9, జనవరి 2013, బుధవారం

ఎవరు గొప్ప ?

సంధ్య సమయం
ఆకాశ వృక్షం పై నిండా మాగిన పండులా
రాలి పోవటానికి సిద్దంగా ఉన్నాడు సూర్యుడు

ఆకుల మాటున దాగిన మిణుగురుల వలె
తాళ తాళ మెరుస్తూ
బయట పడుతున్నాయి తారలు

నవ్వులను ఒళ్ళంతా పులుముకుని
ప్రేమను మకరందంల నింపుకుని
రేయి రేడు కై ఎదురు చూస్తూ
విరహంతో ఉన్న పూలను మగత లో ముంచి
మకరందం కొసరి కొసరి దోస్తున్నాయి
కొంటె తుమ్మెదలు

పుల్లని మావిళ్ళు తిన్న కోయిల
ఆ పులుపునంత బయట పంపాలని
తియ్యగా పాడుతోంది

మాటలు నేర్వాలని ఉబలాట పడుతూ
పోటీలు పడుతూ చిలుకలు
పలుకులు చిలుకుతున్నాయి

లయ తప్ప కుండా సంగీతాన్ని
ప్రవాహంలో పలికిస్తోంది సెలయేరు

చల్ల గాలికి ఒళ్ళంతా వణుకుతుంటే
వయ్యారంగా కదులు తున్నాయి తామరలు
వెచ్చని వెన్నెల కోసం ఎదురు చూస్తూ 

రాత్రిని ఏలేందుకు
పండు వెన్నెల పరివరంగా
చంద్రుడు కొలువు చేస్తున్నాడు

ప్రకృతి తనలో తను మురిసి పోతోంది
తన అందాలూ రెట్టింపు చేస్తోంది
అదంతా అనుభవిస్తూ
నమస్కరించింది నా మనసు నా కళ్ళకు
నా కళ్ళు వర్షించాయి సంతోషంగా
నా మనసు  అనుభూతులకు

 నాలో ఓ ప్రశ్న మొదలయింది
ఎవరు గోప్పంటు జిజ్ఞాస రగిలింది
అందమయిన ప్రకృతి గొప్ప?
దాన్ని చూపిన కళ్ళు గొప్పవా?
లేక ఆనందించిన మనసా?

2 వ్యాఖ్యలు:

  1. మనసే గొప్పది.....కళ్ళుండి పకృతిని ఆరాధించలేని వాళ్ళెందరో!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. Nijame...kani manasu undi kallu leka pothe....alage manasu, kallu undi andam leka pothe....urike saradaga......chala santhosham.....thanks a lot for the visit....:) :)

      తొలగించు