19, ఫిబ్రవరి 2013, మంగళవారం

మట్టి మనిషి

రెండు కళ్ళు దినంగా ఆకాశాన్ని చూస్తాయి
మబ్బు పట్టగానే దిపాళ్ళ మెరుస్తాయి
గాలులు విచాగానే వెలుగులు అరుతాయి
ఎండి పోయిన చెరువు చూసి
ఆ గుండె అవిసి పోతుంది
మేతలేని పశువులను చూసి
ఆ కడుపు తరుక్కు పోతుంది

తిండి గింజలు లేక
నీటి చుక్క దొరకక
బ్రతుకు భారమవుతున్న
ఎక్కడో తేలిక పాటి ఆశ ,
వర్షం రాకపోతుందా !
నేల దాహం తిరక పోతుందా !
ఎండిన పంట చిగుర్చక పోతుందా !
మోడువారిన బ్రతుకు మారక పోతుందా!
ఆ ఆశే ఆవిరిగా మారిందేమో
ఆ నమ్మకమే మేఘలుగా కమ్మిందేమో 

తొలకరి చినుకులు ముత్యాలుగా కురిసాయి
పుడమి పాలిట అమృత ధారలయ్యాయి, కాని
ఆ అనందం ఎంతో సేపు నిలవలేదు
వారం అయినా వర్షానికి అలసటే లేదు
మట్టి మనిషికి దిక్కు తోచటం లేదు
ఎండిన చెరువుకు గండి పడింది
వరద నీరు పొంగి పారింది
పంట పొలాలు ముంచేసింది

ప్రకృతి పై అలిగిన ఆ పుడమి పుత్రుడు
సుడి గుండం లో దూకేసాడు
ప్రకృతికి తన బ్రతుకు బలి చేశాడు
మరు ఎటికయినా  తన వారిని
చల్లగా చూస్తుందని

పాద యాత్రలు చేసే పాలకులు
ఉద్యమాలు చేసే నాయకులు
నీతులు వల్లించే పెద్దలు
అన్నదాత అంతం అవుతున్నాడని
అడవి నీతి అమలు అవుతుందని
గుర్తించండి, మట్టి మనిషిని కాపాడండి.


2 వ్యాఖ్యలు: