5, ఫిబ్రవరి 2013, మంగళవారం

నువ్వేంటి గొప్ప ! ఇది ప్రేమ కాదు !!

(కొన్ని సార్లు అతి చిన్న కారణంగా జీవితానికి సరిపడినంత భాదను ముటగట్టు కుంటూ ఉంటాం. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నపుడు, అలాంటిది ప్రేమ విషయం లో జరిగితే అన్న చిన్న ఉహకు ఇ కథ రూపం. గొప్ప మలుపులు ఏమి ఉండవు, గొప్ప ఫీలింగ్స్ ఏమి ఉండవు. కాని నచ్చుతుందన్న దైర్యం తో రాసాను, నచ్చక పొతే ఓ తిట్టు తిట్టేయ్యండి.)కొత్తగా స్కూలు కు వెళ్తున్నా కుర్రాడు ఎలా భయపడుతాడో అలాగే ఉంది రమణ పరిస్తితి కుడా. కొత్తగా ఇంజనీరింగ్ లో చేరి మొదటి రోజు కాలేజీ కి బయలు దేరాడు.  ఎంత ఇంటర్ వరకు చదివినా మళ్ళి ఇంజనీరింగ్ కాలేజీ కి  మొదటి రోజు అనేసరికి ఎక్కడో బెరుకుగా ఉంది. బసు లో వెళ్తున్న తనకు మనసు నిండా సందేహాలే, కాలేజీ ఎలా ఉంటుందో తోటి విద్యార్తులు ఎలా ఉంటారో అసలు ఆ వాతావరణం తనకు నచ్చుతుందో లేదో ఇన్ని ఆలోచిస్తూ కాలేజీ బస్సు స్టాప్ లో దిగి కాలేజీ వైపు నడిచాడు. 


అసలే ఇంటర్ వరకు తెలుగు మీడియం లో చదివిన తనకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనుకుంటూ వెళ్తున్న తనకు ఎవరో అమ్మాయి వచ్చి "ఎయ్ మిష్టర్ ! వాట్ ఇస్ టైం నౌ" అని అడిగే సరికి ఎం చెప్పాలో తెలియక ఒక్కసారిగా "రమణ" అన్నాడు. తర్వాత అర్ధం అయింది ఆ అమ్మాయి తనను టైం అడిగిందని. అంతే ! సిగ్గు తో తలదించుకుని ముందుకు నడక సాగించాడు.  ఆ అమ్మాయి మాత్రం వెక్కిరింపుగా నవ్వుతూ వెళ్ళి పోయింది. 

జరిగిన అవమానానికి రమణ కు చాల భాదగా ఉంది. అసలే తెలివయినవాడు అయిన రమణకు అది మింగుడు పడలేదు. అమ్మాయిలు అంటే తనకు ఉన్న బెరుకే దినికంతటికి కారణం. అసలు ఇంజనీరింగ్ లో నయినా దిన్ని పోగ్గొట్టు కోవాలి, అంతో ఇంతో అందగాడయిన తను ఎలాగయినా మంచి అమ్మాయిని లైన్ లో దింపాలి, ఇంకా కుదిరితే పెళ్ళి కూడా కానివ్వాలి అనుకున్నాడు. 


ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసు ఎక్కడో తెలుసుకుని వెళ్ళె సరికి తలుపు వేసి ఉంది. కాని లోపల ఏదో లెక్చర్ జరుగుతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ఎం చెయ్యాలో తెలియలేదు రమణకు, అటు ఇటు చూస్తుండగా ఎవరో పెద్దాయన వచ్చి "హే వై ఆర్ యు స్టాండింగ్ దేర్" అని అడిగాడు. రమణ మనసు లో "చచ్చాం ప్రిన్సిపాల్ అనుకుంటా" అనుకుని "ఐ హవె టు గో క్లాసు సర్" అని చెప్పి సడెన్ గా క్లాసు రూం డోర్ తోసాడు. 

ఉరికే దగ్గరకు వేసి ఉన్న డోర్ తను బలంగా తోసే సరికి దబ్బెళ్ మని తెరుచుకుని రమణ తలుపు ముందే ఉన్న  ముందు బెంచి కి గుద్దు కున్నాడు. దాని మిద కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు అదిరి పడ్డారు, అంత కంగారు లోను రమణ చూపులు  బిత్తర పోయి చూస్తున్న సరయు మీదా పడ్డాయి.

వెంటనే తమాయించుకుని లేచి "సారీ సర్, లేట్ కమార్" అన్నాడు లెక్చరర్ వైపు తిరిగి. "వచ్చిందే లేటు , మళ్ళి క్లాసు డిస్టర్బ్ చెయ్యటం. వెళ్ళు వెళ్ళి కుర్చో"  అన్నాడు లెక్చరర్.  "థాంక్స్" అని చెప్పి సరయు వైపు చూశాడు. తను "పో రా" అన్నట్లు మూతి తిప్పింది అంతే రమణ కు మండి పోయింది. అమ్మాయిలంటే భయమే అయినా రమణకు తనను ఎవరయినా లెక్క చేయక పొతే మాత్రం మహా చెడ్డ కోపం. 

బెంచి పై కూర్చుంటూ మనసు లో అనుకున్నాడు "దిని  లాంటి వాళ్ళను ఎంత మందిని చూశాను, అసలు మన గ్లామర్ కు ఫీదా కాని అమ్మాయి ఉందా? ఇది దిని పోజులు". అతను  రోడ్డు మీదా వెళ్తుంటే అమ్మాయిలందరూ తిరిగి చూడటం, ఫ్రెండ్స్ అందరు నువ్వు సూపర్ మామ అంటూ మెచ్చుకోవటం తో  రమణ కు తాను అందగాడినని అర్ధం అయిపొయింది పదవతరగతి లో ఉన్నప్పుడే. 

కాని ఇంతవరకు ఎ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. అమ్మాయిలను ఆకర్షించటం,  వారికి విసుగొచ్చి వదిలి పెట్టేయటం రమణ జీవితం లో సాదారణం అయి పోయింది.   అలాంటి తనను సరయు చిన్న చూపు చూసేసరికి ఎక్కడో ఇగో దెబ్బతింది.

అలా రోజులు గడుస్తున్న కొద్ది రమణ కు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. కాని క్లాసు లో ఎప్పుడు ఎ అమ్మాయి తో ను మాట్లడే వాడు కాదు. సరయు తో ఎవరో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు మాట్లాడే వారు. వాళ్ళు అప్పుడే ఏదో గ్రూప్ పామ్ చేసుకుని అయిదుగురు ఫ్రెండ్స్ లా తయారు అయ్యారు. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి రెండు ముందు రెండు బెంచిలలో వాళ్ళే కూర్చునే వారు. 

ఆ గ్రూప్ లోంచి వెంకట్ మాత్రం సరయు ను పడేయ్యాలని ప్రత్నించసాగాడు. అందుకే సరయు కూర్చున్న బెంచి లో స్తలం లేక పోయిన బలవంతంగా తన పక్కన కూర్చునే వాడు. సరయు చాల ఇబ్బందిగా "వేరే దగ్గర కుర్చోవచ్చు కాద" అంటూ విసుక్కునేది. వెంకట్ గ్రూప్ లో ఉన్నా మిగత అమ్మాయిల కాళ్ళ వెళ్ళ పడి తనను పార్కు లకు హోటల్ లకు రప్పించే వాడు. 

 ఒక నెలరోజుల తరువాత ఓ రోజు ఎందుకో చాల ముందుగా క్లాసు కు వెళ్ళాడు రమణ. క్లాసు లో అడుగు పెట్టగానే సరయు ఒక్కతే కుర్చుని ఉంది. తన వైపు చూడకుండానే ఎప్పుడు తను కూర్చునే బెంచి లో కూర్చున్నాడు. నిజానికి తను బుక్ లోపల పెట్టి బయటకు వెళ్లలనుకున్నాడు కాని సరయు ఉండే సరికి వెళ్ళలేక పోయాడు. 

ఒక్కసారిగా సరయు వెనుకకు తిరిగి ఇలా అంది "హయ్ రమణ ! చదవటం మొదలు పెట్టావా?" అని. అంతే రమణ ఉబ్బితబ్బిబు అయిపోయాడు, ఇదే అదునుగా ఎన్నో మాట్లాడాలనుకున్నాడు ! కాని పొడిగా "ఇంకా లేదు" అని మాత్రం అనగలిగాడు. అప్పటికే వెంకట్ మరియు సరయు గ్రూప్ వచ్చేసింది. అంతే బుక్ పడేసి బయటకు వెళ్తూ సరయు వంక చూశాడు. తన కళ్ళ లోను నిరాశ రమణకు స్పష్టంగా తెలిసి పోయింది. 

రమణకు ఇప్పుడు సరయు మిద కోపం పూర్తిగా పోయింది, అసలు మనసంతా ఎంతో సంతోషం తో నిండి పోయింది. నిజానికి సరయు ను మించిన అందగత్తె క్లాసు లోనే లేదు, అలాంటి సరయు తనతో మాట్లాడింది అన్న విషయమే తనను నేల  మిద ఉండనివ్వటం లేదు. ఆ తర్వాత ప్రతి రోజు క్లాసు లో  ఎవరికీ తెలియకుండా ఒకరి నొకరు చూసుకోవటం, మూగగా ప్రేమించుకోవటం మొదలయింది.


చూస్తూ చూస్తుండగానే ఫస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ వచ్చాయి. అసలే చదువు పట్ల చాల శ్రద్ధ కలిగిన సరయు నేల రోజులు చదువు లో పడి భయటకే రాలేదు. తన హాస్టల్ కు ఫోన్ చేసి మాట్లాడలేక విసిగి పోయిన రమణ కోపం తో సరయును మర్చి పోవలనుకున్నాడు. ఎగ్జామ్స్ సెంటర్ లో తను కనిపించిన కనబడనట్లు వెళ్తున్నా రమణ ను చూసి సరయు చాల భాదపడింది. అంతలోనే ఇగో గుర్తుకొచ్చి తను కూడా చూడనట్లే వెళ్ళిపోయింది.

అంతే ఇద్దరు మాట్లాడుకోలేదు. ఎగ్జామ్స్ తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయారు. ఇంటికి వెళ్ళిన రమణ కు సరయు అస్తమానం గుర్తుకోస్తుంది.  ఎలాగో నెంబర్ తెలుసుకుని సరయు ఇంటికి ఫోన్ చేశాడు. సరయు వచ్చి ఫోన్ ఎత్తింది, గుండె ఆగినంత పనయింది రమణ కు ఉత్సాహంగా "నేను రమణ ను, ఎలా ఉన్నావ్" అన్నాడు.

వెంటనే సరయు "ఏంటి ఇలా ఫోన్ చేసావ్? మా డాడి ఇంట్లో ఉన్నారు. ఇంకెప్పుడు చెయ్యద్దు,  ప్లీజ్" అంటూ పెట్టేసింది. రమణ కు ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది ! "అసలు నేను ఎందుకు ఫోన్ చెయ్యాలి తను మళ్ళి చెయ్యద్దు అని ఎందుకు చెప్పాలి" అని మాయ సబలొ అవమాన పడ్డ దుర్యోదనుడిలా కుమిలి పోయాడు.

నెల రోజుల తర్వాత మళ్ళి కాలేజీ కి వెళ్ళాడు, క్లాసులో అడుగు పెట్టగానే సరయు కనిపించింది.   ఇద్దరు ఒక్కసారిగా ఉత్సాహంగా "హాయ్" అంటూ పలకరించు కున్నారు. ఇద్దరి కళ్ళలొను సంతోషం, వారి కళ్ళు  మెరిసి పోతున్నాయి. ఒకరిని చూడగానే ఒకరికి పట్టలేని సంతోషం కలింగిందని ఇద్దరికీ తెలిసి పోయింది. "ఎలా గడిపావ్ హాలిడేస్? రిసల్ట్ వచ్చింది చూశావ? చాల టెన్షన్ గా ఉంది ! " ఇలా దొర్లిపోతున్నాయి వారి మధ్య మాటలు.

ఆ రోజు నుండి ఇద్దరు కాస్త మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఒక రోజు క్లాసు లో ఎవరిదో బర్త్ డే పార్టి చేశారు, ఎప్పుడు బయటకు రాని రమణ ముందు ఉండి అన్ని అరేంజ్ మెంట్స్ చేయ్యసాగాడు. అసలు ఏది పట్టించుకోని సరయు కూడా ఆరోజు ముందుకు వచ్చింది. ఇద్దరు కలిసి బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, కాని సరయు అందరి ముందు రమణ తో అంత క్లోజ్ గా ఉండటం రమణ కు నచ్చటం లేదు.


రమణ ఎటు వెళ్ళితే అటు వెళ్ళ సాగింది సరయు. తను క్లాసు భయటకు వెళ్ళిన కుడా తనతోనే వచ్చి "ఏంటి ఇక్కడ ! లోపలికి వెళ్దాం పద" అంటూ ముందుకు నెట్ట సాగింది. రమణ కు చాల ఇబ్బందిగా ఉంది. "నువ్వు వెళ్ళు నేను వస్తాను" అని చెప్పాడు కాస్త కోపంగా. సరయు చాల భాద పడింది, ఉక్రోషంగా క్లాసు లో అడుగు పెట్టింది. "ఏంటి విడు పెద్ద పోజులు కొడుతున్నాడు, ఏదో కాస్త మాట్లాడుతుంటే. మళ్ళి అసలు పట్టించుకోకూడదు" అనుకుంది మనసు లో.


కాని రమణ పరిస్తితి వేరేలా ఉంది, ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడని వాడికి  ఒక్కసారిగా అంతటి అందగత్తె వెంట పడుతుండే సరికి భయపడి పోయాడు. ఎం చెయ్యాలో తెలియక ఒంటరిగా ఉండాలని, తనకు దూరం గా వెళ్ళి పోవాలని అనిపించింది.  అసలే సిగ్గరి అయినా రమణకు అంత మంది లో సరయు అలా వెంటపడుతుంటే తట్టుకోలేక పోయాడు, అందుకే దూరంగా పారిపోయాడు.

కాని ఈ విషయం సరయును చాల భాదించింది "ఎప్పుడు ఎ అబ్బాయితో మాట్లాడని తను వీడి కోసం బయటకు వెళ్ళితే నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తాడా? ఇలాంటి పిరికి వాడిని ఇష్ట పడినా  దండగే" అనుకుంది మనసు లో. అంతే ఆ రోజు నుండి రమణ ఎన్ని సార్లు మాట్లాడాలని చుసిన అవకాశం ఇవ్వలేదు.  ఆ తరువాత వారి మద్య దూరం పెరిగి పోయింది, సరయు మనసులో ఏముందో ఎప్పటికి తెలియ లేదు రమణకు.


చదువు పూర్తీ చేసుకుని వెళ్తున్న రోజు కూడా ఇద్దరు మాట్లాడు కోలేదు. కాని ఎవరి ద్వారో తెలిసింది ఏంటంటే వెంకట్ మరియు సరయు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్ళి కూడా చేసుకుంటారని. గుండెలు అవిసేలా భాదపడ్డాడు, కాని ఏమి చెయ్యలేడు, అంత చెయ్యి దాటి పోయింది.

 మంచి ఉద్యోగం వచ్చి, అంతకన్నా అందమయిన భార్య దొరికిన కుడా ప్రేమ అన్న మాట వినగానే రమణ కు సరయు నే గుర్తుకొస్తుంది ఇప్పటికి. "అది ప్రేమ కాదు వట్టి ఆకర్షణ అని ఎంత సర్ది చెప్పుకున్న ! తను ఇంకా గుర్తుకు రావటం ఏంటి ?"  అని ఆలోచిస్తే రమణ దగ్గర సమాధానం లేదు.

అందరికి ఇలాగె జరుగుతుందని కాదు కాని,  ఇలాంటి ప్రేమ కథలు కాలేజీ జీవితం లో చాల మాములు విషయం,  అలాగే అవి జీవితాంతం గుర్తు ఉండటం కూడా అతి మాములు విషయం.


నిజానికి రమణ, సరయు ఒకరినొకరు మొదటి చూపులోనే నచ్చారు కాని అర్ధం లేని ఇగో వాళ్ళ ఇంకా తెలియని తనంతో ఒకరి నొకరు దూరం చేసుకున్నారు. బహుశ ఆ దేవుడు వీరిద్దరికీ రాసి పెట్టలేదేమో !!


(సమాప్తం)


2 వ్యాఖ్యలు: