20, ఫిబ్రవరి 2013, బుధవారం

హీరో కృష్ణ

సినిమా హీరో  పై  ఆరాధన  చూసి హీరో అయ్యావు 
ఆనతి కాలంలోనే దాన్ని నీపై  రెట్టింపు చేశావు 
పర్వాలేదు అన్న వారే "ఔరా" అనేలా చేశావు 
తెలుగు సినిమా లో నీ స్థానం సుస్థిరం చేశావు 

తెలుగు సినిమాను ప్రపంచానికి చాటావు
నీలో తెగింపు కు ఉన్నా వాడిని చూపావు 
నీ ధైర్యానికి ఎల్లాలు లేవని నిరుపించావు 
తెలుగు సినిమాకు కౌబాయ్ గా మారిపోయావు 
చరిత్రలో మిగిలి పోయావు

ఎవరు ముట్టని కధలు నువ్వు సినిమా  తిశావు 
ఎక్కడ లేని పాత్రలకు జీవం పోసావు 
ఇంతకన్నా ఏముంది అని ఒప్పించావు 
"నువ్వు శబాష్"  అని ప్రత్యర్తి తోనే చెప్పించావు
"అల్లూరి"  వై మా గుండెలో నిండి పోయావు 

పరాజయాలు నిన్ను వెన్నంటి ఉంటున్నా 
నీ మజిలి ముగిసిందని  లోకులు నవ్వినా 
మొక్కవోని నీ ధైర్యం ఓటమిని గెలిచింది 
విజయం అలసిపోయి నిన్ను చేరింది 
నీ కీర్తి అప్పటికే గగనం దాటింది 

నీ చలువతో తెలుగు సినిమా 
ఎన్ని కొత్త పుంతలు తొక్కింది 
ఎన్ని రంగులు అద్దుకుంది 
ఎంత పెద్దది గా మారింది 
ఎన్ని మాటలు నేర్చింది 
ఎంత గా సంపాదించింది 
మరువ గలమా?  మర్చి పొతే 
"సాహసం"  అనే పదాన్ని చేరిపెస్తాం 
"ధైర్యం" అనే  రెండక్షరాలు లేకుండా చేస్తాం 
  
విసమెత్తు ప్రతిభకు నువ్వు ప్రోత్సాహం 
అందులో నీ మనసు ఎంతో విస్తారం 
నువ్వు నిలిపిన  ఎన్నో జీవితాలు 
ఇప్పటికి చెపుతాయి ఆ సత్యాలు 

అలుపులేని నీ శ్రమ  ఎందరికి అన్నం పెట్టింది 
నువ్వు పంచిన విజయం ఎందరిని నిలిపింది 
నువ్వు నడిచిన బాట ఎందరిని నడిపింది 
నీ చల్లని మనసు ఎంత ప్రేమను పంచింది 
ప్రత్యర్థి నయినా కదిలించే నీ నిర్మలత్వం 
మంచి ఎక్కడ ఉన్నా నువ్వు చూపే ఆదరణ
పసి మనసు ను తలపిస్తుంది 
నిన్ను అందరివాడు చేస్తుంది

నీ పేరు లో  "నట శేఖరుడు" చేర్చిన 
"సూపర్ స్టార్"  అని అలంకరించిన 
ఎప్పుడు నువ్వు మా "కృష్ణ" వె 
ముద్దుగా పిలుచు కునే మా "కిట్టయ్య"  వె 3 వ్యాఖ్యలు: