19, మే 2013, ఆదివారం

తాతల గొప్పలు !!!

వేద భూమి అంటూ వెనకేసుకోవటం
గొప్ప దేశం అంటూ చెప్పెసుకోవటం
ఎప్పటి నుంచో విని విసిగి పోయాను
ఇంకెప్పుడో అబివృద్ది అని అలసి పోయాను

ఎప్పుడు విన్నా మనం ఎదుగుతున్నాం
కాని అంతకంతకు దిగజారు తున్నాం
అని ఒక్కడు చెప్పాడు
అసలు నిజాలు విప్పాడు

సున్నా మనదే అంట !
అంతకన్నా గొప్ప ఏంటంట?
శాంతికి మారు పేరంటా !
దానికి అర్ధం ఏంటంట?
నాగరికపు దేశం లో
నారికి రక్షణ లేదు
బలాత్కరించి చంపితే శిక్ష లేదు

అతి పెద్ద ప్రజాస్వామ్యం
అడుగడుగునా ఆన్యాయం
రైతుల బ్రతుకు దైన్యం
యువత భవిత శూన్యం
పుట్టగానే చెల్లించాలి మూల్యం

ఎటు చూసినా స్కాములు
ఎన్నికలకు స్కీములు
ఓటులకు నోటులు
హక్కులకు బీటలు
అర్ధం లేని చట్టాలు
పరపతికి చుట్టాలు

ప్రాంతల పేరిట ఉద్యమాలు
ఆ ముసుగులో సాగే దందాలు
అతిగా దెబ్బ తినే మనోభావాలు
కులానికి బానిస మనసులు
దేవుడే సిగ్గు పడే చేష్టలు
తన పేరిట చందాలు
బాబాలు చేసే వికృతాలు

ఇప్పుడయిన కళ్ళు తెరుద్దాం
తాతల గొప్పలు మానేద్దాం
మంచి పౌరులుగా మారుదాం
దేశాన్ని నిజంగా గొప్పది చేద్దాం
గర్వంగా దాన్ని చాటుదాం


10, మే 2013, శుక్రవారం

గ్రీన్ కార్డు (కవిత)

రాత్రి రెండు గంటలకు మీటింగులు
క్లైంట్  తో చాటింగులు
ప్రతి వెళ ఆఫీసు లోనే సిట్టింగులు
పెళ్ళాం, పిల్లలతో కోటింగులు
ఎప్పుడో కుదరని గెట్ టు గెదర్ లు

కష్టానికి పలితం
అన్ సైట్ ఆగమనం
డాలర్లలో జీతం
కోరేది రూపాయి పతనం

రెండు నెలలు బాగా మిగిలింది
ఫ్యామిలీ రాగానే తెలిసింది
ఖర్చు పెరిగి పోయింది
జీతం తరిగి  పోయింది
పొదుపు పొదుపుగానే సాగింది

మావాడు అమెరికా అంటూ గొప్పలు
"ఇల్లు కొన్నావా" అని చుట్టాల ప్రశ్నలు
ఎవరికీ తెలుసు ఇక్కడ నా తిప్పలు
విసాతో తోడుండే ముప్పులు

చెల్లి పెళ్ళి కి కట్నం డాలర్ ల పెరిగి
ఉన్నా కాస్త పొదుపు మంచుల కరిగి
భవిష్యత్తు పై ఆశా తరిగి
ఇండియా పై మనసు విరిగి
గ్రీన్ కార్డును మరిగి
అనుకున్నా,  "వెళ్ళ కూడదు తిరిగి"

అర్దరాత్రి ఫోన్ కూత
తెచ్చింది పిడుగులాంటి వార్త
ఆగింది నాన్న గుండె మోత
ఎలా తీరెను నా కడుపు కోత
చదువు కున్నా భగవత్ గీత
చెప్పేసా వెళ్ళలేని నిస్సహాయత
ఏడ్చా తలచుకుని నా  రాత

వీసా భయం నాలో కొడుకును చంపింది
గ్రీన్ కార్డ్ నా తండ్రి ప్రేమకు కొరివి పెట్టింది
రూపాయి విలువ నా విలువలను అమ్మేసింది
డాలర్ సాలరి నన్ను నాకే దూరం చేసింది
మా అమ్మను అక్కడ  భారం చేసింది
నాన్నపై బెంగతో,  తను కూడా కాలం చేసింది
వెళ్ళకుండా నా జీవితం మరో ఘోరం చేసింది

కాలం అలసిపోలేదు
నా పోరాటం ఆగిపోలేదు
సంపాదనకై ఆరాటం తీరిపోలేదు
ఎదుగుతున్న పిల్లలకు అదుపు లేదు
నా భార్యకు ఒకప్పటి  పొదుపు లేదు
ఇవన్ని చూసి నాకు కునుకు లేదు

సాదించింది సున్నా
ఏముంటుంది ఇంతకన్నా
ఎందులో నేను మిన్నా
గడ్డి మేసే పశువు కన్నా
ఎక్కడ నువ్వున్నా
నన్ను క్షమించు నాన్న


8, మే 2013, బుధవారం

రామ్ చరణ్ ప్రెస్ మీట్ !! (హాస్యం)రామ్ చరణ్ దాడి చేసిన  సంఘటన తాలూకు వివరాలు తెలుసుకుందామని మీడియా అంత చిరంజీవి ఇంటికి వెళ్ళింది. అక్కడ మెగా హీరోలు వారి సినిమా డైలాగులతో  కామెంట్స్   చేస్తే  ఎలా ఉంటుంది? సరదాగా రాసింది, నవ్వు వస్తే నవ్వుకోండి రాక పొతే చెప్పిపొండి.

ముందుగా రామ్ చరణ్ తన గురించి చెపుతూ............

"మా అయ్యా కేంద్ర మంత్రి
ఇక్కడ నేనో కంత్రి
సమ సమాజం తన నినాదం
చావ గోట్టటమే నాకు ప్రదానం
సినిమాలో నేను హీరో
మర్యాదలో పెద్ద జీరో
నేను కథలో నాయకుడు
జీవితం లో ప్రతినాయకుడు
నేను చిరంజీవి కా బచ్చ
నాకుంది పెద్ద  పిచ్చ
సినిమాల్లో అచ్చ
రోడ్డు పై రచ్చ
ప్రజలంటే నాకు తుచ్చ
తెలుగు సినిమాకే నేను మచ్చ"

ఇదంతా విని మీడియా ప్రశ్నలు వెయ్య సాగింది.

మీడియా: ఎంటండి రామ్ చరణ్ గారు అలా కొట్టించారు? 

చరణ్: ఈ ఉరు నాదే,ఆ  రోడ్డు నాదే,  చిరుత.

మీడియా: చిరుతల ప్రవర్తించటానికి ఇది అడవి కాదండి, సమాజం.

చరణ్: ఏరియాను బట్టి మారటానికి ఇది క్లైమేట్ కాదు, కరేజ్. నేను ఇలాగె ఉంటా.

మీడియా:  ఎందుకండీ మీకు అంత ఆవేశం.

చరణ్: అద్మి కం,ఆవేశం జ్యాద. రచ్చ చూపిస్తా. 

మీడియా: రచ్చ అంటే?

చరణ్: నేను ఏదయినా ఒక్కసారే చెపుతా. రెండో సారి నరుకుతా.

మీడియా: మేము ఇక్కడ ఇరవై మందిమి ఉన్నాం. మాలో ఒక్కరిపై చెయ్యి వేసినా బాగుండదు. 

చరణ్: ఒక్కొక్కరు కాదు మీడియా, ఇరవై మంది ఒకేసారి రండి.  అందరిని ఇరగదిసి పంపుతా. 

మీడియా: మీ నాన్న ప్రభుత్వం  లో ఉన్నాడని పొగరా?

చరణ్: ప్రభుత్వం కోసం ప్రజలు ఉన్నారు కాని ప్రజల కోసం ప్రభుత్వం కాదు. ప్రజలను తన్నటం నా హక్కు దాన్ని మీడియాకు భయపడి వదులు కొను. 

మీడియా: చిరంజీవి గారు ! మీ అబ్బాయి తో క్షమాపణ చెప్పిస్తారా?

చిరు: తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించు. పిల్లాడే కదా అని వాణ్ణి కెలికితే పీక కోస్తా. 

మీడియా: పవన్ గారు ! దిని మిద మీ అభిప్రాయం?

పవన్: తన్నిన వాడు సారీ చెప్పటం ఎంత తప్పో, తన్నించు కున్నవాడు సారీ చెప్పించు కోవటం కూడా అంతే తప్పు. 

మీడియా: అరవింద్ గారు ఇందులో మీ వాడి తప్పు లేదా?

అరవింద్: చిన్న పిల్లల్లో, టీనేజర్లలో చరణ్ కు  ఉన్నా క్రేజ్ కు అతను ఎం చేసినా తప్పులేదు. ఎందుకంటే పిల్లలు, టినేజర్ లు ఎం చేసినా పెద్ద తప్పు కాదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా ఫాన్స్ చూస్తూ ఊరుకోరు. 

నాగబాబు: ఇలాంటి యెల్లో జర్నలిసం ఎంకరేజ్ చెయ్యకండి. పిల్లాడు చేసిన తప్పుని పెద్దది చెయ్యకండి. 

మీడియా: బన్నీ దిని మిద మీ కామెంట్ ఏంటి? 

బన్నీ: నేను  హైదరాబాద్ లో కొడితే డిల్లి వరకు వచ్చేది కవరింగ్. మా వాడు ఇంకా చిన్నోడు కాబట్టి ఇంతటితో ఆగాడు. 

మీడియా: బాబు ఫాన్స్ ఇలాంటి వారినా మీరు అభిమానించేది. 

ఫాన్స్: మా అన్నల మీద ఎవడయినా చెయ్యి వేస్తె నరికేస్తాం. వాళ్ళా కోసం రక్త దానం, కళ్ళ దానం, ఎన్ని దానాలు అయినా చేస్తాం. 

మీడియా: ఏంటి ! ప్రజలను కొట్టిన కూడానా?

ఫాన్స్: అసలు చరణ్ కారు దిగలేదు. తను ఒక్కరిని కూడా కొట్టలేదు. ఇంకేంటి సమస్య ! మెగాస్టార్ కాబోయే CM ! పవనిజం జిందాబాద్. !! మెగా పవర్ స్టార్ నెంబర్ 1 !!!

ఎప్పుడు సామాన్యుడు తిరగబడునో, ఎప్పుడు  ఈ దేశం బాగు పడెనో. 

2, మే 2013, గురువారం

పిల్లాడితో కుదరదు !

మూడేళ్ళ కొడుకును ప్లే  స్కూల్ లో దిగ బెట్టి వచ్చి  టీవీ చూస్తూ టిఫిన్ చేస్తోంది అఖిల. ఆఫీసుకు లేట్ అవుతుందంటూ తొందరగా రెడీ అవుతున్నాడు కిరణ్. తను పని చేసేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో, కొడుకు పుట్టక ముందు అఖిల కూడా ఉద్యోగం చేసేది. కాని ఇప్పుడు ఇంటి పని కూడా మానేసి అమ్మను తోడూ తెచ్చుకుని ఇంటిలో కొడుకును చూసుకుంటూ ఉంటోంది.

తల్లి కూడా తనతోనే ఉంటుండటం తో అఖిల కు మంచి చేదోడు వాదోడు గా ఉంటోంది, అలాగే కిరణ్ కు కూడా మంచి సౌకర్యంగా ఉంటోంది అత్తగారు తమ తో ఉంటున్నందుకు. తన భార్య చేసే అడ్డమయిన వంటలు తప్పించుకుని మంచి రుచి గా తింటున్నాడు. 

ఎ మాటకు ఆ మాట చెప్పు కోవాలి, పాపం అఖిల అమ్మ గారికి చాల ఓపిక, అది కాకుండా ఎప్పుడు ఏదో  ఒకటి వండి పెట్టడం ఆవిడకు మహా సరదా. అందుకే మనసు ఎంత తినాలని ఉవ్విళురినా కాస్త కంట్రోల్ చేసుకుని, ఇంట్లోనే ఉన్నా థ్రెడ్ మిల్ మిద కుస్తీ పడుతూ ఇప్పటికి మంచి పర్సనాలిటీ మైటైన్ చేస్తున్నాడు కిరణ్ . కాని అఖిల అలా కాకుండా తల్లి ఏది పెడితే అది తిని బలంగా తయారయింది, కాస్తా మొహమాటం లేకుండా చెప్పాలంటే లావుగా తయారయింది. 

వెళ్తూ వెళ్తూ ఒకసారి తనను తేరిపార చూశాడు, మనసు కలుక్కు మంది "ఈ అందగాత్తేనేనా తను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది? ఇంట్లో వాళ్ళను ఎదురించి మరి, ఏరి కోరి చేసుకున్నాడు" అని నిట్టూర్చి "వస్తాను బంగారం" అని రోజులాగే చెప్పి భయటకు నడిచాడు.

వెళ్తున్నా తనతో "బంగారు ప్రేసేంటేశాన్ ఇరగదియ్, ఈ దెబ్బతో నీకు ప్రమోషన్ వచ్చెయ్యాలి" అంది అఖిల  ఉషారుగా.

కిరణ్ ఒక జీవం లేని నవ్వు నవ్వి "నీ ఎంకరేజ్ మెంట్ ఉండలేగాని, చంపెయాను" అని నవ్వుతూ చెప్పి అపార్ట్ మెంట్ పార్కింగ్ దగ్గరికి వచ్చాడు. 

పార్కింగ్ లో ఎవరో తన బైక్ కు అడ్డంగా పెట్టారు కారు, వెంటనే వాచ్ మాన్ ను "ఏంటయ్యా ఇది ! మాకు ఉంది కారు ఎప్పుడయినా ఇలా పెట్టామా అడ్డంగా ఎవరికయినా? అసలేం చేస్తున్నావ్ నువ్వు పని పాట లేకుండా?" అన్నాడు కోపంగా.

దానికి వాచ్ మెన్ "ఇప్పుడే కదండి మీరు చెప్పింది! తియిస్తాను కాస్త ఆగండి. రోజు ఏదో కారణం తో నా మీద అరవటం, అసలు నువ్వేం చేస్తున్నావు అనటం. ఈ మాట నన్నే అడుగుతున్నారా లేక ఇంకేవరినయినా అడగాలనుకుని నన్ను అడుగుతున్నార ?" అన్నాడు చిరాకుగా.

కిరణ్ ఒక్కసారిగా ఉలికి పడి బింకంగా "మాటలొద్దు, ముందు కారు తియ్యించు" అన్నాడు. 

ఆఫీసు లో అడుగుపెట్టగానే ప్రాజెక్ట్ బ్యూటీ రజని ఎదురయింది. "ఎం ఫిగర్ రా నాయన ! ఇలియానా, అనుష్క ఇద్దరు కలిస్తే ఇది తయారవుతుంది" అనుకున్నాడు.

తనను చూడగానే "హాయ్ కిరణ్ ! గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ? ఈ రోజు నుంచి నువ్వే నా టీం లీడ్. ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పింది" అంది ఉషారుగా.

కిరణ్ కు నోట మాట రావటం లేదు, మనసు ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. అయినా తమాయించుకుని "థట్స్ రియల్లీ గ్రేట్" అని చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి పోయాడు.

కిరణ్ కు చెప్పలేని ఆనందంగా ఉంది "ఇంత గొప్ప ఫిగర్ తన టీం లోకి వస్తుందని అనుకోలేదు. కాని ఎం లాభం తనకు పెళ్ళయిందని తెలిస్తే తన మొఖం కూడా చూడదు. అయినా తనకేం తక్కువ ముప్పయి దాటినా పాతికల కనిపిస్తాడు, టాలెంట్ ఉంది" ఇలా సాగిపోతున్నాయి తన ఆలోచనలు. 

కాస్సేపటికి ప్రాజెక్ట్ మేనేజర్ చాట్ లో తన రూం కు రమ్మని పిలిస్తే వెళ్ళాడు. తనతో పాటు పదేళ్ళ అమ్మాయి, ఓ మూడేళ్ళ అబ్బాయి ఉన్నారు తన కేబిన్ లో. రాగానే పిల్లలను కూతురు, కొడుకు గా పరిచయం చేసింది ఆమె. ప్రాజెక్ట్ విషయాలు ఏవో మాట్లాడుతోంది కాని తన దృష్టి అంత నాజుకుగా ఉన్నా ఆమె వంటి మీదే ఉంది.

"అసలు ఇద్దరు  పిల్లలు పుట్టాక కూడా ఎలా మైటైన్ చేస్తోంది ఆవిడా! ఇన్ని రోజులు తనకు ఇప్పుడిప్పుడే పెళ్ళయి ఉంటుంది  లేదా మహా అయితే రెండేళ్ళ వయసున్న పిల్లలు  ఉండి ఉంటారు  అనుకున్నాడు.

కాని ఇవిడ చుస్తే కాలేజీ అమ్మాయిని మరిపిస్తోంది" అనుకున్నాడు మనసులో.  అంతే కాకుండా  ప్రతి దానికి "నాకు  సిజేరియన్ అయింది, బరువు పనులు చెయ్యకూడదు" అని సాకులు చెప్పే తన భార్య మిద పికలదాక కోపం వచ్చింది. 

ఆఫీసు లో అందరు నాజుకుగా,  సుందరంగా కనపడసాగారు కిరణ్ కు తన భార్య తప్ప. ఎన్ని గొప్పలు పోయాడు పెళ్ళయిన కొత్తలో, తన భార్య చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అందమయింది. ప్రతి వెధవ కుళ్ళు కోవాలి అని కోరుకునే వాడు. కాని ఇప్పుడు తానె కుమిలి పోతున్నాడు. సాయంత్రం వరకు ఆఫీసు నిండా ఉన్నా సమాంత , తమన్నా లను చూసి చూసి అలసి పోయాడు. ఇంటికి వెళ్లేసరికి అఖిల సోఫాలో కుర్చుని టీవీ చూస్తూ మిరప కాయ బజ్జీలు తింటోంది.

అప్పుడే అత్తగారు   మరో వాయ తెచ్చి తన ప్లేట్ లో ఉంచి "రా అయ్యా కాళ్ళు చేతులు కడుక్కో, నీకు పెడుతా బజ్జీలు" అంది.

అఖిల కారం కు నోరు ఉస్సు ఉస్సు అంటూ "సూపర్ కుదిరాయి బంగారు ఇవ్వాల" అంది నోరు ఊరిస్తూ.

"ఓహో అలాగ" అని మనసులో మాత్రం "తిను ఇకేం పని నీకు ! తినటం ఒళ్ళు పెంచటం" అనుకుని లోలోపల రుస రుసలాడుతూ బాత్రూం కు వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చాడు. 

కొద్ది సేపటికి తేరుకుని "ఈ రోజు ఎలాగయినా తనకు చెప్పాలి" అనుకుని తను కూడా సోఫా లో కూర్చున్నాడు. ఆ సమయంలో టీవీ లో సుమా యాంకరింగ్ చేసే ఏదో ప్రోగ్రాం వస్తోంది.

వెంటనే కిరణ్ "ఇంత వయసు వచ్చిన, పిల్లలు పుట్టిన  వీళ్ళు భలే మైంటైన్ చేస్తారు కాద !" అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ.

అఖిల ఏమి పట్టించు కోలేదు. మళ్ళి తనే అన్నాడు "బంగారు నువ్వు కూడా సరదాగా జిమ్ కు వెళ్ళి కాస్త గ్లామర్ పెంచవచ్చు కదా" అన్నాడు చిలిపిగా.

"నేనా ! పిల్లాడితో ఎలా కుదురుతుంది" అంది కాస్త చిరు కోపంగా.

"ఏముందిరా ! వాణ్ణి స్కూల్ లో దింపి వచ్చి ఇంట్లోనే థ్రెడ్ మిల్ మీద  నడిస్తే సరి. అలాగే సాయంత్రం కూడా కాస్సేపు చెయ్యు. నేను చెయ్యట్లేదా? నువ్వు తలచుకుంటే ఎంత చెప్పు" అన్నాడు ప్రోత్సహిస్తూ.

అప్పుడు అఖిల అనుమానంగా మొఖం పెట్టి "ఇప్పుడు గ్లామర్ పెంచి నేను షూటింగ్ కు వెళ్ళాలా? లేక తమరికి నామోషిగా ఉందా? " అంది. 

కిరణ్ మనసు చివ్వుకుమంది. కోపంగా "అంటే షూటింగ్ ఉంటేనే బరువు తగ్గుతార? స్లిమ్ గా ఉంటె ఆరోగ్యం అన్నా విషయం తెల్సా నీకు. ముప్పయెళ్ళకె ముసలి వాళ్ళు కావాలా?" అన్నాడు.

వెంటనే అఖిల అమ్మ లోపలి నుంచి వచ్చి "ఏంటయ్యా బాబు! పిల్లకు సిజేరియన్ అయింది అప్పుడే అలా మాట్లాడుతావు" అంది భాదపడుతూ.

"అవ్వన్ని  ఆయనకు ఎందుకమ్మా! సోకులు చేసుకోవాలి అంతే తెలుసు" అంది నిష్టూరంగా.

కిరణ్ కు ఉక్రోషం ముంచుకొచ్చింది "ప్రపంచం లో ఈమెకు మాత్రమే అయింది సిజేరియన్. ఇంకా మేపండి, అడ్డమయిన గడ్డి" అంటూ భయటకు వెళ్ళి పోయాడు కోపంగా.

ఇంటికి వచ్చేసరికి అఖిల, అత్త గారు  బెడ్ రూం లో ఏడుస్తూ కూర్చున్నారు. కిరణ్ వెళ్ళి అఖిలను గంట సేపు బ్రతిమాలితే కాని లేవలేదు.

తిని పడుకున్న తర్వాత కిరణ్ "బంగారు ! బాబు పుట్టాక ముందు నువ్వు కూడా జాబ్ చేసే దానివి మనకు బాగా అదా అయ్యేది. కాని ఇప్పుడు నేను ఒక్కణ్నె సంపాదిస్తున్నాను, ఎంత చేస్తే బ్రతుకుతాం చెప్పు? నా మాట విని లేని పోనీ భయాలు మాని ఇంట్లోంచి భయటకు రా" అన్నాడు బ్రతిమాలుతూ.

వెంటనే అఖిల "ఎంత చెప్పినా మీ గొడవ మీదే కాని నా గోడు వినరా? పిల్లాడిని పట్టుకుని నేనుంటే జిమ్ కు వెళ్ళు, జాబ్ కు వెళ్ళు అంటూ ఇలా నన్ను టార్చర్ పెట్టడం అవసరమా మీకు" అంటూ మళ్ళి ఏడుపు అందుకుంది.

కిరణ్ మారు మాట్లాడకుండా అటు తిరిగి పడుకున్నాడు. అఖిల అలాగే ఏడుస్తూ ఎప్పుడు పడుకుందో తెలియదు.

మరునాడు ఆఫీసుకు వెళ్ళిన కిరణ్ కు రజని ఎదురయి "ఈ రోజు నా బర్త్ డే, లంచ్  ఇస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి" అంది కొంటెగా నవ్వుతు.

"మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ అఫ్ ది డే" అని చెప్పి వెళ్ళి పోయాడు.

తర్వాత లంచ్ టైం లో కిరణ్ దగ్గరికి వచ్చి "వెళ్దామా" అంది రజని.

పార్కింగ్ దగ్గరికి వెళ్లేసరికి ఎవరు లేరు తాము ఇద్దరు తప్ప అప్పుడు కిరణ్ అడిగాడు రజనిని "మిగత వారు ఏరి?" అని.

"ఎవరు రారు ! ఇది నీకె స్పెషల్ ట్రీట్" అంది  కవ్వింపుగా నవ్వుతూ.

కిరణ్ కు అంత కలల ఉంది, కాని చాల బాగుంది అనుకున్నాడు. ఆ రోజంతా రజని తన డెస్క్ దగ్గరే ఉంటూ ఎన్నో కబుర్లు చెప్పింది. ఎప్పుడు లేనిది ఆఫీసు నుంచి లేట్ గా వెళ్ళాడు ఇంటికి.

వెళ్లేసరికి అఖిల కొడుకుకు అన్నం తినిపిస్తోంది. అప్పుడు అత్తా గారు వచ్చి "చూడయ్య నీ కొడుకు నేను తినిపిస్తే తినడట! ఎన్ని రోజులుగా అలవాటు చేసుకుందామన్న అవ్వటం లేదు. అన్నింటికీ వాళ్ళ అమ్మే కావాలి" అంది నోరు నొక్కుకుంటూ.

దానికి అఖిల "ఎవరికీ అర్ధం అవుతాయి అమ్మా ఈ భాధలు, మాట్లాడితే అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పటం తప్ప" అంది విసుగుకుంటు.

కొడుకును ముద్దాడి డ్రెస్ మార్చుకొని వచ్చి అన్నం తిని పడుకున్నాడు ఏమి మాట్లాడకుండా.

కిరణ్ కు తెలియకుండా రజనికి చాల దగ్గర అవుతున్నాడు. ఆమెను అప్పుడప్పుడు అక్కడక్కడ ముట్టు కున్న కూడా రజని ఏమి అడ్డు చెప్పటం లేదు. ఆమెకు కష్టం కలుగ కూడదని తన పని కూడా చేస్తూ, తనను హాస్టల్ దగ్గర దింపేసి రోజు ఇంటికి  లేట్ గా రావటం అలవాటు చేసుకున్నాడు కిరణ్.  అఖిల, కిరణ్ ఎప్పుడో అవసరం ఉంటె కాని మాట్లాడుకోవటం లేదు.

ఒక రోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చిన కిరణ్ మంచి డ్రెస్ వేసుకుని మళ్ళి భయటకు వెళ్ళటం చూసినా అఖిల "మళ్ళి ఎక్కడికి" అంది.

"కంపెనీ లో ఫ్యామిలీ పార్టీ ఉంది" అన్నాడు కిరణ్.

"ఫ్యామిలీ పార్టీ అంటే మేము కూడా రావచ్చు కదా !" అంది ఉత్సాహంగా.

"పిల్లాడితో నికేక్కడ కుదురుతుంది" అని వెటకారంగా చెప్పి భయటకు నడిచాడు.

అఖిల కళ్ళలో నీరు జల జల రాలి పోయింది.

కిరణ్, రజని విషయం తెలిసిన ప్రాజెక్ట్ మేనేజరు రజనిని వేరే టీం లీడ్ కిందికి మార్చింది. దాంతో రజని కిరణ్ తో మాట్లాడటమే ఆపేసింది.

దాంతో పిచ్చేకి పోయినా కిరణ్ "నీకోసం ఎంత చేశాను ! కనీసం మాట్లాడటం లేదు" అని నిలదిసాడు.

"ఉరికే చేశావ? ఎప్పుడు పడితే అప్పుడు నీ వెనుక తిరిగాను, నన్ను ముట్టుకోనిచ్చాను, నీ బైక్ మిద తిరిగాను అందుకే చేశావ్. ఇప్పుడు నేను వేరే టీం అందుకే నీకు నాకు సంబందం లేదు" అంది నిర్లక్ష్యంగా.

కిరణ్ కు మతి పోయింది. ఏమి చెయ్యలేక తలదించుకుని తన డెస్క్ దగ్గరికి వచ్చేశాడు.

ఆ రోజు వీకెండ్ కావటం తో అఖిల భయటకు వెళ్ళలనుకుని కిరణ్ తో అంది "బంగారు ! ఐ మాక్స్ లో చోట భీమ్ సినిమా వచ్చింది. బాబు కు ఆ కార్టూన్ షో అంటే చాల ఇష్టం. మమల్ని సినిమా తిసుకేళ్తవా" అంది బ్రతిమాలుతూ.

రజని విషయం బెడిసి కొట్టటంతో విసిగి పోయి ఉన్నా కిరణ్ "పిల్లాడితో నికేక్కడ కుదురుతుంది. అయినా నాకు ఆఫీసు లో పనుంది" అని వెళ్ళి పోయాడు.

అప్పుడే అఖిల అమ్మ ప్లేట్ లో చికెన్ బిర్యానీ వేసుకుని తెచ్చింది. అఖిల కోపంగా "ఏంటమ్మా ! ఇదేమన్నా హోటల్ అనుకున్నావా ?ఇల్లనుకున్నావా?  ఎప్పుడు ఏదో ఒకటి వండి నన్ను మేపక పొతే. నీకేం తోచక పొతే పిల్లాడ్ని ఆడించు, వాణ్ణి దగ్గరుండి చూసుకో. ఇలా వంటలు చేసి నన్ను తిండి పోతును చెయ్యొద్దు" అంది.

అఖిల అమ్మ "నీకు వండి పెట్టడం నా తప్ప" అంది భాదపడుతూ.

"తప్పు కాదమ్మా ! కాని అవసరానికి మించి తినటం మంచిది కాదు అని చెపుతున్నా" అంది తనను ఓదారుస్తూ.

ఆఫీసు లో ఉన్నా కిరణ్ కు తన వారు, పరాయి వారు తెలిసి వచ్చింది. "తన భార్య లావుగా ఉంటె ఏంటి? ఈ రోజు కాక పొతే రేపు తగ్గిపోతుంది, కాని పోయినా కాలం తిరిగి రాదు" అనుకున్నాడు. 

సాయంత్రం ఇంటికి వచ్చిన కిరణ్ కు అఖిల థ్రెడ్ మిల్ మిద చెమటలు కక్కుతూ పరుగుపెడుతూ కనిపించింది.

అది చూడగానే కిరణ్ కు ఎక్కడలేని సంతోషం, వెంటనే  అఖిల దగ్గరికి వెళ్ళి "సారి రా పొద్దున్న మూడ్ బాగా లేదు" అని చెప్పి లోపలికి  వెళ్ళి పోయాడు.

కాస్సేపటికి పక్కింటి ఆవిడా వచ్చింది తమ కొడుకు వయసే ఉన్నా వాళ్ళ  కొడుకుని  తీసుకుని. ఆవిడా, ఆమె భర్త ఇద్దరు జాబ్ చేస్తారు పిల్లాడిని ఎక్కడో డే కేర్ లో ఉంఛి.

"అసలు వీళ్ళ  అబ్బాయి  తిండి తింటాడో లేదో పాపం!  చాల బక్కగా, జీవం లేకుండా ఉన్నాడు" అనుకున్నాడు కిరణ్. 

టీవీ లో ఏవో అడ్వటైజ్ మెంట్ లు వస్తుంటే తమ కొడుకు A B C అని గుర్తుపడుతున్నాడు.  కాని వాళ్ళ అబ్బాయి మాత్రం ఏమి మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నాడు.

"డబ్బులు తీసుకుని వీడికి ఎం చెపుతున్నారో ఏమో నండి" అంది ఆవిడా.

అఖిల "నేను దగ్గరుండి చెపుతున్నాను కాబట్టి వీడికి వచ్చండి" అంది కాస్త గర్వంగా.

ఆవిడా వెళ్ళి పోయిన తర్వాత కిరణ్, అఖిల దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకుని "థాంక్స్ వేరి మచ్. నువ్వు ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకో" అన్నాడు మనస్పూర్తిగా.

అందుకు అఖిల "మీరు ఒక్కరు ఎంత చేస్తే బ్రతుకుతాం. బాబు కు చెప్పటానికి నేను ఇంటి దగ్గర ఉండనవసరం లేదు. మళ్ళి నాలో పాత అఖిలను చూస్తారు" అంది విశ్వాసంగా.

కిరణ్ మనసు గాలిలో తేలియాడింది. ఇప్పుడు అఖిల తనకు ఇలియానా, సమాంత కన్న అందంగా   కనిపించ సాగింది. అఖిల కు కూడా చాల రోజుల తర్వాత ఎక్కడలేని కొత్త ఉత్సాహం, ఏదో సాదించాలని తపన మొదలయింది. ఇద్దరు ఒక్కసారిగా కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు సంతోషంగా.

ఇలాంటి కిరణ్ లు, అఖిలలు మన మద్య చాల మంది ఉన్నారు. ఒక బిడ్డ పుట్టగానే జీవితం అంత అయిపొయింది అని రిలాక్స్ అయ్యే భార్యలు. భార్య ఇబ్బందులు, భాద్యతలు అర్ధం చేసుకోకుండా ఎప్పుడు ఆమె అందంగా ఉండాలనుకునే భర్తలు. దీనికి పరిష్కారం ఒకరి భాద్యతలు ఒకరు పంచుకోవటం, ఎదుటి వారి  ఇబ్బందులు, కోరికలు కనిపెట్టుకుని మసలు కోవటం.

(సమాప్తం)