8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

చేతబడి !!! - 4

(మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి. మిగత భాగాల కోసం వేచి చుడండి)

అవమానంతో సుబ్బారావు కు ఎక్కడ ఉండబుద్ది కావటం లేదు, ఆ రోజు కాలేజీ కి వెళ్ళకుండా బార్ లో కుర్చుని మందు తాగుతున్నాడు. "ఏదో మాట వరసకు అంటే తనను కుక్క అంటుందా అది! డబ్బు ఉందన్న పొగరు, అందగాత్తేనన్న ధీమా దాన్ని నిలబడ నియ్యటం లేదు. ఆ అందమంతా ఆవిరి అయిపోయేలా చెయ్యాలి ! ఎవరితోనయినా ఆసిడ్ దాడి చేయిస్తే?" ఇలా సాగిపోతున్నాయి సుబ్బారావు ఆలోచనలు. 

అంతలో తన స్నేహితుడు కనిపించి "ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చి తాగుతున్నావ్ ?" అంటూ అడిగాడు ఆశ్చర్యంగా.

"ఒరేయ్ ఎవరయినా ఆసిడ్ దాడి చేసే వాళ్ళు ఉంటె చెప్పురా !" అన్నాడు కోపంగా.

"విషయం ఏంటి చెప్పకుండా ఆసిడ్ దాడి అంటూ తిక్క తిక్కగా మాట్లాడుతా వెంట్ర" అన్నాడు చిరాకుగా.

"మోహిని ! పెళ్ళి చేసుకోమంటే నన్ను కుక్క అందిరా" అన్నాడు ఏడుస్తూ. 

"ఆసిడ్ దాడి చేయిస్తే నికేంటి రా ఒరిగేది ! డబ్బులున్నాయ్,  మళ్ళి సర్జరీ లు చేసుకుని ఇంకా అందంగా తయారవుతుంది. ఒక వెళ దొరికిపోతే నువ్వు జైలు కు వెళ్తావ్. అందుకని నా మాట విని మంత్రాలను నమ్ముకో" అన్నాడు రహస్యంగా.

అంత  భాదలోను సుబ్బారావు పడి పడి నవ్వుతూ "ఒరేయ్ నువ్వు చదువు అబ్బాని సనాసివని నిరుపించావ్ రా ! మంత్రాలకు చింతకాయలూ రాలవు అని సామెత విన్నావా? ఎప్పుడయినా" అన్నాడు. 

దానికి ఆ స్నేహితుడు "చింతకాయలు రాలవు కాని, అమ్మాయిలు వాలుతారు మన ఒళ్ళో. పెద్ద చదువుకున్ననని పొగరు మాని నేను చెప్పింది చెయ్. సక్సెస్ అయితే నాకు పది లక్షలు ముట్ట చెప్పాలి" అన్నాడు చమత్కారంగా.

"సరే అలాగే ! ఇంతకూ ఎవరు ఆ మహా మాంత్రికుడు" అన్నాడు సుబ్బారావు వెటకారంగా నవ్వుతూ.

"పక్కనే ఉన్నా అడవిలో ఉంటాడు ! ఈ మధ్యే వచ్చాడు ఎక్కడ నుండో. పేరు నాగులు" అన్నాడు రహస్యంగా.

స్నేహితుడు చెప్పిన ఆనవాల ప్రకారం అడవిలో నాగులు ఉన్నా చోటుకు బయలు దేరాడు సుబ్బారావు. కాలి బాట కుడా సరిగా లేని ఆ అడవిలో ఎంత దూరం నడవాలో తెలియటం లేదు, కనీసం దారి తప్పి పొతే ఎవరినయినా అడుగటానికి కుడా లేదు. అయినా తప్పదు ! తన జీవితం అనుకునట్లు సాగాలంటే ఇలాంటి వాటిని కూడా నమ్మక తప్పదు అనుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 

అలా  వెళ్తున్న వాడల్ల ఒక్కసారిగా ఆగి పోయాడు. పక్క నున్న పొదలు కదులుతున్నాయి ! సుబ్బారావు బిత్తర పోయి ఆటే చూస్తున్నాడు. ఒక్కసారిగా  జుయ్ మని గాలి వీచింది, ఆ గాలి కి చెట్టు పై నుండి ఆకులూ పెళ పెళ రాలిపడ్డాయి సుబ్బారావు మిద. అదిరి పడి చెట్టు పైకి చూశాడు,  కాని ఏమి లేదు. పొదలు కదలటం ఎక్కువ అయింది, సుబ్బారావు కు వెన్నులో వణుకు మొదలయింది. దగ్గరకు వెళ్ళి చుద్దామంటే దైర్యం సరిపోవటం లేదు. అంతే ! అక్కడ నుండి ముందుకు పరుగు తీసాడు.

కొద్ది దూరం పరుగు పెట్టి,  తిరిగి పరుగు లాంటి నడక తో ముందుకు సాగాడు. చాల దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఒక గుడిసె కనిపించింది. బహుశ అదే నాగులు ఉండే చోటు అయి ఉంటుంది అనుకుని ఇంకా వేగంగా నడక సాగించాడు. గుడిసె ను సమీపించి పరిసరాలు చూశాడు, చుట్టూ అన్ని చెట్లు వాటి మద్యలో తాటి ఆకులూ మరియు చెట్ల కొమ్మలతో కప్పిన గుడిసె. చుట్టూ ఈత మరియు కొబ్బరి మట్టలతో చిక్కగా అల్లి లోపలిది బయటకు కనిపించకుండా ఉంది.

లోపలి నుండి ఏవో మంత్రాలూ వినపడుతున్నాయి. సుబ్బారావు కు మాత్రం ఇంకా నమ్మకం కలుగటం లేదు. ఈ రోజుల్లో ఇలాంటివి ఏంటి ! అనుకుంటూనే ఒక సారి  ప్రయత్నిస్తే తప్పేంటి అనుకున్నాడు. కాని ఆ ప్రయత్నం తన చావు మీదికి తెస్తుందని ఉహించ లేక పోయాడు. కొద్ది సేపటికి  మంత్రాలూ ఆగిపోయాయి, నాగులు బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే సుబ్బారావు అదిరి పోయాడు.

నాగులు మొఖం అంత రక్తం తో నిండి ఉంది, అతని నోరు ఎర్రగా పండింది. మరో చేతిలో చిన్న మేక పిల్ల గొంతు తెగి వేలాడుతూ ఉంది. అంటే ! నాగులు నోటితోనే  పీక కొరికేసి దాని రక్తం తాగడాన్న మాట ! అది తలచు కోగానే సుబ్బారావు కు ఎక్కడో చిన్నగా భయం మొదలయింది. సిటి లో పుట్టి పెరిగిన తను  ఇలాంటివి ఎప్పుడు చూసి ఎరుగడు. ఆపై నాగులు ఆకారం అతని భయాన్ని  రెట్టింపు చేస్తోంది. గుబురు గడ్డం, మీసాలు మరియు నల్లని వంటి చాయ. లుంగీ కట్టుకుని పైన చొక్కా లేకుండా  ఒళ్ళంతా వెంట్రుకలతో మనీష కాదా ! అన్నంత అనుమానం కలిగించేలా ఉన్నాడు.

కాని అంతలోనే తేరుకుని, చదువుకున్న తనను ఇలాంటి అడవి మనిషి ఎం చేయగలడు ! నేనే ఒక అట ఆడించాలి అనుకుని దైర్యం తెచ్చుకున్నాడు. అతన్ని సమీపించి "నాగులు అంటే నువ్వేనా ?" అని ప్రశ్నించాడు నిర్లక్ష్యంగా.

ఒక్కసారిగా నాగులు సుబ్బారావు ను  ఉరిమి చూసి "నేనే ! నీకేం కావాలి" అన్నాడు గంబిరమయిన  గొంతుతో. అ గొంతులో గర్వం, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న  కోపం తొణికిస లాడింది.

అదేమీ పట్టని సుబ్బారావు అదే దొరణి కొనసాగిస్తూ "నేను ఒక్క అమ్మాయిని ఇష్టపడ్డాను. తన తో నా పెళ్ళి జరిపిస్తే నేను ఈ మంత్రాలూ చింతకాయలు నమ్ముతాను" అన్నాడు వెటకారంగా చూస్తూ.

నాగులు కు విషయం అర్ధం అయ్యింది, "వీడు తన మీద నమ్మకంతో రాలేదు. ఏదో ఒక రాయి వేసి చూద్దాం అని వచ్చాడు ! వీడికి సరయిన గుణ పాఠం చెప్పాలి" అనుకుని "అలాగే చేద్దాం ! కాని ఖర్చు అవుతుంది. ఆరు లక్షలు" అన్నాడు అంతే గంబిరంగా.

"నువ్వు పని చేస్తే ఆరు లక్షలు కాదు, నా పెళ్ళాం ఆస్తి లోంచి పది లక్షలు ఇస్తాను. నన్ను ఎం చెయ్యమంటావో చెప్పు" అన్నాడు ఉషారుగా. 

"ముందు ఆమె వెంట్రుకలు మరియు రక్తం తీసుకుని రా. తరువాత ఎం చెయ్యాలో నేను చెపుతాను" అని చెప్పి లోపలి వెళ్లి ఒక కొబ్బరి బొండం తెచ్చి  కొట్ట సాగాడు.

"సరే నేను బయలు దేరుతాను" అంటూ వెళ్తున్న సుబ్బారావు కు కొబ్బరి బొండం ఇస్తూ "దిన్ని తాగండి. అసలే ఎండన పడి వచ్చారు. మళ్ళి ఎండలోనే వెళ్ళాలి" అన్నాడు నాగులు.

సుబ్బారావుకు తాగాలని లేదు, కాని తాగక పొతే మళ్ళి భయపడుతున్నననుకుంటడని ఆఇష్టంగానే తాగాడు. కాని అందులో నీళ్ళు చాల తియ్యగా ఉన్నాయి, తను ఎప్పుడు తాగి ఎరుగడు అంత తియ్యని కొబ్బరి బొండం. అదే అడగాలనుకుని ! ఎక్కువగా మాట్లాడితే లోకువ అయిపోతాం అనుకుని అక్కడ నుండి బయలు దేరాడు.

సుబ్బారావు వెళ్ళిన కాస్సేపటికి పచ్చని  కొబ్బరి బొండం నల్లగా  మారి పోయింది. నాగులు బిగ్గరగా నవ్వుతూ దాన్ని కాలి తో గట్టిగా తొక్కాడు. అంతే ! రెండు ముక్కలయినా దాని నుండి పురుగులు బయటకు వచ్చాయి పుట్ట నుండి బయట పడ్డ చీమల మాదిరి. ఇవేవి తెలియని సుబ్బారావు మోహిని తన వశం కాబోతుందని, తన ఆస్తికి ఇక నుంచి తనదే పెత్తనం అని సంతోషంగా ఇంటి దారి పట్టాడు.

మోహిని ఇంటిలో పనిచేసే మంగమ్మకు డబ్బు ఆశ చూపి మోహిని వెంట్రుకలు మరియు నెల సరికి (పిరియడ్)  ఆమె  వాడిన ప్యాడ్ తెప్పించు కోవటం పెద్ద కష్టం కాలేదు సుబ్బారావుకు. అవి తన చేతికి అందగానే నాగులు దగ్గరికి చేరుకున్నాడు.

సుబ్బారావును చూడగానే నాగులు సంతోషంతో "శబాష్....చెప్పిన పని చెప్పినట్లు చేసినావ్. ఇప్పుడు చూపిస్తా నా మంత్రాల తడాకా" అంటూ సుబ్బారావును తన గుడిసె లోపలికి  తీసుకెళ్ళాడు.

అందులో అడుగు పెట్టగానే సుబ్బారావు కు ఏదో వింత అనుభూతి కలిగింది. అక్కడక్కడ ఎముకలు మరియు భయంకరయిన విగ్రహాలు అగుపించాయి. ఇంకా మట్టి తో మరియు చెక్క తో చేసిన కొన్ని అడ, మగ బొమ్మలు ఓ మూలా పడి  ఉన్నాయి.  చిన్న గుట్టగా పోసిన నిమ్మ కాయలు, కుంకుమ, పసుపు, గందం, బూడిద మరియు  బియ్యం పిండి పేర్చి ఉన్నాయి పాత్రలలో.  కిటికీ మూసి లేక పోవటంతో ఒక్కసారిగా గాలి వీచింది గుడిసె లోపలికి ! అంతే ఓ మూలా ఉన్నా మూట మీద నుండి గుడ్డ తొలగి పోయింది. అప్పుడు అగుపించింది ఒక శవం ! అది చూడగానే సుబ్బారావు గుండెలు అదిరి పోయాయి.

 నాగులు వెళ్ళి కిటికీ మూసి వచ్చి గుడ్డ ఎప్పటిలా కప్పేసాడు. పద్మాసనం వేసి కూర్చుని బియ్యం పిండి మరియు బూడిద తో ముగ్గు వేసాడు. ఆపైన  సుబ్బారావు తెచ్చిన మోహిని వాడిన నెల సరి ప్యాడ్ ను ఒక మట్టి ముంతలో ఉన్నా నీళ్ళ లో ముంచాడు. అప్పుడు ఆమె రక్తం ఆ నీళ్ళ లో కలిసి పోయింది. సుబ్బారావు తెచ్చిన మోహిని జుట్టును ఆమె రక్తం తో నిండిన ఆ మట్టి పాత్రను, ఇంకా నూనే  వేసి, వత్తి పెట్టి వెలిగించని ఒక దీపపు సమిదను  ఆ ముగ్గు మధ్యలో పెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ ఎముకను తిప్ప సాగాడు.

సుబ్బారావు అదంతా నిశ్చేష్టుడయి  చూస్తుండి పోయాడు. కాసేపటికి ఆ దీపం దానంతటదే వెలిగింది. సుబ్బారావు చేతిని తీసుకుని ఒక కత్తితో చిన్న గాటు పెట్టి మోహిని రక్తం కలిపిన మట్టి పాత్రలో పట్టాడు. అ తర్వాత మోహిని జుట్టు ను ఆ దీపం మంటలో కాల్చి ఆ బూడిదను ఇద్దరి రక్తం కలిసిన పాత్రలో కలిపాడు. ఆ పాత్రను దీపం చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలూ చదువ సాగాడు. దీపం ఒక్కసారిగా అరి పోయింది ! నాగులు తృప్తిగా చూసి ఒక మగ ఆకారం చెక్క బొమ్మను తీసుకుని పడుకో బెట్టి దానిపై ఆ పాత్రలోని ఇద్దరి  రక్తం మరియు బూడిద కలిసిన ద్రవాన్ని కొద్ది కొద్ది గా పోస్తూ ఏవో మంత్రాలూ చదివాడు. కాస్సెపటికి బొమ్మ లేచి నిలబడింది.

 ఇదంతా చూస్తున్న సుబ్బారావుకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అ తర్వాత నాగులు ఆ పాత్రలో ఏదో నల్లని పొడిని కలిపాడు. విచిత్రంగా అది ఆకు పచ్చ రంగులోకి మారి పోయింది.

"ఇందులో ఉన్నా దాన్ని కొంచెం తాగు" అంటూ సుబ్బారావు చేతికి ఇచ్చాడు. తటపయిస్తూనే కొంచెం తాగాడు సుబ్బారావు !  అది చాల తియ్యగా ఉంది. 

"ఈ చెక్క బొమ్మ తీసుకుని వెళ్ళి నువ్వు కోరుకుంటున్నా అమ్మాయి పడక గది ముందు కట్టు. ఇది గాలిలో వేలాడుతున్నంత సేపు ఆ అమ్మాయి నీ వశం లో ఉంటుంది ! ఆ లోపు ని పని కానించు. మరో ముఖ్య విషయం ఈ పాత్రలోని ద్రవాన్ని ఆ అమ్మాయి తో తాగించు, అప్పుడే నా మంత్రం శక్తి ఆమె పై పని చేస్తుంది" అన్నాడు నాగులు.

అన్నింటికీ సంతోషంగా తల ఉపి అక్కడ నుండి బయలు దేరాడు సుబ్బారావు. ఇంకా కొన్ని గంటలలో మోహిని తన వశం కాబోతోంది !

"అందమయిన తనను తినివితిరా అనుభవించాలి. రెండు లేదా మూడు రోజులలో పెళ్ళికి ఒప్పించాలి. ఆ తరువాత తనే చచ్చినట్లు పడి ఉంటుంది" అనుకుంటూ పరుగు లాంటి నడక తో ఇంటి కి బయలు దేరాడు.

కాని క్రూరుడు అయిన నాగులు ఆలోచన మరోలా ఉంది. నిజానికి సుబ్బారావు కు సహాయం చేయాలనీ లేదు నాగులు కు. అందుకే తాత్కాలిక మయిన శక్తి తో పంపించాడు సుబ్బారావు ను.

మరి నాగులు ఆలోచన ఏమిటి ? సుబ్బారావు మోహిని ని సోతం చేసుకున్నాడ?  వీటికి సమాదానం వచ్చే భాగాలలో తెలుసు కుందాం.

(ఇంకావుంది)

అయిదవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.


3 వ్యాఖ్యలు: