6, జనవరి 2013, ఆదివారం

ఎందుకంటే ! నేను ఆడపిల్లను !!

నేను కడుపునా పడ్డ క్షణం నుంచి
నా కష్టాలు మెదలు
అసలు పుడుతానో లేదో అని
ప్రపంచాన్ని చూస్తానో లేదో అని
నన్ను కనే దైర్యం అమ్మ, నాన్న కు వస్తుందో రాదో అని
ఆరు నెలలు నరకం అనుభవిస్తాను

పసిగా ఉన్నప్పుడయిన పాపం అనరు
కొన్ని సార్లు నాన్న అలకలు, నాన్నమ్మ ఈసడింపులు
అమ్మ కష్టాలు అప్పుడే మొదలు, నా వల్ల
నాన్న తిప్పలు ఆరంభం
పసితనం నుంచే నా కష్టాలు ప్రారంభం

కోరినది చదువ లేను
అనుకున్నది కట్టు కోలేను
అన్న, తమ్ముడి కోసం త్యాగాలు
ఆడపిల్ల కేందుకంటూ సూక్తులు
నాకు మాత్రమే వర్తించే నీతులు

నా మనసు నన్ను వదిలి పోతుంది
నా ఇష్టం ఎన్నో సార్లు చచ్చిపోతుంది
పైకి మాత్రమే నేను సున్నితం
నా లోపలంతా బడబాగ్ని !
తీవ్రమయిన అసంతృప్తి
తలదించు కొనే అదైర్యం నా నేస్తాలు !
నా ఉహలు, కలలు మాత్రమే
కాసేపు నన్ను బ్రతికిస్తాయి
ఎప్పుడు కట్టుబాట్లు నన్ను శాసిస్తాయి

ఇంత  అణుకువగా ఉన్న
ఎన్ని త్యాగాలు చేసిన
సృష్టి లో సగ భాగం నాదయినా
ఆనందమంతా నాతోనే ఉన్న
ప్రేమంతా నేను పంచిన
నా విలువ పెరుగదు
నా బ్రతుకు మారదు

నేను ఒంటరిగా కనిపిస్తే చాలు
మదమెక్కి, నీతిని మరచి
కామంతో కళ్ళు మూసిన మగాడు
నా మీద పడి నన్ననుబవిస్తాడు
నా బతుకు నలిపెస్తాడు, కాని
వాణ్ణి కన్నది నేనేనని
వాడి సోదరి  నా రూపామేనని
వాడి బార్య నా లాంటిదేనని
వాడి కూతురు రేపు నేనే అవుతానని
వాడికెలా చెప్పేది, వాణ్ణెల బాగుపరిచేది !

నిన్ను కన్న ప్రతిసారి నేను  మరో జన్మ ఎత్తాను రా !
నీ కోసం నా ఇష్టాలు పాతి పెట్టాను రా !
నీకు పక్క పంచటానికి, నా వంటి బాధను
పంటి బిగువున దాచాను రా !
నువ్వు ఈసడించు కున్న ని కూతురుగా మారి
నీ జీవితం పరిపూర్ణం చేశాను  రా !
నన్ను ఇలా అనుభవించటానికి ని మనసెలా ఒప్పింది !

అసలు నీకు మనసుందా? లేక కామంతో కాలి పోయిందా?
మేలుకో  !  నా విలువ తెలుసుకో !
నీపై అలిగి నేను పుట్టటం ఆపేస్తే
నీ పుట్టుకే వ్యర్దం, ఈ సృష్టే అంతం !
ఇప్పటికయినా కళ్ళు తెరుచు కో
నన్ను కాపాడుకో
ఎందుకంటే నేను "ఆడపిల్లను"


3 వ్యాఖ్యలు: