14, ఫిబ్రవరి 2013, గురువారం

హంతకుడి ఆత్మహత్య !

రాజారావు కు చాల అలసటగా ఉంది. అంత  దూరం నడవటం కష్టంగా ఉంది. జైలు గోడల మద్య 30 సంవత్సరాలు గడిపే సరికి నడక అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు తన వయసు 65 సంవత్సరాలు. ముప్పది సంవత్సరాల ముందు ఆవేశంతో ఇద్దరు వ్యక్తులను చంపేశాడు. అమ్మ నాన్నకు లేక లేక కలిగిన సంతానం తానూ. ఒక్కడే కొడుకని ఎంతో గారభంగా పెంచారు. ఉన్నంతలో బాగా చదువు చెప్పించాలనుకున్నారు. కాని తను మాత్రం సినిమాలు, అమ్మాయిలు అంటూ  షికార్లు చేస్తూ కాలం గడిపేసాడు.  ఉద్యోగం సద్యోగం లేకుండా కనబడిన ప్రతి వాడితో అయిన దానికి కానీ దానికి గొడవలు పడి  ఉరిలో గొడవలన్నీ ఇంటి మీదికి తెచ్చేవాడు. డబ్బులు ఇమ్మంటూ నాన్నను తెగ విసిగించేవాడు. అప్పటికే రిటైర్ అయిన నాన్న, ఆరోగ్యం బాగుండని  అమ్మ ఎంతో నచ్చచెప్పాలని చూసారు. ఏదయినా ఉద్యోగం చేసుకొమ్మని అయినా తను వినలేదు. 

ఎదో విషయం లో, ఇప్పుడు  తనకు గుర్తు కూడా రావటం లేదు, గొడవ పడి మాట మాట పెరిగి పక్కనే ఉన్న రాడు తో ఇద్దరి తలలు పగుల గొట్టాడు. తన దురదృష్టం, ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అంతే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇద్దరినీ చంపినందుకు రెండు యావత్ జీవిత శిక్షలు వేసాడు జడ్జి. చనిపోయిన వాళ్ళలో ఒక్కడు అ జడ్జి బందువుట, తర్వాత తెలిసింది. ఆర్థికంగా బలంగా లేని నాన్న ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండి  పోయాడు. తానూ జైలులో ఉన్నప్పుడే దిగులుతో నాన్న చనిపోయాడు అని తెలిసింది. అసలే ఆరోగ్యం బాగుండని  అమ్మ, ఎన్ని అవస్తలు పడిందో. ఎ దిక్కులేని చావు చచ్చిందో తలచుకున్నప్పుడల్లా తన మిద తనకే అసహ్యం వేస్తుంది. క్షణిక ఆవేశం లో జీవితాన్ని నరకం చేసుకున్నానని రాజారావు కుమిలి పోనీ క్షణం లేదు. 

ఇన్నాళ్ళకు విడుదల అయ్యాడు జైలు నుంచి. నా అనేవారు ఎవ్వరు లేరు. అసలు తమకు సొంత ఇల్లు కూడా లేదు. తన తల్లి తండ్రి ఎదో ఉరు నుండి ఉద్యోగ రిత్యా హైదరాబాదు వచ్చారు. వచ్చే జీతమంతా నాన్న తన చదువుకే ఖర్చు పెట్టేవాడు. అందుకే సొంత ఇంటిని కూడా కోనుక్కోలేక పోయాడు. ఇప్పుడు తనకు ఎటు వేళ్ళలో తెలియటం లేదు. అసలు ఎలా బ్రతకాలో ఏమి పాలు పోవటం లేదు. జైలు లో అయితే సమయానికి తిండి పెట్టేవారు. తన శిక్ష కాలం పూర్తయిన కూడా  జైలరు గారి మంచి తనంతో ఇన్నాళు  అక్కడే ఉండిపోయాడు. కాని ఇప్పుడు అయన రిటైర్ అయిపోయాడు. కొత్తగా వచ్చిన జైలరు శిక్ష పూర్తీ అయిన వారు ఉండకూడదని విడుదల తేది జారి చేసాడు "మీ వాళ్ళకు,  సమాచారం ఇచ్చుకోండి" అంటూ. కాని తనకు ఎవరు ఉన్నారు సమాచారం ఇవ్వటానికి. రిలీజు రోజు దగ్గర అవుతున్న కొద్ది దిగులు పెరిగి పోయింది. జైలరు గారిని ఎంతో బ్రతిమాలాడు తనను విడుదల చేయవద్దని. కాని గవర్నమెంటు రూల్సు ఒప్పుకోవని అయిదు వందలు చేతిలో పెట్టి పంపించి వేశారు. 

భయట అడుగు పెట్టిన క్షణం నుంచి ఒక్కటే భయంగా ఉంది తనకు. ముప్పయయిదేళ్ళలో  సిటి పూర్తిగా మారి పోయింది. ఎక్కడ చుసిన కార్లు, బస్సులు మరియు ఆటోలు. ఇంకా బైక్ లయితే లెక్కలేదు, ట్రాపిక్ పెరిగి పోయింది. దాంతో పాటు కాలుష్యం కూడా అనుకున్నాడు రాజారావు. సిటి చుసినట్లుంటుందని నడిచి వెల్దమనుకున్నాడు. రెండు ముడు కిలో మీటర్లు నడవగానే అలసి పోయాడు. మద్యాహ్న బోజన సమయం కూడా అవుతోంది, ఎక్కడయినా ఏదయినా తిందాం అనుకున్నాడు. ఎదురుగా "భోజనం తయారు" అన్న బోర్డు చూసి లోనికి వెళ్ళాడు. చేతులు కడుక్కుని ఓ టేబులు ముందు కూర్చున్నాడు. ఓ కుర్రాడు వచ్చి "ఏం  గావలి తాత?" అంటూ అడిగాడు.  "భోజనం తీసుకురా, పప్పుతో" అన్నాడు రాజారావు. "గట్లనే తిసుకోస్తాగని, 35 రూపాలు అవుతది ప్లేటుకు. మరి డబ్బులు ఉన్నాయా" అంటూ అరాతిసాడు ఆ కుర్రాడు. రాజారావు కు చాల ఆశ్చర్యం వేసింది. ప్లేటు భోజనం 35 రూపాయల ! తమ రోజుల్లో 5 రూపాయలు ఉండేది అది కూడా డీలక్స్ హోటల్లో. ఈ లెక్కన అయిదు వందలతో తానూ ఎంతో  కాలం బ్రతుకలేడని  అర్ధం అయింది.  అయినా తప్పేదేముంది, "ఉన్నాయి బాబు తీసుకురా" అన్నాడు. 

భోంచేసి బయటకు వచ్చిన రాజారావుకు ఎటు వెళ్ళలో తెలియటం లేదు. ఏనాడు ఎ స్నేహితుడు తన కోసం రాలేదు. ఎన్నో మార్లు అమ్మ నాన్నను వేదించి డబ్బులు తీసుకుని వాళ్ళకు పార్టి ఇచ్చాడు. ఎవరు ఎప్పుడు అడిగిన లేదనకుండా డబ్బులు ఇచ్చాడు.  అయిన నాలాంటి ఖైదిని, హంతకుడిని ఎవరు మాత్రం స్నేహితుడిగా గుర్తుంచుకుంటారు అనుకున్నాడు రాజారావు. అలా ఆలోచించుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. ఒక్కసారిగా అతనికి ఒక ఉపాయం తోచింది. ఎక్కడయినా పనికి కుదిరితే బాగుంటుందని అనుకున్నాడు. ఏదయినా హోటలు అయితే అక్కడే ఉంటూ అక్కడే  తినోచ్చు అనుకుని,  ఇందాక తను భోంచేసిన హోటలు కెళ్ళి అడగాలని వెనుకకు నడక సాగించాడు. 

హోటలు కుర్రాడు గుర్తు పట్టి "ఏం  తాత ! మళ్ళ  వచ్చినావ్" అన్నాడు. "ఇక్కడ ఏదయినా పని దొరుకుతుందేమో అని" అన్నాడు రాజారావు. "ముసలోడివి నువ్వేం పనిచేస్తావ్ గిడ, అయినా ఓనర్ ను అడుగుతా అగు" అంటూ ఓనర్ దగ్గరకు వెళ్ళాడు. ఎదో మాట్లాడి, రామ్మంటూ చేయితో సైగ చేసాడు ఆ కుర్రాడు. వెళ్ళగానే ఓనరు అడిగాడు "పేరేంటి? ఉరేంటి?" అని. "నా పేరు రాజారావు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాదే" అన్నాడు. "మరయితే ఈ పని ఎందుకు చేస్తున్నావ్? అది కూడా ఈ వయసులో" అంటూ ఆశ్చర్య పోయాడు ఓనర్. "ఈ రోజే జైలు నుంచి విడుదల అయ్యాను, ముప్పయయిదు  ఏళ్ల  తర్వాత. నాకు ఎవరు లేరు అందుకే పనికి కుదురుదామని" అన్నాడు రాజారావు. "అచ్చా ! గల్లాపెట్టె దోపిడీ చేసి దొబ్బెద్దమనుకున్నావ్. పాపం ముసలోడు ఆయనేం తీస్తాడు అని మేం పాగల్ గాళ్ళు గావలె అంతేనా. ఎట్లా కనిపిస్తున్నార బై నీకు, చల్ బయటకు నడు" అంటూ మెడబట్టి తోసేసాడు ఓనర్. 

రాజారావుకు దుఖం పొంగుకొచ్చింది. ఒక్కసారి నేరస్తుడిగా ముద్ర పడితే ఎప్పటికి నేరస్తుడిగానే  ఉండల? క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవించాల? జైలు నుంచి విడుదల అయిన వారు మళ్ళి  మళ్ళి  జైలు కు ఎందుకు వస్తున్నారో అప్పుడు తనకు అర్ధం అయ్యేది కాదు. కాని ఇప్పుడు పూర్తిగా అర్ధం అయ్యింది. సమాజం వారిలో మార్పును చంపి, వారిని నేరస్తులుగా బ్రతుకుమని గెంటే స్తోంది. తనకు వయసు అయిపోయింది  కాని, వయసులో ఉంటె మాత్రం కిరాయి హంతకుడిగా బ్రతికేవాడేమో. ఆ తప్పెవరిది? తనదా? ముమ్మాటికి కాదు. తనను చేర్చుకొని ఈ సమాజానిది. యిలా సాగిపోతున్నాయి అతని ఆలోచనలు, అతని నడక తో పాటు. 

సాయంత్రం అవుతుంది. ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలి అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. దారిలో ఒక లాడ్జ్ కనిపిస్తే వెళ్ళి  రిసెప్షన్ లో అడిగాడు "ఒక రాత్రి పడుకోవటానికి ఎంత" అని. "ఉరికే పడుకొంటే 150 రూపాయలు, అదే రాత్రి భోజనం మరియు ఉదయం టిపిన్  తో అయితే 200 రూపాయలు" అన్నాడు రిసెప్షన్ లో ఉన్నాతను. చేసేదేముంది "అన్నం తోనే" అంటూ డబ్బులిచ్చాడు. ఓ కుర్రాడు "నాతో  రా తాత" అంటూ ముందుకు సాగాడు. తాళం  తీసి లోపలికి  అడుగుపెట్టాడు ఓ రూము లోకి, రాజారావు అనుసరించాడు. రూము పర్వాలేదు నిటుగానే ఉంది, కాని బెడ్ చాల దుమ్ము పట్టి ఉంది. అంత మరకలతో చూడటానికి అసహ్యంగా ఉంది. "బాబు ఏదయినా బెడ్  షిట్ వెయ్యి దినిమిద కాస్త" అన్నాడు రాజారావు. "అట్లనే ఎస్తగని, 10 రూపాయలు ఇవ్వాలి మరి" అన్నాడు ఆ కుర్రాడు. "అలాగే ఇస్తాను కానీ ముందు తీసుకురా" అన్నాడు రాజారావు. కుర్రాడు బెడ్ షిట్ పరిచి 10 రూపాయలు తీసుకుని వెళ్ళి  పోయాడు. తలుపులు దగ్గర వేసుకుని బెడ్డు మిద నడుము వాల్చాడు రాజారావు. 

తానూ పూర్తిగా అలసి పోయాడు. శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ అలసి పోయాడు. రేపటిని తలచుకుంటే చాల భయం వేస్తుంది. ఎక్కడ ఉండాలి? ఎలా బ్రతకాలి? ఇలా ఆలోచిస్తూ గంటలు గంటలు గడిపేసాడు. ఎప్పుడో చిన్నగా మగతగా కన్ను అంటింది. భయట నుంచి తలుపు చప్పుడవుతుంది. బహుశ భోజనం వచ్చిందేమో అనుకుని తలుపు తీసాడు. ఎదురుగా కుర్రాడు భోజనం ప్లేటు, నీళ్ళ  బాటిల్ తో నిలబడి ఉన్నాడు. ప్లేటు,  బాటిలు తీసుకుని మళ్ళి  తలుపేసుకున్నాడు. భోజనం చేయ్యలనిపించటం లేదు. ఆకలి,  దాహం ఏవి గుర్తుకు రావటం లేదు. గడచిన జీవితం, ఎలా గడవలో తెలియని భవిష్యత్తు తప్ప. అప్రయత్నంగా పైకి చుసిన రాజారావుకు చిన్నగా శబ్దం చేస్తూ తిరుగుతున్నా ప్యాను కనిపించింది. 

రాజారావుకి తానూ ఈ సమాజం లో వ్యక్తిని కాను అనిపిస్తోంది. ఈ ఇసడింపుల మద్య, ఒక నేరస్తుడిగా ఈ ముసలి జీవితం అవసరమా? అయినా ఎవరి కోసం బ్రతకాలి. పొద్దున్న లేస్తూనే మళ్ళి  ఆకలి వేస్తుంది, పని చేసుకోవాటానికి ఈ సమాజం ఆసరా ఇవ్వదు. అడుక్కుని తినటానికి మనసొప్పటం లేదు. బ్రతికినంత కాలం ఎలాగు అమ్మ నాన్న తో సంతోషంగా గడప లేక పోయాడు  తను. కనీసం చచ్చి వారిని కలుసుకుని క్షమాపణలు అడుగుతాను. అక్కడయినవాళ్ళను ఓ కొడుకుగా చూసుకుంటాను అనుకున్నాడు రాజారావు. 

కుర్రాడు తెచ్చిన బెడ్ షిట్ ప్యానుకు కట్టి మెడకు బిగించుకున్నాడు. ఉపిరి ఆడటం లేదు తనకు. కాళ్ళు  ఆప్రయత్నంగా  కొట్టుకొంటున్నాయి, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నాలుక బయటకు వస్తోంది, భరింప తరం కాని భాధ. ఈ భాధ  కన్నా బ్రతకటమే మేలనుకున్నాడు. కాని ఏమి చేయలేక పోతున్నాడు. అప్పటికే మెడను బలంగా చుట్టేసింది ఉరితాడు. చేతులలో సత్తువ లేదు పైకి లేవటానికి. ఓ అయిదు నిమిషాలు అలాగే కొట్టుకుని ప్రాణాలు వదిలేశాడు రాజారావు. 

క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని మరోసారి నేరస్తుడు అయ్యాడు చట్టం దృష్టి లో. కాని అతనికి తెలియని విషయం ఏంటంటే రిటైర్ అయిన ఆ  జైలరు  అతన్ని తనతో పాటే ఉంచుకోవాలని అనుకున్నాడు. సమాచారం పంపటంలో కాస్త ఆలస్యం జరిగింది. ఈ రాత్రి గడిపేస్తే ఆ జైలరు తనను  వేదికించే వాడు. చిన్న చితక పని చేసుకుని హాయిగా బ్రతికే వాడు అయన దగ్గర.  అందుకే ఆవేశం ఎందుకు మంచిది కాదు.


(సమాప్తం)

7 వ్యాఖ్యలు: