18, ఫిబ్రవరి 2013, సోమవారం

చేతబడి !!! - 6

(అయిదవ భాగం కోసం ఇక్కడ నొక్కండి. తరువాత భాగం కోసం వేచి చుడండి)

నాగులు మోహిని దగ్గరికి బయలు దేరటానికి సిద్దం అవుతున్నాడు. ఒక సాదువు మాదిరి తన వేషం  మార్చుకున్నాడు.   మెడలో ఉన్నా తాయత్తులు తీసివేసి రుద్రాక్షలు వేసుకున్నాడు. తెల్లని లుంగీ మరియు తెల్లని చొక్కా వేసుకుని, నుదుటన విబూది తో నామాలు పెట్టి , వాటి పైన  రూపాయి బిల్లంత  కుంకుమ బొట్టు పెట్టి అచ్చం భక్తుడిలా తయారు అయ్యాడు. 

మాంత్రికుడయిన నాగులుకు మోహిని ఇంటికి చేరటానికి పెద్ద కష్టం కాలేదు. తన బెడ్ రూం లోంచి బయటకు చూస్తున్న మోహిని కి ఎవరో సన్యాసి తన ఇంటి ముందు గుర్కాతో వాదులడుతున్నట్లు చూసి అతన్ని పంపించమని ఇంటర్ కాం లో ఫోన్ చేసి చెప్పింది.

మోహిని అతన్ని చూడగానే "నువ్వేనా ! నా మీద మంత్ర ప్రయోగం చేసింది" అడిగింది కోపంగా.

 "నా దగ్గరికి ఎవరు వఛ్చిన దేవుడిలా వారి కోరిక తీర్చటం నా భాద్యత. దేవుడిలాగే నాకు ముడుపులు చెల్లించాలి" అన్నాడు గంభిరమయిన స్వరంతో. 

"ఓహో అంత గొప్ప వాడివా! అయితే నా కోరిక తీర్చి ని ముడుపులు తీసుకో" అంది మోహిని కొంటెగా.

"నా గొప్పతనం సుబ్బారావు తో నువ్వు గడిపినా రాత్రి తర్వాత కూడా తెలియలేదా? నీ కోరిక ఏదయినా నేను తీర్చగలను, అందుకు తగ్గ ముడుపులు ముట్టచెపితే" అన్నాడు ఇంకా కొంటెగా.

అతని మాటలకు మోహిని చాల ఇబ్బంది పడింది. అతనితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంది.

తర్వాత మోహిని ఆరవింద్ విషయం చెప్పి "జీవితాంతం అతను  నాతోనే ఉండాలి! ఇంకా అతని ప్రియురాలు ప్రియాను  అతను మర్చి పోయేలా చెయ్యాలి" అని చెప్పింది.

అందుకు నాగులు "దానికి నువ్వు కొన్ని నియమాలు పాటించాలి. నేను చెప్పిన చోటుకు వచ్చి కొన్ని పూజలు ఆచరించాలి. మదన పిశాచానికి నీ రొమ్ము పాలతో, మరియు రక్తంతో దాహం తీర్చాలి" అన్నాడు.

మోహిని ఆశ్చర్యపోతూ "నాకు పాలు ఎలా వస్తుంది ! ఆ పిశాచని కనుక్కోవటం ఏలా ?" అంటూ అడిగింది. 

అప్పుడు నాగులు గర్వంగా నవ్వుతూ "ముందు ముందు అన్ని నీకె తెలుస్తాయి. నీకు పాలు రావాలంటే ఈ పొడిని పాలతో కాని నీళ్ళ తో గాని తాగు, మరునాటికి నీ రొమ్ములు బాలింత మాదిరి పాలు కారటం మొదలు పెడుతాయి" అన్నాడు ఏదో పొట్లం ఇస్తూ.

"అయితే నేను ఎప్పుడు, ఎక్కడికి రావాలి" అడిగింది మోహిని కుతూహలంగా.

"ఇక్కడికి పది కిలోమీటర్లు దూరం లో మదన పల్లె అని  కాస్త పెద్దయిన  ఉరు ఉంది.  ఆ ఊరి శ్మశానంలో నేను నీ కోసం రేపు ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రి సరిగా ఒంటి గంటకు మన పూజ మొదలు పెట్టాలి" అని చెప్పి వెళ్ళి పోయాడు. 

నాగులు చెప్పినట్లుగానే మోహిని మరునాడు పన్నెండు గంటల ముపై నిమిషాలకు ఆ ఊరి  శ్మశానంలో అడుగు పెట్టింది. పున్నమికి ఇంకా చాల రోజులు ఉండటం తో,  ఆకాశంలో  చంద్రుడు సగం ఆకారం తో కొక్కెం లా వేలాడుతున్నాడు. నల్లని మేఘాలలో దాక్కుని అప్పుడప్పుడు భయట పడుతూ, ఆ శ్మశానం లో ఉన్నా సమాధులకు కాపాల ఉన్నాడేమో అనిపిస్తున్నాడు.  కియ్ మని కీచురాళ్ళు రొద పెడుతున్నాయి చెవులు చిల్లులు పడేలా,  గబ్బిలాలు చెట్లపై తలకిందులుగా వేలాడుతు భయంకరంగా చూస్తున్నాయి.  ఎక్కడో దూరంగా కుక్కలు చాల బిగ్గరగా మొరుగుతు ఉరి ఉనికిని తెలుపుతున్నాయి. నాగులు కోసం  వెళ్తున్న మోహినికి పక్కనే ఏదో శవం కాలిన కాష్టం కనిపించింది! ఇంకా నిప్పులు అలాగే మండుతున్నాయి. ఆ ప్రాంతం అంత కమ్మురు వాసన ఇంకా అలాగే ఉంది.

 ఆ పరిసరాలు చూస్తుంటే  మోహిని కి చాల భయం భయంగా ఉంద. కాని అరవింద్ పై ఉన్నా ఇష్టం దాన్ని జయించింది. చిన్న గా అడుగులు వేసుకుంటూ నాగులు ఎక్కడ ఉన్నాడో వెతుక సాగింది. చివరికి ఒక దగ్గర ఎవరో ఏదో చేస్తున్నట్లు కనిపించింది.

"నాగులు గారు" అంటూ పిలిచింది చిన్న గొంతు తో.

"మాట్లాడకుండా ఇక్కడికి రా" అన్నాడు నాగులు అజ్ఞాపిస్తున్నట్లుగా.

మోహిని వెళ్ళేసరికి నాగులు ఏదో మట్టితో చేసిన సమాధిని తవ్వుతున్నాడు. కాసేపటికి పూర్తిగా తవ్వి శవాన్ని భయటకు తీసాడు. పొద్దున్నే పాతి పెట్టినట్లు ఉన్నారు శవాన్ని! ఏమి పాడు అవ్వలేదు. కాని శవాన్ని చూసే సరికి అందమయిన మోహిని మొహం భయంతో వికారం గా మారింది.

నాగులు ఆమె వేసుకున్న జాకెట్ తీసేయమని చెప్పాడు. తర్వాత ముగ్గు వేసి ఏవో మంత్రాలూ చదువుతూ శవం పై బూడిద చల్లుతూ ఉన్నాడు. కాస్సేపటికి జుయ్ మని గాలి వీచింది ఆ ప్రాంతం అంత. ఏదో జరుగబొతుందని తెలిసినట్లుగా గబ్బిలాలు ఎగిరి పోయాయి, కిచ్చురాళ్ళు అరవటం ఆపేశాయి. నిశ్శబ్దం అలుముకుంది శ్మశానం అంత! చావులాంటి నిశ్శబ్దం. కొద్దిసేపటికి శవం కళ్ళు తెరిచి నాగులు వైపు చూడసాగింది. నాగులు దాని మొహం మోహిని వైపు తిప్పి ఏవో మంత్రాలూ చదువసాగాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ శవం నాలుక భయటకు తీసింది.

అప్పుడు నాగులు వెంట తెచ్చుకున్న మనిషి పుర్రె లో మోహిని రొమ్ములను పట్టి పాలు పిండి శవానికి తాగించాడు. ఆపైన ఆమె చేతిపై గాటు పెట్టి అదే పుర్రె లో ఆమె రక్తం పట్టాడు. అది చూడగానే విచిత్రంగా శవం లోట్టలు వేయసాగింది. అదంతా చూస్తున్నా మోహిని కి ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో గొంతు ఎండి పోతోంది. నాగులు ఏవో మంత్రాలూ చదువుతూ మోహిని వైపు చూపిస్తూ   శవాన్ని ఏదో  అడుగుతున్నాడు. శవం తలూపుతూ రక్తం ఉన్నా పుర్రె వైపు ఆశగా చూడసాగింది. కాస్సేపటికి నాగులు పుర్రె లో రక్తం తాగించాడు శవానికి. తర్వాత శవం యొక్క తల మరియు  కుడి చేయి నుంచి  చూపుడు వెళ్ళు నరికి సంచిలో వేసుకున్నాడు.

తర్వాత శ్మశానం భయటకు వచ్చి నాగులు ఇలా చెప్పాడు "నేను ఇచ్చే శవం చూపుడు వేలు తీసుకెళ్ళి అరవింద్ ఇంటి లో పెట్టు. అది కుళ్ళి పోయి అందులోంచి బిల బిల మంటూ రెక్కల పురుగులు రావటంతోనే నా మంత్ర శక్తి పని చేస్తుంది. వచ్చే టప్పుడు అతని రక్తం మరియు వెంట్రుకలు తీసుకురా" అన్నాడు.

మోహిని అలాగే నని చెప్పి ఇంటికి బయలు దేరింది. మరునాడు మోహిని అందంగా తయారయి హ్యాండ్ బ్యాగ్ లో ఒక చిన్న కత్తి పెట్టుకుని అరవింద్ ఇంటికి బయలు దేరింది. అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు. అరవింద్ ది పక్కనే ఉన్నా పల్లెటూరు, అందుకే రూం లో ఒంటరిగా ఉంటాడు. వెళ్ళి తలుపు కొట్టేసరికి అరవింద్ వచ్చి తలుపు తీసాడు.

ఆశ్చర్య పోతూ "ఏంటి మేడం మీరు ఇక్కడ ! కబురు చేసి ఉంటె నేనే వచ్చే వాణ్ణి కదా ?" అన్నాడు.

మోహిని మత్తుగా నవ్వి "అవసరం నాది అయినప్పుడు నేనే రావటం సంస్కారం. వచ్చిన వాళ్ళ అవసరం తీర్చి సంతోష పెట్టటం నీకు సంస్కారం" అంది కొంటెగా.

అరవింద్ కు విషయం అర్ధం కావటం మొదలు పెట్టింది. "మేడం ఏదయినా ఉంటె రేపు కాలేజీ లో మాట్లాడుదాం ! దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి" అన్నాడు బ్రతిమాలుతూ.

మోహిని కోపంగా తన చీర తొలగించి "చుడురా! ఇంతటి అందం, నా డబ్బు అన్ని నీ సొంతం చేస్తానంటే నీ ప్రాబ్లం ఏంట్రా? రా అరవింద్ నన్ను కాదనకు" అంటూ అతన్ని హత్తుకుంది.

అరవింద్ ఇంకా కోపంగా ఆమెను తోసేసి  "షట్ అప్ ! నేను నీలా భరితెగించలెను. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో" అన్నాడు గుమ్మం వైపు చూపిస్తూ.

మోహిని హ్యాండ్ బ్యాగ్ లోంచి కత్తి తీసి "అరవింద్ నువ్వు ఒప్పుకోక పొతే నేను నరాలు కోసుకుని చచ్చిపోతాను" అంది బెదిరింపుగా.

అరవింద్ ఒక్కసారిగా కంగారు పడి "మోహిని ! దయచేసి పిచ్చి పనులు చెయ్యొద్దు. ముందు ఆ కత్తి ఇలా ఇచ్చేయ్" అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు.

అతను కత్తి తీసుకుంటూ ఉండగా  మోహిని తెలివిగా అరవింద్ చెయ్యి తెగేలా చేసింది. వెంటనే చేతి రుమాలు తీసి తుడుస్తూ "సారి అరవింద్ నీకు తెగుతుందని అనుకోలేదు" అంటూ అతని వెంట్రుకలలో చేతులు పెట్టింది అప్యాయంగా నిమురుతున్నట్లు.


అరవింద్ ఆమె చెయ్యి తీసేస్తూ ఇబ్బంది గా మొహం పెట్టాడు. మోహిని కోపంగా జుట్టు పికి "తల మీద చెయ్యి వేసిన కూడా పాడు అయిపోతావ ?" అంది.

అప్పటికే ఆమె చేతికి చాల  వెంట్రుకలు వచ్చాయి. రక్తం అంటిన రుమాలు మరియు వెంట్రుకలు చిన్నగా బ్యాగ్ లో వేసుకుంది. ఆపైన పెద్దరికంగా  "క్షమించు అరవింద్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. బాగా దాహంగా ఉంది కొన్ని మంచి నీళ్ళు ఇస్తావ ?" అంది.

అరవింద్ కిచెన్ లోకి వెళ్ళగానే అతని బెడ్ కింద నాగులు ఇచ్చిన శవం చూపుడు వేలు ను పెట్టింది. "బ్యాచలర్ అయినా అరవింద్ ఎప్పుడో నెలకు ఒకసారి బెడ్ కిందా క్లీన్ చేస్తాడు,  ఈ లోపు తన పని అయిపోతుంది"  అనుకుంది మనసు లో. అరవింద్ తెచ్చిన నీళ్ళు తాగి అక్కడినుండి బయట పడింది మోహిని. 

మరునాడు పెట్టె లో డబ్బుతో, హ్యాండ్ బ్యాగ్ లో చేతి రుమాలు, అరవింద్ జుట్టు వేసుకుని నాగులు ఉన్నా గుడిసెకు చేరింది. నాగులు అరవింద్ రక్తం అంటిన  చేతి రుమాలు నీళ్ళు పోసి ఉన్నా ఒక మట్టి పాత్రలో వేసాడు, అప్పుడు అరవింద్ రక్తం నీళ్ళ లో కలిసి పోయింది. ఆపైన మోహిని చేతికి గాటు పెట్టి ఆమె రక్తం అదే పాత్రలో పట్టాడు. తర్వాత ఆమె వెంట్రుకలు కొన్ని తీసుకుని, అరవింద్ వెంట్రుకలు కలిపి కాల్చి ఆ బూడిదను రక్తం కలిసిన పాత్రలో పోసాడు.  గుడిసె మద్యలో ముగ్గు వేసి శవం తాలుకు తలను మద్యలో పెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ ఆ పాత్రలోని ద్రావణం కొద్ది కొద్ది గా పోస్తూ ఉన్నాడు దానిపైన. కొద్దిసేపటికి ఆ తల కళ్ళు తెరిచింది. మోహిని కి ఎందుకో చాల సంతోషం వేసింది. నాగులు తర్వాత ఆ మట్టి పాత్రలో ఏదో పచ్చని పొడిని కలిపాడు! అది నీళ్ళ మాదిరి మారిపోయింది.

నాగులు ఆమె వైపు చూస్తూ "నేను వచ్చి ఈ తలను నీ ఇంటి పెరటిలో తవ్వి పాతి పెడుతాను! అది అక్కడ ఉన్నాననీ రోజులు నువ్వు కోరుకుంటున్నా వాడు నీ మాట వింటాడు. ఈ ద్రావణాన్ని నువ్వు తాగు  నా మంత్ర శక్తికి బలం చేకూరి నీ  వశం అవుతాడు వాడు" అన్నాడు.

మోహిని  డబ్బు తో సహా పెట్టెను  నాగులు కు అందించి సంతోషంగా నాగులును తీసుకుని ఇంటికి బయలు దేరింది. కాని తన సంతోషం ఎన్నో రోజులు నిలవదని ఆమెకు తెలియదు పాపం.  ఇంటికి వెళ్ళిన తర్వాత  నాగులు ఆ మోహిని పిశాచం ఉన్నా  తలను పెరటి లో పాతాడు! తర్వాత మోహిని నాగులు ఇచ్చిన ద్రావణం తాగి తన బెడ్ రూం లో  నిద్ర పోయింది. నాగులు కింద  ఉన్నా గెస్ట్ బెడ్ రూం లో పడుకున్నాడు.

మోహిని వచ్చి చేసిన అల్లరి తెలుసుకున్నా ప్రియా "అరవింద్ మనం తొందరగా పెళ్ళి చేసుకుందాం. మీ వాళ్లు , మా వాళ్ళు ఒప్పుకోక పోయినా సరే. రిజిస్టార్ మ్యారేజ్ చేసుకుందాం" అంది అసహనంగా అరవింద్ తో.

దానికి అరవింద్ కూడ వత్తాసు పలుకుతూ "అలాగే చేసుకుందాం. ఒక రెండు రోజులు ఆగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం" అన్నాడు.

ఇక ఇద్దరు సంతోషం తో ఒక్కరి నొకరు హత్తుకున్నారు. ప్రియాకు చాల సిగ్గుగా ఉంది ! కాని  మూడేళ్ళు గా ప్రెమించుకుంటున్న కూడా అరవింద్  ఏ నాడు తొందరపడ లేదు.  ఇక ఆగకూడదు అనుకుని అరవింద్ పెదవులు అందుకుని అతనికి ఆహ్వానం పలికింది. ఆమె ఉద్దేశ్యం అర్ధం అయినా అరవింద్ ఆమె పెదవులు అందుకుని తర్వాత  తన నాలుకను  ఆమె నాలుక పై ద్వంద యుద్దానికి ఉసిగొలిపాడు.  సాగుతున్నా సమరం లో ఇద్దరు ప్రయోజనం పొందుతూ, ఉత్తెజితులవుతూ యుద్ధం కొనసాగించాడు.

ప్రియా ! పేరుకు తగ్గాటే ప్రియంగా ఉంటుంది. రంగు తక్కువయినా మొహం లో కోటి కాంతుల కళ, చెక్కిన శిల్పం లాంటి శరీరాకృతి, ఉండి లేన్నట్లు ఉండే నడుము, లోతయిన ఉదారబాగము దాని పైన లోతయిన నాభి, మిగడల జారి పోయే నున్నని విపు. ఆమెను చూసిన ఏ మగాడయినా మతి పోయి మళ్ళి మళ్ళి చూడవలసిందే. అందుకు అరవింద్ కూడా  మినహాయింపు కాదు.  అందుకే అన్ని రోజులు ఊరించిన అందం తన సొంతం అయ్యేసరికి ఎక్కడ నుండి మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో తెలియక తనకు తోచిన విధంగా సాగిపోతున్నాడు.

ఆమె వంటి నుండి వచ్చే సువానలకు ఆగలేక చేల రేగి పోతున్నాడు. ఆ తీపి భాదను ఓపలేక పోయినా కూడా ! ప్రియా అతనికి ఇంకా బాగా సహకరిస్తోంది,  యుద్ధం సాగటానికి తనవంతు కృషిని సాగిస్తోంది. అలాంటి సమయంలో బెడ్ కిందా ఉన్నా నాగులు మంత్రించి ఇచ్చిన చూపుడు వేలు నుండి ఒక సన్నని ఎగిరే పురుగు భయటకు వచ్చింది.

అరవింద్ కు ఏం అవుతుంది ? ప్రియా అరవింద్ లా పెళ్ళి జరుగుతుందా? మోహిని ఏమవుతుంది? సమాధానం వచ్చే భాగం లో తెలుసుకుందాం.(ఇంకావుంది)

ఏడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి


1 వ్యాఖ్య: