)

4 వ్యాఖ్యలు: