13, జనవరి 2014, సోమవారం

క్షమించు తెలుగు సినిమా !!


హీరో అంటే తోడ కొట్టుడు
కామెడియన్స్ ను కొట్టుడు
వంద మందిని నరుకుడు
హీరోయిన్ను ముద్దడుడు
అని ఫిక్స్ అయిపోయాము
నీ నటనతో పాత్రకు ప్రాణం పోసి
నీ ప్రాణమంత పెట్టావు
అందుకే మాకు నచ్చలేదు !
క్షమించు మహేష్

తెర మీద రక్తం పారాలి
తలలు ఎగిరి పడాలి
హీరోయిన్ బొడ్డు, తొడలు
నిగ నిగ లాడాలి
అని అలవాటయిన కళ్ళకు
నీ కెమెరా చూపిన నిజాలు, అందాలు
నచ్చలేదు ! క్షమించు రత్నవేలు

పంచ్ డైలాగులు
బూతు మాటలు
ప్రాసకోసం పాకులాట
కామెడీ పేరుతొ కొతులాట
ఇదే మాకు అలవాటయిన ఆట
స్వచ్చమయిన మాటలు
సరళ మయిన బాష
మాకు ఎబ్బెట్టుగా అనిపించాయి !
క్షమించండి రచయితలు

చావు డప్పులు
రణ గోణ  ధ్వనులు
చెవులు చిల్లులు పడే మోతలు
మరిగిన మాకు, సన్నివేశానికి
ప్రాణం  పోసిన నీ సంగీతం
సరిపోలేదు !
క్షమించు దేవి

నమ్మిన కథకు న్యాయం
నవ్యతకు నాంది
తెలివికి పదును
మర్చిపోయాము
సినిమా అంటే నవ్వటమే అని
నేర్చుకున్నాము
నీ ఓర్పు, నీ నేర్పు
మాకు మింగుడు పడలేదు !
క్షమించు సుకుమార్

పిచ్చి సినిమాకు రివ్యూ లు రాసి
వాటినే కొలమానంగా చూసి
మా అజ్ఞానాని కప్పిపుచ్చలెక
1 గొప్పదనం తెలియక
చెత్తవాగుడు వాగేసి
ఏదో రివ్యూ రాసేసాము
మీ ఉన్నత ప్రయత్నం వెనుక
ఆరాటం, పోరాటం తెలియలేదు !
క్షమించండి నిర్మాతలు

పరాయి సినిమాలు అవార్డ్స్ కొడుతుంటే
వారికి  పరపతి ఎక్కువ అని అక్రొశించము
కాని కొత్తదనానికి మేము ఇచ్చే గౌరవం
తెలుగు సినిమాను సిగ్గుపడేలా చేస్తోంది
క్షమించు తెలుగు సినిమా తల్లి


18 వ్యాఖ్యలు:

 1. బాగా చెప్పారు. మనకు మూక ప్రేక్షకులు ఎక్కువ. ఆ మూకలను బట్టి సినిమాలు తియాటం అలవాటయ్యిపోయింది సినీ పరిశ్రమకి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ENGLISH LO KI DUBB CHESI WORLD MOTTAM RELEASE CHEYYOCCHU AS IT IS GAA

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీకు మరీ నచ్చేసినట్లుందండి. సినిమాలో మనసుకు హత్తుకునే సన్నివేశాలూ చలా ఉన్నాయి. ఆ కుర్రవాడి వేదన మనసును కదిలిస్తుంది.
  కానీ చాలా చోట్ల ఆ బాధని తేలిక చేసే సన్నివేశాలున్నాయి. ఆ విధంగా ఆ బాధ డైల్యూట్ అయిపోతుంది.
  ఉదా, సైక్రియాటిస్ట్ మరియూ హీరోయిన్‌తో(ఆమె ఎంత అతని మంచి కోసం చేసింది అనుకున్నప్పటికీ) సన్నివేశాలు.

  ఐ-న్యూస్ ఏంకర్ అయిన హీరోయిన్ ఏదో ఇంటర్నేషనల్ మోడల్‌లా కనిపిస్తుంది. ఏదో రాక్‌స్టార్‌కి కస్టమైజ్ చేయబడిన గర్ల్‌ఫ్రెండ్‌లా ఉంటుంది. బయట కూడా పద్దతిగా కనిపించడం వల్లనేమో మహేష్ బాబుని రాక్‌స్టార్‌గా ఒప్పుకోలేకపోయాను.

  మహేష్ బాబు గతం గురించి తెలుసుకునేటప్పుడు ఇద్దరినే చూపిస్తారు - అతను అనాధాశ్రమంలో ఉన్నప్పటి ఓ ఆయా, అమ్మానాన్నని చంఫేశారని కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్. అంత పెద్ద రాక్‌స్టార్ గురించిన కధాకమామీషు అప్పటివరకూ ఎవరికీ తెలీదు. అతను ఆ స్థాయికి ఎవరి సహాయమూ లేకుండానే వస్తాడా?!! అతని గతం గురించి ఇంకే ఆధారాలూ చూపించకపోవడం పెద్ద లోపంగా అనిపించింది. ఇంకెవ్వరూ అతన్ని ఆ మానసిక స్థితిలో చూడలేదా అప్పటివరకూ?!!

  అతని ఇంటి మీద ఎటాక్‌ని (రెండోసారి పోలీసులొచ్చే సంఘటన) అతను చిత్రీకరించి, ఆ కెమరాలో ఫోటోలు చూపించి అతను పొరబడట్లేదని నిరూపించుకోకుండా గోవా ఎందుకు వెళతాడు? గోవాలో అంత కచ్చితంగా చెప్పినవాడు ముందెందుకు చెప్పడు?
  అతని తండ్రి ఓ మంచి సైన్‌టిస్ట్. నాజర్ చెప్తేనే తప్ప తండ్రి గురించి ఎందుకు తెలీదు?!!
  అతని తండ్రి కనిపెట్టిన విత్తనం అన్ని రోజులుంటుందా? పోని ఉన్నా అదే క్వాలిటీతో ఉంటుందా?

  రొటీన్ కధలకు భిన్నంగా తీసినందుకు అభినందించొచ్చు. కానీ గంటన్నర సినిమాని రెండున్నర గంటలు చూపించటం, పాటలని వదలకపోవటం, హీరోయిన్‌ని చూపించిన విధానం, కధలో కొన్ని లోపాలు....ఇవన్నీ కలిపి ఆ సినిమాకున్న ప్రత్యేకతని చెడగొట్టాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆష గారు,
   సినిమా అంతా కూడా గౌతం ఒంటరిగా ఉంటూ ఎవరితో కలవడానికి ఇష్టపడని వ్యక్తిగానే చూపించాడు రాక్ స్టార్ గా ఎదగడానికి ఇతరుల సాయం తీసుకున్నా వారు ఇతని గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదండీ. అతని హెలూసినేషన్స్ గురించి ఎవరితోనూ అతను చెప్పి ఉండకపోవచ్చు ఎందుకంటే అతను ఊహించుకున్నది హత్య చేసినట్లుగా కదా.
   సెకండ్ అటాక్ లో గౌతం ఫోటోలు తీశాను అని చెబుతాడు కానీ కెమేరా జరిగిన గొడవలో ఇంటిలోనుండి బయట పడిపోవడంతో కెమేరా కనపడక నిరూపించుకునే అవకాశం లేక తాత్కాలికంగా జనాలని తప్పించుకుని ఏకాంతం కోసం గోవా వెళ్ళిపోతాడు.
   ఇక గోల్డెన్ రైస్ ని చెడిపోకుండా ఒక లిక్విడ్ లో భద్రపరిచినట్లుగా చూపించారండీ. అంత సైంటిస్ట్ కి దానిని ప్రిజర్వ్ చేయడం తెలియదంటారా.

   తొలగించు
  2. మీ ఇద్దరితోనూ నేను ఏకిభవిస్తున్నాను. కాని ఒక్కటి మాత్రం నిజం ! ఎప్పుడు అదే మూసలో వెళ్ళకుండా కొత్తగా ప్రయత్నించిన వారిని అభినందిచాలని ఈ చిన్న ప్రయత్నం. నా బ్లాగ్ ను చదివి, మీ అభిప్రాయలు చెప్పినందుకు చాల సంతోషం.

   తొలగించు
  3. వేణుశ్రీకాంత్‌గారు

   మీరు చెప్పినట్లుగానే అనుకున్నా అది హేలూసినేషన్ అని అతను నమ్మట్లేదు కదండి. అలాంటప్పుడు తనెందుకు దాస్తాడు? పోనీ ఎవరూ నమ్మరని భావించినా పెద్దయ్యాక ఎలా బయటపడిందో అలా ఇప్పటివరకూ జీవితంలో ఒక్క సంఘటన కూడా లేనట్టు చూపించటం ఈ కధలో పెద్ద లోటు. అది మనకి హీరో గురించిన ప్రత్యేక నిజమేమీ చెప్పకపోవచ్చు. కానీ అతని కేస్ గురించి అంతా తెలుసుకున్న ఫీలింగ్‌ని ఇవ్వలేకపోయింది.

   ఇన్ని రోజులూ అతన్ని వెంటాడుతున్న బాధతో పాటు కంఫ్యూజన్‌కి గురైనతను అతనికున్న ఒకే ఒక్క ఆధారాన్ని వదులుకోవడం మీకు సబబుగానే తోచిందా? ఏమో నాకలా అనిపించలేదు.

   ఇంక ఆ విత్తనాన్ని ప్రిజర్వ్ చేయటం గురించి. మీరు చెప్పిన లాజిక్‌లో ఆలోచిస్తే ఆ విషయం గురించి అంత ఆలోచించక్కర్లేదు. కానీ అలా జరుగుతాయా అని? పైగా అతని తండ్రి చనిపోతాననుకొని ఎన్ని ఏళ్ళైనా ఉండాలని అలా ప్రిజర్వ్ చెయ్యలేదు కదా.

   తొలగించు
  4. సాయారాం గారు

   మంచి ప్రయత్నం అండి.

   తొలగించు
  5. ఆష గారు ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి.
   హెలూసినేషన్ అని నమ్మట్లేదు కనుకే అతను ఎవరికి చెప్పకుండా దాచాడండీ ఎందుకంటే ముగ్గురిని చంపేవరకూ అతను అరెస్ట్ కాకూడదు కదా అందుకే మూడో వాడ్ని కూడా చంపేశానని ఊహించుకున్న తర్వాతే వెళ్ళి పోలీసులకి సరెండర్ అవుతాడు. ఇకపోతే హీరో ఎవరినిపడితే వాళ్ళని ఊహించుకోవడంలేదు కేవలం ఆ ముగ్గురి గురించి వాళ్ళు తనని ఎక్కడ చంపేస్తారో అని భయపడి వాళ్ళని తనే చంపినట్లుగా ఊహించుకుంటున్నాడు తప్ప వేరే ఇతర హెలూసినేషన్స్ ఏవీ లేవు. హీరోకి ఈ హెలూసినేషన్స్ మొదటిసారి పూనేలో నాజర్ ని చంపినట్లు రెండోసారి హైదరాబాద్ లో కెల్లీని చంపినట్లు మాత్రమే (మధ్యలో తను ఊహ అనుకుంటున్న పునీత్ మర్డర్ నిజమే) సో రెండోసారికే కెమేరాకి దొరికిపోయాడు. అన్నాళ్ళు ఎందుకు ఊహించుకోలేదు అని అడిగితే ఒక వయసు వచ్చాకే అతనికి ఈ జబ్బు వచ్చిందని సమాధానపడవచ్చు... లేదా ఒకవేళ ఊహించుకున్నా అవన్నీ సినిమా కథకి అవసరంలేదు కనుక చూపించలేదు అని కూడా అనుకోవచ్చు.

   ఇక ఆ కెమేరాని పోగొట్టుకోవడం అనేది అతని చేతుల్లో లేదు పోరాటంలో కిటికీలోనుండి లాన్లో పడిపోయింది కెమేరా రెండో రోజు ఉదయం కార్ ఎక్కి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళేప్పుడు కూడా లాన్లో మొక్కల మధ్య ఈ కెమెరా ఉండడం చూపిస్తాడు. ఆ రాత్రి వేళ పోలీసులు వచ్చి చేసే హడావిడిలో కెమేరా ఏమైందో తీరికగ ఆలోచించలేకపోతాడు పైగా ఒక పక్క కెమేరానే లేదు అది కూడా నీ ఊహే అని పోలీసులు చెప్తుంటారు కదా.

   అంత ప్రైవసీ ఉన్న బ్యాంక్ లాకర్లో అలా భద్రపరిచేటప్పుడు సైంటిస్ట్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడండీ ప్రిజర్వేటివ్స్ లో పెట్టినపుడు అవి ఎన్నాళ్ళైనా భద్రంగా కాపాడుతూనే ఉంటాయి... మహేష్ మొదటిసారి ఆ కంటైనర్ ని చేతులో తీసుకున్నపుడు లోపల బ్లూకలర్ లిక్విడ్ మూవ్ అవడం గమనించవచ్చు.

   సుకుమార్ ఎంత ఆలోచించారో తెలియాలంటే ఒకసారి ఈ పోస్ట్ మార్టం ఆర్టికల్ చదవండి. http://www.idlebrain.com/movie/postmortem/1nenokkadine.html

   తొలగించు
  6. వేణుశ్రీకాంత్‌గారు

   మీరు అలా చెప్తుంటే మీ రెండో పాయింట్ కన్వింసింగ్‌గానే అనిపిస్తున్నట్లుందండి. ఇంకొన్ని రివ్యూలు చదివాక నాకర్ధమయ్యిందేంటంటే ఈ సినిమాలో ఒక్కోరు ఒక్కో విషయాన్ని అన్వేషించి సంతృప్తో/అసంతృప్తో పడుతున్నారు. నా వరకైతే అది ఆ చిన్నపిల్లవాడి గురించీ, అతని బాధ గురించీ, అది తీరడం గురించి. చాలా మంది అతని తల్లిదండ్రులను తెలుసుకోక ముందే సినిమా ముగిసిపోయిందని లేదా అలా ఉంటే బావుందని అభిప్రాయపడుతున్నారు. అలా జరిగుంటే ఈ సినిమా నాక'స్సలు' నచ్చుండేది కాదు.
   నాకెందుకు అసంతృప్తి అనిపించిందంటే ఆ బాధతో మిగతా కేరక్టర్స్/కధ వ్యవహరించే తీరు. అందువల్లే ఇంత అసహనమూ, రంధ్రాన్వేషణా చేశాననిపిస్తోంది. 'టేకెన్ ' లాంటి సినిమాల్లో ఆద్యంతమూ ఆఖరి నిమిషంలో ప్రమాదాలు తప్పిపోయే సీన్లు ఉన్నా నాకెప్పుడూ విచిత్రంగా అనిపించలేదు. హీరో కూతుర్ని రక్షించేయాలి అన్న ఆత్రం అవన్నీ మరిచిపోయేలా చేసింది. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్ దగ్గరనుండీ గోవాలో హీరోయిన్ ఎపిసోడ్ వరకూ సన్నివేశాలు, పాటలూ చికాకును కలిగించాయి. వాటి బదులు ఈ హీరోయిన్‌నే అతని ఫ్లాష్ బేక్‌లో పెట్టి అతని గురించి ఇంకొంచెం చెప్పొచ్చు కదా అనిపించింది.

   ఇంతకీ నేను చెప్పాలనుకున్నదేమిటంటే ఇందులో తప్పులను సమర్ధించడానికో(నేను కూడా అలా చేశానండి కొన్ని సినిమాలకు)లేదా అంతలా నచ్చడానికో మీకు పలు కారణాలున్నాయి. కానీ నాలాంటి ప్రేక్షకురాలికి అలాంటి కారణాలు లేకపోవడం మూలంగా అంతగా నచ్చలేదు. అతని ఇంటర్వ్యూ చదివానండీ. అతని ఐడియాస్ బావున్నాయి.

   తొలగించు
 4. గుడ్ వన్ సాయారాం గారు... బాగా చెప్పారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Gautam gatham anthaa choopinchadaaniki idi cinema ( not a serial ).

  ప్రత్యుత్తరంతొలగించు