10, మే 2013, శుక్రవారం

గ్రీన్ కార్డు (కవిత)

రాత్రి రెండు గంటలకు మీటింగులు
క్లైంట్  తో చాటింగులు
ప్రతి వెళ ఆఫీసు లోనే సిట్టింగులు
పెళ్ళాం, పిల్లలతో కోటింగులు
ఎప్పుడో కుదరని గెట్ టు గెదర్ లు

కష్టానికి పలితం
అన్ సైట్ ఆగమనం
డాలర్లలో జీతం
కోరేది రూపాయి పతనం

రెండు నెలలు బాగా మిగిలింది
ఫ్యామిలీ రాగానే తెలిసింది
ఖర్చు పెరిగి పోయింది
జీతం తరిగి  పోయింది
పొదుపు పొదుపుగానే సాగింది

మావాడు అమెరికా అంటూ గొప్పలు
"ఇల్లు కొన్నావా" అని చుట్టాల ప్రశ్నలు
ఎవరికీ తెలుసు ఇక్కడ నా తిప్పలు
విసాతో తోడుండే ముప్పులు

చెల్లి పెళ్ళి కి కట్నం డాలర్ ల పెరిగి
ఉన్నా కాస్త పొదుపు మంచుల కరిగి
భవిష్యత్తు పై ఆశా తరిగి
ఇండియా పై మనసు విరిగి
గ్రీన్ కార్డును మరిగి
అనుకున్నా,  "వెళ్ళ కూడదు తిరిగి"

అర్దరాత్రి ఫోన్ కూత
తెచ్చింది పిడుగులాంటి వార్త
ఆగింది నాన్న గుండె మోత
ఎలా తీరెను నా కడుపు కోత
చదువు కున్నా భగవత్ గీత
చెప్పేసా వెళ్ళలేని నిస్సహాయత
ఏడ్చా తలచుకుని నా  రాత

వీసా భయం నాలో కొడుకును చంపింది
గ్రీన్ కార్డ్ నా తండ్రి ప్రేమకు కొరివి పెట్టింది
రూపాయి విలువ నా విలువలను అమ్మేసింది
డాలర్ సాలరి నన్ను నాకే దూరం చేసింది
మా అమ్మను అక్కడ  భారం చేసింది
నాన్నపై బెంగతో,  తను కూడా కాలం చేసింది
వెళ్ళకుండా నా జీవితం మరో ఘోరం చేసింది

కాలం అలసిపోలేదు
నా పోరాటం ఆగిపోలేదు
సంపాదనకై ఆరాటం తీరిపోలేదు
ఎదుగుతున్న పిల్లలకు అదుపు లేదు
నా భార్యకు ఒకప్పటి  పొదుపు లేదు
ఇవన్ని చూసి నాకు కునుకు లేదు

సాదించింది సున్నా
ఏముంటుంది ఇంతకన్నా
ఎందులో నేను మిన్నా
గడ్డి మేసే పశువు కన్నా
ఎక్కడ నువ్వున్నా
నన్ను క్షమించు నాన్న


21 వ్యాఖ్యలు:

 1. మంచి కవిత. వాస్తవికతకు అద్దం పట్టింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. US life gurunchi chaala baaga chepparu and I am 100% sure that it will apply to most of us here in USA

  ప్రత్యుత్తరంతొలగించు
 3. i remember watching a move long back which is exactly in same lines.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. I am not sure which movie you are talking about.....it is written based on people's experiences...Anyways thanks for the visit.....

   తొలగించు
 4. సహజసుందరముగా అమెరికాలోని భారతీయుల ఈతిబాధలు అగచాట్లు వాస్తవ పరిస్తుతులకు మీ కవిత అడ్డం పట్టింది!ఆ విధమైన రచన ఒక NRI మాత్రమె వ్రాయగలిగినది ఎక్కడా ఒక్క వ్యర్థపదం లేకుండా స్వయంగా అనుభవించి అల్లిన కవిత!కవిగారికి అభినందనలు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇందులొ ఒక్కటి కుడ నెను అనుభవించలెదు భగవంతుడి క్రుప వల్ల. మీ అభినందనకు చాల క్రుతజ్ఞతలు.

   తొలగించు
 5. మీ ప్రొఫైల్ చూశాను ఆశ్చర్యపోయాను నిజామాబాద్ లో ఉంటూ ఊహించి వ్రాసిందేకాని అనుభవించి వ్రాసిన్దికాదని గ్రహించి కవిగారి ఊహాశక్తిని అభినందిస్తున్నాను!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీలాంటి పెద్దల ప్రోత్సాహమే నన్ను నడిపేది.

   తొలగించు
 6. బాగా రాశారండీ. ఒక వ్యక్తి వేదన కనిపిస్తూంది మీ కవితలో.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మస్తు చెప్పినవ్ బిడ్డా! సోచాయింపజేసే కవిత షెప్పినవ్. నా దిల్ కీ బాత్ గదే.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. దిల్ ఖుష్ అయ్యే మాట చెప్పినావ్, మళ్ళ మళ్ళ అస్తుండు.

   తొలగించు
 8. Sairam, mee kavitalu chala bavunnayi. Meeku abhyantaram leka pote nenu mee kavitaly na friends tho share chesukovacha? Thanks to Shekhar Dodly..Atani facbook update chusi mee kavitalaku parichayam ayyanu. Mee kavitalu vaduka bhashalo vunnandu valla chala akattukunnayi. Thank you once again for this wonderful poem.

  ప్రత్యుత్తరంతొలగించు