21, జూన్ 2015, ఆదివారం

తండ్రి మనసునువ్వు పుట్టింది మొదలు
నాలో పెద్దరికాన్ని లేపావు
నా భాద్యతను పెంచావు
నా భాల్యం తిరిగి తెచ్చావు
నన్ను నా తండ్రిని చేశావు

నా మనసుకు కలవరం
ఏదో తెలియని పలవరం
నన్ను ముంచింది
పెద్దవాడినన్న బెంగ తోలచింది
నీ బోసి నవ్వు ముందు
నా యవ్వనం అలసింది
తండ్రి నన్న గర్వం గెలిచింది

పని నుంచి ఇంటికి రాగానే
నన్ను అంటుకు తిరిగే నువ్వు
క్షణ కాలం కానరాక పొతే
ప్రాణాని కై వెతుకులాట
తట్టుకోలేను రా నీ దోబూచులాట

విసుగు తో నాన్న మందలిస్తే
మనసు చిన్న చేసుకోకు
నాన్నను మర్చి పోకు
నాన్న ప్రాణం నీలో ఉంది
నువ్వు లేకుంటే
నాన్నకు ఇంకేముంది

మాయదారి జ్వరం నీకు సోకినపుడు
మీ అమ్మ శోకం లో మునిగినప్పుడు
నాన్న దైర్యం చూసి అబ్బురపడకు
మీ అమ్మను మభ్యపెట్టి
ఎన్ని దేవులకు మొక్కనో
ఎన్ని దురలవాట్లు వదిలేసానో
నీ పసి మనసుకు తెలుపలేను
నువ్వు నీరసిస్తే క్షణం నిలవలేను

నువ్వు తప్పు చేస్తే మందలించి
మొండిగా ఉంటె దండించి
నేనంటే భయం పెట్టింది
నా గొప్ప కోసం కాదు
దాంట్లో ఎ సంతోషం లేదు
నీతో ప్రేమగా ఉన్నా క్షణం ముందు
దేనికి విలువ లేదు

నువ్వు ఎందులో వెనుకబడ్డ
నేను ఓడిపోయినా భావన,
నువ్వు దిగులు పడితే
నాలో పట్టుదల,
పెరిగి పోతాయి !
నీకు అన్ని  అందించాలని
నీకై ఎన్నో సాదించాలని
నాన్న ఇంటి పట్టున లేడని
ఆపార్ధం చేసుకోకు
నువ్వంటే ఇష్టం లేదని అనుకోకు

నాకన్నా నువ్వు గొప్పగా ఉండాలని
కోరినవన్నీ నీకు దొరకాలని
నీకు దొరకకుండా యంత్రంగా మారాను
కాని మనసు లేని యంత్రాన్ని కాను
నువ్వు లేకుంటే
నా జీవితంలోకి రాకుంటే
ఈ నాన్న ఇలా ఉండేవాడు కాదు
ఏ  మాత్రం ఎదిగే వాడు కాదు

నా కన్నా గొప్పగా ఎదగాలని
నిండుగా నువ్వు వెలగాలని
నన్ను మించిన తండ్రివి కావాలని
ఈ తండ్రి ఆశ
తీరుస్తావు కదూ !!7 వ్యాఖ్యలు:

 1. తండ్రి మనసును అద్భుతంగా ఆవిష్కరించారు సాయారాం గారు. ఒక్కో వాక్యం మనసును హత్తుకుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "నువ్వు ఎందులో వెనుకబడ్డ
  నేను ఓడిపోయినా భావన
  నువ్వు దిగులు పడితే
  నాలో పట్టుదల పెరిగి పోతాయి
  నీకు అన్ని అందించాలని
  నీకై ఎన్నో సాదించాలని
  నాన్న ఇంటి పట్టున లేడని
  ఆపార్ధం చేసుకోకు
  నువ్వంటే ఇష్టం లేదని అనుకోకు"

  మాటల్లేవ్

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాకన్నా నువ్వు గొప్పగా ఉండాలని
  కోరినవన్నీ నీకు దొరకాలని
  నీకు దొరకకుండా యంత్రంగా మారాను

  చాల బావుందండి ... నిజంగా మాటల్లేవ్

  ప్రత్యుత్తరంతొలగించు
 4. poetry chadavatam alavaatu lekapoinaa timepass kosam chaduthunte mee post kanipinchindi... nijam gaa awesome.... asalu no words bhayaa :) :) :)

  ప్రత్యుత్తరంతొలగించు