24, జూన్ 2012, ఆదివారం

ఆరవ వేలు

అనగనగ ఒక్క అమ్మాయి. తన  పేరు కావ్య. తను చాల భయస్తురాలు. డిగ్రి చదువుతున్నా కూడా  ఎవరి మొహన్ని  నేరుగా చూసే ధైర్యం లేదు,  ఇంకా అపరిచితుల సంగతి సరే సరి.  రోజు సాయంత్రం  కావ్య సైకిల్  మీద ట్యూషన్ కి  వెళ్ళేది.  దారి  మద్యలో రోడ్డును తప్ప ఇంకేం చూసేది కాదు.

అలాంటి తనకు ఓ రోజు ఎవరో తనను వెంటాడుతున్నారని అనుమానం వచ్చింది. ఎందుకటే  రోజు ఒకే  మలుపు దగ్గర నుండి ఒక్క సైకిల్ తనను  వెంబడించటం  గమనించిది అది ఒక్కరోజు కాదు వరుసగ మూడు రోజులు  గమనించింది.  దానితో ఆ సైకిల్ తన కోసమే  ఆగి తనను మాత్రమే వెంటాడుతుందని  నిర్దారించుకుంది . 

అంతే  తన  గుండె వేగం పెరిగింది ,   కాళ్ళలో  వణుకు  మొదలయింది  తిరిగి చూసే  ధైర్యం లేని తను ఓరగా నెల చూపుతో వెనక్కి  చూసింది. అవి ఒక్క మగ మనిషి కాళ్ళు  అని గుర్తించింది. అంతే  తన గుండె ఆగినంత పనయింది . ఎక్కడ లేని బలం తెచ్చుకుని వేగంగా సైకిల్ తొక్కుకుంటూ  ఇంట్లో వచ్చి పడింది .

 రెండో రోజు మళ్ళి  ట్యూ షన్  వెళ్ళాలంటే భయం, వాళ్ళ అమ్మకి చేపుదామంటే  ఏమంటుందోనని అదో భయం .  అయినా ధైర్యం చేసి చెప్పింది  " అమ్మ రోజు ఎవరో నన్ను సైకిల్ మీద వెంబడిస్తున్నారు , నాకు చాల భయం వేస్తుంది, నేను ట్యూషన్  కి వెళ్ళాను" అని.

"ఎవడే వాడు !" అంది వాళ్ళ  అమ్మ విస్తుపోతూ. 

"తెలీదమ్మ, మొహం చూడలేదు కానీ కాళ్ళు  మాత్రం బాగా గుర్తున్నాయ్ ఎందుకంటే ఒక కాలికి ఆరు వేళ్ళు  ఉన్నాయి ఇంకా రోజు అదే సైకిల్" అంది కావ్య.  

చినతనం నుంచి అయిన దానికి కానీ దానికి బయపడే తన పిరికి స్వబావం తెలిసిన  వాళ్ళమ్మ పక్కున నవ్వి  "రోజు నువ్వు అదే టైంకి  అదే రోడ్డు మీద అదే సైకిలు వేసుకుని నువ్వు  ట్యూషన్ కి  వెళ్ళినట్టే చాల మంది అదే రోడ్డు మిద  అదే టైంకి  వాళ్ళ పనుల మీద తిరుగుంటారు, అర్ధం లేని భయాలు మాని ముందు ట్యూషను కు బయలుదేరు" అంది.

ఇక చెసెదేమి లేక ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని  ట్యూషన్ కి బయలుదేరింది.  ఆ  రోజు కూడా ఎవరో తనను వెంబడించటం గమనించింది. ట్యూషన్ లో తన స్నేహితురాలు ఉష కు ఇదేవిషయం చెప్పి తోడూ రమ్మంది. 

వెంటనే ఉష ఉషారుగా "నీకు ఎవడో లైన్ వేస్తున్నాడే" అంది. 

దాంతో కావ్య కి ఇంకా తత్తర  పుట్టింది. ఈ మాట అ నోట ఇ నోట  పాకి ఎక్కడ తన ఇంట్లో తెలుస్తుందోనని బయపడి "ఉరికే సరదాగా అన్నాను అసలు నువ్వు ఎమంటవో  అని" ఉష ముందు అబద్దం అడింది.  

ఇప్పుడు తనకు ఇంకో కొత్త భయం మొదలయింది,  ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎక్కడ తనను ప్రేమలో పడిందని అనుకుంటారో, చెప్పక పొతే  ఈ  వెంటాడుతున్న వాడు ఏంచేస్తాడో అని భయపడుతూ అలాగే వారం  రోజులు వెళ్ళింది,  ప్రతి రోజు అదే  సైకిల్, అవే  కాళ్ళు తనను వెంబడించాయి.

అలా  వారం  గడిచాక ఒక రోజు ధైర్యం చేసి వాళ్ళ  అమ్మతో ఇలా చెప్పింది "అమ్మ మాకు కొత్త లెక్చరర్  వచ్చాడు, అయన చాల బాగా చెపుతున్నాడు నాకు ట్యూషన్ ఇంకా అవసరం లేదు". 

దానికి వాళ్ళ  అమ్మ "సరెలేవే! నీ  ఇష్టం, నువ్వు పాస్ అయితే అంతే చాలు" అంది.

అలా గండం గడిచిందని సంతోష పడింది. డిగ్రి పుర్తవటం తో పెళ్లి సంబందాలు చూడటం మొదలు పెట్టారు. కొన్నాళ్ళ కు ఒక్క మంచి సంబంధం కుదిరింది, అబ్బాయి వాళ్ళ ఉరి వాడే, పేరు రాజేష్.  హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు.  వెంటనే పెళ్లి చూపులు ఎర్పాటు చేసారు పెద్దవారు. స్వతహాగా బయస్తురాలయిన కావ్య కు సిగ్గు కూడా తోడయ్యే  సరికి దించిన తల ఎత్తలేదు. అబ్బాయి కూడా ఏమి మాట్లాడలేదు.

అందరు వెళ్లి పోయాక వాళ్ళ వదిన వచ్చి కావ్య ని అడిగింది "ఏంటి అబ్బాయి నచ్చాడ?" అని. 

వెంటనే కావ్య "ఏమో?" అంది గుండ్రంగా కళ్ళు తిప్పుతూ. 

వాళ్ళ వదిన ఆశ్చర్యంగా "అసలు అబ్బాయిని చూసావా లేదా ?" అంది. 

కావ్య సిగ్గు పడుతూ "కొంచెం కొంచెం చూసాను" అంది.

"ఏంటి ! కొంచెం కొంచెం చూసావా?  ఏం చూసావ్" అంది. 

దానికి కావ్య " గోదుమ రంగు సాక్స్ వేసుకున్నాడు కదా అబ్బాయి" అంది అమాయకంగా.

అందుకు వాళ్ళ  వదిన నవ్వి "నువ్విక  మారవ్ తల్లి,  మేమంతా చూసాం. అబ్బాయి చాల బాగున్నాడు, నువ్వు  చూస్తానంటే చెప్పు పోటో తెప్పిస్తాం" అంది. 

అందుకు కావ్య "ఎందుకులే వదిన మీ అందరికి నచ్చాడు కద, నాకు నచ్చినట్టె " అంది.

ఓ శుబముహుర్తన కావ్య కు రాజేష్ కు పెళ్లి అయిపొయింది. కావ్య రాజేష్ కొత్త కాపురం హైదరాబాద్ లో పెట్టారు.  వాళ్ళు అద్దెకు ఉంటున్న ఇల్లు రెండు  అంతస్తులది (G+1). కింది వాటాలో విళ్ళు పై వాటాలో ఎవరో ఒక్కతనే ఉంటాడని వాళ్ళయన చెప్పాడు. ఓనర్స్ మాత్రం  అమెరికా లో ఉంటారట.

అందరు  ఆడవాళ్ళ లాగే   కావ్య కుడా వాళ్ళాయన ఆఫీసుకు వెళ్ళగానే టివి లో మునిగి పోయేది. ఒక ఆదివారం రోజు వాళ్ళాయన కాలి  గోళ్ళు తీసుకుంటున్నాడు.  

ఒక్క కాలి మీద  పెద్ద మచ్చను చూపిస్తూ "ఎన్నో రోజులుగా అడుగుదామనుకుంటున్నాను, అసలు ఏంటి ఆ మచ్చ" అంది. 

దానికి వాళ్ళాయన ఓ రకంగా చూస్తూ " ఏంటి ఈ కాళ్ళు చూస్తుంటే ఎమ్మన్న గుర్తుకు వస్తుందా? అంత  ఇదిగా  అడిగావు" అన్నాడు.  

రాజేష్ మాటలకూ నివ్వెర   పోయిన కావ్య మౌనంగా వంట గదిలోకి వెళ్లి పోయింది. ఇప్పుడు కావ్య లో మరో రకమయిన భయం మొదలయింది. వాళ్ళాయన తనను అనుమానిస్తున్నడెమో అని తనలో తాను  మదన పడసాగింది.

ఒక రోజు కావ్య వంట గదిలో ఉండగా ఏదో శబ్దం రావటంతో  కిటికీ లోంచి  బయటకు  తోంగి చూసింది. పై పోర్షన్ లో ఉండే ఆతను అపుడే మేట్లేక్కుతున్నాడు, అప్రయత్నంగా అతని కాళ్ళ కేసి చూసింది. అంతే కావ్య గుండె ఆగినంత పనయింది.

ఆవే కాళ్ళు, అవే ఆరు వెళ్ళు తనను సైకిల్ మీద వెంటాడాయి. వాడు పై వాటాలో ఉండటం యద్రుచికమా? లేక తనను వెంటాడుతూ  ఇక్కడ వరకు వచ్చాడ? ఆ ఆలోచన రావటం తోనే తనకు చిరు చెమటలు పోసుకోచ్చాయి.

వాళ్ళయనకు చెపుదమంటే  మొన్న మచ్చ గురించి అడిగితేనే అదో రకంగా మాట్లాడాడు, యిప్పుడు వీడి గురించి చెప్పితే ఇంకా ఏమంటాడో! అని తనలో తనే మదన పడసాగింది. రాజేష్ తో కూడ ముబావంగా ఉండటం మొదలు పెట్టింది.

తనలో ఈ మార్పు గమనించిన రాజేష్ ఒక్క రోజు కావ్యాని  "ఏంటి ఈ మద్య అదోల  ఉంటున్నావ్, ముభావంగా, భయం భయంగా" అని అడిగాడు. 

అదేం లేదని మాట దాటేయాలని చూసింది.  కాని రాజేష్ గుచ్చి గుచ్చి అడగటంతో కావ్య నోరు విప్పక తప్పలేదు.

"మన పై పోర్షన్ లో అతను నేను ట్యూషన్ కు  వెళ్ళుతుంటే వెంట పడేవాడు" అంది. 

"అవునా, మరి ఇన్ని రోజులు చెప్పలేదేంటి! అయినా అందులో నువ్వు భయపడేది ఏముంది" అన్నాడు రాజేష్.

దానికి కావ్య "నేను ఈ  మధ్యే అతన్ని  గుర్తు పట్టాను, అతని కాళ్ళు చూసి" అంది. 

రాజేష్ కాస్త ఆశ్చర్యంగా  " ఏంటి కాళ్ళు చూసి గుర్తుపట్టావా? అదేంటి" అన్నాడు.

"అవునండి, నేనెప్పుడు అతని మొహం చూడలేదు, కాని కాళ్ళు మాత్రం చూసాను. ఒక కాలి కి ఆరు వెళ్ళు ఉంటాయి" అంది కావ్య.

దానికి రాజేష్  పగలబడి నవ్వుతూ "ఏది అ మసీదు మలుపు దగ్గర నుంచేనా? వెంటపడింది" అన్నాడు. 

కావ్య ఆశ్చర్యంగా "అవును మికెలా  తెలుసు?" అంది. 

రాజేష్ ఇంకా నవ్వుతు "ఆరు వెళ్ళు ఉన్న వాళ్ళ అందరు నీ  వెంటపడ్డారు అనుకుంటే ఎలా? అసలు అ వెంటపడింది నేనే. ఆరు వెళ్ళు అంటే నాకు చిరాకు, అందుకే తియించేసుకున్న. మొన్న మచ్చ గురించి అడిగినప్పుడే గుర్తుపట్టి అడుగుతావనుకున్న, కాని భయపడుతూ లోపలికి వెళ్లి పోయావ్. ఏదయినా మంచి సందర్భంలో  చెప్పి నిన్ను థ్రీల్  చేద్దామనుకున్న"  అన్నాడు.

అప్పటి నుండి కావ్య అనవసర భయాలు మానుకుని సంతోషంగా ఉండటం మొదలు పెట్టింది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి