30, సెప్టెంబర్ 2013, సోమవారం

హిట్టుకు దారేది?

(ఈ పోస్ట్ ప్రమాదవశాత్తు డిలీట్ అయిపోయింది.  కష్టపడి ఎలాగో బ్యాకప్ నుండి తెచ్చాను కాని స్పందనలు తేలేక పోయాను)

యాదగిరి పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్. వీడు ఎడ్డెం అంటే  తడ్డెం అనే  స్నేహితుడు రాము.  ఇద్దరు కలిస్తే ఎ విషయం మిద అయిన గంటలు గంటలు కొట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్యే వచ్చిన అత్తారింటికి దారేది సినిమా మీద వీళ్ళ చర్చ ఎలా సాగిందో చూద్దాం. 

యాదగిరి: ఒరెయ్ మామ పవర్ స్టార్ సినిమా చూసావా ?

రాము: ఏది గుడుంబా శంకర్? ఈ మధ్యే టివి లో వచ్చింది.

యాదగిరి: అరేయ్ ఓ ! అది కాదు రా బై. కొత్త సినిమా, అత్తారింటికి దారేది. 

రాము: ఓ అదా ! ఫస్ట్ హాఫ్ ఒక్కసారి చూసినా సెకండ్ హాఫ్ రెండు సార్లు చుసిన. 

యాదగిరి: మైండ్ దొబ్బింద ? సెకండ్ హాఫ్ రెండు సార్లు చూసుడు ఏందీ?  

రాము: మొన్ననే టీవీ లో గుడుంబా శంకర్ చూసినా.  సెకండ్ హాఫ్ అంత గుడుంబా శంకర్ లెక్కనె ఉంటది కదా. అదే పవన్ కళ్యాణ్ వేషాలు, గట్లనే పాటలు పాడుడు. 

యాదగిరి: అరేయ్ ! అది పవర్ స్టార్ స్టైల్. 

రాము: అదే స్టైల్ ఎన్ని రోజులు చేస్తాడో ఇంకా. ఎ సినిమా చూడు అదే అక్టింగ్ అదే గంతులు. 

యాదగిరి: అయినా సినిమా హిట్ అయ్యింది. 

రాము: అంతేరా టైం బాగుంటే. ఆకలి మీదా ఉన్నోడికి చద్దన్నం పెట్టిన బిర్యానీ లేక ఉంటది. 

యాదగిరి: బాబు నెట్ లా సగం సినిమా పెట్టిన కుడా అన్ని కలెక్షన్స్ చేసింది. 

రాము: అవునా ? నెట్ లా ఇంతకూ ముందు ఎ  సినిమా రాలేదా?  దేనికి అంత హంగామా చేస్తున్నారు ! 

యాదగిరి: అంటే నువ్వు పైరసి సపోర్ట్ చేస్తున్నావా? 

రాము: నేను పైరసిని సపోర్ట్ చెయ్యటం కాదు. నెట్ లో వచ్చిన కూడా అన్ని కలెక్షన్స్ చేసింది అంటుంటే అడుగుతున్నా. 

యాదగిరి: అర్ధం కాలే? 

రాము: ఇంతకూ ముందు మగధీర, దూకుడు ఇంకా ఎన్నో సినిమాలు ఒక్కరోజులో నెట్ లో వచ్చినయ్, అవ్వి కూడా కలెక్షన్స్ ఇరగ దిసినయ్. మరి దీనికి ఎందుకు అంత హంగామా అంటున్నా. 

యాదగిరి: అట్లా కాదురా సినిమా బాగుంది. 

రాము: ఫస్ట్ హాఫ్ ఇంట్లో హీరో సెట్ కావటానికి పోయింది. అక్కడక్కడ కాస్త కామెడీ పేలింది బోర్ కొట్టలేదు. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం పెళ్లి కొడుకుని తేవటానికే సరిపోయింది. మిగతాది ఏదో నాటకం సిన్ కోసం  పోయింది.

యాదగిరి: అంటే నీకు ఎం కావాలి మరి? జోక్స్ ఉన్నాయా లెవా?

రాము: ఏదిరా జోక్? నాటకం సిన్ జోకా? పక్కొన్ని కొడుతూ కామెడీ అనుకొమ్మని వాళ్ళు తియ్యటం మనం నవ్వటం. మళ్ళి దానికి 15 నిముషాలు బొక్క. 

యాదగిరి: డైలాగులు బాగున్నాయ్ కదా ?

రాము: అందరు బ్యాంకాక్ లేదా ఏదో పుణ్య క్షేత్రాలు పోయి స్టొరీ రాస్తుంటే త్రివిక్రమ్ పాపం జూ కి వెళ్లి రాసినట్లు ఉన్నాడు. 

యాదగిరి: ఏంట్రా నువ్వు అనేది ?

రాము: ఎప్పుడు చూడు సింహం, పులి, పాము అని హీరో తన గురించి తానె చెప్పుకుంటూ ఉంటాడు. 

యాదగిరి: పంచ్ పెలిందా లేదా? 

రాము: ఏది పంచ్ ! సింహం నేను ఒక్కటే గడ్డం గిసుకోవటమే తేడా? ఇదా !  పబ్బు, సబ్బు అని ఏదో తల తోక లేకుండా చెపుతాడు,  ఆ డైలాగ ? 

యాదగిరి: ఒరేయ్ పైట్స్ అదిరి పోయాయి. 

రాము: నిజమే రా. ఒక్కప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా బాగా లేక పోయిన పైట్స్ బాగుండేవి. ఇప్పుడు మాత్రం బెదర గొట్టాడు. 

యాదగిరి: చెప్పేది సరిగా ఏడువు. 

రాము: ఫస్ట్ ఫైట్ లో ఆపిల్ తో కొట్టి మెషిన్ గన్స్ ఉన్నా విలన్స్ ను చంపేస్తాడు. ఇంటర్వెల్ తర్వాత ఫైట్ చాల సార్లు చాల మంది హీరోలు చేసారు నా చిన్నప్పుడు,  దేన్నో చూపించి దాన్ని పట్టుకుంటే నన్ను ఓడించినట్లే అని. ఇంకా కళ్ళద్దాల కోసం గుండాలు పడిపోతూ ఉంటె పాపం పవన్ కళ్యాణ్ స్టైల్ గా కళ్ళద్దాలు కాపాడుకుంటుంటే నా సామీ రంగా అదిరిపోయింది ఫైట్. 

యాదగిరి: అరేయ్ ఏందిరా. సినిమాను సినిమా లెక్క చూడల. క్లైమాక్స్ ఎంత బాగుంది. 

రాము: నిజమేరా. ఇప్పుడు ఎ పార్క్ కు వెళ్ళిన, లేక బస్సు స్టాండ్ పోయిన, రైల్వే స్టేషన్ పోయిన ఎప్పుడు ఎవరు కోనేస్తారో అని భయంగా ఉంది. 

యాదగిరి: అబ్బా అపురా ! అది సినిమా రా బై. ఎంత ఫీల్ ఉంది క్లైమాక్స్ ల. 

రాము: నిజమే రా క్లైమాక్స్ బాగుంది. కాని చాల పెద్దగా అయింది. నాకే అనిపించింది, పవన్ కళ్యాన్ అక్టింగ్ చూసి తొందరగా ఒప్పుకో తల్లి నదియా అని. 

యాదగిరి: అయితే ఏంట్రా మా హీరో కు ఉన్న క్రేజ్ ఎ హీరో కు లేదు. అవతార్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. 

రాము: ఏంట్రా అవతార్ రికార్డ్స్ బద్దలు కొట్టిందా? నా దగ్గర అన్నావ్ కాని భయట అంటే పిచాస్సుపత్రిలో చేరిపిస్తారు. 

యాదగిరి: నిజం మామ ఫేస్బుక్ లో చుసిన. 

రాము: ఒరేయ్ అయ్యా ! నీలాంటి పిచ్చి ఫాన్స్ పెట్టింది నమ్మి మోసపోకు. ఇంకా మాట్లాడితే పవనిసం వర్డ్ ను ఆక్స్పర్డ్ డిక్షనరీ లో చేర్చారు అని కుడా అంటారు. 

యాదగిరి: సరే రా నమ్మను గాని  త్రివిక్రమ్,  పవన్ కళ్యాణ్ హిట్ కాంబినేషన్ మామ. ఎంతయినా త్రివిక్రమ్ ఫుల్ టాలెంట్. 

రాము: నిజమే రా. హాలీవుడ్ సినిమాలు చూసి సిన్లు లేపేసి తన సినిమాల్లో వాడుకోవటం గొప్ప టాలెంట్. 

యాదగిరి: ఎవరు కాపీ కొడుత లేరు? రాజమౌళి లాంటి డైరెక్టర్ నాకు త్రివిక్రమ్ అంటే భయం అన్నాడు. 

రాము: అయన చెప్పింది ఒక్కప్పటి త్రివిక్రమ్ గురించి. అత్తారింటికి దారేది త్రివిక్రమ్ గురించి కాదు. ఒక్కపుడు త్రివిక్రమ్ సినిమా అంటే కథ ప్రకారం నడిచేది. కాని ఇప్పుడు హిట్ కోసం నడుస్తుంది. 

యాదగిరి: హిట్ సినిమా తియ్యక ఫ్లాప్ సినిమా తీస్తారా? 

రాము: హిట్ సినిమానే తియ్యాలి. కాని దాని కోసం కథను త్యాగం చెయ్యకూడదు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ఒక సాదా సిద డైరెక్టర్ లా పిచ్చి పేరడీ కామెడీ తీసి హిట్ కొట్టాడు. సింహం ఎలుకను చంపితే గొప్ప కాదు. 

యాదగిరి: అందరు డైరెక్టర్లు అలాగే తీస్తున్నారు. 

రాము: మరి రాజమౌళి త్రివిక్రమ్ కు భయపడవలసిన పని లేదు. త్రివిక్రమ్ గొప్ప టాలెంట్ అని చెప్పనవసరం లేదు. 

యాదగిరి: హాలీవుడ్ లో రికార్డ్స్ మోత మోగుతుంది. 

రాము: దూకుడు మోతకి అక్కడి ఇంగ్లీష్ పేపర్స్ ఆర్టికల్స్ రాసాయి. 

యాదగిరి: నీకు కుళ్ళురా మహేష్ సినిమాను దాటేసింది అని. 

రాము: ఓరి వెర్రి సన్నాసి. రోజు రోజు మార్కెట్ పెరుగుతుంది కాని తగ్గటం లేదు. ఇంకా డాలర్ వేల్యూ పెరుగుతూనే ఉంది. కలెక్షన్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి దాని గురించి బాధ లేదు. 

యాదగిరి: మరి నీ భాదేంటి బాబు?

రాము: మాములు సినిమాను కళ ఖండం అని ప్రచారం చేసి తెలుగు సినిమా పరువు తియ్యదు అంటున్నా. 

యాదగిరి: ఈ మధ్య వచ్చిన కళ ఖండం ఏంటో చెప్పు? 

రాము: కళ ఖండాలు కాదు గాని  మంచి సినిమాలు  బొమ్మరిల్లు, మగధీర, గమ్యం, ఆ నలుగురు గిట్లంటివి. 

యాదగిరి: అంటే ఇప్పుడు అత్తారింటికి దారేది మంచిగా లేదు అంటావ్?

రాము: హిట్ కు దారేది అంటాను. వెంకి, బలుపు, దూకుడు అన్ని ఒక్క బాపతే. 

(సమాప్తం)