4, ఆగస్టు 2013, ఆదివారం

ఆంధ్రులు మారాలి

ఎక్కడ నుండిమొదలు పెట్టాలో  ఎక్కడ ముగించాలో తెలియని సంకట స్థితిలో రాస్తున్నాను దిన్ని. కాని కొందరు ఆంధ్ర సోదరుల అజ్ఞానం, అహంకారం ఇది రాయటానికి మూల కారణం. వాళ్ళు  చెప్పేది ఒక్కటే "తెలంగాణ అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ వృద్ది లోకి వచ్చింది ఆంధ్ర వాళ్ళ వల్ల" ఇది వినగానే నాకు మొదట వచ్చేది నవ్వు, తర్వాత ఆవేశం.  ఎంతటి అమాయకత్వం, ఎంతటి అహంభావం.

ఈ ఉద్యమాలు, అన్యాయాలు నాకు పెద్దగా పట్టావు, స్వరాష్ట్రం వల్ల ఎవరికీ ఎంత లాభం అని నేను చెప్ప బోవటం లేదు. కాని ఒక ప్రాంతం ప్రజల మీద, వారి సంస్కృతీ మిద చులకన భావం ! వారు అసలు నాగరికులు కాదు, మేమే వారిని ఉద్దరించం అనే అహంకారం మిద నా ఆక్రోషం. తెలివయిన వారు, తెలివి తక్కువ వారు ప్రతి ప్రాంతంలో ఉన్నారు, ప్రతి దేశం లోను ఉన్నారు. ఒక్కరి, ఇద్దరి  ప్రతి పాదికన జాతి మొత్తన్ని చులకన చేయటం ఆవేశాన్ని రగిలిస్తుంది. 

కొందరు హద్దు మిరి పలుకుతుంటారు "మీకు పెరుగన్నం తినటం నేర్పింది మేమే" అని. ఎంత బలుపు కాకపోతే, తెలంగాణకు  పాడి పంటలు ఉన్నాయి అన్న సంగతి తెలియదా ? లేక వారి అజ్ఞానమా? చరిత్ర తెలిసిన ఎవరయినా తెలంగాణా నాగరికత లేని ప్రాంతం అని చెప్పగలరా? పోతన వ్యవసాయం చేస్తూ, పాడి చూసుకుంటూ కావ్యాలు రాసే వాడు అని చదువు కోలేదా?  ఇక పోతన, శ్రీనాథుడి మధ్య వ్యత్యాసం చెప్పనలవి కాదు.  అసలు బిర్యానీ వండటం, దాని రుచి చూడటం మొదలు పెట్టింది తెలంగాణ. దాన్ని వండే విధానం తెలిసిన ఎవరయినా పెరుగు లేనిదే బిర్యానీ లేదని తెలుసుకుంటారు. ఇక్కడ నేను చెప్పదలచుకుంది బిర్యానీ రుచి ముందు ఎవరు చూసారు అని కాదు. ఎవరి  ఆహారపు  అలవాట్లు వారికీ ఉన్నాయి అవి వారి  వంటలను నిర్దేశించాయి.  

కొందరు తెలివి తక్కువ ఆంధ్ర వారు (ఇప్పటి యువకులు సైతం) తెలంగాణా వారికి తినటం రాదు, మేము నేర్పిన అలవాట్లు అని తెగ నిలుగుతూ ఉంటారు,  వారి గురించి ఇది చెప్పటం. నా ముందే ఒక సంఘటన జరిగింది. ఒక మెస్ లో సంబారు వడ్డించారు, అది నాకు కూడా నచ్చలేదు. కాని నేను ఏదోలే అని తింటున్నాను. ఎవరో యువకుడు సంబారు వడ్డించే వాణ్ణి పిలిచి "ఏంటి ఈ సంబారు ఇంత చండాలంగా ఉంది ! తెలంగాణ వాడు అనుకున్నావా?" అని ప్రశ్నిస్తున్నాడు. నేను అతనితో తగువు పెట్టుకున్నాను. అసలు సంబారు బాగా లేని దానికి, తెలంగాణకు సంభందం ఉందా ? ఏమిటి ఇంతటి దురబిప్రాయం ? అలాగే నేను ఆంధ్ర లో బిర్యానీ తిన్నప్పుడు  హైదరాబాద్ బిర్యానీ తో పోల్చితే నాకు ఏ  మాత్రం నచ్చలేదు. ఒక్క హోటల్ ప్రతిపాదికన ఆంధ్రవారికి బిర్యానీ చేయటం చేతకాదు అని చెపితే మూర్కత్వం అవుతుంది. 

తెలంగాణ వారికీ మాట్లాడటం రాదు, వారి భాష అంత కటువుగా ఉంటుంది అంటారు. కాని తెలంగాణ వారు పలికించెది మనసును కాని లౌక్యాన్ని కాదు. అందుకే అంతటి కరుకుతనం, కాని స్వచ్చదనం. ప్రతి మాండలికంలో ఒక అందం ఉంటుంది. అలాంటిదే తెలంగాణ మాండలికం. దాన్ని పట్టుకుని సినిమా రచయితలూ విలన్ల భాష గా చెలామణి చేస్తే దాన్నే అందరు నమ్మేసారు, తెలంగాణ భాషనే హేళన చేసేసారు. ఎంత దారుణం ! ఒక బాష మిద, సంస్కృతీ మిద ఇంత దాడి జరగటం మొఘలులా కాలం తర్వాత  బహుశ ఇదే ప్రధమం, చివరి అయి ఉంటుంది.

మా ఉరికి దగ్గరలోనే ఒక ఉరు ఉంటుంది. ఇటుకలు తయారు చేయటానికి వచ్చిన ఆంధ్రవారు కొద్ది రోజులకు వ్యవసాయ కూలీలుగా పని చేసి, తర్వాత భూములు కొని వ్యవసాయం మొదలు పెట్టి, ఉరిలో చాల మంది వచ్చి చేరారు. ఆ ఉరికి ఏదో తెలంగాణా పేరు ఉంటె, కొన్ని రోజులకు వీళ్ళంతా కలిసి దాని పేరు ఆంధ్రనగర్ అని మార్చేసారట  (ఇది నా ముందు జరిగిన సంఘటన కాదు కాబట్టి "అట" అంటున్నాను). ఎంతటి అన్యాయం ?   ఒక ప్రాంతానికి ఒక సంస్కృతీ ఉంటుంది, దానికి తగ్గట్టుగా కొన్ని పేర్లు చెలామణి లో ఉంటాయి, ఉర్లకయినా, మనుష్యులకయినా. దాన్ని కాలరాసి వీళ్ళు "ఆంధ్ర నగర్" అని పేరు పెట్టేసారు. అంటే ఇక్కడి ప్రజలు చేతగాని దద్దమ్మలా? అమెరికాలో సైతం ఒక విధి పేరు మార్చటానికి ఇంత శాతం అనుకూలంగా  ఓట్లు వస్తేనే దాని పేరు మారుస్తాం అని నిభందనలు ఉంటాయి. కాని ఇక్కడ ఓట్ల కోసం, నోట్ల కోసం తెలంగాణ సంస్కృతిని, పేర్లని తుంగలో తోక్కేసారు నాయకులూ. అతి తెలివయిన ఆంధ్ర వారు దాన్ని బాగా ఉపయోగించుకున్నారు.

నదులు, గనులు, వాతావరణం, సహజ సంపద ఎందులో చూసుకున్నా తెలంగాణదే పై చేయి. అందుకే ఆంధ్రవారు మా ఉళ్ళలొకి కూలీలుగా వచ్చి బ్రతుకు తెరువు కొనసాగించారు, కోన సాగిస్తున్నారు. అలాంటిది తెలంగాణ అభివృద్ధి ఆంధ్రుల వల్ల జరిగింది అనటం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరంచటం లాంటిది.  హైదరాబాద్ చరిత్ర తెలియని వారు, మూర్కులు మాత్రమే మేము డెవలప్ చేశాం అని వీరంగాలు పలుకుతారు.

ఎప్పటిది ఉస్మానియా యూనివర్సిటీ? ఎప్పటిది ఉస్మానియా హాస్పిటల్? ఎప్పటిది ఉస్మానియా మెడికల్ కాలేజి? చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయి తెలంగాణా అభివృద్ధి చిహ్నాలు నిజాం సంస్థానానికి రాజదాని అయిన హైదరాబాద్ అభివృద్ధి ఇప్పటిది కాదు  (కింద ఇచ్చిన జాబితా చదివితే నోరు వేల్లబెట్టటం ఖాయం). కాలానుగుణంగా నూతన హంగులు దిద్దుకుంది తప్ప ఎవరో పని కట్టుకుని హైదరాబాద్ ను అభివృద్ధి చెయ్యలేదు.  అందరు బ్రతకటానికి వచ్చి ఇక్కడి బాష ను, సంస్కృతిని చులకన చేసి,  ప్రత్యెక తెలంగాణ పట్టని నాలాంటి వారిని సైతం ప్రేరిపించింది ఎవరు? ఆంధ్ర్రుల పొగరు కదా? అందుకే ఆంధ్ర సోదరులు ఇకనయినా మారండి.

 తెలంగాణా వచ్చిన, రాక పోయినా నేను చెప్పేది ఒక్కటే.  సాటి బాషను గౌరవించండి, సంస్కృతిని కాపాడండి. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలూ హేళన చేయటం అపెయ్యండి. ఇది మా రక్తం, ఇది మా పిత్రార్జితం.


కింద ఇస్తున్నా జాబితా చూస్తే తెలుస్తుంది  ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణా అభివృద్ది: 

INDUSTRIES: Singareni Colleries (Year 1871), FirstSpinning Mill (1873), Phirani Factory (1876), Govt.Printing Press (1876), Soda Factory (1910), IronFactory (1910), Deccan Button Factory (1916), VSTFactory (1919), Chemical Laboratory (1921), DeccanGlass Factory (1927), DBR Mills (1929), Azam JahiMills (1931), RTC (1932), Nizam Sugar Factory (1937),Sirpur Paper Mill (1939), Golconda Cigarette Factory(1941), Hyderabad State Bank (1942), HyderabadAllwyn Metals (1942), Praga Tools (1943), Sirsilk(1946), Hyderabad Asbestos (1946), HyderabadLamination Products (1947).

DEPARTMENTS: Revenue (1864), Customs (1866),Formation of Districts (1866), Health (1866), Printing& Stationery (1867), Endowments (1867), Forest(1867),Municipal (1869), Public Works (1869),Education (1870), High Court (1870), SurveySettlement (1875), Land Settlement (1876), PopulationCensus (1881), Excise (1882), Police (1883), Mines(1892), Industries and Commercial (1892), Local Fund(1893), Irrigation (1896), State Life Insurance Fund(1911), City Improvement Board (1912), Agriculture(1913), Hyderabad Civil Service (1913), Archaeology(1914), Akasha vani (Radio) (1932), Labour (1945).

SCHOOLS, COLLEGES, UNIVERSITIES : DarulUloom School (1856), Chadarghat School (1872),Mufi-dul Anaam School (1879), Alia School (1879),Secunderabad Mahboob College (1884), Nizam College(1874), Nampally Girls School (1887), Warangal(Telugu) School (1890), Asafia School (1894), MedicalCollege (1894), Viveka Vardhini School (1904),Mahboobia Girls School (Gunfoundry) (1910), CityCollege (1920), Osmania University (1920), OsmaniaMedical College (1921), Hyderabad Public School(1923), Marwadi Hindi Vidyalaya (1924), HindiVidyalaya Secunderabad (1926), Physical EducationCollege (1930), College of Veterinary Science (1946).Koti Womens College, Nampally Womens College.

LIBRARIES: Mudigonda Shankaradyula library,Secunderabad (1872), Asafia State Central Library(1892), Bharat Gunvardhak Library, Sha-ali-banda(1895), Bollaram Lirbary (1896), Sri KrishnadevarayaLibrary, Sultan-bazar (1901), Raja Raja NarendraLibrary, Hanamkonda (1904), Vignana ChandrikaLibrary (1905), Pratapa Rudra Library, Warangal(1913), Samskruta Kala Vardhini, Secunderabad (1913),Bala Saraswati Library (1923), Jogipeta Library, Medak(1930)

LAKES, BRIDGES, AND HISTORICAL BUILDINGS: Hussainsagar Lake (1562), Puranapool(1578), Charminar, Gulzar House, Char Kaman (1589-91), Saroornagar Colony (1793), Sultan-shahi Mint(1803), Miralammandi (1805), Miralam Lake (1806),Bristish Residency Bhavan (1808), Chandulal Baradari(1828), Chadarghat Bridge (1831), Afzal-gunj Bridge(1859-66), Post Offices (1862), Public Gardens (1873),Falaknuma Palace (1884), Chanchalguda Jail (1882),Muslim-Jang Bridge (1884), Hanuman Vyayamasala(1893), Raj Bhavan, High Court Building (1920),Osmansagar Gandipet (1920), Himayatsagar Anacut(1927)

CEMENT ROADS : Construction of cement Roadsin Hyderabad 1930

RAILWAY LINE: Bombay to Raichur (1866),Mumbai -Secunderabad (1873), Nizam Railway Board(1874), Nampally Railway Station (1883)

TELEPHONE NETWORK: NizamiaObservatory Telescope (1890)

DRAINAGE SYSTEM AND FLOOD CONTROL MECHANISM: Underground Drainage System(1909), Sir Mokshagundam Visvesvaraya, Prepared a Scheme for Flood Protection work and undergrounddrainage for Hyderabad City.

HOSPITALS: Ayurveda, Unani Hospital (1890),Medical College (1894), Mental Hospital Erragadda(1897), Gigjikhana Victoria Memorial Nursing Home(1905), Homeopathy College (1916), Charminar UnaniAyurvedic Hospital (1927), Niloufer Hospital (1925),Osmania General Hospital (1945). Gandhi Hospital, TBHospital, Cancer Hospital, ENT Hospital, NizamOrthopaedic Hospital, Koranti Hospital, NIMS.