24, అక్టోబర్ 2012, బుధవారం

అదృష్టం లో దురదృష్టం !

(కథ చవివే ముందు, ఎప్పుడు ఏడుపు గొట్టు రాతలు రాసే నేను కాస్త పంథా మర్చి కామెడి రాయాలని సాహసం చేసాను. నవ్వు వస్తే నవ్వుకోండి, చక్కిలి గింతలు పెట్టుకుని అయిన సరే.  కాని ఇలా జరుగుతుందా ! అలా జరుగుతుందా అంటూ సందేహాలు లేపి నా సాహసాన్ని, దుస్సాహసం చేయకండి దయచేసి.)

మనోజ్ చాల తెలివయిన కుర్రాడు. చదువులో ఎప్పుడు పస్ట్ రావటం అతని అలవాటు. అలాగే అతనికి అదృష్టం కూడా ఇతరులకు  దురదృష్టం పట్టినట్లు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అతని ప్రెండ్స్ అందరు "ఒరేయ్ మామ నీకు ఒళ్ళంతా సుడేరా" అంటూ కుళ్ళుకునే వారు.

అతని పూర్తీ పేరు కంచు మనోజ్ కుమార్. బిటెక్ కంప్యూటర్స్ పూర్తీ చేసి ఇండియాలో అందరు చేసే పనే తను చేసాడు. అంటే MS చేయటానికి అమెరికా వెళ్ళాడనుకుంటే మీరు తొక్క మిద కాలు వేసినట్టే (అంటే బోల్త పడ్డట్టే). అతనికి తన అమ్మ నాన్న ను వదలి వెళ్ళాలంటే ఇష్టం లేదు. అందుకే అమెరికా గిమేరికా ఏం పెట్టుకోకుండా సుబ్బరంగా ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీరుగా జాయిన్ అయిపోయాడు. 

సాదారణంగా ఎవరయినా  10 సంవత్సరాలు వచ్చే వరకు ఇంటిని వదిలి ఉండలేరు. కాని మనోజ్ మాత్రం ఇప్పటికి  వాళ్ళ అమ్మను చూడకుండా ఉండలేడు. తనకు ఇద్దరు అక్కలు మరియు ఇద్దరు అన్నలు  ఉన్నా కూడా మనోజ్ చిన్న వాడు కావటం వలన ఎక్కువ ప్రేమ వాళ్ళ అమ్మకు . అమ్మను వదిలి ఉండలేక IIT లో సీట్ వచ్చిన  కూడా హైదరాబాద్ లో మాములు ఇంజనీరింగ్ లో జాయినయ్యాడు. అప్పుడు మనోజ్ ను తిట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 

ప్రస్తుతానికి వస్తే, జాయినాయిన కొద్ది రోజుల్లోనే అతని స్పార్క్ అర్ధం అయ్యింది ప్రాజెక్ట్ మేనేజర్ కు. మంచి కమ్యునికేషన్ స్కిల్సు, టెక్నికల్ స్కిల్సు అతని సొంతం. ఇంకా సాప్ట్వేర్ కు కావలసిన అదృష్టం ఎలాగు ఉంది. తొందరలోనే ప్రాజెక్టు లో చాల పేమస్  అయిపోయాడు. అందరి నోళ్ళలో మనోజ్, మనోజ్ అంటూ వినపడేది.

కాని అమెరికా వాళ్ళు మాత్రం "మిష్టర్ కంచు" అంటూ పిలేచే వాళ్ళు. పాపం వాళ్లకు సర్ నెమ్ కాన్సెప్ట్ లేకేపోవటం తో అతని సర్ నేమె పస్ట్  నెమ్ అనుకుని (కంచు మనోజ్ కుమార్) పొరపడెవారు.  మనోజ్ కు తిక్క పుట్టి ఇమెయిల్ కూడా పంపాడు. "నా ఒంటి పేరు మనోజ్, ఇంటి పేరు కంచు. ఎవడయినా మళ్ళి కంచు అంటే ఠంచనుగా తిట్లు తింటారు" అని. అప్పటి నుంచి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిలుస్తున్నారు. ఆదాయం బాగుంది కదా అని మాదాపూర్ లో ఒక ఇల్లు కూడా తీసుకున్నాడు లోన్ పెట్టి.

రోజులు ఇలా హాయిగా సాగుతుండగా, ఓ నాడు మేనేజరు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. తన క్యాబిన్ కు రామ్మని. తనకు మేనేజరు దగ్గర చనువు ఎక్కువ అనే  కంటే, అతని కంటే పోటుగాడు లేడని, మేనేజరు కు తానూ తప్ప మరో దిక్కు లేదన్న పొగరుతో పర్మిషన్ అడగ కుండానే లోపలికి  వెళ్ళి పోయాడు. 

"గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రమ్మనారు" అన్నాడు మనోజ్.

"హాయ్  మనోజ్. కాం కాం  సిట్" అంటుండగానే కూర్చున్న మనోజ్ చూసి ఏమి అనలేక "గుడ్ గుడ్, వేరి గుడ్" అంటూ పల్లికలించాడు.

ఆ తర్వాత తనే "ఎం లేదు మనోజ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పుద్దామని" అంటూ ఆగాడు.

"వావ్ గుడ్ న్యూస్ ! ఏంటి సార్ ? తొందరగా చెప్పండి" అన్నాడు మనోజ్ కప్పల నోరు తెరిచి.

"అంత తొందరగా చెప్పేస్తే థ్రిల్  ఏముంటుంది. కాస్త సస్పెన్స్ లో ఉంటుంది థ్రిల్" అన్నాడు మేనేజరు కొంటెగా.

 "సస్పెన్స్ లో ఏముంటుంది సార్  థ్రిల్ ! సస్పెన్స్ తప్ప. అది రివిల్ చేస్తే తెలుస్తుంది థ్రిల్లో  లేక డల్లో" అన్నాడు మనోజ్ ఇంకా కొంటెగా.

"గుడ్ లాజిక్-గుడ్ సేన్సప్ హ్యుమర్. ఇంకా ఉరించను గాని చెప్పేస్తున్నా" అంటూ మళ్ళి  ఆగిపోయాడు మేనేజరు.

మనోజ్ ప్రశ్నార్థకంగా చూసాడు.

"ఏదయినా మనోజ్ ! నువ్వు చాల లక్కినోయ్. అసలు నువ్వు నాకు పెద్ద పార్టి ఇవ్వాలి సరేనా?" అన్నాడు మేనేజరు పలికిలిస్తూ.

మనోజ్ కు చిరాకేస్తుంది. అయినా ఆపుకుని "అలాగే సార్ తప్పకుండా ఇస్తా. ఇప్పటికయినా చెప్పండి దయచేసి" అన్నాడు బ్రతిమాలుతూ. 

"ఒకే ఒకే చెప్పేస్తా. నీకు పాసుపోర్టు ఉందా" అన్నాడు మేనేజరు కళ్ళు పెద్దవి చేసి.

"ఉద్యోగంలో చేరటానికి ఈ మద్య పాసుపోర్టు అడుగుతున్నారని విన్నాను కాని, మీరేంటి సార్  న్యూస్ చెప్పటానికి కూడా  అడుగుతున్నారు" అన్నాడు మనోజ్ ధినంగా.

"యూ...... సిల్లి పెల్లో" అని వెక్కిరించాడు మేనేజరు.

మనోజ్ కు దుఖం పొంగుకొచ్చింది. "సార్ నన్ను ఉరించకుండా! దయచేసి అదేంటో చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను" అంటూ టేబల్ క్రిందకి దురబోయాడు ఏడుస్తూ.

"ఏయ్..... ఏంటిది మ్యాన్ నువ్వు మరి ఇంత  సెన్సిటివా?" అంటూ ఆశ్చర్య పోయాడు.

మనోజ్ కు తిక్క రేగింది.  "నేను సెన్సిటివ్ కాదురా...... నువ్వు శాడిస్టువి . గంట నుంచి గుడ్ న్యూస్ చెపుతానంటూ నన్ను బలితీసుకుంటున్నావ్" అని మనసులో తిట్టుకుని పైకి బోరుమని ఏడ్చేశాడు.

మేనేజరు అదిరి పోయాడు. "ఎవరయినా చుస్తే నేను నిన్ను ఏదయినా చేశాననుకుంటారు. దయచేసి ఏడుపు అపు నాయన" అంటూ బ్రతిమాలాడు.

"ముందు మీరు అదేంటో చెప్పండి, అప్పుడే ఆపుతా" అన్నాడు ఏడుపు కొనసాగిస్తూ.

"ఎం లేదు మనోజ్ నిన్ను అమెరికా పంపుదామనుకుంటున్న" అన్నాడు మేనేజర్ గర్వంగా.

అదివినగానే మనోజ్ ఏడుపు అపుతాడని అనుకున్నాడు మేనేజరు. కాని అతను  ఏడుపు ఇంకా ఎక్కువ చేశాడు. 

మేనేజరు ఆశ్చర్యంతో "ఏంటి మనోజ్ నేను చెప్పింది వినబడలేదా? నిన్ను" అంటూ పూర్తీ చేయకుండానే.....

"వినపడింది సార్, నన్ను అమెరికా పంపిస్తున్నారు అంతేగా" అన్నాడు కోపంగా.

"ఏంటయ్యా?  నువ్వు ఎగిరి గంతేస్తావనుకుంటే అలా కోప్పడుతావ్" అన్నాడు మేనేజరు ఆశ్చర్యంగా.

"ఎగిరి గంత్తేయ్యటం కాదురా నిన్ను ఎగిరి తన్నాలి"  అని మనసులో అనుకుని "నాకు ఇష్టం లేదు సార్" అన్నాడు మనోజ్ ఏడుపు కొనసాగిస్తూ.

"అది కదయ్యా" అంటూ మేనేజరు  ఎదో చెప్పే లోపే.......

"సార్ ! అవసరం అయితే ఇ కంపెనీలో ఉద్యోగం మానేస్తాను కాని నేను మాత్రం అమెరికా వెళ్లాను" అన్నాడు మనోజ్ దృడ మయిన స్వరంతో.

మేనేజరు మనోజ్ చేతులు పట్టుకుని బోరుమని ఏడుస్తూ "బాబు ని పోటో ఒకటి యిస్తావ?" అన్నాడు.

"నేను వెళ్ళను అంటుంటే,  మళ్ళి  పోటో ఎందుకు సార్" అన్నాడు మనోజ్ చిరాకుగా.

"అందుకే అడుగుతున్నాను బాబు. ఎంతో  మంది అన్ సైట్ పంపడం లేదని నన్ను బండ బూతులు తిట్టుకుంటున్నారు. కాని నీలాంటి వాడిని చూడటం మొదటి సారి బహుశ చివరి సారి కూడా. అందుకే ని పోటో కు రోజు కోక్కసారయిన దండం పెట్టుకుంటే నాకు అ తిట్లయిన తప్పుతాయి" అంటూ బ్రతిమాలాడు.

"అలాగే పంపిస్తా" అని చెప్పి మేనేజరు రూం  నుంచి బయట పడ్డాడు మనోజ్. 

అప్పటి నుంచి ఆ కంపెనీలో నుంచి వెళ్ళి పోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్వులు  అటెండ్ అవ్వటం మొదలు పెట్టాడు. ఒక మల్టి  నేషనల్ కంపెనీలో అన్ని రౌండ్స్ క్లియర్ చేసాడు. ఆఖరిది HR రౌండ్ మాత్రమే ఉంది.

ఇంటర్వు చేసే అతను అడిగాడు "మీకు పాస్ పోర్టు ఉందా" అని.

"లేదు అవసరం అయితే అప్లై చేస్తాను" అన్నాడు మనోజ్.

"తోందరగా చేసుకోండి. మిమల్ని త్వరలోనే ఆస్ట్రేలియా పంపిస్తాం" అన్నాడు అలాగయిన కాస్త సలారి తగ్గించవచ్చని.

వెంటనే మనోజ్ "అయితే నేను జాయిన్ అవ్వను" అన్నాడు కోపంగా.

"ఏంటి మిష్టర్! మీకు ఆస్ట్రేలియా ఇష్టం లేక పొతే అమెరికా వెళ్ళుదురు గాని" అన్నాడు ఇంటర్వూ  చేసే అతను  ఉషారుగా.

"అసలు ఇండియాలో, హైదరాబాదు లో తప్ప నేను ఎక్కడ పని చేయను, అందుకే జాయినవ్వను " అన్నాడు మనోజ్ కోపంగా అరుస్తూ.

ఇంటర్వూ  చేసే అతనికి పిచ్చేక్కినంత పనయింది.  "బాసు నువ్వు పేస్ బుక్ లో ఉన్నావా? ఉంటె నన్ను ని ప్రెండు గా యాడ్ చేసుకోవా" అంటూ బ్రతిమాలాడు.

"ఎందుకండీ" అడిగాడు మనోజ్  చిరాకుగ.

"నీలాంటి వాడిని చూశానని అందరికి గర్వంగా చెప్పుకుంటాను. ఎంతో  మంది ఇంటర్వూ  మొదలు పెట్టగానే ఆన్  సైట్ కావాలంటూ అడుక్కోవ్వటం చూశాను. కానీ నీలాగా వద్దు అన్న వాణ్ణి ఈ జన్మకు చూడలేను" అంటూ మురిసి పోయాడు ఇంటర్వు చేసే అతను. 

అప్పటి నుంచి ఇంటర్వులు అటెండు అయ్యేటప్పుడు మెదట అతను  పెట్టె కండిషన్ "నేను అన్  సైట్ వెళ్ళాను. హైదరాబాదు లోనే పనిచేస్తాను" అని.

అది వినటం తోనే వాళ్ళు ఆశ్చర్య పోవటం మనోడిని పేస్ బుక్ లో యాడ్  చేసుకోవటం సర్వ సాదారణం అయిపొయింది. ఈ దెబ్బతో మనోడి ప్రెండ్స్ లిస్టు మహేష్ బాబు పేజి లో ప్యాన్స్ లిస్టుల తయారయింది. అన్ని కంపెని ఇంటర్వూ  ప్యానెల్ లో పేమస్  అయిపోయాడు. చివరికి ఓ కంపెని మనోడి కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకుందని జాయినయి పోయాడు.

స్వతహాగా తెలివిమంతుడు, అదృష్టవంతుడు అయిన మనోజ్ తొందరలోనే అందరి దృష్టి లో పడ్డాడు. ముఖ్యంగా US  మేనేజరు కు బాగా నచ్చేసాడు, అందుకే అతన్ని పంపుమని ఇండియా మేనేజరు ను ఒక్కటే పోరు పెడుతున్నాడు. కాని  అతన్ని ఎక్కడికి పంపమని ఒప్పుకుని తీసుకున్నారు. అందుకె  ఎలా అడగాలో అర్ధం కావటం లేదు మేనేజరు కు. అయినా రాత పూర్వకంగా ఏమిలేదు కదా అనుకుని ఓ రోజు తన క్యాబిన్ కు పిలుచుకున్నాడు మేనేజరు.

మనోజ్ రాగానే "మనోజ్ నీకు ఒక బ్యాడ్ న్యూస్. నిన్ను అమెరికా పంపుతున్నాను" అన్నాడు.

"అసలు ఇలాంటివి ఉండవని ఒప్పుకుంటేనే కదా సార్  నేను జాయిన్ అయ్యాను. మళ్ళి  ఇదేంటి" అన్నాడు కోపంగా.

"నిజమే నయ్యా కానీ US  మేనేజరు కు నువ్వు చాల నచ్చావ్ మరి" అన్నాడు.

"నేను వెళ్ళాను సార్" అన్నాడు మనోజ్ దృడంగా.

"చూడు మనోజ్ కంపెనీలో ఉన్నప్పుడు కంపెని రూల్సు ఒప్పుకోవాలి. నేను నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒక్కటి చెనై వెళ్ళాలి, రెండు అమెరికా వెళ్ళాలి" అన్నాడు మెనేజరు సంబర పడుతూ, అతను  చచ్చినట్లు అమెరికా ఒప్పుకుంటాడనుకుని.

"నేను చెనై కే వెళ్తాను సార్" అన్నాడు మనోజ్ ఉక్రోషంగా.

అది ఉహించని మేనేజరు "ఏంటయ్యా ఇది ! ఇంత  విచిత్రంగా ఉన్నావ్ ! బాబు ని కాళ్ళు పట్టుకుంటాను అమెరికా వెళ్ళవయ్య. లేకపోతె US మేనేజరు గాడు నన్ను చంపేస్తాడు" అంటూ మనోజ్ చేతులు పట్టుకుని బ్రతిమాల  సాగాడు.

"మీరు నిజంగా కాళ్ళు పట్టుకున్న నేను చెనై కే వెళ్తాను" అంటూ విస  విస  వెళ్ళి  పోయాడు.

మేనేజరు టేబులు కు తల కొట్టుకోసాగాడు ఏమి అర్ధం కాక. 

చెనై కి వెళ్ళిన మనోజ్ కొద్ది రోజుల్లోనే మరో కంపెనీలో జాయినయ్యాడు. అక్కడ కూడా తోందరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓ రోజు ఈ కంపెని మేనేజరు కూడా తన క్యాబిన్ కు పిలిచుకుని ఆన్ సైట్ విషయం చెప్పాడు. అంతే  మనోజ్ కి ఎక్కడ లేని విరక్తి పుట్టుకొచ్చింది.

కోపంగా "లక్ష్మి టాక్ షో,  ప్రేమతో మీ లక్ష్మి లాంటి ప్రోగ్రామ్స్ గ్యాప్ లేకుండా చుపిస్తానన్న నేను అన్ సైట్ మాత్రం వెళ్ళాను సార్" అని చాలెంజ్ చేశాడు మేనేజరు తో.

"ఇంకా టైం ఇస్తున్నాను,  బాగా ఆలోచించుకో" అంటూ పంపేశాడు మేనేజరు.

ఇంకా లాభం లేదని అక్కడ కూడా మానేసి ఏదయినా కాలేజ్ లో లేదా స్కూల్ లో టీచరుగా  జాయిన్ అవ్వాలనుకున్నాడు. అప్పటినుంచి ప్రతి కాలేజ్ లో, ఇంటర్ నేషనల్ స్కూల్స్ లో  ఇంటర్వులు ఇచ్చాడు. కాని ఎవరు తన ఇంటి లోన్ EMI కి సరిపడా ఇవ్వటం లేదు.

ఓ రోజు పేపర్లో విసాలన్ని రిజెక్ట్ అవుతున్నాయని అందులో ను L1 వీసాలు ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయని చదివాడు. మంచి మాస్టర్ ప్లాన్ వేసాడు మనోజ్.

మేనేజరు దగ్గరకు వెళ్ళి "సార్  నేను US  వెళ్ళుతాను. కాని L1 వీసా  మిదయితేనే వెళ్తాను" అన్నాడు గారంగా.

మేనేజరు ఆశ్చర్యంగా "అందరు H1 కావాలంటారు. నువ్వేంటయ్య  L1 అయితేనే వెళ్తనంటావ్. ఏది ఏమయినా నువ్వు ఒప్పుకోవటమే సంతోషం" అంటూ సంబరంగా గంతులేసినంత పనిచేశాడు.

చేసేదేంలేక మనోజ్ పాసు పోర్టు కు అప్లై  చేశాడు. వేరే వాళ్ళకు పాసు పోర్టు బుక్కులయి పోయాయి,  కంప్యుటరు పాస్వర్డ్ మర్చిపోయాము, ఇంకేదో ఇంకేదో అని వంద కారణాలు చెప్పే పాసు పోర్టు డిపార్టుమెంటు, మనోడికి మాత్రం నెల రోజులలో పాస్ పోర్టు ఇచ్చేసింది. తన అదృష్టానికి తన మీదే జాలేసింది మనోజ్ కు.

 "ఇప్పుడు కాదు కాని, వీసా ఇంటర్వు లో చెపుతా వీళ్ళ  సంగతి. అసలు ఎలా పంపిస్తారో" అని పకడ్బంది ప్లాన్ వేసుకున్నాడు.

"వాళ్ళు ఏమి అడిగిన తింగర తింగర గా సమాదానం చెప్పాలి, దెబ్బకు వీసా రిజెక్ట్ కావాలి" అనుకున్నాడు. 

వీసా ఇంటర్వు లో అడిగిన ప్రశ్న లకు మనోజ్ కు మతి పోయింది.

మొదటి ప్రశ్న "నీ  పేరేంటి". రెండవ ప్రశ్న "ఎప్పుడు జాయిన్ అయ్యావు ఈ కంపెనీలో".

మూడవ ప్రశ్న "మళ్ళి  ఎప్పుడు తిరిగి వస్తావు" .

అంతే  "నీ  వీసా రెండు వారాల్లో వస్తుంది" అని పంపి వేసారు.

మనోజ్ కు తన అదృష్టానికి తన మీదే విరక్తి కలిగింది. బోరున ఏడ్చుకుంటూ ఇంటికి బయలు దేరాడు. 


(సమాప్తం)

21, అక్టోబర్ 2012, ఆదివారం

రక్షకుడు


మనిషిని మనిషి హింసిస్తూ
నీతి, న్యాయం నశించిన శకన 
దయ, ప్రేమ కరువయిన కాలన 
మనుష్యులను కాయ
పశుల శాలయందు 
శిశువుగా అవతరించే 
యెహోవా పుత్రుడు 
యేసు నామదేయుడు 

భోదనలతో మనసు మార్చి 
పాపులను తన దరికి చేర్చి 
పరలోక వారసులనే 
మరియ తనయుడు 
మహిమ స్వరూపుడు 

కుటిలమయిన నీతిని 
కఠిన మయిన శాస్త్రని విస్మరించాడు 
వికృత గురువుల కృతులను నిలువరించాడు 

తన స్పర్శ తో, తన వాక్కుతో
రోగులకు స్వస్థతను  
ముగవారికి మాటను 
గుడ్డి వారికి చూపును 
మృతులకు మరు జన్మను ప్రసాదించాడు
జనావళిని ఆకర్షించాడు 

దైవ తనయుని తేజం 
లోకమంతా వెలుగు నింప 
బ్రతుకు భారమయి తల్లడిల్లే చీకటి తత్త్వం 
ప్రేమ ముర్తిపై కక్షతో దాల్చే కఠినత్వం 

కొరడాలతో కొట్టించే 
వికృతంగా హిసించే 
అయినా చల్లారని సాదింపు 
మూగబోయిన న్యాయాని 
సిలువేయమని వేదించే 

సిలువ భుజములపై వ్రాలెను 
లోక పాపములు మోసేను 
ఆ రక్షకుడు 
తండ్రి అజ్ఞాను పాలించను 
వ్యాఖనములు నిరుపించను 
ముందుకు సాగెను 
ఆ దైవ కుమారుడు 

రాతి మనసు గల రాక్షస సంఘం 
రాళ్ళతో కొట్టింది 
ముళ్ళ కిరీట మెట్టి 
విరగబడి నవ్వింది  
ఎన్నో వ్యంగ్యపు మాటలు రువ్వింది 

తనకై ఏడ్చే ప్రజలను వద్దని వారించే 
అయన సహనం చూసి  విశ్వమే తరించే 
తనయుని కష్టం తల్లి మనసుని దహించే 
కన్నీరు మున్నిరుగా విలపించే 

కమలమంటి పాదాలు 
ముళ్ళతో విరిసాయి 
కరుణా మయుని రక్త ధారాలు 
కల్వరి  నిండాయి 

నీచ లోకం కాళ్ళు, చేతులలో 
మేకులు దింపింది 
మహిముంటే సిలువ దిగమంది 
అయన అంగిపై పందెం కాసింది 
అయినా,  యేసు మనసు 
వారిని జాలిగానే చూసింది 
ఆ హినులను అమాయకులుగా ఎంచింది 
దండించ వద్దని తండ్రిని వేడింది 

దహమన్న నోటికి నీటిని బదులు 
కఠిన విషమును చిమ్మిన 
సర్పమంటి జాతి పాపపు కోరలు పీకగా 
మరణమును మన్నించెను 
మూడు రోజులకు తిరిగి లేచెను 

నిరాశ వెన్నంటి, విశ్వాసం అడుగంటి 
శోకం లో మునిగిన శిష్యులను చూసేను 
నేను నేనే నంటూ ఉత్తేజ పరచెను 
తండ్రి రాజ్యం విస్తరింపుమంటూ 
అయన నామమే చాలంటూ 
చివరి బోధ చేసేను 
అటుపై పరలోకం చేరెను 

ప్రేమ, శాంతి స్తాపించిన పావన మూర్తి 
ఎప్పటికి తరగనిది అయన కీర్తి 


18, అక్టోబర్ 2012, గురువారం

దేశమంటే మనుష్యులు కాదోయ్

దేశమంటే మనుష్యులు కాదోయ్
దేశమంటే దున్నలోయ్
పక్కన లూటి అయిన
పట్టింపు లేని పశువులోయ్

బండలవలె కండ కలదోయ్
ప్రతివాడికో  గుండె కలదోయ్
అందు దమ్ము మాత్రం కరువోయ్

చదువు కలదోయ్
తెలివి కలదోయ్
నిస్వార్థం నిండు సున్నోయ్

మాటలోమో కోటలు దాటును
చేతలేమో చేవ చచ్చును
సినిమాకు యువత బానిసోయ్
భవితకన్న-ఎక్కువ మక్కువోయ్

నీరు  కన్నా బీరు  మోలోయ్
ఎ వీధి  చూసిన ఉగులాట  జోరోయ్
ఆడవారు సైతం మినహాయింపు కారోయ్

ప్రభుత్వాలు మారిన పట్టింపు లేదోయ్
ఓటు వేయటానికి ఓపిక లేదోయ్
మత గొడవలంటే అతి మక్కువోయ్
సామరస్యం అతి తక్కువోయ్

దేశమేమయిన తమ కెందుకోయ్
తాము  బాగుంటే లోక మెందుకోయ్
దేశ భక్తీ అంటే పనికి రాని మాటోయ్
దోచు కోవటమే నేటి ఉత్తమమయిన బాటోయ్

దేశమంటే మనుష్యులు కాదోయ్
దేశమంటే దున్నలోయ్