19, మే 2013, ఆదివారం

తాతల గొప్పలు !!!

వేద భూమి అంటూ వెనకేసుకోవటం
గొప్ప దేశం అంటూ చెప్పెసుకోవటం
ఎప్పటి నుంచో విని విసిగి పోయాను
ఇంకెప్పుడో అబివృద్ది అని అలసి పోయాను

ఎప్పుడు విన్నా మనం ఎదుగుతున్నాం
కాని అంతకంతకు దిగజారు తున్నాం
అని ఒక్కడు చెప్పాడు
అసలు నిజాలు విప్పాడు

సున్నా మనదే అంట !
అంతకన్నా గొప్ప ఏంటంట?
శాంతికి మారు పేరంటా !
దానికి అర్ధం ఏంటంట?
నాగరికపు దేశం లో
నారికి రక్షణ లేదు
బలాత్కరించి చంపితే శిక్ష లేదు

అతి పెద్ద ప్రజాస్వామ్యం
అడుగడుగునా ఆన్యాయం
రైతుల బ్రతుకు దైన్యం
యువత భవిత శూన్యం
పుట్టగానే చెల్లించాలి మూల్యం

ఎటు చూసినా స్కాములు
ఎన్నికలకు స్కీములు
ఓటులకు నోటులు
హక్కులకు బీటలు
అర్ధం లేని చట్టాలు
పరపతికి చుట్టాలు

ప్రాంతల పేరిట ఉద్యమాలు
ఆ ముసుగులో సాగే దందాలు
అతిగా దెబ్బ తినే మనోభావాలు
కులానికి బానిస మనసులు
దేవుడే సిగ్గు పడే చేష్టలు
తన పేరిట చందాలు
బాబాలు చేసే వికృతాలు

ఇప్పుడయిన కళ్ళు తెరుద్దాం
తాతల గొప్పలు మానేద్దాం
మంచి పౌరులుగా మారుదాం
దేశాన్ని నిజంగా గొప్పది చేద్దాం
గర్వంగా దాన్ని చాటుదాం


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి