8, నవంబర్ 2012, గురువారం

పక్క వాడి పెళ్ళాం !


సురేష్ కు పెళ్ళయి సంవత్సరం అవుతుంది, అయినా ఎలాంటి తృప్తి లేదు. వివాహ జీవితం తను అనుకున్నట్లు సాగడం లేదు. తను కోరుకున్న జీవిత భాగస్వామి వేరు తనకు లబించిన భార్య వేరు. పెళ్లి చూపులలో అందరిలాగే అమ్మాయిని చీరలో చూసి ఇష్టపడ్డాడు.

లహరి అనే పేరు చాల మోడ్రన్ గా ఉంది కదా ! తను కూడా మోడ్రన్ గా ఉంటుందని ఉహించాడు. కాని తను పక్తు బామ్మ లాంటి అమ్మాయి అని  అప్పుడు తెలుసు కోలేక పోయాడు.

తానేమో ఎప్పుడు కొత్త కొత్త స్టైల్సు పాలో అవుతుంటాడు. చూడటానికి ఆకర్షనియమయిన మొఖం తో ఎత్తుకు తగ్గ లావుతో అందంగానే ఉంటాడు. లహరి మాత్రం తక్కువ తినలేదు. అందమయిన ముఖం,  చామన చాయ రంగు అయిన చీర కట్టులో అచ్చం బొమ్మలాగే ఉంటుంది.

పెళ్ళి కి ముందు తన స్నేహితులు తనను ఒక్కో హిరోయిన్ తో పిలిచే వారు. కొందరు మీరా జాస్మిన్ అంటే కొందరు అనుష్క అనేవారు. కానీ తనకు మాత్రం ఇవ్వేవి పట్టేవి కాదు. అసలు అందంగా ఉండాలని, అలా  తయారవ్వాలని, ఇలా  కనిపించాలని తను ఎప్పుడు ప్రయత్నించేది కాదు.

మోడరన్ డ్రెస్ లంటే అసలు తనకు నచ్చావు, చిన్నప్పటి నుంచి అమ్మ ఎ రోజు మోడ్రన్  డ్రెస్సులు తేలేదు,  పంజాబీ డ్రెసులు  తప్ప.  కాని సురేష్ కు మాత్రం తన భార్య ఎప్పుడు కొత్త కొత్త ప్యాషన్స్ పాలో అవ్వాలని,  అందరిలో ఉషారుగా ఉండాలని కోరిక.

లహరి మాత్రం చాల అణుకువగా మెలగేది.  పదిమందిలో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడేది. పరాయి మగాళ్ళను అందరిని "అన్నయ్య, తమ్ముడు" అని వరసలు పెట్టి పిలిచేది. ఇవ్వన్ని  చూసి సురేష్ కు మండి  పోయేది. అచ్చం పల్లెటూరు బైతుల చేస్తుందని విసుగుకోనేవాడు.

నిజానికి సురేష్ పెరిగింది పల్లెటూరు, లహరి పెరిగింది సిటి లో. కాని సురేష్ సిటి కుర్రాడిలా, లహరి పల్లెటూరి అమ్మాయిల ప్రవర్తించేవారు.  చిన్నప్పటినుంచి సున్నిత మనస్కురాలు, భయస్తురాలు అయిన లహరికి ఎ పని చెయ్యాలన్న ఒక్కటికి పది సార్లు ఆలోచించటం అలవాటు. కాని సురేష్ ఆలా కాదు, ఏదయినా క్షణనలో  చేస్తాడు.

లహరిలో ఆ మనస్తత్వం కూడా నచ్చేది కాదు అతనికి.  ఎవరయినా ఏదయినా అంటే ఎదురుదాడి చేసి వాళ్ళ నోరు మూయించటం సురేష్ నైజం. కాని లహరి అలా  కాదు "పోనిలే పాపం నోరు జారి ఉంటారు" అనుకుని సర్దుకు పోయేది. అలా కాకుండా తన భార్య డైనమిక్ గా ఉండాలని కోరుకునే వాడు సురేష్.

సురేష్ సాప్ట్వేర్ ఇంజనీర్. లహరి Msc.  మాథ్స్ చేసింది. ఉద్యోగం చేస్తానంటే సురేష్ "ఏమి అవసరం లేదు. బయటకు వెళ్ళి నా పరువు ఇంకా తీయొద్దు" అంటూ ఇంట్లో కూర్చోబెట్టాడు.

లహరికి కంప్యూటర్స్ పెద్దగా  తెలిసేది కాదు. అదికూడా సురేష్ కు భాదగా ఉండేది. మాథ్స్ లో జీనియస్ అయిన లహరికి ఎందుకో కంప్యూటర్స్ మాత్రం అబ్బలేదు. అందరు పేస్ బుక్, ఆర్కుట్ అంటూ మాట్లాడుతుంటే, లహరి మాత్రం ఆవకాయ, అప్పడాలు అంటూ టాపిక్ మొదలు పెట్టేది.  ఇవన్ని  చూసి సురేష్ కు పిచ్చెక్కి పోయేది. అసలు పెళ్ళి  ఎందుకు చేసుకున్నానురా అంటూ తెగ భాదపడిపోయే వాడు.  అందుకే ఎప్పుడు తనతో ముభావంగా ఉండేవాడు.

సూటి పోటి   మాటలతో లహరిని భాద పెట్టె వాడు.  పెళ్ళయి సంవత్సరం అవుతున్నా ఆపీసు కొలీగ్స్ కు తన భార్యను పరిచయం చేయలేదు, అందరు నవ్వుకుంటారని. పెళ్ళి  పార్టి కూడా తను ఒక్కడే వెళ్ళి  ఇచ్చాడు తన భార్యకు ఒంట్లో బాగా లేదని.

సురేష్ ఆలా ఉంటున్నందుకు లహరి కూడా చాల భాద పడేది. తనలో ఏంటి లోపం అనుకుంటూ పరిశీలన చేసుకునేది. పెళ్ళి  కి ముందు తనను అందరు అందగత్తె అంటూంటే పట్టించుకునేది కాదు. కాని ఇప్పుడు తన భర్త ఒక్కసారి కూడా తనను మెచ్చుకోవటం లేదు.

సరుకులకు వెళ్ళి నప్పుడు రోడ్డు మిద ఏ  అమ్మాయిని చుసిన నోరు వెళబెట్టి  చూస్తాడు. వాళ్ళు తన అందం ముందు ఎందుకు పనికి రారు. కానీ ఆయనకు వాళ్ళెందుకు నచ్చుతున్నారు ! జీన్స్ ప్యాంటు, స్లివ్ లెస్ టాప్  వేసుకున్నందుకా? అంటూ మదన పడిపోయేది. సురేష్ ఇంటి లో తక్కువ ఆఫీసు లో ఎక్కువ ఉండటం మొదలు పెట్టాడు. వికేండ్స్ అయితే పార్టిలు, రాత్రి పన్నెండు దాటినా తర్వాత ఇంటి కి రావటం అలవాటు చేసున్నాడు.

తన తో మాట్లాడటమే తక్కువ చేసిన భర్తను ఏమి అనలేక మౌనంగా విటన్నింటికి  అలవాటు పడి  పోయింది లహరి. అమ్మ నాన్న భాద పడుతారని సురేష్ ఇంట్లో లేక పోయిన ఎదో పనిలో ఉన్నాడని అబద్దం ఆడేది. ఒక్కగానొక్క కూతురు జీవితం ఇలా అయిపోయిందని వాళ్ళు బ్రతుకలేరని భాదనంత తనలోనే దిగమింగుకునేది.

యీల  సాగుతుండగా, ఓ శనివారం రోజు ఎదో పని మిద సురేష్ ఇంటి వైపు వచ్చిన అతని కొలీగ్స్ అతన్ని సర్ ప్రైజ్ చేయటానికి ఇంటి కి వెళ్లలనుకున్నారు.

వెంటనే ఒక్కతను పోన్ చేసి "సురేష్, ఎక్కడున్నావ్" అన్నాడు.

"రైతు బజార్లో బండి పెట్టుకుని వ్యాపారం చేస్తున్న. లేకపోతె వీకెండ్ ఎక్కడుంటాను రా? ఇంట్లో నే తగలడ్డ" అన్నాడు సురేష్ తన సహజ దోరణిలో.

అది అలవాటయిన కొలీగ్ "అయితే ని అపార్టుమెంటు నంబరు చెప్పు" అన్నాడు.

"మంజీర అపార్టుమెంట్, ప్లాట్ నంబరు 325. అయిన ఎందుకురా?" అంటూ ఆశ్చర్య పోయాడు సురేష్.

కొలీగ్ ఏమి మాట్లాడ కుండ పెట్టేసాడు. సురేష్ కు జరగబోయే ప్రమాదం తెలిసి పోయింది. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నా తన పరువు గంగలో కలిసి పోతుంది.

"ఏయ్ ! ఇటురా" అంటూ లహరిని కేకేసాడు.

"మా ప్రెండ్స్ వస్తున్నారు గాని, కాస్త అ  జిడ్డు మొహాన్ని రుద్ది ఏదయినా మంచి డ్రెస్ వేసుకో" అన్నాడు చిరాకుగా.

లహరి మనసు భాదపడలేదు, ఇదివరకయితే చివ్వుకుమనేది. కాని ఇలాంటివి అలవాటయి పోయాయి. ఎదో రకంగా అయన మాట్లాడితే చాలు అన్న స్థితికి వచ్చేసింది. అయిదు నిమిషాల్లో డోర్  బెల్ మోగితే వెళ్ళి  తలుపు తీసాడు.

నలుగురు  కొలీగ్స్ "హల్లో  సురేష్ ! ఏంటి ఎంచేస్తున్నావ్. నిన్ను డిస్టబ్ చెయ్యటానికి వచ్చాం" అంటూ తలో మాట మాట్లాడుతున్నారు.

కాస్సేపటికి లహరి అందరికి కాఫీలు తీసుకొచ్చింది. చీర కట్టులో అచ్చం అజంతా శిల్పం లా ఉంది. సురేష్ కు మాత్రం పల్లెటూరు బైతుల కనిపించసాగింది. సిగ్గు తో తన కొలీగ్స్ వైపు చూశాడు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అని. అందరు నోళ్ళు వెళ్ళబెట్టారు. ఒక రకమయిన ఆశ్చర్యం, ఆరాధన భావం కనిపిస్తుంది వాళ్ళ కళ్ళలో. అందరు అప్రయత్నంగా  నమస్కారం పెట్టారు లహరికి. సురేష్ కు చాల వింతగా ఉంది ఇదంతా.

కాఫీలు ఇచ్చి అక్కడనుంచి వంటింట్లోకి వెళ్ళి  పోయింది లహరి. సురేష్ అతని కొలీగ్స్ ఏవో మాట్లాడు కుంటున్నారు. చూస్తూ చూస్తుండగానే గంట గడిచి పోయింది.

"ఒకే సురేష్ మేము వస్తాం" అంటూ బయలు దేరారు.

లహరి కంగారుగా బయటకు వచ్చింది వంటింట్లోంచి. "అన్నయ్య బొంచేసి వెళ్ళండి, మద్యాహ్నం అవుతుంది కదా" అంది.

"నికేందుకమ్మ శ్రమ. ఏదయినా మేస్ లో చేసి వెళ్తాం" అన్నాడు వాళ్ళలో ఒక్కతను.

"మొదటి సారి ఇంటి కి వచ్చారు. భోంచేయకుండా వెళ్తార? రండి ముందు" అంటూ వాష్ బేసిన్ చూపించింది.

వాళ్ళకు ఆకలిగానే ఉంది, అందుకే తినటానికి సిద్ద పడి  పోయారు. సురేష్ కు మాత్రం ఇబ్బంది గా ఉంది. పప్పు చారు, బంగాళా దుంప వేపుడు చేసింది లహరి.  ఇంకా అప్పడాలు, పెరుగు పచ్చడి చూడగానే నోరు ఉరి పోయిందివాళ్ళకు. ఒక్కొకటి కొసరి కొసరి వడ్డించింది అందరికి. తృప్తి గా తిని సురేష్, లహరికి  థాంక్స్ మిద థాంక్స్ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళి పోయారు.

వాళ్లటు వెళ్ళ గానే సురేష్ లహరి మిద పడ్డాడు. "ఎంటే? నేను డ్రెస్ వేసుకోమ్మంటే చీర కట్టుకున్నావ్ అందరి ముందు పల్లెటూరి దానిలాగా" అన్నాడు కోపంగా.

"చీర అయితే కంపార్ట్ గా ఉంటుంది. అదే డ్రస్ అయితే మళ్ళి  చున్ని వేసుకోవాలి" అంది భయపడుతూ.

"చాల్లే నోర్ముయ్. వేదవ కారణాలు నువ్వు" అంటూ కసురు కున్నాడు.

లహరి ఏడ్చుకుంటూ బెడ్ రూం లోకి వెళ్ళి పోయింది.

మరునాడు సోమవారం ఆఫీసు కెళ్ళిన సురేష్ కు కాఫీ మెచిన్ రూం  లో కొలీగ్స్  తన గురించి ఎదో మాట్లాడు కుంటునారు అని అర్ధం అయింది. భయటే ఉండి వినసాగాడు.

"ఇన్ని రోజులు సురేష్ తన భార్యను చూపించక పొతే ఎదో అనుకున్నాను. ఇంత  అందమయిన భార్య ఉందని అనుకోలేదు. రంగు కాస్త తక్కువయినా అచ్చం బాపు బొమ్మర బాబు" అన్నాడు మెదటి కొలీగ్.

 "నాకు ఉంది పెళ్ళాం, ఎప్పుడు పొట్టి డ్రెస్ లు వేద్దామ, ఎప్పుడు ఎక్సపోజింగ్ చేద్దామ అని చూస్తుంటుంది. చీర కట్టుకుని పద్దతిగా ఏనాడూ లేదు" అన్నాడు రెండో కొలీగ్.

"అసలు ఆ అమ్మాయి ఎంత పాస్టు  రా ! గంటలో నలుగురికి రెండు కూరలతో వంట చేసేసింది. నా పెళ్ళాం నన్నే వండ  మంటుంది, కట్నం తెచ్చానన్న పొగరు తో" అన్నాడు మూడవ కొలీగ్.

ఇవన్ని వింటున్న సురేష్ కు మతి పోతోంది. వాళ్ళు చెప్పుతున్న ఒక్కో మాట తన మనసును బాణం ల గుచ్చుకొంటుంది.

"అసలు అలాంటి భార్యను వదిలి వీడు ఆఫీసులో ఇంతసేపు ఎలా ఉంటున్నాడో. మళ్ళి  వీకెండ్ పార్టిలు టంచనుగా వస్తాడు, మనమయిన ఎప్పుడయినా తప్పుతాం. నేనయితే ఇల్లు కదిలి బయటకు రాను రా అలాంటి భార్య ఉంటె" అన్నాడు నాలుగవ అతను.

సురేష్ కు తన తప్పులు ఒక్కొకటిగా గుర్తుకొస్తున్నాయి. నిజంగానే తను వజ్రన్ని  రాయి అని భ్రమ పడ్డాడు. లహరి పట్ల తన ప్రవర్తన గుర్తుకొచ్చి దుఖం పొంగుకొచ్చింది. గొంతును ఎవరో బలంగా నొక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒక్కసారిగా బోరుమని ఏడ్చేయాలనంత భాద. ఇంకా ఉండలేక పోయాడు ఆఫీసులో. వెంటనే ఇంటికి బయలు దేరాడు.

ఇంటి కి వెళ్ళి  తలుపు కొట్టిన సురేష్ కు జీన్స్ ప్యాంట్, స్లివ్ లెస్ టాప్  వేసుకున్న లహరి తలుపు తీసింది.

"ఎలా ఉందండి ?" అంటూ చూపించింది సంబరంగా ముందుకు వెనుకకు తిరిగి.

సురేష్ కు ఒక్కసారిగా దుఖం పొంగుకొచ్చింది.

లహరిని హత్తుకుని "నన్ను క్షమించరా బంగారం. నువ్వు నీలాగె ఉండు. పావురం లాంటి నిన్ను కాకిలా మార్చలనుకున్నాను. తప్పు నాదే" అంటూ ఏడుస్తున్న సురేష్ ను గుండెలకు హత్తుకుంది లహరి తృప్తిగా.

హనుమంతుడి కి తన బలం ఎదుటివాడు గుర్తుచేసే వరకు తెలియనట్లే , ప్రతి వాడికి తన భార్య  అందం, ప్రత్యేకత కనిపించదు, ఎ స్నేహితుడో కుళ్ళుకునే  దాక. సురేష్ కొలీగ్స్ భార్యలు కూడా ఎదో ప్రత్యేకత కలవారే కానీ వారికి అది కనిపించటం లేదు. ఆ మాటకొస్తే ప్రతి మనిషి లో ఓ ప్రత్యేకత ఉంటుంది, మనం దాన్ని గుర్తించి  వారిని మనసార ఇష్ట పడటం లోనే ఉంది తృప్తి.


(సమాప్తం)

14 వ్యాఖ్యలు:

 1. ఇది మహిళా లోకం సహించదు.! చీర కట్టి బాపు బుట్ట బొమ్మలా ఉండా లంటారా ? పప్పుచారు చేస్తూ 'కిచేనే'స్వారీ' చెయ్య మంటారా ?

  ఎక్కడ మహిళా బ్లాగర్లు. వెంటనే వచ్చి ఇక్కడ ఘెరావ్ చెయ్యాలి !

  చీర్స్
  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు చెప్పిన ఆఖరి వాక్యాలు బావున్నాయి.

   తొలగించు
  2. @జిలేబి నెను చెప్పింది ఒక్క మగవాడి మనస్తత్వం గురించి మాత్రమెనండి. ధన్యవాదలు

   @జ్యోతిర్మయి ధన్యవాధలు

   తొలగించు
 2. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా బాగా చెప్పేరు.
  నాదో చిన్న సలహా.
  ' పక్కోడి ' లాంటి ప్రయోగం భాషకి అందం ఇవ్వదు.
  మీరు సినిమాలు చూసి ప్రభావితం అయినట్లున్నారు .
  ' పక్క వాడి ' అన్న ప్రయోగం సరైనదీ చక్కటిదీను.
  కులగజ్జిని భాషకి కూడా అంటించే వారి ప్రయోగాలు చూసి భాషని పాడిచేసుకుని మీ సాహితీ వ్యాసంగానికి అన్యాయం చేసుకోకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిజమె సుమా ! ఇప్పుడె మర్చెసాను. చాల క్రుతజ్ఞతలు.

   తొలగించు
 3. chala bagundi! entho mandi bharthalu sarigga ilage pravarthistaru... vaarantha ilage aalochisthe aa bharyalu entho adrustavanthulu..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Chala bavundi..naku time dorikinapudu mi stories chaduvuthunanu, But among all this is good one.

  ప్రత్యుత్తరంతొలగించు