5, జులై 2013, శుక్రవారం

భరించలేను నీ దూరం

నిన్ను చూడాలని మనసు ఎంత తపిస్తుందో
చెప్పేందుకు భాషలేదు
నేను చేసే ప్రేమ తపస్సు తప్ప
నీ పిలుపు వినాలని నా హృదయం ఎంతగా
నిశ్శబ్దం వహించిందో ఎలా తెలుపను
మౌనంగా ఉండి పోవటం తప్ప
జాలిలేని నిదుర నాపై కక్ష కట్టి
నా దరికి రాకుంది
కలలోనయిన నిన్ను చూపకుంది
నీ దూరం కల్లోలాలు రేపి
మధుర జ్ఞాపకాలు మరుగు చేసి
ఆ ఆనందం సైతం నాకు దూరం చేసింది
ప్రతిక్షణం భారం చేసింది
నీ స్పర్శకు దూరమయిన  తనువూకు
 వెన్నల సైతం సూదిల గుచ్చు కుంటోంది
ఇంకా వేడిని వేగగాలనా?
నీ తోడులేక అడుగయిన సాగగాలనా?
ప్రేమకు ఆకలి దాహం ఉండవు అంటారే ! కాని
నీ దూరం నాలో వాటిని పెంచింది
ఎంతకు తీరకుండా మార్చింది
నిన్ను చూడాలన్న తపనే
ఈ ఆకలి దప్పికలా?
తీరేది ఎప్పుడో ?
నీన్ను చేరేది ఎప్పుడో ?


1 వ్యాఖ్య:

  1. భావం బాగుంది.
    కాస్త పదాలటూ ఇటూ మార్చి లయగా వినిపిస్తే మంచి కవిత అవుతుంది.
    తనువుకు, సూదిలా అని ఉండాలేమో చూడండి.

    ప్రత్యుత్తరంతొలగించు