7, మార్చి 2013, గురువారం

ప్రేమించలేని ప్రేమ ! ఎందుకు ?

నా పేరు నిర్మల మేరి. రెండేళ్ళ క్రితం  బి. యస్సి నర్సింగ్ పూర్తీ చేసుకుని ఒక ప్రైవేటు హాస్పిటల్  లో  నర్సుగా పని చేస్తున్నాను. రోజు లాగే హాస్పిటల్ కు వచ్చిన నాకు నా కొలీగ్స్ జ్యోతి, సరళ తెగ నవ్వుకుంటూ కనిపించరు. రిజిస్టార్ లో సైన్ చేసి స్టాఫ్ రూం  లోకి అడుగుపెట్టాను. ఇద్దరు ఒక్కేసారి "గుడ్ మార్నింగ్" అంటూ పలకరించారు. "వేరి గుడ్ మార్నింగ్. ఎంటే  తెగ నవ్వు కుంటున్నారు! ఈ రోజు ఎవరు బలి అయ్యారు మీ కుళ్ళు జోకులకు" అంటూ ఆరాతిసాను.

ఇద్దరు ఒకేసారి ఘోల్లుమని నవ్వి పోటీలు పడుతూ చెప్పటం ప్రారంబించారు. "ఈ రోజు మన హాస్పిటల్ కు ఒక మనిషిని పోలిన ఏనుగు వచ్చిందే, అసలు ఆవిడను చూస్తే ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది" అంది జ్యోతి. దానికి సరళ వంత  పాడుతూ "బిపి చూడటానికి వెళ్తే ఆవిడా చేయికి బెల్టు సరిపోలేదంటే నమ్ము!" అంది. వెంటనే జ్యోతి "అసలు కుర్చీ సరిపోక డాక్టరు కోసం చూస్తూ  అక్కడే నిలబడి ఉంది చూడు" అంటూ క్యాసువల్  వార్డు వైపు చూపించింది.

నిజమే ఆవిడా చాల లావుగా ఉంది ! నిలబడ లేక అవస్తపడుతున్న ఆమెను చూసి నాకు చాల జాలేసింది. ఒక ఐరన్  స్టూలు తిసుకేళ్లి  ఆవిడకిచ్చి "దినిమిద   కూర్చోండి" అన్నాను. ఆవిడా కళ్ళలో ఎంతో సంతోషం, కృతజ్ఞత నాకు కనిపించాయి. "థాంక్యు వేరిమచ్" అంటూ కూర్చుంది. కొద్ది సేపటికి ఆవిడ వంతు వచ్చి డాక్టరు వద్దకు వెళ్ళింది లోపలికి.

 ఆతర్వాత జ్యోతిని పిలిచి ఆవిడకు ఏవో టెస్టులు చేయాలి బ్లడ్ తీసుకొమ్మని చెప్పింది డాక్టర్. ఆవిడను ఖాళిగా ఉన్న ఓ రూములోకి తీసుకెళ్ళింది జ్యోతి. కొద్దిసేపటికి పడి పడి  నవ్వుతు బయటకు వచ్చింది. ఆవిడా మాత్రం ఏమి జరగనట్లు గానే బిల్లు కట్టేసి వెళ్ళిపోయింది. "అసలు  ఎం జరిగిందే అంతగా నవ్వుకుంటూ వచ్చావు" అని అడిగిన సరళ తో ఇంకా నవ్వుతు "అయ్యా బాబోయ్ అసలు అదేం వోళ్ళే  బాబు ! ఎక్కడ చుసిన కండ, ఆ నరాలు పట్టుకోవటంలో పడ్డ కష్టంతో నా యంబిబియాస్ అయిపోయేదేమో" అనటంతో నీళ్ళు తాగుతున్న సరళ ఒక్కసారిగా నవ్వే సరికి తన నోట్లో నీళ్ళు  స్విపరు వెంకమ్మ మిద పడ్డాయి. అయిన సరళ ఇంకా నవ్వుతూనే ఉంది. వెంకమ్మ మాత్రం "మాయదారి సంత మాయదారి సంత, అసలు నర్సులన్నట్లే గని చిన్న పిల్లలకు మల్లె ఇక ఇకలు పక పకలు" అంటూ గోనుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు మాత్రం ఇంకా ఏవేవో ఉహించుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు.

నాకు మాత్రం ఆవిడను చూస్తుంటే మా పెద్దక్క గుర్తుకొస్తుంది. మేము అయిదుగురు ఆడపిల్లలం ! మగ పిల్లడి కోసమని మా ఆమ్మ నాన్న మా అందరిని కనేసారూ. మా నాన్న గవర్నమెంటు టీచరుగా  పని చేసేవారట. ఏదో ఆక్సిడెంట్ లో నా రెండేళ్ళ వయసప్పుడే చనిపోయారు. దానితో దిగులు పడి మా ఆమ్మ కూడా మరో రెండేళ్లకు నాన్న దగ్గరికే వెళ్లి పోయింది.

మా పెద్దక్కకు నాకు పదమూడేళ్ళ తేడా ఉంటుంది. అమ్మ నాన్న లేని మమల్నిమా  పెద్దకే సొంత బిడ్డలుగా పెంచింది. థైరాయిడ్ సమస్య వల్ల తను లావుగా ఉండేది. అయిన కూడా మాదగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని ఉషారు వచ్చేది తనకు. మాకు పెద్దగ ఆస్తులు లేవు, ఉళ్ళో  ఉన్న ఎప్పుడో తాతల నాటి మూడు ఎకరాల భూమి తప్ప.  మా చదువుల కోసం అక్క  ఓ ప్రైవేటు స్కూల్ లో ఇంగ్లిషు టీచరుగా పని చేసేది. దాంతో పాటు మా మేనత్తలు కూడా చేతనయిన సహాయం చేసేవారు.

తను మా అక్కే గాని ఏరోజు తన పెద్దరికం పోగొట్టుకోలేదు ! తానంటే మా అందరికి భయమే. ఒక్క మా రెండో అక్కే కాస్తా చనువుగా ఉండేది. మా కోసం తపించి పోయే మా అక్కంటే మాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉండేవి. మా మేనత్తలు ఎప్పుడయిన పెళ్లి చేసుకొమ్మంటే "నన్ను భరించేవాళ్ళు ఎవరుంటారు అత్తా ! అయిన నాకిప్పుడు ఏం తక్కువయిందని, పెళ్లి కాకుండానే నలుగురు పిల్లలకు తల్లినయ్యను ఇంతకన్నా ఏముంటుంది పెళ్ళయితే మాత్రం" అంటూ దాటావేసేది. అక్క నిజంగానే మా అమ్మ నాన్నలని మర్చిపోయేలా చేసింది. క్రిస్మస్ వచ్చిందంటే చాలు మేము ఎవరిని దినంగా చూడకూడదని అందరికి కొత్త బట్టలు తీసేది, తను మాత్రం ఏవో పాత వాటితోనే సర్డుకునేది. "అదేంటక్క నువ్వు తిసుకోలేదంటే" "నా కిష్టం లేదు తీసుకోలేదు, అయినా నా గురించి మికేందుకే నోరు మూసుకొని చర్చ్ కేల్లండి" అని  మమ్మల్ని గద్దించి పంపేసి తానూ మాత్రం మా కోసం వంటలు, పిండి వంటలు చేస్తూ ఇంట్లోనే ఉండి  పోయేది.

నా వయసు పెరుగుతున్న కొద్ది అక్క మా కోసం చేసే త్యాగాలు నాకు అర్థమవటం మొదలు పెట్టాయి. ఎన్నోసార్లు అక్కను అడుగుదమనుకున్నాను "ఇన్ని కష్టాలు పడుతూ, నీకంటూ జీవితం లేకుండా మమల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువగా పెంచుతున్నావ్ ! ఎందుకక్క మేమంటే నీకు అంత ఇష్టం" అని కాని నాకు ధైర్యం సరిపోలేదు. అందరిలోకి చిన్నదన్నని అక్క నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. కాని చదువులో ఎప్పుడు పస్ట్  రావాల్సిందే. అక్క చదివింది ఇంటర్ అయిన డిగ్రి లెక్కలు కూడా  చెప్పేది అక్క   వాళ్ళకు.  అసలు తనకు కొద్దిలో స్టేట్ ర్యాంక్ మిస్ అయిందట టెన్త్ క్లాస్ లో.

చదువుకుని ఎంతో  గొప్ప స్తితిలో ఉండగలిగే మా అక్క మా కోసం తన జివితనే త్యాగం చేసింది. అక్కకు వయసు అవుతున్న కొద్ది లావు పెరగటం మొదలు పెట్టింది. ఎ చిన్న పనిచేసిన  తొందరగా  అలసి పోయేది. అప్పుడు నేనే అక్కకు ఇంటి పనిలో సాయంగ ఉండేదాని. డిగ్రీలు పుర్తవటంతోనే ఉళ్ళో  ఉన్న భూమి అమ్మి అందరు అక్కలకు   పెళ్లి  చేసేసింది. నాక్కూడా చేస్తానంటే నేనే వద్దని అక్క దగ్గరే ఉండి పోయాను. ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కను దగ్గరుండి బాగా చుసుకుందమనుకున్నాను. మా ద్యాసలో పడి అక్క తన  ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. థైరాయిడ్ వాల్ల  అక్క లివరు పూర్తిగా దెబ్బతింది. ఏడాది క్రితమే దేవతలాంటి మా అక్క మా అందరిని వదలి దేవుడి దగ్గరికి వెళ్లి పోయింది.

ఇలా సాగుతున్న నా ఆలోచనలకూ నా సెల్ పోన్ మొగి పుల్ స్టాప్ పెట్టింది. హేమంత్ పోన్ చేస్తున్నాడు. పోన్ ఎత్తి "హలో" అన్నాను "ఏంటి, ఎక్కడున్నావ్? ఈ  రోజయిన డిన్నర్ కు వస్తావా" అంటూ అడిగాడు. "చూడండి డాక్టర్ గారు నర్సునయిన నాకే పేషెంట్ల పట్ల ఇంత భాద్యత ఉంటె మీకెంత ఉండాలి" అంటూ ఉడికించాను. "అబ్బబ ఎప్పుడు చూడు  పేషెంట్లు హాస్పిటలు, నువ్వొక్కదానివే అందరిని కాపాడేస్తావ? అయిన నాకు తెలియని పేషెంట్లు ఎవరు నీకు, ఏమయినా సరే ఈరోజు మనం డిన్నర్ కు వెళ్ళాల్సిందే" అన్నాడు. "ఇద్దరం ఒకే హాస్పిటల్ అయిన మీరు డాక్టర్ నేను నర్సు మీ అంత  స్వేచ్చ మకేక్కడిది సార్" అంటూ ఇంకా ఉడికించాను. "అస్సలు నిన్ను ఎవరు చేయమన్నరు అ ఉద్యోగం,  హాయిగా నన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండకుండా" అన్నాడు. "సార్ సార్ నేను ఉద్యోగం మనకుండా ఈ రోజు మనం డిన్నర్ కు వెళ్ళదం సరేనా ?" అన్నాను నవ్వుతు. "థాంక్యు వెరిమచ్" అంటూ పెట్టేసాడు ఎవరెస్టు ఎక్కినంత గర్వంగా.

 నాగురించి నేను చెప్పు కోవటం కాదు కాని  నన్ను అందరు చాల అందంగా ఉన్నావని  పోగిడేస్తుంటారు. అసలు మా ఇంట్లో అందరం బాగుండేవాళ్ళం, మా పెద్దక్కతో సహా. తను లావు అన్న మాటే కాని మా అందరికన్నా రంగు ఎక్కువ ఇంకా మంచి పిచర్స్ తో అందంగా ఉండేది. హేమంత్ నాతొ పాటే ఇదే హాస్పిటల్ లో డాక్టర్ గ  జాయినయ్యాడు. మొదట్లో ఏదో కాలక్షేపానికి వెంట పడుతున్నడనుకున్న, కాని నిజంగా ప్రేమిస్తున్నాడని తెలిసాక నేను ప్రేమించటం మొదలు పెట్టాను.  తనకు డాక్టర్ అంటే ఒక్క వృత్తి  మాత్రమే, నాకు మాత్రం అదొక సేవ. దేవుడిని నమ్మలేని మనిషి కూడా డాక్టర్ ను దేవుడికన్నా ఎక్కువగా నమ్ముతాడని నా నమ్మకం. నాకు సాద్యమయినంత వరకు ఒక్క నర్సు గా పేషెంట్లను సంతోషంగా ఉంచుతాను. హేమంత్ ఆలా కాదు, ఏదో ట్రిట్  చెయ్యాలి కాబట్టి చేస్తుంటాడు. తనలో నాకు నచ్చనిది అదే. ఏదయినా మనస్పూర్తిగా చేయి అందులోనే ఆనందం వెతుక్కో. అసలు సాటి మనిషి కళ్ళలో మన సాయం పొందినప్పుడు వచ్చే వెలుగు కంటే, మనపట్ల వారు చూపే కృతజ్ఞత కంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏమి లేదని నా అబిప్రాయం.

ఓ వారం తర్వాత ఆ లావుటవిడ మళ్ళి కనిపించింది హాస్పిటల్ లో. క్యాసువల్  వార్డు వైపు వెళ్ళినప్పుడు నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది. నేను నవ్వి నా పనిలో నిమగ్నమయ్యాను. జ్యోతి వేరే పేషెంట్లతో బిజీగా ఉండటంతో డాక్టర్ గారు నన్నే ఆవిడ విషయాలు చూడమని  చెప్పింది. ఆవిడను తీసుకుని ఓ ఖాళి ఉన్న రూము లోకి వెళ్ళాను ఇంజక్షన్ చెయ్యటానికి. "హాయ్, నాపేరు వందన" అంటూ పరిచయం చేసుకుంది "నా పేరు నిర్మల" అంటూ నేను నాపేరు చెప్పాను. "మీరు చాల అందంగా ఉన్నారు ! ఎ మోడలింగో,  సినిమాలో చేసుకోకుండా ఇలా నర్సుగా ఎందుకు" అంటూ అడిగింది. "ఆర్థిక పరమయిన ఇబ్బందుల వల్ల  నేను డాక్టర్ కాలేక పోయాను, కనీసం నర్సునయి తోటి వారికి సేవ చేయాలనీ ఇష్టం గానే చేరాను ఈ ఉద్యోగంలో" అన్నాను.  ఇంజక్షన్ చేసిన తర్వాత "వస్తానండి" అంటూ వెళ్తున ఆవిడను ఆపి "మీరు నా కన్నా చాల పెద్ద వారు నన్ను అండి,  మీరు అననవసరం లేదు, పేరు పెట్టి పిలవండి చాలు" అని చెప్పను. దానికి ఆవిడా చాల సంతోషంగా "అందమే కాదు, గొప్ప సంస్కారం కూడా ఉంది నీకు, నువ్వు పరిచయం అవటం నాకు చాల ఆనందంగా ఉంది" అంటూ వెళ్ళి  పోయింది.

 ప్రతి వారం ఆవిడా రావటం మా పరిచయం పెరగటం జరుగుతోంది. ఇలా రెండు నెలల తర్వాత ఓ రోజు ఉండబట్టలేక అడిగేశాను " ఏంటి మీ సమస్య, ఎందుకు ప్రతివారం యిలా వస్తున్నారు" అని. "అందేటి నువ్విక్కడే పనిచేస్తావు కాద ! నీకు తెలియద" అన్నారు వందన గారు. "ఇది కార్పోరేట్ హాస్పిటల్ కదండి అంతా కాన్పిడేన్షియల్ గా ఉంటుంది, డాక్టర్స్ మాకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఇంజక్షన్,  మందులు ఇవ్వమంటారు తప్ప ఎవరికీ ఎ జబ్బు లాంటివి ఏమి చెప్పారు" అన్నాను. వెంటనే అవిడ "ఆర్థికంగా ఎ లోటు లేకుండా చేసిన దేవుడు తనను ఎక్కడ మర్చి పోతనో అని నాకిలా కష్టాలు   ఇచ్చి నా ముందు తన ఉనికి కాపాడు కుంటున్నాడు. నాకు బ్లడ్ క్యాన్సర్" అని చెప్పటంతో తీవ్రమయిన దిగ్బ్రంతికి గురయ్యాను.

నాకు ఎం మాట్లాడాలో, వందన గారిని ఎలా ఓదార్చాలో అంతు చిక్కడం లేదు. అప్పుడు ఆవిడే "ఫర్వాలేదు నిర్మల నా కష్టానికి నువ్వేం చేయగలవు, అసలు నేను తొందరలో చనిపోతానని నాకు భాధ లేదు కాని అబం శుభం తెలియని నా కూతురు దిక్కులేనిదవుతుందని నా భాద" అంది. "మీకో కుతురుందా ! ఎంత వయసు" అని అడిగాను. "తనకిప్పుడు ముప్పయయిదేళ్ళు" అంది. "ముప్పయయిదేళ్ళ ఆవిడా గురించి ఇలా భాదపడుతరెంటండి, పాతికేళ్ళ నేనే ఒంటరిగా ఉంటున్నాను" అన్నాను ఆశ్చర్యంగా. దానికావిడ "ని పరిస్తితి వేరు తన పరిస్తితి వేరు నిర్మల" అంటూ నిట్టూర్చింది.  నేను ఉండబట్టలేక మళ్ళి  అడిగాను "ఏంటి పరిస్తితి ! ఎందుకు మీరిలా ఆందోళన పడుతున్నారు" అని. "ఈ ఆదివారం వీలయితే మా ఇంటికి రా, అంతనికే అర్థం అవుతుంది" అంటూ వెళ్ళిపోయింది.

నా మనసు మాత్రం రక రకాల ఆలోచనలతో నిండి పోయింది. అయినా రేపే కదా ఆదివారం తినబోతూ రుచి అడగటం ఎందుకు, చుడబోతు  ఈ ఆలోచనలు ఎందుకు అనుకుని పనిలో నిమగ్నమయ్యాను. ప్రతి ఆదివారం చర్చ్ కు వెళ్ళే నేను అది మానుకుని ప్రొద్దున్నే ఆవిడా ఇచ్చిన అడ్రస్సు ప్రకారం వాళ్ళింటికి వెళ్ళాను. చాల పెద్ద ఇల్ల. గేటు తీసుకోని లోపలి వెళ్ళుతుంటే ఎవరో అమ్మాయి ఇరవయి ఏళ్ళు ఉంటాయి లాన్ లో బట్టలు అరేస్తోంది ,పనిమనిషి అనుకొంటా. నేను అంత పొద్దునే వస్తానని ఉహించని వందన గారు చాల ఆశ్చర్యపోతూనే నన్ను చాల ఆప్యాయంగా లోపలికి  ఆహ్వానించారు. ఎక్కడ చుసిన ఖరీదయిన వస్తువులతో మంచి పర్నిచరు తో చాల నీటుగా ఉంది ఇల్లు. హల్లో  సోఫాలో కుర్చుని అటు ఇటు చూస్తున్నాను. హల్లో నుంచే పైకి మేట్లునాయి, డుప్లెక్స్ హౌస్ గురించి ఎప్పుడు వినటమే కాని ఇప్పుడే చూడటం. వందన గారు చెప్పినట్లు ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబమని నాకు అర్ధం అయింది. కాసేపటికి ఆవిడ మా ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చింది, నాకు పెద్దగ అలవాటు లేకపోయినా కాదనలేక పోయాను. కాఫీ తాగుతూ మా కుటుంబ విషయాలు, నా చదువు, ఉద్యోగం గురించి అడిగింది ఆవిడ.


కాసేపయ్యాక నేనే ఉండబట్టలేక అడిగాను "మీ అమ్మాయిని పరిచయం చేస్తాననన్నారు ! ఆవిడా ఇంట్లో లేరా" అని. "దానికి అంత అదృష్టం లేదమ్మా, నా తోరా" అంటూ పైకి లేచింది. నేను ఆవిడను అనుసరించాను. మేట్లేకి పై అంతస్తుకోచ్చం. ఆవిడా ఓ రూం తలుపులు తెరిచింది, లోపలికెళ్ళగానే నాకు బెడ్ మిద ఓ అమ్మాయి వెలికిల పడుకుకుని కనిపించింది. మమ్మల్ని చూసిన ఏవిధమయిన స్పందన లేదు. కాసేపు నిశితంగా పరిశీలించాక నాకు ఓ విషయం అర్ధం అయింది. అమ్మాయి మొహానికి శరీరానికి పొంతన లేదు. మొహం చుస్తే చాల వయసయినట్టుగ శరీరం మాత్రం ఓ పది సంవత్సరాల అమ్మాయిగా ఉంది. ఎలా అడగాలో, ఏమని అడగాలో నాకు అంతుపట్టడం లేదు.

అప్పుడు వందన గారే ఇలా చెప్పటం ప్రారంబించారు "తన పేరు మానస, నాకు పద్దెనిమిదేళ్ళకే మా మేన బావ తో పెళ్లయింది, ఏడాదికి ఇది నా కడుపునా పడింది. అందరు పిల్లలాగే పెరుగుందని అనుకున్నం , కాని వయసుతో పాటు దాని పెరుగుదల, మిగిలిన విషయాలు ఆగిపోతున్నాయని చాల ఆలస్యంగా గ్రహించం. దానికి అయిదేళ్ళు వచ్చే నాటికి ఇలా పూర్తిగా మంచానికే పరిమితం అయిపొయింది. ఎంతమంది డాక్టర్ లకు చూపించిన లాభం లేక పోయింది. మేనరికపు వివాహాల వచ్చే సమస్యంట, ఇంత  సీరియస్ ప్రాబ్లమ్స్ కోటి మందిలో ఒక్కరికి ఉంటాయట,  ఆ దురదృష్టవంతులం మేమే అయ్యం. రెండో బిడ్డను కన్నా కూడా ఇలాంటి సమస్యలే రావచ్చని చెప్పారు. దానితో దిగులు వేసుకున్న మా వారు ఆ  దిగులు తోనే కన్ను ముసారూ. ఇది చాలదన్నట్లుగ నాకు ఈమద్యే తెలిసింది నాకు బ్లడ్ క్యాన్సర్ చాల అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని. నా తర్వాత నా బిడ్డ ఏమవుతుందో అని దిగులే తప్ప నేను చనిపోతానని నాకు బాదలేదు" అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

"అసలు తన పరిస్తితి ఎంటి ఇప్పుడు"  అని అడిగాను.  "పసిగుడ్డుతో సమానం అమ్మ తనిప్పుడు. కాళ్ళు చేతులు అడవు, మాట పడిపోయింది. శరీరం అంత పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయింది. తనకు పదేళ్ళ వయసునుంచి శరీరంలో ఎదుగుదల ఆగిపోయింది" అంటూ చెప్పింది. "మరి ఆకలి దప్పిక వేస్తె ఎలా అంటి" అని అడిగాను. "మనమే సమయం ప్రకారం అన్ని అందివ్వాలి, లేకపోతె నాకు ఆకలి అని కూడా చెప్పలేదమ్మ" అంటూ కన్నీరు పెట్టుకుంది.

మేము రూంలో ఉన్నప్పుడే పనిమనిషి ఓ గిన్నెతో వచ్చింది. వందన గారు స్పూన్ తో జావా లాంటి పదార్ధాన్ని చిన్న చిన్నగా నోటికందిస్తుంటే  మిగింది మానస. హల్లో కి వచ్చి దీర్ఘంగా కుర్చుని ఆలోచిస్తున్న నాతొ "సారి నిర్మల నీకు నా కష్టాలన్నీ చెప్పి ని వీకెండ్ పాడు చేశాను, రా భోంచేద్దాం" అంటూ పిలిచింది. "అయ్యో ఫర్వలేదంటి తెలుసుకోవాలని నేనే వచ్చాను కదా" అంటూ లేచాను. భోంచేసి కాసేపు కుర్చుని వందన గారి వద్ద సెలవు తీసుకుని ఇంటి కొచ్చాను.

ఇంటి కొచ్చిన నాకు ఎన్నో ఆలోచనలు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న మదర్ థేరిసా కొటేషన్ గుర్తుకొచ్చింది "ప్రపంచంలో అతి భయంకరమయిన జబ్బు ఎవరికయినా నా అనే వారు లేకపోవటమే" ఈ విషయం నాకు అప్పుడు పెద్దగ అర్ధం కాలేదు. కాని ఇప్పుడు నూటికి నూరుపాళ్ళు నిజమనిపిస్తుంది. నలుగురు ఆడపిల్లలయిన మాకు నేను ఉన్నానంటూ మా అక్క అండగా నిలిచింది. లేదంటే మేమందరం ఏమయి పోయేవాళ్ళం. నా అనే వాళ్ళు లేక తలో దిక్కు చెదిరి పోయి !  ఓ గాడ్  తలచుకుంటేనే భయమేస్తుంది. మరిప్పుడు వందన గారి పరిస్తితేంటి, అసలు మానస ఏమవుతుంది. ఇవ్వని ఆలోచిస్తుంటే మనసంతా చెప్పలేని భాధతో నిండి పోయింది.

ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కను బాగా చుసుకుందమనుకున్నాను, కాని నాక అదృష్టం లేక పోయింది. అసలు మానసలోనే అక్కను చూసుకుంటే తప్పేంటి, నా అనే వాళ్ళు లేక బిక్కు బిక్కు మంటూ చావుతో  పోరాడుతున్న వందన గారిని నేన్నున్నానని అదుకుంటే బాగుంటుంది కదా ! అనుకున్నాను. అలా నిర్ణయించుకున్న తర్వాత మనసంతా ప్రశాంతతో నిండి పోయింది.

"అసలు నువ్వు క్రిస్టియన్ వని, నర్సువని చెప్పి మన పెళ్ళికి మా అమ్మ నాన్న ను ఎలా ఒప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే, మళ్లి  ఇదేంటి !" అన్నాడు హేమంత్ ఆశ్చర్యంగా, నేను  మానస, వందన గారి విషయం చెప్పగానే. "హేమంత్ దయచేసి అర్ధం చేసుకో, నేను ఆ భాద్యత స్వికరించాలను కుంటున్నాను. వందన గారి తర్వాత మానసకు అమ్మనవుదమనుకుంటున్నాను" అన్నాను బ్రతిమాలుతూ. "చూడు నిర్మల నేను నిన్ను పెళ్లి చేసుకుని, ఉద్యోగం మానిపించి హాయిగా జీవితం గడుపుదమనుకున్నాను. కాని నువ్విల ఎవరికో అమ్మనవ్వాలి, ఇంట్లో కూడా నర్సులాగే ఉంటానంటే నా వల్ల కాదు" అన్నాడు హేమంత్ కాస్త కటువుగానే. "అది కాదు" అని నేను చెప్పేలోపే, "ఈ విషయంలో నా నిర్ణయం మారదు" అంటూ విస  విస  వెళ్ళి  పోయాడు.

నిన్న మా అక్కలు కూడా ఇదే మాట, "అతి మంచితనానికి వెళ్లి ని జీవితం పాడు చేసు కోవద్దు" అని ఒక్కటే హితభోద. నా నిర్ణయం తప్పయితే హేచ్చరించాలి, హిత భోద చేయాలి కానీ సాటి మనిషిని ఆదుకుంటనంటే ఇన్ని అడ్డంకుల. నేను చేయాలనుకుంటున్న పని నిస్వార్దామయింది  కాని నాకు తోడుగా నిలుస్తారనుకున్న నా వాల్లందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. మదర్ థేరిసాను తలచుకుని అందరు ఎంతో భక్తీ బావంతో మాట్లాడుతారు. కానీ సమాజం పట్ల ఆవిడా చూపించిన ప్రేమలో నేను ఆవగింజంత చూపిస్తుంటే తట్టుకోలేక పోతున్నారు.

 "జీసస్ ! నేను చేయబోతున్న ఈ కార్యం నికిష్టమయితే, ని చిత్త ప్రకారమే అయితే ఎ విధమయిన స్వార్ధం నా మనసును అంటకుండా, నిర్మలమయిన ని ప్రేమను నాకు తోడుగా ఉంచు తండ్రి"  అని ప్రార్దింఛి వందన గారి దగ్గరికి బయలు దేరాను. "వద్దు నిర్మల, ని జివితన్ని పాడు చేసుకోవద్దమ్మ" అంది వందన అంటి నేను మానసను చూసుకుంటాను అని చెప్పగానే. "లేదంటి నేను బాగా ఆలోచింఛి మనస్పూర్తిగానే ఈ పని చేయాలనుకుంటున్నాను" అన్నాను స్థిర నిశ్చయంతో. "అది కాదు నిర్మల, ని జీవితం" అంటూ ఆవిడేదో చెప్పబోయింది. నేను మధ్యలోనే ఆపేసి "ఎంటండి జీవితం అంటే ! ప్రేమ, పెళ్ళి, పిల్లలు వాళ్ళ పెళ్ళిలు మళ్ళి వాళ్ళ పిల్లలు, అంతేనా. సాటి మనిషికి చేతనయిన సాయం చేయలేని జీవితం నాకక్కరలేదు" అన్నాను. వందన గారు మౌనంగా ఉండిపోయారు.

"మీకు ఏదయినా అనుమానంగా ఉంటె పర్వాలేదు" అన్నాను. "ఎంత మాటమ్మ ! నీపై నాకు అనుమానమా ! ని గొప్ప మనసుకు ఎలా కృతఙ్ఞతలు చెప్పాలో తెలియాక మౌనంగ ఉండిపోయనమ్మ" అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది. ఆవిడ కళ్ళలోంచి కన్నీరు నా మెడపై  పడుతోంది, నా మనసు సంతోషంలో తడిసిపోతోంది. ఎన్ని కోట్లు ఇచ్చిన పొందలేని ఆనందం అది.

ఇది జరిగిన మూడు నెలలకు వందన గారు ప్రశాంతంగా కన్ను మూశారు. నా జీవితం హాస్పిటలు మానసతో సాగిపోతుంది. ఓ రోజు హేమంత్  ఇంటికి  వెళ్ళుతున్న నన్ను ఆపి "ఇప్పటికైనా ని నిర్ణయం మార్చుకో" అన్నాడు. "మార్చు కోవటానికి నాది తప్పుడు నిర్ణయం కాదు హేమంత్, అయిన ఇప్పుడు నాదగ్గర ని గురించి ఆలోచించే సమయం, స్వార్ధం రెండు లేవు." అంటూ చెప్పి వచ్చేసాను.

మరో మూడేళ్ళ తర్వాత మానస కూడా నన్ను వదలి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి  పోయింది. వందన గారి వీలునామా ప్రకారం వాళ్ళ  ఆస్థి మొత్తం నాకొచ్చింది. ఈ ఆస్థిని  ఏంచేయాల అనుకుంటున్నా నాకు ఓ దివ్యమయిన ఆలోచన వచ్చింది. మానస పేరు మీద ఒక్క అనాధ  ఆశ్రమం పెట్టి కొంతమంది నిర్బగ్యులకయినా అండగా ఉండాలని. అ ఆలోచన రావటం తోనే మనసంతా  గర్వంతో నిండి పోయింది.

"ప్రేమ అనేది అన్ని కాలలలో, అందరికి అందుబాటులో ఉండే ఫలం లాంటిది"   అన్న మదర్ థేరిసా మాటలు నిజం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.

(సమాప్తం)

5 వ్యాఖ్యలు: