18, జులై 2016, సోమవారం

అఖిల్-నాగ్ తిప్పలు (హాస్యం) -2

రాఘవేంద్ర రావు ఆఫీసు లో నాగార్జున ఎంటర్ అయ్యాడు. ఏవో పళ్ళ బొమ్మలు టేబుల్ మిద వేసుకుని అటు ఇటు తిప్పుతూ చేతితో పిసుకుతూ ఏదో ఆలోచిస్తున్నాడు దర్శకేంద్రుడు.

నాగ్: హలో రాఘవేంద్ర రావు గారు ! ఎలా ఉన్నారు. చూస్తుంటే చాల ఖాళీగా ఉన్నట్ట్టునారు.

RVR: ఏంటి నాగ్ ! ఇంత బాగా పనిచేసుకుంటూ  కనిపిస్తే ఖాళీగా ఉన్నానంట వెంటి? డమరుఖం దెబ్బ బాగానే తాకినట్లు ఉంది నీకు.

నాగ్: ఇప్పుడు దాని గొడవెందుకు లెండి ! డమరుఖం థియేటర్ లో మోగక పోయిన నా జీవితం లో బాగానే మోగింది. ఇంతకూ మీరేం పనిచేస్తున్నారు? ఏవో బొమ్మలతో ఆడుకుంటూ.

RVR: మన స్పెషాలిటి ఏంటి నాగ్? పండ్లు ఇంకా బొడ్డు. ఇప్పటి వరకు అక్కడే వేశాను కాని  వెరైటి గా ఇంకా ఎక్కడ వేస్తె బాగుంటుందో ఆలోచిస్తున్నా.

 నాగ్: ఎంటండి ఈ వయసు లో కూడా! పైగా ఇప్పుడు బొడ్డు మాత్రమే కాదు బికినీ లు వేసి హీరోయిన్ లు టాప్ లేపెస్తుంటే ఇంకా అక్కడే  ఆగిపోతే ఎలా? వేరేవి ఆలోచించండి.

RVR: ఈ వయసు లో నాకు అవసరమా ! మన కు వచ్చిన దాంట్లో ఏదో వెరైటి చూపాలని నేను అనుకుంటే  ఇలా విమర్శలు ఏంటి? ఇంతకూ నువ్వెందుకు వచ్చావ్?

నాగ్: మా అబ్బాయి అఖిల్ ను హీరో గా లాంచ్ చేద్దామనుకుంటున్నాను. మీరు మంచి సినిమా తీస్తే బాగుంటుంది.

RVR: నేను ఇప్పుడు అంత భక్తీ సినిమాలు తీస్తున్నా. నీకు తెలుసు కాద. నీకు ఇష్ట మయితే భక్త మార్కండేయ సినిమా తీద్దాం. మంచి భక్తీ సినిమా, ఇంకా గొప్ప ఆక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సిన్  లు పుష్కలంగా తీసి జనాన్ని  పిచ్చోలని చెయ్యొచ్చు.

నాగ్: నాకు ఆ  స్టొరీ పెద్దగా ఐడియా లేదు. ఒక్కసారి చెప్పండి.

RVR: మొన్ననే మన భారవి చెప్పాడు. చాల ఈజీ అది తియ్యటం,  పైగా బడ్జెట్ కుడా పెద్దగా అవ్వదు. మార్కండేయుడు అనే ఒక్క బుడ్డోడు శంకరుడి వర ప్రసందంగా పుడుతాడు. కాని అల్ప అయుష్కుడు, అందుకని శివుని గురించి తపసు చేసి యమున్ని ఓడించి 100 ఏండ్లు బ్రతుకుతాడు. చూశావ ఎంత ఈజీ నో !

నాగ్: కాని  అంత భక్తీ తప్ప నాకేం కనబడటం లేదు. ఇంకా లవ్ సిన్స్ కు స్కోప్ లేదు. 

RVR: ఏంటయ్యా నువ్వు మరీను. అన్నమయ్య లో స్కోప్ ఉందా! ఎన్ని డూఎట్లు పెట్టాను. ఆఖరికి దేవుళ్ళు  విష్ణు, లక్ష్మి కుడా నా ఐడియా లకు బలి అయిపోయారు. ఇంకా రామదాసు లో సీత క్యారెక్టర్ బొడ్డు కూడా చుపించేశా. ఇంకా పాండురంగడు లో అయితే నీ డార్లింగ్ టాబు ను లేటు  వయసు లో ఘాటుగా  చూపించి నాకు నేనే సాటి అని నిరూపించా. 

నాగ్: అర్ధం అయింది ! నీ పైత్యం తో అసలు స్టొరీ ని ముప్పుతిప్పలు పెట్టి ముక్కు పిండేస్తావ్.

RVR: అదే తప్పు ! కమర్షియల్ ఎలిమెంట్స్ అంటారు వాటిని. ఇంకా లవ్ సిన్స్ కోసం మార్కండేయుడికి ఒక ప్రియురాలు సృష్టిస్తాం. వారిద్దరి మధ్య సూపర్ రొమాంటిక్ సాంగ్, నా ట్రేడ్ మార్క్ తో పాలు, తేనే, గంధం ఇంకా పండ్లు! అబ్బో తలచు కుంటే ఈ వయసు లో నాకు ఏంచెయ్యాలో తెలియటం లేదు. ఇంకా ఇద్దరి మద్య సెంటిమెంటు అయితే గుండెలు పిండేస్తుంది. 

నాగ్: ఈ వయసులో మీ ఉషారు చూస్తుంటే, ముసలాడికి దసరా పండుగ అనే సామెత గుర్తొస్తుంది.  కాని అల్పాయుష్కుడు అంటే చిన్న వాడు అనుకుంట కాద. ప్రియురాలు, రొమాన్స్ అంటే బాగుంటుందా. 

RVR: అప్పట్లో చిన్నప్పుడే పెళ్ళి అయిపోయేది కాద. కావాలంటే పాటలో కవర్ చేద్దాం ! "ముక్కు పచ్చలారని బాలిక....... ముగ్గు లోకి దింపుతా రా ఇక" అని సాంగు.

 నాగ్: ఓహో ! ఇది రామదాసు లో "చాలు చాలు చాలు"  అనే పాట కన్నా గొప్పగా తియ్యాలి. నాకు చేసిన అన్యాయం మా వాడికి జరుగటానికి వీల్లేదు.

RVR:  ఇది మాత్రమే కాదు. హీరో తపస్సు చేసుకునే టప్పుడు ఇంద్రుడు పంపినట్లుగా రంభను పంపిస్తాం. అక్కడ మంచి ఐటం సాంగ్. చాన్సులు లేక ఖాళీగా ఉన్నా ఛార్మి నో లేక శ్రియ నో పెట్టి "తప్పస్సు చేసే మన్మథుడా లేచి రా రా  గురుడా" అని  లిరిక్స్.  అబ్బో ఆ విసువల్స్ తలచుకుంటే నాకు మతిపోతోంది.

నాగ్: ఓహో ఈ మధ్య పాటలు కుడా రాస్తున్నారా? పైగా మన్మథుడు అనేది అదిరింది, నా బిరుదు. యంగ్  మన్మథుడు అని  మా వాడికి బిరుదు కుడా ఇచ్చేయచ్చు యుంగ్ రెబెల్ స్టార్ లాగ. ఇంతకూ ఆక్షన్ పార్టు ఎలా కవర్ చేస్తారు.

RVR: సింపుల్ ! యముడికి, మార్కండేయుడికి గొప్ప ఫైట్ సిన్. 

నాగ్: ఏంటి మార్కండేయుడు ఫైట్ కుడా చేస్తాడ. మరి తపస్సు చేస్తాడు అన్నారు !

RVR: అవును నిజమే ! ఒక పని చేద్దాం. తపస్సు చేస్తుంటే మార్కండేయుడి భక్తీ మనిషిగా మారి  యముడి తో ఫైట్ చేసినట్లు చూపిద్దాం. ఆ విధంగా యముడు కి అతనిని చంపటనికి విలు కాదు. అబ్బా భలే కుదిరింది పాయింట్, ఈ వయసు లో కుడా ఇలాంటి కొత్త ఐడియా లు రావటం నాకే సాధ్యం. 

నాగ్: మురిసి పోయింది చాలు. షిరిడి సాయి దెబ్బ ఇంకా మాననే లేదు. మా టీవీ లో ఎంత ఉదారగోట్టిన,  ఎంత మంది తో గొప్ప సినిమా అని చెప్పించిన, సాయి బాబాతో స్టేపులు ఏంటి అంటూ తిప్పి కొట్టారు. ని వేషాలు నాతొ ఆపావ? పాపం బాలయ్యతో పాడురంగాడు లో ఆడవేషం వేయించి సాంతం సన్నాసిని చేశావు. నీ తొక్క లో ఐడియా లు నువ్వు.

RVR: అబ్బా అపు. ఏదో ఒకటి అలా అయిందని ఎప్పుడు అలాగే అవుతుందని అనుకుంటే ఎలా.

నాగ్: సరే సరే. మరి కామెడి ఎలా పండుతుంది ఇందులో. 

RVR: ఎంత అమాయకుడివయ్యా నువ్వు ! అన్నమయ్యలో కామెడి, రామదాసు లో కామెడి అదిరి పోయింది చూసి ఇంకా నీకు ఈ డౌట్స్. ఏముంది చెప్పు ! హీరో కి కొందరు ముని కుమారులు ఫ్రెండ్స్ గా ఉంటారు ! వాళ్ళందరూ బ్రహ్మానందం దగ్గర గురుకులంలో విద్యాబ్యాసం చేస్తూ ఉంటారు. అప్ కామింగ్ కమెడియన్స్ అందరిని పెడుతాం, కావలసినంత కామెడి. 

నాగ్: బాగుంది. మరి కాస్టింగ్ ! శివుడుగా ఎవరు?  యముడిగా ఎవరు?

RVR: శివుడిగా నువ్వు. యముడిగా మన శ్రీహరి. 

నాగ్: నేను శివుడా ! నాకు డాన్సు రాదుగా.

RVR: స్విమింగ్ రాని రంభకు స్విమ్ సూట్ వేసి ఎక్ష్పొసింగ్ చెయ్యించలెదా? డాన్సు రాని రాజశేఖర్ తో అల్లరి ప్రియుడు తియ్యలేదా? ఆక్టింగ్ రాని నీతో అన్నమయ్య తియ్యలేదా? నన్ను తక్కువ అంచనా వెయ్యకు. తిక్క రేగితే మోహన్ బాబు తో స్వామి వివేకానంద తీస్తా. 

నాగ్: కాని నాకు ఓపిక లేదండి. నేను డాన్స్ మానేసి చాల కాలం అయింది. ఇప్పుడు శివతాండవం అంటే. మళ్ళి అంత గ్లామర్ రోల్ కాదు అది. ఇప్పటికే సాయి బాబాతో చాల డామేజ్ జరిగింది నా గ్లామర్ కు, మళ్ళి అంటే చాల కష్టం. 

RVR: ఆలోచించు ! బాగా హెల్ప్ అవుతుంది,  నీకు,  మీ వాడికి.  ఈ వయసులో నాకు కుడా ఒక తృప్తి ఇలాంటి దైవ భక్తీ సినిమాలు తీస్తే. 

నాగ్: భక్తీ కంటే రక్తి ఎక్కువ అనిపిస్తోంది మీ సినిమాలలో. ఆలోచించు కొని చెప్పుతా. లేదంటే ఇంకేవరినయిన పెడుదాం ఆ రోల్ లో.  

RVR: సరే బాగా ఆలోచించు కో ! నీకు నచ్చితే మొదలు పెడుదాం సినిమా.


ఎటు తేల్చుకోలేని నాగార్జున అక్కడి నుండి బయలు దేరి ఇంటి ముఖం పట్టాడు. 

6 వ్యాఖ్యలు:

 1. అరాచకం... కుమ్మేశారు..
  శ్రీయేసుక్రీస్తు రేంజ్ లో ఉంది ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >...... ఆక్టింగ్ రాని నీతో అన్నమయ్య తియ్యలేదా? .....
  తీసారు. జనం ప్రాణం కూడా తీసారు. అన్నమయ్య పరువు తీసారు.
  బ్రహ్మాండంగా ఉంది టపా!

  ప్రత్యుత్తరంతొలగించు