10, నవంబర్ 2012, శనివారం

చేతబడి !!! - 1

(చేతబడి ఉందా లేదా అనే తర్కం చేసే ముందు ఒక్కటి గుర్తిదాం. వెలుగుకు వికృతి చీకటి, మంచికి  వికృతి చెడు ఉన్నట్లే, దైవ శక్తికి వికృతి దుష్ట శక్తి. ఆ దుష్ట శక్తులను వాడుకుని పనులు జరిగించుకోవటమే చేతబడి.)

అది ఒక దట్టమయిన అడవి, దాని చుట్టూ కొన్ని పల్లెలు. ఒక మద్య వయసు అడ మనిషి ఒక్కతే నడుచుకుంటూ వెళుతోంది. కారు, అడవి బాటలో పట్టక పోవటంతో, సిటి నుంచి పది కిలోమీటర్లు కారు మీద వచ్చిన తానూ అడవిలో ఒంటరిగా నడిచి వెళ్తోంది.

చేతిలో ఒక బ్యాగు అందులో ఆరు లక్షల వరకు డబ్బు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఒక్క గుడిసె కనిపించింది. అది చూడటంతోనే ఇంకా ఉత్సాహంగా అడుగులు వేయసాగింది.

ఎవరో స్నేహితులు చెప్పిన ఆనవాల ప్రకారం గుడ్డిగా వెళ్తున్న తనకు మాంత్రికుడు నాగులు ఉండే చోటు ఇంత  త్వరగా దొరుకుతుందని అనుకోలేదు. కొద్దిసేపటికి నాగులు ఉండే గుడిసెను చేరుకుంది.  రావటం అయితే వచ్చింది కాని లోపల మాత్రం చాల భయంగా ఉంది తనకు.

అ పరిసరాలన్నీ వింతయిన వస్తువులతో నిండి ఉన్నాయి. మద్యాహ్నం అయిన కూడా, దట్టంగా చెట్లు ఉండటంతో వెలుగు సరిగా రాక, సాయంత్రంల ఉంది అక్కడ. నెమ్మదిగా వెళ్ళి తలుపు కొట్టింది. 

రెండు నిమిషాల తర్వాత ఒక నలబై సంవత్సరాల వయసున్న నల్లని వ్యక్తీ భయటకు వచ్చాడు.  మాసిన గడ్డం, గుబురు మీసాలు, పొడవయిన జుట్టు, రూపాయి బిళ్ళంత పసుపు బొట్టు తో, మెడలో ఏవో తాయత్తులు వేలాడుతూ, చొక్కా లేకుండా, లుంగీ మాత్రమే కట్టుకుని చూడటానికే భయం పుట్టేలా ఉన్నాడు.

కాని ధైర్యం చేసి అడిగింది  "నాగులు గారిని కలవాలి" అని వణుకుతున్నా స్వరంతో.

గంబిరమయిన కంటంతో "నేనే నాగులు. నువ్వెవరు?" అడిగాడు ఆమెను తదేకంగా చూస్తూ.

"నా పేరు సరోజ. మాది పక్కనే ఉన్నా సిటి. మీతో కాస్త పనుండి వచ్చాను" అంది.

"సిటి వాళ్ళకు నాతొ ఎం పని. అడవిలో ఉంటూ పూజలు చేసుకునే వాణ్ణి" అన్నాడు నాగులు ఆశ్చర్యం నటిస్తూ.

అతను  అలా అనేసరికి తన విషయం ఎలా చెప్పాలో అంతు  పట్టటం లేదు సరోజకు. నీళ్ళు నములుతూ నిలబడి పోయింది.

"ఇంతవరకు వచ్చి చెప్పక పొతే ఎలా? నాకు చేతనయినా సహాయం చేస్తాను. ఫర్వాలేదు చెప్పు" అన్నాడు ఆదేశిస్తునట్లుగా. సరోజకు కాస్త ధైర్యం వచ్చింది.

"ఈ మద్య  మా అయన నాతొ సరిగా ఉండటం లేదు. చిటికి మాటికి కోప్పడుతున్నాడు. పిల్లలు లేరని నన్ను చులకనగా చూస్తున్నాడు. ఎందుకిలా అని అరాతిస్తే, దేన్నో తగులు కున్నాడు. అంతే కాకుండా నాకు విడాకులు ఇచ్చి, దాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే నేను రోడ్డు మిద పడాలి. మిరే ఏదయినా చేసి వాళ్ళిద్దరు చచ్చిపోయే లాగ చూడాలి" అంది సరోజ కసిగా.

నాగులు చిన్నగా నవ్వి "అతను ఇంకెవరినో తగులు కున్నాడని నీకు అనుమానమా? లేక చూసావా?" అన్నాడు.

"ఇదిగోండి స్వామి, నేను నియమించిన మనిషి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసిన ఫోటో" అంటూ బ్యాగులోంచి తీసి చూపించింది.

అందులో ఒక నలబై యేళ్ళ  మగమనిషి, పాతికేళ్ళ అందమయిన యువతి ఉన్నారు. 

ఫోటో ను తీక్షణంగా చుసిన నాగులు "విడాకులు ఇస్తే నీకు భరణం వస్తుంది కద! చంపటం దేనికి?" అన్నాడు.

"కోట్ల ఆస్తి వస్తుంటే ముష్టి భరణం ఎవ్వడికి కావాలి స్వామి. వాడు నాకు దక్కకుండా సుఖ పడి పోవటానికి వీల్లేదు. విడాకులకు  ముందే చస్తే, వాడి ముసలి తల్లి, తండ్రిని ఎదో రకంగా మాయ చేసి, ఆస్తంతా నా సొంతం చేసుకుంటా" అంది లోలోపల సంబర పడి  పోతూ.

"అలాగే చేద్దాం. కాని పది లక్షల వరకు  ఖర్చు అవుతుంది. ఇంకో విషయం, ఇది ఎవరికయినా తెలిసిందో నువ్వు కూడా చస్తావ్" అన్నాడు బెదిరిస్తూ.

"ఆరు లక్షలు నాతోనే తెచ్చాను స్వామి, మిగతావి పని అవ్వగానే తీసుకొస్తా. ఈ విషయం మనకు తప్ప ఎవరికీ తెలియనివ్వను. అయినా నా గోతి నేను తవ్వుకుంటాన" అంటూ చిన్నగా వణుకుతున్న చేతులతో బ్యాగులోంచి డబ్బులు తీసిచ్చింది సరోజ.

"ఆ ఫోటో ఇచ్చి నువ్వు వెళ్ళ వచ్చు" అన్నాడు నాగులు నిర్లక్ష్యంగా.

సరోజ అనుమానంగా చూస్తూ "స్వామి !  చేతబడి చెయ్యాలంటే చేసే వాళ్ళ జుట్టు లేదా వారు తొక్కిన మట్టి అడుగుతారు. మీరు ఏమి అడుగలేదు" అంది.

నాగులు కోపంగా "నన్నే అనుమానిస్తున్నావా!" అంటూ కళ్ళెర్ర చేసాడు.

అంతే! సరోజ గుండెలు జారి పోయాయి, నాగులు కాళ్ళ మిద పడిపోయి  భయంతో వణికి పోతూ "క్షమించండి స్వామి! తెలియక అడిగాను. అనుమానంతో కాదు" అంది.

నాగులు ఆమె జుట్టు పట్టి పైకి లేపి చెవిలో రహస్యంగా చెప్పాడు "ఈ పోటోయే చాలు వాళ్ళు చావటానికి" అని.

అంతే  సరోజకు ఎక్కడ లేని ఉషారు వచ్చింది. తను ఫోటో తెచ్చింది మంచిదయింది, పని తొందరగా అవుతుంది. లేక పొతే వాళ్ళ జుట్టుకు, మట్టికి చాల కష్ట పడవలసి వచ్చేది అనుకుని తన తెలివికి మురిసి పోయింది. 

చుట్టూ ఉన్నా ప్రతి పల్లెలో తాను బెదిరించి గుప్పెట్లో పెట్టుకున్న మనుష్యులు ఉన్నారు నాగులుకు. ఎక్కడయినా ఎవరయినా చనిపోతే వచ్చి నాగులుకు చెపుతారు. గంట క్రితమే సీతారాం పల్లెలో ఎవరో చనిపోయారని తన మనిషి వచ్చి చెప్పాడు. కాస్త ఎంగిలి పడి, రాత్రి 11 గంటల ప్రాంతంలో బయలుదేరి 12 గంటల కన్న ముందే ఆ పల్లె చేరిపోవచ్చు అనుకున్నాడు. అనుకున్న విధంగానే భోంచేసి కాలి నడకన బయలు దేరాడు. ఉరి ముందు నుండి కాకుండా చివరనుండి వెళ్ళి శ్మశానం చేరుకున్నాడు.

కొన్ని గంటల క్రితమే శవాన్ని పూడ్చినట్లున్నారు, ఇంకా అగరొత్తుల వాసన వదలలేదు ఆ ప్రాంతం. వెంట తెచ్చుకున్నా చిన్న గునపంతో తవ్వ సాగాడు మట్టితో పూడ్చిన ఆ సమాధిని. కాస్సేపటికి శవాని భయటకు తీసి, ఎప్పటి లాగే సమాది పుడ్చేసాడు. ఎవరికీ అనుమానం రాకుండా యధవిధిగా అద్దాడు చేతులతో. ఒకవేళ అనుమానం వచ్చిన ఎ నక్కో లేక కుక్కో అనుకుంటారు కాని ఇలాంటి అనుమానం మాత్రం రాదు అనుకున్నాడు నాగులు.

శవాన్ని భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. ఆ రోజు శనివారం, అమావాస్య అందుకే చిమ్మ చీకటి కమ్ముకుంది. నాగులు ఎ మాత్రం తడబడకుండా వడి వడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. 

*****************************************

అది ఒక త్రి స్టార్ హోటల్ రూం. అ సిటి లోనే ఖరీదయిన హోటల్ లో నలబై ఏళ్ళ మగమనిషి, పాతికేళ్ళ యువతి కుర్చుని   ఉన్నారు. అతని చేతిలో విస్కీ గ్లాసు, ఆమె చేతిలో బీర్ టిన్. ఇద్దరు తమ డ్రింక్స్ తాగుతూ, మద్య మద్య లో ప్లేటు లో ఉన్నా చికెన్ ముక్కలు తింటున్నారు.

ఆ యువతి అతనితో అంటోంది గోముగ "ఏంటి రాజేష్ ! మీ ఆవిడకు విడాకులు ఎప్పుడు ఇస్తావ్? మనం ఒక్కటి అయ్యేది ఎప్పుడు".

"రేఖ డార్లింగ్ ! లాయర్ తో మాట్లాడం కద. అతను  టైం పడుతుంది అంటే నన్నేం చెయ్యమంటావ్" అన్నాడు విసుగుగా.

రేఖ కంగారు పడి పోయి "అయ్యగారికి అంత కోపమా? ఎదో నీ  సొంతం అయిపోవాలన్న తొందరలో అడిగాను  కాని, నాకు మాత్రం తెలియదు నీ ప్రేమ,  నేనంటే" అంది అతన్ని బుజ్జగిస్తూ.

"సొంతం చేసుకోవటానికి పెళ్ళే చేసుకోవాల? ఇలాంటి ఏకాంతం సరిపోదు" అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు రాజేష్.

"ఈ  కబుర్లతోనే నన్ను మాయచేసి బుట్టలో వేసావు" అంది రేఖ అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ. 

**********************************************

ఇంటికి చేరిన నాగులు శవాన్ని శుబ్రపరచి గుడిసె లోపలికి తెచ్చాడు. ఓ పొడవాటి కత్తితో శవం తల నరికేసాడు. బుస్సుమని రక్తం బయటకు వచ్చింది, దాన్ని ఒక గిన్నెలో పట్టాడు. పొయ్యి వెలిగించి ఓ పెద్ద పెనం పెట్టి దాని మీద శవం నుంచి నరికిన తల పెట్టాడు.

సరోజ ఇచ్చిన రాజేష్, రేఖల ఫోటోను గిన్నెలో పట్టిన రక్తం తో తడిపి కుంకుమ ,పసుపుతో చేసిన ముగ్గు మద్యలో పెట్టాడు. పెనం మిద ఉన్నా  తల కాలుతూ కమురు వాసన రాసాగింది. అయినా అదంతా తనకు ఇష్టమే అన్నట్లుగా ఏవో మంత్రాలూ చదువుతూ, మద్య మద్య లో రాజేష్, రేఖల ఫోటో మీద కుంకుమ చల్లుతున్నాడు.

ఆ దృశ్యం చూడటానికే భయంకరంగా ఉంది. అక్కడి వాతావరణం కుడా అలాగే తయారయ్యింది. చెట్లు భయపడి వణికి పోతున్నయేమో! హోరు మని గాలి వీస్తోంది. ఆ కమురు వాసనకు చెట్ల మిద నాలుగయిదు గబ్బిలాలు చేరాయి.

ఎక్కడో దూరంగా "హూ" అంటూ నక్క అరుస్తోంది. పిట్టలు తట్టుకోలేక కిచ కిచమంటూ ఒక్కటే గోల పెడుతున్నాయి. ఇవ్వేవి పట్టని  నాగులు మాత్రం తన పనిలో నిమగ్నమయ్యాడు. కొద్ది సేపటి తర్వాత పెనంలో ఉన్నా శవం తలకు నిప్పు రాజుకుంది. గిన్నెలో పట్టిన రక్తాన్ని కొద్ది కొద్ది గా పోస్తూ మంత్రాలూ చదువుతున్నాడు.

రక్తం అంత అయిపోయాక, రాజేష్, రేఖల ఫోటో వేసాడు ఆ మంటలో, తలతో పాటు కాలి పోయింది.  ఆ తర్వాత ఆ బూడిదను ఎత్తి గోధుమ పిండితో కలిపాడు. రక్తం పట్టిన గిన్నెలో నీళ్ళు పోసి చపాతీ పిండి మాదిరి పిసికి రెండు బొమ్మలు చేసాడు. ఒక్కటి రాజేష్ ది  రెండవది రేఖది. 

హోటల్లో  బెడ్ మీద  పక్క పక్కనే  పడుకున్నారు రాజేష్, రేఖ. నాగులు ఏవో మంత్రాలూ చదివి రెండు బొమ్మలను ఒక దానిపై ఒకటి పడుకోబెట్టాడు. అంతె! ఆద మరచి నిద్ర పోతున్న ఇద్దరు శృంగారంలోకి దిగిపోయారు.

నాగులు ఎలా పడుకో బెడితే అలాగే పడుకుంటున్నారు. ఎవరి బొమ్మ మిద ఉంచితే, వారు మిద, ఎవరి బొమ్మ చేయి నాగులు ఎలా కదిపితే, అలాగే చెస్తున్నారు యాంత్రికంగా. కాసేపు అలా  ఆడించిన తర్వాత ఒక పెద్ద సూది చేతిలోకి తీసుకున్నాడు నాగులు.

సూదితో రాజేష్ బొమ్మ తలలో పొడిచాడు. అంతే  రాజేష్ "అబ్బా" అంటూ తల పట్టుకున్నాడు.

రేఖ ఏమయింది అని అడిగేలోపే, ఆమె బొమ్మ కడుపులో పొడిచాడు సూదితో. "అమ్మా" అంటూ కడుపు పట్టుకుంది. ఈ రకంగా ఒక్కసారి కాలి పై, వీపుపై, మరోసారి చేతిపై పొడుస్తూనే ఉన్నాడు. వారు భాదతో మెలికలు తిరుగుతూనే ఉన్నారు. పొడిచి పొడిచి విసిగి పోయిన నాగులు రెండు బొమ్మల తలలు విరిచేశాడు. అంతే ! రాజేష్, రేఖ ఇద్దరు గిల గిల తన్నుకుని చనిపోయారు.

మరునాడు సరోజ ఏమి తెలియనట్లే హోటల్ కు వెళ్ళింది. అప్పటికే రాజేష్ అమ్మ నాన్న వచ్చి ఉన్నారు. ఎం జరిగిందో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఒక్కగానొక్క కొడుకు హటాత్తుగా కారణం తెలియకుండా చనిపోవటం రాజేష్ తండ్రి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఎవరికీ తెలియకుండా రాజేష్ ది, రేఖది జుట్టు తీసుకున్నాడు. 

*******************************************

కర్మ కాండలు అయిపోయిన వారం రోజులకు తనకు తెలిసిన మాంత్రికుడి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు రాజేష్ తండ్రి.

ఆ ఇద్దరి జుట్టు తో అంజనం వేసిన మాంత్రికుడు "వారి పై చేతబడి జరిగింది" అని  చెప్పాడు.

ముందుగా అనుమానం సరోజ పైనే వచ్చింది. రాజేష్ తండ్రి  "అది కూడా అలాగే చావాలి. అంతకన్నా ముందు అది చేసింది  ఎవడో, దయచేసి చెప్పండి" అన్నాడు మంత్రికుడితో.

"ఈ చుట్టూ పక్కల ఇలాంటివి చేసే వాడు ఒక్కడే ఉన్నాడు, నాగులు వాడి పేరు. డబ్బుకు కక్కుర్తి పడి మిడి మిడి జ్ఞానంతో విర్ర విగుతున్నాడు" అన్నాడు మాంత్రికుడు.

"వాడిని ఏమి చేయలేమా?" అన్నాడు రాజేష్ తండ్రి కోపంగా, కసిగా.

"చేయోచ్చు, మీ అబ్బాయి, అ అమ్మాయి జుట్టు తో.  ఎవడయితే శక్తిని పంపాడో తిరిగి వాడి మీదికి అదే శక్తిని పంపవచ్చు. చేతబడి వల్ల  చనిపోయిన వారి  అణువణువునా ఆ శక్తి ఆనవాలు ఉంటాయి కొద్ది కాలం పాటు. మీరు జుట్టు తీసుకోవటం మంచిది అయ్యింది" అన్నాడు మాంత్రికుడు మెచ్చుకోలుగా చూస్తూ. 

*******************************************

తనకు అడ్డు తొలగి పోయిందని సంతోషంగా సరోజ అడవిలోకి నాగులు దగ్గరికి బయలు దేరింది, మిగత డబ్బు ముట్ట చెప్పాలని. అక్కడ నాగులుకి ఎదో జరగ బోతోందని అనిపించ  సాగింది. పరిసరాలు పరికించి చూస్తూ అటు ఇటు తిరుగున్న తనకు దూరంగా సరోజ వస్తు కనిపించింది.

నాగులు ను సమీపించి "అనుకున్నంత పని చేసారు స్వామి. మీ ఋణం ఉంచుకోను. ఇదిగో మిగత నాలుగు లక్షలు" అంటూ డబ్బు ఇవ్వ బోయింది.

"తొందరేముంది  తీసుకుంటాను, కాసేపు కుర్చుని వెళ్దువుగాని, రా" అంటూ లోపలికి  దారి తీసాడు.

రానంటే ఎక్కడ కోప్పడుతాడో అని భయపడుతూనె లోపలికి అడుగు పెట్టింది. ఒక్కసారిగా గుడిసె కిటికీ తలుపు దబ్ మని తెరుచుకుంది. హోరు మని గాలి గుడిసెను చుట్టూ ముట్టింది. నాలుగుకు విషయం అర్ధం అయ్యింది, ఎవరో తన శక్తిని తన మీదికే పంపిస్తున్నారు. దాన్ని ఆపడం ఎలాగో తనకు తెలియదు.

అంతే ! పక్కనే ఉన్నా  తాడుతో సరోజను గుంజకు కట్టేశాడు. ఏవో మంత్రాలూ చదువుతూ సరోజను చూపించ సాగాడు. గాలి ఇంకా ఎక్కువయింది. అ గాలి తాకిడికి గుడిసె పై కప్పు కూడా ఎగిరి పోయేలా ఉంది. గుడిసె కూలి పోతుందనగా భయటకు పరుగెత్తాడు నాగులు. 

సరోజ మాత్రం కేకలు పెడ బొబ్బలు పెడుతూ బయటకు రాలేక అక్కడే ఉండి పోయింది. కాస్సేపటికి తన అరుపులు ఆగిపోయాయి. గుడిసె పేళ పెళ మంటూ కూలిపోయి నిప్పు అంటుకుంది. నాగులు ఏవో మంత్రాలూ చదువుతూ పరుగెడుతూనే ఉన్నాడు.

"నా గోతి నేను తీసుకుంటాన" అన్నా సరోజ నిజంగానే తన గోతిని తానే తవ్వుకుంది. దొరికే దానితో తృప్తి పడకుండా. 


(ఎవరికయినా చేతబడి కావాలంటే నాగులు బతికే ఉన్నాడు)

రెండవ భాగం కోసం ఇక్కడ నొక్కండి 


3 వ్యాఖ్యలు:

  1. కధ బాగుందండి..... ఇంతకీ ఆ నాగులు ఇప్పుడేం చేస్తున్నట్లో:-)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @chinni చాల సంతొషం

    @Padmarpita ధన్యవాదలు. మీ ID పట్టుకుని మి దగ్గరకి వచ్చె ప్రయత్నంలొ ఉన్నడు జగ్రత్త :) :)

    ప్రత్యుత్తరంతొలగించు