28, జూన్ 2012, గురువారం

కాకి గూడు


ఉదయం ఆరుగంటల సమయంలో ప్రతిరోజూ నిద్ర లేచే సుబ్బారావు అలవాటు ప్రకారంగా లేచిన వెంటనే పెరట్లోకి వచ్చి వేప పుల్లతో పళ్ళు తోమి బావి లోంచి నీళ్ళు  తోడుకుని మొఖం కడుక్కున్నాడు. సుబ్బారావు ఉండేది మరి పల్లెటూరు కాదు అలా అని పట్నం కాదు,  మద్యస్తంగా ఉండే చిన్నపాటి టౌను.

అదే ఉళ్ళో  అతను  మండలాఫిసులో గుమస్తాగా పని చేస్తున్నాడు. తల్లి తండ్రి చిన్నప్పుడే కాలం చేయటంతో వాళ్ళ బామ్మే తనను పెంచి చదువు చెప్పించి ప్రయోజకున్ని చేసింది.

వాళ్ళింట్లో ఉండేది సుబ్బారావు, అతని భార్య సుందరి అతని ఇద్దరి పిల్లలు కొడుకు రవి కూతురు రమణి ఇందాక చెప్పుకున్న అతని బామ్మ శారదమ్మ. 

సుబ్బారావు వాళ్ళది ఒక్కప్పుడు వ్యవసాయ కుంటుంబం. పెద్దగ ఆస్తిపాస్తులు లేక పోయిన ఓ మూడు వందల గజలలో తాతలనాటి ఇల్లుంది. ఇల్లు మంచి వాస్తు ప్రకారం ఉండి పెరడు, అందులో రక రకాల పూల చెట్లు, కొన్ని కూరగాయ పాదులు, ఓ మెస్తారు  ఎత్తున్న మామిడి చెట్టు,  వేప చెట్టు, సర్వ కాలలయందు  నీళ్ళు  ఉండే బావి. ఇలా ఏ  బదర బంది  లేని కుంటుంబం తనది.

అయితే అతనికోచ్చిన చిక్కళ్ళ  వాళ్ళ  బామ్మ వాళ్ళే. తను ఉన్నని రోజులయినా వాళ్ళ వ్యవసాయ పనిముట్లు ఉంచాలని పట్టుపట్టి మరి పెరడు లో పెట్టించింది. ఆలాగే వాస్తు, రాహుకాలం, దుర్ముహూర్తం లాంటి ఎన్నో పట్టింపులు. అంతే  కాకుండా అది మంచింది ఇది చెడ్డది మా కాలంలో ఇవి లేవు అవి లేవు అంటూ ఇంటిల్లి పాదిని హాడలిస్తుంటుంది. బామ్మంటే అమితమయిన గౌరవం, ప్రేమ ఉన్న సుబ్బారావు కాస్త అటు ఇటయిన  ఆవిడ ఇష్ట ప్రకారమే పనులు జరిపించే వాడు. 

మొఖం కడుక్కుని పెరట్లో ఉన్న దిమ్మ మిద కుర్చుని బార్య ఇచ్చిన కాఫీ ఆస్వాదించటం సుబ్బారావు దినచర్యలో భాగం. అలా  కాఫీ తాగుతూ అప్రయత్నంగా పైకి చుసిన సుబ్బారావు కు ఓ కాకి గూడు  కట్టటం కనిపించింది. గూడు  ఇంకా పూర్తికాలేదు కాకి పూర్తీ చేసే పనిలో ఉంది.

ఎందుకో సుబ్బారావు కు ఆ విషయం నచ్చలేదు. వెంటనే ఆ కాకిని అదిలించి అక్కడనుంచి వెళ్ళగొట్టాడు. నిజం చెప్పాలంటే అది వెళ్లి పోయేంత వరకు అదిరించి బెదిరించి తరిమేసాడు. 

సుబ్బారావు అల వెళ్ళగానే మళ్ళి  చెట్టెక్కిన కాకి సగం పూర్తయిన తన గూటిని కట్టె  పనిలో  మునిగి పోయింది. గూడు కట్టే ద్యాసలో పడి పాపం కాకి తిండి తిప్పలు కూడా మర్చిపోయింది. ఎదయింతేనేం!  సాయంత్రానికల్లా గూడు  పూర్తిగా కట్టేసింది. 

రోజు సాయత్రం అయిదు గంటలకు ఆపీసు నుంఛి రాగానే పై పనులు పూర్తీ చూసుకుని  పెరట్లో ఉన్న దిమ్మ మిద కుర్చుని బార్య ఇచ్చిన కాఫీ తాగటం సుబ్బారావుకు అలవాటు. అలా  కాఫీ తాగుతున్న సుబ్బారావు కు  ప్రొద్దున విషయం గుర్తుకొచ్చి పైకి చూసాడు. పొద్దున్న సగంలో ఆగిన గూడు  పూర్తయి కనిపించింది.

అంతే  పూనకం వచ్చిన వాడిలాగా పెద్ద కర్ర తీసుకుని ఆ గూడు కుల్చేయటం మెదలు  పెట్టాడు.  అ దెబ్బ తో బెదిరిపోయిన కాకి ఎగిరి పోయి ప్రక్కనే ఉన్న కరెంటు తీగ మీద వాలి  దినంగా చూడటం మొదలెట్టింది.  సుబ్బారావు మాత్రం ఆ గూడు  అందక  పోయిన ఎగిరి ఎగిరి కొడుతూ ఎలాగోలా  దాన్ని  కుల్చేసాడు.  

ఒక రకమయిన ప్రశంతతో కాకి వంక చూసాడు. దానికి ఎక్కడలేని దుఖం, కోపం పొంగుకోచ్చాయి దానికి.  సుబ్బారావుని నానా శాపనార్థాలు పెడుతూ ఎగిరి పోయింది.  అ తర్వాత రెండు రోజుల వరకు సుబ్బారావు ఆవిషయం మర్చిపోయాడు.

ఈ లోపు కాకి మళ్ళి  తన గూడు  కట్టడం మొదలు పెట్టింది అదే చెట్టు పైన  అయితే ఇసారి కాస్తా ఎత్తు మీద.  ఓ రోజు సాయంత్రం కాఫీ తాగుతున్న సుబ్బారావు మీద  ఏదో పడినట్టయి  చెట్టు పైకి చుసాడు. కాకి గూడు పూర్తయి కనిపించింది. సుబ్బారావు  గూడు  కుల్చేయాలని నిర్ణయించుకుని ప్రక్కనే ఉన్నా నిచ్చెన వేసుకుని ఓ పొడవాటి కర్ర తీసుకుని గూడు  పడగొట్టడం ప్రారంభించాడు.

కాకి కావు కావుమంటూ అక్కడే తిరగటం మొదలు పెట్టింది.  అయినా సుబ్బారావు ఎ మాత్రం జాలి లేకుండా గూడు  కుల్చేసాడు. ఇక కాకి చేసేదేమీ లేక సుబ్బారావుని శాపిస్తూ దినంగా అరుకుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి  పోయింది.

సుబ్బారావు ఆలా గూడు కుల్చేయటం చూసిన  వాళ్ళ భామ్మ "ఏమిట్రా సుబ్బి నువ్వు చేస్తున్న పని ! వేపచెట్టు పెరడులో ఉండటం మంచిది కాదని దాని కొట్టేయించమని ఆ సిద్దాంతి గారు చెప్పినప్పటి నుంచి అడుగుతున్నాను , నువ్వేమో కాకులు గూళ్ళు పెడుతున్నాయని వాటిని కుల్చేస్తున్నావ్. అసలు ఆ చెట్టే లేక పొతే ఈ తిప్పలు ఉండవు కద?" అంది నిష్టూరంగా.

దానికి సుబ్బారావు "అబ్బ భామ్మ కోటించేస్తాను  లేవే.  దానికి మనుష్యులు దొరకాలి, నాకు విలు చిక్కలి" అన్నాడు సముదాయిస్తూ.

"రెండు నెలలుగా ఇదే మాట చెపుతున్నావు, ఇంకెప్పుడు కలిగెనో దానికి మోక్షం" అంటూ నిటురుస్తూ  వెళ్లి పోయింది.

ఇది జరిగిన వారం తర్వాత ఓ రోజు ప్రొద్దునే ఏదో అలికిడయితే తమ పెరటి పిట్టగోడ పక్కనే ఉన్నా మరో వేప చెట్టు పైకి చూసాడు. ఓ కాకి తన గూడు కడుతూ కనిపించింది. ఎందుకో తెలియదు గాని సుబ్బారావు మొఖంలో సంతోషం తొణికిసలాడింది.

ఓ ఆదివారం రోజు సుబ్బారావు నలుగురు మనుష్యులను తిసుక్కోచ్చాడు. ఎప్పటినుంచో చెట్టు కొట్టేయించాలని పోరు పెడుతున్న వాళ్ళ  భామ్మ మాట చెల్లించాలని. ఆసమయానికి వేరే చెట్టు మిద గూడు  కట్టుకున్న కాకి గుడ్లు పెట్టి పిల్లల కోసం పొదుగుతు ఉంది.

సుబ్బారావు పెరట్లో చెట్టు కొట్టేయబడటం చుసిన కాకి గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఒక్కవేళ ఈ సమయానికి తన గూడు అక్కడ ఉన్నట్లయితే తనకు, తన పిల్లలకు కలిగే పరిస్థితి  తలచుకుని వణికిపోయింది.

తన గూటిలోంచి బయటకు వచ్చి సుబ్బారావు పెరటి మీదుగా ఎగురుతూ కావు కావుమంటూ తిరగటం మొదలు పెట్టింది కృతఙ్ఞతలు చెపుతున్నట్టుగా.

ఆ విషయం అర్ధమయిందో ఏమిటో సుబ్బారావు కూడా చేయి ఉపుతూ కాకికి సైగలు చేసాడు పర్వాలేదు అన్నట్లుగా. ఈ విషయలేమి తెలియని బామ్మ ఏంటో పిచ్చి మాలోకం వీడు! కాకులతో మాట్లాడుకుంటాడు అని నవ్వుకుంది.

9 వ్యాఖ్యలు: