3, నవంబర్ 2013, ఆదివారం

కిల్లర్ !!


అది సాయంత్రం ఆరు గంటల సమయం,  హైదరాబాద్ ట్యాంకు బండ్ మిద బస్టాప్ లో ఓ వ్యక్తి  పుస్తకం చదువు కుంటూ కూర్చున్నాడు. అతని పెరు విశ్వం. అతని ఇల్లు ఇక్కడికి రెండు కిలో మీటర్లే దూరం, అందుకే ఏమి తోచనప్పుడేళ్ళ  ట్యాంకు బండ్ మిదకి వచ్చి ఏదో చోటులో కూర్చుండి  ఇలా పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఎందుకో పెద్దగా రద్దీగా లేదు ట్యాంకు బండ్. ఏవో ద్విచక్ర వాహనాలు తప్ప బస్సులు, టాక్సీలు మరియు ఆటోలు కూడా తిరగటం లేదు. జనాలు కూడా అక్కడడక్కడ  ఒక్కరిద్దరు తప్ప ఎక్కువగా లేరు. 

 అసలే ఈ రోజు టివి లో ఎవరో హంతకుడు వయసులో ఉన్న అమ్మాయిల్ని బలాత్కారం చేసి చంపెస్తున్నాడని ప్రకటించారు. ఇప్పటి వరకు పన్నెండు మందిని చంపేసినా  పోలీసులు మాత్రం వాణ్ణి పట్టుకోలేక పోయారు. ఇక్కడ చూస్తేనేమో అస్సలు రద్దీ లేదు.

ఆలాంటి సమయంలో అదే బస్టాప్ కు ఓ అమ్మాయి వచ్చింది. ఎందుకో ఆమె చాల కంగారుగా ఉంది. మాటి  మాటికి గడియారం వంక చూసుకుంటూ తనలో తను ఏదో గోణుగుకుంటూ ఉంది. బహుశ బస్సు కోసం ఎదురు చుస్తుందేమో అనుకున్నాడు విశ్వం. తనకేమి పట్టనట్లు పుస్తకం చదువు కోవటం లో మునిగి పోయాడు.

ఆలా ఓ పావు గంటకు మరో వ్యక్తీ వచ్చాడు అదే బస్టాప్ కి,   చూడటానికి చాల బలంగా ఉన్నాడు. అమ్మాయి వంక అదో రకంగా చూస్తున్నాడు. అలాగే విశ్వం వంక కోపంగా చూస్తున్నాడు. పాపం అమ్మాయి ఇంకా కంగారు పడిపోసాగింది, నిజం చెప్పాలంటే చాల భయపడి పోసాగింది.  భయంతో అమ్మాయికి సాయంత్రం అయినా చెమటలు పోస్తున్నట్లు అనిపించింది విశ్వనికి. 

ఓ పావు గంట తరువాత ఆ అమ్మాయి విశ్వం దగ్గరికి వచ్చి "సార్ ! అరగంట నుంచి బస్సు కోసం చూస్తున్నాను ఒక్క బస్సు కూడా రావటం లేదు. నా సెల్ పోన్ లో చార్జింగ్ అయిపొయింది, దయచేసి మీ సెల్ ఇస్తారా ?  మా వాళ్లకు ఫోన్ చేసి ఇక్కడికి రామ్మంటాను" అంది. దానికి విశ్వం "అయ్యో ! సారి అండి,  నా దగ్గర సెల్ ఫోన్ లేదు, నిజానికి నేను సెల్ ఫోన్ వాడను" అన్నాడు. దాంతో ఆ  అమ్మాయి చాల దిగులు పడి పోయింది. దానికి విశ్వం "మరేం పర్లేదు, ఏదయినా షాప్ కు వెళ్ళి  ఫోన్ చేద్దాం మీ వాళ్ళ కు. నేను తోడుగా వస్తాను" అన్నాడు.

సరేనంటూ ఇద్దరు బయలు దేరారు ఏదయినా షాప్ లో ఫోన్ ఉంటుందేమోనని. కాని ఒక్క షాప్ కూడా తెరిచి లేదు. రోడ్డు మిద ఎవరో కనిపిస్తే అడిగాడు విశ్వం, ఎందుకు షాపులు మూసివేసి ఉన్నాయని. ఆరోజు బందు అంటూ చెప్పారు. అప్పుడు విశ్వం ఆ అమ్మాయి వంక తిరిగి   "బంద్  రోజు నువ్విల బయటకు ఎందుకు వచ్చావ్ ?" అంటు అడిగాడు. దానికి అమ్మాయి "మా పిన్ని వాళ్ళు అమెరికా వెళ్తుంటే సాగనంపటానికి నిన్న వచ్చాను సార్, ఈ రోజు మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు  వాళ్ళను కారులో హెయిర్ పోర్టులో  డ్రాప్ చేసి విజయవాడ వెళ్లి పోతారు. నన్ను ఇలా దారిలో దింపి వేసారు. వాళ్ళు అటు వెళ్ళగానే నాలో కంగారు మొదలయ్యింది, ఎలాగో దైర్యం చేసి దగ్గర బస్టాప్ కదా అని ఇక్కడకు వచ్చాను. ప్రయాణం హడావిడిలో ఉన్న మాకు ఈ రోజు బందు అన్న విషయమే తేలియలేదు " అంటూ భయపడి పోయింది.

దానికి విశ్వం "మరేం  పర్వాలేదు మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. మా ఇంటికి వెళ్లి అక్కడనుంచి మీ వాళ్ళకు ఫోన్ చేద్దువుగాని. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళతారు" అన్నాడు. అ అమ్మాయి తటపయిస్తూ ఉండి పోయింది. అంతలో కాస్త  దూరంగా బస్టాప్ లో కనిపించిన బలిష్టమయిన వ్యక్తి వాళ్ళ వైపే రావటం కనిపించింది. వెంటనే ఆ అమ్మాయి "అలాగే వెళ్దాం సార్" అంది.  అల ఇద్దరు నడుస్తూ ఉన్నారు. అప్పటికి సమయం పావు తక్కువ ఏడు. అది చలికాలం కావటంతో తొందగారనే చీకటి పడింది , పైగా బంద్  కూడా కావటంతో అసలు జనం లేరు రోడ్డుమీద.

కాస్సేప్పయ్యాక వెనకి తిరిగి చుసిన విశ్వం కి బస్టాప్ లో చుసిన ఆ బలిష్టమయిన వ్యక్తీ కూడా వాళ్ళను అనుసరిస్తున్నట్టు కనిపించింది. విశ్వం వేగం పెంచాడు, ఆ అమ్మాయి కూడా తనతో పాటు వేగం పెచ్చింది. ఆ వ్యక్తీ కూడా వేగం పెంచాడు. ఆ అమ్మాయికి ఇంకా  కంగారు పెరిగింది. విశ్వం లో కూడా చిన్నగా కంగారు మొదలయింది. వాడు చుస్తే చాల బలంగా ఉన్నాడు, తను నిజంగానే వాడితో తలపడలేడు అనుకుంటూ నడక వేగం ఇంకా పెంచాడు విశ్వం.

ఆలా కాసేపటికి విశ్వం ఇల్లు చేరారు ఇద్దరు. ఆ ఇల్లు కాలనీలో చివరగా ఉంది, ప్రక్కనే శ్మశానం ! చాల దూరంలో వేరే ఇళ్ళు  ఉన్నాయి. అద్దె తక్కువని తీసుకున్నాడు విశ్వం. విది  లైటు పాడు అయినట్లు ఉంది రోడ్డు మిద మరియు ఇంటి ముందు అంత చీకటిగా  ఉంది. ఆ అమ్మాయి చాల భయపడి పోతున్నట్లుగా  గమనించాడు విశ్వం. తాళం తీసి లోపలికి  అడుగు పెట్టాడు. "బయట లైట్ వెయ్యండి సార్" అంది ఆ అమ్మాయి. "సారి అండి, నిన్ననే బల్బు మాడిపోయింది. ఇంకా మార్చలేదు" అన్నాడు.  భయం భయం గానే లోపలికి  అడుగు పెట్టింది ఆ అమ్మాయి.

ఇల్లు చాల చిన్నది. ఒక్క హాలు, బెడ్ రూం ఇంకా కిచెన్ అని తెలిసి పోతుంది. హల్లో సాయిబాబా పోటో వేలడదిసి ఉంది. అది చూడగానే ఆ అమ్మాయికి కాస్త దైర్యం నమ్మకం కలిగాయి. మెయిన్ డోర్ మూస్తున్నా విశ్వం తో "తలుపు తీసే ఉంచండి సార్  ఉక్కగా ఉంది" అంది ఆ అమ్మాయి. దానికి విశ్వం నవ్వుతు "చలికాలం ఉక్కపోయటం ఎంటండి? దోమలు వచ్చాయంటే నేను చావాలి రాత్రంతా. మా ఇంటికి వచ్చేసాం కాదా ఇంకా భయమెందుకు !. అదిగో ఫోన్, మీ వాళ్ళను అర్జెంటుగా మీ కోసం రామ్మని చెప్పండి" అంటూ ల్యాండ్ ఫోన్ చూపించాడు.

ఫోన్ ఎత్తిన అ అమ్మాయికి అది పని చేయటంలేదని అర్థం అయ్యింది. వెంటనే విశ్వంతో "ఇది డేడ్ అయినట్లుగా ఉందండి !" అంది. "ఓ మై గాడ్ ! ఆదెప్పుడు జరిగింది ?" అంటూ ఆశ్చర్య పోయాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఏంచేయాలో అర్ధం కావటం లేదు. అప్పడు విశ్వం "మరేం భయం లేదు, నా దగ్గర స్కూటర్ ఉంది. ఒక్క కప్పు టి తాగి  మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపెస్తాను" అన్నాడు. ఆ అమ్మాయికి మరో మార్గం కనిపించలేదు. అలాగేనంటూ ఒప్పుకుంది.

విశ్వం కిచెన్ లోకి వెళ్ళి పోయాడు. అప్పుడప్పుడు గిన్నెల శబ్దం వస్తోంది లోపలి నుంచి. ఆ అమ్మాయికి అతనేం చేస్తున్నాడో చూడాలనిపించింది. కాని అతను  చుస్తే బాగుండదని ఆగిపోయింది. ఎందుకయినా మంచిదని మెయిన్ డోర్ గొళ్ళెం తీసి పెట్టింది.

కాసేపయ్యాక విశ్వం ఒక విచిత్రమయిన స్థితిలో భయటకు వచ్చాడు. చూడటానికి చాల భయం వేసేలా ఉన్నాడు. కళ్ళు చింత నిప్పుళ్ళ ఎర్రగా మండి  పోతున్నాయ్. ఓ లావు పాటి కూర  గాయాలు కోసే కత్తి  అతని చేతిలో లైటు వెలుగికి మెరిసి పోతోంది. అతన్ని చూడగానే ఆ అమ్మాయి బయటకు పరిగెత్తేదే,  కాని టిపాయ్  అడ్డుగా ఉండటంతో నిలబడి నిశ్చేస్టూరాలయి చూస్తుండి  పోయింది.

విశ్వం ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్తున్నాడు. "ఎంత పిచ్చిదానివి కాకపోతే నన్ను నమ్మి ఇంత  దూరం వస్తావు నాతో పాటు. ఈ రోజు బందు కదా ఎవరు దొరుకుతారులే అనునుకున్నాను. కానీ నా అదృష్టం,  పాపం ని దురదృష్టం నువ్వు దొరికి పోయావ్. టివి లో చెప్పిన హంతకుడు నేనే" అంటూ నవ్వుతు ఆ అమ్మాయి మిద పడబోయాడు.  అంతే  ఒక్క సారిగా మెయిన్ డోర్ తెరుచుకుంది.

బస్టాప్ లో చుసిన బలిష్టమయిన వ్యక్తీ విశ్వం మిద పడి పిడిగుద్దులు గుద్దసాగాడు. అది ఉహించని విశ్వం ప్రతిఘటించలేక పోయాడు. చేతిలో కత్తి  ఎప్పుడో కింద పడి  పోయింది. ఆ వ్యక్తీ ఇంకా తనను కొడుతూనే ఉన్నాడు. కాసేపటికి విశ్వం స్పృహ కోల్పోయాడు.

తెలివి వచ్చే సరికి తను పోలిస్ స్టేషన్ సెల్ లో ఉన్నాడు. ఎదురుగ ఆ బలిష్టమయిన వ్యక్తీ మరియు ఆ అమ్మాయి ఇద్దరు పొలిసు డ్రేసు లో కనిపించారు. విశ్వం మళ్ళి  స్పృహ తప్పాడు.


(సమాప్తం)


2 వ్యాఖ్యలు: