12, జనవరి 2013, శనివారం

పిరికి ప్రేమ

నువ్వంటే ఇష్టం ఎప్పుడో తెలియదు
నీపై ప్రేమ ఎప్పుడు మొదలో చెప్పలేను
మది నిండా నువ్వు నిండి పోయావు
నిదుర లోను ని కలవరింతలే
మెలకువ లోను ని తలపులే
నిన్ను చూడాలని ఆరాటం
అనుక్షణం నా మనసుతో పోరాటం
నీతో ఎన్నో చెప్పాలని అనుకుంటాను
ఎదురుగా నువ్వుంటే ముగబోతాను
నువ్వు దూరం కాగానే
ఒంటరి తనం ముందు ఓడిపోతాను
నాలోని నువ్వు, నన్ను గెలిపిస్తావు
రేపటి కోసం నన్ను బ్రతికిస్తావు
ఎప్పుడు రోజు గడుస్తుందా
ఎప్పుడు నిన్ను చూద్దామా అనుకుంటాను
ఎ రోజయినా నిన్ను చూడక పొతే
ని పలుకు వినక పొతే
నా  హృదయ రోదన ఎలా వినిపించను
నీపై ప్రేమను ఎలా చూపను
నాతొ పలికే ని ప్రతి మాట
మదిలో కొలువుంచనని ఎలా నిరూపించను
ఈ మూగ ప్రేమ తనలో అంటుంది
ఈ మనసు నీకె సొంతం
ఈ తనువూ నీకె అర్పితం
ఈ బ్రతుకు నీకె అంకితం
నీకు తెలిసేదెలా ?
ఈ పిరికితనం నన్ను విడేదేలా?
నా ప్రేమ గెలిచేదేలా?

4 వ్యాఖ్యలు: