24, జూన్ 2012, ఆదివారం

నాకో నిజం తెలిసింది !!! - 1


నాకో నిజం తెలిసింది
ఎన్ని చేసిన ఎ ఒక్కరిని మనల్ని  ప్రేమిం చేల చేయలేమని
వారిని మనం  ప్రేమించటం  తప్ప మనల్ని ప్రేమించటం వారి ఇష్టమని

నాకో నిజం తెలిసింది
కొందరిని ఎంత ఇష్టపడిన ఎంత గౌరవించిన
అదే గౌరవం అదే ఇష్టం మనకు దొరకదని

నాకో నిజం తెలిసింది
ఎంత ప్రాణ స్నేహితులయినా మనల్ని భాదిస్తారని
వారిని క్షమించాలని


నాకో నిజం తెలిసింది
నమ్మకం ఏర్పడటానికి ఏళ్ళు పడితే
అది పోవటానికి క్షణం చాలని

నాకో నిజం తెలిసింది
ఎదుటి వారి గోప్పతో పోల్చుకోక
మన గొప్ప తెలుసుకోవాలని దానిలో ఇంకా గొప్పగా రాణించాలని

నాకో నిజం తెలిసింది
పని చేసే వాడే తప్పులు చేస్తాడని
తప్పులు చేసే వాడికే అనుభవం వస్తుందని


నాకో నిజం తెలిసింది
మనం ఈ రోజు చేసే పనులే
మన రేపు నిర్ణయిస్తాయని

నాకో నిజం తెలిసింది
విమర్శించే వాడికి జీవితం దుర్బరమని
అస్వాదించేవాడికి  అదే జీవితం అద్బుతమని

నాకో నిజం తెలిసింది
దనవంతుడంటే  ఎక్కువ దనం  ఉన్నవాడు కాదని
దాని అవసరం లేని వాడని

 
నాకో నిజం తెలిసింది
ఎవరితోనంయిన గొడవ పడితే  వెంటనే కలిసి పోవాలని
లేదంటే తిరిగి మనకు అవకాశం రాకపోవచ్చని

నాకో నిజం తెలిసింది
కొన్ని సార్లు నిజమయిన ప్రేమ నిస్తేజంగా నిస్సారంగా ఉంటుందని
అవసర మయినప్పుడు వికసిస్తుందని

నాకో నిజం తెలిసింది
మన వయస్సెంత ఉన్న
అలసి పోగానే అమ్మ, భయం వేసినప్పుడు నాన్న
గుర్తుకోస్తారని13 వ్యాఖ్యలు:

 1. ఈమధ్యకాలంలో ఇంత స్వకీయత. మౌకిలత ఉన్న రచన జాలంలో రాలేదు. ఇలాగే ముందుకు సాగండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పై వ్యాఖ్యలో పదాన్ని మౌలికత అని సవరించుకొని చదవవలసినది. టైపాటుకు క్షంతవ్యుణ్ణి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "నాకో నిజం తెలిసింది
  మన వయస్సెంత ఉన్న
  అలసి పోగానే అమ్మ, భయం వేసినప్పుడు నాన్న
  గుర్తుకోస్తారని" నిజమండీ....

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాకో నిజం తెలిసింది
  మీ మాటల్లో పాండిత్యం సాహిత్యం అత్యధికముగా ఉన్నాయని
  మీ ఆలోచనల్లో ఔన్నత్యం ఆధ్యాత్మికం ఆధిపత్యంగా ఉన్నాయని
  మీలో చాతుర్యం చమత్కారం చిక్కగా ఉన్నాయని

  ప్రత్యుత్తరంతొలగించు