2, మార్చి 2013, శనివారం

కంప్యూటర్ ఇంజనీర్

(నవ్వువస్తే నవ్వుకోండి, రాక పొతే చెప్పి పొండి)

సుబ్బారావు చిన్నపటి నుంచి ఊర్లోనే పెరిగాడు. ఆపైన  చదువు కోసం పక్కనే ఉన్నా వాళ్ళా జిల్లా కు వచ్చి డిగ్రీ ఇంకా ఫీజీ పూర్తీ చేశాడు. తన చిన్న నాటి క్లాస్మేట్స్ అందరు MCA చేసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయి పెద్ద పెద్ద జీతాలు ఎత్తుతుంటే పాపం చాల భాద పడి పోయాడు. ఇంకా వాళ్ళకు వస్తున్నా కట్నాలు అయితేనేమి, అమెరికా కో లేక సింగపూర్ కో వెళ్ళి బాగా సంపాదించటం చూసి అయితేనేమి మనోడు కూడా ఓ రోజు పొద్దున్నే నిర్ణయం తీసుకున్నాడు  తాను కూడా కంప్యూటర్ ఇంజనీర్ కావాలని.

అందుకే తను చదివింది M.Com అయినా కూడా కంప్యూటర్ జాబు కొట్టాలని ఆశయంగా పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసాడు.  తర్వాత అమీర్ పేట లో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో చేరి  ఏదో ఒకటి నేర్చుకుని ఎలాగయినా జాబు సంపాదించాలనుకున్నాడు. క్లాసు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రాక్టీసు చెయ్యటానికి  లాప్టాప్ కూడా కొన్నాడు.

మరునాడు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి "ఒరేయ్ మామ  నిన్ననే లాప్టాప్ కొన్నాను" అని చెప్పాడు చాల ఉషారుగా.

సుబ్బారావు సంగతి తెలిసిన అతని ఫ్రెండ్ "విడి మొహానికి లాప్టాప్ అవసరమా?" అనుకుని "కంగ్రాట్స్ మామ. ఇంతకూ ఎం లాప్టాప్" అన్నాడు ఆశ్చర్యంగా.

సుబ్బారావు ఇంకా ఉషారుగా "బ్లాక్ కలర్  మామ" అన్నాడు.

అతని ఫ్రెండ్ కు మతి పోయింది. అయిన తమాయించుకుని "అది కాదురా ! ఎం కంపెనీ ది" అన్నాడు మళ్ళి.

సుబ్బారావు అటుఇటు చూసి బ్లూ కలర్ లో స్టికర్ మీద ఉన్నా పేరు చదివి "ఇంటెల్ అని ఉంది మామ" అన్నాడు.

అతని ఫ్రెండ్ "ఓరి నాయనో ! విడు మామూలోడు కాదు" అనుకుని "అది కాదురా స్క్రీన్ పైన ఉంటుంది, దాని పేరు చెప్పురా" అన్నాడు ఓపిక తెచ్చుకుంటూ.

సుబ్బారావు స్క్రీన్ మూసి దాని పేరు చదివి "డెల్ అని ఉంది మామ, అదేనా" అన్నాడు అనుమానంగా.

అతని ఫ్రెండ్ "బతికించావు రా నాయనో" అనుకుని "మంచి కంపెనీ, ఇంతకూ కన్ఫిగరేషన్ ఏంటి మామ" అన్నాడు.

సుబ్బారావు అయోమయంలో పడి "అంటే ఏంటి మామ ! అదెక్కడ ఉంటుంది" అన్నాడు అటుఇటు లాప్టాప్ తిప్పుతూ.

అతని ఫ్రెండ్ "నిన్ను ఈ ప్రశ్న అడిగినందుకు నన్ను నేను  చెప్పుతో కొట్టుకోవలిరా" అనుకుని "లైట్ తీసుకో మామ ! ఇంతకూ ఎంతకు కొన్నావ్ రా" అన్నాడు.

"మొత్తం కలిపి 35,000 అయ్యింది మామ" అన్నాడు గొప్పగా.

అతని ఫ్రెండ్ "అబ్బో బాగానే గొప్పలు పోతున్నవ్ రా" అనుకుని "మరి నెట్ ఉందా" అని అడిగాడు.

సుబ్బారావు మళ్ళి అయోమమయం లో పడ్డాడు. సర్లే ఏముంది అనుకుని "అంత కాస్ట్లీ కాబట్టి అన్ని ఉంటాయి లే మామ" అన్నాడు ఇంకా గొప్పగా.

అతని ఫ్రెండ్ కు  పిచ్చేకి పోయింది "నీ లాంటి వేదవకు కంప్యూటర్ ఎందుకురా ! ఏ కంపెనీ ని నాశనం చెయ్యాలని బయలు దేరావు" అనుకుని ఫోన్ కట్ చేశాడు.

సుబ్బారావు మాత్రం "వీడికి కుళ్ళు ! వెధవ" అనుకుని దానితో కుస్తీ పట్టసాగాడు.

అతని లో ఉన్నా గొప్ప విషయం అమాయకత్వం మరియు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్. ఎవరయినా ఏదయినా అడిగితె తెలియదు అనకుండా ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉంటాడు. చాల  సార్లు అలాగే భయట పడుతూ ఉంటాడు, కాని ఎదుటి వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఇలాగె ఒకసారి క్లాసు లో డేటాబేస్ లో టేబుల్ గురించి చెపుతున్నాడు అతని ఇన్స్టిట్యూట్ లో సార్. మనోడికి టేబులు, కుర్చీ గురించి తెలుసు ఇంకా మాట్లాడితే సోఫా గురించి తెలుసు కాని కంప్యూటర్ లో ఈ టేబుల్ గొడవ ఏంటో తెలియ లేదు. సీరియస్ గా లేచి "సార్ !  ఎక్కడయినా రోస్ లో టేబుల్స్ ఉంటాయి కాని టేబుల్ లో రోస్ ఉండటం ఏంటి ? మళ్ళి ఈ కాలమ్స్ గొడవేంటి"  అంటూ  అడిగాడు అమాయకంగా.

పాపం ఆ సార్ కి పిచ్చేకినంత పనయింది, క్లాసు లో ఒక్కటే నవ్వులు.

ఇలాంటిదే ఇంకొక సంఘటన జరిగింది C# క్లాసు లో. ఆ రోజు టాపిక్ మల్టీ థ్రెడ్ గురించి, మనోడికి ఆ థ్రెడ్ (దారం)  లా గొడవ ఏంటో తెలియలేదు.

 డౌట్ ఉంటె ఆపుకోలేని మనస్తత్వం ఉన్నా మనోడు కుతూహలంతో లేచి "సార్ ! థ్రెడ్ అంటే తెలుగు లో దారం, అసలు కంప్యూటర్ కు దారాలకు సంబందం ఏంటి ? " అన్నాడు.

ఒక క్షణం  క్లాసు అంత బిత్తర పోయి చూసి, నవ్వటం మొదలు పెట్టారు. ఆ సార్ కి ఎక్కడ లేని కోపం వచ్చింది, విసుగ్గా మొహం పెట్టి "దారాలన్నీ పేర్చి, తాడుల  పెని ఉరేసుకోవటానికి" అన్నాడు.

అప్పుడు కాని తెలియలేదు మనోడికి తనేదో తింగరి డౌట్ అడిగానని.

తర్వాత ఎలాగో కష్టపడి చిన్న చిన్న అప్లికేషన్స్ చెయ్యటం నేర్చుకున్నాడు సుబ్బారావు. అమీర్ పేట లో ఫేక్ ఎక్ష్ప్రిరియన్స్  సర్టిఫికేట్ సంపాదించి జాబు కోసం ఇంటర్వ్యూ లు అటెండ్ అవ్వటం మొదలు పెట్టాడు. ఎట్టకేలకు మనోడి పంట పండింది, ఇంటర్వ్యూ చేసే వాడి దుంప తెంప టానికి బయలు దేరాడు.

ఇంటర్వ్యూ మొదలు అయింది, మొదటి ప్రశ్న ఇలా అడిగాడు కంపెనీ అతను "నీ గురించి చెప్పు".

మనోడు ఉషారుగా "నాపేరు సుబ్బారావు, మాది కాకినాడ, నాకు ఒక అమ్మ ఇంకా నాన్న ఉన్నారు. నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను" అన్నాడు.

ఇంటర్వ్యూ చేసే అతను ఏదో తేడా కొడుతుంది అనుకుని "మరి ఈ జాబ్ కు ఎందుకు వచ్చావ్ ?" అన్నాడు.

"ఎక్కువ సాలరి కోసం" అన్నాడు సుబ్బారావు తడుము కోకుండా, ఇంటర్వ్యూ చేసే అతను నోరు వెళ్ళ  బెట్టాడు.

తొందరగానే కోలుకుని తర్వాత ప్రశ్న అడిగాడు "అసలు .Net ఎందుకు వాడుతారు ?" అని.

దానికి వెంటనే సుబ్బారావు "ప్రోగ్రాములు చెయ్యటానికి" అన్నాడు.

ఇలా కాదు రిసనింగ్ చెక్ చేద్దాం అనుకుని "ఒక చెట్టు ఉంది, దాని మీదా కొన్ని కాకులు,  అవి ఎన్ని ఉన్నాయో చెప్పమంటే ఎం చేస్తావ్?" అని అడిగాడు.

సుబ్బారావు బిగ్గరగా నవ్వి "ఏదో ఒక అంకె చెప్పేస్తా, డౌట్ ఉంటె నువ్వే లెక్క  పెట్టుకో అంటా !"  అన్నాడు ముసిముసిగా నవ్వుతు.

ఇంటర్వ్యూ చేసే అతనికి తిక్క రేగి "లెక్క పెట్టాను తప్పు చెప్పావు అంటే ఎం చేస్తావు" అన్నాడు కోపంగా.

"సింపుల్ ! ఎన్ని ఉన్నాయో అడిగి ఎక్కువుంటే  ముందు చెప్పిన దాంట్లోంచి తీసి వేసి చెపుతా ! తక్కువుంటే కలిపి చెపుతా"  అన్నాడు అలాగే నవ్వుతూ.

అతని కోపం నషాళానికి అంటింది "అంత కష్టపడటం దేనికి? నేను చెప్పిన అంకెనే మళ్ళి చెపితే సరి పోతుంది కదా! బాబు నీకో దండం ! నీకు ఉద్యోగం ఇవ్వటం మా వాళ్ళ కాదు,  ఇక్కడ నుండి వెళ్ళి  పో " అన్నాడు రెండు చేతులతో దండం పెడుతూ.

సుబ్బారావు తన తెలివికి తనకే ముచ్చటేసింది, ఉద్యోగం రాకపోయినా గర్వంగా భయటకు నడిచాడు.

ఆ రకంగా వచ్చిన కొన్ని ఇంటర్వ్యూ లు కూడా అతి తెలివి తో పోగొట్టుకుని, మనకు ఇండియా కాదు సింగపూర్ రైట్ ప్లేస్ అనుకున్నాడు.

సింగపూర్ లో ఉన్నా తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి "ఒరేయ్ మామ నేను సింగపూర్ వద్దామనుకుంటున్నాను ! ఎం చెయ్యాలో చెప్పురా" అంటూ అడిగాడు.

"ముందు పాస్ పోర్ట్ ఉండాలి ఆ తర్వాత వీసా రావాలి" అన్నాడు అతని ఫ్రెండ్.

"అబ్బా ఆ మాత్రం తెలుసు లేరా! ముందు కంప్యూటర్ లో ఎం చెయ్యాలో చెప్పురా" అన్నాడు బ్రతిమాలుతూ.

"ఇంతకూ నువ్వేం చేసావో చెప్పు" అన్నాడు అతని ఫ్రెండ్.

".Net అగ్గి తీస్తా మామ" అన్నాడు గర్వంగా.

"అగ్గి తీస్తే బొగ్గయి బూడిద మిగులుతుందేమో" అన్నాడు వెటకారంగా.

"నీ కుళ్ళు జోకులు అపురా బాబు.  నేను అక్కడకి వస్తే నన్ను కొంచెం చుసుకోరా మామ" అన్నాడు.

వాడికి వీసా ఎవడిస్తాడు లే అనుకుని "ఎంత మాట మామ ? ని కోసం ప్రాణం ఇస్తా. ముందు నువ్వు ఇక్కడికి రా చెపుతా" అన్నాడు ఆవేశంగా.

అంతే మనోడు అప్పుడే సింగపూర్ వెళ్ళినట్లు కలలు కంటూ వీసా కు అప్లై చేశాడు.

ఓ శుభ దినాన మనోడికి వీసా వచ్చి సింగపూర్ కు ప్రయాణం అయి పోయాడు. మొదటి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు.

ఇంటర్వ్యూ చేసే అతను "ఏ ఫ్లాట్ పామ్స్ మిద వర్క్ చేసావ్" అన్నాడు.

మనోడు వెంటనే "విండోస్" అన్నాడు టక్కున.

అతను ఆశ్చర్య పోయి "ఏంటి విండోస్ మిద వర్క్ చేసావా ! నువ్వు డెవలప్ చేశావా?" అన్నాడు.

సుబ్బారావు చాల కాన్ఫిడెంట్ గా "అవును" అన్నాడు. అంతే ఇంటర్వ్యూ చేసే  అతను గబా గబా భయటకు పరుగు పెట్టి  "విండోస్ డెవలప్ చేసిన వాడు మన కంపెనీకి వచ్చాడు"  అని అందరికి చెప్పేసాడు.

ఇంకా అందరు సుబ్బారావు ను చూడటానికి రాసాగారు. సుబ్బారావు కు ఏమి అర్ధం కావటం లేదు, కాని చాల సంతోషంగా ఉంది.

"ఇక్కడ విండోస్ అని చెపితేనే ఇంత గొప్పగా చూస్తున్నారు, ఇంకా .Net అని చెపితే ఇంకేం అవుతారో" అనుకున్నాడు. అర్జెంటు గా కంపెనీ సీఈఓ ను పిలిచి సుబ్బారావు తో మీటింగ్ అరేంజ్ చేశారు.

సీఈఓ వచ్చి సుబ్బారావు కు షేక్ హ్యాండ్ ఇచ్చి "ఎప్పుడు డెవలప్ చేసారు మీరు విండోస్" అంటూ అడిగాడు.

సుబ్బారావు గర్వంగా "రోజు గంట రెండు గంటలు చేస్తుంటాను. నిన్న కూడా చేశాను" అన్నాడు.

సీఈఓ కు అనుమానం వచ్చి "మీరు విండోస్ డెవలప్ చెయ్యలేదా ! అంటే మీరు కోడ్ రాయలేదు కద? విండోస్ కు" అన్నాడు.

సుబ్బారావు కాస్త చిరాకు పడి "ఏంటి  మాన్ ! నేను విండోస్ మీదా డెవలప్మెంట్ చేశాను, కోడ్ కూడా రాశాను" అన్నాడు.

అప్పుడు గాని అందరికి అర్ధం అయ్యింది అసలు విషయం. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి సుబ్బారావు ను భయటకు తోసేసారు. సుబ్బారావు కు మాత్రం  ఎందుకు అలా చేశారో అర్ధం కాలేదు.

అలా చాల ఇంటర్వ్యూ లు అటెండ్ అయి విసిగి పోయి కన్సల్టెంట్ గా మారి పోయాడు. ఒక కంపని నుంచి పిలుపు వచ్చింది ఏదో వర్క్ ఉంది అని. మనోడు ఉషారుగా వెళ్ళి కలిసాడు కంపెనీ MD ని.

అతను తనకు కావలసిన అప్లికేషను గురించి ఇలా చెప్పాడు "నాకు లిఫ్ట్ ఎన్నో ఫ్లోర్ లో ఉందొ తెలిసే అప్లికేషన్ కావాలి" అన్నాడు.

దానికి సుబ్బారావు "అది చాల సింపుల్" అన్నాడు.

MD ఆశ్చర్య పోయి "ఎన్ని రోజులు కావాలి" అన్నాడు.

"రెండు రోజులు చాలు" అన్నాడు నిర్లక్ష్యంగా.

MD వినయంగా "అయితే డెమో రెండు రోజుల తర్వతా చూద్దాం" అని చెప్పి వెళ్ళి పోయాడు.

సుబ్బారావు కు ఏదో రూం ఇచ్చారు అక్కడే ఆఫీసు లో. అంతే మనోడికి కన్నీరు కారి పోయాయి ఆనందం తో. రెండు రోజులు కుస్తీ పట్టి అప్లికేషను చేశాడు.

డెమో ఇచ్చే రోజు MD వచ్చి అప్లికేషను చూపించమన్నాడు. సుబ్బారావు తను చేసిన అప్లికేషను ఓపెన్ చేసి చూపించాడు.

అప్పుడు MD "ఇందులో లిఫ్ట్ ఎక్కడ ఉంది ఎలా తెలుస్తుంది" అని  అడిగాడు.

సుబ్బారావు గర్వంగా చూసి అప్లికేషన్ లో ఉన్నా ఒక్క బటన్ పై క్లిక్ చేశాడు, అప్పుడు "ఫస్ట్ ఫ్లోర్" అంటూ మెసేజ్ డిస్ప్లే అయింది స్క్రీన్ మీద. MD బిత్తర పోయి చూస్తుంటే,  సుబ్బారావు గర్వంగా చూసి ఇంకో బటన్ మీద నొక్కాడు తన అప్లికేషన్ లో అప్పుడు "సెకండ్ ఫ్లోర్" అని మెసేజ్ డిస్ప్లే అయింది. సుబ్బారావు సంబరంగా MD వంక చూశాడు. అతనికి పట్ట పగలే చుక్కలు కనిపించినట్లు ఉన్నాయి. కూర్చిలో కూలబడి సుబ్బారావు నే ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు.

అది కూడా మనతోని కాదు అనుకుని తెలుగు సినిమా డీవీడీ లకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రాయటానికి కుదిరాడు. అప్పటి నుంచి ఏ తెలుగు సినిమా డీవీడీ తన దగ్గరకు వచ్చిన  వాటిలో డైలాగులకు డిక్షనరీ లో పదాలు వెతికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రాస్తూ ఉంటాడు.

కొన్ని సార్లు ఓపిక లేక పొతే తనకు తోచ్చినట్లు రాసేస్తూ ఉంటాడు.  అందుకే కొన్ని సార్లు ఘోరంగా ఉంటాయి తెలుగు సినిమాకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఉదాహరణకు నెయ్యిని ఇంగ్లీష్ లో ఘీ అని చెప్పే బదులు బట్టర్ మిల్క్ జ్యూస్ అని వేస్తారు సబ్ టైటిల్ లో.  మన సుబ్బారావు కంప్యూటర్ ఇంజనీర్ కల మన తెలుగు సినిమా డీవీడీ సబ్ టైటిల్స్ ను అ రకంగా నాశనం చేసింది.


(సమాప్తం)

4 వ్యాఖ్యలు:

 1. సాయారాం గారు,సుబ్బారావుకి ఏదో ఒక జాబ్ ఇప్పించాల్సింది. బాగుంది:)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నాకు ఈ పోస్ట్ నచ్చలేదండీ. అమాయకత్వం మీద కామెడీ రాసినట్టు అనిపించింది. పీజీ చేసిన సుబ్బారావు కంపెనీ పేరు కూడా తెలియకుండా లాప్టాప్ కొనడం అతకలేదనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిజంగానే ఉంటారండి ! వారికి కంపెనీతో పనిలేదు చూడటానికి బాగుందా ! బాగా పని చేస్తుందా అంతే కావలి. సాఫ్ట్ వేర్ జాబ్స్ అంటే ఉన్నా పిచ్చి మీద చమత్కారంగా రాసిందే కాని ఆ అమాయకత్వం మీద మాత్రం కాదండి. నా బ్లాగ్ చూసినందుకు చాల సంతోషం.

   తొలగించు