25, మార్చి 2014, మంగళవారం

చేతిలో భూతం !!! -1


"ఒరేయ్ వేస్ట్ ఫెలో ! మార్నింగ్ 9:30 అవుతోంది. ఇంకా ఎంత సేపు పడుకుంటావు రా? లేచి రెడీ అయి చర్చి కి రా" అని తండ్రి తిట్టి లేపటంతో కళ్ళు నులుము కుంటూ నిద్ర లేచాడు విక్టర్.

 హాలు లోకి వచ్చేసరికి అన్నయ్య, ఇద్దరు అక్కలు మరియు నాన్న రెడీ అయిపోయి చర్చి కి బయలు దేరారు. రెడీ అయినా వాళ్ళను చూస్తుంటే విక్టర్ కు చాల అసూయగా ఉంది. మెరిసి పోయే నిమ్మా పండు రంగులో హీరో, హీరోయిన్ల లాగా ఉన్నారు. 

పక్కన తమ డాడి మాత్రం వాళ్ళ రంగుకు మ్యాచ్ కాకుండా నల్లని బొగ్గు రంగులో ఉన్నాడు. అచ్చం అదే రంగులో ఆయనకు పోటిగా విక్టర్ కూడా నల్లగా మెరిసి పోతున్నాడు. అది చూసి  ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. "విక్కి ! తొందరగా రారా !" అని అన్నయ్య మరియు ఇద్దరు అక్కలు డాడీ ని తీసుకుని చర్చి కి వెళ్ళిపోయారు.

బాత్ రూం లో దూరిన తనకు అద్దంలో తన తోడ బుట్టిన వారితో పోలిస్తే అసహ్యంగా ఉన్నా తన రూపం కనిపించింది. "ఏంటో ఖర్మ ! ఇంట్లో ఎవరికీ రాని తండ్రి రంగు మరియు అయన వికారమయిన రూపం తనకే  వచ్చింది" అని రోజులాగే వాపోయాడు.

అందరు చెప్పటం బట్టి, మరియు వారి పెళ్ళి ఆల్బమ్ చూసి తను తెలుకున్నది ! విక్టర్ తల్లి చాల అందమయినది. విక్టర్ తండ్రి మాత్రం చాల నల్లగా, కురుపిలగా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. విక్టర్ తండ్రి మంచితనం చూసి అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది అతని తల్లి. తనను కని పురిట్లోనే చని పోయింది. అప్పటినుండి నాన్న మరియు అన్నయ్య ఇద్దరు అక్కలు తనను ఎంతో గారభంగా పెంచారు. వారి ప్రేమ తనను చెడ గొట్టిందో లేక తనకు తెలివి తేటలు తక్కువో తెలియదు కాని చదువు అబ్బలేదు.

ఎందులోనూ సరయిన ప్రతిభను చూపించ లేక పోయాడు.  ఎదుగుతున్న కొద్ది  ఆత్మ నున్యత పెంచుకుని ఎందులో ను రాణించ లెక  అందరి చేత చివాట్లు తినటం అలవాటు చేసుకున్నాడు. చదువు డిగ్రీ వరకు సాగించి,  ఫెయిల్ అయి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే, తండ్రి మరియు తోడ బుట్టిన వారి సాధింపులు ఎక్కువ అయిపోయాయి. డబ్బులకు ఇబ్బంది కూడా మొదలయింది. అందుకే ఒక మల్టీ నేషనల్ కాల్ సెంటర్ కంపెనీ లో  క్యాబ్  డ్రైవర్ గా  పని చేస్తూ తన ఖర్చులు తనే వెళ్ళ దిసుకుంటున్నాడు విక్టర్.

 ఎది తనకు లేకపోతె దాన్నే కావాలని మనిషి మనసు మారాం చేస్తుంది. అందుకే తనకు లేని రంగు, అందం మరియు అమ్మాయిలను ఆకట్టు కోవటం అంటే విక్టర్ కు ఎక్కడ లేని పిచ్చి.  ముఖ్యంగా అమ్మాయిలన్న, వారితో మాట్లాడటం అన్నా విక్టర్ కు మహా ఇష్టమయిన విషయాలు. కాని తన దురదృష్టం ! అందం లేదు, చదువు లేదు పోనీ ఏదయినా స్పెషల్ టాలెంట్ తో ఆకట్టుకుందాం అని చర్చ్ లో  కీ బోర్డు కాని గిటార్ కాని నేర్చు కోవాలని ఎంతో ప్రయత్నించిన ఒక మోస్తారు గా కూడావాయించ లేక పోయాడు.

అసలు అతను చర్చ్ కు వెళ్ళెదె అమ్మాయిలను చూడటానికి. అందమయిన అమ్మాయిలను చూస్తూ వారిని తన కలల్లో రప్పించుకుని వారితో ప్రేమా, సరసాలు సాగించటం అతని అలవాటు. చర్చ్ లో అడుగు పెట్టి కీ బోర్డు ఉన్నా దగ్గరికి వెళ్ళి అది వాయిస్తున్న అబ్బాయితో "ఒరేయ్ మామ ! ఒక్కసారి ఛాన్స్ ఇవ్వరా" అన్నాడు.

దానికి అతను  "దేనికి బాబు ! అందరిని బెదర గొట్టి భయటకు పంపడనికా? ఎన్ని సార్లు ఫాదర్ తో తిట్లు తిన్నా నీకు రెండక్షరాలు ఇంకా రావటం లేదు" అన్నాడు వెటకారంగా.

విక్టర్ ఆశ్చర్యంగా "రెండక్షరాలు ఎంటిరా?" అని అడిగాడు.

"ఆ.....బుద్ది, జ్ఞానం ఇంకా సిగ్గు" అన్నాడు వెక్కిరింపుగా నవ్వుతు.

నిరాశగా అక్కడి నుండి వచ్చేసి  అమ్మాయిలు ఎక్కువగా ఉన్నా వరుసలో వెళ్ళి కూర్చున్నాడు. చర్చ్ అయిపోయిన తర్వాత అందరు భయటకు వస్తున్నారు. ఎప్పటిలాగానే అందరు అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు విక్టర్.  చూడబోతే ప్రతి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు ఉంది. ప్రతి అమ్మాయి ఎవడినో  ఒక్కణ్ణి చూస్తూ సిగ్గు పడుతూ వెళ్తోంది.

ఎలాగయినా ఎవరి తోనయిన మాట్లాడాలని ఎదురుగా వస్తున్నా అమ్మాయిని పలకరించాడు "హాయ్ ! కేథరిన్" అని.

ఆమె పలకుండా వెళ్తొంటే  చెయ్యితో చిన్నగా భుజం తట్టాడు వెనుక నుండి. చివుకున్న  వెనుకకు తిరిగింది ఆమె. విక్టర్ నవ్వుతు "హాయ్" అన్నట్లుగా చెయ్యి ఉపాడు.

"ఐ యాం వెరీ బిజీ నౌ"  అని  కోపంగా చూసింది.

బిక్క చచ్చిపోయాడు !  "సారీ" అని చెప్పి అక్కడనుండి భయటకు వచ్చేశాడు.  కొద్ది సేపటికి ఆ అమ్మాయి తన అన్నయ్య తో హ్యాపీ గా మాట్లాడుతూ కనిపించింది.

అతనికి ఇలాంటి అవమానాలు కొత్త కాదు. కాని ఎన్ని సార్లు అవమానం పొందిన దాని భాధ ప్రతిసారి పెరుగుతుందే కాని తగ్గటం లేదు. అందుకే అర్జెంటు గా దిన్ని మర్చి పోవాలి ! కొద్ది దూరం లోనే ఉన్నా బార్ లో దూరి పోయాడు. బీర్ ఆర్డర్ చేసి,  రాగానే సిప్ తీసుకున్నాడు.

కొద్ది క్షణాలకే ఫోన్ మోగింది, తీసి చుస్తే సైదులు గాడు. ఫోన్ ఎత్తి "హలో ! చెప్పురా సైదు" అన్నాడు విక్టర్.

"విక్కి డార్లింగ్ ! తాటి కల్లు ఫుల్ వేసే సరికి నువ్వే గుర్తచ్చినావ్ ! అందుకే చేస్తున్నా. ఇంతకూ ఎక్కడున్నావ్ డార్లింగ్" అన్నాడు సైదులు  కల్లు ఎక్కువయి నోరు తడబడుతుంటే.

దానికి "నేను బి మందు తాగటానికి బార్ కు వచ్చిన రా" అన్నాడు.

"మామ సంథింగ్ రాంగ్ ! నువ్వు ఇప్పుడు చర్చ్ లా పోరిలను చుసుకుంట ఉంటావ్ కదా" అన్నాడు ఆశ్చర్యంగా మాట తడబడుతూనే.

 విక్టర్ ఏడ్చినంత పని చేసి  "మామ నాకు బతకాలని లేదురా ! ఎ ఒక్క పోరి నన్ను కేర్ చెయ్యడం లేదు. నువ్వే ఏదయినా చెయ్యాలి రా ! నా కోసం" అన్నాడు.  సైదులు ఉరి వాడు కావటం తో తన దగ్గర ఏవయిన మంత్రాలూ, లేదా వశీకరణ చేసుకునే మూలికలు లాంటివి ఉంటాయని అతని  నమ్మకం.

అప్పుడు సైదులు "డార్లింగ్ ! పొరిల కోసం చచ్చి పోవుడు పిరికి తనం. నీ కెందుకు నేను ఉన్నా కదా ! రేపు డ్యూటీ కి ఎక్కుత, మొత్తం మాట్లాడుదాం. మంచిగా తాగి జాగ్రత్తగా ఇంటి కి వెళ్ళు" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

తర్వాత సైదులు స్నేహితులలో  ఒకడు "తాగిన తర్వాత అమ్మాయిలు గుర్తు రావాలి గాని ! నువ్వేంట్రా ఎవడికో ఫోన్ చేసి డార్లింగ్, విక్కి, లక్కీ అంటావ్" అన్నాడు ప్రశ్నార్థకంగా.

 "వాడు నేను సెమ్ కంపనీ లో క్యాబ్ డ్రైవర్స్. ఇప్పుడు మన ఫ్రెండ్" అన్నాడు గర్వంగా.

"పరమ చెత్త నా కొడుకువి నీకు వాడు ఫ్రెండ్ ఏంట్రా ! లంబాడి తండా పోరిలను అనుభవించుడు,  వాళ్ళు ఒప్పుకోక పొతే చంపి పాతెసుడు" అన్నాడు మరో స్నేహితుడు.

"ఒరేయ్ ! మీరు  కూడా ఉన్నారు  కదరా నాతొ పాటు !  హైదరాబాద్ లో రూం ఉన్నా కూడా, 100 కిలోమీటర్ల దూరం ఉన్నా మన ఉరికి ప్రతి శని , అది  వారలు వచ్చేది ఎందుకు రా ? మిమల్ని కలిసి ఎంజాయ్ చేద్దామనే కదా" అన్నాడు తన అలక గొంతులో పలికిస్తూ.

అందుకు ఆ స్నేహితుడు "సరే రా ! గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లు నీకు బాగానే దొరికిండు ఆ బకరా గాడు" అన్నాడు వెటకారంగా.

"మామ ! అమాయకుడు ఎప్పుడు నమ్మేది నాలాంటి దొంగ నాయల్నేరా ! ఎందుకంటే, వాడిలో లేని తెగింపు, ధైర్యం నాలో నిండుగా ఉంటాయి కాబట్టి" అన్నాడు హీరోలాగా పోజు కొడుతూ.

"ఇంతకూ ఎప్పుడు వెళ్తున్నావ్ రా సిటి కి" అన్నాడు మరో స్నేహితుడు.

"రేపు మార్నింగ్ వెళ్తున్నా మామ. మద్యహ్నం నుండి డ్యూటీ కదా మనకు" అన్నాడు సైదులు.

*******************************************

సోమవారం పొద్దున్నే ఫోన్ మోగటంతో విసుగుగా ఫోన్ ఎత్తింది ప్రియమణి "హలో ! ఏంటి మమ్మీ ఇంత పొద్దున్నే చేశావ్" అంది కోపంగా.

అవతలి నుండి వాళ్ళ అమ్మ "అదేంటే ! ఉదయం పది అవుతుంటే పొద్దున్నే అంటావ్. డ్యూటీ ఉన్నా రోజు ఎలాగు లేట్ గా పడుకుంటావు లేట్ గా లేస్తావు. కనీసం డ్యూటీ లేని రోజు అయినా కాస్త పొద్దున్నే లేవకూడదు" అంది  మందలిస్తూ.

"మన ఉరు నుండి ఇప్పుడు నన్ను నిద్ర లేపటానికి చేశావ ఫోను  ! అసలు విషయం ఏంటో చెప్పు" అంది చిరాకుగా.

"మణి ! మామయ్య నీకు ఒక సంభందం తెచ్చాడు రా. అబ్బాయి అమెరికా లో ఉంటాడట. నువ్వు ఏమంటావ్" అంది సంబరంగా.

"అయ్యో అమ్మా ! అమెరికా అయినంత మాత్రాన ఎవడో, ఏమిటో చూడకుండా,  మాట్లాడకుండా ఎలా చేసుకుంటాను. మీకు నచ్చితే నేను పండుగకు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుదాం. నువ్వు అనవసరంగా అత్ర పడి పోయి నా నిద్ర చెడ గొట్టే  పనులు పెట్టుకోకు"   అంది  విసుగు పడుతూ.

"ఒక్కగానొక్క కూతురివి ! మాకు దూరంగా సిటి లో హాస్టల్ లో ఉంటూ, వద్దని చెప్పిన జాబు చేస్తున్నావ్. ఎలా ఉన్నవో ? అని  చెయ్యటం కూడా తప్పేనా" అంది బాధ పడుతూ ప్రియమణి తల్లి.

"అమ్మా ప్లీజ్  !  నువ్వు అలా భాద పడొద్దు. నాకేం కాదు ! నీకు నచ్చిన వాడినే నేను పెళ్ళి చేసుకుంట. ఓకే నా ? నాన్న గారు భాగున్నారు కదా? సరే మరి నేను ఆఫీసు కు రెడీ అవ్వాలి. బై" అని ఫోన్ పెట్టేసింది ప్రియమణి.

తర్వాత టవల్ తీసుకుని హాస్టల్ బాత్ రూం లో దూరి పోయింది.  "1 గంటకు ఆఫీస్  క్యాబ్ వస్తుంది ఈ లోగ అన్ని పనులు  కానిచ్చి భోజనం చెయ్యాలి. ఆ క్యాంటీన్ లో తిండి తినలేక పోతున్నాను.  మళ్ళి అర్ద రాత్రి 12 గంటలకు కాని విలు కాదు" అనుకుంది మనసులో.

స్నానం నుండి వచ్చి, జీన్స్ మరియు టి షర్టు వేసుకుని జుట్టు అలాగే లూస్ గా వదిలేసి,  లైట్ గా లిఫ్ స్టిక్ పెట్టుకుని హాస్టల్ మెస్ లోకి వెళ్ళింది ప్రియమణి. అక్కడ కొందరు అమ్మాయిలు అప్పటికే భోజనం చేస్తున్నారు.

అందులో ఒక అమ్మాయి "వావ్ మణి ! అదిరి పోయావే. సూపర్ డ్రెస్సు. అసలు నీ స్ట్రక్చర్ కు ఏ డ్రెస్ అయిన సూట్ అవుతుంది" అంది సంబ్రమాశ్చర్యాలతో.

దానికి ప్రియమణి "థాంక్యు థాంక్యు" అంది సిగ్గుతో వంగి చేతితో సలాం పెడుతూ.

అప్పుడు మరో అమ్మాయి "నేనే గనక మగాణ్ణి అయితే నిన్నే పెళ్ళి చేసుకునే దాన్నే" అంది ప్రియమణి చెయ్యి పట్టి పైకి లాక్కుంటూ.  అందరు ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వారు.

 "ఉరుకొండే మీరు మారిను. మునగ చెట్టు ఎక్కిస్తారు" అంది చిరు కోపం చూపిస్తూ.

అలా సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనం ముగించింది. తర్వాత ఆఫీసు వెళ్ళటానికి క్యాబ్ కోసం ఫోన్ చేసి ఎదురు చూస్తూ కూర్చుంది.

*************************************************

"సైదులు మామ ! ఎలాగయిన నువ్వే నాకో అమ్మాయిని సెట్ చెయ్యాలి రా" అన్నాడు విక్టర్ గొముగా.

దానికి సైదులు కోపపడుతూ "నా దగ్గర ఎమన్నా పోరిలా ఫ్యాక్టరీ ఉన్నదా ! లేక నేనేమన్నా అమ్మాయిల బ్రోకర్ నా" అన్నాడు.

"అది కాదు మామ ! మీ ఉర్లల్ల మంత్రాలు ఇంకా తాయెత్తులు అవి  ఉంటాయి కదరా" అన్నాడు అమాయకంగా.

దానికి సైదులు బిగ్గరగా నవ్వి "ఓరి పిచ్చోడ ! నువ్వు వాటిని నమ్ముతున్నావా ? ఉరిలో పుట్టి పెరిగినా నేనే నమ్మను వాటిని" అన్నాడు. అది వినటం తోనే విక్టర్ లో నీరసం ఆవహించి అక్కడే కూలబడి పోయాడు.

సైదులు రహస్యంగా "చూడు మామ ! పోరిలను పడెయ్యటానికి చాల విషయాలు కావాలి. అదే వాళ్ళను ట్రాప్ చెయ్యటానికి ! ఏది అవసరం లేదు. తప్పించు కొనే తెలివి తేటలు ఉంటె చాలు" అన్నాడు.

విక్టర్ కు అర్ధం కాలేదు "ట్రాప్ చెయ్యటం అంటే" అన్నాడు అంతే రసహ్యంగా.  సైదులు ఏదో చెప్పేలోపు విక్టర్ ఫోన్ మోగింది. చూస్తే క్యాబ్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు.

"సైదు మామ,  నాకు ఏదో పికప్ వచ్చి నట్లు ఉంది. సాయత్రం మాట్లాడుదాం" అని చెప్పి పికప్ అడ్రస్ కి బయలు దేరాడు.

అడ్రస్ కి వెళ్ళి "మేడం ! కింద వెయిట్ చేస్తున్నా రండి" అని ఫోన్ చేశాడు.

కొద్ది సేపటికి ఆమె కారు వెనుక తలుపు తీసుకుని కూర్చుంది. కారంత ఆమె పెర్ఫ్యూమ్ తో నిండి పోయింది. విక్టర్ తన కారులో  అద్దాన్ని ఆమె అందమయిన  మొఖం కనిపించేలా అడ్జస్ట్ చేసాడు.  ఆమెను అలా చూస్తూ డ్రైవ్ చెయ్యటం చాల కష్టంగా చాల అనిజిగా ఉంది అతనికి. ఆమె సెంట్ ను గుండెల నిండా పిలుస్తూ ఆమె ఎర్రని పెదవులు కసితీరా చూస్తున్నాడు. అవేవి పట్టని ఆమె సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చుంది.

కొద్దిసేపటికి తానె "ఏంటి విక్టర్ ! వీకెండ్ ఎలా అయింది" అంది క్యాసువల్ గా.

"ఎం వీకెండ్ మణి మేడం. ఆఫీసు ఉంటేనే బెటర్ అనిపించింది" అన్నాడు నిరుత్సాహంగా.

"ఎందుకలా ?" అనడిగింది ఆశ్చర్యంగా.

అప్పుడు  ఉషారుగా "ఆఫీసు ఉంటె మీలాంటి వాళ్ళను చూడచ్చు. అదే ఆఫీసు లేక పొతే ఏముంటది" అన్నాడు.

అందరితో ఫ్రీగా మూవ్ అయ్యే మనస్తత్వం ఉన్నా ప్రియమణి దాన్ని  కంప్లిమేంట్ లాగే తీసుకుని "నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావ్ కదా" అంది మందలింపుగా.

తర్వాత ఆఫీసు దగ్గర దిగి రిజిస్ట్రార్ లో సైన్ చేసి లోపలికి  వెళ్ళి పోయింది ప్రియమణి.


(ఇంకా ఉంది)

రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి