10, సెప్టెంబర్ 2012, సోమవారం

నిద్రరాముని నుండి రాక్షసుని వరకు 
ధనికుని నుండి పేదవాని వరకు 
పసివాడి నుండి పండు ముసలి వరకు 
అలసిన మనసు కోరే అమ్మ ఓడి నిద్ర

తీరని కోరికలను కలలో తీర్చి 
కలతలను రూపుమాపే కల్పవృక్షం నిద్ర 
కలవరింతలతో హృదయాన్ని తెలిపి 
అంతరన్ని  ముందుంచే నిలువుట్టద్దం  నిద్ర 

కఠిన నిజాలు కాస్సేపయినా  మరపించి 
కన్నీటిని తుడిచే వదలిపోని నేస్తం నిద్ర 
ఎంత వేడినా వరమియ్యని దేవుడు 
అడగకుండానే యిచ్చిన వరం యీ నిద్ర, కాని 

అతిగా ఒడిలో చేరితే ఒడలు మరపించి 
కొరగాని వాడిని చేసే కొరివి యీ నిద్ర 
మత్తులో మునిగితే చిత్తూ చేసే చితి మంట యీ  నిద్ర 
ఎన్ని తనలో ఉన్న అందరిని తనలో కలుపుకుని 
అందరి తలలు వంచు యీ  నిద్ర.


6 వ్యాఖ్యలు:

 1. "తీరని కోరికలను కలలో తీర్చి
  కలతలను రూపుమాపే కల్పవృక్షం నిద్ర
  కలవరింతలతో హృదయాన్ని తెలిపి
  అంతరన్నిముందుంచే నిలువుట్టద్దంనిద్ర "
  beautiful lines.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాల థాంక్స్, ఇలాంటి ప్రోత్సాహమే నడిపించేది.

   తొలగించు
 2. ఏదో టైం దొరికినప్పుడు నిద్రపోవడమే అనుకున్నా, నిద్ర వెనుక ఇన్ని నిఘూఢ అర్థాలు ఉన్నాయన్నమాట:)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. job lu vachina raaka poyina,
  promotion lu vachina raaka poyina,
  time ki train lu vachina raaka poyinaa,
  prathi roju time ki vachedhee ee nidra

  ప్రత్యుత్తరంతొలగించు