18, అక్టోబర్ 2012, గురువారం

దేశమంటే మనుష్యులు కాదోయ్

దేశమంటే మనుష్యులు కాదోయ్
దేశమంటే దున్నలోయ్
పక్కన లూటి అయిన
పట్టింపు లేని పశువులోయ్

బండలవలె కండ కలదోయ్
ప్రతివాడికో  గుండె కలదోయ్
అందు దమ్ము మాత్రం కరువోయ్

చదువు కలదోయ్
తెలివి కలదోయ్
నిస్వార్థం నిండు సున్నోయ్

మాటలోమో కోటలు దాటును
చేతలేమో చేవ చచ్చును
సినిమాకు యువత బానిసోయ్
భవితకన్న-ఎక్కువ మక్కువోయ్

నీరు  కన్నా బీరు  మోలోయ్
ఎ వీధి  చూసిన ఉగులాట  జోరోయ్
ఆడవారు సైతం మినహాయింపు కారోయ్

ప్రభుత్వాలు మారిన పట్టింపు లేదోయ్
ఓటు వేయటానికి ఓపిక లేదోయ్
మత గొడవలంటే అతి మక్కువోయ్
సామరస్యం అతి తక్కువోయ్

దేశమేమయిన తమ కెందుకోయ్
తాము  బాగుంటే లోక మెందుకోయ్
దేశ భక్తీ అంటే పనికి రాని మాటోయ్
దోచు కోవటమే నేటి ఉత్తమమయిన బాటోయ్

దేశమంటే మనుష్యులు కాదోయ్
దేశమంటే దున్నలోయ్

3 వ్యాఖ్యలు: