13, జనవరి 2014, సోమవారం

క్షమించు తెలుగు సినిమా !!


హీరో అంటే తోడ కొట్టుడు
కామెడియన్స్ ను కొట్టుడు
వంద మందిని నరుకుడు
హీరోయిన్ను ముద్దడుడు
అని ఫిక్స్ అయిపోయాము
నీ నటనతో పాత్రకు ప్రాణం పోసి
నీ ప్రాణమంత పెట్టావు
అందుకే మాకు నచ్చలేదు !
క్షమించు మహేష్

తెర మీద రక్తం పారాలి
తలలు ఎగిరి పడాలి
హీరోయిన్ బొడ్డు, తొడలు
నిగ నిగ లాడాలి
అని అలవాటయిన కళ్ళకు
నీ కెమెరా చూపిన నిజాలు, అందాలు
నచ్చలేదు ! క్షమించు రత్నవేలు

పంచ్ డైలాగులు
బూతు మాటలు
ప్రాసకోసం పాకులాట
కామెడీ పేరుతొ కొతులాట
ఇదే మాకు అలవాటయిన ఆట
స్వచ్చమయిన మాటలు
సరళ మయిన బాష
మాకు ఎబ్బెట్టుగా అనిపించాయి !
క్షమించండి రచయితలు

చావు డప్పులు
రణ గోణ  ధ్వనులు
చెవులు చిల్లులు పడే మోతలు
మరిగిన మాకు, సన్నివేశానికి
ప్రాణం  పోసిన నీ సంగీతం
సరిపోలేదు !
క్షమించు దేవి

నమ్మిన కథకు న్యాయం
నవ్యతకు నాంది
తెలివికి పదును
మర్చిపోయాము
సినిమా అంటే నవ్వటమే అని
నేర్చుకున్నాము
నీ ఓర్పు, నీ నేర్పు
మాకు మింగుడు పడలేదు !
క్షమించు సుకుమార్

పిచ్చి సినిమాకు రివ్యూ లు రాసి
వాటినే కొలమానంగా చూసి
మా అజ్ఞానాని కప్పిపుచ్చలెక
1 గొప్పదనం తెలియక
చెత్తవాగుడు వాగేసి
ఏదో రివ్యూ రాసేసాము
మీ ఉన్నత ప్రయత్నం వెనుక
ఆరాటం, పోరాటం తెలియలేదు !
క్షమించండి నిర్మాతలు

పరాయి సినిమాలు అవార్డ్స్ కొడుతుంటే
వారికి  పరపతి ఎక్కువ అని అక్రొశించము
కాని కొత్తదనానికి మేము ఇచ్చే గౌరవం
తెలుగు సినిమాను సిగ్గుపడేలా చేస్తోంది
క్షమించు తెలుగు సినిమా తల్లి