25, నవంబర్ 2013, సోమవారం

కన్నతల్లి తెలంగాణ !!కన్నతల్లి తెలంగాణ
అందుకో ఈ నివేధన
జరుగని నీ  విమోచన

అన్యాయమయిన అక్షరాలు చేరి
ఉద్యమా గీతాలు రాయనివ్వు
బీడు భూమిలో మోడయిన  రైతు
ని సాధనలో మొలకెత్తనివ్వు
కాటికై  చాపిన  మూడు కాళ్ళు
ధీటుగా నిలువ నివ్వు
గొప్యంగా ఉండే గొబ్బెమ్మలు
వెలుగు చూడనివ్వు
పోరులో సాగనివ్వు

లింగ బేధం లేకుండా
కులం మతం అడ్డు రాకుండ
వయసుతో పని లేకుండా
సంఘి భావనతో సాగాలి పోరు
సమైఖ్య కట్లు తెంచాలి ఈ జోరు

సగం కాలిన కడుపులు
ఇలాగె మండనివ్వు
మా అవమానాలు
ఉప్పెనగా మారనివ్వు
ఈ కన్నీరుకు కట్టలు వేయకు
ఈ నెత్తురుకు శాంతం నేర్పకు

ఈ మనసుకు ఓపికను పంచకు
ఈ ఒంటిని అలసటలో ముంచకు
నిన్ను చేరే వరకు నిద్రను చేర్చకు
మా పట్టుదల మార్చకు

కన్న తల్లి తెలంగాణ
అందుకో ఈ నివేధన
తిర్చరావా ! నీ బిడ్డల వేదన !!వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి