6, నవంబర్ 2012, మంగళవారం

లిప్ట్ లో దయ్యాలు

(ప్రతి ఒక్కరం ఎదో ఒక సమయం లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అప్పుడు మనతో ఎవరు లేరు అనుకుంటాం. కాని మనకు తెలియని విషయం ఏంటంటే ! మనల్ని వేరే వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు.  కానీ మనకు వారు కనిపించరు. అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతారు,  కొన్ని సార్లు ఇబ్బంది ఎక్కువయి మనం కూడా వారిలో కలిసి పోతాం. అలాంటి ఒక యదార్ద  సంఘటన కు కథ రూపం.)

సమయం రాత్రి 9 గంటలు, లక్ష్మి ఒక్కతే  ఉంది అపిసులో. తను ఒక మధ్యతరగతి సాప్ట్వేర్ కంపెనీలో HR  మేనేజర్ గా పని చేస్తోంది. రేపు కంపెని IT  పేమెంట్ చేయటానికి ఆఖరి రోజు కావటంతో HR డిపార్ట్ మెంటుకి సంబందించిన స్టేట్మెంట్ తయారు  చేస్తోంది. నిన్నటి దాక కసిన్ పెళ్ళి కావటంతో లివ్ లో ఉంది.  ఈ రోజు రావటం తోనే ఈ పని అంటగట్టాడు MD. ఇంత  లేటు గా పని చేయటం తనకు ఇదే మొదటి సారి.

ఆ మూడు అంతస్తుల  బిల్డింగ్ లో లక్ష్మి ఆపిసు ఉండెది మూడవ అంతస్తులో. రెండవ అంతస్తులో ఎదో యాడ్  ఏజెన్సీ, ఒకటవ అంతస్తులో ఎదో మార్కెటింగ్ ఏజెన్సీ  ఇంకా కింది అంతస్తులో ఆంద్ర బ్యాంక్ ఉన్నాయి. ఇంకా పార్కింగ్ అంత  సెల్లార్ లో చేసుకుంటారు.  అందరు 6 గంటలకే వెళ్ళి పోతారు, తను కూడా అలాగే వెళ్ళి పోయేది కానీ ఈ రోజు తప్పలేదు. అసలే రేపు  శనివారం కావటంతో ఒక్కరు కూడా లేరు, సాయత్రం అయిదు గంటలకే అందరు వెళ్ళి పోయారు. చిన్న కంపెని కావటం తో పెద్ద సెక్యూరిటీ కూడా ఉండదు, ఇద్దరంటే ఇద్దరు గార్డ్స్ ఉంటారు. 

అలా పనిచేసుకుంటూ ఉండేసరికి సమయమే తెలియలేదు తనకు. ఇప్పటికే ఇంటి నుంచి మూడు సార్లు ఫోన్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే నాన్న, తమ్ముణ్ణి  తీసుకుని వచ్చేస్తాడు అపిసుకి. తోమ్మిదిన్నరకల్ల బయలు దేరుతానని చెప్పింది ఇంట్లో వాళ్ళతో.

అక్కడనుండి తమ  ఇల్లు 5 కిలో మీటర్ల దూరమే కావటం కూడా తనకు కాస్త దైర్యం గా  ఉంది.  అనుకున్నట్లు గానే తొమ్మిదిన్నర కల్ల స్టేట్మెంట్ రెడి అయిపొయింది. కంప్యూటర్ ఆప్ చేసి బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ గార్డ్స్ లేరు. వాళ్ళు లిప్ట్ ముందు, ఎంట్రన్స్ దగ్గర టేబులు, కుర్చీలు వేసుకుని కూర్చుంటారు,  వేరే స్థలం కూడా ఉండదు అక్కడ.  మరి ఎటు వెళ్ళి  ఉంటారు అని అలోచించి, అయినా ఇప్పుడు వాళ్ళు ఎటు తగలడితే నాకేంటి ! అసలే ఆలస్యం అవుతోంది అనుకుని లిప్ట్ దగ్గరికి వెళ్ళి కిందికి వెళ్ళటానికి బటన్ నొక్కింది. 

లిప్ట్ డోర్ తెరుచుకోగానే అందులోంచి దిగారు ఇద్దరు గార్డులు. అందంగా ఉండే తనను ఇద్దరు కొరుక్కుని తిన్నట్లు చూడటం తను చాల సార్లు గమనించింది.

అయినా సరే దైర్యంగా కోపం నటిస్తూ "ఏంటి ! ఎక్కడికి వెళ్ళారు,  సెక్యూరిటీ ఉండకుండా?" అంది లక్ష్మి.

"ఏంటి మేడం ! ఇంత కష్టపడుతున్నారు, ఈ వయసులో. మీరు అనుకుంటే  ఎంత ఎంజాయ్ చెయ్యొచ్చు" అన్నాడు మొదటి వాడు కసిగా తనను చూస్తూ.

"సినిమాల్లో ఇంట్రెస్టు ఉందా మేడం మీకు! మా బావ ప్రోడ్యుసర్, నేనిపిస్తా హిరోయిన్ గా" అన్నాడు రెండో వాడు నాలుకతో పెదాలు తడుపుకుంటూ.

ఇంకా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదని అర్ధం అయిపొయింది లక్ష్మి కి. ఏదయినా ఉంటె రేపు చూసుకోవచ్చు వీళ్ళ  సంగతి, ముందుగా వీళ్ళ నుంచి  బయట పడాలి అనుకుని, వాళ్ళ  మాటలకూ నవ్వి నవ్వనట్లుగా నవ్వి "గుడ్ నైట్" అని చెప్పి వెనుకకు తిరిగి చూడకుండా లిప్ట్ ఎక్కేసింది. 

C బటన్ నోక్కటంతో కిందికి వెళ్తున్న లిప్ట్ రెండో ప్లోర్ కి వెళ్ళగానే ఆగి పోయినట్లు అనిపించింది. ఏమయి ఉంటుందా అని చూస్తుండగానే లిప్ట్ లో లైట్లు అన్ని ఆరిపోయి ఎమర్జెన్సి లైట్ వెలిగింది,  ఎక్కడో గుడ్డి దీపంలా.

లక్ష్మి గుండె ఆగినంత పని అయింది. భగవంతుడా ! ఎప్పుడేం చేయాలి. అసలు బిల్డింగ్ మెంటేనేన్స్ వాళ్ళు ఉన్నారో లేక ఎక్కడయినా తాగి పడి  పోయారో అనుకుంటూ భయపడి పోసాగింది. ప్రయత్నించి చూద్దాం  అనుకుని లిప్ట్  ఎమర్జెన్సి బటన్ నొక్కింది. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరు ఎత్తటం లేదు.  దేవుడా...... ఎవరయినా ఎత్తేలాగ  చూడు తండ్రి అనుకుని ఆత్రంగా చూడ సాగింది.

కొద్ది సేపటికి ఎవరో "హల్లో" అన్నారు విచిత్రమయిన గొంతుతో.

"నేను లిప్ట్ లో ఇరుక్కు పోయాను ! దయచేసి ఎవరయినా వచ్చి నన్ను బయటకు తియ్యండి" అంది లక్ష్మి బ్రతిమాలుతూ కంగారుగా.

అవతలి వ్యక్తీ బిగ్గరగా నవ్వి "ముగ్గురు వస్తారు ! నీ  దగ్గరికి" అని ఫోన్ పెట్టేసాడు. 

లక్ష్మి కి అతని వాలకం వింతగా అనిపించింది. తానూ లిప్ట్ లో ఇరుక్కు పోయాను అంటే నవ్వుతున్నాడు! గొంతు ఏంటో ఒక రకంగా ఉంది. పైగా ముగ్గురు వస్తారు అంటున్నాడు, అసలు ముగ్గురెందుకు. కొంపదీసి ఇది ఆ సెక్యూరిటీ గార్డుల పని కాదు కదా అనుకుంది భయపడుతూ.

ఒక్కసారిగా లిప్ట్ ను తేరిపార చూసింది. గుడ్డిగా వెలుగుతున్న ఎమర్జెన్సి లైటు, పైన వేలాడుతూ గాల్లో ఉన్నా లిప్టు, అందులో తనొక్కతే ! గుండెల్లో దడ  మొదలయింది. నుదురంతా  చెమట తో తడిసి పోయింది. ఇలాంటి పరిస్తితి వస్తుందనుకుంటే తమ్ముణ్ణి  రమ్మనేది.

అసలు వాళ్ళకు చెపితే ఎదో ఒకటి చేస్తారు అనుకుని సెల్ ఫోన్ తీసింది ఇంటికి  ఫోన్ చేద్దామని. కాని ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది! కారణం, ఎన్నడు లేనిది ఫోన్ లో సిగ్నల్ దొరకటం లేదు. ఒక్క పాయింట్ కూడా చూపించటం లేదు,  ఎప్పుడు ఒక్క పాయింటు కూడా తగ్గేది కాదు. లక్ష్మి లో భయం ఇంకా పెరిగి పోయింది. 

కొన్ని క్షణాల తర్వాత ఎవరో తన వెనుక నిలబడ్డారని అనిపించింది లక్ష్మి కి.  ఒక్కసారిగా వెనుకకు తిరిగింది, కాని ఎవరు లేరు ! ఇదంతా తన భ్రమ అనుకుంది. కాని లిప్ట్ లో ఎవరో ఉన్నారని తనకు బలంగా అనిపిస్తోంది. భయం భయం గా ఆ మూలకు  ఈ మూలకు చూడసాగింది.

ఒక్కసారిగా రెండు చేతులు తనను వెనుక నుండి పట్టుకుని గొంతు పిసక సాగాయి.  లక్ష్మి హడలి పోయింది. విడిపించు కోవాలని ప్రయత్నించింది, కానీ లాభం లేక పోయింది. ఆ చేతులు చాల బలంగా తన గొంతు పిసుకుతున్నాయి. తనకు ఉపిరి ఆడటం లేదు, కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి. కాసేపు పెనుగులాట తర్వాత,  ఒక్కసారిగా వదలి పోయాయి ఆ చేతులు.

లక్ష్మి కి జరిగింది నిజమా ! లేక తన భ్రమ అంతు పట్టడం లేదు. ఒళ్ళంతా భయం తో వణకి పోసాగింది, అసలు నిలబడలేక అలాగే ఓ మూల కూలబడి పోయింది. ఇంత  చిన్న లిప్ట్ లో ఎక్కడికి వెళ్ళ టానికి లేదు, ఎం చేయాలో అర్ధం కావటం లేదు.

 "ప్లీజ్ హెల్ప్ మి" అంటూ అరిచింది బిగ్గరగా ఏడుస్తూ. కానీ ఎవరు  వస్తున్నా దాఖలు లేదు.  

తనకు తెలిసిన దేవుని స్తోత్రాలు పాడు కోవాలని గుర్తు చేసుకుంటోంది. కాని ఒక్కటి గుర్తు రావటం లేదు ఆ భయం లో.

అతి కష్టం మీదా  "శ్రీ ఆంజనేయం ! ప్రసనంజానేయం" మాత్రం గుర్తు కొచ్చింది. ఓ మూల  నక్కి అది జపిస్తూ కూర్చుంది వణికి పోతూ. అంతలో లిప్ట్ లో అడుగుల చప్పుడు! అంతే  మంత్రం మరచి పోయి భయంతో ఏడువ సాగింది.

ఆ అడుగులు తనకు  దగ్గరవతున్నాయి, ఇంకా మూలకు నక్కి కూర్చుంది హడలి పోతూ. ఒక్కసారిగా తనను ఎవరో జుట్టు పట్టి ముందుకు లాగారు! అంతే  లిప్ట్ లో బోర్ల పడి  పోయింది. పడి  పోయిన తన మీద  ఎక్కి కూర్చున్నారు. తనకు ఉపిరి ఆడటం లేదు, పైకి లేవటానికి శక్తి సరిపోవటం లేదు. అరవటానికి నోరు రావటం లేదు, బాధతో కాళ్ళు, చేతులు ఆడించలనుకుంది కాని సాద్యం కావటం లేదు. అశక్తు రాలిగా అలాగే పడుకుండి పోయింది. కొద్ది సేపటికి బరువు దిగి పోయింది.

దిగ్గున లేచి నిలబడి ఏడువ సాగింది, తనకు ప్రాణాల  మీద  ఆశ పోయింది. ఎవరు తనను కాపాడుతారు? ఇక్కడి నుంచి ఎలా బయట పడాలి అనుకుంటూ నిరసించి పోయింది. గొంతు తడి అరి పోతోంది! అయినా తెలియటం లేదు భయంతో. అఫిసులో ఉన్నప్పుడు అకలేసింది ! దాని సంగతే మర్చి పోయింది.  ఒళ్ళంతా చెమటలు పోసి వర్షం లో తడిసినట్లు అయిపొయింది. 

అలాంటి సమయం లో, ఒక్కసారిగా లిప్ట్ లో లైట్లు అన్ని వెలిగాయి. లిప్ట్ పని చేయటం మొదలు పెట్టింది, లక్ష్మి నమ్మలేక పోయింది! పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. లిప్ట్ నెమ్మదిగా పస్ట్  ప్లోర్ చేరింది.

అప్పుడు లక్ష్మి కి ఒక ఆలోచన వచ్చింది "ఫోన్ లో వ్యక్తీ ముగ్గురు వస్తారు అన్నాడు! అంటే మూడవ వ్యక్తీ సెల్లార్ లో ఉంటాడ?" ఆ ఆలోచన రావటం తోనే లక్ష్మి వెన్నులో వణుకు మొదలయింది.

లిప్ట్ సెల్లార్  లో ఆగింది, కాని డోర్  తెరుచు కోవటం లేదు. లక్ష్మి డోర్  ఓపెన్ చేసే బటన్ నోక్కసాగింది ఆత్రంగా.

కొద్ది సేపటికి "దడేల్" మని డోర్  తెరుచుకుంది. కాని బయట అడుగు పెట్టాలంటే దడగా ఉంది. బయట చుస్తే ఎవరు లేరు, ఆ మూల  ఒక్కటి, ఈ మూల ఒకటి అన్నట్లుగా రెండు లైట్లు వెలుగుతున్నాయి గుడ్డిగా.  చూడటానికే చాల భయం పుట్టేల ఉన్నాయి ఆ పరిసరాలు.

అయినా  తప్పేదేముంది అనుకుని బయటకు వచ్చింది లిప్ట్ నుంచి. రెండు అడుగులు వెయ్యగానే! ఎవరో తనను వెనుకకు లాగుతున్నట్లుగా అనిపించింది. బలంగా ముందుకు అడుగేసింది కాని అంగుళం కూడా కదల లేక పోయింది. గట్టిగా అరిచింది కాని మాట బయటకు రాలేదు.

అలాగే నిలబడి పోయిన తనను ఎవరో ఒక్కసారిగా చెంప చెల్లు మనిపించారు. అంతే చుక్కలు కనిపించాయి! వెంటనే మరో చెంప మొదటి దాని కన్నా బలంగా. ఈ సారి ఏకంగా కళ్ళు బైర్లు కమ్మాయి. కాసేపటికి పట్టు వదిలి పోవటంతో పరుగు పరుగున రోడ్డు మిద కొచ్చింది బతుకు జీవుడా అనుకుంటూ.

కొద్దిసేపటికి  తేరుకుని ఇంటికి పోన్ చెయ్యాలని సెల్ తీసి, నంబరు డయల్ చేస్తుండగా ఫోన్ మోగింది. నంబరు Unknown  అని ఉంది, ఎత్తి "హలో"  అంది భయం భయంగా.

మూడు గొంతులు బిగ్గరగా నవ్వుతు "లిప్ట్ బాగాయిందా" అన్నాయి. అంతే  ఫోన్ విసిరి కొట్టింది. 

అప్పటికే సమయం పది గంటలు దాటటంతో లక్ష్మి తమ్ముడు, నాన్న వచ్చారు. 

"బండి రేపు తీసుకోవచ్చు" అని చెప్పి వాళ్ళతో  ఇంటికి వెళ్ళి పోయింది. 

జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు, నమ్మక పోగా నవ్వుతారని. ఎందుకంటే  ఇలాంటి సంఘటన ఇంతకూ ముందు  ఎప్పుడు జరిగిన దాఖలు లేవు ఆ బిల్డింగ్ లో. 

కారణం! ఆ బిల్డింగ్ కి పనిచేసిన ముగ్గురు  కూలీలు చని పోయిన రోజు మాత్రమే ఆ లిప్ట్ తొమ్మిది దాటినా తర్వాత ఎమర్జెన్సి లోకి వెళ్ళి పోతుంది. ఆ రోజు ఎప్పుడంటే...........


(మీ ఆఫీసు లో లిప్ట్ ఆగి పోయినప్పుడు తెలుస్తుంది. అంత వరకు జాగ్రత్త)

4 వ్యాఖ్యలు:

 1. భయపెట్టారు.
  హార్రర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారా? :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చూడటం లేదు కాని, మీ వాఖ్యను బట్టి నా ప్రయత్నం పలించిందని చాల సంతోషంగా ఉంది. మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.

   తొలగించు
 2. డిటెక్టివ్ నవల చదువుతున్నట్లుంది :)

  ప్రత్యుత్తరంతొలగించు