20, జులై 2013, శనివారం

కోపం ఎందుకు ? ఎలా ఉండాలి ?

(మొదటి సారి ఒక విషయం మీద, నాకు ఉన్నా మిడి మిడి  జ్ఞానం తో వ్యాసం రాసాను. ఎలా ఉందో చెప్పమని మనవి చేసుకుంటున్నాను)


కోపం అనేది ప్రతి మనిషికి, లేదా జంతువుకి ఇంకా చెప్పాలంటే ప్రాణం ఉన్నా ప్రతి జీవికి సహజ సిద్దంగా ఉద్బవించే భావము లేదా మానసిక స్థితి.  జంతువులూ ఇంకా ఇతర ప్రాణం ఉన్నా జీవుల గురించి మనకు (నాకు)  పెద్దగా తెలియదు కాబట్టి మనుష్యుల గురించి మాట్లాడుతాను. అసలు కోపం అనేది ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలు ఏమిటి? 

ఎవరయినా వ్యక్తీ తనకు అనుకూలంగా లేని పరిస్థితులు ఎదురయినప్పుడు, లేదా నచ్చని విషయాలు విన్నప్పుడు లేదా చూసినప్పుడు  పుట్టుకు వచ్చే గుణము కోపం. అయితే ఈ కోపం ఒకే విషయానికి  ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉంటుందా? కోపం చూపించే స్థాయిలో  అసలు తేడాలు ఎందుకు ?

ఉదాహరణకు ఒక వ్యక్తీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు లేదా ఎవరో వ్యక్తీ తప్పుగా నడుపుతూ అతనికి దారి ఇవ్వలేదు. అంతే అతని కోపం నషాళానికి ఎక్కి పోతుంది. ఎదుటి వ్యక్తీ ని బండ బూతులు తిడుతూ లేదా ట్రాఫిక్ ను ఇంకా దేశాన్ని అడిపోసుకుంటూ తన అక్కసునంత వెళ్ళగక్కుతాడు. ఇదే పరిస్థితికి మరో అతను పెద్దగా స్పందించడు, లేదా మరి అంత తీవ్ర స్థాయిలో కోపం చూపడు. ఎందుకు?

ఆయా వ్యక్తుల తాలుకు మానసిక స్థితి, మరియు వారి స్వభావం ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు మొదటి వ్యక్తీ అప్పటికే పని చేసి అలసి పోయి ఇంటికి వెళ్తూ  ఉండాలి లేదా పనికి లేటుగా అయినా వెళ్తూ ఉండాలి. రెండవ వ్యక్తీ ఏదో పార్టి నుండి హాయిగా గడిపి లేదా ఏదో శుభవార్త విని  సంతోషంగా వస్తున్నాడు అనుకుందాం. అప్పుడు అతని కోపం మొదటి వ్యక్తీ అంత తీవ్ర స్థాయిలో ఉండదు. అంటే మన ప్రస్తుత  కోపం స్థాయిని నిర్ణయించేది మన  గడిచిన లేదా ఉన్నా  పరిస్థితులు !  అదే కాకుండా వ్యక్తుల స్వభావం సైతం ఆయా పరిస్థితులకు వారి వారి కోపం స్థాయిని నిర్ణయిస్తుంది. 

ఎవరయినా వ్యక్తీ అతి పోటి తత్వం ఉండి ఎదుటి వారు దారి ఇవ్వక పొతే నిప్పులు కక్కుతాడు.  ఎందుకంటే ఇతను రోడ్డు మీద ప్రతి ఒక్కరితో పోటి పడుతాడు, అందరికంటే ముందు వెళ్ళాలని తాపత్రయ పడుతాడు. ఉదా: త్రీ ఇడియట్స్ లో బొమ్మన్ ఇరానీ పాత్ర తీసుకోండి.  ఇంకో రకం ఏంటంటే తనను తానూ అతిగా ప్రేమిచుకునే వారు. వారి కోప కారణం ఒక్కటే  "తనకు దారి ఇవ్వడా ?"  అన్న గర్వం ఎదుటి వాడి మీద కోపంతో చిందులు తోక్కిస్తుంది. ఎందుకంటే ఆయనను మించిన గొప్పోడు లేడు  అని అతని భావన.  కాని ఎదుటి వాడికి ఈయన ఎవడో కూడా తెలియదు. 

అలాగే కోపం స్థాయిని నిర్ణయించేది మరో విషయం కూడా ఉంది. అదే విషయాన్నీ అర్ధం చేసుకోవటం. ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్నీ ఒకేలా అర్ధం చేసుకోరు. ఉదాహరణకు ఒక వ్యక్తిని సినిమా థియేటర్ దగ్గర ఎవరో వచ్చి "బ్లాక్ టికెట్స్ ఉన్నాయా?"  అని అడిగాడు. అంతే అతని కోపం బుసలు కక్కుతుంది. "ఎలా కనిపిస్తున్నాను నీకు? బ్లాక్ టికెట్స్ అమ్మే వాడిలాగా?"  అని  అడిగిన వాడి  దుంప తెంపేస్తాడు . మరో వ్యక్తీ మాత్రం "నేను కూడా సినిమా చూడటానికే వచ్చాను" అని సామాన్యంగా  సమాధానం చెప్పేస్తాడు లేదా మహా అయితే "నీ దగ్గర ఉంటె ఇవ్వు నేనే కోంటాను" అని చమత్కారం ఆడుతాడు. 

పై సంఘటనలో ఇద్దరు వ్యక్తుల అర్ధం చేసుకొనే శక్తి మీద వారి కోపం స్థాయి  నిర్ణయించ బడింది అని చెప్పవచ్చు.  మొదటి వ్యక్తీ అవమానంగా భావించాడు అందుకే కోపం ఎక్కువ స్థాయిలో చూపించాడు. రెండవ వ్యక్తీ "అతను సినిమా చూడాలన్నా ఆత్రంలో అడిగి ఉంటాడు" అని మరోలాగా దాన్ని అర్ధం చేసుకున్నాడు. అందుకే చిన్న చమత్కారం తో పరిస్థితిని తేలిక చేశాడు. 

ఇలా చెప్పుకుంటు  పొతే కోపానికి, దాని స్థాయికి ఎన్నో కారణాలు, ఉదాహరణలు. ఉదాహరించిన రెండు సంఘటనలలో మొదటి వ్యక్తులు కోపం స్థాయిని పెంచినంత మాత్రన వారికీ జరిగిన మేలు కాని, గౌరవం కాని ఏమి లేదు. వారికీ కలిగిన మానసిక ఒత్తిడి మరియు శారీరక భాధ తప్ప.  పరిస్థితులు మన కోపం వల్ల మారవు అని తెలిసినప్పుడు కోపం ప్రదర్శించటంలో అర్ధం లేదు. 

అయితే మరి కోపం చూపించటం మంచిది కాదా? కోపాన్ని అణుచుకోవాలా? నిజానికి కోపం అనేది ఆసిడ్ లాంటిది. దాన్ని దాచిన పాత్రను తినేస్తుంది. అందుకే కోపాన్ని ఎప్పటికప్పుడు భయటకు పంపాలి. మనసును తేలిక చేసుకోవాలి. భయటకు పంపటం అంటే అందరి మీద అరవటమే కానవసరం లేదు. ఒంటరిగా గడపటం,  కాసేపు  మౌనంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోవటం కూడా కోపాన్ని తగ్గిస్తాయి. 

అరిస్టాటిల్ మహాశయుడు చెప్పిన ప్రకారం "కోపం అనేది ఎవరికయినా రావచ్చు,  అది తేలికయిన విషయం.  కాని సరయిన కారణానికి, సరయిన వ్యక్తీ మీద, సరయిన సమయం లో,  సరయిన మోతాదులో కోపం చూపించటం అందరికి సాధ్యం కాదు మరియు అంత తేలిక కాదు". దిన్ని బట్టి మనకు అర్ధం అయ్యే విషయం ఏమిటి? కోపం అనేది తప్పు కాదు. కాని దాని కారణం,  స్థాయి మరియు వ్యక్తులను నిర్ణయించి సరయిన రీతిలో, సమయం లో   మన కోపం ప్రదర్శించాలి. 

మరో మాటలో చెప్పాలంటే " శిల పైన శిల్పి వేసే దెబ్బ కానే కాదు కోపం, అప్పుడే వస్తుంది శిలకు ఓ రూపం". మన కోపం మేలు చేసేదిగా ఉండాలి కాని మనం అంటే భయం పుట్టేలా, లేదా అసహ్యం పుట్టేలా ఉండ కూడదు. 

(మీ భావాలు పంచుకో గోరుతాను)


13, జులై 2013, శనివారం

విజయం అంటే ?

విజయం ఎంతో ప్రియమయినది
చాల విలువయినది
దానికి అందరు మిత్రులే
దాని ముందు అందరు ఆశక్తులే
దాని పుట్టుక చర్చనియం
పొందితే ఆకర్ష నియం

విజయం శాంతికి పునాది
నూత నానికి నాంది
రేపటికి వారధి
భవిష్యత్తుకు  సారధి

నిశ్చయంతో పరిచయం
సాధనతో సహవాసం
కృషితోనే తన స్నేహం
ధైర్యానికి దాసోహం
అదే విజయ రహస్యం

కాలంతో ఖరిధు అవుతుంది
వృదా చేస్తే తన షరాబు చేస్తుంది
అపజయానికి నవాబు చేస్తుంది
గెలుపు లేని గరిబు చేస్తుంది

ఓటమితో మొదలవుతుంది
ఓర్పుతో రగులు కుంటుంది
నేర్పుతో చేరువవుతుంది
తెలివితో సొంత మవుతుంది
గర్వంతో అంతమవుతుంది

విజయం అంటే విశ్రాంతి కాదు
నీతోనే ఆగిపోదు
ఓటమి ఎప్పుడు నిద్ర పోదు
నీ సాధన సాగలేదో.......
విజయం తిరిగి రాదు

విజయం అంటే గెలవటం కాదు
విజయం అంటే పోరాడటం
విజయం అంటే సాధీంచటం కాదు
విజయం అంటే సాధన చేయటం
విజయం అంటే గర్వం కాదు
విజయం అంటే వినయం

5, జులై 2013, శుక్రవారం

భరించలేను నీ దూరం

నిన్ను చూడాలని మనసు ఎంత తపిస్తుందో
చెప్పేందుకు భాషలేదు
నేను చేసే ప్రేమ తపస్సు తప్ప
నీ పిలుపు వినాలని నా హృదయం ఎంతగా
నిశ్శబ్దం వహించిందో ఎలా తెలుపను
మౌనంగా ఉండి పోవటం తప్ప
జాలిలేని నిదుర నాపై కక్ష కట్టి
నా దరికి రాకుంది
కలలోనయిన నిన్ను చూపకుంది
నీ దూరం కల్లోలాలు రేపి
మధుర జ్ఞాపకాలు మరుగు చేసి
ఆ ఆనందం సైతం నాకు దూరం చేసింది
ప్రతిక్షణం భారం చేసింది
నీ స్పర్శకు దూరమయిన  తనువూకు
 వెన్నల సైతం సూదిల గుచ్చు కుంటోంది
ఇంకా వేడిని వేగగాలనా?
నీ తోడులేక అడుగయిన సాగగాలనా?
ప్రేమకు ఆకలి దాహం ఉండవు అంటారే ! కాని
నీ దూరం నాలో వాటిని పెంచింది
ఎంతకు తీరకుండా మార్చింది
నిన్ను చూడాలన్న తపనే
ఈ ఆకలి దప్పికలా?
తీరేది ఎప్పుడో ?
నీన్ను చేరేది ఎప్పుడో ?