12, జులై 2016, మంగళవారం

అఖిల్-నాగ్ తిప్పలు (హాస్యం) -1

అఖిల్ ను లాంచ్ చెయ్యాలని నాగార్జున తీవ్రంగా అలోచించి ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద డైరెక్టర్స్ అందరిని కలుసుకుని వాళ్ళ ఐడియా లతో మూవీ ప్లాన్ చెయ్యాలను కున్నాడు. అ ప్రస్తానం లో అయన ఎదురుకున్న పరిస్తిలు ఎలా ఉన్నాయి !

నాగ్, రాంగోపాల్  వర్మ ఆఫీసు లో కుర్చీని మాట్లాడుకుంటున్నారు. వర్మ చేతి లో వోడ్కా గ్లాస్ పట్టుకుని కూర్చున్నాడు.

నాగ్: వర్మ ! అప్పట్లో నేను నీకు బ్రేక్ ఇచ్చాను శివ సినిమా తో. ఇప్పుడు నువ్వు నాకు బ్రేక్ ఇవ్వాలి మా అబ్బాయి అఖిల్ ను లాంచ్ చేసి.

వర్మ: నాగ్ నువ్వు నా సినిమా చేసింది ఏదో నన్ను ఉద్దరించాలని కాదు. నేను చెప్పిన స్టొరీ నీకు నచ్చింది అందుకే చేశావు. నాకు బ్రేక్ ఇవ్వటం, తొక్క తోలు లాంటి వాటి మిద నమ్మకం లేదు.

నాగ్: ఓకే ఓకే నాకు అర్ధం అయ్యింది. మరి మా వాడి తో మూవీ గురించి ఏమంటావ్. ఎంత ఖర్చు అయిన పర్వాలేదు.

వర్మ: ఖర్చు పెడితే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ముర్కత్వం అవుతుంది. యు నో, అల అనుకుంటే కష్టపడి సెట్ లు వేసిన మన గోవిందా గోవిందా హిట్ అవ్వాలి కాదా?

నాగ్: ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు ఎందుకు. ఎన్ని రోజులు అయిన పర్వాలేదు మంచి సినిమా తీసి పెట్టు, మా వాడితో.

వర్మ: ఎక్కువ రోజులు తీస్తే సినిమా బాగా ఆడుతుందని అపోహ ఉంది జనం లో. అల అనుకుంటే నేను ఎన్నో రోజులు కష్ట పడి తీసిన షోలే రీమేక్ సూపర్ హిట్ అవ్వాలి కాదా?

నాగ్: నీతో వాదించలేను రాము నేను. మంచి స్టొరీ తో సినిమా తియ్యు.

వర్మ: చూడు నాగ్ ! స్టొరీ అనేది మంచిది చెడ్డది అనేది ఉండదు. ఎమోషన్ పట్టుకుంటే ఒక్క రాయిని పెట్టి కుడా సినిమా హిట్ చేయ్యోచు.

నాగ్: ఏంటి వర్మ, మా వాడిని పెట్టి సినిమా తియ్యమంటే రాయి రప్ప అంటావేంటి. పోనీ అందరికి నచ్చే సినిమా తియ్యు.

వర్మ: ఈ మాట నేను చాల సార్లు చెప్పాను. నేను నాకు నచ్చినట్లే సినిమా తీస్తాను. అ తరువాత చూసే వాడి ఖర్మ.

నాగ్: వర్మ ! ఏంటి నాకి ఖర్మ. సరే నీకు నచ్చినట్లు ఒక సినిమా తియ్యు మా వాడితో. ఆడితే మా అదృష్టం లేక పొతే వాడు మరో సుమంత్ లాగ, చైతన్య లాగ అయిపోతాడు.

వర్మ: నా మిద నీకు ఉన్నా కాన్ఫిడెన్స్ చూస్తుంటే,  నేనో పెద్ద జీనియస్ అని అనిపిస్తుంది నాకు.  అందుకే నా చుట్టూ ఎప్పుడు పిచ్చి బ్యాచ్ ను పెట్టుకుని తిరుగుతుంటాను. అప్పుడే కాద మన మిద మనకు నమ్మకం రెట్టింపు అవుతుంది.

నాగ్: నువ్వు ఎవడితో తిరుగున్నావ్ అని నేను అడిగానా? సినిమా ఎలా తియ్యబోతున్నవో చెప్పు ముందు.

వర్మ: ఈ మద్య ఓ కొత్త కెమెరా వచ్చింది,  నెట్ లో చూశాను.  మన షర్టు బటన్ సైజు అంత  ఉంటుంది,  కాని క్లారిటీ మాత్రం అచ్చం మన సినిమా కెమెరా లాగే ఉంటుంది. అలాంటివి ఒక అయిదు కెమెరా లు తెప్పించి, ప్రతి వాడి షర్టు బటన్ కు ఫిక్స్ చేస్తాం. సిన్ చెప్పి ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాణ్ణి ఆక్టింగ్ చెయ్యామంటం. అప్పుడు ఎంత నాచురల్ గా ఉంటుందో ఉహించు.

నాగ్: ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు ఆక్టింగ్ చేస్తే మరి నువ్వెందుకు? డైరెక్టర్ గా.

వర్మ: నీకు కాన్సెప్ట్ అర్ధం అయినట్లు లేదు. డైరెక్టర్ అనే వాడు స్టొరీ టెల్లర్, ఆక్టర్ లో ఉన్నా ఎమోషన్ పట్టుకుని, సిన్ ఎడిటింగ్ చేయించి, మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి,   సిన్ ఎలివేట్ చేస్తాడు. యు నో, అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు.

నాగ్: జనాలతో ని కనెక్షన్ ఎప్పుడో కట్ అయ్యింది గాని, అసలు ఈ కొత్త కెమెరాల కాన్సెప్ట్ ఇప్పుడెందుకు?

వర్మ: కొత్త ప్రయోగం. ఇప్పటి వరకు కెమెరా లు మార్చి తీసాను. ఇప్పుడు అసలు కెమెరామెన్ లేకుండానే తీస్తాను. దటిజ్ వర్మ.

నాగ్: అసలు వర్కౌట్ అవుతుందంటావా?

వర్మ: అది చెప్పగలిగితే ఇన్ని ఫ్లాప్ లు ఎందుకు తీస్తాను. సినిమాకు వచ్చే ప్రేక్షకులు రక రకాల పరిస్తితుల్లో వస్తారు. అప్పుడు వాడు ఉన్నా స్టేట్ అఫ్ మైండ్ ఏంటో నాకేల తెలుస్తుంది. యు నో, సినిమా తియ్యటమే మన పని, నచ్చింద నచ్చ లేదా అనేది నా కంట్రోల్ లో లేదు.

నాగ్: వర్మ అసలు నువ్వే కంట్రోల్ తప్పి చాల కాలం అయింది. ఇంకా ఆశ చావక వచ్చాను. ఇంతకూ స్టొరీ ఏంటి?

రాము: కొత్తగా ఎందుకు ! నా హిట్ సినిమా సత్య కు సీక్వెల్ తీద్దాం.

నాగ్: అందులో హిరో చనిపోయాడు కాద?

వర్మ: నా డార్లింగ్ బతికే ఉంది కాద. హిరో కారెక్టర్ చనిపోక ముందు హిరో హీరోయిన్ ఇద్దరు ఖండాల వెళ్తారు గుర్తుందా, అక్కడ జరిగిన మ్యాటర్ కు మన హీరో పుడుతాడు.

నాగ్: ఎన్నాయిన చెప్పు ! దరిద్రపు గొట్టు ఐడియాలు ఇవ్వటం లో నువ్వు సూపర్. ని వాళ్ళే ఆ పూరి జగన్ పూర్తిగా నాశనం అయ్యాడు. తర్వాత ఏంటి?

వర్మ: హీరో కాలేజ్ లో ఒక్క మాఫియా డాన్ చెల్లెలిని ప్రేమిస్తాడు. అది ఇష్టం లేని మాఫియా డాన్ హీరోని,  హీరోయిన్ ని ఇద్దరినీ  చావా గొట్టి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు హీరో మరో మాఫియా డాన్ గా మారుతాడు. తిక్క రేగిన విలన్  హీరో తల్లిని చంపేస్తాడు. అది తట్టు కోలేని హీరో హీరోయిన్ ను అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తాడు.

నాగ్: ఏంటి హీరో హీరోయిన్ ను హీరో చంపేస్తాడ? అది రేప్ చేసి. ఎంత దారుణం !

వర్మ: చూశావ ! నువ్వే అలా అనుకుంటున్నావ్. ఎమోషన్స్ తో ఆడుకుంటా. తర్వాత విలన్ హీరో మిద చేతబడి చేయిస్తాడు. హీరోయిన్ దెయ్యంగా మారి  విలన్ ను పట్టి పిడిస్తుంటుంది.

నాగ్: చంపింది హీరో అయితే విలన్ ను ఎందుకు పిడిస్తుంది?

వర్మ: అక్కడే సిక్రెట్ రివిల్ చేస్తాం. హీరో ఆమెను రేప్ చేసి చంపక ముందే విలన్ ఆమెను చంపేసాడు.

నాగ్: అంటే ఆల్రెడీ చచ్చి దెయ్యం అయినా హీరోయిన్ ను హీరో రేప్ చేసి చంపేసాడు. వాడికి ఆ  మాత్రం తెలియ లేదు? అంతేనా !

వర్మ: నన్ను నువ్వు,  నీ ఫామిలీ అర్ధం చేసుకున్నంతగా తెలుగు ఇండస్ట్రీ లో ఎవ్వరు  చేసు కోలేదు. అందుకే మీతో తప్ప ఎవరి తో తియ్యలేక పోయాను. పైగా ఈ ట్విస్ట్ నా సినిమాల్లో వేరి స్పెషల్.

నాగ్: అదంతా మా ఖర్మ కాని. ఇంతకూ ముందు ఎక్కడ వాడావ్ ఆ ట్విస్ట్?

వర్మ: దెయ్యం సినిమాలో కళ్ళు చిదంబరం దెయ్యం అని చివరలో తెలుస్తుంది. అలాగే డార్లింగ్ సినిమాలో దెయ్యం అయినా ఇషా డియోల్ తో ఫర్దీన్ ఖాన్ హాట్ గా రొమాన్స్ చేస్తాడు. వాటిని  అక్సేప్ట్ చేసినప్పుడు వీటిని కూడా చేయాల్సిందే.

నాగ్: అంటే ఆడియన్స్ ఏది చూడాలో నువ్వే డిసైడ్ చేస్తావ?  తర్వాత ఏంటో చెప్పు !

వర్మ: సింపుల్ దెయ్యంగా మారిన హీరోయిన్ విలన్ ను చంపేస్తుంది. చేతబడి చెయ్యబడ్డ హీరో కుడా చనిపోతాడు. ఇది కొత్త పాయింట్.

నాగ్: ఏది కొత్త పాయింట్ హీరో చనిపోవటమ ! ని సినిమాల్లో అది కమానే కదా?

వర్మ: కాదు ! చేతబడి తో  హీరో చనిపోవటం. ఇంతకూ ముందు చేతబడి చేసిన్నట్లు చూపించాను కాని చంపలేదు. ఇప్పుడు చంపేస్తున్నా.

నాగ్: !?!?!?*****!!!!!!!!????

వర్మ: జనరల్ గా సినిమాతో  మెసేజ్ ఇవ్వటం  నాకు నచ్చదు. కాని ఇందులో రెండు మెసేజ్ లు ఇవ్వాచు. ఒక్కటి అమ్మాయిలను రేప్ చేసి చంపకూడదు. వాళ్ళు దెయ్యం అయి నిన్ను చంపేస్తారు. రెండోది మాఫియా గా మారిన వాడు మాఫియా చేతి లోనే చచ్చి పోతాడు.

నాగ్: అసలు ఇది లవ్ స్టొరీ నా? మాఫియా స్టొరీ నా ? లేక హారర్ స్టొరీ నా?

వర్మ: అన్ని జోనర్ లు కలిపి కొత్త ప్రయోగం.  ఎలా ఉంది?

నాగ్: ఏంటి వర్మ !  నీలో ఉన్నా క్రియేటివిటీ ఏమయింది. ఇంత చెత్త ఐడియా లతో సినిమా లు తిస్తున్నావ్?

వర్మ: నేను శివ సినిమా తీసినప్పటి నుంచి ఈలాగే అంటున్నారు. కాని నా సినిమాకు క్రేజ్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. న్యూస్ కోసం మొహం వాచిన మీడియా ఉన్నంత కాలం నేను ఇలాగే బ్రతికేస్తుంటా. చీర్స్ ! వోడ్కా తో మీ రాము.

అక్కడ నుంచి బయట పడిన నాగ్ , ఇలా అనుకున్నాడు మనసు లో.....అన్నమయ్య తో నా ఇమేజ్ మార్చిన రాఘవేంద్ర రావు అయితే బెటర్. రేపే వెళ్ళి కలవాలి.


(ఆ అనుభవం ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం.)

6 వ్యాఖ్యలు:

 1. ఈ పోస్ట్ కమెంట్లు లేకుండా ఇలా ఎలా ఉండిపోయిందో నాకు అర్ధం కావట్లేదు...
  ఉతికారేశారు... సూపర్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇరగ్గొట్టేశారు! Superb!

  Sravan

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆడితే మా అదృష్టం లేక పొతే వాడు మరో సుమంత్ లాగ, చైతన్య లాగ అయిపోతాడు. idi keka mestaaru

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిజమే కాదండి ! సుమంత్, నాగ చైతన్య ఎందుకు పనికి రాని హీరోలుగానే మిగిలి పోయారు. చాలా కృతజ్ఞతలు.

   తొలగించు