8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

చేతబడి !!! - 3

(రెండవ బాగం కోసం ఇక్కడ నొక్కండి. తరువాతి భాగాల కోసం వేచి చూడండి)

సుబ్బారావు మోర్ సూపర్ మార్కెట్ లో గంట నుండి ఎదురుచూస్తున్నాడు ఆ షాప్ ఓనర్ మోహిని కోసం. ఎలాగయినా తన ప్రేమను చెప్పి ఆమెను ఒప్పించాలని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. పెద్దగా అందంగా ఉండక పోయిన, డబ్బు లేక పోయిన  బాగా చదువుకున్నాడు.  మోహిని వాళ్ళా కాలేజీ లోనే లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.

మోహిని, అతను ఒకే కాలేజీ లో చదువుకోవటం వల్ల ముఖ పరిచయం, దాన్నే చనువు అనుకుంటూ ఉంటాడు.  కాని మోహిని అతన్ని ఎ నాడు స్నేహితుడిగా భావించేది కాదు.

మోహిని వాళ్ళకు చాల వ్యాపారాలు ఉన్నాయి ఆ సిటి లో, ఇంకా చుట్టుపక్కల ఊర్లలో. తను ఏమి పట్టించుకోక పోయిన లక్షలలో వచ్చి పడుతాయి డబ్బులు నెల తిరిగే సరికి. ఈ మధ్యే తల్లి తండ్రి చనిపోవటం తో ఒంటరిగా ఉంటోంది లంకంతా ఇంట్లో. ఒంటరిగా ఉంటున్న తనను జంట చేసుకోవటం పెద్ద కష్టం కాదు. అందుకే ఆమెకు  దగ్గర అయి ఆమె కు మొగుడిగా , ఆమె ఆస్తి కి యజమాని అవ్వలన్ని పథకం వేసాడు. 

మోహిని కారు దిగి సరాసరి తన కేబిన్ లోకి వెళ్ళింది. కాస్సేపటికి సుబ్బారావు లోపలికి  అడుగు పెట్టాడు.

"గుడ్ మార్నింగ్ బ్యుటిపుల్" అంటూ పలకరించాడు కొంటెగా నవ్వుతూ.

"ఓ నువ్వా ! ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావ్ ? కాలేజీ కి వెళ్ళలేదా ?" అడిగింది మోహిని నిర్లక్యంగా.

"కొంపదీసి వెళ్ళి పోమ్మంటావా ! ఏంటి ?" అంటూ అడిగాడు ఇబ్బందిగా నవ్వుతూ.

"చెపితే మాత్రం వెళ్తావా ! ముందు విషయం చెప్పు" అంది లహరి చిరాకుగా. 

ఆ రోజు పింక్ కలర్ చిర కట్టుకుంది మోహిని. పలుచని ఆమె జాకెట్టు లోంచి తెల్లగా కనిపిస్తోంది ఆమె బ్రాసరి. ఎత్తయిన గుండెల మిద అందంగా ఆమె కదిలినప్పుడల్లా అటుఇటు ఉగుతోంది  డైమండ్ లాకెట్. చిర తొలగి పోయి నిమ్మ పండు రంగులో కనిపిస్తున్న ఆమె ఉదర బాగము,  కొలతలు చూసి పెట్టినట్లు ఉన్నా గుండ్రని లోతయిన ఆమె నాబి సుబ్బారావు మనసును అల్లరి చేస్తున్నాయి. ఇంకా ఆ ఎర్ర్రని పెదవులు అందితే ! అంతటి సుఖానికి తానూ బ్రతక గలడా? స్లివ్ లెస్ లో కనిపిస్తున్న ఆ నునుపయిన జబ్బలు ఒక్కసారి తడమని ఈ జన్మ ఎందుకు? 

ఇవ్వని కాదు! ఇంత అస్తిపరురాలు భార్య కాకపోతే జీవితం వృధా అయిపోతుంది. ఎలాగయినా ఈ రోజు తనను ఒప్పించాలి. ఇలా సాగిపోతున్న సుబ్బారావు ఆలోచనలు.

"ఏంటి ! ఏమి మాట్లాడవు. అసలు ఎందుకు వచ్చావ్ ?" అన్న మోహిని అరుపు తో ఈ లోకం లోకి వచ్చాడు.

"ఏమి లేదు నీతో చాల రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెపితే" అంటూ గొణిగాడు. 

"ఏంటది ? త్వరగా చెప్పు. నేను మళ్ళి కాలేజీ కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చెయ్యాలి" అంది.

"మనిద్దరం కాలేజీ లో చదువుకునే రోజుల నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు సరే  అంటే నిన్ను పెళ్ళి చేసుకున్దమనుకుంటున్నాను" అన్నాడు ఉత్సాహంగా.

"వ్వాట్ రబ్బిష్ ! నేనేంటి నిన్ను పెళ్ళి చేసుకోవటం ఏంటి" అంది కోపంగా చూస్తూ.

"దయచేసి ఒప్పుకో మోహిని ! నా ప్రేమ నిజమయింది. నువ్వు ఏం చేసిన అడ్డు చెప్పను. ఒక పెంపుడు కుక్కలా ఓ మూలా పడి ఉంటాను" అన్నాడు బ్రతిమాలుతూ. 

"కరెక్ట్....బాగా చెప్పావ్ నీ గురించి నువ్వు. కుక్కలను మనుష్యులు పెళ్ళి చేసుకోరు. అందులోకి నా లాంటి మహారాణి అసలు చేసుకోదు. లిమిట్స్ లో ఉండు ! ఇంకోసారి ఇలాంటి పపోసల్స్ తో వచ్చావో ఉన్నా ఉద్యోగం కూడా ఉడుతుంది. ఏదో నాతొ ఒకే కాలేజీ లో చదువుకున్నావని వదిలేస్తున్నా. గెట్ అవుట్" అంటూ గుమ్మం చూపించింది.

అవమానంతో తల దించుకుని బయటకు వచ్చాడు సుబ్బారావు. 

కాలేజీ కి వెళ్ళి తన రూం లో అడుగుపెట్టిన మోహిని వెంటనే అరవింద్ ను రామ్మని కబురు పెట్టింది. అరుఅడుగుల ఎత్తు, మంచి పిజిక్ తో ఎర్రగా అందమయిన మొఖం తో ఎ అమ్మాయి కయిన మొదటి చూపులోనే నచ్చేస్తాడు అరవింద్. పైగా చాల తెలివయిన వాడని కూడా వింటుంది మోహిని. అందుకే అతనంటే మోహిని కి ఎంతో ఇష్టం, అతను ఒప్పుకుంటే ఈ క్షణమే సర్వం అతనికి దారపోస్తుంది. కాని ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అతను తొనక లేదు తనకు లొంగ లేదు. మోహిని రోజు కాలేజీ కి వచ్చేది అరవింద్ ను చూడటానికే అంటే అతిశయోక్తి కాదు. 

"గుడ్ మార్నింగ్ మేడం" అంటూ లోపలి అడుగు పెట్టాడు అరవింద్.

"హయ్ హ్యాండ్ సామ్ ! నన్ను మేడం అనొద్దు, పేరు పెట్టి పిలవమని ఎన్ని సార్లు చెప్పాలి. మనం ఒకే ఏజ్ గ్రూప్ తెలుసా మీకు" అంది కొంటెగా కన్ను గిటుతూ.

"ఇన్ ఫాక్ట్ నేనే మీ కన్నా రెండేళ్ళు పెద్దవాణ్ణీ. కాని మీరు నా బాస్ కాదా" అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.

మోహిని ఉషారుగా "మీరు బాస్ కావాలంటే చెప్పండి ఇప్పుడే అంత మీ చేతిలో పెట్టి చేతులు ఎతేస్తా" అంటూ స్లివ్ లెస్ చేతులు పైకి లేపింది.

ఇంకెవరయినా అయితే నున్నని ఆమె జబ్బలు చూస్తూ అలా కన్నార్పకుండా ఉండేవారు.

కాని అరవింద్ కిందికి తలదించుకుని "చెప్పండి మేడం ! నన్ను ఎందుకు పిలిపించారు" అన్నాడు వినయంగా.

మోహిని తన కుర్చీ లోంచి లేచి "నా మీద మీ అభిప్రాయం తెలుసు కుందామని ! చెప్పండి నన్ను చుస్తే మీకు ఏమని పిస్తుంది" అంటూ అడుగుతూ చీరను నడుము పై నుండి కాస్త తొలగించి, తన ఎద బాగం అతనికి కనిపించేలా చేసింది. 

నునుపయిన ఆమె వంటి చాయ ఆ రూం అంత పడుతుందేమో అన్నంతంగా ఆమె అందం మెరిసి పోతోంది.

అరవింద్ కాస్సేపు అలాగే ఆమెను చూసి ఒక్కసారిగా తేరుకుని "సారి మేడం ! నాకు అలాంటి అభిప్రాయం లేదు. నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను" అన్నాడు దృడమయిన స్వరంతో.

"ఈ ఆస్తి, ఈ అందం అంత నీ కాళ్ళ ముందు పెడుతాను. దయచేసి కాదనకు" అంది అతన్ని వెనుక నుంచి హత్తుకుంటూ.

అరవింద్ ఆమెను విడిపించుకుని "క్షమించండి మేడం ! మీకు ఇబ్బందిగా ఉంటె ఇక్కడ ఉద్యొగమయిన మానేస్తాను. కాని నేను నా ప్రియా కు అన్యాయం చెయ్యలేను" అంటూ బయటకు నడిచాడు. 

నిశ్చేష్టురలాయి అలా చూస్తూ ఉండి పోయింది మోహిని. కోటిశ్వరుడి గారల కూతురు అయిన తనకు, గొప్ప అందగత్తేనని విర్ర విగిన తనకు ఎంతటి అవమానం. అక్కడ ఉండలేక డ్రైవర్ ను కారు ఇంటికి తీసుకెళ్ళ మని చెప్పింది. ఇంటి నిండా పని మనుషులు, గుర్కాలు,  కాని నా అనేవాళ్ళే లేరు.  లేక లేక ఇష్టపడ్డ ఒక్క మగాడు కాదన్నాడు. అలాగే బెడ్ రూమ్ లో ఏడుస్తూ ఉండి పోయింది.

ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో ! ఎవరు నాగులు మంత్ర శక్తికి బలి అవుతారో వచ్చే భాగం లో తెలుసుకుందాం.

(ఇంకావుంది)


నాలుగవ భాగం కోసం ఇక్కడ నొక్కండి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి