26, ఫిబ్రవరి 2013, మంగళవారం

చేతబడి !!! - 7


(అరవ భాగం కోసం ఇక్కడ నొక్కండి)

చూపుడు వేలు నుండి పురుగులు రాగానే నాగులు మంత్ర శక్తి అరవింద్ మిద పని చెయ్యటం మొదలు పెట్టింది. అప్పటివరకు ప్రియాను ఆరాధనగా, అద్బుతంగా చూసిన వాడు, ఆమెను ముద్దులతో ముంచెత్తిన వాడు ఒక్కసారిగా ఆమె ను తోసేసి లేచి నిలబడ్డాడు.

ఆశ్చర్య పోయినా ప్రియా "ఏమయింది అల లేచావ్ ? పెళ్ళికి ముందు ఇష్టం లేదా !" అడిగింది విస్తుపోతూ.

అప్పుడు అరవింద్ ఆమెను అసహ్యంగా చూస్తూ "అసలు నువ్వే ఇష్టం లేదు. నల్లగా ఉండే నీకు నేను కావాల ? నాలాంటి వాడికి మోహిని అయితే సరయిన జోడి" అన్నాడు.

ప్రియా కు దుఃఖం పొంగు కొచ్చింది.  ఏడుస్తూనే  "ఎవరు నన్ను ప్రేమించమని చెప్పారు? నువ్వు కాదు నా వెంట పడి ప్రేమించే వరకు వదల లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్" అంది అతని చొక్క పట్టుకుని.

"అప్పుడు ప్రేమించాను ఇప్పుడు లేదు అంటున్నాను. ఇంకా నన్ను వదిలేయ్" అంటూ విసురుగా ఆమె చెయ్యి తోసేసి భయటకు వెళ్ళాడు. 

ప్రియా ఏడుస్తూ కూర్చుండి పోయింది, కాని అరవింద్ మాత్రం మోహిని ఇంటి వైపు బయలు దేరాడు. ఎవరో తరుము తున్నట్లుగా వడి వడి గా నడుస్తూ మోహిని ఇంటిని చేరుకున్నాడు. అప్పటికే ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్న మోహిని కి స్వర్గం అందినంత పనయింది. అరవింద్ ను సరాసరి బెడ్ రూం కు తీసు కెళ్ళి సర్వస్వం అర్పించుకుంది. ప్రియాను తప్ప ఎవరిని కన్నెత్తి చూడని అరవింద్ మోహిని కి పూర్తిగా లొంగి పోయి ఆమె ను వశం చేసుకున్నాడు. జరిగిన సంఘటనతో కుమిలి పోయిన ప్రియా అరవింద్ మోహిని దగ్గర ఉన్నాడని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళింది. 

ప్రియాను చూడటంతోనే మోహిని గూర్కా తో ఆమెను లోపలికి  పంపవద్దని చెప్పింది. అలాగే ఏడుస్తూ రోజంతా అక్కడే నిలబడి పోయినా ప్రియాను చూడగానే గూర్కా బెబెక్ కు చాల జాలి వేసింది. ఎక్కడో అనుమానం ఉన్నా వాడు ప్రియాకు చెప్పాడు ఇలా రహస్యంగా "మేడం ! ఇది మంత్రాల పని. అందుకే అంతగా ప్రేమించే మీ సారూ అట్లా మా మేడం కు లోన్గిపోయిండు. మీరు కూడా ఎవరయినా మంచి మంత్రగాన్ని తీసుకురండి".

అది విన్న ప్రియా అసలు నమ్మలేదు, "కాని అంతల తనను ప్రేమించే అరవింద్ అప్పటికప్పుడు ఇలా మారి పోవటం ఏంటి ? చూస్తుంటే ఇది మంత్రాల పనే అనిపిస్తుంది" అనుకుని తన ఉరికి బయలు దేరింది మంత్రాల వీరయ్య కోసం. 

వీరయ్య చాల గొప్ప మాంత్రికుడు, కాని మంచి కోసం పాటుపడే మనిషి. ఎక్కడ మంత్రాలతో చెడు జరుగుతున్నా వాటిని తన మంత్ర శక్తి తో అడ్డుకుంటాడు. ప్రియాను చూడాగానే అతను పసిగట్టాడు.  జరిగింది ప్రియా నోటి ద్వారా విని ఆమెతో పాటు పట్నం బయలు దేరాడు.  అరవింద్ రూం లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా అదిరి పడి బయటకు వెళ్ళి  ఏవో మంత్రాలూ చదువుతు లోపలికి  అడుగు పెట్టాడు.

ఆపైన అరవింద్ రూం అంత వెతికి అతని మంచం కింద ఉన్నా కుళ్ళి పోయినా చూపుడు వేలు  తీసుకుని ప్రియాకు చూపిస్తూ "ఇదిగో ! ఇదే ఆ మంత్ర శక్తి అరవింద్ మీద ప్రయోగం చేసింది" అన్నాడు.

వెంటనే ప్రియా ఆత్రంగా అడిగింది "అయితే దిన్ని నాశనం చేస్తే అరవింద్ మాములు వాడు అయిపోతాడా ?" అని. 

వీరయ్య నవ్వుతూ "ఇప్పుడు మంత్ర శక్తి అతన్ని పూర్తిగా వశం చేసుకుని తన అధినం లో ఉంచుకుంది. తనను తృప్తి పరచిన వారికి అతన్ని లొంగేలా చేస్తుంది, వారి గురించే తలచేలా చేస్తుంది. దాని నుండి అతను బయట పడాలి అంటే ఆ మంత్ర శక్తి ని నాశనం చెయ్యాలి. అందుకు నేను పూజలు చెయ్యాలి" అన్నాడు.

"అలాగే చెయ్యండి స్వామి ! దానికి నన్ను ఎం చెయ్యమన్న చేస్తాను. కాని నా అరవింద్ తిరిగి నాకు దక్కాలి" అంది దృడమయిన స్వరంతో.

"అయితే రేపు స్మశానానికి వెళ్ళి పూజలు చేద్దాం, కాని అంతకు ముందు మోహిని ఇంటి దగ్గర పాతి పెట్టిన మదన పిశాచి తలను బయటకు తియ్యాలి. దానితోనే మనం పూజలు చెయ్యాలి " అన్నాడు.

వెంటనే ప్రియాకు మోహిని ఇంటి గూర్కా బిబెక్ గుర్తుకొచ్చాడు, వాడికి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఆ పని చేస్తాడు అనుకుని "అలాగే ప్రయత్నిస్తాను స్వామి" అంటూ బిబెక్ దగ్గరికి బయలు దేరింది.  

బిబెక్ కు అయిదు వెయ్యిలు ఇస్తాను అని చెప్పగానే మరో మాట అనకుండా అలాగే వెతికి బయటకు తీస్తాను అని చెప్పాడు.  ఆ రోజు రాత్రి మోహిని పెరడు లో వెతికి తవ్వినట్లు స్థలాని పట్టుకుని తవ్వి తలను బయటకు తీసి బయట వేచి చూస్తున్నా ప్రియాకు ఇచ్చాడు. వారం రోజులు భూమి లో పాతి పెట్టి ఉండేసరికి మొహం లో చర్మం అంతా కుళ్ళి పోయి, కళ్ళు గుంటలు పడి, దవడలు కనిపిస్తూ చాల భయంకరంగా ఉంది ఆ తల. మాములు సమయంలో అయితే దగ్గరి నుంచి చూడటానికే ఇష్టపడని ప్రియా అరవింద్ మిది ప్రేమతో దాన్ని అలాగే పట్టుకుని శ్మశానం లో ఉన్నా వీరయ్య దగ్గరికి బయలు దేరింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ తల ఏదో శబ్దం చేసినట్లు అనిపించింది ప్రియాకు.

పట్టి చూస్తే ఏమి లేదు.  అంత తన భ్రమ అనుకుని మళ్ళి నడవటం ప్రారంబించింది. అప్పుడు అర్దరాత్రి ఒంటి గంట యాభై అయిదు నిముషాలు.  కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తల చిన్నగా నవ్వటం మొదలు పెట్టింది. ప్రియా భయపడి  దాన్ని వదిలేసి అలాగే చూస్తూ నిలబడి పోయింది. తల దొర్లుకుంటూ ప్రియా దగ్గరికి వస్తోంది నవ్వుతూ. ప్రియా పై ప్రాణాలు పైనే పోయాయి! దానికి అందకుండా పరుగు పెట్టడం మొదలు పెట్టింది. తల ప్రియాను వదలకుండా అలాగే దొర్లుకుంటూ ఆమె వెంట పడ సాగింది.

అక్కడ మోహిని కౌగిలిలో వెచ్చగా పడుకున్నా అరవింద్ తల బయటకు తీసే సరికి ఒక్కసారిగా లేచి అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉండి పోయాడు. ఏమి అర్ధం కాని మోహిని కింది గదిలో నిద్ర పోతున్న నాగులు ను నిద్ర లేపింది. అరవింద్ వాలకం చూడగానే విషయం అర్ధం అయిన నాగులు గుర్కాను పిలిపించమన్నాడు. బిబెక్ రాగానే ఏమి మాట్లాడకుండా పక్కనే ఉన్నా బొమ్మ తీసి తలపై కొట్టి చంపేసాడు.

మోహిని ఆశ్చర్యపోతూ "ఏమయింది స్వామి ! ఎందుకు విణ్ణి చంపెసారు" అనడిగింది.

నాగులు పట్టరాని కోపం తో "వీడు పెరడు లో మదన పిశాచి తలని తవ్వి బయటకు పంపాడు. ఇప్పుడు మన మీద దాన్ని ప్రయోగిస్తే ఎంత ప్రమాదమో నీకు తెలియదు" అన్నాడు. కాని ఎక్కడో అతని గొంతులో చిన్న వణుకు తొణకిస లాడింది.

ప్రియా ఎంతసేపటికి రాక పోయే సరికి ఆమెను వెతుకుతూ మోహిని ఇంటి వైపు వస్తున్నా విరయ్యకు పరుగు పెడుతున్నా ప్రియా కనిపించింది. పరుగు పెట్టి పరుగు పెట్టి అలసి పోయిన ప్రియా ఒక దగ్గర కూలబడి పోయింది. ఒక్కసారిగా తల ప్రియా మీదికి దూకి ఆమె పీక కొరికి రక్తం తాగ బోయింది. దాన్ని గమనించిన వీరయ్య తన చేతిని కోసుకుని తల ముందు పెట్టాడు. రక్తం చూడగానే ప్రియాను వదిలి తల గాల్లో కి ఎగిరి వీరయ్య చేతిని పట్టుకుని అతని రక్తం పిల్చసాగింది. ఇదంతా చూస్తున్న ప్రియాకు భయంతో ముర్చపోయినంత పనయింది. తర్వాత వీరయ్య ఏవో మంత్రాలూ చదివి తలను నిద్ర పుచ్చాడు తాత్కాలికంగా.

అక్కడ నాగులు మదన పిశాచం కోసం పూజలు మొదలు పెట్టి దాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అరవింద్ ఏమి అంతు చిక్కక పసి వాడిలా దిక్కులు చూస్తూ ఉండి పోయాడు.  నాగులు ముగ్గు వేసి అందులో మోహినిని  కూర్చోబెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ వెళ్ళి పోయినా మదన పిశాచాన్ని తిరిగి ఆహ్వానిస్తున్నాడు. వీరయ్య కు త్వరపడక పొతే గొప్ప ప్రమాదం ముంచుకు వస్తుంది అని అర్ధం అయింది. వడి వడి గా అడుగులు వేస్తూ శ్మశానం చేరుకొని ముగ్గు వేసి అందులో శవం తలను పెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ దాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు మహా మాంత్రికులు తలపడుతున్న ఆ క్షణాలు ప్రకృతిని భయంకరంగా మార్చేసాయి. ఎవరు ఎవరో తెలియని ఆ ఇద్దరు ఒకరు మంచి కోసం మరొకరు చెడు కోసం, తమ పంతాలు నెగ్గించు కోవటానికి, పిశాచాలపై అధిపత్యం కోసం మంత్రాలతో పోరాటం సాగిస్తున్నారు.

ఇద్దరు మంత్రాలూ చదువుతూ మదన పిశాచాన్ని వశం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కొద్ది సేపటికి ఒకరి మంత్ర శక్తి ఒకరిని భాదించటం మొదలు పెట్టింది.  నాగులు మంత్ర శక్తి వీరయ్య మొహాన్ని కాల్చా బోయింది, అప్పుడు వీరయ్య చేతులు అడ్డు పెట్టుకున్నాడు, అంతే అతని చేతులు బొబ్బలు పడి పోయాయి. అయినా నిగ్రహం కోల్పోని వీరయ్య ఇంకా ప్రయత్నించసాగాడు. కాస్సేపటికి వీరయ్య మంత్ర శక్తి నాగులు ఒళ్ళంతా బొబ్బలు తెచ్చింది, అయినా భయపడని నాగులు ఇంకా అలాగే మంత్రాలూ చదువుతూ ప్రయత్నించసాగాడు. ఇదంతా చూస్తున్నా మోహిని కి భయంతో అక్కడ నుండి లేచి వెళ్ళి పోవాలని అనిపించింది,  కాని నాగులు ఏమ్చేస్తాడో అనుకుని వణికి పోతూ  అలాగే కూర్చుండి పోయింది.

దాదాపు అరగంట సాగినా ఆ పోరాటం లో నాగులు ను మించిన మంత్రకాడు అయినా వీరయ్య కు విజయం లభించిది. మదన పిశాచి దెబ్బకు నాగులు రక్తం కక్కుకుని అక్కడికక్కడే చని పోయాడు. మోహిని ఆ మంత్ర శక్తి కి ఒళ్ళంతా కాలి నల్లగా మారి పోయి పూర్తీ కూరిపిగా మారి పోయింది. తన మీద ప్రయోగించిన మంత్ర శక్తి నాశనం కావటంతో అరవింద్ మామాలు వాడు అయి పోయి తన ఇంటికి బయలు దేరాడు.


(చెడు పై మంచి విజయం తో ఈ చేతబడి కథ ముగిసింది. తిరిగి మరో భయపడే కథతో మీ ముందుకు వస్తాను. ఎన్నో వారాలుగా నన్ను ఆదరించిన మీ అందరికి నా వందానాలు. )2 వ్యాఖ్యలు: