31, జనవరి 2013, గురువారం

కమల్ ! ఏందీ ని గొప్ప !!

విశ్వరూపం సినిమా మిద అలుముకున్న వివాదాల దృష్ట్యా మీడియా వారు ముఖ్యంగా మన టీవీ వారు చేస్తున్న హంగామా వల్లా ఎ ఇద్దరు స్నేహితులు కలిసిన వారి మాటల్లో కాసేపయినా ఆ సినిమా గురించి మరియు కమల్ హసన్ గురించి మాటలు దొర్లటం సహజం. అలాంటి ఒక సన్నివేశాన్ని ఉహించి రాసిన ఓ ఇద్దరి స్నేహితుల సంభాషణ. ఒకతని పేరు యాదగిరి మరో అతని పేరు లింగం. యాదగిరికి మసాలా సినిమాలు అంటే ఇష్టం కాని లింగం కు మంచి సినిమాలు చూసే అలవాటు.

యాదగిరి: ఏంది  మామ ఏడికి పోలే ?  ఇట్లచినావ్ !

లింగం: అంటే ! ఇదేమన్న నీ ఇళ్ళ సాలె? కేప్ కి వచ్చి ఏదో దమ్ము కొట్టి టీ తాగుదామని నేనస్తే.

యాదగిరి: ఎయ్ అపురా బై ! ఏదో అడిగితె అట్లా సీరియస్ అయిపోతావ్ ఏందీ?  సరే గాని చాయ్ చెప్పు నేను సిగరెట్ తెస్తా.

లింగం: నాకు ఒక్క సిగరెట్ కావాలి షేరింగ్ మనతోని కాదు. నువ్వు అసలే దాన్ని చికి చికి తాగుతావ్. 

యాదగిరి: అరేయ్ నితోని ఏది పెట్టుకోవద్దు రా బై. అసలే పైసలు లేక సినిమా కు కూడా పోవుడు అవుతలెదు నీకు సెపరేట్ సిగరెట్ కావాల్న. 

లింగం: సినిమా కు పోలేదని ఏడుసుడు ఏందిరా ! ఏదో అన్నం తినలేదన్నట్లు. అయినా అంత గొప్ప సినిమాలు ఏమున్నాయి ఇప్పుడు !

యాదగిరి: నాయక్, సీతమ్మా వాకిట్లో సిరి మల్లె చెట్టు. కతర్నాక్ సినిమాలు.

లింగం: మొన్ననే సంక్రాంతికి చుసినావ్ కదరా ! మల్లి ఎందుకు?

యాదగిరి: అంటే ఒక్కసారి చూసి ఊరుకుంటారా ! కనీసం మూడు సార్లు చూడక పొతే నాకు అర్ధం కాదురా బై.

లింగం: విశ్వరూపం పోదాం రా బై. బాగుంటది. 

యాదగిరి: వామ్మో ! అయినా సినిమాలు చూసుడు మనతోని కాదురా బై. ఏందీ రా బై గట్ల తీస్తాడు అంత వైరేటి వెరైటి. 

లింగం: అంటే నీకు వెరైటి సినిమా నచ్చద?

యాదగిరి: ఎ అట్లా కాదురా బై ! ఏంటో హీరో అంటే పది మందిని కొట్టల్ర బై. ఎప్పుడు చూడు తన్నులు తింటాడు.

లింగం: సినిమా కోసం  రియల్ స్టంట్ లు చేస్తుంటే ఇంతవరకు కమల్ హసన్ కు ఎన్ని ఆక్సిడెంటు లు అయ్యయో నీకు తెలుసా? అవ్వే స్టంట్ లు జాకిచాన్ చేస్తే చూస్తావ్. రియాల్టీ ఫైట్ లు పెట్టి హీరో తప్పించు కొనే టప్పుడు కమల్ చేసే రియల్  స్టంట్ లు నీలాంటి వాడికి కనిపించవు. 

యాదగిరి: అది కాదురా బై అసలు కామేడినే ఉండదు అయన సినిమాల్ల.

లింగం: సతి లీలావతి, బ్రహ్మచారి సినిమా చూసినవ? పంచతంత్రం మొన్న టీవీ లో వస్తుంటే పడి పడి నవ్వినావ్ కదరా?

యాదగిరి: డాన్స్ ఉంటాద  అయన సినిమాల? వేరే వాళ్ళు  చూడు ఎంత బాగా డాన్సు చేస్తారో.

లింగం: సాగర  సంగమం చూసినావా? అంతకు మించిన డాన్సు ఇంకేదయినా ఉందా !

యాదగిరి: హీరోయిన్ లను బాగా నలిపెస్తాడు రా బై.

లింగం: పిచ్చి నా కొడుకా. బొడ్డు మిద తేనే పోసి, పండ్లు ఎసి  అవసరం లేక పోయినా స్విమ్ సూట్ వేయించి ఎక్ష్పొసింగ్ చేయిస్తే లేని తప్పు కథ ప్రకారం హీరోయిన్ ను ముద్దు పెట్టుకుంటే తప్పా?  అంతకు మించిన సిన్ లు భయట చేస్తున్నారు పబ్లిక్ లో. 

యాదగిరి: ఏమయినా కమల్ కు హీరోయిజం రాదురా. ఏదో ఆక్టింగ్ చేసుకుంటూ నెట్టు కోస్తాడు.

లింగం: ఒరేయ్ విచిత్ర సహోదరులు సినిమాలో పొట్టి కమల్ హసన్ చేసే హీరోయిజం ను మించిన హీరోయిజం ఒక్కటి చెప్పు రా.  ఇప్పటికి ఆ పొట్టి క్యారెక్టర్ ఎలా చేసారో నూటికి 97 మందికి తెలియదు రా. కాని కమల్ దాన్ని చేసి చూపించాడు. 

యాదగిరి: చాల్లేరా ! అయన ఎలా చేస్తే మనకెందుకు. అసలు సెంటిమెంట్, కామెడి, ఆక్షన్, లవ్  అన్ని ఉన్నా ఒక్క సినిమా చెప్పు కమల్ ది. 

లింగం: వసంత కోకిల, ఇంద్రుడు చంద్రుడు , స్వాతిముత్యం,  గుణ, ద్రోహి  ఇంకా నాకు పేర్లు గుర్తుకు రావటం లేదు. ఒరేయ్ కమల్ హసన్ సినిమా తీస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటది రా.

యాదగిరి: ఎప్పుడు అన్ని ఏడుపు గొట్టు సినిమాలు తీస్తాడు. గాంది మిద విమర్శిస్తూ తీసిండు హే రామ్ అని చెప్పి.  అబ్బో అందులో ఇద్దరి హీరోయిన్ లను ఆడుకున్నాడు.

లింగం:  అరేయ్  ఆ టైం ల గాంధిని ఎంత గా ఇష్ట పడ్డారో అంతే  ద్వేషించిండ్రు. దాన్నే అయన చుపెట్టిండు,  స్టొరీ ప్రకారం సెక్స్ సిన్ లు అవసరం కాబట్టి తీసిండు,  అంతే కాని ఏదో వాళ్ళను అనుభవించాలని కాదు రా.  కక్కుర్తి వెధవ !  అందరు నీలాగే ఉండరు. 

యాదగిరి: నువ్వు ఎన్నయినా చెప్పు రా బై, నాకు అయన సినిమాలు నచ్చాయి.  ఆ నాయకుడు తీసుకో  అంత పవర్ ఫుల్ హీరో లాస్ట్ కి అట్లా చచ్చి పోతాడు. అదే వేరే వాళ్ళు తీస్తే సూపర్ ఎండింగ్ ఉంటాది అందరిని చంపేసి మంచి గా సెటిల్ అయినట్లు. 

లింగం: ఒరేయ్ ఆ సినిమా కోసం కమల్ హసన్ జుట్టు పికించు కున్నాడు మొదల్ల నుంచి. గికితే బట్ట తల లాగ కనిపించదని. ఒక్క సినిమా కోసం ఎవరయినా జుట్టు పికేసు కుంటార? నువ్వు దుమ్ము లోకి రమ్మంటేనే జుట్టు కరాబ్ అయితది రా బై అంటావ్. తప్పు దారిలో వెళ్ళిన వాళ్ళు అలాగే ముగిసి పోతారు అని చుపించిండు. 

యాదగిరి: ఒక్క సుఖాంతం అయినా సినిమా చెప్పురా కమల్ హసన్ ది. 

లింగం: మైకేల్ మదన కామా రాజు. నాలుగు కారెక్టర్ లు అసలు ఒక్కదానికి ఒక్కటి పోలికనే ఉండాది. చూసినవ ఆ ఆక్టింగ్, అసలు ఎం కామెడి ఉంటాది అండ్ల.

యాదగిరి: వట్టి మేకప్ తప్ప ఏముంటది రా బై అయన సినిమాల్ల !

లింగం: ఓహో మేకప్ ఏసుకొని నువ్వు చెయ్ రా ! భామనే సత్య భామనే. 50 ఏండ్ల ముసలావిడా క్యారెక్టర్ అట్లనే భారతీయుడు ముసలి క్యారెక్టర్.

యాదగిరి: అదయితే ఒప్పుకుంట రా బై. అసలు దశావతారం చూసినప్పుడు, ఒక్కోడే ఇన్ని కారెక్టర్ లు చేసుడు గ్రేట్ అనిపిచింది. 

 లింగం: కమల్ మస్త్ డైరెక్టర్ కూడా రా బై. అసలు పోతురాజు సినిమా భలే ఉంటది రా.

యాదగిరి: మన్మధ బాణం ! అసలు ఎం  సినిమా రా బై అది.  కమల్,  మాదవన్ ఇద్దరు ఉంటారు. దిమాక్ కరాబ్ అయింది.

లింగం: అదేదో  అనుకున్నారు మంచి గా రాలేదు. ఆ ఇద్దరిదే సత్యమే శివం చూసినావా ! ముందు అది చూసి మాట్లాడు. అభయ్ చూసినావా అసలు రెండు కారెక్టర్ లకు ఎంత తేడా ఉంటాది, లుక్ లో.  ఒక్క కారెక్టర్ బక్కగా ఒంకోటి మస్త్  బాడి బిల్డింగ్,  గ్రాపిక్స్ కాదు ! నిజంగానే పెంచిండు బాడి.  కాని ప్లాప్ అయ్యింది   అట్లని  కమల్  గొప్ప కాదంటే ఎట్లా రా బై.

యాదగిరి: నిజమే మామ కాని అయినా సినిమాలు పెద్దగా హిట్ కావు రా.

లింగం: ఎందుకు అవుతాయి రా ! నీలాంటి మసాలా సినిమాలు చూసేటొల్లు ఉంటె. అరేయ్ సినిమా హిట్ కాక పోవచ్చు కాని కమల్ హసన్ ఎప్పుడు ఫెయిల్ గాలే.

యాదగిరి: కానీ విశ్వరూపం బ్యాన్ చేసిండ్రు అంట గదరా ! ఏవో సెక్యూరిటీ ప్రాబ్లంస్ అంట.

లింగం: ఈ మద్య సినిమాల మిద బ్యాన్ లు పెట్టుడు గొడవలు చేసుడు కామన్ అయిపొయింది. అసలు ఏదో కారెక్టర్ పెడితే యిలకు ఏందో నొప్పి. తెలుగు లో రిలీస్ అయ్యింది కదా ! మరి సెక్యూరిటీ ప్రాబ్లం అచ్చిన్దా? అంత పాలిటిక్స్ రా బై.

యాదగిరి: నిజమే మామ. అరె కడలి సినిమా మిద కూడా ఏదో లేసింది కంట్రవర్సి. అదయితే ఘోరం మామ, 17 ఏండ్ల హీరోయిన్ తో ముద్దు సిన్ లు తిస్తావా? అసలు యువత యెమయితది అంటుండ్రు. అసలు దిమ్మాక్ ఉందా రా బై ఇలకు.

లింగం: స్కూలు పిల్లలు కడుపు తెచ్చుకుంటే లేదు గాని ఆయనేదో పాపం సినిమా దిస్తే సుడకుండానే యిల్లు మొదలు పెటిండ్రా !

యాదగిరి: కాని కమల్ హసన్ ది మాత్రం ఘోరం మామ ! అంత గొప్ప నటుడికి ఇంత అన్యాయం తప్పు రా.

లింగం: అంత అమ్మ మహిమ రా. ఆమె సినిమాల్ల చేసి CM అయ్యింది ఇప్పుడు సినిమోల్లనే ఇట్లా టార్చర్ పెడుతుంది.

యాదగిరి: మామ విశ్వరూపం  సినిమాకు పోతుంటిమి గాని పైసలు లేవు రా.

లింగం: నేను తీసుక పోత పా !

యాదగిరి: ఏందీ ! సినిమా కు అంటే పైసలు పెట్ట అంటావు నువ్వు తీసుక పోతవ? ఇయ్యాల సెలవు ఇగ.

లింగం: అపుబే ! లత్కోరు సినిమాలకు పెట్టగాన్ని మంచి సినిమాలకు ఎందుకు పెట్ట. ఎన్ని సినిమాలు చూపించిన రా బై నీకు. అన్ని మంచి సినిమాలే మల్ల.

యాదగిరి: ఎ.....జోక్ చేసిన మామ ! పుసుకున్న ఫీల్ అయి పోతావ్.

కమల్ హసన్ తీసిన సినిమాలు అన్ని గొప్పవి అని చెప్పటం లేదు, కాని సినిమా కోసం ప్రాణం కూడా పంనంగా పెట్టె ఇలాంటి కళాకారులకు అకారణంగా అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక నాకున్న కొద్ది పాటి పద జాలంతో, కొద్ది పాటి జ్ఞానంతో చంద్రుడికి ఓ నూలు పోగులా ఇది రాసాను. అంతే కాని ఎవరిని కించ పరచాలని, తక్కువ చెయ్యాలని మాత్రం కాదు.


18, జనవరి 2013, శుక్రవారం

నాయక్ స్టొరీ డిస్కషన్ (హాస్యం)

(కామెడి అనుకుని రాసా. నచ్చితే నవ్వుకోండి, నచ్చక పొతే తిట్టి పొండి)

బద్రీనాథ్ తో డిలా పడ్డ వినాయక్ ఈ సారి ఎలాగయినా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యి అన్నయ్య చిరంజీవి తో తియ్యలనుకుంటే ఆయనేమో మంత్రిగా మారి తన కొడుకు చరణ్ తో తియ్యమని సూచించడంతో స్టొరీ వండి అందరికి వడ్డించటానికి రెడీ అయిపోయాడు.

వినాయక్: అన్నయ్య చరణ్ బాబు కోసం సూపర్ స్టొరీ రాయించా. కామెడి, ఆక్షన్ అదిరి పోతుంది.

చిరు: ఆక్షన్ అంటే తాళ్ళు అది కట్టించి మేనేజ్ చేయ్యోచు గాని కామెడీ విడు చేస్తాడు అంటావ?

వినాయక్: బాబు జస్ట్ ఆక్షన్ చేస్తాడు. మిగత వాళ్ళు కామెడీ చేస్తారు. ఇంకా స్టొరీ లో సూపర్ ట్విస్ట్ ఉంటుంది, అది ఇంటర్వెల్ వరకు చెప్పం.

అరవింద్: కొంప దిసి గంటన్నర వెయిట్ చెయ్యమంటావా ఏంటి !

చిరు: బావ నికన్ని మామయ్య పోలికాలు వచ్చాయి. కామెడి లో.

బన్ని: మాక్కూడా అవే పోలికాలు అంటూ ఎగతాళి చేస్తున్నారు డాడి  అందరు.

అరవింద్: లక్షలు లక్షలు పోసి సర్జరీ లు చేయించం కదరా. ఇంకా ఏడు పెందుకు.

చరణ్: ఎయ్ ఆపండి. ఇప్పుడు మన సర్జరీ ల గొడవెందుకు. ముందు స్టొరీ చెప్పండి వినాయక్  బాబాయి.

వినాయక్: సింపుల్ బాబు. నా ముందు సినిమా కృష్ణ తో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. రాజమౌళి  సింహాద్రి సినిమాతో సెకండ్ హాఫ్ అయి పోతుంది. మళ్ళి  నా అదుర్స్ సినిమాతో క్లైమాక్స్ అయిపోతుంది.

పవన్: మరింకా నువ్వు తిసేదేంటి మళ్ళి. ఈ స్టొరీ లో ఫీల్ లేదన్నయ్య.

చిరు: తమ్ముడు ఒక్కసారి డైరెక్టర్ చెప్పేది వినురా. ఎప్పుడు వాళ్ళ పనిలో వేలు పెట్టడం కాదు.

పవన్: నేను వేలు పెడితేనే బద్రి హిట్టయింది. ఖుషి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.

నాగబాబు: ఆ తర్వాత నీ బాక్స్ బద్దలయింది. జానీ,  గుడుంబా శంకర్ తో.

చిరు: ఒరేయ్ ఎప్పుడు మీరిలా కొట్టుకో బట్టే మీడియా మన కుటుంబం విడి పోయింది అని రాస్తుంది. ముందు స్టొరీ వినండ్ర.

వినాయక్: పవన్ గారి తో నేను ఏకిభవిస్తున్నాను. స్టొరీ  కొత్తగా ఎం లేదు అనిపిస్తుంది. అందుకే నేను కొత్త ఆలోచనతో వచ్చా ఈ సారి.

చిరు: ఓరి ని నువ్వు నేర్చు కున్నావ్ ఉరించటం సోనియా గాంధీ లాగ. కాని నాకు ఓపిక లేదురా, ఇప్పటికే విసుగ్గెతి పోయాను మంత్రి పదవి కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి.

వినాయక్: కొత్త పాయింట్ ఏంటంటే,  బాబు డబల్ ఆక్షన్ చేస్తాడు ఇందులో.

చిరు: ఏంటి వినాయక్ మైండ్ గాని దొబ్బింద నీకు? ఒక్క రోల్ చెయ్యటానికే  నన్ను ఇమిటేట్ చేస్తుంటే !  మళ్ళి డబల్ రోల్ అంటావు.

వినాయక్: అన్నయ్య ! బాబు కు నీ తర్వాత ని అంత వాణ్ణి, నాకు తెలియదా తన కెపాసిటీ. అసలు బాబు కష్ట పడకుండా స్టొరీ లోనే గొప్ప మెలిక పెడుతాం.

చరణ్: అమ్మయ్యా బతికించవ్ బాబాయి. చాల భయపడి పోయాను వినగానే.

వినాయక్: నువ్వు హాయిగా ఉండు నాన్న. ఏంటంటే బాబు ఇద్దరి గా వచ్చి విలన్ ను కాన్ప్యుస్ చేస్తాడు. ఎవరు  ఎవరో తెలియక విలన్ తల పట్టుకుంటాడు.

చిరు: అబ్బా మొదటి సారి బుర్ర పెట్టావ్ రా.  అదిరింది పాయింట్.

వినాయక్: థాంక్స్ అన్నయ్య. ఇంకా బాబు చెయ్యాల్సిందల్ల రెండు క్యారెక్టర్ లకు రెడీ అయిపోవడమే.

చరణ్: మళ్ళి రెడీ అయిపోవటమేంటి.  ఇప్పుడే కాదా నేనేం చెయ్యనవసరం లేదు అన్నావ్?

వినాయక్: అబ్బా టెన్షన్ పడకు నాన్న. నువ్వు కనీసం హెయిర్ స్టైల్ కూడా మార్చ నవసరం లేదు, ఆఖరికి మాట్లాడే విదానం కూడా మార్చనవసరం లేదు.

పవన్: మరి రెండు క్యారెక్టర్స్ అని ఎలా తెలుస్తుంది.

వినాయక్: సింపుల్ ! ఒక క్యారెక్టర్ ఇన్ షర్టు చేసుకుంటుంది. రెండో క్యారెక్టర్ చేసుకోదు. ఇంకా డ్రెసింగ్ లో కుడా చాల తేడా చూపిస్తాం.

బన్ని: చూశావ డాడి మామయ్య కేర్. నాకెప్పుడ యిన ఇలాంటి స్టొరీ తెచ్చావ.

అరవింద్: కోట్లు పోసి బద్రీనాథ్ తీస్తే ఎం చేసావ్.

వినాయక్: అరవింద్  బావ ! బద్రీనాథ్ బాధ నుండి బయట పడి ఇప్పుడే ఈ   సినిమా కు రెడీ అయిపోయాను. మళ్ళి  నన్ను కుంగదియాకు. చెప్పు అన్నయ్య.

చిరు: బావ గతం వదిలేయ్. అందరు రాజమౌళి లాగ తిస్తారనుకుంటే ఎలా. మనోడు ఏదో సుమో లు లేపి,  కామెడి చేసి మన వాళ్ళకు కష్టం కలుగ కుండా హిట్ ఇస్తాడు. నువ్వేమో అతిగా ఉహించి డబ్బులు పోయాయి అంటే ఎలా.

పవన్: ఒరేయ్ ఎన్నాళ్ళు తీస్తా ర్రా ?  ఇవే సినిమాలు ! ఇంకా మారార?

చరణ్: సర్లే బాబాయి ! నువ్వు మాత్రం  బాలు సినిమా రెండు సార్లు తియ్యలేదా పంజా అని చెప్పి. ఇంకా ప్రతి సినిమాలో మెడ మిద చేతితో మసాజ్ చెసుకుంటావ్ పైట్ సిన్ లో. మేమేమన్న అన్నామ మర్చుమని.

పవన్: అది కాదు చరణ్, స్టోరి లో క్లారిటీ లేదు. ఇద్దరు ఒక్కేలగా ఉన్నప్పుడు ఆ ఇద్దరికి ఎక్కడో లింక్ ఉండాలి కాద.

వినాయక్: అక్కర లేదండి. మనకు ఒక్క ఓల్డ్ నమ్మకం ఉంది చూశార. మనుషులను పోలిన మనుష్యులు ఏడుగురు ఉంటారు అని,  ఇక్కడ అదే వాడుతం.

బన్నీ: అదిరింది వినాయక్ మాయ్య. మాస్ లో నిన్ను మించినోడు లేడు.

వినాయక్: థాంక్స్ బాబు. అన్నయ్య ఇంకా అక్కడకడ పొలిటికల్ డైలాగ్స్ పడుతాయి, మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి హీరోయిజం ఎలివేట్ అయ్యేలాగా పంచ్ డైలాగ్స్.

చిరు: వావ్ ! నా కొడుకుకు అప్పుడే పంచ్ డైలాగులు. నాకు 50 సినిమాలు చేస్తేగాని రాలేదు పంచ్ డైలాగ్ కొట్టే చాన్స్. మచ్చుకు ఒక్కటి చెప్పావ?

వినాయక్: నేను ఏదయినా ఒక్కసారే చెపుతా ! రెండో సారి చంపేస్తా.

పవన్: అంటే ! ఎవడయినా చెవిటి వాడు మళ్ళి అడిగితె చంపేస్తారా? నాకు ఎక్కడో కొడుతుంది అన్నయ్య.

చిరు: పవన్ ! నేను మాస్ హీరో గా చెపుతున్నాను. ఇలాంటివి సినిమాకు అవసరం.

వినాయక్: ఇంకోటి అన్నయ్య, స్థలాని బట్టి మారటానికి ఇది క్లైమేట్ కాదు కరేజ్.

నాగబాబు: అన్నయ్య ఏంటి ఈ డైలాగ్ ! నిన్ను టార్గెట్ చేసి పెట్టినట్లు ఉంది.

చిరు: ఏంటి నాగబాబు ! ఈ డైలాగ్ కు నాకు సంబందం ఏంటి.

నాగబాబు: మరదే అన్నయ్య అన్ని చెప్పాలి నీకు. నువ్వు ఇప్పుడు తెలంగాణా లో అడుగు పెట్టగలవా? అంటే ఏరియాను బట్టి ని కరేజ్ మారింది కద?

చిరు: కంటిలో నలుసు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ అని ఉరికే అనలెదురా.

పవన్: ఇంతకూ ఎవరు ! ఏమిటో?

చిరు: నువ్వు మాత్రం కంటి లో నలుసు రా. నాగబాబు  చెప్పులో రాయి, ఈ నా బామ్మర్ది గాడు చెవిలో జోరీగ. చెప్పి చెప్పి రాజకియలోకి ఆ తర్వాత కాంగ్రేసు లోకి తెచ్చి పడేసాడు.

వినాయక్: అన్నయ్య మనం అనవసరంగా టాపిక్ దాటేస్తునం. సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండాలి. ఎవరో సెలెక్ట్ చెయ్.

చిరు: ఇంకెవరు మగదిర తో మనోడికి రికార్డు బ్రేక్ ఇచ్చిన కాజల్. ఇంకో అమ్మాయి ని  చరణ్ సెలెక్ట్ చేస్తాడు. పాపం వాడి సినిమా కాద. కనీసం ఒక హీరోయిన్ ను అయినా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వక పొతే మళ్ళి ఫీల్ అవుతాడు.

చరణ్: నేను ఉపసనాను అడిగి చెపుతా డాడి.

చిరు: వద్దులే అర్ధం అయిపొయింది. వినాయక్ నువ్వే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చెయ్యి. పిల్ల బాగుండాలి కాని హైట్ ఉండకూడదు.

వినాయక్: నాకు తెలియదా అన్నయ్య. వయసు అయిపోయిన నీతోనే టాగూర్ సినిమా పెద్ద హిట్ చేసిన వాణ్ణి ఎప్పటికయినా నీ 150 వ సినిమా డైరెక్ట్ చేసే వాణ్ణి.

చిరు: ముందు దిన్ని హిట్ చెయ్. నా సినిమా తరువాత చూద్దాం. ఇప్పుడు తీస్తే హిట్ అవుతుందో లేదో తేలిక నేను తీయాల వద్ద అని ఆలోచిస్తుంటే మళ్ళి డైరెక్షన్ అంటూ నా ప్రాణం తీస్తాడు.

అరవింద్: మ్యూజిక్ ఎవరు పెడుదాం ?

చిరు: మంచి ఫాం లో ఉన్నోడు ఎవరు. నా ఉద్దేశ్యం మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు కాదు, ఎవరి సినిమాలు బాగా హిట్ అవుతున్నాయ్ అని.

వినాయక్: నీ ఉద్దేశ్యం అర్ధం అయింది లే అన్నయ్య, నువ్వు మళ్ళి చెప్పల ! థమన్ మంచి పామ్ లో ఉన్నాడు. ఉరికే శవాల దగ్గర డప్పులు వాయించినట్లు, లేదా అన్ని కాపి కొడుతూ పాటలు ఇస్తాడు. కాని సినిమా సూపర్ హిట్ అయి పోతుంది.

అరవింద్: థమన్ నాకు ఒకే బావ.

చరణ్: అన్ని మిరే ఒకే చేస్తే మరి నేనేం ఓకే చెయ్యను?

చిరు: నీ తెలివి ఈ మధ్యే  తెలిసి పోయింది. ఇంకా నువ్వు మూసుకో. వినాయక్ మ్యూజిక్ లో మంచి కిక్క్ ఉండాలంటే నా పాటొకటి రీమేక్ చేయించు.

చరణ్: డాడి ! నాకు నచ్చిన పాట, రగులుతోంది మొగలి పొద.

చిరు: అబ్బా ! ఈ పాట పేరు తో కాజల్ తో కస బిస గుస గుస అనుకుంటున్నవ ! కాని ఈ స్టొరీ కి అది సూట్  కాదు  నాన్న.  కొండవీటి దొంగ లో శుభలేఖ  రాసుకున్న.

వినాయక్: అదిరింది అన్నయ్య. వాడు చెడ గొట్టిన పర్వాలేదు దిన్ని పెట్టాల్సిందే.

చిరు: మరికేం. అందరికి ఓకే కాద.

పవన్: స్టొరీ లో కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయి అన్నయ్య.

చిరు: పవన్ లాజిక్ లు తీసి ఎన్ని సినిమాలు పోగొటుకున్న నీకు బుద్ది రాదా. ఎన్ని సినిమాలు ! పోకిరి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. నీకు తెలిసిన లాజిక్ ఒక్కటే,  రీమేక్ చేసి హిట్ కొట్టడం. అంతే మాట్లాడు, ఎక్కువద్దు.

చరణ్: అబ్బాబ !  ఈ స్టొరీ సెలక్షన్ అంటే చాలు ఒక్కటే తల నొప్పి.  చాల థాంక్స్ వినయాక్ బాబాయి మంచి స్టొరీ వినిపించారు. ఈ సినిమా మనం చేస్తున్నాం.

వినాయక్: నాన్న గారు చెప్పారు బాబు. అన్ని అయన చూసుకుంటారు,  మీరు వెళ్లి  రెస్ట్ తీసుకోండి.


ఆ రకంగా నాయక్ సినిమా మన మిద దాడి చేసింది. దాన్ని చూసేటప్పుడు మీకు కృష్ణ సినిమాలో కామెడి, సింహాద్రి సినిమాలో ఫ్లాష్ బాక్ ఇంకా అదుర్స్ సినిమాలో క్లైమాక్స్ గుర్తుకొస్తే మీ బుర్ర బాగా పనిచేస్తున్నట్లు లెక్క. ఇంకా నరకటం, రక్తం ఎరులాయి పారటం, కొడితే మనిషి ఆకాశం లో పల్టీలు కొట్టడం మాస్ సినిమాలో మాములే అనుకోవటం మనకు ఎప్పుడో అలవాటు అయిపొయింది.16, జనవరి 2013, బుధవారం

మల్టీ స్టార్ సందడి (హాస్యం) -2

(మొదటి బాగానికి వచ్చిన ప్రోత్సాహంతో రెండో భాగం  రాసే దైర్యం చేశాను.  చదవమని కోరుకుంటున్నాను.) 


ముసలి రెబెల్ స్టార్ మరియు యంగ్ రెబెల్ స్టార్ ఇద్దరు మాట్లాడు కుంటున్నారు ఎక్కడో.....

KRJ: బాబు ప్రబాస్, ఏంట్రా వీళ్ళు ఇప్పుడేదో కొత్తగా మల్టీ స్టార్ అంటూ మొదలు పెట్టారు. నేను ఎన్ని తీసాను ! కృష్ణ తో, శోబన్ బాబు తో, బాలయ్యతో సుల్తాన్. ఇంకా ఇప్పటికి చేస్తూనే ఉన్నాను.

ప్రబాస్: ఇప్పుడు ఎం చేశావ్ పెద్ద నాన్న.

KRJ: అప్పుడే మర్చి పోయావ? మనిద్దరం కలిసి స్క్రీన్ షేక్ చేశాం. బిల్లా సినిమాతో.

ప్రబాస్: ఓ అదా ! అదెలా మార్చి పోతాను పెద నాన్న. నువ్విచ్చిన షాక్ కి ఆడియన్స్ అదిరి పోయి పారిపోయారు.  ఏదో అనుష్కకు కోటి ఇచ్చి బికినీ వేయించం కాబట్టి సరి పోయింది. లేదంటే అంతంత మాత్రం ఉన్న సినిమా సాంతం అడుగంటి పోయేది. 

KRJ: అదేంట్రా అల అంటావ్ ! మొన్నటికి మొన్న రెబల్ తో కలెక్షన్స్ కొల్లగోట్టం. ని ఫాన్స్ అందరు నా ఫాన్స్ గా మారి పోయారు.

ప్రబాస్: ఏంటి నా ఫాన్స్ ని ఫాన్స్ అయ్యారా? కలెక్షన్స్ కొల్ల గొట్టమ? ఆ లారెన్స్ గాడి దెబ్బకు ప్రొడ్యూసర్స్ విదిన పడ్డారు. నేను ఏదో మాస్ సినిమా తియ్యర అంటే వాడు ఏకంగా మాస్ సినిమానే మళ్ళి తీసాడు. అందులో పెద్ద నాన్న డార్లింగ్.....నిన్ను చూస్తుంటే ఎవడికయినా ప్యాన్ అవ్వాలనిపిస్తుందా?   ని పిచ్చి గాని.

KRJ: ఫీల్ అవ్వకు రా నా ఫాన్స్ నీ ఫాన్స్ అవ్వలేదా నువ్వోచ్చిన కొత్తలో. ఇది అలాగే.  నేను థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను కదా.

ప్రబాస్: నువ్వు ఎన్నయినా మొదలు పెట్టుకో. కాని నాతొ లింక్ మాత్రం పెట్టుకోకు.

KRJ: నాయాల్ది ! నన్నే కదనేంత మొనగాడివా? నేను రెబల్ స్టార్ ను రా. నా పేరు పెట్టుకుని నువ్వోచ్చావ్.

ప్రబాస్: పేరు పెట్టుకునంత మాత్రాన జీవితాంతం ఇలా నన్ను పిడించాలా.

KRJ: సరే రా ఇంకొక్కటి చేద్దాం ఇద్దరం కలిసి.

ప్రబాస్: చాలు ! ఇకా చాలు. అసలే రాజమౌళి సినిమా ఎన్నాళ్ళకు పూర్తీ చేస్తాడో,  వయసు దాటి ముదురు బెండకాయ ల తయారు అవుతున్నానని నేను బాదపడుతుంటే మళ్ళి ని టార్చర్ ఒక్కటి. ఈ ముదురు వయసు లో నేను రెబల్ అని కొట్టుకోక పొతే ఓ మూల కుర్చోవచ్చు కాద. ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాం.

KRJ: రెబల్ అంటే రెస్పెక్ట్ కాదు రా భయం పుడుతుంది. అవతలి వాడికి.

ప్రబాస్: మేము అదే కదా చెపుతున్నాం. నువ్వు ఉన్నవంటేనే థియేటర్ లోకి ఎవడు రావటం లేదు భయం తో.

KRJ: మల్టీ స్టార్ సినిమాలు కెరీర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు చేసిన ఏకైక హీరో ఈ కృష్ణంరాజు.

ప్రబాస్: విలన్ గా వేసి తర్వాత బావ, తాత క్యారెక్టర్ లకు మల్టీ స్టార్ అంటే కెమెరాలు పగిలి పోతాయి, లైట్లు మాడిపోతాయి, తెరలు చినిగి పోతాయి.  ఇంకోక్కసారి ఎవడన్న మల్టీ స్టార్ అంటూ వస్తే.......

కృష్ణంరాజు భయపడుతూ పరుగులు పెట్టాడు. 

దగ్గుపాటి వారి ఇంట్లో బోజనాలు చేస్తూ సినిమా ముచ్చట్లు.........

నాయుడు: మొత్తానికి సినిమా మంచి హిట్ అయ్యింది కదరా. ఏమయినా దిల్ రాజు లక్కి ఫెలో. నేను అలాగే అన్ని సెన్సేషన్ సినిమాలు తిస్తుంటా.

సురేష్: తిస్తుంటా కాదు నాన్న. తిసేవాడిని. ఇప్పుడు నువ్వు ఏది తీసిన ఎవడికి తెలియదు, రెండో రోజుకే లేపెస్తారు బొమ్మ. ఏదో థియేటర్లు మన చేతిలో ఉన్నాయి కాబట్టి సరి పోయింది.

రానా: తాత నన్ను పెట్టి ఒక బాలివుడ్ మూవీ తియ్యు. అప్పుడు ఉంటుంది మాజా.

వెంకి: నిజమే రా హిరోయిన్ తో  మాజా నీకు. బొచ్చె మాకు. ఒరేయ్ నీ మొహానికి ప్లే బాయ్ ఇమేజ్ అవసరమా?

రానా: వాళ్ళు నా వెంట పడుతుంటే నేనేం చెయ్యాలి బాబాయ్. బిపాసా, శ్రియ, త్రిష ఇంకా ఇలియానా. అబ్బో పెద్ద లిస్టు.

వెంకి: ఈ ముదురు వాళ్ళు తప్ప నీకు ఎవరు పడరు రా? పిచ్చి సనాసి. వాళ్ళకు సినిమాలు రావటం లేదు, టచ్ లో ఉంటె ఎప్పుడయినా విన్ని  గోకోచ్చు అని లైన్ లో పెడుతుంటే విడు  ఏదో ప్లే బాయ్ లాగ ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య చెప్పు ఈడికి.

రానా: బాబాయి ఇందాకే చరణ్ ఫోన్ చేశాడు. మహేష్ టీవీ లో SVSC మల్టీ స్టార్ కాదు అన్నాడంట. ఎంత ఘోరం బాబాయి.

వెంకి: కాదు మరి.  ఉన్న స్టార్ ను నేనే కదా.

సురేష్: ఏమయినా చిన్నోడా ని కాన్ఫిడెన్సు నాకు లేకే ప్రొడ్యూసర్ అయ్యాను. నువ్వు హీరో అయ్యావ్. మన ఫ్యామిలిలో నువ్వేరా అంత కాన్ఫిడెన్సు.

రానా: డాడి నన్ను మర్చి పోత్తున్నావ్. ఏం తాత?

నాయుడు: నిజమే రా ! ని మిద నీకు ఉన్నా కాన్ఫిడెన్సు మాకు ని మిద రావటం లేదు. అందుకే ఇంతవరకు సొంత బ్యానర్ లో సినిమా తీసే సాహసం చేయలేక పోయా.

రానా: చాల్లే నిదో బ్యానరు మళ్ళి సినిమా. అమెరికా అని చెప్పి హైటెక్ సిటి లో తిస్తావ్, సిరియల్ మొహలని పెట్టి కాస్టింగ్ కంప్లీట్ చేస్తావ్. తాత నీ అతి పెద్ద బడ్జెట్ మూవీ  చెప్పు.

నాయుడు: దేవత సినిమా. అందులో రెండు లారీలు బిందెలు వాడాడు రాఘవేంద్ర రావు. తర్వాత అమ్మ లేక నేను చచ్చాను. సినిమా చుస్తే బిందె ఫ్రీ అంటూ స్కీములు పెట్టి హిట్ చేశాం దాన్ని.

రానా: తాత నువ్వు ఎన్నో మల్టీ స్టార్ లు తిసావు కాద.  మరి బాబాయి తో ఎందుకు తియ్యలేదు.

వెంకి:  ఈ విక్టరి ఎవరి మిద అదార పడడు. నేనే తీసాను మల్టీ స్టార్ సినిమాలు. కొండపల్లి రాజ సుమన్ తో, పోకిరి రాజ అలీ తో.

 రానా: అలీ తో మల్టీ స్టార్ ఏంటి బాబాయి.

వెంకి: అప్పుడు అలీ మంచి పామ్ లో ఉన్నాడు హీరో గా.

సురేష్: ఇంకోటి మర్చిపోయావ్ చిన్నోడా. ఈనాడు కమల్ తో.

వెంకి: పెద్దోడా ! నేను ఎంత మర్చిపోదమనుకున్న పుండు మిద కారం చల్లి నట్లు ఎందుకు రా గుర్తు చేస్తావ్.  అవును  ! ఆ సినిమా కనీసం విడుదల అయ్యింది అన్న సంగతి కూడా ఎవడికి తెలియదు. అది నా తప్పా? అంత ఆ కమల్. ఎవడో పిల్లాడికి మాట ఇచ్చాడంట వాడికి డైరెక్షన్ ఇచ్చాడు. థు పనికి మాలిన వేదవ ! సినిమా రా అది.

రానా: కూల్ బాబాయి కూల్. నెక్స్ట్ మనిద్దరం మల్టీ స్టార్ చేద్దాం. మనింట్లో దైర్యం చెయ్యరు గాని, క్రిష్ గాన్ని పడేస్తా.

వెంకి: ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నా నేను గాలి వేదవ అయినా నీతో సినిమా ఏంట్రా? ఉన్నారు గా నీ ఫ్రెండ్స్ చరణ్ గాడు, బన్నీ గాడు వాళ్లతో తీసుకో.

రానా: కానీ  వాళ్ళు భయపడుతున్నారు బాబాయ్. నా క్కూడా భయం గానే ఉంది వాళ్ళ తో చెయ్యాలంటే.

వెంకి: నిన్ను చూసి ఆ వెదవలు భయపడటం ఏంట్రా? అంతుందా మనకు.

రానా: నాతొ ఆక్ట్ చేస్తే వాళ్ళు పొట్టి నాయలన్ని తెలిసి పోతుందని భయ పడుతున్నారు.

వెంకి: మరి నీకెందుకు భయం?

రానా: నాకు ఆక్టింగ్ రాదు, డాన్సు రాదు. పైగా చాల పొడుగు. ఎక్కడ నన్ను తేడా గాడు అనుకుంటారో అని.  నీకయితే ఆక్టింగ్ ఒక్కటే వచ్చు కాద, మేనేజ్ చేయ్యోచు.

వెంకి: అంటే నాకు డాన్సు రాదా. కూలి నెంబర్ 1 లో కిల్ల కిల్ల  మనే కళవరు రాణి పాటలో నా డాన్సు చూసావా. ట్రెండ్ సెట్ చేశా అప్పట్లో.

రానా: చాల్లే ట్రెండ్ ! చలికి వణుకుతున్నట్లు కాళ్ళు ఉపడమే గా? ఇలా కాదు గాని బాలివుడ్ లో హిట్ కొట్టి చెపుత.

వెంకి: అవును మరి,  పాపం అందరు రానా బాబు ఎప్పుడు వస్తాడా సినిమా తీసి బాగు పడి పోదాం అని ఎదురు చూస్తున్నారు.

అందరు చేతులు కడుక్కోవటానికి లేచారు. రానా మాత్రం నయన తారను లైన్ లో పెట్టె పనిలో SMS ఇస్తూ ఉండి పోయాడు.

ఘట్టమనేని వారి ఇల్లు అందరు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.....

కృష్ణ: మొత్తానికి నా పేరు నిలబెట్టావ్ మహేష్. మనం  డేరింగ్, డాషింగ్ అని నువ్వు కూడా నిరుపించావ్.

మహేష్: మన డేరింగ్ ఏంటో కానీ నాన్న అప్పట్లో అన్నయ్యను చూడటానికి జనానికి డేరింగ్ సరిపోలేదు అందుకే నేను వచ్చేదాకా ఆగవలసి వచ్చింది నీకు.

మంజుల: నీకన్న ముందే నేను పేరు నిలబెట్టే దాన్ని రా. కాని ఫాన్స్ పట్టుపట్టి నన్ను తోక్కేసారు.

రమేష్: అయినా అగుతున్నావా. ఏదో ఒకటి ఆక్టింగ్ చేస్తూనే ఉన్నావ్ గా. షో అని కావ్య డైరి అని సోది సినిమాలు.

విజయ నిర్మల: రమేష్ స్త్రీ జాతిని అలా అ గౌరవ పర్చకు. ఆడవాళ్ళు తలచుకుంటే ఏదయినా చేయ్యోచ్చు. 

మహేష్: అవును నిజమే. నలుగురు  పిల్లలు పుట్టాక పక్కవారి మొగుణ్ణి ఎగరేసుకు పోవచ్చు.

కృష్ణ: పిన్ని ని ఏమి అనొద్దు నాని. తప్పంతా నాది.

విజయ నిర్మల: చూశార మీ నాన్నకు నేనంటే ఎంత ఇష్టమో. నా మిద మాట కూడా పడనివ్వరు.

కృష్ణ: ఎప్పటికయినా తప్పు తెలుసు కోవాలి కద ! విజయ.

సుదీర్: మామయ్య, మహేష్ SVSC మల్టీ స్టార్ కాదని చెప్పాడంట టీవీ లో ఇప్పుడే ప్రియా నాకు ఫోన్ చేసి చెప్పింది.

కృష్ణ: ఏంటి నాని. ఎన్నో మల్టీ స్టార్స్ సినిమాలు చేసిన నా పరువు గంగపాలు చేశావు.

మహేష్: ఎయ్ ఆపండి. సినిమా ఏదో కాస్త హిట్ అయిందని, దాని క్రెడిట్ మొత్తం నొక్కేయాలని నేను ప్లాన్ చేస్తే, ఆ వెంకి ఏమో అవును ఉన్న ఒక్క స్టార్ నేనే అంటూ ప్రచారం మొదలు పెట్టాడంట.

నమ్రత: బేబి నా మాట విని నువ్వు అర్జెంటు గా బాలీవుడ్ కి వచ్చేయ్. ఈ తెలుగు మనకు సెట్ కాదు.

మహేష్: మూడేళ్ళు సినిమాలు చెయ్యకుండా ఇంట్లో ఉన్నందుకు, ఇప్పుడిడిప్పుడే కాస్త నిలదొక్కుకుంటూ ఉంటె మళ్ళి ఈ బాలీవుడ్ గోల ఏంటి.

మంజుల: వెళ్ళురా తమ్ముడు. మేము వస్తాం నీతో.

మహేష్: చీ దినమ్మ జీవితం. నన్ను ఇంకా వదలరా. ప్రతి సినిమాలో మీ ఆయనకు ఒక రోలు, నిన్ను కో ప్రొడ్యూసర్ చెయ్యలేక చస్తున్నా. అలాగే అన్నయ్య ఒక్కడు. ఇంట్లో ఉండి మందు కొడుతూ హాయిగా ఉండమంటే నిర్మాత అంటూ బయలు దేరాడు.  దానికి తోడూ ఈ సుదీర్ గాడు, అసలు చెల్లిని పెళ్ళి చేసుకున్నది అందుకే అనుకుంట.

కృష్ణ: ఎన్నయినా చెప్పు, ఎక్కువ మల్టీ స్టార్ చేసిన ఘనత నాదే దాన్ని నువ్వు కొనసాగించాలి. నీ సినిమాలు 150 కోట్లు కలెక్ట్ చెయ్యాలి.

మహేష్: ఏంటి 150 కోట్ల ! రూపాయల? పైసాల?  ని సోది జాతకం నిజం చెయ్యటానికి నేను ఫేక్ లెక్కలు వేయించలేక చస్తున్నా  ఇక్కడ. నీకో దండం ని నెంబర్ వన్ పిచ్చికి దండం.

అప్పుడే స్కూలు నుంచి వచ్చిన  కొడుకు గౌతమ్ తో ఆడుకోవటానికి బయటకు వెళ్ళి పోయాడు మహేష్.

15, జనవరి 2013, మంగళవారం

మల్టీ స్టార్ సందడి (హాస్యం) -1

(ఎవరిని నొప్పించాలని కాదు. సరదాగా నాకు వచ్చిన ఫ్లో లో రాసుకుంటూ వెళ్ళాను. రోజు మనం చూసే న్యూస్ చానెల్స్ , ఆ హీరో ల మిద ఉన్నా రూమర్స్ ను బట్టి అల్లిన సంబాషణలు. నచ్చితే ఒక్క కామెంట్ రాయండి.)


సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ఇరవయయిదెళ్ళ తర్వాత మల్టీ స్టార్ మూవీ అంటుంటే తెలుగు సినిమా కుటుంబాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి.


మంచు వారి ఇల్లు ఓ  సాయంత్రం పూట......

మోహన్ బాబు: అసలు ఏంట్రా వీళ్ళ గొప్ప నేను ఎప్పుడో ఆక్ట్ చేశాను మల్టీ స్టార్ మూవీ. పెద్దరాయుడు రజని కాంత్ తో చేశాను, అది మల్టీ స్టార్ కదా? అన్న NTR  తో మేజర్ చంద్రకాంత్ చేశాను అది కాదా? అలాగే నాగార్జున తో అధిపతి. ఇంకా మొన్న మొన్ననే ప్రబాస్ తో బుజ్జిగాడు అది కాదా మల్టీ స్టార్. అసలు మల్టీ స్టార్ అంటే ఏమిటి ! దానికి ఏదయినా పుస్తకం అచ్చువేసి మా కివ్వండి,  సిల్లి ఫెలోస్.

విష్ణు బాబు: అది కాదు డాడీ.  నేను శ్రీహరి అంకుల్ తో డీ చేశాను కదా, అది మల్టీ స్టార్ కదా.

మనోజ్ బాబు: మరి నేనో ! బన్ని గాడి తో వేదం. ఇంకా బాలయ్య అంకుల్ తో, సారీ ! అంకుల్ అంటే తంతాడు అసలే తింగరోడు, బాలయ్య అన్నయ్యతో ఉ కొడతార ఉల్లికి పడుతర తీసాను కదా. ఏంటో మన ఖర్మ మనల్ని ఎవ్వడు లెక్కచేయడు.

లక్ష్మి: మేము గోప్పోలమే. మాకు ఇవ్వాలి గౌరవం, అవార్డులు. 

నందమూరి వారి మంతనాలు తెలుగు దేశం పార్టి ఆఫీసు లో......

జూనియర్: బాబాయ్ ఏంటో మనం సరిగా ప్లానింగ్ చెయ్యటం లేదు బాబాయి. మన ఫాన్స్ అందరు అలాగే ఫీల్ అవుతున్నారు. పబ్లిసిటీ ముఖ్యం అంటూ ఒక్కటే నస పెడుత్తున్నారు.

బాలయ్య: ముందు నీ నస ఏంటో చెప్పరా.

జూనియర్: మల్టీ స్టార్ మువి బాబాయి. అసలు మల్టీ స్టార్ నేనే చేశాను ముందుగా. యమదొంగ మోహన్ బాబు అంకుల్ తో. గట్టిగా మాట్లాడితే వెంకటేష్ తో మహేష్ కన్న ముందే ఆక్ట్ చేశాను చింతకాయల రవి లో.


కళ్యాణ్ రామ్: తమ్ముడు అది పాటలో రెండు స్టెప్స్ వేసావు కదా తమ్ముడు.

జూనియర్: మరదే,  నా స్టెప్స్ తోనే ఆ మూవి ఆడింది.

బాలయ్య: అది ఫ్లాప్ అనుకుంట కదరా.

జూనియర్: అదే బాబాయి చెప్పేది. పబ్లిసిటీ ముఖ్యం. మన ఫాన్స్ ఒక్కటే గోల.

బాలయ్య: నిజమేరా. అప్పట్లో నాన్న గారు నాగేశ్వర్ రావు గారు, కృష్ణ గారితో చేశారు. మళ్ళి నేను వారిద్దరితో గాండీవం, సుల్తాన్ చేశాను. కాని మనకు అవసరం లేదు, ప్రజల ఆదరణ ఉంది మనకు  అది  చాలు.

తారకరత్న : ఏంటి బాబాయి ఆదరణ! తొమ్మిది సినిమాల్లో బుక్ అయ్యిన నాకు ఒక్క సినిమా హిట్ అవ్వలేదు.
నువ్వు మళ్ళి ఎప్పుడు హిట్ ఇస్తావో తెలియదు.

హరికృష్ణ: 30 ఇయర్స్ ఇండస్ట్రీ. మూడు మల్టీ స్టార్ సినిమాలు.

జూనియర్: ఓరి నాయనో. మూడా ? ఏంటి నాన్న అవి.

హరికృష్ణ: శ్రీ రాములయ్య, సీతారామరాజు మరియు శివరామరాజు.

అందరు ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వి.  మన బతుకులు ఇంతే ముసలాయన పేరు చెప్పుకుని బ్రతకాల్సిందే అనుకున్నారు మనసులో.


చిరంజీవి, అల్లు అరవింద్  ఇద్దరు  గెస్ట్ హౌస్ లో పకడ్బంది ప్లానింగ్.......

చిరంజీవి: బావ మనం ఎలాగయినా గొప్ప ప్లాన్ వేసి మన వాళ్ళను ఇద్దరినీ పైకి తేవాలి.

అరవింద్: ఇద్దరు కాదు బావ ముగ్గురు. ఇ నా కొడుకులకు చదువు చెప్పించిన ఆ చెత్త మొహాలు వేసుకుని హీరో లుగా తయారు అయి పోయారు. పెద్దోడు ఎదో తాడ్లు కట్టుకుని డాన్సులు వేస్తూ స్టైలిష్ స్టార్ అంటూ మనం రుద్దేసరికి అలవాటు అయిపోయాడు. ఈ చిన్న నా కొడుకుని ఏమని రుద్దలో నాకు అర్ధం కావటం లేదు.

చిరంజీవి: మా వాడు మాత్రం తక్కువ. అచ్చంగా నన్ను ఇమిటేట్ చేస్తూ నా అంత గొప్పోడు అయినట్లు ఫీల్ అవుతున్నాడు. వీడికి తోడూ మా  అల్లులు,  వెదవలు మీకు సూట్ కాదురా అంటే వింటారా, నా ప్రాణం తీసి నీతోనే సినిమా తియించుకునే రేంజ్ కు వెళ్ళి పోయారు. ఎంత పార్టి పెట్టి డబ్బులు సంపాదిస్తే మాత్రం అంత వృదా ఖర్చు చెయ్యమంటే అదోల ఉంది బావ.


పవన్: నిజాయితీగా ఉండమంటే విన్నావా అన్నయ్య. ఇంకోసారి ఎం ముఖం పెట్టుకుని వెళ్తావు ప్రజల ముందుకి.

చిరంజీవి: అప రోయ్. నీ సోది నిజాయితీ ని పిచ్చి ఫాన్స్ ముందు చెప్పు. పవనిజం తొక్క తోలు అంటూ పిచ్చి నా కొడుకుల్లగా రేచ్చి పోతారు. అంతే కాని చిన్నప్పటినుంచి నిన్ను,  ని వేదవ వేషాలు చుసిన నా ముందు కాదు. ఎన్ని పెళ్లి లు కావాలిరా నీకు.

చరణ్: డాడి బాబాయి ని ఎమ్మన అంటే నేను ఒరుకోను. ముందు నాతొ మాట్లాడండి.

చిరంజీవి: వెర్రి నా గొర్రె. వాడి వాళ్ళెరా నువ్వు ఇంకా అప్ కమింగ్ స్టేజి లో ఉన్నావ్. వాడే లేక పొతే నా ఫాన్స్ అందరు చచ్చినట్లు నిన్ను  గొప్పోణ్ణి చేసేవారు.

చరణ్: లేదు డాడి. అసలు మీడియా మనతో ఆడుకుంటుంది. మల్టీ స్టార్ మూవీ ముందుగా తీసింది మీరు !  ఆ క్రెడిట్ మీడియా మహేష్ కు ఇస్తుంది.

నాగబాబు: ఒరేయ్ వేదవ ! మీడియా నా వెంట్రుక అంటూ నాకేం భయం లేదు అంటూ సొల్లు వాగావు కదా.
మరెందు కురా అంత గింజు కుంటున్నావ్. నువ్వు చిన్న పిల్లాడి వని కవర్ చేసి నేను సారి చెప్పాను రా. చిన్న పిల్లాడు అయితే పెళ్ళి ఎలా చేసారంటూ అడిగితె మొహం ఎక్కడ పెట్టు కోవాలో తెలియలేదు.

చిరంజీవి: సరే నాగబాబు. ఇంతకూ నేను చేసిన మల్టీ స్టార్ మూవీస్ ఏంటి చరణ్.

చరణ్: మెకానిక్ అల్లుడు నాగేశ్వరరావు తో. మంజునాధ అర్జున్ తో.

బన్ని: చరణ్ రెండు  మర్చి పోయావ్,  శంకర్ దాదా సిరిస్  శ్రీకాంత్ తో.

పవన్:  స్టైల్ మూవీ నాగార్జున మరియు లారెన్స్ తో. ఇంకా ఆపండిరా ! ఎన్నయినా చెప్పుతారు. నిజాయితీగా ఉండండి రా.

చిరంజీవి: చి దిన్నమ్మ జీవితం. పార్టి మార్చే సరికి నా పేరు చెప్పుకుని పైకి వచ్చిన  వాడికి కుడా లోకువ అయిపోయాను. ఒరేయ్ బామ్మర్ది ఎంత గొప్ప సలహా ఇచ్చావ్ రా. దా దా నికిస్తా ఓ కిస్కా.

అరవింద్:  ఏంటి  బావ నువ్వు మరిను. ఒక్కసారి పార్టి పెట్టి మన వాళ్లతో జీవితాంతం సినిమాలు తీసేంత సంపాదించం. రేపు మళ్ళి మగధీర పార్టు 2 తీస్తా చరణ్ తో, అంతే మనోడే నెంబర్ 1.

శిరీష్: ఏంటి నెంబర్ 1 ! అక్కడ ఆల్రెడీ మహేష్ కుమ్మేస్తున్నాడు. నేను ఎన్ని సార్లు బ్లాగు లో మర్చానో కలెక్షన్స్ గురించి. ఇంకా లాభం లేదని మూసుకుని కూర్చున్న.

అందరు నిశబ్దంగా ఆలోచించ సాగారు మంచి ఉపాయం కోసం.

నాగార్జున,  చైతన్య,  సుమంత్, నాగేశ్వరరావు, సుశాంత్  ఇంకా అఖిల్ అన్నపూర్ణ స్టూడియో లో భాదపడుతున్నారు.......


ANR : ఏంటో రా నేను ఎంత కష్టపడ్డ అంత రామారావు కు పోయేది. తరువాత ఆ కృష్ణ సాంతం లేపెసాడు.

నాగ్: చుడండి నాన్న గారు మీకు నా అంత అందం లేదు. నన్ను ఇప్పటికి మన్మదుడు  అంటారు.

ANR : అపార. నువ్వు వచ్చిన కొత్తలో అసలు నిన్ను నిలబెట్టటానికి ఎంత కష్టపడ్డానో మర్చిపోయావ. ఆఖరికి నాతో ఆక్ట్ చేసిన శ్రీదేవి ని పెడితేగాని నీకు హిట్ రాలేదు.

నాగ్: అసలు శివ సినిమాతో వర్మ ను తెచ్చింది నేనే.


ANR: వర్మను నువ్వు తేవటం కాదు వర్మనే నిన్ను తీసుకొచ్చాడు పైకి.

సుమంత్: నన్నేం టో ప్రేమ కథ తో నిలబెడుతాడు అనుకుంటే ఎందుకు పనికి రాని వాడిగా చూపించాడు.

చైతన్య: నన్ను మరి దారుణం. బెజవాడతో ఉన్నా కాస్త లవర్ బాయ్ ఇమేజ్ పోయింది. మళ్ళి హిటే రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు.

అఖిల్: అసలు మహేష్ లాగ డిఫరెంట్ సబ్జక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి డాడి. చూడండి ఇప్పుడు మల్టీ స్టార్ కూడా చేశాడు.

నాగ్: ఎయ్ అపు. ఇంట్లో ఇంత మంది హీరో లు ఉండగా ఎప్పుడు మహేష్ అంటావ్. ఏంట్రా నేను చెయ్యలేదా మల్టీ స్టార్. నిన్ను చూడాలని శ్రీకాంత్ తో, అధిపతి మోహన్ బాబు తో, మళ్ళి అన్నమయ్య. ఇవ్వని మల్టీ స్టార్ కావ?

సుమంత్: మామయ్య ఇంకోటి మర్చి పోయావ్. స్నేహమంటే ఇదేరా ! మనం చేశాం కద.

ANR: అంటే నేను మాత్రం చెయ్యలేదా. కుర్రాలతో పోటిగా ! శ్రీకాంత్ తో పండుగ, బాలయ్యతో గాండీవం, శ్రీ రామరాజ్యం. చిరంజీవి తో మెకానిక్ అల్లుడు.

అఖిల్: డాడి చిన్నపుడు మనిద్దరం కలిసి చేశాం కదా సిసింద్రి. అది కూడా మల్టీ స్టార్ అవుతుందా?

సుశాంత్: మామయ్య ఈ సారి ఎలాగయినా నా మూవీ లో ఆక్ట్ చెయ్. నేను కూడా  మల్టీ స్టార్ హీరో అయిపోతా మన ఫామిలీ నుంచి.

నాగ్ : ఎయ్ నొరుముయ్ రా. మీ అందరి కన్న  నేనే అందగాన్ని. ఏదయినా చేస్తే నేనే చెయ్యాలి.

అఖిల్: ఇన్ని రోజులు ఎంచేశావు డాడి ! వయసంతా అయిపోయాక ఈ శాపతలు చేస్తున్నావ్. అసలు మహేష్ తరువాత నేనే అందగాన్ని అంటున్నారు మీడియా మొత్తం.

సుశాంత్: ఇంకోసారి అందం గురించి మాట్లాడితే కరెంట్ పాస్ అయిపోద్ది ఒంట్లో.

ANR: ఒరేయ్ ఆపండ్ర. అసలు మీ అందమంతా నా నుంచి వచ్చిందిరా. కాని  నా ఆక్టింగ్ మాత్రం ఒక్కడికి రాలేదు. అంత మన ఖర్మ.

ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఆలోచనలో పడ్డారు.


( రెండో భాగం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: http://sayaram.blogspot.com/2013/01/ii.html )

14, జనవరి 2013, సోమవారం

బాబాయి ! అమ్మాయి !!

(కథ ప్రకారం కాస్త అసభ్యతను  రాయవలసి వచ్చింది, క్షమించ ప్రార్దన.)

ఆదివారం మద్యాహ్నం కాస్తా కునుకు తీసి, సాయంత్రం అవ్వటంతో డాబా మీదికి వచ్చాడు రవీంద్ర. క్రింద అర్చన, తన తమ్ముడు మరియు మరి కొంత మంది స్నేహితులు కలిసి  షటిల్ కాక్ ఆడుతున్నారు.

అర్చన తమ ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయి. వాళ్ళు కింది వాటాలో ఉంటారు, రవీంద్ర వాళ్ళకు పై పోర్షన్ అద్దెకు ఇచ్చారు. నెల రోజుల క్రితమే ఇంట్లో దిగారు. ఇల్లాంత సర్దుకుని రవీంద్ర  భార్య కానుపుకని పుట్టింటికి వెళ్ళి పోయింది. భార్య లేక పోవటంతో చాల బోర్ గా ఉంది రవీంద్రకు అందుకే డాబా ఎక్కాడు. 
 
షటిల్ ఆడుతున్న అర్చన కు బాగా చెమట పోసి ఉక్కగా ఉన్నట్లుంది. వేసుకున్న టి షర్టు పై బటన్ తీసి  ముందుకు లాక్కుని గాలి ఉదుకుంది లోపల. అప్పుడు తెల్లని ఆమె వక్ష సౌదర్యం కనిపించి రవీంద్రను ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

అప్రయత్నంగా పైకి చుసిన అర్చన రవీంద్ర ను  చూడగానే "హాయ్ అంకుల్. రండి షటిల్ ఆడుతార?" అంది.

"నో నో ఐ కాంట్ ప్లే. మీరు కానివ్వండి" అన్నాడు రవీంద్ర నవ్వుతు.

మోకాల వరకు వేసుకున్న స్కర్ట్, బిగుతయిన టి షర్టు అచ్చం ప్లేయర్ లాగే తయారయింది. తెల్లని వంటి ఛాయా, మంచి పుష్టిగ, తీర్చి దిద్దినట్లు ఉండే శరీరాకృతి. సానియా మీర్జాను మించి పోయింది అనుకున్నాడు. చదివేది ఇంటర్ మీడియాట్ అయినా మంచి వయసులో ఉన్నట్లు కనిపిస్తుంది అర్చన.

"ఎవడు చేసు కుంటాడో గాని వాడికి ప్రతి రాత్రి జాగారమే ! నా సామీ రంగా" అనుకున్నాడు రవీంద్ర మనసులో, అర్చనను కాంక్షగా చూస్తూ.

కాక్ కోసం అటు ఇటు పరుగెడుతున్న అర్చనను చూస్తూ ఎంత సేపు గడిపాడో తెలియదు. ఇక్కడ ఉంటె అనవరంగా డిస్టర్బ్ అవ్వటం తప్ప ఇంకేం లేదు అనుకుని కిందికి వచ్చేసాడు తమ వాటా లోకి. 

కంప్యూటర్ ముందు కుర్చుని ఏవో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు రవీంద్ర. మెయిన్ డోర్ బెల్ మోగటంతో వెళ్లి తలుపు తీసిన రవీంద్ర ఆశ్చర్య పోయాడు. ఎదురుగా చేతిలో బ్యాట్ తో అర్చన.

"సారి అంకుల్. డిస్టర్బ్ చేసాన?" అంటూ అడిగింది.

"అందెం లేదు. ఏంటి విషయం" అన్నాడు రవీంద్ర.

"మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాద. నాకు కంప్యూటర్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్లియర్  చేస్తారా?" అంది అర్చన రిక్వెస్ట్ చేస్తూ. 

"ఇంటర్ లో కంప్యూటర్ ఉందా?" అనడిగాడు రవీంద్ర ఆశ్చర్య పోతూ.

"లేదు లేదు నేను ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటున్నాను. అక్కడ ల్యాబ్ దొరకదు, నా డౌట్స్ క్లారిఫయ్ కావటం లేదు. అందుకే మీ హెల్ప్ అడుగుతున్నాను" అంది అర్చన.

"నో ప్రాబ్లం. అలాగే చెపుతాను" అన్నాడు రవీంద్ర ఉషారుగా.

వెంటనే అర్చన వచ్చి కంప్యూటర్ ముందు కూర్చుని MS వర్డ్ ఓపెన్ చేసింది. "అంకుల్ ఇదిగో ఇ మెయిల్ మర్జ్ ఆప్షన్ ఉంది కాదా ! నేను అన్ని చేసిన తర్వాత మెయిల్ వెళ్ళటం లేదు. ఎలా ట్రై చేసిన నాకు పనిచేయటం లేదు" అంది.

రవీంద్ర తన వెనుక నిలబడి ముందుకు వంగి అది ఎలా చేస్తే వర్క్ అవుతుందో చెప్పసాగాడు. అలాగే కంప్యూటర్ ఆపరేట్ చేసే టప్పుడు తన చేతులు అర్చనకు తగిలించ సాగాడు. 

అర్చనలో ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి అని అర్ధం అయింది రవీంద్రకు. కావాలనే ఆ అమ్మాయికి ఇంకా దగ్గరగా జరిగి ఎక్కడెక్కడో తగల సాగాడు. అర్చన చాల డిస్టర్బ్ అవుతోంది.

తను కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంటే ఆమె భుజాల మిద చేతులు వేసి  చిన్నగా  మర్దన చేస్తు "నాకిలా చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. నిక్కుడ బాగుందా" అంటూ  అమాయకంగా అడిగాడు.

అర్చనకు అదంతా కొత్తగా ఉంది. తండ్రి, తమ్ముడు తప్ప పరాయి మగవాడి స్పర్శ తెలియని తనకు రవీంద్ర స్పర్శ కొత్త అనుభూతిని ఇస్తోంది. "హు" అంది మత్తుగా. 

అర్చన ఒంటి నుండి వచ్చే చెమట వాసన రవీంద్ర ను మత్తేకిస్తోంది. గట్టిగా ఉపిరి పీల్చుకుని తన వెచ్చని ఉపిరి అర్చన మెడకు తగిలేలా చేస్తున్నాడు. ముప్పయి రెండేళ్ళ రవీంద్రకు ఇలాంటి అనుభూతులు కొత్త కాకపోయినా, నెల రోజులుగా చూస్తున్న అర్చన ఇలా దొరికే సరికి తట్టుకోలేక పోతున్నాడు. అందుకే తనకు తెలిసిన కిటుకులన్ని ప్రయోగిస్తూ తనను లొంగ దిసుకోవలనుకున్నాడు.

ఈ అవకాశం వదలకూడదు, అర్చన ఇంకా అడ్డు చెప్పదని అనుకున్న తర్వాత ఇంకేదో చెయ్యాలనుకునే లోపు. 

"అక్క ! మమ్మీ  పిలుస్తోంది" అంటూ అర్చన తమ్ముడు పైకి వచ్చాడు.

ఒక్కసారిగా ఇద్దరు ఈ లోకం లోకి వచ్చారు. "ఓకే అంకుల్. థాంక్స్ వేరి మచ్" అంటూ సిగ్గుపడుతూ వెళ్ళి పోయింది అర్చన. తను అటు వెళ్ళగానే రవీంద్రకు ఒక్క రకమయిన సంతోషం. చదువుకునే రోజులలో ఎంతో మందిని లొంగ దిసుకున్నాడు. అందమయిన తానంటే ఎ అమ్మాయి అయినా వారం రోజులలో పడిపోయేది. తన ఫ్రెండ్స్ అందరు ప్లే బాయ్ అంటూ పిలిస్తే గర్వ పడేవాడు.

తనకు ఈ చిన్న పిల్లను పడేయటం పెద్ద విషయం కాదు. చిన్న పిల్ల అనుకోగానే ఎక్కడో గుచ్చుకుంది రవీంద్ర కు. కాని అర్చన అందం గుర్తుకొచ్చి దాన్ని కప్పేసింది. 

ఎలాగు పడిపోయింది. ఇంకో రెండు రోజులలో మంచి అదను చూసి పని పూర్తీ చెయ్యాలి. అందమయిన కన్నె పిల్లను తినివి తీరా అనుభవించాలి. తనకు జీవితం లో మర్చి పోలేని అనుభూతిని ఇవ్వాలి అనుకున్నాడు రవీంద్ర. ఆ రాత్రి అర్చన గురించి ఆలోచిస్తూ అందమయిన కలలు కంటూ ఎప్పుడు నిద్ర పోయాడో తెలియదు. ప్రొద్దునే ఫోన్ రావటం తో లేచి "హలో" అన్నాడు రవీంద్ర. 

"ఒరేయ్ రవి. నేను రా అన్నయ్యను" అన్నాడు రవీంద్ర అన్నయ్య.

"ఏంటి అన్నయ్య ! ఇంత పొద్దున్నే ఫోన్ చేసావ్. ఇంటి దగ్గర అంత ఓకే కాద" అడిగాడు ఆశ్చర్యంగా.

"అంత ఓకే రా. ఆ చెత్త ట్యూషన్ మాస్టర్ గాడు మన గీత తో అసభ్యంగా బిహేవ్ చేసాడు. రాత్రంతా అదే గొడవ. నీకు చేద్దామనుకున్నాను. మళ్ళి  నువ్వు కంగారు పడుతవని చెప్పలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్న" అన్నాడు రవీంద్ర అన్నయ్య.

గీత తన అన్నయ్య కూతురు పదవ తరగతి చదువుతోంది. అది వినటంతోనే రవీంద్రకు ఎక్కడలేని కోపం వచ్చింది. "ఏంటి అన్నయ్య ! ఆ నా కొడుకును నరికి పారేయకుండా వదిలేసావ" అన్నాడు ఆవేశంగా. 

"అనుకున్నాను రా. నువ్వు ఇలాగె అంటవాని. వాణ్ణి నరికితే అయిపోతుందా! మీ వదిన, పిల్లల గతి ఏమవుతుంది. అందుకే నాలుగు తగిలించి వదిలేసం. అంతటితో అయిపొయింది, నువ్వు కూడా వదిలేయ్" అంటూ ఫోన్ పెట్టేసాడు.

రవీంద్ర రక్తం మరిగిపోతోంది. "అంత చిన్న పిల్లతో అల ప్రవర్తించటానికి ఆ దొంగ లంజ కొడుకుకి మనసెలా వచ్చింది. తానె గనుక అక్కడ ఉండి ఉంటె నరికి పారేసేవాడు" అనుకుంటూ భయటకు వచ్చాడు అసహనంగ. 

అర్చన స్కూల్ కు బయలు దేరుతున్నట్లుగా ఉంది. తనను చూసి సిగ్గు పడుతూ "హాయ్" అంటూ  చెయ్యి ఉపి గేటు తీసుకుని భయటకు వెళ్ళి పోయింది.

అంతే రవీంద్రను ఎవ్వరో చాచి చెంప మిద కొట్టినట్లు అయింది. ఇంట్లోకి వచ్చి చేతితో తల బాదుకుంటూ "ఎంత తప్పు చేశాను. ఆ మాస్టర్ గాడు  చేసింది తప్పయితే నేను చేసింది ఏమిటి? అబం శుభం తెలియని ఆ చిట్టి తల్లిని అనుభావించాలనుకున్నాను"  అర్చన పట్ల తన ప్రవర్తన గుర్తుకొచ్చి తన మిద తనకే అసహ్యం వేసింది.

"తన తప్పు సరిదిద్దు కోవాలి. ఆ చిన్నారికి తను ఒక బాబాయి నని గుర్తు చెయ్యాలి. ఇంకెప్పుడు ఎ ఆడపిల్ల పట్ల ఇలా ప్రవర్తించ కూడదు" అనుకుని ప్రశాంతంగా ఆఫీసు కు బయలు దేరాడు రవీంద్ర.

ఇలాంటి రవీంద్ర లు మన చుట్టూ కొకోల్లాలు. తన దాక వస్తే గాని తెలియదు వారికీ.

(సమాప్తం).

12, జనవరి 2013, శనివారం

పిరికి ప్రేమ

నువ్వంటే ఇష్టం ఎప్పుడో తెలియదు
నీపై ప్రేమ ఎప్పుడు మొదలో చెప్పలేను
మది నిండా నువ్వు నిండి పోయావు
నిదుర లోను ని కలవరింతలే
మెలకువ లోను ని తలపులే
నిన్ను చూడాలని ఆరాటం
అనుక్షణం నా మనసుతో పోరాటం
నీతో ఎన్నో చెప్పాలని అనుకుంటాను
ఎదురుగా నువ్వుంటే ముగబోతాను
నువ్వు దూరం కాగానే
ఒంటరి తనం ముందు ఓడిపోతాను
నాలోని నువ్వు, నన్ను గెలిపిస్తావు
రేపటి కోసం నన్ను బ్రతికిస్తావు
ఎప్పుడు రోజు గడుస్తుందా
ఎప్పుడు నిన్ను చూద్దామా అనుకుంటాను
ఎ రోజయినా నిన్ను చూడక పొతే
ని పలుకు వినక పొతే
నా  హృదయ రోదన ఎలా వినిపించను
నీపై ప్రేమను ఎలా చూపను
నాతొ పలికే ని ప్రతి మాట
మదిలో కొలువుంచనని ఎలా నిరూపించను
ఈ మూగ ప్రేమ తనలో అంటుంది
ఈ మనసు నీకె సొంతం
ఈ తనువూ నీకె అర్పితం
ఈ బ్రతుకు నీకె అంకితం
నీకు తెలిసేదెలా ?
ఈ పిరికితనం నన్ను విడేదేలా?
నా ప్రేమ గెలిచేదేలా?

9, జనవరి 2013, బుధవారం

ఎవరు గొప్ప ?

సంధ్య సమయం
ఆకాశ వృక్షం పై నిండా మాగిన పండులా
రాలి పోవటానికి సిద్దంగా ఉన్నాడు సూర్యుడు

ఆకుల మాటున దాగిన మిణుగురుల వలె
తాళ తాళ మెరుస్తూ
బయట పడుతున్నాయి తారలు

నవ్వులను ఒళ్ళంతా పులుముకుని
ప్రేమను మకరందంల నింపుకుని
రేయి రేడు కై ఎదురు చూస్తూ
విరహంతో ఉన్న పూలను మగత లో ముంచి
మకరందం కొసరి కొసరి దోస్తున్నాయి
కొంటె తుమ్మెదలు

పుల్లని మావిళ్ళు తిన్న కోయిల
ఆ పులుపునంత బయట పంపాలని
తియ్యగా పాడుతోంది

మాటలు నేర్వాలని ఉబలాట పడుతూ
పోటీలు పడుతూ చిలుకలు
పలుకులు చిలుకుతున్నాయి

లయ తప్ప కుండా సంగీతాన్ని
ప్రవాహంలో పలికిస్తోంది సెలయేరు

చల్ల గాలికి ఒళ్ళంతా వణుకుతుంటే
వయ్యారంగా కదులు తున్నాయి తామరలు
వెచ్చని వెన్నెల కోసం ఎదురు చూస్తూ 

రాత్రిని ఏలేందుకు
పండు వెన్నెల పరివరంగా
చంద్రుడు కొలువు చేస్తున్నాడు

ప్రకృతి తనలో తను మురిసి పోతోంది
తన అందాలూ రెట్టింపు చేస్తోంది
అదంతా అనుభవిస్తూ
నమస్కరించింది నా మనసు నా కళ్ళకు
నా కళ్ళు వర్షించాయి సంతోషంగా
నా మనసు  అనుభూతులకు

 నాలో ఓ ప్రశ్న మొదలయింది
ఎవరు గోప్పంటు జిజ్ఞాస రగిలింది
అందమయిన ప్రకృతి గొప్ప?
దాన్ని చూపిన కళ్ళు గొప్పవా?
లేక ఆనందించిన మనసా?

6, జనవరి 2013, ఆదివారం

ఎందుకంటే ! నేను ఆడపిల్లను !!

నేను కడుపునా పడ్డ క్షణం నుంచి
నా కష్టాలు మెదలు
అసలు పుడుతానో లేదో అని
ప్రపంచాన్ని చూస్తానో లేదో అని
నన్ను కనే దైర్యం అమ్మ, నాన్న కు వస్తుందో రాదో అని
ఆరు నెలలు నరకం అనుభవిస్తాను

పసిగా ఉన్నప్పుడయిన పాపం అనరు
కొన్ని సార్లు నాన్న అలకలు, నాన్నమ్మ ఈసడింపులు
అమ్మ కష్టాలు అప్పుడే మొదలు, నా వల్ల
నాన్న తిప్పలు ఆరంభం
పసితనం నుంచే నా కష్టాలు ప్రారంభం

కోరినది చదువ లేను
అనుకున్నది కట్టు కోలేను
అన్న, తమ్ముడి కోసం త్యాగాలు
ఆడపిల్ల కేందుకంటూ సూక్తులు
నాకు మాత్రమే వర్తించే నీతులు

నా మనసు నన్ను వదిలి పోతుంది
నా ఇష్టం ఎన్నో సార్లు చచ్చిపోతుంది
పైకి మాత్రమే నేను సున్నితం
నా లోపలంతా బడబాగ్ని !
తీవ్రమయిన అసంతృప్తి
తలదించు కొనే అదైర్యం నా నేస్తాలు !
నా ఉహలు, కలలు మాత్రమే
కాసేపు నన్ను బ్రతికిస్తాయి
ఎప్పుడు కట్టుబాట్లు నన్ను శాసిస్తాయి

ఇంత  అణుకువగా ఉన్న
ఎన్ని త్యాగాలు చేసిన
సృష్టి లో సగ భాగం నాదయినా
ఆనందమంతా నాతోనే ఉన్న
ప్రేమంతా నేను పంచిన
నా విలువ పెరుగదు
నా బ్రతుకు మారదు

నేను ఒంటరిగా కనిపిస్తే చాలు
మదమెక్కి, నీతిని మరచి
కామంతో కళ్ళు మూసిన మగాడు
నా మీద పడి నన్ననుబవిస్తాడు
నా బతుకు నలిపెస్తాడు, కాని
వాణ్ణి కన్నది నేనేనని
వాడి సోదరి  నా రూపామేనని
వాడి బార్య నా లాంటిదేనని
వాడి కూతురు రేపు నేనే అవుతానని
వాడికెలా చెప్పేది, వాణ్ణెల బాగుపరిచేది !

నిన్ను కన్న ప్రతిసారి నేను  మరో జన్మ ఎత్తాను రా !
నీ కోసం నా ఇష్టాలు పాతి పెట్టాను రా !
నీకు పక్క పంచటానికి, నా వంటి బాధను
పంటి బిగువున దాచాను రా !
నువ్వు ఈసడించు కున్న ని కూతురుగా మారి
నీ జీవితం పరిపూర్ణం చేశాను  రా !
నన్ను ఇలా అనుభవించటానికి ని మనసెలా ఒప్పింది !

అసలు నీకు మనసుందా? లేక కామంతో కాలి పోయిందా?
మేలుకో  !  నా విలువ తెలుసుకో !
నీపై అలిగి నేను పుట్టటం ఆపేస్తే
నీ పుట్టుకే వ్యర్దం, ఈ సృష్టే అంతం !
ఇప్పటికయినా కళ్ళు తెరుచు కో
నన్ను కాపాడుకో
ఎందుకంటే నేను "ఆడపిల్లను"