20, జులై 2013, శనివారం

కోపం ఎందుకు ? ఎలా ఉండాలి ?

(మొదటి సారి ఒక విషయం మీద, నాకు ఉన్నా మిడి మిడి  జ్ఞానం తో వ్యాసం రాసాను. ఎలా ఉందో చెప్పమని మనవి చేసుకుంటున్నాను)


కోపం అనేది ప్రతి మనిషికి, లేదా జంతువుకి ఇంకా చెప్పాలంటే ప్రాణం ఉన్నా ప్రతి జీవికి సహజ సిద్దంగా ఉద్బవించే భావము లేదా మానసిక స్థితి.  జంతువులూ ఇంకా ఇతర ప్రాణం ఉన్నా జీవుల గురించి మనకు (నాకు)  పెద్దగా తెలియదు కాబట్టి మనుష్యుల గురించి మాట్లాడుతాను. అసలు కోపం అనేది ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలు ఏమిటి? 

ఎవరయినా వ్యక్తీ తనకు అనుకూలంగా లేని పరిస్థితులు ఎదురయినప్పుడు, లేదా నచ్చని విషయాలు విన్నప్పుడు లేదా చూసినప్పుడు  పుట్టుకు వచ్చే గుణము కోపం. అయితే ఈ కోపం ఒకే విషయానికి  ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉంటుందా? కోపం చూపించే స్థాయిలో  అసలు తేడాలు ఎందుకు ?

ఉదాహరణకు ఒక వ్యక్తీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు లేదా ఎవరో వ్యక్తీ తప్పుగా నడుపుతూ అతనికి దారి ఇవ్వలేదు. అంతే అతని కోపం నషాళానికి ఎక్కి పోతుంది. ఎదుటి వ్యక్తీ ని బండ బూతులు తిడుతూ లేదా ట్రాఫిక్ ను ఇంకా దేశాన్ని అడిపోసుకుంటూ తన అక్కసునంత వెళ్ళగక్కుతాడు. ఇదే పరిస్థితికి మరో అతను పెద్దగా స్పందించడు, లేదా మరి అంత తీవ్ర స్థాయిలో కోపం చూపడు. ఎందుకు?

ఆయా వ్యక్తుల తాలుకు మానసిక స్థితి, మరియు వారి స్వభావం ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు మొదటి వ్యక్తీ అప్పటికే పని చేసి అలసి పోయి ఇంటికి వెళ్తూ  ఉండాలి లేదా పనికి లేటుగా అయినా వెళ్తూ ఉండాలి. రెండవ వ్యక్తీ ఏదో పార్టి నుండి హాయిగా గడిపి లేదా ఏదో శుభవార్త విని  సంతోషంగా వస్తున్నాడు అనుకుందాం. అప్పుడు అతని కోపం మొదటి వ్యక్తీ అంత తీవ్ర స్థాయిలో ఉండదు. అంటే మన ప్రస్తుత  కోపం స్థాయిని నిర్ణయించేది మన  గడిచిన లేదా ఉన్నా  పరిస్థితులు !  అదే కాకుండా వ్యక్తుల స్వభావం సైతం ఆయా పరిస్థితులకు వారి వారి కోపం స్థాయిని నిర్ణయిస్తుంది. 

ఎవరయినా వ్యక్తీ అతి పోటి తత్వం ఉండి ఎదుటి వారు దారి ఇవ్వక పొతే నిప్పులు కక్కుతాడు.  ఎందుకంటే ఇతను రోడ్డు మీద ప్రతి ఒక్కరితో పోటి పడుతాడు, అందరికంటే ముందు వెళ్ళాలని తాపత్రయ పడుతాడు. ఉదా: త్రీ ఇడియట్స్ లో బొమ్మన్ ఇరానీ పాత్ర తీసుకోండి.  ఇంకో రకం ఏంటంటే తనను తానూ అతిగా ప్రేమిచుకునే వారు. వారి కోప కారణం ఒక్కటే  "తనకు దారి ఇవ్వడా ?"  అన్న గర్వం ఎదుటి వాడి మీద కోపంతో చిందులు తోక్కిస్తుంది. ఎందుకంటే ఆయనను మించిన గొప్పోడు లేడు  అని అతని భావన.  కాని ఎదుటి వాడికి ఈయన ఎవడో కూడా తెలియదు. 

అలాగే కోపం స్థాయిని నిర్ణయించేది మరో విషయం కూడా ఉంది. అదే విషయాన్నీ అర్ధం చేసుకోవటం. ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్నీ ఒకేలా అర్ధం చేసుకోరు. ఉదాహరణకు ఒక వ్యక్తిని సినిమా థియేటర్ దగ్గర ఎవరో వచ్చి "బ్లాక్ టికెట్స్ ఉన్నాయా?"  అని అడిగాడు. అంతే అతని కోపం బుసలు కక్కుతుంది. "ఎలా కనిపిస్తున్నాను నీకు? బ్లాక్ టికెట్స్ అమ్మే వాడిలాగా?"  అని  అడిగిన వాడి  దుంప తెంపేస్తాడు . మరో వ్యక్తీ మాత్రం "నేను కూడా సినిమా చూడటానికే వచ్చాను" అని సామాన్యంగా  సమాధానం చెప్పేస్తాడు లేదా మహా అయితే "నీ దగ్గర ఉంటె ఇవ్వు నేనే కోంటాను" అని చమత్కారం ఆడుతాడు. 

పై సంఘటనలో ఇద్దరు వ్యక్తుల అర్ధం చేసుకొనే శక్తి మీద వారి కోపం స్థాయి  నిర్ణయించ బడింది అని చెప్పవచ్చు.  మొదటి వ్యక్తీ అవమానంగా భావించాడు అందుకే కోపం ఎక్కువ స్థాయిలో చూపించాడు. రెండవ వ్యక్తీ "అతను సినిమా చూడాలన్నా ఆత్రంలో అడిగి ఉంటాడు" అని మరోలాగా దాన్ని అర్ధం చేసుకున్నాడు. అందుకే చిన్న చమత్కారం తో పరిస్థితిని తేలిక చేశాడు. 

ఇలా చెప్పుకుంటు  పొతే కోపానికి, దాని స్థాయికి ఎన్నో కారణాలు, ఉదాహరణలు. ఉదాహరించిన రెండు సంఘటనలలో మొదటి వ్యక్తులు కోపం స్థాయిని పెంచినంత మాత్రన వారికీ జరిగిన మేలు కాని, గౌరవం కాని ఏమి లేదు. వారికీ కలిగిన మానసిక ఒత్తిడి మరియు శారీరక భాధ తప్ప.  పరిస్థితులు మన కోపం వల్ల మారవు అని తెలిసినప్పుడు కోపం ప్రదర్శించటంలో అర్ధం లేదు. 

అయితే మరి కోపం చూపించటం మంచిది కాదా? కోపాన్ని అణుచుకోవాలా? నిజానికి కోపం అనేది ఆసిడ్ లాంటిది. దాన్ని దాచిన పాత్రను తినేస్తుంది. అందుకే కోపాన్ని ఎప్పటికప్పుడు భయటకు పంపాలి. మనసును తేలిక చేసుకోవాలి. భయటకు పంపటం అంటే అందరి మీద అరవటమే కానవసరం లేదు. ఒంటరిగా గడపటం,  కాసేపు  మౌనంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోవటం కూడా కోపాన్ని తగ్గిస్తాయి. 

అరిస్టాటిల్ మహాశయుడు చెప్పిన ప్రకారం "కోపం అనేది ఎవరికయినా రావచ్చు,  అది తేలికయిన విషయం.  కాని సరయిన కారణానికి, సరయిన వ్యక్తీ మీద, సరయిన సమయం లో,  సరయిన మోతాదులో కోపం చూపించటం అందరికి సాధ్యం కాదు మరియు అంత తేలిక కాదు". దిన్ని బట్టి మనకు అర్ధం అయ్యే విషయం ఏమిటి? కోపం అనేది తప్పు కాదు. కాని దాని కారణం,  స్థాయి మరియు వ్యక్తులను నిర్ణయించి సరయిన రీతిలో, సమయం లో   మన కోపం ప్రదర్శించాలి. 

మరో మాటలో చెప్పాలంటే " శిల పైన శిల్పి వేసే దెబ్బ కానే కాదు కోపం, అప్పుడే వస్తుంది శిలకు ఓ రూపం". మన కోపం మేలు చేసేదిగా ఉండాలి కాని మనం అంటే భయం పుట్టేలా, లేదా అసహ్యం పుట్టేలా ఉండ కూడదు. 

(మీ భావాలు పంచుకో గోరుతాను)


13 వ్యాఖ్యలు:

 1. బావుంది మీ కోపం మీద కోపం.ఇలా అన్నందుకు నన్ను బ(భ?)యటికి పొమ్మనరు కదా:)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

  www.poodanda.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "శిల పైన శిల్పి వేసే దెబ్బ కానే కాదు కోపం, అప్పుడే వస్తుంది శిలకు ఓ రూపం" ఈ వాక్యం ఎందుకో అసంబద్దం అనిపిస్తుంది కొంచెం వివరిస్తారా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీకు

   శిల పైన శిల్పి వేసే దెబ్బ కానే కాదు కోపం
   అప్పుడే వస్తుంది శిలకు ఓ రూపం

   అన్న పదవిన్యాసం అసంబధ్ధంగా అనిపించితే ఆశ్చర్యపడ వలసింది ఏమీ లేదు.

   ----- కోపం
   ----- రూపం
   అనే అంత్యప్రాసకోసం తెలుగువాక్యంలో పదాలను అసహజంగా పేర్చటం వలన అసంబధ్ధత వచ్చింది మరి.
   ఐతే తెలుగులో పదాల అమరికమీద క్రూరమైన నిబంధనలు ఏమీలేవు. పలుకుబడికి విరుధ్ధంగా లేనంత వరకూ వాక్యంలోని పదాలను ఏ క్రమంలో ప్రయోగించినా తప్పులేదు.

   ఐతే ఈ‌ప్రయోగంలో మరిన్ని దోషాలున్నాయి. అందువేత అసంబధ్ధత ద్విగుణీకృతం అయింది. సరిగా వ్రాస్తే ఇలా ఉండాలి:

   శిలకు శిల్పి వేసే దెబ్బకు రానే కాదు కోపం
   అప్పుడే వస్తుంది కదా ఆ శిలకే ఓ రూపం

   మొదటి పాదంలో ఉన్నవి 25 మాత్రలు. అలాగే రెండవ పాదంలో ఉన్నవి 25 మాత్రలు. అంటే మాత్రా సమకంగా వ్రాసామన్న మాట.
   అలాగే పఠన సౌలభ్యం కోసం ప్రతిపాదంలోను విరుపు ఉండాలి. మన ప్రయత్నంలో వచ్చిన విరుపును చూడండి

   శిలకు శిల్పి వేసే దెబ్బకు - రానే కాదు కోపం
   అప్పుడే వస్తుంది కదా ఆ - శిలకే ఓ రూపం

   అంటే ప్రతి పాదంలోనూ 15మాత్రల తరవాత విరుపు వచ్చేలా వ్రాసామన్న మాట.
   వచన కవిత్వం కాబట్టి విరుపు అన్నాను. అదే ఛందో బధ్ద కవిత్వం ఐతే యతి అనవలసి ఉండేది. యతి గురించి సాంప్రదాయికంగా కొన్ని కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అదంతా వేరే సంగతి.

   వచన కవిత్వంలో మాత్రాబధ్ధంగా వ్రాస్తే ఒక అందం వస్తుంది. ఒక్కొక్క సారి పాదాలలో ఒకే మాత్రల సంఖ్య ఉండనవసరం లేదు. హ్రస్వంగా ఉన్న అక్షరాలలో దీర్ఘంగా ఉఛ్ఛరించే అవకాశం ఉన్నవాటిని అదికమాత్రలుగా తీసుకుని మాత్రా సమకత సాధించవచ్చును.

   ఇకపోతే, విరుపులు ఎక్కడ ఉండాలీ, ఎలా ఉండాలీ, ఆదిప్రాసలు, అంత్యప్రాసలూ వంటివి కవులు సందర్భానుసారంగా వాడాలి.
   ఇదంతా మంచి పరిశీలన మీదా, మంచి అనుభవం మీదా పట్టుబడుతుంది.

   ఐతే ఈ‌ కాలం వాళ్ళల్లో అనేకులు వాక్యాల్ని ఇష్టానుసారం కత్తిరించి నిలువుగా పాదాలుగా పేర్చేస్తే అది చచ్చినట్లు కవిత్వం ఐపోతుందన్న భ్రమలో ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి సలహాలు స్వీకరించే అలవాటు లేదు.

   అసలు మాత్ర అంటే ఏమిటీ దాని అవసరం అంటే ఏమిటీ అనిపిస్తే, దాని గురించి తెలుసుకోవటం మంచిదే. మాత్ర అనేది ఒక అక్షరం యొక్క ఉఛ్ఛారణాకాలం. పాదాల మధ్య ఈ కాలప్రమాణానికి సంబంధించిన తూకం కవిత్వానికి మంచి పఠనీయతనూ, కవి ప్రతిభావంతుడైతే, ఆ ఉద్దేశంతో వ్రాస్తే గానయోగ్యతనూ కూడా ఇస్తుంది కవిత్వానికి.

   స్వస్తి.

   తొలగించు
  2. నా సుదీర్ఘ వివరణలో ఒక cut & paste తప్పు దొర్లింది. క్షంతవ్యుడను.

   శిలకు శిల్పి వేసే దెబ్బకు - రానే రాదు కోపం
   అప్పుడే వస్తుంది కదా ఆ - శిలకే ఓ రూపం

   అని ఉండాలి.

   తొలగించు
  3. ఉలితో శిలను కొట్టటం వల్ల దానికి మేలు జరిగింది, అలాగే కొన్ని సార్లు కోపం వల్ల కూడా కొన్ని మేలులు ఒరుగుతాయి అని చెప్పదలిచాను. రచనలో పసితనంలో ఉన్న నాకు ఇంతకన్నా ఉత్తమమయిన పోలిక తట్టలేదు. మీ రాక బహు సంతోషం కలిగించింది.

   తొలగించు
  4. ఇన్ని నియమ నిబంధనలు నాకు తెలియవండి. అవకాశం ఉంటె మీ వద్ద శిష్యరికం చెయ్యటానికి ఎ మాత్రం వెనుకాడను. మీ పరిజ్ఞానం అద్బుతం, కాని దురదృష్టవశాత్తు నేను ఇవ్వేవి పాటించటం లేదు, ఏదో మనసు తోచిన భావాలూ నాకు తెలిసిన అతి కొద్ది పదజాలం లో ఇరికిస్తూ ఆనంద పడుతున్నాను. మీ లాంటి పెద్దల వివరణ నా లాంటి పిల్ల రచయితలకు చాల అవసరం, అప్పుడప్పుడు ఇలా విమర్శిస్తూ, వివరించండి. ధన్యవాదాలు.

   తొలగించు
  5. సాయారాంగారూ

   నియమాలు తరువాత వస్తాయండీ.
   ముందు మీరు వ్రాసేటప్పుడు ఒక లయ లేదా తూగు కుదురుతోందేమో చూసుకోండి.
   అంటే కొంచెం అందంగా పాడుకునే విధంగా ఉందేమో చూసుకోవటం అన్నమాట.
   అంతకంటే మరేమీ అవసరం లేదు.
   ఇలా లయాన్వితంగా ఉండటానికి కారణాలు అర్థం చేసుకుని వాటిని గ్రంథస్థం చేస్తే అవే నియమాలయ్యాయి కాని మొదట రచనలే ప్రధానం.
   మీకు బాగా నచ్చేటట్లు వ్రాయండి. ఒకటికి పదిసార్లు చిత్రిక పట్టండి. మీకొక మంచి ఒరవడి వస్తుంది. దాన్నే మీ శైలి అంటామన్న మాట.
   అది బాగా స్థిరపడ్డాక ఒక టైపిస్టు వేళ్ళు ఆటోమేటిగ్గా సరైన అక్షరాల మీదకే వెళ్ళేటట్లు మీ వ్రాతలూ సులభంగా హాయిగా మంచి ధోరణిలో ఒదుగుత్తాయి.
   నియమాలు భయపెట్టటానికో, ఆధిక్యం చూపటానికో కాదు - కేవలం అవగాహన కోసమూ సహాయం చెయ్యటానికీ మాత్రమే!
   శుభం భూయాత్.

   తొలగించు
  6. మీరు చెప్పిన వాటి మిద దృష్టి సారిస్తాను. ఆధిక్యం కోసం మీరు ప్రయత్నిస్తున్నారని నేను ఎప్పుడు భావించలేదు, అలాగే నా రచన దాహం ముందు ఎ నియమం నిలవలేదు. కాని నా రచనల్లో మార్పును నేను కూడా కోరుకుంటున్నాను, అందుకోసం శ్రమిస్తాను. ధన్యవాదాలు.

   తొలగించు
  7. చాలా బాగా చెప్పారు శ్యామలీయం గారు.

   శిల పైన శిల్పి వేసే దెబ్బ కానే కాదు కోపం, అప్పుడే వస్తుంది శిలకు ఓ రూపం

   ఈ వాక్యం నాకు ఎలా అర్ధం అయ్యిందంటే "శిల్పి శిల పైన వేసే దెబ్బ కోపం వల్ల కాదు శిలకి ఒక రూపం ఇవ్వటానికి వేసిన దెబ్బ " . అందుకని నాకు అసంబద్దముగ అనిపించింది.

   సాయిరామ్ గారు All the best

   తొలగించు
  8. సాయారాంగారు,

   లలితకళల్లో కవిత్వం ఒకటి. కళమీద ఆసక్తి ఉన్నవారు దానిలో సమున్నత సృష్టి చేయాలని ఆశపడతారు. అది సర్వదా ఆమోదయోగ్యం, వాంచనీయం. మానవసమాజంలో కళలు అనేవి బహుకాలం నుండి వర్థిల్లుతున్నాయి. అన్ని కళలూ కాలక్రమంలో మారుతూ ఉంటాయి కొత్తరూపాల్లోనికి. అలాగే కొత్త కొత్త కళారూపాలూ పుట్టుకుని వస్తూ ఉంటాయి, ఇదంతా సహజమైన పరిణామం. ఒక కొత్త కళను సృష్టించినవారూ, ఒక కళలో కొత్త మార్పును తీసుకుని వచ్చేవారూ‌ కూడా ఆ కళ పట్ల ఎంతో తపనతో ఉండి, ఎంతో అధికారం సాధించాక కాని ఆ కొత్తదనమో మార్పో తేవటం సాధారణంగా జరగదు. అన్ని విద్యలూ, కళలూ కూడా అభినివేశంతో వికసిస్తాయి, అలాగే నిరంతరమైన అధ్యయనంతో రాణిస్తాయి. కేవలం తమతమ కళాతృష్ణ ఒక్కటే చాలు ప్రకటనకు అనుకోవటం తరచుగగా కళాకారుల అభ్వృధ్ధికి అడ్డంకిగా మారతుంది. కవులైతే, తమతమ చిత్తానికి నచ్చిన ధోరణిలో కవిత్వాన్ని ఉన్నతంగా చెప్పిన గొప్పకవుల కవిత్వం బాగా అధ్యయనం చేయాలి. చిత్రకారులైతే గొప్పచిత్రకారుల ఒరవడులను సహాయం తీసుకోవాలి. బొమ్మలు బాగా వేస్తున్న పిల్లవాడికి తల్లిదండ్రులు మంచి గురువువద్ద శిక్షణ ఇప్పిస్తారు కదా? కేవలం ఆ పిల్లవాడి ఆసక్తి, దాహం అనేవి చాలవని అంతా అనుకుంటాం కదా? అలాగే, యువకవులు కూడా తమ తమ రచనా పాటవం పెంచుకుందుకు తగినంత అభ్యాసం చేయాలి మరి. నియమాలు ఎందుకూ అవి అడ్డు కదా అంటే ఎవరూ ఏమీ చెప్పగలిగింది లేదు. ఆచారహీనః న పునంతి వేదాః అని సూక్తి. ఒక descipline అనేది యువకవులకి అవసరం అటున్నానని అనుకోకండి. చిన్న పెద్దా అందరు కళాకారులకీ నిత్యావసరమే అది. మీరు మార్పు కోరుకుంటున్నానూ, దానికోసం శ్రమిస్తానూ అన్నారు. అది మిక్కిలి సంతోషం కలిగించింది.

   అన్నట్లు నేనేదో చేయి తిరిగిన కవిని అనుకోకండి. నేనూ మీ లాంటి విద్యార్థినే.

   తొలగించు
 4. Syamaliyam gaaru cheppinatlu konni thappulu minayonchi migathadi anthaa naaku nacchindi Sai..:-):-)

  ప్రత్యుత్తరంతొలగించు