6, ఫిబ్రవరి 2013, బుధవారం

చెతబడి !!! - 2

(మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి . తర్వాతి భాగాల కోసం వేచి చూడండి)
 
అంతకు ముందు తను  చేసిన చేతబడి తన మీదికే తిప్పికొట్టడం తో చావు తప్పి కన్ను లొట్టా పోయిన నాగులు ఎలాగయినా అత్యంత శక్తి వంతుడయిన మాంత్రికుడిగా మారాలను కున్నాడు. అందు కోసమని తన గురువు దగ్గర నుంచి దొంగలించిన తాళ పత్ర గ్రంధాన్ని తెరిచి  కొత్త మంత్రాలూ ఎలా సాదించలొ, వాటికై అచరించవలసిన నియమ, నిబందనలు తెలుసుకున్నాడు. 

అందుకు అతి ముఖ్యమయినది  శవ పూజ,  చేయటానికి ఆ రోజు రాత్రి ముహూర్తం నిర్ణయించు కున్నాడు. ఆ రోజు నిండు పున్నమి! అర్దరాత్రి పన్నెండు గంటలకు అడవిలో ఉన్నా తన గుడిసె నుండి బయలు దేరాడు.

దగ్గర లో ఉన్నా పల్లె పేరు తాడి గుండెం, ఆ ఉరి శ్మశానం ఉరికి ఉత్తరాన ఉంటుంది. అతి చిన్న పల్లె అయిన ఆ ఉరిలో మనుష్యులు పెద్దగా ఉండరు అందుకే చావులు కూడా తక్కువే.

కాని ముహూర్తం దాటి పోకుండా ఉండాలంటే ఆ ఉరికి వెళ్ళటమే సరయినది అనుకున్నాడు నాగులు. సంచిలో చిన్న గునపం మరియు పూజ సామాగ్రి వేసుకుని  చీకటి లో ఒక్కడే నడుస్తూ వెళ్తున్నాడు. వెన్నెల వెలుగు లో చెట్ల నీడలు వింత వింత ఆకారాల్లో కనిపిస్తున్నాయి. మాములు మనుషులు అయితే భయపడి ఒక్క అడుగు కుడా వెయ్యలేరు. కాని మాంత్రికుడు అయిన నాగులు కు భయం లేదు.  ముహూర్తం దాటి పోకుండా శ్మశానం చేరి శవ పూజ చెయ్యాలన్నదే ఉంది మనసులో. 

చేతిలో ఉన్నా కర్రతో పొదలు పక్కకు జరుపుతూ అవసరయిన చోట కాలి బాట లో నడుస్తూ తొందరగా చేరాలని ముందుకు సాగుతున్నాడు. శ్మశానం లోకి అడుగు పెట్టగానే బలిష్టమ మయిన నక్క ఒకటి ఎదురు పడింది నాగులు కు. అది నాగులు ను చూడగానే ఒక్కసారిగా అతని మీదికి దూకింది. ఏమాత్రం తడబడని నాగులు పక్కకు తప్పుకుని  చేతి లో ఉన్నా కర్రతో బలంగా కొట్టాడు దాన్ని. 

తేరుకున్న నక్క గుర్రు మని అరుస్తూ మళ్ళి అతని మిది కి దుకాబోయింది. కర్ర దాని వైపు ఉపి ఏదో మాత్రం చదివాడు నాగులు. అంతే!  నక్క అలాగే కూలబడి పోయింది. శ్మశానం లో అటు ఇటు తిరిగి మట్టి తో పూడ్చిన ఒక సమాధిని ఎంచుకున్నాడు. ఆ శవాన్ని పూడ్చి కనీసం రెండు వారలయినా అయి ఉంటుంది అనుకున్నాడు. కాని తనకు అంత వ్యవది లేదు అందుకే సంచి లోంచి గునపం తీసి తవ్వటం ప్రారంబించాడు.  మట్టి దే అయినప్పటికీ రెండు వారలు అయ్యేసరికి చాల గట్టి పట్టింది సమాది. 

అతికష్టం పూర్తిగా తవ్వే సరికి తెల్లని గుడ్డ కప్పిన శవం కనిపించింది. దాని పైన ఉన్న మట్టిని తొలగించి శవాన్ని బయటకు తియ్యాలని చేతితో లేపాడు. అంతే ! శవం అంత కుళ్ళి పోయినట్లు ఉంది!  చేతి కి గుజ్జు గుజ్జుగా తగిలింది. నాగులు ఎ మాత్రం జుగుప్స పడకుండా శవాన్ని బయటకు తీసాడు జాగ్రతగా. దాని కున్న బట్టను పూర్తిగా తొలగించే సరికి శవానికి పట్టిన పురుగులు బయటకు వచ్చాయి. వెన్నెల వెలుగు లో ఆ అడ శవం అతి భయంకరంగా కనిపించింది. 

ముఖం అంత కుళ్ళి పోయి చెంపల చర్మం ఉడి పోయి దవడలు మరియు పళ్ళు బయటకు కనిపిస్తు, అక్కడక్కడ పురుగులు పాకుతూ ఉన్నాయి. ఇక పొట్ట దగ్గర అయితే పేగులు బయటకు వచ్చాయి ! అందులో పురుగులు బిల బిల మంటూ పారుతున్నాయి. ఏమాత్రం చలించని నాగులు సంచి లోంచి గందం, పసుపు మరియు కుంకుమ తీసి ముగ్గు వేసాడు. శవం కాలిన  బూడిద ను ఒక చేతితో బయటకు తీసిన శవం పై చల్లుతూ,  మరో   చేతితో ఎముకను శవం మిద తిప్పుతూ ఏవో మంత్రాలూ చదువ సాగాడు.

కాసేప్పటికి తన వంటి మిద ఉన్నా లుంగీ మరియు చొక్కా తీసివేసి పూర్తిగా నగ్నంగా మారిపోయాడు.  నిలబడి అన్ని దిక్కులు తిరుగుతూ ఎవరినో రామ్మనట్లు శవం వైపు చూపించ సాగాడు. కాస్సేపటికి శవం కదలటం మొదలు పెట్టింది. ఉత్సాహంగా మంత్రాలూ ఇంకా బిగ్గరగా తొందరగా చదవటం మొదలు పెట్టాడు నాగులు. ఒక్కసారిగా శవం లేచి నిలబడింది.  అసలే కుళ్ళి పోయిన శవం లేచే సరికి అక్కడకడ శరీర బాగాలు ఉడి కింద పడ్డాయి. ఎ మాత్రం చలించని  నాగులు మాత్రం  బూడిదను తీసి చల్లుతూ మంత్రాలూ చదవటం కోన సాగించాడు. 

ఒక పది నిమిషాల తర్వాత శవం బిగ్గరగా అరుస్తూ నాగులు మీదికి ఉరికింది. అది ముందే ఉహించిన నాగులు ఎ మాత్రం తొట్రుపాటు పడకుండా దగ్గరలో ఉన్నా కత్తితో చేతి ని కోసుకున్నాడు, సర్రుమని రక్తం బయటకు వచ్చింది. రక్తం చూడగానే శవం నాగులు ను చేరి అతని చేతినుంచి కారుతున్న రక్తాన్ని తాగసాగింది.  అ తర్వాత నాగులు చేతిలో ఉన్నా ఎముక తో శవాన్ని కొట్టి ఏవో మంత్రాలూ చదివాడు. అంతే శవం నాగులు కాళ్ళ మిద పడి చలనం లేకుండా అయి పోయింది. 

నాగులు తృప్తిగా మీసాలు మేలి వేసాడు. వచ్చిన పని పూర్తీ అయింది, మరో పిశాచ శక్తి తన వశం అయింది. వశం అయినా శక్తి చేజారకుండా ఉండాలంటే నగ్నంగానే ఇంటికి చేరాలి. అందుకే బట్టలన్నీ సంచిలో సర్దుకుని, శవాన్ని ఎప్పటిలాగే పాతేసి తన గుడి సే  వైపు నడక ప్రారంబించాడు నాగులు. స్మశానం దాటు తుండగా ఎవరో మనుషులు వస్తున్నా అలికిడి అయింది. 

"ఎయ్ ఎవరక్కడ? గియ్యలప్పుడు" అంటూ అడిగాడు ఆ వ్యక్తీ.

నాగులు ఏమి మాట్లాడ కుండా అలాగే ముందుకు సాగాడు.

ఆ వ్యక్తీ "నిన్నే ! పిలిస్తే పల్కావ్" అంటూ నాగులు ముందుకు వచ్చాడు.

నగ్నంగా ఉన్నా నాగులు ను చూడగానే అతను ఒక్కసారిగా అదిరి పోయాడు.  ఇంకేదో అనేంతలో నాగులు అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఏదో మంత్రం చదివాడు. అంతే  ! ఆ వ్యక్తీ కుప్పకూలి పోయాడు. తెల్లవారి అతనికి ఎం జరుగుతుందో తలుచుకుని నాగులు నవ్వుకున్నాడు. 

ఆ నవ్వులో క్రూరత్వం, పిశాచాలకు అదిపతినని గర్వం తొణికిస లాడాయి. మనుష్యులను చేతబడి తో  కర్కశంగా హింసించి చంపే భయంకరమయిన ఆ వ్యక్తీ కి జాలి, కరుణ ఉంటాయని అనుకోవటం పిచ్చితనం అవుతుంది. అతన్ని చూసి అక్కడే తచ్చాడుతున్న నక్కలు భయంతో పరుగు తీసాయి. ఉరి దగ్గరకి రాగానే అతన్ని చూసి కుడా  కుక్కలు అరవటం మర్చి పోయాయి. భయంతో తోకలు ఉపుతూ ఉరి లోకి పరుగులు తీసాయి. 

ఆలాంటి నాగులు దగ్గరకి ఎవరయినా వస్తే ! వారి చావు వారు కొని తెచ్చుకోవటమే అవుతుంది. కాని గొర్రె కాసాయి ని నమ్మినట్లు మనుషులు  తమ తీరని కోరికలు తీర్చుకోవటం కోసం ఎప్పుడు ఇలాంటి వారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ దురదృష్టవంతులు ఎవరో ! వారి తీరని కోరికలు ఏమిటో వచ్చే భాగం లో తెలుసుకుందాం.


 (ఇంకా ఉంది)


మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి  

4 వ్యాఖ్యలు:

  1. బ్లాగులను ప్రచురించడంలో కూడలి వారు పక్షపాతం చూపుతున్నారు. వారికి నచ్చిన బ్లాగులను ముందుగా ప్రచురించడం నచ్చని (రాజకీయ) బ్లాగులను రెండు గంటలు ఆలస్యంగా ప్రచురించడం నేను గమనించాను

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. తమరు ఎవరో కాని ఒకటి గమనించండి ! కూడలి వారు నాకు చుట్టాలు కాదు నాది ముందుగా ప్రచురించటానికి, అసలు వారెవరో కూడా తెలియదు నాకు . అయినా మీకు ఏదయినా కూడలి తో ఇబ్బంది ఉంటె సంప్రదించ వలసింది కూడలి అడ్మిన్స్ ను. మిరెంటండి నా బ్లాగ్ మిద పడ్డారు? నాకు తెలిసి ఇది ఎవరు మాన్యువల్ గా చెయ్యటం లేదు ఏదో ఆటోమాటిక్ సర్వీస్ చేస్తూ ఉండాలి. నా బ్లాగ్ చూసినందుకు ధన్యవాదాలు.

      తొలగించు