26, ఫిబ్రవరి 2013, మంగళవారం

చేతబడి !!! - 7


(అరవ భాగం కోసం ఇక్కడ నొక్కండి)

చూపుడు వేలు నుండి పురుగులు రాగానే నాగులు మంత్ర శక్తి అరవింద్ మిద పని చెయ్యటం మొదలు పెట్టింది. అప్పటివరకు ప్రియాను ఆరాధనగా, అద్బుతంగా చూసిన వాడు, ఆమెను ముద్దులతో ముంచెత్తిన వాడు ఒక్కసారిగా ఆమె ను తోసేసి లేచి నిలబడ్డాడు.

ఆశ్చర్య పోయినా ప్రియా "ఏమయింది అల లేచావ్ ? పెళ్ళికి ముందు ఇష్టం లేదా !" అడిగింది విస్తుపోతూ.

అప్పుడు అరవింద్ ఆమెను అసహ్యంగా చూస్తూ "అసలు నువ్వే ఇష్టం లేదు. నల్లగా ఉండే నీకు నేను కావాల ? నాలాంటి వాడికి మోహిని అయితే సరయిన జోడి" అన్నాడు.

ప్రియా కు దుఃఖం పొంగు కొచ్చింది.  ఏడుస్తూనే  "ఎవరు నన్ను ప్రేమించమని చెప్పారు? నువ్వు కాదు నా వెంట పడి ప్రేమించే వరకు వదల లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్" అంది అతని చొక్క పట్టుకుని.

"అప్పుడు ప్రేమించాను ఇప్పుడు లేదు అంటున్నాను. ఇంకా నన్ను వదిలేయ్" అంటూ విసురుగా ఆమె చెయ్యి తోసేసి భయటకు వెళ్ళాడు. 

ప్రియా ఏడుస్తూ కూర్చుండి పోయింది, కాని అరవింద్ మాత్రం మోహిని ఇంటి వైపు బయలు దేరాడు. ఎవరో తరుము తున్నట్లుగా వడి వడి గా నడుస్తూ మోహిని ఇంటిని చేరుకున్నాడు. అప్పటికే ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్న మోహిని కి స్వర్గం అందినంత పనయింది. అరవింద్ ను సరాసరి బెడ్ రూం కు తీసు కెళ్ళి సర్వస్వం అర్పించుకుంది. ప్రియాను తప్ప ఎవరిని కన్నెత్తి చూడని అరవింద్ మోహిని కి పూర్తిగా లొంగి పోయి ఆమె ను వశం చేసుకున్నాడు. జరిగిన సంఘటనతో కుమిలి పోయిన ప్రియా అరవింద్ మోహిని దగ్గర ఉన్నాడని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళింది. 

ప్రియాను చూడటంతోనే మోహిని గూర్కా తో ఆమెను లోపలికి  పంపవద్దని చెప్పింది. అలాగే ఏడుస్తూ రోజంతా అక్కడే నిలబడి పోయినా ప్రియాను చూడగానే గూర్కా బెబెక్ కు చాల జాలి వేసింది. ఎక్కడో అనుమానం ఉన్నా వాడు ప్రియాకు చెప్పాడు ఇలా రహస్యంగా "మేడం ! ఇది మంత్రాల పని. అందుకే అంతగా ప్రేమించే మీ సారూ అట్లా మా మేడం కు లోన్గిపోయిండు. మీరు కూడా ఎవరయినా మంచి మంత్రగాన్ని తీసుకురండి".

అది విన్న ప్రియా అసలు నమ్మలేదు, "కాని అంతల తనను ప్రేమించే అరవింద్ అప్పటికప్పుడు ఇలా మారి పోవటం ఏంటి ? చూస్తుంటే ఇది మంత్రాల పనే అనిపిస్తుంది" అనుకుని తన ఉరికి బయలు దేరింది మంత్రాల వీరయ్య కోసం. 

వీరయ్య చాల గొప్ప మాంత్రికుడు, కాని మంచి కోసం పాటుపడే మనిషి. ఎక్కడ మంత్రాలతో చెడు జరుగుతున్నా వాటిని తన మంత్ర శక్తి తో అడ్డుకుంటాడు. ప్రియాను చూడాగానే అతను పసిగట్టాడు.  జరిగింది ప్రియా నోటి ద్వారా విని ఆమెతో పాటు పట్నం బయలు దేరాడు.  అరవింద్ రూం లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా అదిరి పడి బయటకు వెళ్ళి  ఏవో మంత్రాలూ చదువుతు లోపలికి  అడుగు పెట్టాడు.

ఆపైన అరవింద్ రూం అంత వెతికి అతని మంచం కింద ఉన్నా కుళ్ళి పోయినా చూపుడు వేలు  తీసుకుని ప్రియాకు చూపిస్తూ "ఇదిగో ! ఇదే ఆ మంత్ర శక్తి అరవింద్ మీద ప్రయోగం చేసింది" అన్నాడు.

వెంటనే ప్రియా ఆత్రంగా అడిగింది "అయితే దిన్ని నాశనం చేస్తే అరవింద్ మాములు వాడు అయిపోతాడా ?" అని. 

వీరయ్య నవ్వుతూ "ఇప్పుడు మంత్ర శక్తి అతన్ని పూర్తిగా వశం చేసుకుని తన అధినం లో ఉంచుకుంది. తనను తృప్తి పరచిన వారికి అతన్ని లొంగేలా చేస్తుంది, వారి గురించే తలచేలా చేస్తుంది. దాని నుండి అతను బయట పడాలి అంటే ఆ మంత్ర శక్తి ని నాశనం చెయ్యాలి. అందుకు నేను పూజలు చెయ్యాలి" అన్నాడు.

"అలాగే చెయ్యండి స్వామి ! దానికి నన్ను ఎం చెయ్యమన్న చేస్తాను. కాని నా అరవింద్ తిరిగి నాకు దక్కాలి" అంది దృడమయిన స్వరంతో.

"అయితే రేపు స్మశానానికి వెళ్ళి పూజలు చేద్దాం, కాని అంతకు ముందు మోహిని ఇంటి దగ్గర పాతి పెట్టిన మదన పిశాచి తలను బయటకు తియ్యాలి. దానితోనే మనం పూజలు చెయ్యాలి " అన్నాడు.

వెంటనే ప్రియాకు మోహిని ఇంటి గూర్కా బిబెక్ గుర్తుకొచ్చాడు, వాడికి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఆ పని చేస్తాడు అనుకుని "అలాగే ప్రయత్నిస్తాను స్వామి" అంటూ బిబెక్ దగ్గరికి బయలు దేరింది.  

బిబెక్ కు అయిదు వెయ్యిలు ఇస్తాను అని చెప్పగానే మరో మాట అనకుండా అలాగే వెతికి బయటకు తీస్తాను అని చెప్పాడు.  ఆ రోజు రాత్రి మోహిని పెరడు లో వెతికి తవ్వినట్లు స్థలాని పట్టుకుని తవ్వి తలను బయటకు తీసి బయట వేచి చూస్తున్నా ప్రియాకు ఇచ్చాడు. వారం రోజులు భూమి లో పాతి పెట్టి ఉండేసరికి మొహం లో చర్మం అంతా కుళ్ళి పోయి, కళ్ళు గుంటలు పడి, దవడలు కనిపిస్తూ చాల భయంకరంగా ఉంది ఆ తల. మాములు సమయంలో అయితే దగ్గరి నుంచి చూడటానికే ఇష్టపడని ప్రియా అరవింద్ మిది ప్రేమతో దాన్ని అలాగే పట్టుకుని శ్మశానం లో ఉన్నా వీరయ్య దగ్గరికి బయలు దేరింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ తల ఏదో శబ్దం చేసినట్లు అనిపించింది ప్రియాకు.

పట్టి చూస్తే ఏమి లేదు.  అంత తన భ్రమ అనుకుని మళ్ళి నడవటం ప్రారంబించింది. అప్పుడు అర్దరాత్రి ఒంటి గంట యాభై అయిదు నిముషాలు.  కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తల చిన్నగా నవ్వటం మొదలు పెట్టింది. ప్రియా భయపడి  దాన్ని వదిలేసి అలాగే చూస్తూ నిలబడి పోయింది. తల దొర్లుకుంటూ ప్రియా దగ్గరికి వస్తోంది నవ్వుతూ. ప్రియా పై ప్రాణాలు పైనే పోయాయి! దానికి అందకుండా పరుగు పెట్టడం మొదలు పెట్టింది. తల ప్రియాను వదలకుండా అలాగే దొర్లుకుంటూ ఆమె వెంట పడ సాగింది.

అక్కడ మోహిని కౌగిలిలో వెచ్చగా పడుకున్నా అరవింద్ తల బయటకు తీసే సరికి ఒక్కసారిగా లేచి అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉండి పోయాడు. ఏమి అర్ధం కాని మోహిని కింది గదిలో నిద్ర పోతున్న నాగులు ను నిద్ర లేపింది. అరవింద్ వాలకం చూడగానే విషయం అర్ధం అయిన నాగులు గుర్కాను పిలిపించమన్నాడు. బిబెక్ రాగానే ఏమి మాట్లాడకుండా పక్కనే ఉన్నా బొమ్మ తీసి తలపై కొట్టి చంపేసాడు.

మోహిని ఆశ్చర్యపోతూ "ఏమయింది స్వామి ! ఎందుకు విణ్ణి చంపెసారు" అనడిగింది.

నాగులు పట్టరాని కోపం తో "వీడు పెరడు లో మదన పిశాచి తలని తవ్వి బయటకు పంపాడు. ఇప్పుడు మన మీద దాన్ని ప్రయోగిస్తే ఎంత ప్రమాదమో నీకు తెలియదు" అన్నాడు. కాని ఎక్కడో అతని గొంతులో చిన్న వణుకు తొణకిస లాడింది.

ప్రియా ఎంతసేపటికి రాక పోయే సరికి ఆమెను వెతుకుతూ మోహిని ఇంటి వైపు వస్తున్నా విరయ్యకు పరుగు పెడుతున్నా ప్రియా కనిపించింది. పరుగు పెట్టి పరుగు పెట్టి అలసి పోయిన ప్రియా ఒక దగ్గర కూలబడి పోయింది. ఒక్కసారిగా తల ప్రియా మీదికి దూకి ఆమె పీక కొరికి రక్తం తాగ బోయింది. దాన్ని గమనించిన వీరయ్య తన చేతిని కోసుకుని తల ముందు పెట్టాడు. రక్తం చూడగానే ప్రియాను వదిలి తల గాల్లో కి ఎగిరి వీరయ్య చేతిని పట్టుకుని అతని రక్తం పిల్చసాగింది. ఇదంతా చూస్తున్న ప్రియాకు భయంతో ముర్చపోయినంత పనయింది. తర్వాత వీరయ్య ఏవో మంత్రాలూ చదివి తలను నిద్ర పుచ్చాడు తాత్కాలికంగా.

అక్కడ నాగులు మదన పిశాచం కోసం పూజలు మొదలు పెట్టి దాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అరవింద్ ఏమి అంతు చిక్కక పసి వాడిలా దిక్కులు చూస్తూ ఉండి పోయాడు.  నాగులు ముగ్గు వేసి అందులో మోహినిని  కూర్చోబెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ వెళ్ళి పోయినా మదన పిశాచాన్ని తిరిగి ఆహ్వానిస్తున్నాడు. వీరయ్య కు త్వరపడక పొతే గొప్ప ప్రమాదం ముంచుకు వస్తుంది అని అర్ధం అయింది. వడి వడి గా అడుగులు వేస్తూ శ్మశానం చేరుకొని ముగ్గు వేసి అందులో శవం తలను పెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ దాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు మహా మాంత్రికులు తలపడుతున్న ఆ క్షణాలు ప్రకృతిని భయంకరంగా మార్చేసాయి. ఎవరు ఎవరో తెలియని ఆ ఇద్దరు ఒకరు మంచి కోసం మరొకరు చెడు కోసం, తమ పంతాలు నెగ్గించు కోవటానికి, పిశాచాలపై అధిపత్యం కోసం మంత్రాలతో పోరాటం సాగిస్తున్నారు.

ఇద్దరు మంత్రాలూ చదువుతూ మదన పిశాచాన్ని వశం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కొద్ది సేపటికి ఒకరి మంత్ర శక్తి ఒకరిని భాదించటం మొదలు పెట్టింది.  నాగులు మంత్ర శక్తి వీరయ్య మొహాన్ని కాల్చా బోయింది, అప్పుడు వీరయ్య చేతులు అడ్డు పెట్టుకున్నాడు, అంతే అతని చేతులు బొబ్బలు పడి పోయాయి. అయినా నిగ్రహం కోల్పోని వీరయ్య ఇంకా ప్రయత్నించసాగాడు. కాస్సేపటికి వీరయ్య మంత్ర శక్తి నాగులు ఒళ్ళంతా బొబ్బలు తెచ్చింది, అయినా భయపడని నాగులు ఇంకా అలాగే మంత్రాలూ చదువుతూ ప్రయత్నించసాగాడు. ఇదంతా చూస్తున్నా మోహిని కి భయంతో అక్కడ నుండి లేచి వెళ్ళి పోవాలని అనిపించింది,  కాని నాగులు ఏమ్చేస్తాడో అనుకుని వణికి పోతూ  అలాగే కూర్చుండి పోయింది.

దాదాపు అరగంట సాగినా ఆ పోరాటం లో నాగులు ను మించిన మంత్రకాడు అయినా వీరయ్య కు విజయం లభించిది. మదన పిశాచి దెబ్బకు నాగులు రక్తం కక్కుకుని అక్కడికక్కడే చని పోయాడు. మోహిని ఆ మంత్ర శక్తి కి ఒళ్ళంతా కాలి నల్లగా మారి పోయి పూర్తీ కూరిపిగా మారి పోయింది. తన మీద ప్రయోగించిన మంత్ర శక్తి నాశనం కావటంతో అరవింద్ మామాలు వాడు అయి పోయి తన ఇంటికి బయలు దేరాడు.


(చెడు పై మంచి విజయం తో ఈ చేతబడి కథ ముగిసింది. తిరిగి మరో భయపడే కథతో మీ ముందుకు వస్తాను. ఎన్నో వారాలుగా నన్ను ఆదరించిన మీ అందరికి నా వందానాలు. )20, ఫిబ్రవరి 2013, బుధవారం

హీరో కృష్ణ

సినిమా హీరో  పై  ఆరాధన  చూసి హీరో అయ్యావు 
ఆనతి కాలంలోనే దాన్ని నీపై  రెట్టింపు చేశావు 
పర్వాలేదు అన్న వారే "ఔరా" అనేలా చేశావు 
తెలుగు సినిమా లో నీ స్థానం సుస్థిరం చేశావు 

తెలుగు సినిమాను ప్రపంచానికి చాటావు
నీలో తెగింపు కు ఉన్నా వాడిని చూపావు 
నీ ధైర్యానికి ఎల్లాలు లేవని నిరుపించావు 
తెలుగు సినిమాకు కౌబాయ్ గా మారిపోయావు 
చరిత్రలో మిగిలి పోయావు

ఎవరు ముట్టని కధలు నువ్వు సినిమా  తిశావు 
ఎక్కడ లేని పాత్రలకు జీవం పోసావు 
ఇంతకన్నా ఏముంది అని ఒప్పించావు 
"నువ్వు శబాష్"  అని ప్రత్యర్తి తోనే చెప్పించావు
"అల్లూరి"  వై మా గుండెలో నిండి పోయావు 

పరాజయాలు నిన్ను వెన్నంటి ఉంటున్నా 
నీ మజిలి ముగిసిందని  లోకులు నవ్వినా 
మొక్కవోని నీ ధైర్యం ఓటమిని గెలిచింది 
విజయం అలసిపోయి నిన్ను చేరింది 
నీ కీర్తి అప్పటికే గగనం దాటింది 

నీ చలువతో తెలుగు సినిమా 
ఎన్ని కొత్త పుంతలు తొక్కింది 
ఎన్ని రంగులు అద్దుకుంది 
ఎంత పెద్దది గా మారింది 
ఎన్ని మాటలు నేర్చింది 
ఎంత గా సంపాదించింది 
మరువ గలమా?  మర్చి పొతే 
"సాహసం"  అనే పదాన్ని చేరిపెస్తాం 
"ధైర్యం" అనే  రెండక్షరాలు లేకుండా చేస్తాం 
  
విసమెత్తు ప్రతిభకు నువ్వు ప్రోత్సాహం 
అందులో నీ మనసు ఎంతో విస్తారం 
నువ్వు నిలిపిన  ఎన్నో జీవితాలు 
ఇప్పటికి చెపుతాయి ఆ సత్యాలు 

అలుపులేని నీ శ్రమ  ఎందరికి అన్నం పెట్టింది 
నువ్వు పంచిన విజయం ఎందరిని నిలిపింది 
నువ్వు నడిచిన బాట ఎందరిని నడిపింది 
నీ చల్లని మనసు ఎంత ప్రేమను పంచింది 
ప్రత్యర్థి నయినా కదిలించే నీ నిర్మలత్వం 
మంచి ఎక్కడ ఉన్నా నువ్వు చూపే ఆదరణ
పసి మనసు ను తలపిస్తుంది 
నిన్ను అందరివాడు చేస్తుంది

నీ పేరు లో  "నట శేఖరుడు" చేర్చిన 
"సూపర్ స్టార్"  అని అలంకరించిన 
ఎప్పుడు నువ్వు మా "కృష్ణ" వె 
ముద్దుగా పిలుచు కునే మా "కిట్టయ్య"  వె 19, ఫిబ్రవరి 2013, మంగళవారం

మట్టి మనిషి

రెండు కళ్ళు దినంగా ఆకాశాన్ని చూస్తాయి
మబ్బు పట్టగానే దిపాళ్ళ మెరుస్తాయి
గాలులు విచాగానే వెలుగులు అరుతాయి
ఎండి పోయిన చెరువు చూసి
ఆ గుండె అవిసి పోతుంది
మేతలేని పశువులను చూసి
ఆ కడుపు తరుక్కు పోతుంది

తిండి గింజలు లేక
నీటి చుక్క దొరకక
బ్రతుకు భారమవుతున్న
ఎక్కడో తేలిక పాటి ఆశ ,
వర్షం రాకపోతుందా !
నేల దాహం తిరక పోతుందా !
ఎండిన పంట చిగుర్చక పోతుందా !
మోడువారిన బ్రతుకు మారక పోతుందా!
ఆ ఆశే ఆవిరిగా మారిందేమో
ఆ నమ్మకమే మేఘలుగా కమ్మిందేమో 

తొలకరి చినుకులు ముత్యాలుగా కురిసాయి
పుడమి పాలిట అమృత ధారలయ్యాయి, కాని
ఆ అనందం ఎంతో సేపు నిలవలేదు
వారం అయినా వర్షానికి అలసటే లేదు
మట్టి మనిషికి దిక్కు తోచటం లేదు
ఎండిన చెరువుకు గండి పడింది
వరద నీరు పొంగి పారింది
పంట పొలాలు ముంచేసింది

ప్రకృతి పై అలిగిన ఆ పుడమి పుత్రుడు
సుడి గుండం లో దూకేసాడు
ప్రకృతికి తన బ్రతుకు బలి చేశాడు
మరు ఎటికయినా  తన వారిని
చల్లగా చూస్తుందని

పాద యాత్రలు చేసే పాలకులు
ఉద్యమాలు చేసే నాయకులు
నీతులు వల్లించే పెద్దలు
అన్నదాత అంతం అవుతున్నాడని
అడవి నీతి అమలు అవుతుందని
గుర్తించండి, మట్టి మనిషిని కాపాడండి.


18, ఫిబ్రవరి 2013, సోమవారం

చేతబడి !!! - 6

(అయిదవ భాగం కోసం ఇక్కడ నొక్కండి. తరువాత భాగం కోసం వేచి చుడండి)

నాగులు మోహిని దగ్గరికి బయలు దేరటానికి సిద్దం అవుతున్నాడు. ఒక సాదువు మాదిరి తన వేషం  మార్చుకున్నాడు.   మెడలో ఉన్నా తాయత్తులు తీసివేసి రుద్రాక్షలు వేసుకున్నాడు. తెల్లని లుంగీ మరియు తెల్లని చొక్కా వేసుకుని, నుదుటన విబూది తో నామాలు పెట్టి , వాటి పైన  రూపాయి బిల్లంత  కుంకుమ బొట్టు పెట్టి అచ్చం భక్తుడిలా తయారు అయ్యాడు. 

మాంత్రికుడయిన నాగులుకు మోహిని ఇంటికి చేరటానికి పెద్ద కష్టం కాలేదు. తన బెడ్ రూం లోంచి బయటకు చూస్తున్న మోహిని కి ఎవరో సన్యాసి తన ఇంటి ముందు గుర్కాతో వాదులడుతున్నట్లు చూసి అతన్ని పంపించమని ఇంటర్ కాం లో ఫోన్ చేసి చెప్పింది.

మోహిని అతన్ని చూడగానే "నువ్వేనా ! నా మీద మంత్ర ప్రయోగం చేసింది" అడిగింది కోపంగా.

 "నా దగ్గరికి ఎవరు వఛ్చిన దేవుడిలా వారి కోరిక తీర్చటం నా భాద్యత. దేవుడిలాగే నాకు ముడుపులు చెల్లించాలి" అన్నాడు గంభిరమయిన స్వరంతో. 

"ఓహో అంత గొప్ప వాడివా! అయితే నా కోరిక తీర్చి ని ముడుపులు తీసుకో" అంది మోహిని కొంటెగా.

"నా గొప్పతనం సుబ్బారావు తో నువ్వు గడిపినా రాత్రి తర్వాత కూడా తెలియలేదా? నీ కోరిక ఏదయినా నేను తీర్చగలను, అందుకు తగ్గ ముడుపులు ముట్టచెపితే" అన్నాడు ఇంకా కొంటెగా.

అతని మాటలకు మోహిని చాల ఇబ్బంది పడింది. అతనితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంది.

తర్వాత మోహిని ఆరవింద్ విషయం చెప్పి "జీవితాంతం అతను  నాతోనే ఉండాలి! ఇంకా అతని ప్రియురాలు ప్రియాను  అతను మర్చి పోయేలా చెయ్యాలి" అని చెప్పింది.

అందుకు నాగులు "దానికి నువ్వు కొన్ని నియమాలు పాటించాలి. నేను చెప్పిన చోటుకు వచ్చి కొన్ని పూజలు ఆచరించాలి. మదన పిశాచానికి నీ రొమ్ము పాలతో, మరియు రక్తంతో దాహం తీర్చాలి" అన్నాడు.

మోహిని ఆశ్చర్యపోతూ "నాకు పాలు ఎలా వస్తుంది ! ఆ పిశాచని కనుక్కోవటం ఏలా ?" అంటూ అడిగింది. 

అప్పుడు నాగులు గర్వంగా నవ్వుతూ "ముందు ముందు అన్ని నీకె తెలుస్తాయి. నీకు పాలు రావాలంటే ఈ పొడిని పాలతో కాని నీళ్ళ తో గాని తాగు, మరునాటికి నీ రొమ్ములు బాలింత మాదిరి పాలు కారటం మొదలు పెడుతాయి" అన్నాడు ఏదో పొట్లం ఇస్తూ.

"అయితే నేను ఎప్పుడు, ఎక్కడికి రావాలి" అడిగింది మోహిని కుతూహలంగా.

"ఇక్కడికి పది కిలోమీటర్లు దూరం లో మదన పల్లె అని  కాస్త పెద్దయిన  ఉరు ఉంది.  ఆ ఊరి శ్మశానంలో నేను నీ కోసం రేపు ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రి సరిగా ఒంటి గంటకు మన పూజ మొదలు పెట్టాలి" అని చెప్పి వెళ్ళి పోయాడు. 

నాగులు చెప్పినట్లుగానే మోహిని మరునాడు పన్నెండు గంటల ముపై నిమిషాలకు ఆ ఊరి  శ్మశానంలో అడుగు పెట్టింది. పున్నమికి ఇంకా చాల రోజులు ఉండటం తో,  ఆకాశంలో  చంద్రుడు సగం ఆకారం తో కొక్కెం లా వేలాడుతున్నాడు. నల్లని మేఘాలలో దాక్కుని అప్పుడప్పుడు భయట పడుతూ, ఆ శ్మశానం లో ఉన్నా సమాధులకు కాపాల ఉన్నాడేమో అనిపిస్తున్నాడు.  కియ్ మని కీచురాళ్ళు రొద పెడుతున్నాయి చెవులు చిల్లులు పడేలా,  గబ్బిలాలు చెట్లపై తలకిందులుగా వేలాడుతు భయంకరంగా చూస్తున్నాయి.  ఎక్కడో దూరంగా కుక్కలు చాల బిగ్గరగా మొరుగుతు ఉరి ఉనికిని తెలుపుతున్నాయి. నాగులు కోసం  వెళ్తున్న మోహినికి పక్కనే ఏదో శవం కాలిన కాష్టం కనిపించింది! ఇంకా నిప్పులు అలాగే మండుతున్నాయి. ఆ ప్రాంతం అంత కమ్మురు వాసన ఇంకా అలాగే ఉంది.

 ఆ పరిసరాలు చూస్తుంటే  మోహిని కి చాల భయం భయంగా ఉంద. కాని అరవింద్ పై ఉన్నా ఇష్టం దాన్ని జయించింది. చిన్న గా అడుగులు వేసుకుంటూ నాగులు ఎక్కడ ఉన్నాడో వెతుక సాగింది. చివరికి ఒక దగ్గర ఎవరో ఏదో చేస్తున్నట్లు కనిపించింది.

"నాగులు గారు" అంటూ పిలిచింది చిన్న గొంతు తో.

"మాట్లాడకుండా ఇక్కడికి రా" అన్నాడు నాగులు అజ్ఞాపిస్తున్నట్లుగా.

మోహిని వెళ్ళేసరికి నాగులు ఏదో మట్టితో చేసిన సమాధిని తవ్వుతున్నాడు. కాసేపటికి పూర్తిగా తవ్వి శవాన్ని భయటకు తీసాడు. పొద్దున్నే పాతి పెట్టినట్లు ఉన్నారు శవాన్ని! ఏమి పాడు అవ్వలేదు. కాని శవాన్ని చూసే సరికి అందమయిన మోహిని మొహం భయంతో వికారం గా మారింది.

నాగులు ఆమె వేసుకున్న జాకెట్ తీసేయమని చెప్పాడు. తర్వాత ముగ్గు వేసి ఏవో మంత్రాలూ చదువుతూ శవం పై బూడిద చల్లుతూ ఉన్నాడు. కాస్సేపటికి జుయ్ మని గాలి వీచింది ఆ ప్రాంతం అంత. ఏదో జరుగబొతుందని తెలిసినట్లుగా గబ్బిలాలు ఎగిరి పోయాయి, కిచ్చురాళ్ళు అరవటం ఆపేశాయి. నిశ్శబ్దం అలుముకుంది శ్మశానం అంత! చావులాంటి నిశ్శబ్దం. కొద్దిసేపటికి శవం కళ్ళు తెరిచి నాగులు వైపు చూడసాగింది. నాగులు దాని మొహం మోహిని వైపు తిప్పి ఏవో మంత్రాలూ చదువసాగాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ శవం నాలుక భయటకు తీసింది.

అప్పుడు నాగులు వెంట తెచ్చుకున్న మనిషి పుర్రె లో మోహిని రొమ్ములను పట్టి పాలు పిండి శవానికి తాగించాడు. ఆపైన ఆమె చేతిపై గాటు పెట్టి అదే పుర్రె లో ఆమె రక్తం పట్టాడు. అది చూడగానే విచిత్రంగా శవం లోట్టలు వేయసాగింది. అదంతా చూస్తున్నా మోహిని కి ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో గొంతు ఎండి పోతోంది. నాగులు ఏవో మంత్రాలూ చదువుతూ మోహిని వైపు చూపిస్తూ   శవాన్ని ఏదో  అడుగుతున్నాడు. శవం తలూపుతూ రక్తం ఉన్నా పుర్రె వైపు ఆశగా చూడసాగింది. కాస్సేపటికి నాగులు పుర్రె లో రక్తం తాగించాడు శవానికి. తర్వాత శవం యొక్క తల మరియు  కుడి చేయి నుంచి  చూపుడు వెళ్ళు నరికి సంచిలో వేసుకున్నాడు.

తర్వాత శ్మశానం భయటకు వచ్చి నాగులు ఇలా చెప్పాడు "నేను ఇచ్చే శవం చూపుడు వేలు తీసుకెళ్ళి అరవింద్ ఇంటి లో పెట్టు. అది కుళ్ళి పోయి అందులోంచి బిల బిల మంటూ రెక్కల పురుగులు రావటంతోనే నా మంత్ర శక్తి పని చేస్తుంది. వచ్చే టప్పుడు అతని రక్తం మరియు వెంట్రుకలు తీసుకురా" అన్నాడు.

మోహిని అలాగే నని చెప్పి ఇంటికి బయలు దేరింది. మరునాడు మోహిని అందంగా తయారయి హ్యాండ్ బ్యాగ్ లో ఒక చిన్న కత్తి పెట్టుకుని అరవింద్ ఇంటికి బయలు దేరింది. అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు. అరవింద్ ది పక్కనే ఉన్నా పల్లెటూరు, అందుకే రూం లో ఒంటరిగా ఉంటాడు. వెళ్ళి తలుపు కొట్టేసరికి అరవింద్ వచ్చి తలుపు తీసాడు.

ఆశ్చర్య పోతూ "ఏంటి మేడం మీరు ఇక్కడ ! కబురు చేసి ఉంటె నేనే వచ్చే వాణ్ణి కదా ?" అన్నాడు.

మోహిని మత్తుగా నవ్వి "అవసరం నాది అయినప్పుడు నేనే రావటం సంస్కారం. వచ్చిన వాళ్ళ అవసరం తీర్చి సంతోష పెట్టటం నీకు సంస్కారం" అంది కొంటెగా.

అరవింద్ కు విషయం అర్ధం కావటం మొదలు పెట్టింది. "మేడం ఏదయినా ఉంటె రేపు కాలేజీ లో మాట్లాడుదాం ! దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి" అన్నాడు బ్రతిమాలుతూ.

మోహిని కోపంగా తన చీర తొలగించి "చుడురా! ఇంతటి అందం, నా డబ్బు అన్ని నీ సొంతం చేస్తానంటే నీ ప్రాబ్లం ఏంట్రా? రా అరవింద్ నన్ను కాదనకు" అంటూ అతన్ని హత్తుకుంది.

అరవింద్ ఇంకా కోపంగా ఆమెను తోసేసి  "షట్ అప్ ! నేను నీలా భరితెగించలెను. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో" అన్నాడు గుమ్మం వైపు చూపిస్తూ.

మోహిని హ్యాండ్ బ్యాగ్ లోంచి కత్తి తీసి "అరవింద్ నువ్వు ఒప్పుకోక పొతే నేను నరాలు కోసుకుని చచ్చిపోతాను" అంది బెదిరింపుగా.

అరవింద్ ఒక్కసారిగా కంగారు పడి "మోహిని ! దయచేసి పిచ్చి పనులు చెయ్యొద్దు. ముందు ఆ కత్తి ఇలా ఇచ్చేయ్" అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు.

అతను కత్తి తీసుకుంటూ ఉండగా  మోహిని తెలివిగా అరవింద్ చెయ్యి తెగేలా చేసింది. వెంటనే చేతి రుమాలు తీసి తుడుస్తూ "సారి అరవింద్ నీకు తెగుతుందని అనుకోలేదు" అంటూ అతని వెంట్రుకలలో చేతులు పెట్టింది అప్యాయంగా నిమురుతున్నట్లు.


అరవింద్ ఆమె చెయ్యి తీసేస్తూ ఇబ్బంది గా మొహం పెట్టాడు. మోహిని కోపంగా జుట్టు పికి "తల మీద చెయ్యి వేసిన కూడా పాడు అయిపోతావ ?" అంది.

అప్పటికే ఆమె చేతికి చాల  వెంట్రుకలు వచ్చాయి. రక్తం అంటిన రుమాలు మరియు వెంట్రుకలు చిన్నగా బ్యాగ్ లో వేసుకుంది. ఆపైన పెద్దరికంగా  "క్షమించు అరవింద్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. బాగా దాహంగా ఉంది కొన్ని మంచి నీళ్ళు ఇస్తావ ?" అంది.

అరవింద్ కిచెన్ లోకి వెళ్ళగానే అతని బెడ్ కింద నాగులు ఇచ్చిన శవం చూపుడు వేలు ను పెట్టింది. "బ్యాచలర్ అయినా అరవింద్ ఎప్పుడో నెలకు ఒకసారి బెడ్ కిందా క్లీన్ చేస్తాడు,  ఈ లోపు తన పని అయిపోతుంది"  అనుకుంది మనసు లో. అరవింద్ తెచ్చిన నీళ్ళు తాగి అక్కడినుండి బయట పడింది మోహిని. 

మరునాడు పెట్టె లో డబ్బుతో, హ్యాండ్ బ్యాగ్ లో చేతి రుమాలు, అరవింద్ జుట్టు వేసుకుని నాగులు ఉన్నా గుడిసెకు చేరింది. నాగులు అరవింద్ రక్తం అంటిన  చేతి రుమాలు నీళ్ళు పోసి ఉన్నా ఒక మట్టి పాత్రలో వేసాడు, అప్పుడు అరవింద్ రక్తం నీళ్ళ లో కలిసి పోయింది. ఆపైన మోహిని చేతికి గాటు పెట్టి ఆమె రక్తం అదే పాత్రలో పట్టాడు. తర్వాత ఆమె వెంట్రుకలు కొన్ని తీసుకుని, అరవింద్ వెంట్రుకలు కలిపి కాల్చి ఆ బూడిదను రక్తం కలిసిన పాత్రలో పోసాడు.  గుడిసె మద్యలో ముగ్గు వేసి శవం తాలుకు తలను మద్యలో పెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ ఆ పాత్రలోని ద్రావణం కొద్ది కొద్ది గా పోస్తూ ఉన్నాడు దానిపైన. కొద్దిసేపటికి ఆ తల కళ్ళు తెరిచింది. మోహిని కి ఎందుకో చాల సంతోషం వేసింది. నాగులు తర్వాత ఆ మట్టి పాత్రలో ఏదో పచ్చని పొడిని కలిపాడు! అది నీళ్ళ మాదిరి మారిపోయింది.

నాగులు ఆమె వైపు చూస్తూ "నేను వచ్చి ఈ తలను నీ ఇంటి పెరటిలో తవ్వి పాతి పెడుతాను! అది అక్కడ ఉన్నాననీ రోజులు నువ్వు కోరుకుంటున్నా వాడు నీ మాట వింటాడు. ఈ ద్రావణాన్ని నువ్వు తాగు  నా మంత్ర శక్తికి బలం చేకూరి నీ  వశం అవుతాడు వాడు" అన్నాడు.

మోహిని  డబ్బు తో సహా పెట్టెను  నాగులు కు అందించి సంతోషంగా నాగులును తీసుకుని ఇంటికి బయలు దేరింది. కాని తన సంతోషం ఎన్నో రోజులు నిలవదని ఆమెకు తెలియదు పాపం.  ఇంటికి వెళ్ళిన తర్వాత  నాగులు ఆ మోహిని పిశాచం ఉన్నా  తలను పెరటి లో పాతాడు! తర్వాత మోహిని నాగులు ఇచ్చిన ద్రావణం తాగి తన బెడ్ రూం లో  నిద్ర పోయింది. నాగులు కింద  ఉన్నా గెస్ట్ బెడ్ రూం లో పడుకున్నాడు.

మోహిని వచ్చి చేసిన అల్లరి తెలుసుకున్నా ప్రియా "అరవింద్ మనం తొందరగా పెళ్ళి చేసుకుందాం. మీ వాళ్లు , మా వాళ్ళు ఒప్పుకోక పోయినా సరే. రిజిస్టార్ మ్యారేజ్ చేసుకుందాం" అంది అసహనంగా అరవింద్ తో.

దానికి అరవింద్ కూడ వత్తాసు పలుకుతూ "అలాగే చేసుకుందాం. ఒక రెండు రోజులు ఆగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం" అన్నాడు.

ఇక ఇద్దరు సంతోషం తో ఒక్కరి నొకరు హత్తుకున్నారు. ప్రియాకు చాల సిగ్గుగా ఉంది ! కాని  మూడేళ్ళు గా ప్రెమించుకుంటున్న కూడా అరవింద్  ఏ నాడు తొందరపడ లేదు.  ఇక ఆగకూడదు అనుకుని అరవింద్ పెదవులు అందుకుని అతనికి ఆహ్వానం పలికింది. ఆమె ఉద్దేశ్యం అర్ధం అయినా అరవింద్ ఆమె పెదవులు అందుకుని తర్వాత  తన నాలుకను  ఆమె నాలుక పై ద్వంద యుద్దానికి ఉసిగొలిపాడు.  సాగుతున్నా సమరం లో ఇద్దరు ప్రయోజనం పొందుతూ, ఉత్తెజితులవుతూ యుద్ధం కొనసాగించాడు.

ప్రియా ! పేరుకు తగ్గాటే ప్రియంగా ఉంటుంది. రంగు తక్కువయినా మొహం లో కోటి కాంతుల కళ, చెక్కిన శిల్పం లాంటి శరీరాకృతి, ఉండి లేన్నట్లు ఉండే నడుము, లోతయిన ఉదారబాగము దాని పైన లోతయిన నాభి, మిగడల జారి పోయే నున్నని విపు. ఆమెను చూసిన ఏ మగాడయినా మతి పోయి మళ్ళి మళ్ళి చూడవలసిందే. అందుకు అరవింద్ కూడా  మినహాయింపు కాదు.  అందుకే అన్ని రోజులు ఊరించిన అందం తన సొంతం అయ్యేసరికి ఎక్కడ నుండి మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో తెలియక తనకు తోచిన విధంగా సాగిపోతున్నాడు.

ఆమె వంటి నుండి వచ్చే సువానలకు ఆగలేక చేల రేగి పోతున్నాడు. ఆ తీపి భాదను ఓపలేక పోయినా కూడా ! ప్రియా అతనికి ఇంకా బాగా సహకరిస్తోంది,  యుద్ధం సాగటానికి తనవంతు కృషిని సాగిస్తోంది. అలాంటి సమయంలో బెడ్ కిందా ఉన్నా నాగులు మంత్రించి ఇచ్చిన చూపుడు వేలు నుండి ఒక సన్నని ఎగిరే పురుగు భయటకు వచ్చింది.

అరవింద్ కు ఏం అవుతుంది ? ప్రియా అరవింద్ లా పెళ్ళి జరుగుతుందా? మోహిని ఏమవుతుంది? సమాధానం వచ్చే భాగం లో తెలుసుకుందాం.(ఇంకావుంది)

ఏడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి


15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కుక్క చావూల రైతు

సుక్క పొద్దున్న లేసి అలుపెరుగని యంత్రం లాగ
నాగలి పట్టి భూమిని దున్ని
పగలు తింటే రాత్రికి లేక
రాత్రి తింటే పొద్దున్న లేక
కడుపు కట్టుకుని
రాత్రి పగలు తెలియక చెమట కార్చి
పండించిన పంట బాగానే ఉంది
అప్పులు దిరుతాయని ఆశ రింపింది
గొప్ప ధరలోస్తాయని పట్నం దేస్తే
దాళరోలు కల్సి దండి కొట్టిండ్రు
అందరోక్కటయి ఒక్కన్ని
చేసి పంట నోక్కిండ్రు
యింతకంటే ఎక్కువ రాదని
బస్సు చార్జి చేతుల పెట్టిండ్రు
ధరలే లేంది ఎక్కు వేట్లియాలని సగానంపిండ్రు
యింటికొచ్చి చూస్తే వడ్డీ కట్టమని
అప్పిచ్చిన సేటు పట్టు పట్టిండు
వడ్డీ కట్టంగా మిగిలింది వంద నోటు
పురుగుల మందులకు యాభై లోటు
యింట్ల గాసం నిండింది
గంజి కాచే కుండ ఎండిది
ఆకలి బతుకును మండిత ఉంటే
బతకాలన్న ఆశ బూడిదయి పోయింది
చావూ మిద దాహ మేసి
తాగిన పురుగుల మందు
పురుగులను చంపకున్న
నన్ను చంపుతూ గొప్ప సాయం చేస్తంది
మళ్ళి బతుకు ఉంటే పురుగునయి పుడుత గాని
రైతు నయి చచ్చిన పుట్ట
యిట్ట కుక్క చావూ చావా

14, ఫిబ్రవరి 2013, గురువారం

హంతకుడి ఆత్మహత్య !

రాజారావు కు చాల అలసటగా ఉంది. అంత  దూరం నడవటం కష్టంగా ఉంది. జైలు గోడల మద్య 30 సంవత్సరాలు గడిపే సరికి నడక అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు తన వయసు 65 సంవత్సరాలు. ముప్పది సంవత్సరాల ముందు ఆవేశంతో ఇద్దరు వ్యక్తులను చంపేశాడు. అమ్మ నాన్నకు లేక లేక కలిగిన సంతానం తానూ. ఒక్కడే కొడుకని ఎంతో గారభంగా పెంచారు. ఉన్నంతలో బాగా చదువు చెప్పించాలనుకున్నారు. కాని తను మాత్రం సినిమాలు, అమ్మాయిలు అంటూ  షికార్లు చేస్తూ కాలం గడిపేసాడు.  ఉద్యోగం సద్యోగం లేకుండా కనబడిన ప్రతి వాడితో అయిన దానికి కానీ దానికి గొడవలు పడి  ఉరిలో గొడవలన్నీ ఇంటి మీదికి తెచ్చేవాడు. డబ్బులు ఇమ్మంటూ నాన్నను తెగ విసిగించేవాడు. అప్పటికే రిటైర్ అయిన నాన్న, ఆరోగ్యం బాగుండని  అమ్మ ఎంతో నచ్చచెప్పాలని చూసారు. ఏదయినా ఉద్యోగం చేసుకొమ్మని అయినా తను వినలేదు. 

ఎదో విషయం లో, ఇప్పుడు  తనకు గుర్తు కూడా రావటం లేదు, గొడవ పడి మాట మాట పెరిగి పక్కనే ఉన్న రాడు తో ఇద్దరి తలలు పగుల గొట్టాడు. తన దురదృష్టం, ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అంతే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇద్దరినీ చంపినందుకు రెండు యావత్ జీవిత శిక్షలు వేసాడు జడ్జి. చనిపోయిన వాళ్ళలో ఒక్కడు అ జడ్జి బందువుట, తర్వాత తెలిసింది. ఆర్థికంగా బలంగా లేని నాన్న ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండి  పోయాడు. తానూ జైలులో ఉన్నప్పుడే దిగులుతో నాన్న చనిపోయాడు అని తెలిసింది. అసలే ఆరోగ్యం బాగుండని  అమ్మ, ఎన్ని అవస్తలు పడిందో. ఎ దిక్కులేని చావు చచ్చిందో తలచుకున్నప్పుడల్లా తన మిద తనకే అసహ్యం వేస్తుంది. క్షణిక ఆవేశం లో జీవితాన్ని నరకం చేసుకున్నానని రాజారావు కుమిలి పోనీ క్షణం లేదు. 

ఇన్నాళ్ళకు విడుదల అయ్యాడు జైలు నుంచి. నా అనేవారు ఎవ్వరు లేరు. అసలు తమకు సొంత ఇల్లు కూడా లేదు. తన తల్లి తండ్రి ఎదో ఉరు నుండి ఉద్యోగ రిత్యా హైదరాబాదు వచ్చారు. వచ్చే జీతమంతా నాన్న తన చదువుకే ఖర్చు పెట్టేవాడు. అందుకే సొంత ఇంటిని కూడా కోనుక్కోలేక పోయాడు. ఇప్పుడు తనకు ఎటు వేళ్ళలో తెలియటం లేదు. అసలు ఎలా బ్రతకాలో ఏమి పాలు పోవటం లేదు. జైలు లో అయితే సమయానికి తిండి పెట్టేవారు. తన శిక్ష కాలం పూర్తయిన కూడా  జైలరు గారి మంచి తనంతో ఇన్నాళు  అక్కడే ఉండిపోయాడు. కాని ఇప్పుడు అయన రిటైర్ అయిపోయాడు. కొత్తగా వచ్చిన జైలరు శిక్ష పూర్తీ అయిన వారు ఉండకూడదని విడుదల తేది జారి చేసాడు "మీ వాళ్ళకు,  సమాచారం ఇచ్చుకోండి" అంటూ. కాని తనకు ఎవరు ఉన్నారు సమాచారం ఇవ్వటానికి. రిలీజు రోజు దగ్గర అవుతున్న కొద్ది దిగులు పెరిగి పోయింది. జైలరు గారిని ఎంతో బ్రతిమాలాడు తనను విడుదల చేయవద్దని. కాని గవర్నమెంటు రూల్సు ఒప్పుకోవని అయిదు వందలు చేతిలో పెట్టి పంపించి వేశారు. 

భయట అడుగు పెట్టిన క్షణం నుంచి ఒక్కటే భయంగా ఉంది తనకు. ముప్పయయిదేళ్ళలో  సిటి పూర్తిగా మారి పోయింది. ఎక్కడ చుసిన కార్లు, బస్సులు మరియు ఆటోలు. ఇంకా బైక్ లయితే లెక్కలేదు, ట్రాపిక్ పెరిగి పోయింది. దాంతో పాటు కాలుష్యం కూడా అనుకున్నాడు రాజారావు. సిటి చుసినట్లుంటుందని నడిచి వెల్దమనుకున్నాడు. రెండు ముడు కిలో మీటర్లు నడవగానే అలసి పోయాడు. మద్యాహ్న బోజన సమయం కూడా అవుతోంది, ఎక్కడయినా ఏదయినా తిందాం అనుకున్నాడు. ఎదురుగా "భోజనం తయారు" అన్న బోర్డు చూసి లోనికి వెళ్ళాడు. చేతులు కడుక్కుని ఓ టేబులు ముందు కూర్చున్నాడు. ఓ కుర్రాడు వచ్చి "ఏం  గావలి తాత?" అంటూ అడిగాడు.  "భోజనం తీసుకురా, పప్పుతో" అన్నాడు రాజారావు. "గట్లనే తిసుకోస్తాగని, 35 రూపాలు అవుతది ప్లేటుకు. మరి డబ్బులు ఉన్నాయా" అంటూ అరాతిసాడు ఆ కుర్రాడు. రాజారావు కు చాల ఆశ్చర్యం వేసింది. ప్లేటు భోజనం 35 రూపాయల ! తమ రోజుల్లో 5 రూపాయలు ఉండేది అది కూడా డీలక్స్ హోటల్లో. ఈ లెక్కన అయిదు వందలతో తానూ ఎంతో  కాలం బ్రతుకలేడని  అర్ధం అయింది.  అయినా తప్పేదేముంది, "ఉన్నాయి బాబు తీసుకురా" అన్నాడు. 

భోంచేసి బయటకు వచ్చిన రాజారావుకు ఎటు వెళ్ళలో తెలియటం లేదు. ఏనాడు ఎ స్నేహితుడు తన కోసం రాలేదు. ఎన్నో మార్లు అమ్మ నాన్నను వేదించి డబ్బులు తీసుకుని వాళ్ళకు పార్టి ఇచ్చాడు. ఎవరు ఎప్పుడు అడిగిన లేదనకుండా డబ్బులు ఇచ్చాడు.  అయిన నాలాంటి ఖైదిని, హంతకుడిని ఎవరు మాత్రం స్నేహితుడిగా గుర్తుంచుకుంటారు అనుకున్నాడు రాజారావు. అలా ఆలోచించుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. ఒక్కసారిగా అతనికి ఒక ఉపాయం తోచింది. ఎక్కడయినా పనికి కుదిరితే బాగుంటుందని అనుకున్నాడు. ఏదయినా హోటలు అయితే అక్కడే ఉంటూ అక్కడే  తినోచ్చు అనుకుని,  ఇందాక తను భోంచేసిన హోటలు కెళ్ళి అడగాలని వెనుకకు నడక సాగించాడు. 

హోటలు కుర్రాడు గుర్తు పట్టి "ఏం  తాత ! మళ్ళ  వచ్చినావ్" అన్నాడు. "ఇక్కడ ఏదయినా పని దొరుకుతుందేమో అని" అన్నాడు రాజారావు. "ముసలోడివి నువ్వేం పనిచేస్తావ్ గిడ, అయినా ఓనర్ ను అడుగుతా అగు" అంటూ ఓనర్ దగ్గరకు వెళ్ళాడు. ఎదో మాట్లాడి, రామ్మంటూ చేయితో సైగ చేసాడు ఆ కుర్రాడు. వెళ్ళగానే ఓనరు అడిగాడు "పేరేంటి? ఉరేంటి?" అని. "నా పేరు రాజారావు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాదే" అన్నాడు. "మరయితే ఈ పని ఎందుకు చేస్తున్నావ్? అది కూడా ఈ వయసులో" అంటూ ఆశ్చర్య పోయాడు ఓనర్. "ఈ రోజే జైలు నుంచి విడుదల అయ్యాను, ముప్పయయిదు  ఏళ్ల  తర్వాత. నాకు ఎవరు లేరు అందుకే పనికి కుదురుదామని" అన్నాడు రాజారావు. "అచ్చా ! గల్లాపెట్టె దోపిడీ చేసి దొబ్బెద్దమనుకున్నావ్. పాపం ముసలోడు ఆయనేం తీస్తాడు అని మేం పాగల్ గాళ్ళు గావలె అంతేనా. ఎట్లా కనిపిస్తున్నార బై నీకు, చల్ బయటకు నడు" అంటూ మెడబట్టి తోసేసాడు ఓనర్. 

రాజారావుకు దుఖం పొంగుకొచ్చింది. ఒక్కసారి నేరస్తుడిగా ముద్ర పడితే ఎప్పటికి నేరస్తుడిగానే  ఉండల? క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవించాల? జైలు నుంచి విడుదల అయిన వారు మళ్ళి  మళ్ళి  జైలు కు ఎందుకు వస్తున్నారో అప్పుడు తనకు అర్ధం అయ్యేది కాదు. కాని ఇప్పుడు పూర్తిగా అర్ధం అయ్యింది. సమాజం వారిలో మార్పును చంపి, వారిని నేరస్తులుగా బ్రతుకుమని గెంటే స్తోంది. తనకు వయసు అయిపోయింది  కాని, వయసులో ఉంటె మాత్రం కిరాయి హంతకుడిగా బ్రతికేవాడేమో. ఆ తప్పెవరిది? తనదా? ముమ్మాటికి కాదు. తనను చేర్చుకొని ఈ సమాజానిది. యిలా సాగిపోతున్నాయి అతని ఆలోచనలు, అతని నడక తో పాటు. 

సాయంత్రం అవుతుంది. ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలి అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. దారిలో ఒక లాడ్జ్ కనిపిస్తే వెళ్ళి  రిసెప్షన్ లో అడిగాడు "ఒక రాత్రి పడుకోవటానికి ఎంత" అని. "ఉరికే పడుకొంటే 150 రూపాయలు, అదే రాత్రి భోజనం మరియు ఉదయం టిపిన్  తో అయితే 200 రూపాయలు" అన్నాడు రిసెప్షన్ లో ఉన్నాతను. చేసేదేముంది "అన్నం తోనే" అంటూ డబ్బులిచ్చాడు. ఓ కుర్రాడు "నాతో  రా తాత" అంటూ ముందుకు సాగాడు. తాళం  తీసి లోపలికి  అడుగుపెట్టాడు ఓ రూము లోకి, రాజారావు అనుసరించాడు. రూము పర్వాలేదు నిటుగానే ఉంది, కాని బెడ్ చాల దుమ్ము పట్టి ఉంది. అంత మరకలతో చూడటానికి అసహ్యంగా ఉంది. "బాబు ఏదయినా బెడ్  షిట్ వెయ్యి దినిమిద కాస్త" అన్నాడు రాజారావు. "అట్లనే ఎస్తగని, 10 రూపాయలు ఇవ్వాలి మరి" అన్నాడు ఆ కుర్రాడు. "అలాగే ఇస్తాను కానీ ముందు తీసుకురా" అన్నాడు రాజారావు. కుర్రాడు బెడ్ షిట్ పరిచి 10 రూపాయలు తీసుకుని వెళ్ళి  పోయాడు. తలుపులు దగ్గర వేసుకుని బెడ్డు మిద నడుము వాల్చాడు రాజారావు. 

తానూ పూర్తిగా అలసి పోయాడు. శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ అలసి పోయాడు. రేపటిని తలచుకుంటే చాల భయం వేస్తుంది. ఎక్కడ ఉండాలి? ఎలా బ్రతకాలి? ఇలా ఆలోచిస్తూ గంటలు గంటలు గడిపేసాడు. ఎప్పుడో చిన్నగా మగతగా కన్ను అంటింది. భయట నుంచి తలుపు చప్పుడవుతుంది. బహుశ భోజనం వచ్చిందేమో అనుకుని తలుపు తీసాడు. ఎదురుగా కుర్రాడు భోజనం ప్లేటు, నీళ్ళ  బాటిల్ తో నిలబడి ఉన్నాడు. ప్లేటు,  బాటిలు తీసుకుని మళ్ళి  తలుపేసుకున్నాడు. భోజనం చేయ్యలనిపించటం లేదు. ఆకలి,  దాహం ఏవి గుర్తుకు రావటం లేదు. గడచిన జీవితం, ఎలా గడవలో తెలియని భవిష్యత్తు తప్ప. అప్రయత్నంగా పైకి చుసిన రాజారావుకు చిన్నగా శబ్దం చేస్తూ తిరుగుతున్నా ప్యాను కనిపించింది. 

రాజారావుకి తానూ ఈ సమాజం లో వ్యక్తిని కాను అనిపిస్తోంది. ఈ ఇసడింపుల మద్య, ఒక నేరస్తుడిగా ఈ ముసలి జీవితం అవసరమా? అయినా ఎవరి కోసం బ్రతకాలి. పొద్దున్న లేస్తూనే మళ్ళి  ఆకలి వేస్తుంది, పని చేసుకోవాటానికి ఈ సమాజం ఆసరా ఇవ్వదు. అడుక్కుని తినటానికి మనసొప్పటం లేదు. బ్రతికినంత కాలం ఎలాగు అమ్మ నాన్న తో సంతోషంగా గడప లేక పోయాడు  తను. కనీసం చచ్చి వారిని కలుసుకుని క్షమాపణలు అడుగుతాను. అక్కడయినవాళ్ళను ఓ కొడుకుగా చూసుకుంటాను అనుకున్నాడు రాజారావు. 

కుర్రాడు తెచ్చిన బెడ్ షిట్ ప్యానుకు కట్టి మెడకు బిగించుకున్నాడు. ఉపిరి ఆడటం లేదు తనకు. కాళ్ళు  ఆప్రయత్నంగా  కొట్టుకొంటున్నాయి, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నాలుక బయటకు వస్తోంది, భరింప తరం కాని భాధ. ఈ భాధ  కన్నా బ్రతకటమే మేలనుకున్నాడు. కాని ఏమి చేయలేక పోతున్నాడు. అప్పటికే మెడను బలంగా చుట్టేసింది ఉరితాడు. చేతులలో సత్తువ లేదు పైకి లేవటానికి. ఓ అయిదు నిమిషాలు అలాగే కొట్టుకుని ప్రాణాలు వదిలేశాడు రాజారావు. 

క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని మరోసారి నేరస్తుడు అయ్యాడు చట్టం దృష్టి లో. కాని అతనికి తెలియని విషయం ఏంటంటే రిటైర్ అయిన ఆ  జైలరు  అతన్ని తనతో పాటే ఉంచుకోవాలని అనుకున్నాడు. సమాచారం పంపటంలో కాస్త ఆలస్యం జరిగింది. ఈ రాత్రి గడిపేస్తే ఆ జైలరు తనను  వేదికించే వాడు. చిన్న చితక పని చేసుకుని హాయిగా బ్రతికే వాడు అయన దగ్గర.  అందుకే ఆవేశం ఎందుకు మంచిది కాదు.


(సమాప్తం)

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

చేతబడి !!! - 5

(నాలుగవ భాగం కోసం ఇక్కడ నొక్కండి . తరువాతి భాగం కొసం వేచి చుడండి)

నాగులు ఇచ్చిన ద్రావణం, మరియు మంత్రించిన చెక్క బొమ్మ  తీసుకుని ఇంటికి చేరుకున్నాడు సుబ్బారావు. ఈ రోజు రాత్రికే వెళ్ళి ఆ చెక్క బొమ్మను మోహిని బెడ్ రూం ముందు కట్టాలి అనుకున్నాడు.  అంతకు ముందు ఆ ఇంటి గుర్కా ను మంచి చేసు కోవాలి అనుకుని మోహిని ఇంటి కి వెళ్ళి నేపాలి  గుర్కా బిబెక్ ను కలుసుకుని వాణ్ణి తీసుకుని బార్ లో కూర్చోబెట్టి కావలసినంత మందు తాగించాడు. 

తర్వాత తను అర్ద రాత్రి ఒంటి గంటకు ఇంటి కి వస్తే, మోహిని బెడ్ రూం దగ్గరకి తిసుకెళ్ళలని అల చేస్తే రెండు వెయ్యిల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్లు గానే ఒంటి గంటకు మోహిని బంగ్లాకు వచ్చి బిబెక్ ను కలుసుకున్నాడు సుబ్బారావు.  బిబెక్ సుబ్బారావు ను మోహిని ఉన్నా బెడ్ రూం దగ్గరికి తీసుకెళ్ళాడు. 

బిబెక్ పక్కన కొత్తగా ఉన్నా సుబ్బారావు ను చూడగానే మోహిని కుక్క ఒకటే మొరగటం ప్రారంబించింది. మోహిని లేస్తుందేమో అనుకుని చాల భయపడి పోయారు  ఇద్దరు. ఒక్కసారిగా కుక్క సుబ్బారావు మీదికి దూకింది, దాన్ని అదిలించే ప్రయత్నంలో సుబ్బారావు చెక్క బొమ్మ ఉన్నా చేతిని  "ఎయ్" అని చూపించాడు.  మంత్రించిన చెక్క బొమ్మను చూడగానే కుక్క తోక ఉపుకుంటూ సుబ్బారావు కాళ్ళను నాకా సాగింది. 

అప్పుడు సుబ్బారావు ఇలా అనుకున్నాడు "అనవసరంగా వీడికి మందు, డబ్బులు వెస్ట్ చేశాను. ఈ బొమ్మతోనే పని అయిపోయేది" అని.

బిబెక్ మాత్రం చాల ఆశ్చర్య పోయాడు. సుబ్బారావు కు మోహిని బెడ్ రూం చూపించి అక్కడ నుండి గెట్ దగ్గరికి వెళ్ళి పోయాడు. మోహిని బెడ్ రూం కు రెండు దారులు ఉన్నాయి, ఒకటి ఇంటి లోపలి నుంచి వెళ్ళటానికి మరొకటి పెరటి లోంచి వెళ్ళటానికి. మోహిని పొద్దున్న లేవగానే పెరటి వైపు వచ్చి ఎండలో కుర్చుని కాఫీ తాగుతూ, పేపర్ చదువుతూ కూర్చుంటుంది. 

సుబ్బారావు చెక్క బొమ్మ కట్టటానికి మంచి స్తలం కోసం వెతికి పెరటి లో ఓ  చెట్టుకు గుబురుగా ఉన్నా కొమ్మకు కట్టాడు.  దగ్గరకి వచ్చి ఎవరయినా పట్టి చుస్తే తప్ప ఎవరికీ కనిపించదు దూరం నుండి.  వచ్చిన పని పూర్తీ చేసుకుని ఇంటికి వెళ్ళి పోయాడు సుబ్బారావు. పడుకుంటూ "రేపు కాలేజీ లో ఏదో పార్టి ఉంది అప్పుడు ఎలాగయినా తనతో ఆ ద్రావణం తాగించాలి"  అనుకున్నాడు. 

పొద్దున్న లేవగానే మోహిని బయటకు వచ్చి రోజులాగే మంగమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కూర్చుంది. ఉన్నట్లు ఉండి తనకు సుబ్బారావు గుర్తుకు రావటం మొదలు అయింది.

మనసులో అనుకుంది "ఛా ! వీడు నాకు గుర్తుకు రావటం ఏంటి" అని. కాని తానూ  ఎంతగా  వేరే వాటి మీదికి మనసు మార్చిన ప్రతి విషయం లో అతనే గుర్తుకు రావటం మోహిని కి నచ్చటం లేదు. 

"అరవింద్ తనను కాదు అన్నందుకు నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పిన సుబ్బారావు పై తనకు ఇష్టం ఏర్పడుతోందా" అనుకుని ఆలోచించింది.

మళ్ళి ఇలా సర్ది చెప్పుకుంది "అరవింద్ కాదంటే మాత్రం తను సుబ్బారావు లాంటి వాడిని ఇష్టపడ వలసిన అవసరం లేదు". కాని అసలు కారణం తనకు తెలియదు.

ఆ రోజు కాలేజీ కి వెళ్ళినప్పుడు  రాత్రి జరిగే పార్టి గురించి స్టాఫ్ అందరితో మీటింగ్ పెట్టింది మోహిని. దానికి  సుబ్బారావు మరియు అరవింద్ కూడా వచ్చారు. అప్పుడు సుబ్బారావు మరియు అరవింద్ ఇద్దరు చాల దగ్గరలో కూర్చున్నారు. ఎందు కో తనకు సుబ్బారావు అరవింద్ కన్నా ఆకర్షణగా కనిపించ సాగాడు. సుబ్బారావు లో ఏదో తెలియని ఆకర్షణ శక్తి మోహిని ని అతన్నే చూస్తూ ఉండమని ఆదేశిస్తోంది.  సుబ్బారావు కూడా  చిలిపిగా మోహిని ని  చూస్తూ తన చూపులతో కవ్విస్తున్నాడు. కాని మోహిని కి అదంతా నచ్చటం లేదు. తొందరగా మీటింగ్ ముగించి ఇంటికి వెళ్ళి పోయింది. ఇక మీదట సుబ్బారావు ను చూడకూడదు అనుకుంది. 

సాయంత్రం కావటం తో కాలేజీ లో జరిగే పార్టికి బయలు దేరింది. మెరున్ కలర్ బోర్డర్ తో పసుపు పచ్చని చీర,  మెరున్ కలర్ జాకెట్ తో, మేడలో సన్నని డైమండ్ లాకెట్,  మ్యాచింగ్ కు ఖరీదయిన గాజులు  అచ్చం దేవా కన్యలా తయారు అయ్యింది.

మరో వైపు చూస్తే ! బొడ్డు కిందికి చీర, వెనుక నున్నని వీపు కనిపించేలా జాకెట్, పట్టులాంటి జుట్టు వదిలేసి, లైట్ గా లిప్ స్టిక్ రుద్ది తేనె కారుతున్నా పెదవులు, ఎత్తయిన గుండెలు !  అచ్చం రతి దేవిలా తయారయ్యింది. 

ఆ పార్టికి సుబ్బారావు కూడా ఎప్పుడు లేనిది అందంగా తయారయ్యి వచ్చాడు. మోహిని ని చూడగానే వెళ్ళి "హల్లో మేడం ! గుడ్ ఈవెనింగ్" అంటూ పలక రించాడు.

మాములుగా అయితే ఏమి మాట్లాడకుండా వెళ్ళి పోయేది కాని నవ్వుతూ "గుడ్ ఈవెనింగ్ ! లూకింగ్ నైస్" అంటూ వెళ్ళింది.

తర్వాత పార్టి మొదలు అయింది. అందరు తమకు నచ్చిన డ్రింక్స్ తాగుతూ మాట్లాడు కుంటున్నారు. కొందరు మ్యూజిక్ కు తగ్గట్టు డాన్సు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే మంచి సమయం వెళ్ళి మోహిని కి డ్రింక్ ఆఫర్ చెయ్యాలి అనుకుని ఒక గ్లాసులో  నాగులు ఇచ్చిన మంత్రించిన ద్రావణం పోసి దాంట్లో మోహిని తాగుతున్న డ్రింక్ కలిపాడు.

తర్వాత మోహిని దగ్గరకి వెళ్ళి ఆమె చేతిలో ఉన్నా గ్లాస్ పడిపోయేలా గా చేతిని తాకించాడు. అక్కడ ఉన్నా అందరికి అర్ధం అయ్యింది అతను కావాలనే ఆమె గ్లాస్ పడగొట్టాడు అని. కాని వెంటనే ఏమి తెలియనట్లు  "సారి మేడం ! చూసుకోలేదు. నేను ఇంకో డ్రింక్ తీసుకొస్తాను" అంటూ తను గ్లాస్ పెట్టిన చోటుకు పరుగు పెట్టాడు.

డ్రింక్  తిసుకోచ్చి మోహిని కి ఇస్తూ "ఇదిగోండి మేడం! మీరు తాగుతున్న డ్రింక్. స్వయంగా నేనే కలిపి తెచ్చాను" అంటూ ఇచ్చాడు.

మోహిని కి అది వాడి ముఖాన కొట్టాలి అన్నంత కోపం వస్తోంది కాని ఏమి చెయ్యలేక పోతోంది. మనసు అధినం తప్పి అతని చేతిలోంచి గ్లాసు  తీసుకుని తాగసాగింది.

డ్రింక్ తాగినా కొద్ది సేపటికి మోహిని కి ఏదో మైకం కమ్ముకుంది, నీరసంతో  కళ్ళు తిరిగి అక్కడే కూర్చుండి పోయింది. వెంట వచ్చిన పని మనిషి మరియు మిగత అడ టీచర్లు ఆమె చుట్టూ చేరి "ఏమయింది మేడం" అంటూ కంగారుగా ఏవో సపర్యలు చేయసాగారు.

కాస్సేపటికి కోలుకున్న మోహిని ఎవరి కోసమో వెతుకు లాడటం గమనించారు ఆమె చుట్టూ చేరిన అందరు. దూరంగా సుబ్బారావు మోహిని ని గమనిస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా నటిస్తున్నాడు. సుబ్బారావు ను  చూడాగానే మోహిని ముఖం సంతోషంగా మారిపోయింది.

అందరు సద్దుమణిగాక మెల్లగా సుబ్బారావు దగ్గరికి చేరి చిన్నగా అడిగింది "ఈ రాత్రి నాకు తోడూ వస్తావా ?" అని.

సుబ్బారావు ఉబ్బి తబ్బిబు అయిపోతూ "నువ్వు పిలవటం నేను రాక పోవటమా ! నువ్వు పిలిస్తే ఎట్లోకయిన వస్తా. తోడుగా ఎందుకు రాను" అన్నాడు చొంగ కార్చుకుంటూ.

మోహిని అదేదో గొప్ప జోక్ లాగ విరగబడి నవ్వుతూ కార్ వైపు దారి తీసింది. ఇద్దరు కలిసి మోహిని ఇంటికి వెళ్ళారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెడ్ రూం లోకి దారితీసింది మోహిని.

సుబ్బారావు కు సంతోషం తో ఒళ్ళు వణికి పోసాగింది. మోహిని ని హత్తుకుని  ఎక్కడపడితే అక్కడ తమకంతో ముద్దులు పెట్ట సాగాడు. మోహిని ఎ మాత్రం అతనికి అడ్డు చెప్పటం లేదు. మోహిని వంటి నుండి వస్తున్నా సెంట్ వాసన, మెత్తగా,  పట్టులా తాకుతున్న ఆమె ఒళ్ళు  సుబ్బారావు మతి పోగోడుతున్నాయి.  బెడ్ మీదా పడుకోబెట్టి ఆమె పెదవులను ఆక్రమించి ఆమె తేనే ధారలు జుర్రుకుంటూ తన దాహం తిర్చుకోసాగాడు. తాపం ఓపలేని మోహిని మిగత పని చుడమన్నట్లుగా అతన్ని కిందికి తోసింది. ఆమె ఉద్దేశ్యం అర్ధం అయినా సుబ్బారావు తోటలో పడ్డ దొంగ మాదిరి  నెమ్మదిగా కిందికి దిగాడు.

చిలుక పండును కొసరి కొసరి తిన్నట్లుగా ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ అక్కడక్కడ పంటి గాటులతో తీపి గాయాలు పెడుతూ ఆమెను దోచుకుంటున్నాడు. మోహిని అతనికి పూర్తిగా సహకరిస్తూ ఎప్పుడో వస్త్రా సన్యాసం చేసేసింది. సుబ్బారావు ఒడుపుగా తన అస్త్రాలు సందిస్తూ ఆమె పై యుద్దాన్ని కొనసాగిస్తూ ఆమెను ఆక్రమించుకుంటున్నాడు. వర్షం వస్తున్నా సూచనలు ఉండటం తో వాతావరణం వేడిగా మారి పోయింది. వారు ఉన్నా  తొందరలో ఏసీ వేసుకోక పోవటంతో ! ఇద్దరు చెమటలో తడిసి పోతున్నారు.  ఆమె ఒంటి పై అక్కడక్కడ ముత్యాల్ల మెరుస్తున్నా చెమట బిందువులు సుబ్బారావు ను  రెచ్చగోడుతున్నాయి. పాము మాదిరి ఆమె ఒళ్ళంతా చుట్టుకుని బుసలు కొడుతు ఉంటె ఆమె ఏమి చెయ్యలేని మొగలి చెట్టు మాదిరి అతనికి సహకరించింది. 

కాసేపటికి  యుద్ధం ముగిసింది సుబ్బారావు కు ప్రంపంచం జయించినంత ఆనందం, మోహిని కి ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్న మన్మదుడు సొంతమయినట్లుగా తృప్తి. ఇద్దరు అలసి పోయి ప్రశాంతంగా నిద్ర పోయారు. కాస్సేపటికి హోరుమని వర్షం మొదలయింది. గాలి తాకిడికి చెట్లు, చేమలు  చెల్లా చెదురు కాసాగాయి.  ఆ వర్షానికి , విచె గాలికి సుబ్బారావు కట్టిన మంత్రపు చెక్క బొమ్మ  కింద పడింది.  ఇవ్వేవి తెలియని సుబ్బారావు మోహిని పక్కలో  ఆదమరిచి నిద్ర పోతున్నాడు. పొద్దున్నే నిద్ర లేచిన మోహిని కి తన వంటి మిద నూలు పోగు లేదు అన్న విషయం తెలుసుకుని ఆశ్చర్య పోయింది. పక్కన చుస్తే అదే స్తితిలో సుబ్బారావు .

సుబ్బారావును నిద్ర లేపెసరికి "గుడ్ మార్నింగ్ డార్లింగ్" అంటూ లేచాడు ఒళ్ళు విరుచుకుంటూ.

మోహిని  అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ కోపంగా  అడిగింది "నువ్వు లోపలికి  ఎలా వచ్చావ్" అని.

సుబ్బారావు కు ఏమి అర్ధం కావటం లేదు మోహిని అలా ఎందుకు మాట్లాడుతుందో. అయినా ఏమి భయట పడకుండా "నువ్వే కదా తోడూ రామ్మనావ్" అన్నాడు గారంగా.

"నేను నిన్ను తోడూ రామ్మనన్న ! ఒరేయ్ విడ్ని కట్టేయండ్రా ముందు" అంటూ గుర్కాలకు ఆదేశాలు జారి చేసింది.

సుబ్బారావు కాళ్ళు చేతులు కట్టేసి బెడ్ రూం మద్యలో పడేసారు. అందరిని భయటకు పంపించి మోహిని ఇలా అడిగింది సుబ్బారావు ను "చెప్పురా ఎం చేశావ్ నాకు ! నేను నిన్ను తోడూ రమ్మని అడగటం ఏంటి" అని.

కాని సుబ్బారావు మాత్రం "మోహిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రాత్రి  నీకు నాకు మధ్య జరిగిన విషయం మర్చి పోకు. మనిద్దరం పెళ్ళి చేసుకుందాం" అన్నాడు బ్రతిమాలుతూ.

మోహిని మాత్రం గుర్కా వదిలి వెళ్ళిన కర్ర తీసుకుని సుబ్బారావు ను ఎక్కడ పడితే అక్కడ  ఏడ పెడ కొట్టసాగింది.  రాత్రి తను చుసిన మోహిని కి ఈ మోహిని కి ఎ మాత్రం పోలిక లేదు అనుకున్నాడు సుబ్బారావు.

మోహిని ఎ మాత్రం వ్యవది లేకుండా సుబ్బారావు ను కొడుతూనే ఉంది "చెప్పురా ! చెప్పు. నాకేం చేశావ్" అని అడుగుతూ.

చెప్పక పొతే చంపేసేలా ఉంది అనుకున్న సుబ్బారావు "ని మీద మంత్ర ప్రయోగం చేయించాను" అన్నాడు ఆమె కొట్టే దెబ్బలకు రొప్పుతూ.

మోహిని ఒక్కసారిగా నివ్వెరపోయింది. జరిగినదంతా తెలుసుకుని చాల భయపడి పోయింది. అంతలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ! ఇదే కిటుకు తో తను అరవింద్ ను పొందితే ?  అనుకున్నదే తడవుగా సుబ్బారావు కట్లు విప్పి "ఒరేయ్ ! నేను నిన్ను చంపకుండా ఉండాలంటే,  ఆ మాంత్రికుణ్ణి నా దగ్గరికి తీసుకురా" అని చెప్పి పంపేసింది.

చావు తప్పినందుకు సుబ్బారావు అదే మహా ప్రసాదం అనుకుని నాగులు ఉన్నా చోటుకు బయలు దేరాడు. నాగులును కలుసుకుని జరిగింది చెప్పి మోహిని తనను తీసుకోని రమ్మనట్లు చెప్పాడు.

దానికి నాగులు "నేను అక్కడికి రావటం రాక పోవటం నా ఇష్టం. ముందు నువ్వు ఇస్తానన్న డబ్బులు ఇవ్వు" అన్నాడు తీవ్రమయిన స్వరంతో. 

దానికి సుబ్బారావు విసుగు పడుతూ "నువ్వు ఆ అమ్మాయితో నా పెళ్ళి జరిపిస్తే ఇస్తాను అని చెప్పాను. కాని జరుగ లేదు కదా" అన్నాడు.

అందుకు నాగులు కోపంగా "నా మంత్ర శక్తిని ఉపయోగించి ఆ అమ్మాయిని నీ సొంతం చేశాను. పెళ్ళి భాద్యత నాది కాదు. ముందు నా డబ్బులు ముట్టచేప్పు" అన్నాడు.

అసలే విసిగి పోయి ఉన్నా సుబ్బారావు "ఏంట్రా డబ్బులు ఇచ్చేది ! అసలు ఇవ్వను ఎం పికుతావ్" అన్నాడు ఇంకా కోపంగా.

దానికి నాగులు బిగ్గరగా నవ్వుతూ "నా శక్తి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా ?" అంటూ అడిగాడు.

"ఎయ్ ఏంటి నువ్వు పికేది ! నువ్వు నన్ను ఎం చెయ్యాలన్న నా వెంట్రుకలు కావాలి రక్తం కావాలి" అన్నాడు వెటకారంగా నవ్వుతూ.

"నువ్వు ఇలాంటి దొంగానాయలవనే నువ్వు నా దగ్గరికి వచ్చిన రోజే నీ మిద మంత్ర ప్రయోగం చేశాను రా. నువ్వు తాగిన కొబ్బరి బొండం మాములుది కాదు ! మంత్ర ప్రయోగం చేసింది" అన్నాడు గర్వంగా నవ్వుతూ.

సుబ్బారావు కు మతి పోయింది అది వినగానే. నాగులు కాళ్ళ మిద పడి "నన్ను క్షమించండి. ఎలాగయినా మీకు డబ్బులు ఇస్తాను" అంటూ బ్రతిమాల సాగాడు.

నాగులు మాత్రం వికటహాసం చేస్తూ "నాతోనే అపహాస్యం ఆడిన నువ్వు బ్రతకటానికి విలు లేదు" అంటూ ఏదో చెక్క బొమ్మ తీసి మంత్రాలూ చదువ సాగాడు.

అంతే సుబ్బారావు భయపడుతూ అక్కడ నుండి పరుగు పెట్టాడు ఇంటి వైపు. కొద్ది దూరం వెళ్ళిన సుబ్బారావు కు విపరితయిమయిన దురద మొదలయింది ఒళ్ళంతా.

గోక్కుంటూ ఉంటె చేతి వేళ్ళ గోళ్ళు ఉడిపోయాయి. ఆ తర్వాత కాలి వెళ్ళ గోళ్ళు కూడా ఉడిపోయాయి. సుబ్బారావు పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ పరుగులు పెట్టాడు. ఆ తర్వాత అతని తల మరియు వంటి పై వెంట్రుకలు ఉడి పోసాగాయి.  ఆపైన చేతి వెళ్ళు ఉడి, కాలి వెళ్ళు కూడా ఉడిపోయాయి. అతని ఒళ్ళంతా కర్రకు చెదలు పట్టినట్లుగా మారిపోయి ఒక్కొక అవయావం ఉడిపోసాగింది.  కొద్ది సేపటిలోనే అతని ఒళ్ళంతా మాయమయి ఒట్టి అస్తిపంజరం మాత్రం మిగిలింది. తర్వాత నాగులు మోహిని దగ్గరికి బయలు దేరాడు. అక్కడ ఆమె కోరిక తీర్చి సాధ్యమయినంత డబ్బులు నొక్కాలని.

మోహిని కోరిక తీరిందా? అరవింద్ ప్రియాను మర్చి పొయాడ? నాగులు వల్ల  ఎవరికీ హాని జరిగింది? ముందు భాగం లో తెలుసుకుందాం.

(ఇంకావుంది)

అరవ భాగం కోసం ఇక్కడ నొక్కండి8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

చేతబడి !!! - 4

(మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి. మిగత భాగాల కోసం వేచి చుడండి)

అవమానంతో సుబ్బారావు కు ఎక్కడ ఉండబుద్ది కావటం లేదు, ఆ రోజు కాలేజీ కి వెళ్ళకుండా బార్ లో కుర్చుని మందు తాగుతున్నాడు. "ఏదో మాట వరసకు అంటే తనను కుక్క అంటుందా అది! డబ్బు ఉందన్న పొగరు, అందగాత్తేనన్న ధీమా దాన్ని నిలబడ నియ్యటం లేదు. ఆ అందమంతా ఆవిరి అయిపోయేలా చెయ్యాలి ! ఎవరితోనయినా ఆసిడ్ దాడి చేయిస్తే?" ఇలా సాగిపోతున్నాయి సుబ్బారావు ఆలోచనలు. 

అంతలో తన స్నేహితుడు కనిపించి "ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చి తాగుతున్నావ్ ?" అంటూ అడిగాడు ఆశ్చర్యంగా.

"ఒరేయ్ ఎవరయినా ఆసిడ్ దాడి చేసే వాళ్ళు ఉంటె చెప్పురా !" అన్నాడు కోపంగా.

"విషయం ఏంటి చెప్పకుండా ఆసిడ్ దాడి అంటూ తిక్క తిక్కగా మాట్లాడుతా వెంట్ర" అన్నాడు చిరాకుగా.

"మోహిని ! పెళ్ళి చేసుకోమంటే నన్ను కుక్క అందిరా" అన్నాడు ఏడుస్తూ. 

"ఆసిడ్ దాడి చేయిస్తే నికేంటి రా ఒరిగేది ! డబ్బులున్నాయ్,  మళ్ళి సర్జరీ లు చేసుకుని ఇంకా అందంగా తయారవుతుంది. ఒక వెళ దొరికిపోతే నువ్వు జైలు కు వెళ్తావ్. అందుకని నా మాట విని మంత్రాలను నమ్ముకో" అన్నాడు రహస్యంగా.

అంత  భాదలోను సుబ్బారావు పడి పడి నవ్వుతూ "ఒరేయ్ నువ్వు చదువు అబ్బాని సనాసివని నిరుపించావ్ రా ! మంత్రాలకు చింతకాయలూ రాలవు అని సామెత విన్నావా? ఎప్పుడయినా" అన్నాడు. 

దానికి ఆ స్నేహితుడు "చింతకాయలు రాలవు కాని, అమ్మాయిలు వాలుతారు మన ఒళ్ళో. పెద్ద చదువుకున్ననని పొగరు మాని నేను చెప్పింది చెయ్. సక్సెస్ అయితే నాకు పది లక్షలు ముట్ట చెప్పాలి" అన్నాడు చమత్కారంగా.

"సరే అలాగే ! ఇంతకూ ఎవరు ఆ మహా మాంత్రికుడు" అన్నాడు సుబ్బారావు వెటకారంగా నవ్వుతూ.

"పక్కనే ఉన్నా అడవిలో ఉంటాడు ! ఈ మధ్యే వచ్చాడు ఎక్కడ నుండో. పేరు నాగులు" అన్నాడు రహస్యంగా.

స్నేహితుడు చెప్పిన ఆనవాల ప్రకారం అడవిలో నాగులు ఉన్నా చోటుకు బయలు దేరాడు సుబ్బారావు. కాలి బాట కుడా సరిగా లేని ఆ అడవిలో ఎంత దూరం నడవాలో తెలియటం లేదు, కనీసం దారి తప్పి పొతే ఎవరినయినా అడుగటానికి కుడా లేదు. అయినా తప్పదు ! తన జీవితం అనుకునట్లు సాగాలంటే ఇలాంటి వాటిని కూడా నమ్మక తప్పదు అనుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 

అలా  వెళ్తున్న వాడల్ల ఒక్కసారిగా ఆగి పోయాడు. పక్క నున్న పొదలు కదులుతున్నాయి ! సుబ్బారావు బిత్తర పోయి ఆటే చూస్తున్నాడు. ఒక్కసారిగా  జుయ్ మని గాలి వీచింది, ఆ గాలి కి చెట్టు పై నుండి ఆకులూ పెళ పెళ రాలిపడ్డాయి సుబ్బారావు మిద. అదిరి పడి చెట్టు పైకి చూశాడు,  కాని ఏమి లేదు. పొదలు కదలటం ఎక్కువ అయింది, సుబ్బారావు కు వెన్నులో వణుకు మొదలయింది. దగ్గరకు వెళ్ళి చుద్దామంటే దైర్యం సరిపోవటం లేదు. అంతే ! అక్కడ నుండి ముందుకు పరుగు తీసాడు.

కొద్ది దూరం పరుగు పెట్టి,  తిరిగి పరుగు లాంటి నడక తో ముందుకు సాగాడు. చాల దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఒక గుడిసె కనిపించింది. బహుశ అదే నాగులు ఉండే చోటు అయి ఉంటుంది అనుకుని ఇంకా వేగంగా నడక సాగించాడు. గుడిసె ను సమీపించి పరిసరాలు చూశాడు, చుట్టూ అన్ని చెట్లు వాటి మద్యలో తాటి ఆకులూ మరియు చెట్ల కొమ్మలతో కప్పిన గుడిసె. చుట్టూ ఈత మరియు కొబ్బరి మట్టలతో చిక్కగా అల్లి లోపలిది బయటకు కనిపించకుండా ఉంది.

లోపలి నుండి ఏవో మంత్రాలూ వినపడుతున్నాయి. సుబ్బారావు కు మాత్రం ఇంకా నమ్మకం కలుగటం లేదు. ఈ రోజుల్లో ఇలాంటివి ఏంటి ! అనుకుంటూనే ఒక సారి  ప్రయత్నిస్తే తప్పేంటి అనుకున్నాడు. కాని ఆ ప్రయత్నం తన చావు మీదికి తెస్తుందని ఉహించ లేక పోయాడు. కొద్ది సేపటికి  మంత్రాలూ ఆగిపోయాయి, నాగులు బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే సుబ్బారావు అదిరి పోయాడు.

నాగులు మొఖం అంత రక్తం తో నిండి ఉంది, అతని నోరు ఎర్రగా పండింది. మరో చేతిలో చిన్న మేక పిల్ల గొంతు తెగి వేలాడుతూ ఉంది. అంటే ! నాగులు నోటితోనే  పీక కొరికేసి దాని రక్తం తాగడాన్న మాట ! అది తలచు కోగానే సుబ్బారావు కు ఎక్కడో చిన్నగా భయం మొదలయింది. సిటి లో పుట్టి పెరిగిన తను  ఇలాంటివి ఎప్పుడు చూసి ఎరుగడు. ఆపై నాగులు ఆకారం అతని భయాన్ని  రెట్టింపు చేస్తోంది. గుబురు గడ్డం, మీసాలు మరియు నల్లని వంటి చాయ. లుంగీ కట్టుకుని పైన చొక్కా లేకుండా  ఒళ్ళంతా వెంట్రుకలతో మనీష కాదా ! అన్నంత అనుమానం కలిగించేలా ఉన్నాడు.

కాని అంతలోనే తేరుకుని, చదువుకున్న తనను ఇలాంటి అడవి మనిషి ఎం చేయగలడు ! నేనే ఒక అట ఆడించాలి అనుకుని దైర్యం తెచ్చుకున్నాడు. అతన్ని సమీపించి "నాగులు అంటే నువ్వేనా ?" అని ప్రశ్నించాడు నిర్లక్ష్యంగా.

ఒక్కసారిగా నాగులు సుబ్బారావు ను  ఉరిమి చూసి "నేనే ! నీకేం కావాలి" అన్నాడు గంబిరమయిన  గొంతుతో. అ గొంతులో గర్వం, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న  కోపం తొణికిస లాడింది.

అదేమీ పట్టని సుబ్బారావు అదే దొరణి కొనసాగిస్తూ "నేను ఒక్క అమ్మాయిని ఇష్టపడ్డాను. తన తో నా పెళ్ళి జరిపిస్తే నేను ఈ మంత్రాలూ చింతకాయలు నమ్ముతాను" అన్నాడు వెటకారంగా చూస్తూ.

నాగులు కు విషయం అర్ధం అయ్యింది, "వీడు తన మీద నమ్మకంతో రాలేదు. ఏదో ఒక రాయి వేసి చూద్దాం అని వచ్చాడు ! వీడికి సరయిన గుణ పాఠం చెప్పాలి" అనుకుని "అలాగే చేద్దాం ! కాని ఖర్చు అవుతుంది. ఆరు లక్షలు" అన్నాడు అంతే గంబిరంగా.

"నువ్వు పని చేస్తే ఆరు లక్షలు కాదు, నా పెళ్ళాం ఆస్తి లోంచి పది లక్షలు ఇస్తాను. నన్ను ఎం చెయ్యమంటావో చెప్పు" అన్నాడు ఉషారుగా. 

"ముందు ఆమె వెంట్రుకలు మరియు రక్తం తీసుకుని రా. తరువాత ఎం చెయ్యాలో నేను చెపుతాను" అని చెప్పి లోపలి వెళ్లి ఒక కొబ్బరి బొండం తెచ్చి  కొట్ట సాగాడు.

"సరే నేను బయలు దేరుతాను" అంటూ వెళ్తున్న సుబ్బారావు కు కొబ్బరి బొండం ఇస్తూ "దిన్ని తాగండి. అసలే ఎండన పడి వచ్చారు. మళ్ళి ఎండలోనే వెళ్ళాలి" అన్నాడు నాగులు.

సుబ్బారావుకు తాగాలని లేదు, కాని తాగక పొతే మళ్ళి భయపడుతున్నననుకుంటడని ఆఇష్టంగానే తాగాడు. కాని అందులో నీళ్ళు చాల తియ్యగా ఉన్నాయి, తను ఎప్పుడు తాగి ఎరుగడు అంత తియ్యని కొబ్బరి బొండం. అదే అడగాలనుకుని ! ఎక్కువగా మాట్లాడితే లోకువ అయిపోతాం అనుకుని అక్కడ నుండి బయలు దేరాడు.

సుబ్బారావు వెళ్ళిన కాస్సేపటికి పచ్చని  కొబ్బరి బొండం నల్లగా  మారి పోయింది. నాగులు బిగ్గరగా నవ్వుతూ దాన్ని కాలి తో గట్టిగా తొక్కాడు. అంతే ! రెండు ముక్కలయినా దాని నుండి పురుగులు బయటకు వచ్చాయి పుట్ట నుండి బయట పడ్డ చీమల మాదిరి. ఇవేవి తెలియని సుబ్బారావు మోహిని తన వశం కాబోతుందని, తన ఆస్తికి ఇక నుంచి తనదే పెత్తనం అని సంతోషంగా ఇంటి దారి పట్టాడు.

మోహిని ఇంటిలో పనిచేసే మంగమ్మకు డబ్బు ఆశ చూపి మోహిని వెంట్రుకలు మరియు నెల సరికి (పిరియడ్)  ఆమె  వాడిన ప్యాడ్ తెప్పించు కోవటం పెద్ద కష్టం కాలేదు సుబ్బారావుకు. అవి తన చేతికి అందగానే నాగులు దగ్గరికి చేరుకున్నాడు.

సుబ్బారావును చూడగానే నాగులు సంతోషంతో "శబాష్....చెప్పిన పని చెప్పినట్లు చేసినావ్. ఇప్పుడు చూపిస్తా నా మంత్రాల తడాకా" అంటూ సుబ్బారావును తన గుడిసె లోపలికి  తీసుకెళ్ళాడు.

అందులో అడుగు పెట్టగానే సుబ్బారావు కు ఏదో వింత అనుభూతి కలిగింది. అక్కడక్కడ ఎముకలు మరియు భయంకరయిన విగ్రహాలు అగుపించాయి. ఇంకా మట్టి తో మరియు చెక్క తో చేసిన కొన్ని అడ, మగ బొమ్మలు ఓ మూలా పడి  ఉన్నాయి.  చిన్న గుట్టగా పోసిన నిమ్మ కాయలు, కుంకుమ, పసుపు, గందం, బూడిద మరియు  బియ్యం పిండి పేర్చి ఉన్నాయి పాత్రలలో.  కిటికీ మూసి లేక పోవటంతో ఒక్కసారిగా గాలి వీచింది గుడిసె లోపలికి ! అంతే ఓ మూలా ఉన్నా మూట మీద నుండి గుడ్డ తొలగి పోయింది. అప్పుడు అగుపించింది ఒక శవం ! అది చూడగానే సుబ్బారావు గుండెలు అదిరి పోయాయి.

 నాగులు వెళ్ళి కిటికీ మూసి వచ్చి గుడ్డ ఎప్పటిలా కప్పేసాడు. పద్మాసనం వేసి కూర్చుని బియ్యం పిండి మరియు బూడిద తో ముగ్గు వేసాడు. ఆపైన  సుబ్బారావు తెచ్చిన మోహిని వాడిన నెల సరి ప్యాడ్ ను ఒక మట్టి ముంతలో ఉన్నా నీళ్ళ లో ముంచాడు. అప్పుడు ఆమె రక్తం ఆ నీళ్ళ లో కలిసి పోయింది. సుబ్బారావు తెచ్చిన మోహిని జుట్టును ఆమె రక్తం తో నిండిన ఆ మట్టి పాత్రను, ఇంకా నూనే  వేసి, వత్తి పెట్టి వెలిగించని ఒక దీపపు సమిదను  ఆ ముగ్గు మధ్యలో పెట్టి ఏవో మంత్రాలూ చదువుతూ ఎముకను తిప్ప సాగాడు.

సుబ్బారావు అదంతా నిశ్చేష్టుడయి  చూస్తుండి పోయాడు. కాసేపటికి ఆ దీపం దానంతటదే వెలిగింది. సుబ్బారావు చేతిని తీసుకుని ఒక కత్తితో చిన్న గాటు పెట్టి మోహిని రక్తం కలిపిన మట్టి పాత్రలో పట్టాడు. అ తర్వాత మోహిని జుట్టు ను ఆ దీపం మంటలో కాల్చి ఆ బూడిదను ఇద్దరి రక్తం కలిసిన పాత్రలో కలిపాడు. ఆ పాత్రను దీపం చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలూ చదువ సాగాడు. దీపం ఒక్కసారిగా అరి పోయింది ! నాగులు తృప్తిగా చూసి ఒక మగ ఆకారం చెక్క బొమ్మను తీసుకుని పడుకో బెట్టి దానిపై ఆ పాత్రలోని ఇద్దరి  రక్తం మరియు బూడిద కలిసిన ద్రవాన్ని కొద్ది కొద్ది గా పోస్తూ ఏవో మంత్రాలూ చదివాడు. కాస్సెపటికి బొమ్మ లేచి నిలబడింది.

 ఇదంతా చూస్తున్న సుబ్బారావుకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అ తర్వాత నాగులు ఆ పాత్రలో ఏదో నల్లని పొడిని కలిపాడు. విచిత్రంగా అది ఆకు పచ్చ రంగులోకి మారి పోయింది.

"ఇందులో ఉన్నా దాన్ని కొంచెం తాగు" అంటూ సుబ్బారావు చేతికి ఇచ్చాడు. తటపయిస్తూనే కొంచెం తాగాడు సుబ్బారావు !  అది చాల తియ్యగా ఉంది. 

"ఈ చెక్క బొమ్మ తీసుకుని వెళ్ళి నువ్వు కోరుకుంటున్నా అమ్మాయి పడక గది ముందు కట్టు. ఇది గాలిలో వేలాడుతున్నంత సేపు ఆ అమ్మాయి నీ వశం లో ఉంటుంది ! ఆ లోపు ని పని కానించు. మరో ముఖ్య విషయం ఈ పాత్రలోని ద్రవాన్ని ఆ అమ్మాయి తో తాగించు, అప్పుడే నా మంత్రం శక్తి ఆమె పై పని చేస్తుంది" అన్నాడు నాగులు.

అన్నింటికీ సంతోషంగా తల ఉపి అక్కడ నుండి బయలు దేరాడు సుబ్బారావు. ఇంకా కొన్ని గంటలలో మోహిని తన వశం కాబోతోంది !

"అందమయిన తనను తినివితిరా అనుభవించాలి. రెండు లేదా మూడు రోజులలో పెళ్ళికి ఒప్పించాలి. ఆ తరువాత తనే చచ్చినట్లు పడి ఉంటుంది" అనుకుంటూ పరుగు లాంటి నడక తో ఇంటి కి బయలు దేరాడు.

కాని క్రూరుడు అయిన నాగులు ఆలోచన మరోలా ఉంది. నిజానికి సుబ్బారావు కు సహాయం చేయాలనీ లేదు నాగులు కు. అందుకే తాత్కాలిక మయిన శక్తి తో పంపించాడు సుబ్బారావు ను.

మరి నాగులు ఆలోచన ఏమిటి ? సుబ్బారావు మోహిని ని సోతం చేసుకున్నాడ?  వీటికి సమాదానం వచ్చే భాగాలలో తెలుసు కుందాం.

(ఇంకావుంది)

అయిదవ భాగం కోసం ఇక్కడ నొక్కండి.


చేతబడి !!! - 3

(రెండవ బాగం కోసం ఇక్కడ నొక్కండి. తరువాతి భాగాల కోసం వేచి చూడండి)

సుబ్బారావు మోర్ సూపర్ మార్కెట్ లో గంట నుండి ఎదురుచూస్తున్నాడు ఆ షాప్ ఓనర్ మోహిని కోసం. ఎలాగయినా తన ప్రేమను చెప్పి ఆమెను ఒప్పించాలని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. పెద్దగా అందంగా ఉండక పోయిన, డబ్బు లేక పోయిన  బాగా చదువుకున్నాడు.  మోహిని వాళ్ళా కాలేజీ లోనే లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.

మోహిని, అతను ఒకే కాలేజీ లో చదువుకోవటం వల్ల ముఖ పరిచయం, దాన్నే చనువు అనుకుంటూ ఉంటాడు.  కాని మోహిని అతన్ని ఎ నాడు స్నేహితుడిగా భావించేది కాదు.

మోహిని వాళ్ళకు చాల వ్యాపారాలు ఉన్నాయి ఆ సిటి లో, ఇంకా చుట్టుపక్కల ఊర్లలో. తను ఏమి పట్టించుకోక పోయిన లక్షలలో వచ్చి పడుతాయి డబ్బులు నెల తిరిగే సరికి. ఈ మధ్యే తల్లి తండ్రి చనిపోవటం తో ఒంటరిగా ఉంటోంది లంకంతా ఇంట్లో. ఒంటరిగా ఉంటున్న తనను జంట చేసుకోవటం పెద్ద కష్టం కాదు. అందుకే ఆమెకు  దగ్గర అయి ఆమె కు మొగుడిగా , ఆమె ఆస్తి కి యజమాని అవ్వలన్ని పథకం వేసాడు. 

మోహిని కారు దిగి సరాసరి తన కేబిన్ లోకి వెళ్ళింది. కాస్సేపటికి సుబ్బారావు లోపలికి  అడుగు పెట్టాడు.

"గుడ్ మార్నింగ్ బ్యుటిపుల్" అంటూ పలకరించాడు కొంటెగా నవ్వుతూ.

"ఓ నువ్వా ! ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావ్ ? కాలేజీ కి వెళ్ళలేదా ?" అడిగింది మోహిని నిర్లక్యంగా.

"కొంపదీసి వెళ్ళి పోమ్మంటావా ! ఏంటి ?" అంటూ అడిగాడు ఇబ్బందిగా నవ్వుతూ.

"చెపితే మాత్రం వెళ్తావా ! ముందు విషయం చెప్పు" అంది లహరి చిరాకుగా. 

ఆ రోజు పింక్ కలర్ చిర కట్టుకుంది మోహిని. పలుచని ఆమె జాకెట్టు లోంచి తెల్లగా కనిపిస్తోంది ఆమె బ్రాసరి. ఎత్తయిన గుండెల మిద అందంగా ఆమె కదిలినప్పుడల్లా అటుఇటు ఉగుతోంది  డైమండ్ లాకెట్. చిర తొలగి పోయి నిమ్మ పండు రంగులో కనిపిస్తున్న ఆమె ఉదర బాగము,  కొలతలు చూసి పెట్టినట్లు ఉన్నా గుండ్రని లోతయిన ఆమె నాబి సుబ్బారావు మనసును అల్లరి చేస్తున్నాయి. ఇంకా ఆ ఎర్ర్రని పెదవులు అందితే ! అంతటి సుఖానికి తానూ బ్రతక గలడా? స్లివ్ లెస్ లో కనిపిస్తున్న ఆ నునుపయిన జబ్బలు ఒక్కసారి తడమని ఈ జన్మ ఎందుకు? 

ఇవ్వని కాదు! ఇంత అస్తిపరురాలు భార్య కాకపోతే జీవితం వృధా అయిపోతుంది. ఎలాగయినా ఈ రోజు తనను ఒప్పించాలి. ఇలా సాగిపోతున్న సుబ్బారావు ఆలోచనలు.

"ఏంటి ! ఏమి మాట్లాడవు. అసలు ఎందుకు వచ్చావ్ ?" అన్న మోహిని అరుపు తో ఈ లోకం లోకి వచ్చాడు.

"ఏమి లేదు నీతో చాల రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెపితే" అంటూ గొణిగాడు. 

"ఏంటది ? త్వరగా చెప్పు. నేను మళ్ళి కాలేజీ కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చెయ్యాలి" అంది.

"మనిద్దరం కాలేజీ లో చదువుకునే రోజుల నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు సరే  అంటే నిన్ను పెళ్ళి చేసుకున్దమనుకుంటున్నాను" అన్నాడు ఉత్సాహంగా.

"వ్వాట్ రబ్బిష్ ! నేనేంటి నిన్ను పెళ్ళి చేసుకోవటం ఏంటి" అంది కోపంగా చూస్తూ.

"దయచేసి ఒప్పుకో మోహిని ! నా ప్రేమ నిజమయింది. నువ్వు ఏం చేసిన అడ్డు చెప్పను. ఒక పెంపుడు కుక్కలా ఓ మూలా పడి ఉంటాను" అన్నాడు బ్రతిమాలుతూ. 

"కరెక్ట్....బాగా చెప్పావ్ నీ గురించి నువ్వు. కుక్కలను మనుష్యులు పెళ్ళి చేసుకోరు. అందులోకి నా లాంటి మహారాణి అసలు చేసుకోదు. లిమిట్స్ లో ఉండు ! ఇంకోసారి ఇలాంటి పపోసల్స్ తో వచ్చావో ఉన్నా ఉద్యోగం కూడా ఉడుతుంది. ఏదో నాతొ ఒకే కాలేజీ లో చదువుకున్నావని వదిలేస్తున్నా. గెట్ అవుట్" అంటూ గుమ్మం చూపించింది.

అవమానంతో తల దించుకుని బయటకు వచ్చాడు సుబ్బారావు. 

కాలేజీ కి వెళ్ళి తన రూం లో అడుగుపెట్టిన మోహిని వెంటనే అరవింద్ ను రామ్మని కబురు పెట్టింది. అరుఅడుగుల ఎత్తు, మంచి పిజిక్ తో ఎర్రగా అందమయిన మొఖం తో ఎ అమ్మాయి కయిన మొదటి చూపులోనే నచ్చేస్తాడు అరవింద్. పైగా చాల తెలివయిన వాడని కూడా వింటుంది మోహిని. అందుకే అతనంటే మోహిని కి ఎంతో ఇష్టం, అతను ఒప్పుకుంటే ఈ క్షణమే సర్వం అతనికి దారపోస్తుంది. కాని ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అతను తొనక లేదు తనకు లొంగ లేదు. మోహిని రోజు కాలేజీ కి వచ్చేది అరవింద్ ను చూడటానికే అంటే అతిశయోక్తి కాదు. 

"గుడ్ మార్నింగ్ మేడం" అంటూ లోపలి అడుగు పెట్టాడు అరవింద్.

"హయ్ హ్యాండ్ సామ్ ! నన్ను మేడం అనొద్దు, పేరు పెట్టి పిలవమని ఎన్ని సార్లు చెప్పాలి. మనం ఒకే ఏజ్ గ్రూప్ తెలుసా మీకు" అంది కొంటెగా కన్ను గిటుతూ.

"ఇన్ ఫాక్ట్ నేనే మీ కన్నా రెండేళ్ళు పెద్దవాణ్ణీ. కాని మీరు నా బాస్ కాదా" అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.

మోహిని ఉషారుగా "మీరు బాస్ కావాలంటే చెప్పండి ఇప్పుడే అంత మీ చేతిలో పెట్టి చేతులు ఎతేస్తా" అంటూ స్లివ్ లెస్ చేతులు పైకి లేపింది.

ఇంకెవరయినా అయితే నున్నని ఆమె జబ్బలు చూస్తూ అలా కన్నార్పకుండా ఉండేవారు.

కాని అరవింద్ కిందికి తలదించుకుని "చెప్పండి మేడం ! నన్ను ఎందుకు పిలిపించారు" అన్నాడు వినయంగా.

మోహిని తన కుర్చీ లోంచి లేచి "నా మీద మీ అభిప్రాయం తెలుసు కుందామని ! చెప్పండి నన్ను చుస్తే మీకు ఏమని పిస్తుంది" అంటూ అడుగుతూ చీరను నడుము పై నుండి కాస్త తొలగించి, తన ఎద బాగం అతనికి కనిపించేలా చేసింది. 

నునుపయిన ఆమె వంటి చాయ ఆ రూం అంత పడుతుందేమో అన్నంతంగా ఆమె అందం మెరిసి పోతోంది.

అరవింద్ కాస్సేపు అలాగే ఆమెను చూసి ఒక్కసారిగా తేరుకుని "సారి మేడం ! నాకు అలాంటి అభిప్రాయం లేదు. నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను" అన్నాడు దృడమయిన స్వరంతో.

"ఈ ఆస్తి, ఈ అందం అంత నీ కాళ్ళ ముందు పెడుతాను. దయచేసి కాదనకు" అంది అతన్ని వెనుక నుంచి హత్తుకుంటూ.

అరవింద్ ఆమెను విడిపించుకుని "క్షమించండి మేడం ! మీకు ఇబ్బందిగా ఉంటె ఇక్కడ ఉద్యొగమయిన మానేస్తాను. కాని నేను నా ప్రియా కు అన్యాయం చెయ్యలేను" అంటూ బయటకు నడిచాడు. 

నిశ్చేష్టురలాయి అలా చూస్తూ ఉండి పోయింది మోహిని. కోటిశ్వరుడి గారల కూతురు అయిన తనకు, గొప్ప అందగత్తేనని విర్ర విగిన తనకు ఎంతటి అవమానం. అక్కడ ఉండలేక డ్రైవర్ ను కారు ఇంటికి తీసుకెళ్ళ మని చెప్పింది. ఇంటి నిండా పని మనుషులు, గుర్కాలు,  కాని నా అనేవాళ్ళే లేరు.  లేక లేక ఇష్టపడ్డ ఒక్క మగాడు కాదన్నాడు. అలాగే బెడ్ రూమ్ లో ఏడుస్తూ ఉండి పోయింది.

ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో ! ఎవరు నాగులు మంత్ర శక్తికి బలి అవుతారో వచ్చే భాగం లో తెలుసుకుందాం.

(ఇంకావుంది)


నాలుగవ భాగం కోసం ఇక్కడ నొక్కండి

6, ఫిబ్రవరి 2013, బుధవారం

చెతబడి !!! - 2

(మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి . తర్వాతి భాగాల కోసం వేచి చూడండి)
 
అంతకు ముందు తను  చేసిన చేతబడి తన మీదికే తిప్పికొట్టడం తో చావు తప్పి కన్ను లొట్టా పోయిన నాగులు ఎలాగయినా అత్యంత శక్తి వంతుడయిన మాంత్రికుడిగా మారాలను కున్నాడు. అందు కోసమని తన గురువు దగ్గర నుంచి దొంగలించిన తాళ పత్ర గ్రంధాన్ని తెరిచి  కొత్త మంత్రాలూ ఎలా సాదించలొ, వాటికై అచరించవలసిన నియమ, నిబందనలు తెలుసుకున్నాడు. 

అందుకు అతి ముఖ్యమయినది  శవ పూజ,  చేయటానికి ఆ రోజు రాత్రి ముహూర్తం నిర్ణయించు కున్నాడు. ఆ రోజు నిండు పున్నమి! అర్దరాత్రి పన్నెండు గంటలకు అడవిలో ఉన్నా తన గుడిసె నుండి బయలు దేరాడు.

దగ్గర లో ఉన్నా పల్లె పేరు తాడి గుండెం, ఆ ఉరి శ్మశానం ఉరికి ఉత్తరాన ఉంటుంది. అతి చిన్న పల్లె అయిన ఆ ఉరిలో మనుష్యులు పెద్దగా ఉండరు అందుకే చావులు కూడా తక్కువే.

కాని ముహూర్తం దాటి పోకుండా ఉండాలంటే ఆ ఉరికి వెళ్ళటమే సరయినది అనుకున్నాడు నాగులు. సంచిలో చిన్న గునపం మరియు పూజ సామాగ్రి వేసుకుని  చీకటి లో ఒక్కడే నడుస్తూ వెళ్తున్నాడు. వెన్నెల వెలుగు లో చెట్ల నీడలు వింత వింత ఆకారాల్లో కనిపిస్తున్నాయి. మాములు మనుషులు అయితే భయపడి ఒక్క అడుగు కుడా వెయ్యలేరు. కాని మాంత్రికుడు అయిన నాగులు కు భయం లేదు.  ముహూర్తం దాటి పోకుండా శ్మశానం చేరి శవ పూజ చెయ్యాలన్నదే ఉంది మనసులో. 

చేతిలో ఉన్నా కర్రతో పొదలు పక్కకు జరుపుతూ అవసరయిన చోట కాలి బాట లో నడుస్తూ తొందరగా చేరాలని ముందుకు సాగుతున్నాడు. శ్మశానం లోకి అడుగు పెట్టగానే బలిష్టమ మయిన నక్క ఒకటి ఎదురు పడింది నాగులు కు. అది నాగులు ను చూడగానే ఒక్కసారిగా అతని మీదికి దూకింది. ఏమాత్రం తడబడని నాగులు పక్కకు తప్పుకుని  చేతి లో ఉన్నా కర్రతో బలంగా కొట్టాడు దాన్ని. 

తేరుకున్న నక్క గుర్రు మని అరుస్తూ మళ్ళి అతని మిది కి దుకాబోయింది. కర్ర దాని వైపు ఉపి ఏదో మాత్రం చదివాడు నాగులు. అంతే!  నక్క అలాగే కూలబడి పోయింది. శ్మశానం లో అటు ఇటు తిరిగి మట్టి తో పూడ్చిన ఒక సమాధిని ఎంచుకున్నాడు. ఆ శవాన్ని పూడ్చి కనీసం రెండు వారలయినా అయి ఉంటుంది అనుకున్నాడు. కాని తనకు అంత వ్యవది లేదు అందుకే సంచి లోంచి గునపం తీసి తవ్వటం ప్రారంబించాడు.  మట్టి దే అయినప్పటికీ రెండు వారలు అయ్యేసరికి చాల గట్టి పట్టింది సమాది. 

అతికష్టం పూర్తిగా తవ్వే సరికి తెల్లని గుడ్డ కప్పిన శవం కనిపించింది. దాని పైన ఉన్న మట్టిని తొలగించి శవాన్ని బయటకు తియ్యాలని చేతితో లేపాడు. అంతే ! శవం అంత కుళ్ళి పోయినట్లు ఉంది!  చేతి కి గుజ్జు గుజ్జుగా తగిలింది. నాగులు ఎ మాత్రం జుగుప్స పడకుండా శవాన్ని బయటకు తీసాడు జాగ్రతగా. దాని కున్న బట్టను పూర్తిగా తొలగించే సరికి శవానికి పట్టిన పురుగులు బయటకు వచ్చాయి. వెన్నెల వెలుగు లో ఆ అడ శవం అతి భయంకరంగా కనిపించింది. 

ముఖం అంత కుళ్ళి పోయి చెంపల చర్మం ఉడి పోయి దవడలు మరియు పళ్ళు బయటకు కనిపిస్తు, అక్కడక్కడ పురుగులు పాకుతూ ఉన్నాయి. ఇక పొట్ట దగ్గర అయితే పేగులు బయటకు వచ్చాయి ! అందులో పురుగులు బిల బిల మంటూ పారుతున్నాయి. ఏమాత్రం చలించని నాగులు సంచి లోంచి గందం, పసుపు మరియు కుంకుమ తీసి ముగ్గు వేసాడు. శవం కాలిన  బూడిద ను ఒక చేతితో బయటకు తీసిన శవం పై చల్లుతూ,  మరో   చేతితో ఎముకను శవం మిద తిప్పుతూ ఏవో మంత్రాలూ చదువ సాగాడు.

కాసేప్పటికి తన వంటి మిద ఉన్నా లుంగీ మరియు చొక్కా తీసివేసి పూర్తిగా నగ్నంగా మారిపోయాడు.  నిలబడి అన్ని దిక్కులు తిరుగుతూ ఎవరినో రామ్మనట్లు శవం వైపు చూపించ సాగాడు. కాస్సేపటికి శవం కదలటం మొదలు పెట్టింది. ఉత్సాహంగా మంత్రాలూ ఇంకా బిగ్గరగా తొందరగా చదవటం మొదలు పెట్టాడు నాగులు. ఒక్కసారిగా శవం లేచి నిలబడింది.  అసలే కుళ్ళి పోయిన శవం లేచే సరికి అక్కడకడ శరీర బాగాలు ఉడి కింద పడ్డాయి. ఎ మాత్రం చలించని  నాగులు మాత్రం  బూడిదను తీసి చల్లుతూ మంత్రాలూ చదవటం కోన సాగించాడు. 

ఒక పది నిమిషాల తర్వాత శవం బిగ్గరగా అరుస్తూ నాగులు మీదికి ఉరికింది. అది ముందే ఉహించిన నాగులు ఎ మాత్రం తొట్రుపాటు పడకుండా దగ్గరలో ఉన్నా కత్తితో చేతి ని కోసుకున్నాడు, సర్రుమని రక్తం బయటకు వచ్చింది. రక్తం చూడగానే శవం నాగులు ను చేరి అతని చేతినుంచి కారుతున్న రక్తాన్ని తాగసాగింది.  అ తర్వాత నాగులు చేతిలో ఉన్నా ఎముక తో శవాన్ని కొట్టి ఏవో మంత్రాలూ చదివాడు. అంతే శవం నాగులు కాళ్ళ మిద పడి చలనం లేకుండా అయి పోయింది. 

నాగులు తృప్తిగా మీసాలు మేలి వేసాడు. వచ్చిన పని పూర్తీ అయింది, మరో పిశాచ శక్తి తన వశం అయింది. వశం అయినా శక్తి చేజారకుండా ఉండాలంటే నగ్నంగానే ఇంటికి చేరాలి. అందుకే బట్టలన్నీ సంచిలో సర్దుకుని, శవాన్ని ఎప్పటిలాగే పాతేసి తన గుడి సే  వైపు నడక ప్రారంబించాడు నాగులు. స్మశానం దాటు తుండగా ఎవరో మనుషులు వస్తున్నా అలికిడి అయింది. 

"ఎయ్ ఎవరక్కడ? గియ్యలప్పుడు" అంటూ అడిగాడు ఆ వ్యక్తీ.

నాగులు ఏమి మాట్లాడ కుండా అలాగే ముందుకు సాగాడు.

ఆ వ్యక్తీ "నిన్నే ! పిలిస్తే పల్కావ్" అంటూ నాగులు ముందుకు వచ్చాడు.

నగ్నంగా ఉన్నా నాగులు ను చూడగానే అతను ఒక్కసారిగా అదిరి పోయాడు.  ఇంకేదో అనేంతలో నాగులు అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఏదో మంత్రం చదివాడు. అంతే  ! ఆ వ్యక్తీ కుప్పకూలి పోయాడు. తెల్లవారి అతనికి ఎం జరుగుతుందో తలుచుకుని నాగులు నవ్వుకున్నాడు. 

ఆ నవ్వులో క్రూరత్వం, పిశాచాలకు అదిపతినని గర్వం తొణికిస లాడాయి. మనుష్యులను చేతబడి తో  కర్కశంగా హింసించి చంపే భయంకరమయిన ఆ వ్యక్తీ కి జాలి, కరుణ ఉంటాయని అనుకోవటం పిచ్చితనం అవుతుంది. అతన్ని చూసి అక్కడే తచ్చాడుతున్న నక్కలు భయంతో పరుగు తీసాయి. ఉరి దగ్గరకి రాగానే అతన్ని చూసి కుడా  కుక్కలు అరవటం మర్చి పోయాయి. భయంతో తోకలు ఉపుతూ ఉరి లోకి పరుగులు తీసాయి. 

ఆలాంటి నాగులు దగ్గరకి ఎవరయినా వస్తే ! వారి చావు వారు కొని తెచ్చుకోవటమే అవుతుంది. కాని గొర్రె కాసాయి ని నమ్మినట్లు మనుషులు  తమ తీరని కోరికలు తీర్చుకోవటం కోసం ఎప్పుడు ఇలాంటి వారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ దురదృష్టవంతులు ఎవరో ! వారి తీరని కోరికలు ఏమిటో వచ్చే భాగం లో తెలుసుకుందాం.


 (ఇంకా ఉంది)


మూడవ భాగం కోసం ఇక్కడ నొక్కండి  

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

నువ్వేంటి గొప్ప ! ఇది ప్రేమ కాదు !!

(కొన్ని సార్లు అతి చిన్న కారణంగా జీవితానికి సరిపడినంత భాదను ముటగట్టు కుంటూ ఉంటాం. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నపుడు, అలాంటిది ప్రేమ విషయం లో జరిగితే అన్న చిన్న ఉహకు ఇ కథ రూపం. గొప్ప మలుపులు ఏమి ఉండవు, గొప్ప ఫీలింగ్స్ ఏమి ఉండవు. కాని నచ్చుతుందన్న దైర్యం తో రాసాను, నచ్చక పొతే ఓ తిట్టు తిట్టేయ్యండి.)కొత్తగా స్కూలు కు వెళ్తున్నా కుర్రాడు ఎలా భయపడుతాడో అలాగే ఉంది రమణ పరిస్తితి కుడా. కొత్తగా ఇంజనీరింగ్ లో చేరి మొదటి రోజు కాలేజీ కి బయలు దేరాడు.  ఎంత ఇంటర్ వరకు చదివినా మళ్ళి ఇంజనీరింగ్ కాలేజీ కి  మొదటి రోజు అనేసరికి ఎక్కడో బెరుకుగా ఉంది. బసు లో వెళ్తున్న తనకు మనసు నిండా సందేహాలే, కాలేజీ ఎలా ఉంటుందో తోటి విద్యార్తులు ఎలా ఉంటారో అసలు ఆ వాతావరణం తనకు నచ్చుతుందో లేదో ఇన్ని ఆలోచిస్తూ కాలేజీ బస్సు స్టాప్ లో దిగి కాలేజీ వైపు నడిచాడు. 


అసలే ఇంటర్ వరకు తెలుగు మీడియం లో చదివిన తనకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనుకుంటూ వెళ్తున్న తనకు ఎవరో అమ్మాయి వచ్చి "ఎయ్ మిష్టర్ ! వాట్ ఇస్ టైం నౌ" అని అడిగే సరికి ఎం చెప్పాలో తెలియక ఒక్కసారిగా "రమణ" అన్నాడు. తర్వాత అర్ధం అయింది ఆ అమ్మాయి తనను టైం అడిగిందని. అంతే ! సిగ్గు తో తలదించుకుని ముందుకు నడక సాగించాడు.  ఆ అమ్మాయి మాత్రం వెక్కిరింపుగా నవ్వుతూ వెళ్ళి పోయింది. 

జరిగిన అవమానానికి రమణ కు చాల భాదగా ఉంది. అసలే తెలివయినవాడు అయిన రమణకు అది మింగుడు పడలేదు. అమ్మాయిలు అంటే తనకు ఉన్న బెరుకే దినికంతటికి కారణం. అసలు ఇంజనీరింగ్ లో నయినా దిన్ని పోగ్గొట్టు కోవాలి, అంతో ఇంతో అందగాడయిన తను ఎలాగయినా మంచి అమ్మాయిని లైన్ లో దింపాలి, ఇంకా కుదిరితే పెళ్ళి కూడా కానివ్వాలి అనుకున్నాడు. 


ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసు ఎక్కడో తెలుసుకుని వెళ్ళె సరికి తలుపు వేసి ఉంది. కాని లోపల ఏదో లెక్చర్ జరుగుతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ఎం చెయ్యాలో తెలియలేదు రమణకు, అటు ఇటు చూస్తుండగా ఎవరో పెద్దాయన వచ్చి "హే వై ఆర్ యు స్టాండింగ్ దేర్" అని అడిగాడు. రమణ మనసు లో "చచ్చాం ప్రిన్సిపాల్ అనుకుంటా" అనుకుని "ఐ హవె టు గో క్లాసు సర్" అని చెప్పి సడెన్ గా క్లాసు రూం డోర్ తోసాడు. 

ఉరికే దగ్గరకు వేసి ఉన్న డోర్ తను బలంగా తోసే సరికి దబ్బెళ్ మని తెరుచుకుని రమణ తలుపు ముందే ఉన్న  ముందు బెంచి కి గుద్దు కున్నాడు. దాని మిద కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు అదిరి పడ్డారు, అంత కంగారు లోను రమణ చూపులు  బిత్తర పోయి చూస్తున్న సరయు మీదా పడ్డాయి.

వెంటనే తమాయించుకుని లేచి "సారీ సర్, లేట్ కమార్" అన్నాడు లెక్చరర్ వైపు తిరిగి. "వచ్చిందే లేటు , మళ్ళి క్లాసు డిస్టర్బ్ చెయ్యటం. వెళ్ళు వెళ్ళి కుర్చో"  అన్నాడు లెక్చరర్.  "థాంక్స్" అని చెప్పి సరయు వైపు చూశాడు. తను "పో రా" అన్నట్లు మూతి తిప్పింది అంతే రమణ కు మండి పోయింది. అమ్మాయిలంటే భయమే అయినా రమణకు తనను ఎవరయినా లెక్క చేయక పొతే మాత్రం మహా చెడ్డ కోపం. 

బెంచి పై కూర్చుంటూ మనసు లో అనుకున్నాడు "దిని  లాంటి వాళ్ళను ఎంత మందిని చూశాను, అసలు మన గ్లామర్ కు ఫీదా కాని అమ్మాయి ఉందా? ఇది దిని పోజులు". అతను  రోడ్డు మీదా వెళ్తుంటే అమ్మాయిలందరూ తిరిగి చూడటం, ఫ్రెండ్స్ అందరు నువ్వు సూపర్ మామ అంటూ మెచ్చుకోవటం తో  రమణ కు తాను అందగాడినని అర్ధం అయిపొయింది పదవతరగతి లో ఉన్నప్పుడే. 

కాని ఇంతవరకు ఎ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. అమ్మాయిలను ఆకర్షించటం,  వారికి విసుగొచ్చి వదిలి పెట్టేయటం రమణ జీవితం లో సాదారణం అయి పోయింది.   అలాంటి తనను సరయు చిన్న చూపు చూసేసరికి ఎక్కడో ఇగో దెబ్బతింది.

అలా రోజులు గడుస్తున్న కొద్ది రమణ కు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. కాని క్లాసు లో ఎప్పుడు ఎ అమ్మాయి తో ను మాట్లడే వాడు కాదు. సరయు తో ఎవరో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు మాట్లాడే వారు. వాళ్ళు అప్పుడే ఏదో గ్రూప్ పామ్ చేసుకుని అయిదుగురు ఫ్రెండ్స్ లా తయారు అయ్యారు. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి రెండు ముందు రెండు బెంచిలలో వాళ్ళే కూర్చునే వారు. 

ఆ గ్రూప్ లోంచి వెంకట్ మాత్రం సరయు ను పడేయ్యాలని ప్రత్నించసాగాడు. అందుకే సరయు కూర్చున్న బెంచి లో స్తలం లేక పోయిన బలవంతంగా తన పక్కన కూర్చునే వాడు. సరయు చాల ఇబ్బందిగా "వేరే దగ్గర కుర్చోవచ్చు కాద" అంటూ విసుక్కునేది. వెంకట్ గ్రూప్ లో ఉన్నా మిగత అమ్మాయిల కాళ్ళ వెళ్ళ పడి తనను పార్కు లకు హోటల్ లకు రప్పించే వాడు. 

 ఒక నెలరోజుల తరువాత ఓ రోజు ఎందుకో చాల ముందుగా క్లాసు కు వెళ్ళాడు రమణ. క్లాసు లో అడుగు పెట్టగానే సరయు ఒక్కతే కుర్చుని ఉంది. తన వైపు చూడకుండానే ఎప్పుడు తను కూర్చునే బెంచి లో కూర్చున్నాడు. నిజానికి తను బుక్ లోపల పెట్టి బయటకు వెళ్లలనుకున్నాడు కాని సరయు ఉండే సరికి వెళ్ళలేక పోయాడు. 

ఒక్కసారిగా సరయు వెనుకకు తిరిగి ఇలా అంది "హయ్ రమణ ! చదవటం మొదలు పెట్టావా?" అని. అంతే రమణ ఉబ్బితబ్బిబు అయిపోయాడు, ఇదే అదునుగా ఎన్నో మాట్లాడాలనుకున్నాడు ! కాని పొడిగా "ఇంకా లేదు" అని మాత్రం అనగలిగాడు. అప్పటికే వెంకట్ మరియు సరయు గ్రూప్ వచ్చేసింది. అంతే బుక్ పడేసి బయటకు వెళ్తూ సరయు వంక చూశాడు. తన కళ్ళ లోను నిరాశ రమణకు స్పష్టంగా తెలిసి పోయింది. 

రమణకు ఇప్పుడు సరయు మిద కోపం పూర్తిగా పోయింది, అసలు మనసంతా ఎంతో సంతోషం తో నిండి పోయింది. నిజానికి సరయు ను మించిన అందగత్తె క్లాసు లోనే లేదు, అలాంటి సరయు తనతో మాట్లాడింది అన్న విషయమే తనను నేల  మిద ఉండనివ్వటం లేదు. ఆ తర్వాత ప్రతి రోజు క్లాసు లో  ఎవరికీ తెలియకుండా ఒకరి నొకరు చూసుకోవటం, మూగగా ప్రేమించుకోవటం మొదలయింది.


చూస్తూ చూస్తుండగానే ఫస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ వచ్చాయి. అసలే చదువు పట్ల చాల శ్రద్ధ కలిగిన సరయు నేల రోజులు చదువు లో పడి భయటకే రాలేదు. తన హాస్టల్ కు ఫోన్ చేసి మాట్లాడలేక విసిగి పోయిన రమణ కోపం తో సరయును మర్చి పోవలనుకున్నాడు. ఎగ్జామ్స్ సెంటర్ లో తను కనిపించిన కనబడనట్లు వెళ్తున్నా రమణ ను చూసి సరయు చాల భాదపడింది. అంతలోనే ఇగో గుర్తుకొచ్చి తను కూడా చూడనట్లే వెళ్ళిపోయింది.

అంతే ఇద్దరు మాట్లాడుకోలేదు. ఎగ్జామ్స్ తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయారు. ఇంటికి వెళ్ళిన రమణ కు సరయు అస్తమానం గుర్తుకోస్తుంది.  ఎలాగో నెంబర్ తెలుసుకుని సరయు ఇంటికి ఫోన్ చేశాడు. సరయు వచ్చి ఫోన్ ఎత్తింది, గుండె ఆగినంత పనయింది రమణ కు ఉత్సాహంగా "నేను రమణ ను, ఎలా ఉన్నావ్" అన్నాడు.

వెంటనే సరయు "ఏంటి ఇలా ఫోన్ చేసావ్? మా డాడి ఇంట్లో ఉన్నారు. ఇంకెప్పుడు చెయ్యద్దు,  ప్లీజ్" అంటూ పెట్టేసింది. రమణ కు ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది ! "అసలు నేను ఎందుకు ఫోన్ చెయ్యాలి తను మళ్ళి చెయ్యద్దు అని ఎందుకు చెప్పాలి" అని మాయ సబలొ అవమాన పడ్డ దుర్యోదనుడిలా కుమిలి పోయాడు.

నెల రోజుల తర్వాత మళ్ళి కాలేజీ కి వెళ్ళాడు, క్లాసులో అడుగు పెట్టగానే సరయు కనిపించింది.   ఇద్దరు ఒక్కసారిగా ఉత్సాహంగా "హాయ్" అంటూ పలకరించు కున్నారు. ఇద్దరి కళ్ళలొను సంతోషం, వారి కళ్ళు  మెరిసి పోతున్నాయి. ఒకరిని చూడగానే ఒకరికి పట్టలేని సంతోషం కలింగిందని ఇద్దరికీ తెలిసి పోయింది. "ఎలా గడిపావ్ హాలిడేస్? రిసల్ట్ వచ్చింది చూశావ? చాల టెన్షన్ గా ఉంది ! " ఇలా దొర్లిపోతున్నాయి వారి మధ్య మాటలు.

ఆ రోజు నుండి ఇద్దరు కాస్త మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఒక రోజు క్లాసు లో ఎవరిదో బర్త్ డే పార్టి చేశారు, ఎప్పుడు బయటకు రాని రమణ ముందు ఉండి అన్ని అరేంజ్ మెంట్స్ చేయ్యసాగాడు. అసలు ఏది పట్టించుకోని సరయు కూడా ఆరోజు ముందుకు వచ్చింది. ఇద్దరు కలిసి బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, కాని సరయు అందరి ముందు రమణ తో అంత క్లోజ్ గా ఉండటం రమణ కు నచ్చటం లేదు.


రమణ ఎటు వెళ్ళితే అటు వెళ్ళ సాగింది సరయు. తను క్లాసు భయటకు వెళ్ళిన కుడా తనతోనే వచ్చి "ఏంటి ఇక్కడ ! లోపలికి వెళ్దాం పద" అంటూ ముందుకు నెట్ట సాగింది. రమణ కు చాల ఇబ్బందిగా ఉంది. "నువ్వు వెళ్ళు నేను వస్తాను" అని చెప్పాడు కాస్త కోపంగా. సరయు చాల భాద పడింది, ఉక్రోషంగా క్లాసు లో అడుగు పెట్టింది. "ఏంటి విడు పెద్ద పోజులు కొడుతున్నాడు, ఏదో కాస్త మాట్లాడుతుంటే. మళ్ళి అసలు పట్టించుకోకూడదు" అనుకుంది మనసు లో.


కాని రమణ పరిస్తితి వేరేలా ఉంది, ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడని వాడికి  ఒక్కసారిగా అంతటి అందగత్తె వెంట పడుతుండే సరికి భయపడి పోయాడు. ఎం చెయ్యాలో తెలియక ఒంటరిగా ఉండాలని, తనకు దూరం గా వెళ్ళి పోవాలని అనిపించింది.  అసలే సిగ్గరి అయినా రమణకు అంత మంది లో సరయు అలా వెంటపడుతుంటే తట్టుకోలేక పోయాడు, అందుకే దూరంగా పారిపోయాడు.

కాని ఈ విషయం సరయును చాల భాదించింది "ఎప్పుడు ఎ అబ్బాయితో మాట్లాడని తను వీడి కోసం బయటకు వెళ్ళితే నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తాడా? ఇలాంటి పిరికి వాడిని ఇష్ట పడినా  దండగే" అనుకుంది మనసు లో. అంతే ఆ రోజు నుండి రమణ ఎన్ని సార్లు మాట్లాడాలని చుసిన అవకాశం ఇవ్వలేదు.  ఆ తరువాత వారి మద్య దూరం పెరిగి పోయింది, సరయు మనసులో ఏముందో ఎప్పటికి తెలియ లేదు రమణకు.


చదువు పూర్తీ చేసుకుని వెళ్తున్న రోజు కూడా ఇద్దరు మాట్లాడు కోలేదు. కాని ఎవరి ద్వారో తెలిసింది ఏంటంటే వెంకట్ మరియు సరయు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్ళి కూడా చేసుకుంటారని. గుండెలు అవిసేలా భాదపడ్డాడు, కాని ఏమి చెయ్యలేడు, అంత చెయ్యి దాటి పోయింది.

 మంచి ఉద్యోగం వచ్చి, అంతకన్నా అందమయిన భార్య దొరికిన కుడా ప్రేమ అన్న మాట వినగానే రమణ కు సరయు నే గుర్తుకొస్తుంది ఇప్పటికి. "అది ప్రేమ కాదు వట్టి ఆకర్షణ అని ఎంత సర్ది చెప్పుకున్న ! తను ఇంకా గుర్తుకు రావటం ఏంటి ?"  అని ఆలోచిస్తే రమణ దగ్గర సమాధానం లేదు.

అందరికి ఇలాగె జరుగుతుందని కాదు కాని,  ఇలాంటి ప్రేమ కథలు కాలేజీ జీవితం లో చాల మాములు విషయం,  అలాగే అవి జీవితాంతం గుర్తు ఉండటం కూడా అతి మాములు విషయం.


నిజానికి రమణ, సరయు ఒకరినొకరు మొదటి చూపులోనే నచ్చారు కాని అర్ధం లేని ఇగో వాళ్ళ ఇంకా తెలియని తనంతో ఒకరి నొకరు దూరం చేసుకున్నారు. బహుశ ఆ దేవుడు వీరిద్దరికీ రాసి పెట్టలేదేమో !!


(సమాప్తం)