31, జనవరి 2013, గురువారం

కమల్ ! ఏందీ ని గొప్ప !!

విశ్వరూపం సినిమా మిద అలుముకున్న వివాదాల దృష్ట్యా మీడియా వారు ముఖ్యంగా మన టీవీ వారు చేస్తున్న హంగామా వల్లా ఎ ఇద్దరు స్నేహితులు కలిసిన వారి మాటల్లో కాసేపయినా ఆ సినిమా గురించి మరియు కమల్ హసన్ గురించి మాటలు దొర్లటం సహజం. అలాంటి ఒక సన్నివేశాన్ని ఉహించి రాసిన ఓ ఇద్దరి స్నేహితుల సంభాషణ. ఒకతని పేరు యాదగిరి మరో అతని పేరు లింగం. యాదగిరికి మసాలా సినిమాలు అంటే ఇష్టం కాని లింగం కు మంచి సినిమాలు చూసే అలవాటు.

యాదగిరి: ఏంది  మామ ఏడికి పోలే ?  ఇట్లచినావ్ !

లింగం: అంటే ! ఇదేమన్న నీ ఇళ్ళ సాలె? కేప్ కి వచ్చి ఏదో దమ్ము కొట్టి టీ తాగుదామని నేనస్తే.

యాదగిరి: ఎయ్ అపురా బై ! ఏదో అడిగితె అట్లా సీరియస్ అయిపోతావ్ ఏందీ?  సరే గాని చాయ్ చెప్పు నేను సిగరెట్ తెస్తా.

లింగం: నాకు ఒక్క సిగరెట్ కావాలి షేరింగ్ మనతోని కాదు. నువ్వు అసలే దాన్ని చికి చికి తాగుతావ్. 

యాదగిరి: అరేయ్ నితోని ఏది పెట్టుకోవద్దు రా బై. అసలే పైసలు లేక సినిమా కు కూడా పోవుడు అవుతలెదు నీకు సెపరేట్ సిగరెట్ కావాల్న. 

లింగం: సినిమా కు పోలేదని ఏడుసుడు ఏందిరా ! ఏదో అన్నం తినలేదన్నట్లు. అయినా అంత గొప్ప సినిమాలు ఏమున్నాయి ఇప్పుడు !

యాదగిరి: నాయక్, సీతమ్మా వాకిట్లో సిరి మల్లె చెట్టు. కతర్నాక్ సినిమాలు.

లింగం: మొన్ననే సంక్రాంతికి చుసినావ్ కదరా ! మల్లి ఎందుకు?

యాదగిరి: అంటే ఒక్కసారి చూసి ఊరుకుంటారా ! కనీసం మూడు సార్లు చూడక పొతే నాకు అర్ధం కాదురా బై.

లింగం: విశ్వరూపం పోదాం రా బై. బాగుంటది. 

యాదగిరి: వామ్మో ! అయినా సినిమాలు చూసుడు మనతోని కాదురా బై. ఏందీ రా బై గట్ల తీస్తాడు అంత వైరేటి వెరైటి. 

లింగం: అంటే నీకు వెరైటి సినిమా నచ్చద?

యాదగిరి: ఎ అట్లా కాదురా బై ! ఏంటో హీరో అంటే పది మందిని కొట్టల్ర బై. ఎప్పుడు చూడు తన్నులు తింటాడు.

లింగం: సినిమా కోసం  రియల్ స్టంట్ లు చేస్తుంటే ఇంతవరకు కమల్ హసన్ కు ఎన్ని ఆక్సిడెంటు లు అయ్యయో నీకు తెలుసా? అవ్వే స్టంట్ లు జాకిచాన్ చేస్తే చూస్తావ్. రియాల్టీ ఫైట్ లు పెట్టి హీరో తప్పించు కొనే టప్పుడు కమల్ చేసే రియల్  స్టంట్ లు నీలాంటి వాడికి కనిపించవు. 

యాదగిరి: అది కాదురా బై అసలు కామేడినే ఉండదు అయన సినిమాల్ల.

లింగం: సతి లీలావతి, బ్రహ్మచారి సినిమా చూసినవ? పంచతంత్రం మొన్న టీవీ లో వస్తుంటే పడి పడి నవ్వినావ్ కదరా?

యాదగిరి: డాన్స్ ఉంటాద  అయన సినిమాల? వేరే వాళ్ళు  చూడు ఎంత బాగా డాన్సు చేస్తారో.

లింగం: సాగర  సంగమం చూసినావా? అంతకు మించిన డాన్సు ఇంకేదయినా ఉందా !

యాదగిరి: హీరోయిన్ లను బాగా నలిపెస్తాడు రా బై.

లింగం: పిచ్చి నా కొడుకా. బొడ్డు మిద తేనే పోసి, పండ్లు ఎసి  అవసరం లేక పోయినా స్విమ్ సూట్ వేయించి ఎక్ష్పొసింగ్ చేయిస్తే లేని తప్పు కథ ప్రకారం హీరోయిన్ ను ముద్దు పెట్టుకుంటే తప్పా?  అంతకు మించిన సిన్ లు భయట చేస్తున్నారు పబ్లిక్ లో. 

యాదగిరి: ఏమయినా కమల్ కు హీరోయిజం రాదురా. ఏదో ఆక్టింగ్ చేసుకుంటూ నెట్టు కోస్తాడు.

లింగం: ఒరేయ్ విచిత్ర సహోదరులు సినిమాలో పొట్టి కమల్ హసన్ చేసే హీరోయిజం ను మించిన హీరోయిజం ఒక్కటి చెప్పు రా.  ఇప్పటికి ఆ పొట్టి క్యారెక్టర్ ఎలా చేసారో నూటికి 97 మందికి తెలియదు రా. కాని కమల్ దాన్ని చేసి చూపించాడు. 

యాదగిరి: చాల్లేరా ! అయన ఎలా చేస్తే మనకెందుకు. అసలు సెంటిమెంట్, కామెడి, ఆక్షన్, లవ్  అన్ని ఉన్నా ఒక్క సినిమా చెప్పు కమల్ ది. 

లింగం: వసంత కోకిల, ఇంద్రుడు చంద్రుడు , స్వాతిముత్యం,  గుణ, ద్రోహి  ఇంకా నాకు పేర్లు గుర్తుకు రావటం లేదు. ఒరేయ్ కమల్ హసన్ సినిమా తీస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటది రా.

యాదగిరి: ఎప్పుడు అన్ని ఏడుపు గొట్టు సినిమాలు తీస్తాడు. గాంది మిద విమర్శిస్తూ తీసిండు హే రామ్ అని చెప్పి.  అబ్బో అందులో ఇద్దరి హీరోయిన్ లను ఆడుకున్నాడు.

లింగం:  అరేయ్  ఆ టైం ల గాంధిని ఎంత గా ఇష్ట పడ్డారో అంతే  ద్వేషించిండ్రు. దాన్నే అయన చుపెట్టిండు,  స్టొరీ ప్రకారం సెక్స్ సిన్ లు అవసరం కాబట్టి తీసిండు,  అంతే కాని ఏదో వాళ్ళను అనుభవించాలని కాదు రా.  కక్కుర్తి వెధవ !  అందరు నీలాగే ఉండరు. 

యాదగిరి: నువ్వు ఎన్నయినా చెప్పు రా బై, నాకు అయన సినిమాలు నచ్చాయి.  ఆ నాయకుడు తీసుకో  అంత పవర్ ఫుల్ హీరో లాస్ట్ కి అట్లా చచ్చి పోతాడు. అదే వేరే వాళ్ళు తీస్తే సూపర్ ఎండింగ్ ఉంటాది అందరిని చంపేసి మంచి గా సెటిల్ అయినట్లు. 

లింగం: ఒరేయ్ ఆ సినిమా కోసం కమల్ హసన్ జుట్టు పికించు కున్నాడు మొదల్ల నుంచి. గికితే బట్ట తల లాగ కనిపించదని. ఒక్క సినిమా కోసం ఎవరయినా జుట్టు పికేసు కుంటార? నువ్వు దుమ్ము లోకి రమ్మంటేనే జుట్టు కరాబ్ అయితది రా బై అంటావ్. తప్పు దారిలో వెళ్ళిన వాళ్ళు అలాగే ముగిసి పోతారు అని చుపించిండు. 

యాదగిరి: ఒక్క సుఖాంతం అయినా సినిమా చెప్పురా కమల్ హసన్ ది. 

లింగం: మైకేల్ మదన కామా రాజు. నాలుగు కారెక్టర్ లు అసలు ఒక్కదానికి ఒక్కటి పోలికనే ఉండాది. చూసినవ ఆ ఆక్టింగ్, అసలు ఎం కామెడి ఉంటాది అండ్ల.

యాదగిరి: వట్టి మేకప్ తప్ప ఏముంటది రా బై అయన సినిమాల్ల !

లింగం: ఓహో మేకప్ ఏసుకొని నువ్వు చెయ్ రా ! భామనే సత్య భామనే. 50 ఏండ్ల ముసలావిడా క్యారెక్టర్ అట్లనే భారతీయుడు ముసలి క్యారెక్టర్.

యాదగిరి: అదయితే ఒప్పుకుంట రా బై. అసలు దశావతారం చూసినప్పుడు, ఒక్కోడే ఇన్ని కారెక్టర్ లు చేసుడు గ్రేట్ అనిపిచింది. 

 లింగం: కమల్ మస్త్ డైరెక్టర్ కూడా రా బై. అసలు పోతురాజు సినిమా భలే ఉంటది రా.

యాదగిరి: మన్మధ బాణం ! అసలు ఎం  సినిమా రా బై అది.  కమల్,  మాదవన్ ఇద్దరు ఉంటారు. దిమాక్ కరాబ్ అయింది.

లింగం: అదేదో  అనుకున్నారు మంచి గా రాలేదు. ఆ ఇద్దరిదే సత్యమే శివం చూసినావా ! ముందు అది చూసి మాట్లాడు. అభయ్ చూసినావా అసలు రెండు కారెక్టర్ లకు ఎంత తేడా ఉంటాది, లుక్ లో.  ఒక్క కారెక్టర్ బక్కగా ఒంకోటి మస్త్  బాడి బిల్డింగ్,  గ్రాపిక్స్ కాదు ! నిజంగానే పెంచిండు బాడి.  కాని ప్లాప్ అయ్యింది   అట్లని  కమల్  గొప్ప కాదంటే ఎట్లా రా బై.

యాదగిరి: నిజమే మామ కాని అయినా సినిమాలు పెద్దగా హిట్ కావు రా.

లింగం: ఎందుకు అవుతాయి రా ! నీలాంటి మసాలా సినిమాలు చూసేటొల్లు ఉంటె. అరేయ్ సినిమా హిట్ కాక పోవచ్చు కాని కమల్ హసన్ ఎప్పుడు ఫెయిల్ గాలే.

యాదగిరి: కానీ విశ్వరూపం బ్యాన్ చేసిండ్రు అంట గదరా ! ఏవో సెక్యూరిటీ ప్రాబ్లంస్ అంట.

లింగం: ఈ మద్య సినిమాల మిద బ్యాన్ లు పెట్టుడు గొడవలు చేసుడు కామన్ అయిపొయింది. అసలు ఏదో కారెక్టర్ పెడితే యిలకు ఏందో నొప్పి. తెలుగు లో రిలీస్ అయ్యింది కదా ! మరి సెక్యూరిటీ ప్రాబ్లం అచ్చిన్దా? అంత పాలిటిక్స్ రా బై.

యాదగిరి: నిజమే మామ. అరె కడలి సినిమా మిద కూడా ఏదో లేసింది కంట్రవర్సి. అదయితే ఘోరం మామ, 17 ఏండ్ల హీరోయిన్ తో ముద్దు సిన్ లు తిస్తావా? అసలు యువత యెమయితది అంటుండ్రు. అసలు దిమ్మాక్ ఉందా రా బై ఇలకు.

లింగం: స్కూలు పిల్లలు కడుపు తెచ్చుకుంటే లేదు గాని ఆయనేదో పాపం సినిమా దిస్తే సుడకుండానే యిల్లు మొదలు పెటిండ్రా !

యాదగిరి: కాని కమల్ హసన్ ది మాత్రం ఘోరం మామ ! అంత గొప్ప నటుడికి ఇంత అన్యాయం తప్పు రా.

లింగం: అంత అమ్మ మహిమ రా. ఆమె సినిమాల్ల చేసి CM అయ్యింది ఇప్పుడు సినిమోల్లనే ఇట్లా టార్చర్ పెడుతుంది.

యాదగిరి: మామ విశ్వరూపం  సినిమాకు పోతుంటిమి గాని పైసలు లేవు రా.

లింగం: నేను తీసుక పోత పా !

యాదగిరి: ఏందీ ! సినిమా కు అంటే పైసలు పెట్ట అంటావు నువ్వు తీసుక పోతవ? ఇయ్యాల సెలవు ఇగ.

లింగం: అపుబే ! లత్కోరు సినిమాలకు పెట్టగాన్ని మంచి సినిమాలకు ఎందుకు పెట్ట. ఎన్ని సినిమాలు చూపించిన రా బై నీకు. అన్ని మంచి సినిమాలే మల్ల.

యాదగిరి: ఎ.....జోక్ చేసిన మామ ! పుసుకున్న ఫీల్ అయి పోతావ్.

కమల్ హసన్ తీసిన సినిమాలు అన్ని గొప్పవి అని చెప్పటం లేదు, కాని సినిమా కోసం ప్రాణం కూడా పంనంగా పెట్టె ఇలాంటి కళాకారులకు అకారణంగా అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక నాకున్న కొద్ది పాటి పద జాలంతో, కొద్ది పాటి జ్ఞానంతో చంద్రుడికి ఓ నూలు పోగులా ఇది రాసాను. అంతే కాని ఎవరిని కించ పరచాలని, తక్కువ చెయ్యాలని మాత్రం కాదు.


3 వ్యాఖ్యలు:

  1. బాగా రాశారు. కమల్ నటజీవితం మొత్తానికి నాయకుడు, భారతీయుడు చాలవా? మిగిలినవి గొప్పవి అయితేనేం, కాకపోతేనేం.

    ప్రత్యుత్తరంతొలగించు